
ఎవరో నన్ను చదువుతున్నారు? ఎవరో నన్ను చూస్తున్నారు ఎందుకో మంచిగా మాట్లాడుతున్నారు ఎవరో నన్ను పలుకరిస్తున్నారు ఎందుకో చెంతకురమ్మని స్వాగతిస్తున్నారు ఎవరో నన్ను చదువుతున్నారు ఎందుకో పలువురికి పరిచయంచేస్తున్నారు ఎవరో నన్ను ముట్టుకుంటున్నారు ఎందుకో మహదానందంలో తేలిపోతున్నారు ఎవరో నన్ను తడుముతున్నారు ఎందుకో ఆప్యాయత చూపిస్తున్నారు ఎవరో నన్ను పొగుడుతున్నారు ఎందుకో ఆకాశానికి ఎత్తుతున్నారు ఎవరో నన్ను దీవిస్తున్నారు ఎందుకో నూరేళ్ళు జీవించమంటున్నారు ఎవరో నన్ను గమనిస్తున్నారు ఎందుకో నాపుస్తకాన్ని తెరచిపెట్టమంటున్నారు నా నోట్లో బంగారుచంచా ఉన్నది నా వెనుక అపారసిరిసంపదలు ఉన్నాయి నా చేతిలో కమ్మని కవితలున్నాయి నా గళాన తియ్యని స్వరాలున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం