Posts

Showing posts from February, 2023
Image
 
Image
 పడుచొకతె పడుచొకతె ప్రత్యక్షమయ్యింది గుండెలోన గుబులుపుట్టించిపోయింది నిద్రించగానె కలలోకివచ్చింది ఊరకుండక కవ్వించిపోయింది అతివలోనె వెచ్చదనమున్నది వెన్నవలె మనసుకరిగించుచున్నది ప్రేమలోనె పాశమున్నది పరువములోనె పొంగుయున్నది అందములోనె ఆనందమున్నది కళ్ళలోనె కామమున్నది జోడుంటేనె జల్సాయున్నది కలసుంటేనె కుషీయున్నది నచ్చగానె మెచ్చాలనిపించింది చూపుతిప్పక చూడాలనిపించింది నవ్వగానె బదులివ్వాలనిపించింది పలకగానె సరసాలాడాలనిపించింది కోరితె పెళ్ళాడాలనియున్నది కాపురంపెట్టి పిల్లలకనాలనియున్నది తాడోపేడో  తేల్చుకుంటా తోడుకుతక్షణమే తెచ్చుకుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
ఏంటిరా మామా! కన్నుగీటినా కదలికలేకున్నది చిరునవ్వులుచిందినా స్పందనలేకున్నది సిగ్గువిడిచినా చలనంలేకున్నది పలుకరించినా సమాధానంరాకున్నది షోకులుచూపినా లాభంలేకున్నది వలపువలవిసిరినా వ్యర్ధమగుచున్నది మల్లెపూలుముడుచుకున్నా ఫలంలేకున్నది పరిమళాలుచల్లినా ప్రయోజనంలేకున్నది గులాబీ అందించినా గుండెకుగుచ్చుకోకున్నది  ప్రేమఝల్లులుకురిపించినా ప్రతిస్పందనలేకున్నది చెంతకుపిలిచినా చెవికెక్కించుకోకున్నాడు చేయిచాచినా అందుకోకున్నాడు చెలిమికోరినా ససేమిరాయంటున్నాడు ఇకలాభంలేదని తెలుసుకున్నా తూర్పుతిరిగి దండంపెట్టుకుంటున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
కుళ్ళిన మనుషులు బ్రతికుండగానే మనుషులు కుళ్ళిపోతున్నారు పరిసరాలలో దుర్గంధం వెదజల్లుతున్నారు ఇల్లు ఖాళీచేయమంటే కిరాయిదారుడు కుదరదంటున్నాడు  మరోయిల్లు చూచుకోమంటే మదమెక్కి మొండిచేస్తున్నాడు చెప్పినట్టు వినకపోతే నిందలు మోపుతున్నాడు అందరిముందు పంచాయితీపెట్టి అభాసుపాలు చేస్తున్నాడు సర్దుకుపోదామంటే ససేమిరా అంటున్నాడు తనుచెప్పినట్లే వినవలిసిందే అంటున్నాడు పిలిస్తే పలుకకున్నాడు విషాన్ని కక్కుతున్నాడు పెద్దలు చెబితే సమయం కావాలంటున్నాడు డబ్బులు ఇస్తేనే ఇల్లు ఖాళీచేస్తానంటున్నాడు ప్రశ్నిస్తే పరేషానీ చేస్తున్నాడు చివాట్లుపెడితే చికాకు కలిగిస్తున్నాడు కొమ్మ చెడిపోతే కొట్టెయవచ్చు చెట్టు చెడిపోతే పూర్తిగా నరికెయ్యాల్సిందేగదా! వ్యక్తులు చెడితే దారికి తెచ్చుకోవచ్చు సమాజమే చేడితే ఉధ్ధరించేదెట్లా! సమాజమా! ఆలోచించు పరిస్థితిని సరిదిద్దు ఆలశ్యమయితే అమృతంకాస్తా విషముగా మారవచ్చు దారుణాలు జరుగవచ్చు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహిత్యఝరి సాహిత్యసేద్యం సాగాలి పువ్వులు పూయాలి కాయలు కాయాలి కవిత్వం పండాలి కవులు కదలాలి కదము త్రొక్కాలి కలములు పట్టాలి కవనము చెయ్యాలి నిప్పులు చిందించాలి నిజాలు చూపించాలి కత్తులు ఝలిపించాలి కదనము తలపించాలి అక్షరాలు వెలగాలి పదాలు ప్రకాశించాలి కవితలు కళకళలాడాలి మనసులు మెరిసిపోవాలి ఆలోచనలు అదిరిపోవాలి భావాలు భలేబాగుండాలి గుండెలు గుబాళించాలి హృదయాలు ద్రవించాలి పిల్లలు పరవశించిపోవాలి పడుచువాళ్ళు పులకించాలి పెద్దలు ప్రమోదంపొందాలి పాఠకులంతా పొంగిపోవాలి అందాలను అగుపించాలి అంతరంగాలను ఆకట్టుకోవాలి ఆనందం పెళ్ళుబికిపారాలి అందరూ ప్రతిస్పందించాలి పదేపదే చదవాలి భళేభళే అనాలి చప్పట్లు కొట్టాలి ముచ్చట్లు చెప్పాలి ముత్యాల్లా ధరించాలి రత్నాల్లా దాచుకోవాలి కనకంలా కాచుకోవాలి సంపదలా కాపాడుకోవాలి  మనసంస్కృతిని చాటాలి మనోవిఙ్ఞానాన్ని పెంచాలి మనజాతిని జాగృతంచెయ్యలి మనసాహిత్యాన్ని సుసంపన్నంచెయ్యాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితా! ఓ కవితా! నా కలలో కనిపించరాదా నన్ను కవ్వించి కవనం చేయించరాదా! నా మనసును తట్టరాదా నన్ను కవిత్వ రంగములోనికి దించరాదా! నా కలము అంచున నిలువరాదా నాతో కమ్మని కవితల వ్రాయించరాదా! నా తలకు తలపులు ఇవ్వరాదా నాతో గొప్ప విషయాలు చెప్పించరాదా! నా కంటికి సోయగాలు చూపరాదా నాతో చక్కని వర్ణనలు చేయించరాదా! నా చేతికి అక్షరాల అందించరాదా నాతో ముత్యాలసరాల కూర్పించరాదా! నా మోముపై నవ్వుల కురిపించరాదా నాతో పసందైన పాటల పాడించరాదా! నా ముఖమును జాబిలిలా వెలిగించరాదా నా రాతలను సాహిత్యలోకాన ప్రసరించరాదా! నా పెదవుల సుధలను కురిపించరాదా నాతో తియ్యని పలుకులను పలికించరాదా! నా పలుకుల తేనేచుక్కల చల్లరాదా నాద్వారా పలువురికి పనసతొనలచవిని చూపరాదా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 శివశివా! నిన్నూ తలస్తే కష్టాలు తొలుగునంట నీయాఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట నందీశ్వరుడే నీకు వాహనంబంట డమరుకమే  నీకు వాయిద్యమంట పార్వతీడేవి నీలోభాగమంట మీరుద్దరూకలసి ఆదిదంపతులంట విఙ్ఞాలుతొలగించు విఙ్ఞేశ్వరుడే మీ కుమారుడంట కైలాసమే మీకు ఆవాసస్థానమంట అభిషేకమంటే నీకు మిక్కిలీప్రీతంట నమ్మినవారిని నీవు వమ్మూచేయవంట త్రిశూలమే  నీకు ఆయుధమంట నాగరాజే నీకు ఆభరణమంట నీ జుట్టునుండే గంగ ప్రవహించునంట నీ తలపైనే జాబిల్లి నివసించునంట ఆకలితీర్చు అన్నపూర్ణే నీసతియంట దప్పికాతీర్చే గంగాదేవే నీపత్నియంట భక్తులపాలిట నీవు కొంగుబంగారమంట దుష్టులపాలిట నువ్వు సింహస్వప్నమంట పుట్టించేవాడు బ్రహ్మంట గిట్టించేవాడివి నువ్వంట నటరాజువై నీవు నర్తించుతావంట నిను కొలుచువారిని రక్షించుతావంట కోరినకోర్కెలుతీర్చే భోలాశంకరుడవంట కోపమొస్తే నువ్వు రౌద్రరూపుడువంట నువ్వు మూడొకన్నుతెరిస్తే ముల్లోకాలు భస్మమగునంట నువ్వు కరుణచూపావంటే శాంతిసౌఖ్యాలొనగూరునంట శివశివాయంటాము పూజలూచేస్తాము హరహరాయంటాము హారతులుయిస్తాము నమశ్శివాయంటాము నమస్కారాలుచేస్తాము బసవుడినికొలుస్తాము భక్తులముయవుతాము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మాతృభాష ముచ్చట్లు అమ్మభాష అమృతము మాతృభాష మరందము మనభాష వరాలతెలుగు మనతెలుగు సూర్యునివెలుగు తెలుగుభాష బహుతియ్యన తేటతెలుగు కడుకమ్మన మనతెలుగు దేశానలెస్స మనభాష లోకానమిన్న తెలుగుతోట సుందరంబు తెలుగుపూలు సౌరభంబు తెలుగుతల్లిని ఆరాధిద్దాం తోటియాంధ్రుల గౌరవిద్దాం తెలుగువాడినని గర్విద్దాం తెలుగోళ్ళను సంతసపరుద్దాం తెలుగుజ్యోతిని వెలిగిద్దాం తెలుగుభాషను వ్యాపిద్దాం ఆంధ్రాక్షరాలు ముత్యాలు తెలుగుపదాలు తేనెచుక్కలు తెలుగులోనే పలుకుదాం తెలుగుసుధలు చిమ్ముదాం ఆంధ్రులచరిత్ర తెలుపుదాం ఆంధ్రులపౌరుషం చాటుదాం అచ్చతెలుగును వాడుదాం తేటతెలుగును నేర్పుదాం మాతృభాషను మరువద్దు కన్నతల్లిని కసరుకోవద్దు తల్లిబాష తిరస్కరణము తనసొంతతల్లి తిరస్కారము తెలుగుఝరి గోదారమ్మ ఉరుకులు తెలుగుస్రవంతి క్రిష్ణమ్మ పరుగులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 🌷🌷🌷🌷🌷🌷🌷అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు🌷🌷🌷🌷🌷🌷🌷
Image
 తలపులతట్ట తట్టిచస్తేగదా తలపులుపుట్టేది కవితలువ్రాసేది తలగోక్కుంటే వస్తాయా? తనువులు మురిస్తేగదా తృప్తికలిగేది తోషాలుపంచేది నటిస్తే సరిపోతుందా? మాటలు వదిలితేగదా మనసులుతెలిసేది మంచీచెడుతెలిసేది మౌనంవహిస్తే తెలిసేదెట్లా? కళ్ళు మూతపడితేగదా నిద్రవచ్చేది కలలుకనేది మేల్కొనియుంటే విశ్రాంతిదొరికేదెలా? నవ్వితేగదా మోములువెలిగేది అందాలుచిందేది ఏడుస్తుంటే ఎలా? అడుగులేస్తేగదా ముందుకుసాగేది గమ్యముచేరేది కదలకుంటే ఎట్లా? అభ్యసిస్తేగదా ప్రావీణ్యంవచ్చేది పదవులుదొరికేది సాధనచేస్తేగదా సఫలమయ్యేది? నీటిలో దిగితేగదా ఏటిలోతుతెలిసేది ఆవలితీరంచేరేది వెనుదిరిగితే వెనకబడవా? తింటేగదా రుచితెలిసేది కడుపునిండేది ఊహిస్తే సరిపోతుందా? ప్రయత్నిస్తేగదా విజయంపొందేది పేరువచ్చేది పాలుమాలితే ఎలా? విత్తునాటితేగదా మొక్కమొలిచేది కాయలు కాచేది ఊరకుంటే ఫలమేమి? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
అమ్మా వాగ్దేవీ! సరస్వతీదేవీ సహస్ర వందనాలమ్మా! కామరూపిణీ కోర్కెలు నెరవేర్చవమ్మా! వీణను సవరించనీక వదులయినతీగలు వ్రేళ్ళతో ముట్టనీక వినిపించనీయకున్నవి రాగాలు మూసుకుపోయినకంఠము  మొరాయించి తెరుచుకోక మౌనమువహించి మధురంగాపాడకున్నది పాటలు అలిగిన అందాలచెలి మోమునుచూచి అంగిలినుండి  ఆరుబయటకురాకున్నవి మాటలు కరమునపట్టిన కలము కదలక కాగితాలపైన గీయక కూర్చకున్నది పలుకకున్నది కైతలు శుభప్రదమైనట్టి సన్నాయిరాగాన్ని సన్నుతిచేయటానికి సహకరించకున్నవి స్వరాలు చూచిన చిత్రవిచిత్రదృశ్యాలను చక్కగా వర్ణించటానికి చేతాకాకున్నది దొర్లకున్నవి పలుకులు  పాటకు సరియగు మద్దెలదరువును వేయటానికి వణుకుచున్నవి చేతివ్రేళ్ళు  కవిసమ్మేళనంలో కంఠమెత్తి కమ్మనికైతను వినిపించటానికి    కుదరకున్నది కవివర్యులకు  అమ్మా పలుకులమ్మా అనుగ్రహించవమ్మా అందెళరవళులు మ్రోగించవమ్మా అపరూపగీతాలు వ్రాసిపాడే అవకాశమివ్వవమ్మా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తస్కరణలపర్వం తరువులనున్న  తాజా పూలనుండి తియ్యని తేనెను తస్కరిస్తున్నాయి తేటులు తేనెతుట్టెలను తగలబెట్టి తేనెటీగలను తరిమి తీపి మధువును తస్కరిస్తున్నారు స్వార్ధమానవులు పెరిగిపెద్దయి చెట్లు కాయలు కాస్తుంటే తస్కరిస్తున్నారు పక్షులు పశువులు మనుజులు దొంగవ్యాపారాలు చేసి ధనాన్ని పరోక్షంగా  తస్కరించి  దాచుకుంటున్నారు టక్కరివర్తకులు రెండుచేతుల  రెక్కలకష్టంతో రాబడిపొందుతున్నవారినుండి రెట్టంపురేట్లతో పన్నులు వసూలుచేస్తున్నాయి ప్రభుత్వాలు అమ్యామ్యాలకు అలవాటుపడి అతిగా అన్యాయంగా  అక్రమంగా గుట్టుగా అర్జిస్తున్నారు అవినీతిపరులు అవసరార్ధం అప్పులుజేసేవారినుండి అధికవడ్డీలు వసూలుచేస్తున్న  ఆస్థిపరులను అనారోగ్యాలు వెంటబడగా ఆసుపత్రులు అధికఫీజులు రాబడుతున్నాయి  నీటిని జలాశయాలనుండి  తస్కరిస్తున్నా రవినుండి ఆవిరిని మేఘాలు తస్కరిస్తుంటే ఆకర్షించి వానచుక్కలను తస్కరిస్తున్నది భూమి చిక్కిందల్లా దోచుకొని దాచుకొనే టక్కరులనుండి దోపిడీచేస్తున్నారు తస్కరులు అమలుచేయలేని హామీలనిచ్చి ఓట్లను డబ్బులిచ్చికొని కొల్లగొట్టి ఆపై గెలిచినతరువాత అధికారంచెలాయించి అన్యాయంగా ప్రజలధనాన్ని తస్క...
Image
 ఓ బుజ్జాయీ! బడికి పోతున్నావా బుజ్జాయీ! ఆ బడి వార్తలేమి బుజ్జాయీ? ఊరుమధ్యన ఉన్నది ఓబడి ఆ బడియే నాకు ఒక గుడి గుడి అన్నావు కాని బుజ్జాయీ! ఆ గుడిలో ఉన్నదెవరు బుజ్జాయీ? ఆ గుడి సరస్వతీదేవి కొలువు ఆ అమ్మ నాకు ఇచ్చు చదువు చదువు చెప్పేదెవరు బుజ్జాయీ! ఆ చదువు లాభమేమి బుజ్జాయీ? అయ్యవారు చెబుతారు పాఠాలు ఆ పాఠాలు ఇస్తాయి నాకు జీతాలు జీతాలెందుకు నీకు బుజ్జాయీ! ఆ పైసాలు ఏమిచేస్తావు బుజ్జాయీ? పైసాలుంటే చేసుకుంటా నేనుకళ్యాణం సుఖముగా జరుపుకుంటా నాకుటుంబం కుటుంబమెందుకు నీకు బుజ్జాయీ! అక్కడ ఎవరెవురుంటారు బుజ్జాయీ? అక్కడ ఉంటారు నాతో అమ్మానాన్నలు వారితోపాతుంటారు కొడుకులుకుమార్తెలు పిల్లలెందుకు నీకు బుజ్జాయీ! ఆ పిల్లల పెంచేదెవరు బుజ్జాయీ? పెద్దయి పిల్లలను కంటాము బాగా వారిని పోషించుకుంటాము పెరిగి పెద్దదువుగాని బుజ్జాయీ! అపుడు ఏమిచేస్తావు నీవు బుజ్జాయీ? పూర్తిగా ఉపయోగిస్తాను నా శక్తి ఆపై చాటుతాను నా దేశభక్తి ఏదేశము నీది బుజ్జాయీ! ఆ దేశ గొప్పతనమేమి బుజ్జాయీ? భారతదేశము మనాది అతిపురాతనదేశము మనది మనదేశం ఘనమైనది మనసంస్కృతి విలువైనది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అక్షరాలఝరి పూలవాన  కురిపిస్తా మనసులను మురిపిస్తా ప్రేమవర్షము పారిస్తా ఆనందంలో ముంచేస్తా అధరామృతాన్ని అందిస్తా అమితానందాన్ని చేకూరుస్తా నవ్వులజల్లులు గుప్పిస్తా మోములను వెలిగిస్తా ముత్యాలముసురు సాగిస్తా చిత్తాలను సంతసపరుస్తా కనకధారను పారిస్తా కవనప్రక్రియను కొనసాగిస్తా అక్షరాలఝరిని ప్రవహింపజేస్తా అంతరంగాలను అలరింపజేస్తా తేనెపలుకులు చిందిస్తా తీపిరుచులు చూపిస్తా కలముసిరాను కార్పిస్తా కమ్మనికైతలను కుమ్మరిస్తా కవితాసుధలను స్రవిస్తా సాహితీమాధుర్యాలను చవిచూపిస్తా కవితామృతాన్ని సేవించండి కవివ్రాతలను గుర్తుంచుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
కవితోదయం రవి ఉదయించాడోలేదో తెల్లవారింది వెలుగు ప్రసరించిందోలేదో మెలుకువవచ్చింది నిద్ర లేచానోలేదో దంతధావనంచేశా తలుపు తీశానోలేదో ఇంటికి పత్రిక పాలువచ్చాయి వార్తపత్రిక చదివానోలేదో చేతికి కప్పుకాఫీవచ్చింది వేడివేడికాఫీ త్రాగానోలేదో వంటికి ఉషారొచ్చింది మనసు మురిసిందోలేదో చక్కని తలపొచ్చింది కలము చేతపట్టానోలేదో కమ్మని కవితపుట్టింది సమూహాలలోకి కైతను పంపానోలేదో అద్భుత స్పందనలొచ్చాయి సూర్యోదయ మహత్యమో వేడివేడికాఫీ మహత్యమో భార్యామణి మహత్యమో ఆలోచన తట్టింది కలము కదిలింది కవితోదయమయింది ప్రొద్దుప్రొద్దునే ప్రతిస్పందించిన పాఠకులకు పలుధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవివర్యా! చూపవోయ్ అందాలు చేర్చవోయ్ ఆనందాలు అల్లవోయ్ అక్షరాలు పొసగవోయ్ పదాలు చెయ్యవోయ్ అక్షరసేద్యము తియ్యవోయ్ ఫలసాయము కనవోయ్ పగటికలలు కూర్చవోయ్ కల్పనలు పనిపెట్టవోయ్ మనసులకు పారించవోయ్ ఆలోచనలు బయటపెట్టవోయ్ భావాలు కలిపించవోయ్ భ్రమలను పాడవోయ్ ప్రబోధగీతాలు పులకించవోయ్ శ్రోతలను పఠించవోయ్ ప్రణయగీతాలు పారించవోయ్ నవరసంబులు చిందించవోయ్ తేనెచుక్కలను చవిచూపవోయ్ తియ్యదనాలు వదిలించవోయ్ నిద్రమత్తును మేలుకొలపవోయ్ పాఠకులను వ్రాయవోయ్ సుకవితలను మురిపించవోయ్ మదులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓరి మనిషీ! ఓరి మానవుదా! నీకు ఏమి స్వార్ధమురా? ఎన్ని కోరికలురా? ఎంత ఆరాటమురా? రేపు తెల్లవారివెలుగును చూస్తావోలెదోతెలియదు బ్రతికియుంటావోలేదో ఏమాత్రము తెలియదు కానీ జేబులు నిండా డబ్బులుండాలా తరాలకు తరగని ఆస్తులుండాలా చస్తే స్వర్గానికే పోవాలా సుఖాలునే అనుభవించాలా కానీ నరకానికి పోకూడదా చిత్రహింసలకు గురికాకూడదా రేపు ఏమిచేస్తావో తెలియదు ఎక్కడుంటావో తెలియదు ఏమితింటావో తెలియదు కానీ తలలో తెలివియుండాలా దేహంలో శక్తియుండాలా కాసులు సంపాదించాలా బలమున్నా నీకే ఉపయోగించుకోవాలా నీవారికే వాడుకోవాలా ధైర్యంగా బ్రతకాలా కానీ మంచిపనులు చెయ్యవా పరులకు సహాయపడవా సమాజాన్ని ఉద్ధరించవా రేపు ఏమివ్రాస్తావో ఏమో తెలియదు నేడు విషయాల వాసనేలేదు కవప్రక్రియ కొనసాగించాలంటావు కానీ రాత్రి నిద్రపోతావు ఆలోచనలు ఆపేస్తావు మనసుకు విశ్రాంతినిస్తావు అయినా కవితలు అద్భుతంగావ్రాయాలంటావు అందరిని ఆకర్షించాలంటావు పాఠకుల మనసులతట్టాలంటావు అందాలను చూపించాలంటావు ఆనందాలను కలిగించాలంటావు మదులలో నిలిచిపోవాలంటావు సాహిత్యలోకంలో శాశతస్థానంకావాలంటావు ఓరి మానవుడా! నీవు సరిగా ఆలోచించరా సక్రమంగా నడచుకోరా కోర్కెలు తగ్గించుకోరా స్వార్ధం విడిచిపెట్టరా స...
Image
 ఓ సాహితీ! వధువువై వలపులోదించావు వయ్యారాలు ఒలుకించమంటున్నావు మధువువై మత్తెక్కిస్తున్నావు మనసులను మురిపించమంటున్నావు దీపమై ధగధగలాడుతున్నావు దీటుగా దడదడలాడించమంటున్నావు ఊహవై ఊరిస్తున్నావు ఉల్లాలను ఉత్సాహపరుచమంటున్నావు గంగవై గలగలాపారుతున్నావు గానామృతాన్ని గుటకలువేయించమంటున్నావు పవనమై ప్రసరిస్తున్నావు పరిమళాలను పీల్చుకోమంటున్నావు తేనెవై చుక్కలుచల్లుతున్నావు తీపిని చవిచూడమంటున్నావు ప్రాణమై పరిపాలిస్తున్నావు ప్రపంచాన్ని పరికించమంటున్నావు పువ్వువై పొంకాలనుచూపుతున్నావు మాలగాకూర్చి మెడలోవేయమంటున్నావు పాటవై పడుకోబెడుతున్నావు కలలోకొచ్చి కవ్వించిపోతున్నావు కలమై కాగితాలను నింపిస్తున్నావు కవితాజల్లులను కమ్మకమ్మగా కురిపించుతున్నావు సతివై సహజీవనంచేస్తున్నావు సాహిత్యలోకంలో సంచరించమంటున్నావు సాహితికి ధన్యవాదాలు సరస్వతీదేవికి ప్రణామాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సమాజమా! సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా! బ్రతకటానికి ఉద్యోగాలివ్వని చదువులెందుకు? అన్యాయాలకుబలయినవారిని ఆదుకోలేని న్యాయస్థానలెందుకు? ప్రజలసంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వాలెందుకు? దొంగలను పట్టుకోలేని రక్షకవ్యవస్థయెందుకు? సంతానాన్ని సరిగాచూడని అమ్మానాన్నలెందుకు? వృద్ధ తల్లితండ్రుల చూడని తనయులెందుకు? ఆప్యాయతలు సఖ్యతలులేని కుటుంబాలెందుకు? సుఖసంతోషాలు కరువైన సమాజమెందుకు? గమ్యము చేరలేని జీవితపయనాలెందుకు? సాయం చేయని చేతులెందుకు? కమ్మని కవితలు వ్రాయని కవులెందుకు? సమాజమా స్పందించు సరిదిద్దువ్యవస్థలను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మానవులా! మృగాలా!! మానవులా కౄరమృగాలా! మనుజులా ఆటవికులా! ఆడపిల్లలా ఆడుకొనేబొమ్మలా! అక్కాచెల్లెళ్ళా ఆటవస్తువులా! కోరికలా ఊరేజలాలా! మనసా వరదప్రవాహమా! మాటలను ఈటెల్లా విసురుతా! కలాలను కత్తుల్లాపడతా! దౌర్జన్యకారులకు దేహశుద్ధిచేస్తా! దగాకోరులకు బడితపూజచేస్తా! అహింసాపరులను అంతంచేస్తా! ద్వేషపరులను దగ్ధంచేస్తా! అన్యాయంచేసేవార్ల ఆటలుకట్టిస్తా! అక్రమాలుచేసేవారిని ఎదిరిస్తా! అత్యాచారాలకొడిగట్టేవాళ్ళను అగ్నికి ఆహుతిచేస్తా! మోసగాళ్ళ భరతంపడతా! చీడపురుగులను చిదిమేస్తా! బాధలుపెట్టేవారిని భస్మంచేస్తా! మంచిని తలకెత్తుకుంటా! నీతిపరులను మెచ్చుకుంటా! వదాన్యులను పొగుడుతా! కరుణామయులను కీర్తిస్తా! సమాజానికి సహాయపడతా! సంఘాన్ని సంస్కరిస్తా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రకృతి పరవశాలు ప్రభావాలు మేఘాన్ని పిలువు చినుకై చాచినచేతిలో రాలుతుంది తారకను చూడు తళుకులను కళ్ళకు చూపిస్తుంది జాబిలిని కను వెన్నెలను వంటిపై వెదజల్లుతుంది సెలయేటి చెంతకిపో వడివడి  పరుగులు చూపుతుంది అరణ్యానికి వెళ్ళు పచ్చదనంతో పరవశపరుస్తుంది కోకిలకంఠమును విను కుహూకుహూమంటూ కుతూహలపరుస్తుంది పూలను పరికించు పొంకాలను ప్రదర్శించి పులకరిస్తాయి పసిపాపలను పరిక్షించు అమాయకత్వం అర్ధమవుతుంది అందాలను ఆస్వాదించు ఆనందాలను అందిస్తుంది అంబుధితీరానికి వెళ్ళు అలలై చెంతకు చేరుతుంది మనసును కదిలించు భావాలై మదులను మురిపిస్తుంది కలాన్ని పట్టుకో కమ్మని కవితలను కాగితాలపై కూర్చోపెడుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆమె  (అమలినశృంగారి) కనబడితే కళ్ళప్పగిస్తా స్పందిస్తే సంబరపడతా దొరికితే దోరబుచ్చుకుంటా వస్తానంటే వెంటతెచ్చుకుంటా చిక్కితే చెంతకుతీసుకుంటా ప్రక్కనే అట్టిపెట్టుకుంటా నక్కితే వెదికిపట్టుకుంటా దారికి తెచ్చుకుంటా ఏడిస్తే సముదాయిస్తా కన్నీరు తుడిచేస్తా నవ్వితే మెచ్చుకుంటా మదిలో దాచుకుంటా ఆడితే చూస్తా ఆనందంలో మునిగిపోతా పాడితే దరువేస్తా శ్రద్ధగా చెవులునిక్కురిస్తా తిడితే తప్పుకుంటా మరోదారి చూచుకుంటా కొడితే జారుకుంటా కుక్కినపేనులా మెదలకుంటా కోరితే ఒప్పుకుంటా జంటకు తెచ్చుకుంటా పిలిస్తే పలుకుతా సరసాలతో సల్లాపాలాడతా ప్రేమిస్తే పొంగిపోతా పరువానికి పగ్గాలేస్తా ఒప్పుకుంటే  ఒగ్గేస్తా సహచరిని చేసుకుంటా చెప్పా ఇక చెప్పా ఛీ ఛీ సిగ్గేస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవులు కవులు కత్తులు పడుతున్నారు బానిససంకెళ్ళను తెగకొడుతున్నారు క్రూరులను తుదముట్టిస్తున్నారు కవులు కృష్ణశాస్త్రులవుతున్నారు కల్పనలు చేస్తున్నారు క్షరరహితాలను పేరుస్తున్నారు కవులు కాగడాలు పడుతున్నారు మూఢనమ్మకాలను తగలబెడుతున్నారు మోసగాళ్ళను బూడిదచేస్తున్నారు కవులు కలాలు పడుతున్నారు కవితలు కమ్మగా వ్రాస్తున్నారు చదువరులను సంతసపెడుతున్నారు కవులు కళ్ళు తెరుస్తున్నారు అన్యాయాలను ఎండగడుతున్నారు నిజాలను నిష్ఠూరంలేకుండా చూపుతున్నారు కవులు కష్టపడుతున్నారు అందాలను వర్ణిస్తున్నారు ఆనందాలను కలిగిస్తున్నారు కవులకు కరచాలనమిస్తా వెన్ను తడతా ప్రోత్సాహము ఇస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 జీవనయానం ముందుకు  పయనం సాగాలోయ్ గమ్యము  త్వరగా చేరాలోయ్ సక్రమమార్గము పట్టాలోయ్ అడుగులువడివడి వెయ్యాలోయ్ అందం కంటికి కావాలోయ్ కవితలు కమ్మగ వ్రాయాలోయ్ అన్నం నోటికి కావాలోయ్ పొట్టను పూర్తిగా నింపాలోయ్ తోడు వంటికి కావాలోయ్ వయ్యారాలు ఒలికించాలోయ్ ముచ్చటలు మదికికావాలోయ్ హృదయం పొంగిపోవాలోయ్ ప్రేమ గుండెకు కావాలోయ్ బంధాలు అల్లుకొని పోవాలోయ్ పనులు చేతికికావాలోయ్ జేబులు డబ్బుతోనిండాలోయ్ కాళ్ళకు నడక కావాలోయ్ గమ్యం తొందరగా చేరాలోయ్ రుచులు నాలుకకు కావాలోయ్ మనసు మురిసిపోవాలోయ్ జీవితానికి గమ్యం యుండాలోయ్ సాధనకు ప్రయత్నం చేయాలోయ్ పయనం సాగాలోయ్ లక్ష్యం అందుకోవాలోయ్ బండిచక్రాలు కదలాలోయ్ కాలచక్రము కదలాలోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా బాల్యం నాకు కావాలి! నా బాల్యం నాకు కావలి ఆనాటి స్నేహితులు ఈనాడు కావాలి అప్పటి ఆటలు ఇప్పుడు ఆడుకోవాలి ఆరోజుల ముచ్చట్లు ఈరోజున చెప్పుకోవాలి అనురాగాల అన్నతో ఆప్యాయతను పంచుకోవాలి చిట్టి చెల్లిలిని చిరునవ్వులలో ముంచాలి చెరువులో దిగాలి ఈతనుకొట్టాలి చెట్లనెక్కాలి కాయలుకోయాలి పూలనుకొయ్యాలి పరమాత్మునిపూజించాలి అమ్మప్రేమను పొందాలి నాన్నతో ముద్దులను పెట్టించుకోవాలి అందరితో అమాయకంగా ఆడాలి పాడాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ చంద్రముఖీ! చిరునవ్వులు చిందితే చూచి సంతసించనా! చక్కని చంద్రవదనానికి చిత్తయిపోనా! చూపులు సూటిగావిసిరితే చిక్కనా దొరకనా! సూదంటురాయిలా పట్టుకుంటే చలించక అతుక్కుపోనా! మల్లెల పరిమళాలుచల్లితే మత్తులోపడనా! ముగ్ధమనోహర రూపానికి మౌలుడిని కానా! సరసాలాడితే స్పందించనా! సమయస్ఫూర్తిని చూపించనా! అందంతో ఆకర్షిస్తే ఆనందం పొందనా! ఆకాశపు అంచులను అంటిరానా! ప్రేమజల్లులు కురిపిస్తే పరవశించి తడిసిముద్దవనా! మమతానురాగాలలో మునిగిపోనా! అంతరంగాన్ని తడితే ఆలోచనలలో పడిపోనా! అందుబాటులోకి వస్తే అందలం ఎక్కించనా! చెంతకు వస్తే చేరదీయనా! సహధర్మచరణిగాచేసి సంసారంలోకి దించనా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం మౌలుడు= సేవకుడు
Image
ఓ నా ఇష్టసఖీ! ఓ నాయిష్టసఖీ నను కష్టపెట్టకే పువ్వులిస్తానే నవ్వులుచిందవే సరసాలాడతానే సంతోషించవే తోడుకురావే వేడుకచెయ్యవే చెంతకొస్తానే చెలిమిచెయ్యవే కబుర్లుచెబుతానే కుషీగానుండవే మాటలుచెబుతానే ముచ్చటపడవే మూతినిముడుచుకోకే నోటినిమూసుకొనకే అలగకే పడకెక్కకే కోపముతెచ్చుకొనకే కోరికతిరస్కరించకే కన్నీరుపెట్టకే క్షోభకుగురిచేయకే కొరకొరాచూడకే కోర్కెలచిట్టావిప్పకే పొమ్మనిచెప్పకే పరువునుతీయకే బ్రతిమాలించుకోకే భంగపాటుచెయ్యకే కరుణించవే కోరికమన్నించవే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం