Posts

Showing posts from June, 2023
Image
 పూలమీద ప్రేమ పూలమీద మనసుపడె ముచ్చటించి మురిపిస్తా పూలమీద గాలిమల్లె పలువురకు సోకిస్తా పూలమీద ప్రేమపుట్టె పొరుగువారికి తగిలిస్తా పూలమీద పిచ్చిపట్టె పెక్కుమందికి ఎక్కిస్తా పూలమీద రక్తికలిగె పదిమందికి ముట్టిస్తా పూలమీద పాటపాడుతా పక్కవారికి వినిపించుతా పూలమీద జాలిచూపుతా అందరిని అనుసరించమంటా పూలమీద చూపుసారిస్తా అందాలను ఆస్వాదించుతా పూలమీద నీళ్ళుచల్లతా వాడకుండా ఉండమంటా పూలమీద ప్రశంసలుకురిపిస్తా అందరినీ చదవమంటా పూలమీద కన్నేస్తా ఆనందాన్ని జుర్రుకుంటా పూలమీద చెయ్యేస్తా పరవశించి పొంగిపోతా పూలమీద ముద్రవేస్తా పూలకవిని తలపిస్తా పూలమీద హక్కునాదని ప్రజాకోర్టుకు విన్నవిస్తా పూలమీద కవితరాస్తా పాఠకులను పఠింపజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పేరులో ఏముంది? పేరులో ఏముందిరా పువ్వును ఏపేరునపిలిచినా పొంకము పోదురా పరిమళము తగ్గదురా పేరుకున్న అర్ధము నేతిబీరకాయలోనున్న నెయ్యితోసమానము పేరుపెట్టిన పెద్దల ఉద్దేశము పిల్లలు తీర్చుట ఉచితము భావ్యము పేర్లకు తోకలు తగిలించుకుంటారు కులమును సగర్వంగా చాటుకుంటారు పేరును ప్రేమగాపిలుస్తారు మదులను ముచ్చటపరుస్తారు పేరును విరుస్తారు కసిని తీర్చుకుంటారు పేరుకోసము పాకులాడుతారు పొందినపుడు పరవశించిపోతారు పేరునుబట్టి జాతకాలువ్రాస్తారు భవిష్యత్తును ఊహించుకుంటారు పేర్లనుపట్టి పెళ్ళిల్లుచేస్తారు నిజమనినమ్మి నూరేళ్ళపంటనుపండిస్తారు పేర్లను బడిలోపిలుస్తారు హాజరు నమోదుచేస్తారు పేర్లను చెప్పిస్తారు కొత్తపెళ్ళిజంటలను కలుపుతారు పేర్లకున్న ప్రాముఖ్యము కడలియంత అపారము పేర్లచరిత్రను పరిశీలించరా ప్రాధాన్యతను పరిగణించరా పేరును నిలుపుకోరా సార్ధకనాముడిగా పేరొందరా పొడుగుపేరు వద్దురా పొట్టిపేరు ముద్దురా పేరు పొందరా నోర్లలో నానరా పేరుకొరకు వ్రాయలేదురా పొగడ్తలకు పొంగిపోనురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పువ్వంటే? పువ్వంటే అందము చూచినంత ఆనందము పువ్వంటే పరిమళము పీల్చినంత ప్రమోదము పువ్వంటే ప్రణయము మన్మధుని మోహనాస్త్రము పువ్వంటే వికాసవంతము కళ్ళనుచేయు దేదీప్యమానము పువ్వంటే సౌభాగ్యము పడతులకు పుణ్యసూచకము పువ్వంటే ప్రకాశము మోములకు ముదావహము పువ్వంటే సుకుమారము తాకినయిచ్చు సంతోషము పువ్వంటే వర్ణశోభితము పరికించనిచ్చు పారవశ్యము పువ్వంటే అలంకారము తరుణులకిచ్చు సౌందర్యము పువ్వంటే కవితావిషయము కవులచేవ్రాయించు కమ్మనికవిత్వము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగు వెలుగులు తెలుగుతల్లికి మొక్కుతా తెలుగుతీర్ధాన్ని పుచ్చుకుంటా తెలుగుతలుపులు తడతా తెలుగువాళ్ళను కలుస్తా తెలుగుగడపలు ఎక్కుతా తెలుగుస్వాగతాలు పొందుతా తెలుగువంటలు తింటా తెలుగువాడినని గర్విస్తా తెలుగుదనమును తలకెత్తుకుంటా తెలుగువాళ్ళను తృప్తిపరుస్తా సాటివారితో సంభాసిస్తా సంతోషంలో ముంచేస్తా సహజీవులతో సంచరిస్తా సుఖసౌఖ్యాలతో సంబరపరుస్తా తోటివారితో తిరుగుతా సహాయసహకారాలు అందిస్తా సమాజంలో భాగమవుతా సంఘాభివృద్ధికి పాటుపడతా లోకాన్ని చదువుతా లోపాలను సరిదిద్దుతా ప్రజలతో మమేకమవుతా ప్రేమాభిమానాలు చూరగొంటా మాతృభాషలో ముచ్చటిస్తా మమతామమకారాలతో మదులునింపుతా తేటతెలుగులో కవితలువ్రాస్తా తియ్యందనాలతో తన్మయపరుస్తా తెలుగులోనే మాట్లాడమంటా తెనెచుక్కలను చిందించమంటా తెలుగుగంటలు కొడతా తెలుగునాదాలు వినిపిస్తా తెలుగే వెలుగంటా వెలుగే తెలుగంటా జై జై తెలుగు జయహో తెలుగు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తొలకరిజల్లులు వేడిగాలితో వేగుచుంటిమి మండుటెండలో మాడుచుంటిమి ఉక్కపోతతో ఉడుకుచుంటిమి చెమటతడిలో తడుచుచుంటిమి వరుణదేవుని వేడుచుంటిమి వానలిమ్మని కోరుచుంటిమి వాయుదేవుని అదుగుచుంటిమి చల్లగాలిని వీచమనుచుంటిమి పరమాత్ముని పూజించుచుంటిమి వానలిమ్మని వేడుకొనుచుంటిమి నల్లమబ్బులా పిలుచుచుంటిమి కరువుతీరా కురిపించమంటిమి కుండపోతగా వర్షించమంటిమి కప్పలపెళ్ళిల్లనూ చేయుచుంటిమి కణికరమును చూపమంటిమి కష్టములను తొలగించమంటిమి పశుపక్షులను కావమంటిమి జంతుజాలమును కాపాడమంటిమి చెరువులను నింపమంటిమి వాగువంకలను పారించమంటిమి పూజలు ఫలించాయి వానలు వరించాయి చినుకులు చిటపటమంటున్నాయి చిందులు తొక్కమంటున్నాయి ఉరుములు గర్జిస్తున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి చినుకులు చిందుచున్నాయి చల్లగాలులు వీచుచున్నాయి చేపపిల్లలు ఈదుచున్నాయి కప్పపిల్లలు ఎగురుతున్నాయి చిన్నపిల్లలు ఆడుతున్నారు పెద్దవాళ్ళు పరికిస్తున్నారు తొలకరిజల్లులు ఆగమనం ఉక్కపోతనుండి ఉపశమనం వానకు స్వాగతం కవితకు విరామం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పూలకవి పుష్పాలాపనలు పూలవనమును పెంచరా పువ్వులమధ్యన తిరుగరా అందాలపూలను చూడరా ఆనందమును పొందరా పూలపరిమళాలు పీల్చరా పూలప్రాభవమును చాటరా పూలవన్నెలు పరికించరా పలువిధముల ప్రస్తుతించరా పూలస్నేహమును చేయరా పూలమనసులను తెలుసుకోరా పువ్వులు కోమలమురా తాకిన నలిగిపోవురా పూలపానుపును ఎక్కరా పొద్దుపొడిచేవరకు పవళించరా పుష్పాంజలులు ఘటించరా ప్రేమాభిమానాలు తెలుపరా పుష్పగుచ్ఛమును ఇవ్వరా మదిలోనిప్రేమను తెల్పరా పూలప్రేమను ఎరుగరా పూలప్రియునిగా ఎదుగరా పుష్పమాలలు అల్లరా తెలుగుతల్లిమెడన వెయ్యరా పూలబాషను నేర్వరా పుష్పబాలలతో మాట్లాడరా పూలబ్రతుకులు కాంచరా పూలకవితలను వ్రాయరా పువ్వులను తలచుకోరా పలుకైతలను రచించరా పూలలోకమును పరికింపజేయరా పాఠకులను ప్రమోదపరచరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేను నాపూలు పూలు కవ్విస్తున్నాయి పూలు ప్రేమిస్తున్నాయి పూలు ఎదురుచూస్తున్నాయి పూలు వెంటపడుతున్నాయి పూలు పలుకరిస్తున్నాయి పూలు పులకరిస్తున్నాయి పూలు పిలుస్తున్నాయి పూలు పకపకలాడుతున్నాయి పూలు ప్రక్కనుండమంటున్నాయి పూలు ప్రకాశించిపోతున్నాయి పూలు విహరిద్దామంటున్నాయి పూలు వేడుకచేసుకుందామంటున్నాయి పూలు సొగసులుచూపుతున్నాయి పూలు సరసాలాడుతున్నాయి పూలు పరవశించిపోతున్నాయి పూలు పరిమళాలుచల్లుతున్నాయి పూలు వికసిస్తున్నాయి పూలు పరిహసిస్తున్నాయి పూలు కథలుచెబుతున్నాయి పూలు తలపులులేపుతున్నాయి పూలు వర్ణించమంటున్నాయి పూలు వినోదపరచమంటున్నాయి పూలు కవితలుకూర్చమంటున్నాయి పూలు కైతలువినిపించమంటున్నాయి పూలకోర్కెలు తీరుస్తా పెక్కుకైతలు పుటలకెక్కిస్తా పాఠకులను చదివిస్తా మాధుర్యాలను పంచేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అప్పుసప్పులు  మానవులు జన్మనిచ్చిన దేవునకు ఋణగ్రస్తులు తనయులు పెంచిపోషించిన తల్లిదండ్రులకు బదులున్నవారు శిష్యులు చదువుచెప్పిన గురువులకు అప్పుతీర్చవలసినవారు నేల నీరుయిచ్చిన మేఘాలకు బదులుపరురాలు మొక్కలు పెంచిన భూమికి బాకీదారులు తరువులు పుట్టించిన విత్తనాలకు బకాయీలు చెట్లు ఫలాలిచ్చిన పూలకు అరువులు పువ్వులు పేరుతెచ్చిన పరిమళాలకు అచ్చుదలయున్నవారు వృక్షాలు మొలిపించిన విత్తనాలకు బకాయిదారులు కవితలు కమ్మగాకూర్చిన కవులకు ఎరవులు పాఠకులు పరవశపరచిన కవులకు రోయిదారులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓరేయి ఊహపుట్టింది తలనుతట్టింది భావమయ్యింది కాగితమెక్కింది కోరికొకటి కలిగింది రంగంలోకి దింపింది సాధన చేయించింది విజయం చేకూర్చింది అందము అగుపించింది కళ్ళను కట్టిపడవేసింది అనందము నిచ్చింది మనసును దోచింది పువ్వులు కనబడ్డాయి పరిమళాలు చల్లాయి పొంకాలు చూపాయి పసందు నిచ్చాయి జాబిలి ఉదయించాడు వెన్నెలను కురిపించాడు ప్రేమను వెదజల్లాడు ప్రేమికులను రెచ్చగొట్టాడు తారకలు వచ్చాయి తళతళ వెలిగాయి మేఘాలు లేచాయి చినుకులు చల్లాయి సూరీడు ఉదయించాడు కాంతులు కుమ్మరించాడు చీకటిని పారదోలాడు జనాన్ని జాగృతంచేశాడు అక్షరాలు అందాయి పదాలు పేరుకున్నాయి పంక్తులు పొసగాయి కవితలు కూరాయి పక్షులు లేచాయి రెక్కలు విప్పాయి కిలకిల లాడాయి గాలిలో ఎగిరాయి కవులు చూచారు సంబర పడ్డారు కలమును పట్టారు కవితలు కూర్చారు చూచింది చూచినట్టుగా చెప్పా జరిగింది జరిగినట్టుగా వ్రాశా చదివింది చక్కగా చెబుతారా తట్టింది తడమకుండా తెలుపుతారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పదునుపెట్టిన ప్రేయసి లేమ లెమ్మంది లెస్స పలికింది లేటు వలదంది లేకి కావద్దంది భామ బాగుంది భుజము తట్టింది బుగ్గ గిల్లింది  భ్రమ కలిగించింది ప్రేమనొలికింది ప్రేరేపించింది ప్రోత్సహించింది ప్రేయసిగామారింది వలపువల విసిరింది వయ్యారాలు చూపింది వగలాటలాడింది వణికిసలాడింది తల నిమిరింది తలపులు లేపింది తనువును తాకింది తనివి తీర్చింది దొరనని పిలిచింది దగ్గరకు వచ్చింది దమ్ము చూపమంది దడదడలాడించమంది దొరసానిని చెయ్యమంది దోరవయసు దోచుకోమంది దోబూచులాట వద్దంది దొరతనము చూపమంది ముందుకు వెళ్ళాలనియున్నది మనుమాడాలని యున్నది మెడనువంచాలని యున్నది మంగళసూత్రం కట్టాలనియున్నది కలమును పట్టమంది కవితను వ్రాయమంది కమ్మదనము చూపమంది కలకాలము నిలువమంది కథలు వ్రాయమంది కాంతులు చిమ్మమంది కళకళ మెరువమంది ఖ్యాతిని పొందమంది సంసారం సాగిస్తా సాహిత్యం సానపడతా దీవిస్తే ధన్యుడనవుతా పొగిడితే పొంగిపొర్లుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సుద్దులు సుద్దులు  చెబుతా బుద్ధులు మార్చుతా పెద్దలమాటలు వినుమురా చిల్లరపనులు చేయకురా తెల్లనివన్ని పాలుకాదురా నల్లనివన్ని నీళ్ళుకాదురా పరుగెత్తి పాలుత్రాగుటకన్నా నిలబడి నీళ్ళుత్రాగుటమేలురా మాధవసేవ కన్నా మానవసేవ మిన్నరా వట్టిమాటలు చెప్పకురా గట్టిచేతలు చూపరా దానధర్మములు చెయ్యరా పుణ్యఫలములు పొందరా పోరాడి గెలవరా ప్రఖ్యాతి పొందరా నిదానము ప్రధానమయినా ఆలశ్యము అనర్ధదాయకమురా చెప్పింది చెయ్యరా మాటయిచ్చి మరువకురా ప్రేమను చూపరా ద్వేషము వీడురా అపకారికైనను చెయ్యరా ఉపకారమును భావించకన్యధా చూచి  నడవరా క్రింద పడకురా ఆలోచించి అడుగులెయ్యరా అరచేతులుకాలినతర్వాత ఆకులుపట్టుకొన్నలాభమేమిరా మేలుచేసినవారిని మరువకురా కీడుచేసినవారిని క్షమించురా ఆరోగ్యము మహాభాగ్యమురా విత్తముకొరకు వెంపరలాడకురా ఉన్నదానితో తృప్తిపొందరా లేనిదానికై పాకులాడకురా జరిగినదంతా మంచికనుకోరా జరగబోయేవాటిపై దృష్టిపెట్టరా అనుకున్నామని అన్నీజరగవురా అనుకోలేదని ఆగవురా తల్లిదండ్రులను ప్రేమించరా గురువులను గౌరవించరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తీపికబుర్లు  తీపికబుర్లు అందిస్తా తేటతెలుగును చిందిస్తా తీపిలేని పలుకులు రుచిలేని వంటకాలు తీయదనములేని స్నేహాలు వెన్నెలకాయని రాత్రులు మధురములేని జీవితాలు సంతానములేని గృహములు పసలేని పదార్ధాలు వాడుకోలేని వ్యర్ధాలు మాధుర్యములేని కవితలు పసందులేని అప్పచ్చులు కమ్మదనములేని కయితలు ఇంపుసొంపులేని ఇంతులు స్వాదిమలేని సమావేశాలు ఉప్పువెయ్యని కూరలవిందు సురసములేని సంసారాలు పూలుపుయ్యని పిచ్చిమొక్కలు మధురిమలులేని మాటలు ముచ్చటపరచలేని మోములు తేనెలేని పువ్వులు ఆకర్షించలేని అందాలు మిఠాయిపొట్లము ముందుపెట్టనా చక్కెరపొంగలి చేతికందించనా పరమాన్నపాత్రను పెదవులకందించనా పాలుపంచదారలను పాత్రలోకలిపివ్వనా జిలేబిచక్రాలను చేతికందించనా గులాబిజామును గుటకవేయించనా పంచదారచిలుకలను తినిపించనా కలకండపలుకులను నమిలించనా పిప్పరమెంట్ల ప్యాకెటివ్వనా చాకులెట్ల సంచినివ్వనా పాలుమీగడల పుచ్చుకోమందునా పాయసముల పసందుచెయ్యనా పూతరేకుల పళ్ళెమివ్వనా బందరులడ్డుల బుట్టనివ్వనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పురుషులు పుణ్యపురుషులు నీళ్ళుత్రాగేవారు కొందరు రక్తముక్రోలువారు కొందరు మధువుపుచ్చుకునేవారు కొందరు మద్యపానముచేయువారు కొందరు చూపులతోసుఖపెట్టువారు కొందరు మాటలతోముంచేవారు కొందరు చేతులుపట్టుకునేవారు కొందరు కాళ్ళుపట్టిపడదోచేవారు కొందరు కరుణాత్ములు కొందరు కాఠిన్యపరులు కొందరు ప్రేమాత్ములు కొందరు ద్వేషపరులు కొందరు మంచివాళ్ళు కొందరు మోసగాళ్ళు కొందరు న్యాయపరులు కొందరు అవినీతిపరులు కొందరు సహజపరులు కొందరు నటించేవారు కొందరు ధైర్వవంతులు కొందరు పిరికిపందలు కొందరు బాగుకోరేవారు కొందరు చెడుకోరేవారు కొందరు ఆశీస్సులిచ్చేవారు కొందరు అసూయపడేవారు కొందరు శ్రమించేవారు కొందరు సోమరపోతులు కొందరు దాచుకునేవారు కొందరు దోచుకునేవారు కొందరు సహాయపరులు కొందరు పట్టించుకోనివారు కొందరు ప్రేమపావురాలు కొందరు విషసర్పాలు కొందరు కామధేనువులు  కొందరు అడ్డగాడిదలు కొందరు పరుగులెత్తేవారు కొందరు పాకుకుంటుపోయేవారు కొందరు పొగిడేవారు కొందరు తెగిడేవారు కొందరు మానవులు కొందరు దానవులు కొందరు పుణ్యాత్ముల ప్రేమిస్తా పాపాత్ముల పనిపడతా సమాజానికి సేవజేస్తా సాటివారిని సంతసపరుస్తా పెద్దలకు ప్రణమిల్లుతా పిల్లలకు దీవెనలిస్తా గుండ్లపల్లి రాజే...
Image
 కవిగారి చూపులు చుట్టుపక్కలు చూస్తా చక్కదనాలు చక్కగావర్ణించి చూపుతా తూర్పుదిక్కు తిలకిస్తా తీపిపలుకులు  తేటపదాలతో వినిపిస్తా పడమట పరికిస్తా పాఠకుల  పలుకవితలతో పరవశపరుస్తా ఉత్తరం ఉద్వీక్షిస్తా ఉత్తమకవిత్వం ఊరూరా చేరుస్తా దక్షణం దర్శిస్తా దీటైనసాహిత్యం దృష్టికి తీసుకొస్తా ఎత్తుకు ఎగిరికాంచుతా ఎదసొదలను ఎల్లరకు ఎరిగిస్తా క్రిందను కాంచుతా కడుకవితలను కమ్మగా కూర్చుతా ప్రక్కన పరిశీలిస్త్తా పెక్కుకయితల పేర్చి పారించుతా అన్నిదిక్కులు అవలోకించుతా అద్భుతకవనాలను అందంగా ఆవిష్కరిస్తా వీక్షించింది వ్రాస్తా సర్వులని సంతోషంలో ముంచుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితామృతము కలమును కదిలించాలనియున్నది కవితామృతమును కార్పించాలనియున్నది అమృతమును అందించాలనియున్నది అందరిని అమరులచేయాలనియున్నది అమృతవర్షము ఆకసమునుండికురిపించాలనియున్నది అందరిని అందులోతడిపిముద్దచేయాలనియున్నది అమృతజల్లులు చిలుకరించాలనియున్నది అందరిని శుద్ధిచేయాలనియున్నది కవనామృతమును చేర్చాలనియున్నది కవితాప్రియులను కుతూహలపరచాలనియున్నది అమృతకలశము నింపాలనియున్నది అడిగినవారలకు అందజేయాలనియున్నది అక్షరాలను చిలకాలనియున్నది అమృతమును తీయాలనియున్నది పదములను పొంగించాలనియున్నది పదామృతమును పంచిపెట్టాలనియున్నది అంతరంగమును మదించాలనియున్నది ఆలోచనామృతమును వెలికితీయాలనియున్నది సుధను సృష్టించాలనియున్నది వ్యధలను వెడలకొట్టాలనియున్నది పీయూషమును పొత్తాలందునింపాలనియున్నది పాఠకులను పరవశింపజేయాలనియున్నది వాణీవీణానాదమును వినిపించాలనియున్నది సాహిత్యసుధారసమును సర్వులకుచేర్చాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎవడే నీవాడు? బంగారపు ఛాయవాడు చిరునవ్వులు చిందువాడు పువ్వులా అందమైనవాడు పరిమళాలు వెదజల్లేవాడు పక్షిలా ఎగిరేవాడు మబ్బులా తేలేవాడు సూర్యుడులా వెలిగేవాడు చంద్రుడిలా వెన్నెలకాసేవాడు తారకలా తళతళలాడేవాడు మెరుపులా మెరిసిపోయేవాడు రాముడిలా రమణీయడు కృష్ణుడిలా మోహనరూపుడు మన్మధుడిలా సొగసైనవాడు మనసులను దోచుకునేవాడు కోర్కేలు లేపేవాడు కొమ్ము కాసేవాడు మత్తు చల్లేవాడు చిత్తు చేసేవాడు చెంతకు పిలిచేవాడు చెలిమి చేసేవాడు వాడే  నావాడు వాడే నామగడు భారం భరించేవాడు కుటుంబం నడిపేవాడు తోడుగా ఉండేవాడు జోడుగా నిలిచేవాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేను నా కవిత (కవితతో నా ముచ్చట్లు) కవిత  రాత్రివచ్చింది నిదురలేపింది కవ్వించింది కవనంచెయ్యమంది నేను  కదలలా  మెదలలా ఉలుకలా పలుకలా ఆమె గీపెట్టింది గోలచేసింది బుంగమూతిపెట్టింది బ్రతిమలాడింది కవి లేలెమ్మంది కలం పట్టమంది కాగితాలపై కక్కమంది కవితను సృష్టించమంది అందాలు చూడమంది ఆనందం పొందమంది ఆంతరంగాలను తట్టమంది అద్బుతకవితను వ్రాయమంది కవిత్వం మరువద్దంది మానవద్దంది మంచిగావ్రాయమంది పాఠకులను పఠింపజేయమంది పరవశపరచమంది ప్రోత్సాహపరచమంది విషయాలలో వైవిధ్యం చూపమంది విన్నూతనంగా వ్రాయమంది విశేషప్రతిభ కనపరచమంది కవిత్వంలో శిల్పముండాలంది శైలిబాగుండాలంది స్ఫూర్తిదాయకంగాయుండాలంది కవనంలో ప్రాసలుండాలంది పోలికలుండాలంది పసందుకలిగించాలంది శీర్షిక ఆకర్షించాలంది ముగింపు మదినిముట్టాలంది కవితకు ధన్యవాదాలు వాణీదేవికి వందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం మూడు రోజులనుండి పనుల వత్తిడి వలన సమయం చిక్కక కలం పట్టలా, కవితలు రాయలా. పత్రికలకు, పాఠకులకు పంపలా. ఫోనుచేసి పలుకరించిన కవిమిత్రులకు ధన్యవాదాలు.
Image
 మదిలోనిభావాలు  కోరికలచిట్టాని విప్పాలనియున్నది కోనేటిరాయుని కటాక్షంపొందాలనియున్నది కన్నకలలన్ని సాకారంచేసుకోవాలనియున్నది జీవితాన్ని సఫలీకృతపరచుకోవాలనియున్నది  చూచినవన్ని అందంగాయుండాలనియున్నది ఆనందాన్ని అందుకోవాలనియున్నది చేసినవన్ని బహుబాగుండాలనియున్నది నలుగురికి నచ్చాలనియున్నది పాడినవన్ని సరిగమపదనిసలుకావాలనియున్నది ప్రేక్షకులందరిని పరవశింపజేయాలనియున్నది అక్షరాలన్నింటిని అద్భుతంగావాడాలనియున్నది అందరిచదువరులని అలరించాలనియున్నది పేర్చినపదాలన్ని పసందుకూర్చాలనియున్నది పాఠకులందరిని పులకరించాలనియున్నది విషయాలన్ని వైవిధ్యభరితంగాయుండాలనియున్నది వివిధసంఘటలని విన్నూతనంగా వివరించాలనియున్నది ఆలోచనలని సాగించాలనియున్నది అద్వితీయమైనట్టి కవితలనందించాలనియున్నది  వ్రాసినవన్ని మంచిగాయుండాలనియున్నది మదులనుముట్టి మురిపించాలనియున్నది సరస్వతీదేవిని మెప్పించాలనియున్నది సాహిత్యలోకాన్ని సుసంపన్నంచేయాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
అక్షరవిన్యాసాలు చెలమలో ఊటలూరుతున్నాయి శిరములో ఊహలుపుడుతున్నాయి నదిలో నీరు ప్రవహిస్తున్నది మదిలో పదాలు పారుతున్నాయి కడలిలో అలలు ఎగిసిపడుతున్నాయి మనసులో విషయాలు పెల్లుబుకుతున్నాయి పక్షులు కిలకిలలాడుతున్నాయి ప్రాసలు దడదడపొసుగుతున్నాయి ఆకాశంలో కాంతికిరణాలు ప్రకాశిస్తున్నాయి కాగితాలలో అక్షరకాంతులు వెలుగుతున్నాయి పూదోటలో పరిమళాలు ప్రసరిస్తున్నాయి పుటలలో కవితాసౌరభాలు వీస్తున్నాయి పూసలు మాలలుగా గుచ్చబడుతున్నాయి అక్షరాలు కయితలుగా పేర్చబడుతున్నాయి తుమ్మెదలు తేనెను సేకరిస్తున్నాయి  పాఠకులు కవితలను ఆస్వాదిస్తున్నారు మబ్బులు చినుకులు చల్లుతున్నాయి కైతలు మాధుర్యాలు చిమ్ముతున్నాయి వాణి వీణానాదం  వినండి కవి కవితాగానం  ఆలకించండి అక్షరవిన్యాసాలను పరికించండి సాహిత్యప్రక్రియలను ప్రోత్సహించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం