Posts

Showing posts from January, 2025
Image
 ఆడదే ఆధారం  ఓ అమ్మాయి పుట్టిందంటే ఓ ఇంటికి సహనవతి వచ్చినట్లే ఓ బాలిక జనించిందంటే ఓ వీడుకి లక్ష్మీదేవి ప్రవేశించినట్లే ఓ చిన్నది ఉద్భవించిందంటే ఓ ఇల్లాలు ఒకగృహానికి లభించినట్లే ఓ పిల్ల భూమిమీదపడిందంటే ఓ కుటీరంలో ప్రేమాభిమానాలు పొంగిపొర్లినట్లే ఓ గుంట నేలమీదకి దిగిందంటే ఓ కొంపకు త్యాగమూర్తి ఏతెంచినట్లే ఓ పోరి ప్రసవించబడిందంటే ఓ కుటుంబానికి సుఖసంతోషాలు సమకూరినట్లే ఓ అమ్మడు గర్భంనుండ్ది బయటకొస్తే ఓ నివాసానికి మంచిఘడియలు చేకూరినట్లే ఓ పాప పుడమికి అరుదెంచిందంటే ఓ లోగిలిని ఒకపుణ్యవంతురాలు పావనంచేసినట్లే ఓ వనిత అవతరించిందంటే ఓ వంశోద్ధకురాలు ఒకనివేశానికి దక్కినట్లే మహికి మగువలే మూలాధారం మకరందం సౌందర్యం సంతోషం సౌహార్ధం సౌభాగ్యం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 నికృష్టులారా! అన్యాయాలకు పాల్పడితే ఎదురుతిరుగుతా అకృత్యాలకు ఒడిగడితే ఎండగడతా అమానుషంగా ప్రవర్తిస్తే తగినబుద్ధిచెబుతా నోరు మూస్తే విదిలించుకుంటా కళ్ళు కప్పితే విరుచుకపడుతా చేతులు బందిస్తే తెంపుకుంటా కాళ్ళు కట్టేస్తే తెంచుకుంటా తలుపులు బిగిస్తే పగులగొడతా దొమ్మీకి వస్తే పోరాడుతా డబ్బులు ఎరచూపితే ముఖంమీదకొడతా అమాయుకులు అయితే దారికితీసుకొస్తా పశువులు అయితే నాలుగుబాదుతా రాక్షసులు అయితే శాస్తిచేస్తా నలుగురుని ప్రోగుచేస్తా నికృష్టులపనిపడతా ఆడవారికి కొండంత అండగానిలుస్తా అణగారినివారికి తోడ్పడుతా అభివృద్ధిపరుస్తా పేదవారిని కూడుస్తా  ప్రోత్సహిస్తా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా  ప్రజాస్వామ్యాన్నికాపాడుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 తెలుగుబాటపట్టండి  తెలుగుకు వెలుగుంది తెరువుంది రంగుంది హంగుంది తెలుగుకు బలముంది భవిష్యత్తుంది    గౌరవముంది గుర్తింపుంది    తెలుగుకు తీపియుంది తీరువుంది రుచివుంది శుచివుంది  తెలుగుకు లయవుంది నడకవుంది సొగసుంది స్వరముంది తెలుగుకు తల్లివుంది అండవుంది ఖ్యాతివుంది జాతివుంది తెలుగుకు వైభవముంది సౌరభముంది   ప్రాబల్యముంది ప్రాముఖ్యముంది     తెలుగుకు  సమయమొచ్చింది సందర్భమొచ్చింది  మెరిపిద్దాంరండి వ్యాపిద్దాంరండి   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఎందుకో? కలము పట్టాలని ఉన్నది పుటలు నింపాలని ఉన్నది పదాలు పేర్చాలని ఉన్నది పెదాలు కదిలించాలని ఉన్నది పలుకులు విసరాలని ఉన్నది తేనెచుక్కలు చిందాలని ఉన్నది ముచ్చట్లు చెప్పాలని ఉన్నది చప్పట్లు కొట్టించాలని ఉన్నది మోములు వెలిగించాలని ఉన్నది మనసులు దోచుకోవాలని ఉన్నది అందాలు వర్ణించాలని ఉన్నది ఆనందము కలిగించాలని ఉన్నది మాధుర్యాలు అందించాలని ఉన్నది కమ్మనివంటలు వడ్డించాలని ఉన్నది చాతుర్యము చాటాలని ఉన్నది చమక్కులు చూపించాలని ఉన్నది తలపులు పారించాలని ఉన్నది భావాలు బహిరంగపరచాలని ఉన్నది భారతిని ప్రార్ధించాలని ఉన్నది సాహితిని సమృద్ధిచేయాలని ఉన్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నవదంపుతులారా! తోడునీడగా బ్రతకండి  వెన్నుదన్నుగా నిలవండి  ముందువెనుకలు చూడండి  మంచిబాటను పట్టండి  అన్యోన్యంగా ఉండండి  ప్రేమాభిమానాలు పంచుకోండి  సరసాలు ఆడుకోండి  విహారాలు చేయండి  ఉత్సాహంగా గడపండి  ఉల్లాసంగా జీవించండి  అందాలను చూడండి  ఆనందాలను పొందండి  సంతానమును కనండి  సద్భుద్దులను నేర్పండి    పిల్లలను పోషించండి  ప్రతిభావంతులను చేయండి  ఆదర్శప్రాయులు  అవండి  అందరిమన్ననలు అందుకోండి  పేరుప్రఖ్యాతులు సంపాదించండి  ఆదర్శదంపతులు అనిపించుకోండి  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 లోకం  కుక్కలా మొరుగుతుంది భయపడకు కాకిలా గోలచేస్తుంది పట్టించుకోకు పాములా బుసకొడుతుంది అధైర్యపడకు గాడిదలా తన్నుతుంది చెంతకుపోకు గోడమీదపిల్లిలా కూర్చుంటుంది గమనించు పిల్లులమధ్యలాకోతిలా పంచుతానంటది పంచాయతీకిపోకు అవహేళన చేస్తుంది లెక్కచేయకు ఆందోళన చేస్తుంది అడ్డంతగులు నిప్పులు క్రక్కుతుంది ఒళ్ళుకాల్చుకోకు రాళ్ళు విసురుంది గాయాలబారినపడకు నిందలు వేస్తుంది దీటుగాజవాబివ్వు విషం చిమ్ముతుంది తెలుసుకొనినడువు కళ్ళల్లో కారంచల్లుతుంది కాచుకోవటంనేరువు చెవుల్లో సీసంపోస్తుంది దరిదాపులకుపోబోకు పక్కతోవ పట్టిస్తుంది జాగ్రత్తవహించు ముందుకు పోవద్దంటుంది నిజాన్నిగ్రహించినడువు పెద్దగా ఉరుముతుంది చెవులుమూసుకో తళుక్కున మెరుస్తుంది కళ్ళుకాపాడుకో చెవిలో పూలుపెడుతుంది నిజమెరుగు బట్టలపై బురదచల్లుతుంది దగ్గరకుపోకు లోకంనోర్లను కుట్టేయటంకష్టమని తెలుసుకో నీచెవులను మూసుకోవటం సులభమని ఎరుగిమసలుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 మా ఆవిడ షరతులు రుచిగావున్నా లేకపోయినా పేరుపెట్టకుండా అన్నంతినాలంటుంది మా ఆవిడ అలంకరించుకున్నా లేకపోయినా అందంగాకనపడమనకుండా సర్దుకుపోవాలంటుంది మా ఆవిడ ఒకటోతేదీలోపలే జీతాన్నంతా నగుదురూపేణా చేతికివ్వాలంటుంది మా ఆవిడ గదిమినా తిట్టినా ఎదురుతిరగకుండా నోరెత్తకూడదంటుంది మా ఆవిడ నచ్చినా నచ్చకపోయినా నలుగురిముందు మెచ్చాలంటుంది మా ఆవిడ ఎప్పుడూ డబ్బులలెక్కలను పొరపాటునైనా అడగొద్దంటుంది మా ఆవిడ కార్యాలయమునుండి అటూనిటూతిరగకుండా నేరుగా ఇంటికిరావాలంటుంది మా ఆవిడ ఆదేశాలు  అమలుచేయకపోతే పస్తులు పెడతానంటుంది మా ఆవిడ కోపంతెప్పిస్తే నగలునట్రాతీసుకొని పెట్టాబేడాసర్దుకొని పుట్టింటికెళతానంటుంది మా ఆవిడ ఏమిచెయ్యాలో తోచటంలా ఎలాచెప్పాలో అర్ధంకావటంలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
ఎవరు కవి? శాలువాలు కప్పించుకున్నవాడు కవియా! సత్కవితలు  రచయించినవాడు కవియా! పత్రికలు ప్రాచుర్యమిచ్చినవాడు కవియా! పాఠకులు ప్రశంచించినవాడు కవియా! సొంతడబ్బాలు కొట్టుకునేవాడు కవియా! చదువరులు శ్లాఘించినవాడు కవియా! బిరుదులు కొన్నవాడు కవియా! మనసులు దోచుకున్నవాడు కవియా! పేరుప్రఖ్యాతులు కోరుకునేవాడు కవియా! పెదవులతేనెచుక్కలు చిందించేవాడు కవియా! ఎచ్చులు హెచ్చుగాచెప్పేవాడు కవియా! నోర్లయందు నిత్యమునానువాడు కవియా! ఎక్కువమాటలువాడి  తక్కువర్ధమిచ్చేవాడు కవియా! తక్కువపదాలుప్రయోగించి  ఎక్కువభావమిచ్చేవాడు కవియా! అక్షరనిప్పులు కక్కేవాడు కవియా! కవనపుష్పాలు వెదజల్లేవాడు కవియా! దోషపదాలు దొర్లించేవాడు కవియా! కవితాసౌరభాలు ప్రసరించేవాడు కవియా! పూర్తిగకాగితాలు నింపేవాడు కవియా! కమ్మనికవనాలు పంచేవాడు కవియా! పెన్ను పట్టినవాడు కవియా! పదాలు పసందుచేసేవాడు కవియా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 కవితాదాహం కవిత్వం  కవులకు కలిగేదాహం ఎప్పటికీ తీరనిదాఘం కవిత్వం  మనసులతొలిచే కీటకం మదులలోపుట్టే ప్రకరణం కవిత్వం  ఆలోచనల పర్యావసానం భావజ్వాల బహిర్గతరూపం కవిత్వం అక్షరాల అల్లకం పదాల పేర్చటం కవిత్వం పువ్వుల హారం పరిమళ ప్రసరణం కవిత్వం తియ్యని మకరందం వీనులకు విందుభోజనం కవిత్వం అనుభూతుల అక్షరాకారం అంతరంగాల ప్రతిస్పందనం కవిత్వం అందాల ప్రదర్శనం ఆనందాల కారకం కవిత్వం జలజలాపారే ప్రవాహం మిలమిలామెరిసే ప్రకాశం  కవిత్వం కవితల సమూహం కవుల మనోజనితం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నీవులేక నేనులేను...... చెట్టెండిపోయినా పరవాలేదు బావినీరింకినా ఇబ్బందిలేదు వెన్నెలలేనిరాత్రయినా సమస్యలేదు జేబుఖాళీయయినా చింతలేదు పంచభక్ష్యాలు అవసరములేదు నవరసాలు కోరుకునేదిలేదు షడ్రుచులు కావాలనుకోను పసందయినవంటలు వడ్డించాలనుకోను కష్టాలైనా పడగలను నష్టాలైనా భరించగలను పస్తులైనా ఉండగలను ఆస్తులైనా అమ్మగలను గౌరవమర్యాదలు ఇవ్వాలనను పేరుప్రఖ్యాతులు ఆశించను మంచీచెడ్డలను పట్టించుకోను ఆయురారోగ్యాలకు పరితపించను నీ తాళిని తెంపించలేను నీ బొట్టును చెరిపించలేను నీ గాజులు పగులగొట్టించలేను నీ సౌభాగ్యము దూరంచేయలేను నీ సాహచర్యం వదులుకోలేను నీ తోడులేక బ్రతుకలేను నీ ప్రేమాభిమానాలులేక మనుగడసాగించలేను నీవులేని జీవితాన్ని గడపలేను చెంతనే ఉండు సంతోషంగా గడుపుదాం చేతులు కలుపు కలసిముందుకు నడుద్దాం అందాలను చూపు ఆనందంగా జీవించుదాం నవ్వులు చిందించు నవలోకంలో విహరించుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఓ వసంతమా! చెట్లు ఆకులు రాలుస్తున్నాయి నీవు వస్తావని చిగురులు వేయిస్తావని శోభాయమానం చేస్తావని  కోకిలలు ఎదురుచూస్తున్నాయి నీవు వస్తావని మావిచిగుర్లు తినిపిస్తావని కంఠాన్ని విప్పిస్తావని వేపవృక్షాలు ప్రతిక్షిస్తున్నాయి నీవు వస్తావని పూత పూయిస్తావని ఉగాదిపచ్చడి చేయిస్తావని మామిడితరువులు కాచుకొనియున్నాయి నీవు వస్తావని తోరణాలు కట్టిస్తావని  పిందెలు కాయిస్తావని మొక్కలు పొంచియున్నాయి నీవు వస్తావని పూలుపూయిస్తావని పొంకాలు చూపించవచ్చని మల్లెలు వీక్షిస్తున్నాయి నీవు వస్తావని విరులు వికసింపజేస్తావని పరిమళాలు చల్లిస్తావని ప్రకృతి వేచిచూస్తున్నది నీవు వస్తావని పచ్చదనం పరుస్తావని పుడమికి చక్కదనాన్నిస్తావని తెలుగోళ్ళు తొందరపడుతున్నారు నీవు వస్తావని ఉగాదిపండుగ తెస్తావని కొత్తసాలులో కోర్కెలనుతీరుస్తావని పిల్లలు  కనిపెట్టుకొనియున్నారు నీవు వస్తావని వసంతపంచమి తెస్తావని అక్షరాభ్యాసం చేయిస్తావని ప్రజలు ప్రతిక్షిస్తున్నారు నీవు వస్తావని చలికాలం పోతుందని సంతసాలను కలిగిస్తావని కవులు నిరీక్షిస్తున్నారు నీవు వస్తావని అందాలు చూపుతావని కమ్మనికవితలు రాయిస్తావని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్య...
Image
 మాటలమహత్యం  అతడు మాటకారి అతని మాటలు ఆకర్షిస్తాయి అంతరంగాలు అతడు మాటనేర్పరి అతని మాటలు అందిస్తాయి ఆనందాలు అతడు మాటలగారడి అతన మాటలు కలిగుంటాయి లయబద్ధతను అతడు మాటలమాంత్రికుడు అతని మాటలు చూపుతాయి పాదనియమాలను అతడు మాటలమరాఠి అతని మాటలు విసురుతాయి చమక్కులు అతడు మాటలపొదుపరి అతని మాటలు తక్కువపదాలతో ఇస్తాయి ఎక్కువ అర్ధాలు అతడు మాటలదిట్ట అతనిమాటలు చిందుతాయి తేనెచుక్కలు అతడు మాటమనిషి అతని మాటలు కుదుర్చుతాయి మంచినమ్మకము అతడు అందుకే కవివర్యుడు అతని కవితలు అద్భుతాలు మనమూ నేర్చుకుందామా మాటలచాతుర్యము మనమూ ప్రదర్శించుదామా మాటలమహత్యము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 బాలను నేను (బాలగీతం) బాలను నేను పసిబాలను నేను చిట్టిని నేను చిన్నారిని నేను             ||బాలను|| తెల్లవారితే మేల్కొంటా రాత్రయితే నిద్దురిస్తా వెలుతురుంటే బయటికొస్తా వెన్నెలుంటే విహరిస్తా                 ||బాలను||  ఎక్కిరిస్తే తెల్లబోతా ఎత్తుకుంటే సంతసిస్తా ఆటలంటే సయ్యంటా పాటలంటే గళమెత్తుతా                ||బాలను|| తీపినిస్తే చప్పరిస్తా పండునిస్తే కొరుక్కుతింటా పప్పులిస్తే నములుతా బెల్లమిస్తే మెక్కుతా                  ||బాలను|| పూలుయిస్తే పుచ్చుకుంటా అత్తరుచల్లితే ఆఘ్రానిస్తా కధలుచెబితే కమ్మగావింటా కవితపాడితే కుతూహలపడతా            ||బాలను|| చక్కనంటే చిందులేస్తా ముద్దులిస్తే మురిసిపోతా పిలిచావంటే పలుకుతా కబుర్లుచెబితే కులుకుతా                 ||బాలను|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీప్రయాణం కవితాలోకమందు కాలుపెడతా కాలక్షేపంచేస్తా అక్షరాలను నీళ్ళలో కలుపుతా కవితాసాగరమంటా పదాలను గాలిలో విసురుతా కవనవీచికలంటా విషయాలను నదిలో వదులుతా కైతాప్రవాహమంటా ఆలోచనలను కాగితాలకెక్కిస్తా కయితాపుస్తకమంటా భావాలను బయటకు క్రక్కుతా భావకవితలంటా వాక్యాలను కలముతో కారుస్తా వచనకవితలంటా రాతలను పత్రికలకిస్తా ప్రచురిస్తే మహాకవినంటా కవిసమ్మేళనాలకు హాజరవుతా శాలువాకప్పించుకుంటా మహాసత్కారంచేశారంటా పిలిస్తే  అతిధిగా వేదికలెక్కుతా ఉపన్యాసాలుదంచేస్తా సాహితీప్రయాణం కొనసాగిస్తా సరస్వతీపుత్రుడునంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
మెరుపులు కురిపించిన వీక్షణం 149 వ అంతర్జాల సమావేశం ***********************************************  నేడు 18-01-2025వ తేదీన మూడు గంటలు జరిగిన కాలిఫోర్నియా అంతర్జాల వీక్షణం సమావేశంలో మొదట ముఖ్య అతిధి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి తన ప్రసంగంలోను మరియు 28 మంది కవులు తమ కవితలలోను చమక్కులవాన కురిపించారు. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారు ఆలపాటి గారిని పరిచయం చేసి వారు సమావేశంలో పాల్గొనటం మన అదృష్టం అనిచెప్పారు. ఆలపాటి గారు కదిలించేకవిత్వం కావాలి, ఆశ్చర్యం కలిగించే కవిత్వం కావాలి, ఉత్సాహపరిచే కవిత్వం కావాలి, పలకకవిత్వం కాకుండా పలుకరించే కవిత్వం కావాలని చెప్పారు. కవులు ఆది, వెంకట్, ప్రసాదరావు, ఘంటా మనోహరరరెడ్డి, తేళ్ళ అరుణ, అయ్యల సోమయాజులప్రసాద్, రామక్రిష్ణ చంద్రమౌళి, ఆలపాటి గారి ప్రసంగం కవుల మనసుల్లో చమక్కులు నాటాయని కొనియాడారు. తర్వాత వీక్షణం భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవిసమ్మేళనం నిర్వహించారు. డాక్టర్ గీతా మాధవి అచ్యుతం కేశవం అనే శ్లోకమును, పండుగంటే అనే కవితను  వినిపించారు. ఆలాపాటి కవి శాంతము కోరుకునే మనసు అంటు 6 భాషలలో కవితను ఆలపించారు. యువ కవి...
Image
 తెలుగుకవితలు చమక్కులు చురుక్కులు చమక్కులు విసరనా మదులను దోచనా చంకీలు చల్లనా తళుకులు చూపనా తెలివిని చాటనా తమాష చేయనా ఉరుములు లేకుండా మెరుపులు చూపించనా తెలుగు కావాలనికోరనా తెగులు ఏమాత్రమువద్దననా విషయము వివరించనా వ్యాఖ్యానము వినిపించనా మాటలనేర్పు ప్రదర్శించనా మదులను ముట్టనాతట్టనా మోములను వెలిగించనా మహదానందము కలిగించనా నచ్చినా నచ్చకపోయినా వద్దన్నా వారించినా మెచ్చినా మెచ్చకపోయినా వివరిస్తా వినిపిస్తా కలమును చేతపడతా కవితాచమక్కులు కూర్చుతా గళమును ఎత్తుతావిప్పుతా చురకలు అంటించుతా నానీల రచనల్లో నాల్గవ పంక్తుల్లో చూపాలట చమక్కులు తగిలించాలట చురుక్కులు పదాల్లో చూపించనా ఉరుకులు పరుగులు కులుకులు మెరుపులు వాడీవేడులు తళుకులు చమక్కులులేని కవితవినిపించిన చప్పననవలె వ్యర్ధమనవలె రసహీనమనవలె తెలివితక్కువనవలె ప్రేక్షకవీక్షకులార వివేకవంతులారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 పుష్పవికాసాలు పూలు వికసించాయి చూపించాయి మనోహరదృశ్యాలు పూలు ప్రేమించాయి అందించాయిరమ్మని ఆహ్వానాలు పూలు అద్దుకున్నాయి పలురంగులు పూలు చూపించాయి అందచందాలు పూలు చుట్టూచల్లాయి సౌరభాలు పూలు కలిగించాయి సంతసాలు పూలు ఎక్కాయి కోమలాంగుల కొప్పులు పూలు చేరాయి పరమాత్ముని పాదాలు పూలు అయ్యాయి ప్రకృతిప్రతీకలు పూలు మురిపిస్తున్నాయి మదులు పూలు ప్రోత్సహిస్తున్నాయి కవిపుంగవులను పూలు ఆకర్షిస్తున్నాయి సీతాకోకచిలుకలను పూలు తెలియపరుస్తున్నాయి పుణ్యవతుల సౌభాగ్యం పూలు చూపుతున్నాయి చక్కనిమెత్తని సన్మార్గం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితావిన్యాసాలు కవితాసామ్రాజ్యము స్థాపించాలని ఉన్నది కవితాసింహాసనము అధిరోహించాలని ఉన్నది కవితాసందడులు చేయాలని ఉన్నది కవితాగానమును వినిపించాలని ఉన్నది కవితానవ్వులు కనబరచాలని ఉన్నది కవితాపువ్వులు పూయించాలని ఉన్నది  కవితాకమ్మదనాలు కుమ్మరించాలని ఉన్నది కవితాతియ్యదనాలు క్రోలించాలని ఉన్నది  కవితాకూర్పులు చేద్దామని ఉన్నది కవితావెలుగులు చిమ్మాలని ఉన్నది కవితాసేద్యము సాగించాలని ఉన్నది కవితాపంటలు పండించాలని ఉన్నది కవితాసిరులను పొందాలని ఉన్నది కవితాకుబేరుడను కావాలని ఉన్నది  కవితాలంకారాలు మిలమిలమెరిపించాలని ఉన్నది కవితాకళలు తళతళలాడించాలని ఉన్నది కవితాకిరణాలు ప్రసరించాలని ఉన్నది కవితావెన్నెలను వెదజల్లాలని ఉన్నది కవితావిందులు వడ్డించాలని ఉన్నది కవితాపసందులు చవిచూపాలని ఉన్నది కవితావనమును పెంచాలని ఉన్నది కవితాసౌరభాలను చల్లాలని ఉన్నది కవితాకన్యను చేరదీయాలని ఉన్నది కవితాసౌఖ్యాలను అనుభవించాలని ఉన్నది కవితాకులుకులు ప్రదర్శించాలని ఉన్నది కవితాసొగసులు కళ్ళకందించాలని ఉన్నది కవితాగుట్టులు విప్పాలని ఉన్నది కవితారూపాలు తెలపాలనిఉన్నది కవితాసింగారాలు చూపాలని ఉన్నది కవితానందము చేకూర్చాలని ఉన్నద...
Image
 మహాకవి అతడు కోరుకుందెల్లా లభిస్తుంది అదృష్టవంతుడు అతడు అనుకున్నదెల్లా జరుగుతుంది సంకల్పబలుడు అతడు పాల్గొన్నవాటిలోనెల్లా విజయంసాధిస్తాడు ప్రతిభావంతుడు అతడు చిక్కించుకున్నదెల్లా లాభంచేకూరుస్తుంది భాగ్యవంతుడు అతడు పట్టుకుందల్లా బంగారమవుతుంది  హస్తవాసికలవాడు అతడు రాయాలనుకున్నప్పుడెల్లా కమ్మనికవితకూడుతుంది సరస్వతీపుత్రుడు అతడు చదివించినదెల్లా మనసులుదోస్తుంది మహాకవివర్యుడు అతడు పంపినకైతకు సాహిత్యపోటీలో ప్రధమస్థానం వస్తుంది కవిపుంగవుడు అతడు అక్షరఙ్ఞాని సాహిత్యపిపాసి మహాకవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
 సంకురాత్రి పండుగ పండుగ పందుగ పండుగ పెద్ద సంక్రాంతి పండుగ మూడుదినాల పండుగ ముచ్చటయిన పండుగ                                   సంబరాల పండుగ సంకురాతిరి పండుగ సనాతనమైన పండుగ సంప్రదాయాల పండుగ                   ||పండుగ||  అరిసెలు తినిపించె పండుగ పొంగలి వండించె పండుగ కొత్తబట్టలు కట్టించె పండుగ చిరునవ్వులు చిందించె పండుగ                            పలురకాలపూలను పూయించె పండుగ ధాన్యాలను ఇంటికితెప్పించె పండుగ పట్నవాసులు పైకెగిరించె పండుగ పరమానందాన్ని కలిగించె పండుగ      ||పండుగ||   పిల్లలపై రేగిపండ్లుపోయించె పండుగ పశవులను పూజింపజేసె పండుగ పతంగులను ఎగురింపజేసె పండుగ పందెపుకోళ్ళతో పోరుపెట్టించె పండుగ        బడులకు శెలవులిప్పించె పండుగ ధనుర్మాసంలో వచ్చె పండుగ రంగవల్లులు వేయించె పండుగ గౌరమ్మగొబ్బిల్లు పెట్టించె పండుగ       ...
Image
 కవి ఏంచేస్తాడు? కవితలకు ప్రాణంపోస్తాడు కవిబ్రహ్మగా పిలవబడతాడు అక్షరాలను అల్లుతాడు అర్ధాలను స్ఫురింపజేస్తాడు పదాలను ప్రయోగిస్తాడు ప్రాసలతో పసందుచేస్తాడు వివిధాంశాలు చేబడతాడు విన్నూతనంగా విరచిస్తాడు మనసులను హత్తుకుంటాడు ఆలోచనలను రేకెత్తిస్తాడు ప్రకృతిని చూపిస్తాడు పరవశం కలిగిస్తాడు ప్రేమలకు ప్రాముఖ్యమిస్తాడు బంధాలకు బంధీలనుచేస్తాడు స్నేహాలకు విలువనిస్తాడు స్నేహమే జీవితమంటాడు మగువలను మెచ్చుకుంటాడు మర్యాదగా మెలగమంటాడు అందాలను చూపిస్తాడు అందరినీ ఆకట్టుకుంటాడు పువ్వులను పూయిస్తాడు నవ్వులను కురిపిస్తాడు ఆనందంలో ముంచుతాదు అంతరంగాలలో నిలుస్తాడు సూర్యోదయం చూస్తాడు కవితోదయం చేస్తాడు శారదాదేవిని తలుస్తాదు కమ్మనికవితలు కూర్చుతాడు కలమును చేబడతాడు కాగితాలను నింపుతాడు వేలకైతలు వ్రాస్తాడు కవనలోకాన నిలిచిపోతాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితా చైతన్యాలు ఆవేశము ఆవరిస్తే తలపులు తలనుతడితే భావాలు బయటకొస్తే విషయము వెల్లడయితే కవిత పుట్టకొస్తుంది కరము కలమును పడితే అక్షరాలు అందుబాటుకు వస్తే పదాలు ప్రాసలై పొసిగితే పంక్తులు చకచకా పరుగెత్తితే కవిత జనిస్తుంది కళ్ళు తెరచుకుంటే అందాలు కనబడితే ఆనందము కలిగితే ప్రకృతి పరవశపరిస్తే కవిత ఆవిర్భవిస్తుంది నింగి నీలమయితే మేఘాలు ఆవరిస్తే చినుకులు రాలుతుంటే నీరు పారుతుంటే కవిత ఉద్భవిస్తుంది జాబిలి తొంగిచూస్తుంటే వెన్నెల విరజిమ్ముతుంటే చల్లదనము వ్యాపిస్తుంటే హృదయము ఉప్పొంగితే కవిత ప్రభవిస్తుంది సూరీడు ఉదయిస్తుంటే కిరణాలు ప్రసరిస్తుంటే అంధకారము మాయమవుతుంటే లోకము మేల్కుంటుంటే కవిత ఉద్భవిస్తుంది పువ్వులు పూస్తుంటే రంగులు పులుముకుంటే రెమ్మలు విప్పారుతుంటే పరిమళాలు చల్లుతుంటే కవిత తయారవుతుంది రాత్రి కలలోకొస్తే మదిని కవ్వించితే హృదిని ముట్టితే సాహిత్యంలోనికి దించితే కవిత రూపొందుతుంది పెళ్ళి జరుగుతుంటే వాయిద్యాలు వినబడుతుంటే తాళి కడుతుంటే అక్షింతలు చల్లుతుంటే కవిత అవతరిస్తుంది శారద కణికరిస్తే వీణ మ్రోగుతుంటే నాదాలు వినబడుతుంటే శబ్దాలు శ్రావ్యమయితే కవిత ఆవిర్భూతమవుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్...
Image
 శాశ్వతాలు అశాశ్వతాలు పువ్వులలోని పరిమళం శాశ్వతం కాదు మోములమీది సంతోషం శాశ్వతం కాదు దేహములోని ప్రాణం శాశ్వతం కాదు ప్రకృతి సౌందర్యం శాశ్వతం కాదు నదిలోని నీటిప్రవాహం శాశ్వతం కాదు కానీ కవులకవితలు శాశ్వతం మరి కవులపేరుప్రఖ్యాతులు శాశ్వతం అట్లే సాహితీప్రపంచం శాశ్వతం కమ్మని కవితలు కూర్చండి సదాప్రోత్సహించండి సాహితీ జగతినందు నిలవండి చిరంజీవులవండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నమ్మకపు మాటలు తల్లి చెప్పింది ఎవరినీ నమ్మవద్దని తండ్రి చెప్పాడు దేనినీ నమ్మవద్దని  అక్క చెప్పింది  రూమర్లు నమ్మవద్దని  చెల్లి చెప్పింది  గాలిమాటలు నమ్మవద్దని  అన్న చెప్పాడు  కొందరిని నమ్మవద్దని  తమ్ముడు చెప్పాడు  అందరినీ నమ్మవద్దని  అమ్మాయి చెప్పింది  మాయమాటలు నమ్మవద్దని  అబ్బాయి చెప్పాడు  కల్లబొల్లికబుర్లు నమ్మవద్దని  మిత్రుడు చెప్పాడు  కళ్ళనూ నమ్మవద్దని ఆప్తుడు చెప్పాడు  చెవులనూ నమ్మవద్దని  పెద్దలు చెప్పారు  గుడ్డిగా నమ్మవద్దని పిల్లలు చెప్పారు  పిచ్చిగా నమ్మవద్దని మనసు చెప్పింది  కొత్తవారిని నమ్మవద్దని  మెదడు చెప్పింది  పాతవారినీ నమ్మవద్దని చదువు చెప్పింది  అంతతేలికగా నమ్మవద్దని  సంస్కారం చెప్పింది తర్కించనిదే నమ్మవద్దని  హృదయం చెప్పింది  సులభంగా నమ్మవద్దని  జీవితం చెప్పింది  తొందరగా నమ్మవద్దని  ఎందరు చెప్పినప్పతికి నన్ను తప్ప ఎవరినీ నమ్మవద్దని నిన్ను పూర్తిగా నమ్మాను అందుకే నేను ఇలాగా తయారయ్యాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ మిత్రమా!  దీపంలా వెలుగులుచిమ్ము మార్గదర్శిలా ముందుకునడిపించు కోకిలలా శ్రావ్యతనివ్వు కాకిలా గోలచేయకు తేనెలా తీపినిపంచు కాకరలా చేదునుమింగించకు రత్నంలా మెరువు దుమ్ములా కళ్ళుమూయించకు కాటుకలా నేత్రాలకందమివ్వు కారంలా కళ్ళనుమండించకు తెలుగులా వెలుగులుచిమ్ము హరివిల్లులా రంగులుచూపించు పువ్వులా పరిమళించు జాబిలిలా వెన్నెలవెదజల్లు అక్షరాల్లా అల్లుకొను పదాల్లా ప్రవహించు రవిలా కిరణాలుచల్లు శశిలా వెన్నెలనువెదజల్లు కవితలా మదులనుతట్టు కవిలా కమ్మదనాలనివ్వు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 మాటలమర్మాలు మాటలు గాలిలా స్పర్శిస్తే సంతసిస్తా మాటలు తేనెచుక్కలు చల్లితే ఆస్వాదిస్తా మాటలు తూటాలు ప్రేలిస్తే తప్పుకుంటా మాటలు ప్రేమను చాటితే మురిసిపోతా మాటలు మంటలను లేపితే ఆర్పేస్తా మాటలు మల్లెలను విసిరితే మత్తులోమునుగుతా మాటలు మనసును దోచుకుంటే ముగ్ధుడనవుతా మాటలు కోటలు దాటితే కట్టడిచేస్తా మాటలు విషాన్ని క్రక్కితే తిరగబడతా మాటలు ఆచితూచి వదిలితే మెచ్చుకుంటా మాటలు మంచివయితే మదిలో దాచుకుంటా మాటలు కందిరీగలు అయితే మట్టుబెడతా మాటలు మంత్రాలయితే స్పష్టంగా ఉచ్ఛరిస్తా మాటలు శబ్దాలుకాదు స్వరాలుకాదు సందేశాలు  సమాచారాలు మాటలువిను వెనకాలకేళ్ళు మర్మాలను గ్రహించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల  వేదిక నాల్గవ సమావేశం నేడు 07-01-25వ తేదీ ఎ ఎస్ రావునగర్ హైదరాబాదులో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన నాల్గవ కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నాల్గవ సమావేశం. సభకు అధ్యక్షత వహించిన సినీటీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు వేదిక మంచి కార్యక్రమాలను  నిర్వహిస్తున్నందని కొనియాడారు. ముఖ్య అతిధి నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాస్ గారు మాట్లాడుతూ ఎడారులలోనూ భూమినుండి నీరు పొంగి పొర్లటం చూచామని, అట్లే కవుల మనసులలోని భావాలు మంచి కవితలుగా ప్రవహించాలని, అనుభూతులను కవితలలో వ్యక్తపరచి కవులు అభివృద్ధిలోకి రావాలని కోరారు. విశిష్ట అతిధి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు మాట్లాడుతూ స్తాపించిన కొద్దికాలంలోనే కాప్రా మల్కాజగిరి కవుల వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు, కవులకు మంచి ప్రోత్సాహిమిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.  ప్రముఖకవి నూతక్కి రాఘవేంద్రరావు గారు, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్తర్ రాధాకుసుమ గారు, అక్షర కౌముది సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు గారు, నంది అవార్డు గ్రహీత సినీ నిర్మాత దర్శక...
Image
 కవితాజననాలు తట్టిందే తడవుగా కాగితాలకెక్కిస్తే కవితలవుతాయి నెలతక్కువ శిశువులు ఆలోచనలు పారించి మెరుగుపరచివ్రాస్తే కవితలవుతాయి ఆరోగ్యవంతమయిన బిడ్డలు నాలుగుసార్లు పరిశీలించి దోషాలుతొలిగించి నాణ్యంగావ్రాస్తే కవితలవుతాయి ముచ్చటయిన ముద్దులపాపాయిలు చక్కగా కూర్చి శ్రావ్యంగాపాడితే కవితలవుతాయి నిద్రపుచ్చే పిల్లలజోలపాటలు సందర్భాన్నిపట్టి సమయోచితంగావ్రాస్తే కవితలవుతాయి చిన్నారుల జన్మదినవేడుకలు తెల్లవారి వెలుగులో ఉషోదయకాలానవ్రాస్తే కవితలవుతాయి నవ్వులుచిందుతున్న బాలలబుగ్గలు పున్నమి రోజున వెన్నెలలో విహరిస్తూవ్రాస్తే కవితలవుతాయి చంటిపాపల చంద్రవదనాలు మొగ్గతొడిగి విప్పారినపుడు పరిమళాలుపీలుస్తూవ్రాస్తే కవితలవుతాయి ఆడుకుంటున్న అందాలబుడతలు ముత్యాల్లంటి అక్షరాలతో పగడాల్లాంటి పదాలతోపేరిస్తే  కవితలవుతాయి నవరత్నాల్లాంటి నవజాతపసికూనలు అనుకున్నట్లులేదని ఆపివేస్తే అనుకూలించలేదని అణచివేసుకుంటే కవితలవుతాయి భ్రూణహత్యలు గర్భస్రావాలు కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే పిల్లలుపుడతారన్నట్లు అదృష్టము వరించితే ఆవిష్కృతమవుతాయి అద్బుతకైతలు  గుండపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా అలవాటు అందం అగుపించితే అక్షరాలలో పెట్టాలనిపిస్తుంది ప్రకృతి పరవశపరిస్తే పదాలలో పొసగాలనిపిస్తుంది పువ్వులు పరిమళాలుచల్లుతుంటే పుటలపైన పొందుపరచాలనిపిస్తుంది పెదాలు తీపినిచవిచూపిస్తుంటే తెలుగుతల్లిని స్తుతించాలనిపిస్తుంది మంచిమాటలు మురిపిస్తే కాగితంపై కవితనుకూర్చాలనిపిస్తుంది పున్నమిజాబిలి పలుకరిస్తుంటే ప్రణయగీతంవ్రాసి పాడాలనిపిస్తుంది ప్రశంసలవర్షం తడుపుతుంటే ఆనందగీతం ఆలపించాలనిపిస్తుంది కన్నీటిగాధలు వింటుంటే విషాదకైతలు విరచించాలనిపిస్తుంది బీదలపాట్లు కంటుంటే సాయంచేయాలని సామ్యవాదంరాతలలోచాటాలనిపిస్తుంది మహానుభావులు తలపుకొస్తే గళమెత్తి కీర్తించాలనిపిస్తుంది దురలవాటేమో మనసాగటంలేదు కలమాగటంలేదు కవితలాగటంలేదు ఏమిచేయను ఎట్లాగుందును ఎవరితోచెప్పను ఎలానడుచుకొందును? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 పయనించు.... మేఘం చినుకులుచల్లినా పిడుగులువిసిరినా మందుకుపయనించు కాలం కాటేసినా కలసిరాకపోయినా కదులుముందుకు దీపం కొడగట్టినా దారిచూపకపోయినా దేవులాడుకుంటూనడువు స్నేహం మురిపించకున్నా వేదనకుగురిచెసినా మున్ముందుకునడువు పాదాలు పరుగెత్తకమొండికేసినా అడుగులేయకున్నా ప్రాకుకుంటూనడువు మార్గం కనిపించకపోయినా ముళ్ళుపరచుకొనియున్నా తీసేస్తూముందుకునడువు కాయం గాయపడినా రక్తంకారుతున్నా ముందుకునడువు కళ్ళు మూసుకుపోయినా కటికచీకటయినా కదులుముందుకు మనసు మొండికేసినా మూలుగుతున్నా మందుకువెళ్ళు గమ్యం కష్టమయినా బహుదూరమయినా ముందుకడుగులెయ్యి ప్రాణం ఉన్నంతవరకూ ఆశయంసాధించేవరకూ ముందరకెళ్తుండు జీవితగమనం సాగించు జన్మసాఫల్యం సాధించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం