Posts

Showing posts from December, 2022
Image
 కొత్తసాలుకు స్వాగతం కొత్త వత్సరమొచ్చె కొత్త ఉత్సహమొచ్చె కొత్త ఊహలొచ్చె కొత్త కోర్కెలుపుట్టె కొత్త కలమునుకొంటి కొత్త పొత్తమునుతెస్తి కొత్త పలుకులనువ్రాస్తి కొత్త కవితలనల్లితి కొత్తదుస్తులు తొడిగితి కొత్తరూపము దాల్చితి కొత్తఫోజును పెట్టితి కొత్తదనమును చూపితి కొత్తసమూహాలలో చేరితి కొత్తపరిచయాలు చేసుకుంటి కొత్తవిషయాలు నేర్చుకుంటి కొత్తతరహాగా వ్రాయదలచితి రెండువేలా ఇరవైరెండుకు టాటాయని  నొక్కిచెప్పెద రెండువేలా ఇరవైమూడుకు రారాయని స్వాగతించెద పాతవత్సరానికి  వీడుకోలు  పాఠకులందరికి శుభాకాంక్షలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిహృదయం అందం  కనబడితే కనులారా ఆస్వాదిస్తా అమృతం చిక్కితే చకచకా త్రాగేస్తా అవకాశం వస్తే వదలకుండా వాడుకుంటా అభిమానం కురిపిస్తే తడుస్తా ముద్దవుతా ఆశయం సిద్ధిస్తే ఎగురుతా గంతులేస్తా ఆతిధ్యం ఇస్తే పుచ్చుకుంటా ప్రతిఫలమిస్తా అన్యాయం చేస్తే ప్రశ్నిస్తా ఎదిరిస్తా అందలం దొరికితే అధిరోహిస్తా అసీనుడనవుతా ఆలశ్యం అయితే తొందరజేస్తా చింతిస్తా అలక్ష్యం చేస్తే నొచ్చుకుంటా మౌనంవహిస్తా ఆహ్వానం పలికితే మన్నిస్తా పాల్గొంటా ఆకాశం పిలిస్తే పక్షిలా ఎగురుతా మేఘాలలో విహరిస్తా ఆసనం అర్పిస్తే కూర్చుంటా కుదుటపడుతా అవమానం జరిగితే తప్పుకుంటా తలదించుకుంటా అనుభవం వస్తే అందరితో పంచుకుంటా అదృష్టం వరిస్తే పరమాత్మునికి కృతఙ్ఞతలు చెబుతా ఆనందం కలిగితే అందరితో పంచుకుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవన కహానీలు మట్టిబుర్రకు మంచి ఆలోచనలు తట్టలేదు ముట్టలేదు కళ్ళకు కవితా విషయాలు కనబడలేదు కనికరించలేదు కలమునుండి క్షర రహితములు కారలేదు పేరలేదు ప్రకృతి పొంకాలను చూపలేదు మోపలేదు పుటలపై పదాలు కూర్చోలేదు కూడలేదు చేతిలోకి కలము రాలేదు రాయమనలేదు కవిత కలలోకొచ్చి కవ్వించలేదు కరుణించలేదు పాఠకులను కైతలు చేరలేదు చదివించలేదు బుద్ధి బడుద్దాయి అయ్యి సాగలేదు శ్రమించలేదు రోజూవచ్చే రచనా వస్తువులు  అగపడలేదు అమరలేదు కవిగారి కవనా వ్యాసంగం కదలలేదు మెదలలేదు కవిగారు కవితాభిమానుల కుతితీర్చలేదు ఖ్యాతిపొందలేదు కవిగారి కవనదాహము తెమలలేదు తీరలేదు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అక్షరజ్యోతులు వెలిగించవోయ్ అక్షరదీపాలు ప్రసరించవోయ్ కాంతికిరణాలు అల్లవోయ్ అక్షరకుసుమాలను వెయ్యవోయ్ తెలుగుతల్లిమెడకు చల్లవోయ్ అక్షరసౌరభాలను మురిపించవోయ్ మనుజులమనసులను  తొలగించవోయ్ అఙ్ఞానచీకట్లు కదిలించవోయ్ తెలుగుయువతను చిందించవోయ్ తెలుగుతేనెలను అందించవోయ్ తెలుగుసుధలను తలపించవోయ్ కోకిలకంఠమును వినిపించవోయ్ రాగాలసరాగాలను మురిపించవోయ్ తెలుగుపాఠకులను తరించవోయ్ తెలుగుసాహిత్యప్రియులను కదిలించవోయ్ కలమును చదివించవోయ్ కమ్మనికైతలను గర్వించవోయ్ తెలుగువాడైనందుకు వ్యాపించవోయ్ తెలుగుభాషను తట్టవోయ్ తెలుగుమదులను తెలపవోయ్ తెలుగుఘనతను జైకొట్టవోయ్ తెలుగుకు మ్రోగించవోయ్ తెలుగుజేగంటను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అక్షరాలు-మాటలు అక్షరాలు  అలరారుతున్నాయి మాటలు  మోతమ్రోగుతున్నాయి అక్షరాలు అల్లుకుంటున్నాయి మాటలు మాధుర్యాన్నిచల్లుతున్నాయి అక్షరాలు అలరుతున్నాయి మాటలు మత్తెక్కిస్తున్నాయి అక్షరాలు అలుముకుంటున్నాయి మాటలు ముసురుకుంటున్నాయి అక్షరాలు ప్రత్యక్షమవుతున్నాయి మాటలు మదినిమీటుతున్నాయి అక్షరాలు అరుస్తున్నాయి మాటలు మురిపిస్తున్నాయి అక్షరాలు నేర్వమంటున్నాయి మాటలు ఎరుగమంటున్నాయి అక్షరాలు పలుకమంటున్నాయి మాటలు పేల్చమంటున్నాయి అక్షరాలు కూడుతున్నాయి మాటలు ధ్వనిస్తున్నాయి అక్షరాలు ఆడుతున్నాయి మాటలు పాడుతున్నాయి అక్షరాలు అనుప్రాసలవుతున్నాయి మాటలు అంత్యప్రాసలవుతున్నాయి అక్షరాలు ఆహ్లాదపరుస్తున్నాయి మాటలు ముచ్చటపరుస్తున్నాయి అక్షరాలు అందంగా వ్రాయమంటున్నాయి మాటలు చక్కగా పలకమంటున్నాయి అక్షరాలు చేతిని వ్రాయమంటున్నాయి మాటలు మూతిని ఉచ్ఛరించమంటున్నాయి అక్షరాలు నశించవు మాటలు మరణించవు అక్షరాలు అమరం మాటలు మధురం అక్షరాలు కళ్ళకెక్కుతాయి మాటలు మదులకెక్కుతాయి అక్షరాలకు వరుసయున్నది మాటలకు సొగసుయున్నది అక్షరాలకు శక్తియున్నది మాటలకు యుక్తియున్నది అక్షరాలు భుక్తినిస్తాయి మాటలు ముక్తినిస్తాయి అక్షరాలు అద్భుతం మా...
Image
 అదిగో అప్సరస! దివినుండి దిగివచ్చిన అప్సరస అదిగో! కళ్ళముందుకు వచ్చింది కళ్ళను కట్టిపడవేసింది తల తిప్పలేకున్నాను దృష్టి మరల్చలేకున్నాను పిచ్చి పట్టినట్లుంది వలలో చిక్కినట్లుంది సొగసు లాగుతుంది మనసు పీకుతుంది రంగు నచ్చింది హంగు అదిరింది ఫోజుబాగుంది పువ్వులాగుంది నవ్వుతుంది నవ్విస్తుంది చేతులు కట్టుకున్నది కాళ్ళు ముడుచుకున్నది సోఫాలో కూర్చుంది తిన్నగా చూస్తుంది వలవిసురుతుంది విలవిలలాడిస్తుంది గులాబి చీరలోనున్నది గుబులు పుట్టిస్తుంది గుండెలో గుచ్చింది గాయం చేసింది రెచ్చకొట్టుతుంది ముట్టుకోమంటుంది చెంతకు చేరాలనిపిస్తుంది సరసాలాడాలనిపిస్తుంది అందాలను ఆస్వాదించాలనిపిస్తుంది ఆనందమును అంతరంగంలోనిలుపుకోవాలనిపిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఉన్నాడు ఒకడున్నాడు ఉన్నాడు ఒకడున్నాడు ఆంధ్రుడు ఆత్మీయుడు అమరుడు ఉన్నాడు అచటున్నాడు తెలివైనవాడు తెలియజెప్పేవాడు తెలుగుదేశమువాడు ఉన్నాడు చూస్తున్నాడు ఘనుడు విఙ్ఞుడు తేజుడు ఉన్నాడు కవి ఒకడున్నాడు కవితలు వ్రాస్తాడు కమ్మదనాల నిస్తాడు ఉన్నాడు  కలము పట్టేవాడు కాగితాలపైగీసేవాడు కవనం చేసేవాడు ఉన్నాడు అక్షరాలు అల్లేవాడు పదాలు పేర్చేవాడు భావాలు బయటపెట్టేవాడు ఉన్నాడు మనసున్నవాడు మదులుదోచేవాడు మురిపించేవాడు ఉన్నాడు కనిపించనివాడు వినిపించేవాడు రవినితలపించేవాడు ఉన్నాడు ఆలోచించేవాడు అందాలుచూపేవాడు ఆనందమిచ్చేవాడు ఉన్నాడు మంచితనం కలవాడు మానవత్వం ఉన్నవాడు మనుజులను ప్రేమించువాడు ఉన్నాడు ఊహలలో తేలేవాడు ఊయలలో ఊపేవాడు ఉత్సాహం నింపేవాడు ఉన్నాడు మాటలు ఉరిమేవాడు మదులు మెరిపించేవాడు కవితాజల్లులు కురిపించేవాడు స్వాగతం సుస్వాగతం సుకవికి స్వాగతం సన్మార్గునికి స్వాగతం సుకవితలకు స్వాగతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం (ఆంధ్రుడు అంటే తెలుగువాడుగా అర్ధంచేసుకోవాలని మనవి తెలుగుదేశమువాడు అంటే తెలుగు ప్రాంతీయుడుగా అర్ధంచేసుకోవాలని మనవి)
Image
 మనసా! ఓ మనసా! మనసా! ఓ మనసా! తృప్తిపడవు ఎందుకే మనసా! కన్నీటితో నిన్ను కడగనా  నిప్పుతో నిన్ను నిమరనా  పదవులొచ్చినా ప్రశంసలొచ్చినా ప్రఖ్యాతివచ్చినా తృప్తిపడవు ఎందుకే మనసా నీ మర్మమేమిటో నీ కర్మమేమిటో నీ ధర్మమేమిటో తృప్తిపడవు ఎందుకే మనసా ఆస్తులు కూడినా అంతస్తులు పెరిగినా ఆప్తులు చేరినా తృప్తిపడవు ఎందుకే మనసా భార్య వచ్చినా బిడ్డలు కలిగినా బంధువులు మూగినా తృప్తిపడవు ఎందుకే మనసా గడ్డముపట్టి నిన్ను బ్రతిమలాడనా మనసా బెత్తముపట్టి నిన్ను బెదిరించనా మనసా కర్రతో కొట్టినా ఘాటుగా తిట్టినా చుట్టచుట్టి కట్టకట్టినా తృప్తిపడవు ఎందుకే మనసా అందాలు చూచినా ఆనందము పొందినా అవసరాలు తీరినా తృప్తిపడవు ఎందుకే మనసా కడుపు నిండినా కోరిక తీరినా కష్టాలు తొలిగినా తృప్తిపడవు ఎందుకే మనసా మనుమడు ముద్దిచ్చినా మనుమరాలు మురిపించినా మిత్రులు మెచ్చినా తృప్తిపడవు ఎందుకే మనసా కవితలు కమ్మగా వ్రాసినా కితాబులు కోకొల్లలుగా వచ్చినా కవులను కట్టిపడవేసినా తృప్తిపడవు ఎందుకే మనసా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చూపులు కలసిన శుభవేళ చెలీ! నిన్ను చూచా మనసుపడ్డా మనుమాడా మన చూపులు కలసినపుడు చక్కదానాలు ఆస్వాదించాము చిరునవ్వులు పంచుకున్నాము మన కళ్ళు కలసినపుడు కళాకాంతులతో వెలిగిపోయాము కుతూహలపడ్డాము మన మాటలు కలసినపుడు మనము దగ్గరయ్యాము మురిసిపొయ్యాము మన చేతులు కలసినపుడు చేరువయ్యాము స్నేహితులమయ్యాము మన  మోములు కలసినపుడు ముద్దూముచ్చటలాడాము మహదానందంపొందాము మన  కోరికలు కలసినపుడు కళ్యణమాడదామనుకున్నాము కలసి పయనించాలనుకున్నాము మన పెదవులు కలసినపుడు అమృతాన్ని సేవించాము అమరప్రేమికులమయ్యాము మన మనసులు కలసినపుడు ముహూర్తం పెట్టించాము మనుమాడాము మన శరీరాలు కలసినపుడు స్వర్గానికెళ్ళివచ్చాము సుఖాలలొతేలియాడాము సతీ! సంసారాన్ని ఈదుదాం సంతానాన్ని పొందుదాం సిరిసంపదలను కూడగడదాము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ కథానాయిక కథ పువ్వుపరిమళాన్ని బట్టలపై తైలమునయినా చంద్రముఖిని ఇంటిలో గుడ్డిదీపాన్నయినా కోకిల కంఠాన్ని కాకి గోలనైనా కేకి సోయగాన్ని కాకరూక వికారినైనా స్వేచ్ఛా విహంగాన్ని పంజరంలో చిలుకనైనా ఇంటికి మహాలక్ష్మిని నాలుగుగోడలమధ్య బందీనైనా మూతిని మూసుకొని మూగదాన్నయినా కళ్ళు కప్పుకొని కబోదినయినా కథలో నాయకిని కష్టాలకు ప్రతీకనైనా కోరికలను వెల్లడించలేని దీన మౌనవ్రతినైనా కన్నీటిని రాల్చకున్నా కోపాన్ని అణచుకున్నా కష్టాలను ఓర్చుకుంటున్నా కుటుంబానికి బానిసనైనా అందాలను కొంగుచాటున  దాచుకుంటున్నా ఆనందాలకు దూరముగ బ్రతుకుతున్నా వాడిన పువ్వులా రాలిన పత్రములా జీవచ్ఛవంలా కాలం వెళ్ళబుచ్చుతున్నా కరుగుతున్న కొవ్వొత్తినైనా గాలికికొట్టుకుంటున్న దీపాన్నయినా ఖాళీ కడుపునైనా శక్తిహీనురాలునైనా శిల్పిచెక్కిన విగ్రాహాన్నయినా చిత్రకారుడు గీసినబొమ్మనైనా సినిమాలో విషాదనాయికనైనా సుకవివ్రాసిన కమ్మనికవితనైనా భర్తకు వినోదవస్తువునైనా ఇంటికి పనిమనిషినైనా పిల్లలుకనే యంత్రాన్నయినా జైలులోపెట్టిన జీవితఖైదీనైనా కలలు కల్లలయ్యాయి నమ్మకం సడలిపోయింది విశ్వాసం వీగిపోయింది విలువలు కుప్పకూలాయి బేలతనం బోసిపొయ్యింది చిరునవ్వులు చెదరిపో...
Image
 ప్రశ్నిస్తా! కవిని అక్షరాలతో ప్రశ్నిస్తా సమాజాన్ని చైతన్యపరుస్తా మదులనుతట్టి దోచుకుంటా! మనిషిని పెదవులతో ప్రశ్నిస్తా ఆలోచనలను రేకొడతా మానవత్వం చూపమంటా! ఙ్ఞానిని మాటలతో ప్రశ్నిస్తా మనసులకు పనిపెడతా దీర్ఘాలోచనలలోకి దింపుతా! ప్రేమికుడిని కళ్ళతో ప్రశ్నిస్తా మనసును తెలుపుతా మమకారాన్ని పంచుతా! ఆలోచనాపరుడిని మౌనంతో ప్రశ్నిస్తా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా అందరిని దారికితీసుకొస్తా! తెలిసినవాడిని నవ్వుతో ప్రశ్నిస్తా సమస్యలు సృష్టించొద్దంటా సరళపరిష్కారాలు సూచిస్తా! విప్లవకారుడిని పిడికిలెత్తి ప్రశ్నిస్తా త్యాగానికి సిద్ధపడతా అన్యాయాలపై పోరాడతా! గాయకుడను పాటలతో ప్రశ్నిస్తా ప్రజలను సంఘటితంచేస్తా ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటా! సంస్కర్తను మూఢాచారాలను ప్రశ్నిస్తా సమాజశ్రేయస్సును కోరతా మార్పుకోసం ప్రయత్నిస్తా! సత్యాగ్రహిని దీక్షచేసి ప్రశ్నిస్తా నలుగురిని కూడగడతా సమస్యలకు పరిష్కారాలుచూపుతా! నోరున్నవాడిని గళమెత్తి ప్రశ్నిస్తా బహిరంగంగా భాసించుతా చెప్పినట్లు నడుచుకోమంటా! చదివినవాడిని పరీక్షపెట్టి ప్రశ్నిస్తా సమాధానాలు తెలుపమంటా తెలివిని లెక్కిస్తా! నేతను ఓటర్లను ప్రశ్నిస్తా సరైననిర్ణయం తీసుకోమంటా ప్రలో...
Image
 చిలుకలపలుకులు ఓహో పచ్చనిచిలకమ్మా ఓ కులుకులకొలికమ్మా వయ్యారాలు పోకమ్మా వగలును చూపకమ్మా నీ అందంచూచి నీ చందంకాంచి నీ వర్ణంమెచ్చి నిను ప్రేమిస్తారు వలవేస్తారు పట్టేస్తారు కట్టేస్తారు పంజరంలో పెట్టేస్తారు నీ స్వేచ్ఛను హరిస్తారు నీ రెక్కలు విరిసేస్తారు పంచదారను పెడతారు పలుకులను నేర్పుతారు జాతకాలు తియ్యమంటారు జోస్యమును చెప్పమంటారు కాసులు గడిస్తారు కడుపులు నింపుకుంటారు చక్కదనానాలు నీ సొత్తమ్మా తీపిపలుకులు నీ వరమమ్మా చిన్నారులను సంతసపెడతావు పెద్దవాళ్ళను పరవశపరుస్తావు మాటలతో మురిపిస్తావు కేరింతలతో కట్టిపడేస్తావు చిట్టి చిలకమ్మ త్వరగా రావమ్మా తోటకు వెళ్దామమ్మా పండ్లను తిందామమ్మా చిన్నారులచెంతకు చేరదామమ్మా చిరునవ్వులను చిందిద్దామమా చిలుకా గోరింకా కులికే పకాపకా పలుకే చకాచకా ఎగురే గబాగబా నీ పచ్చనిరంగు ఎర్రని ముక్కు నెమ్మది నడక చూడ చక్కన నీ పలుకులు విచిత్రం మధురం ఆసక్తికరం శుకబ్రహ్మవై వ్యాసునివద్ద పెరిగావు వేదాలను వల్లించావు విఙ్ఞానాన్ని పంచావు ప్రవచనాలను చెప్పావు పరీక్షితురాజుకి మోక్షమిప్పించావు చిట్టి చిలకమ్మా తోటకెళ్ళమ్మా పండునుతేవమ్మా పాపాయికివ్వమ్మా చిలుకలపలుకులు చాలాచెప్పితి చిన్నారులకు చల...
Image
 ప్రకృతీపురుషుల కళ్యాణం నీలిరంగును నింగికిపూస్తా కళ్ళకు కమ్మదనమిస్తా నిండుచంద్రుని నభోవీధిలోనుంచుతా మనసులను మురిపిస్తా తెల్లనివెన్నెలను విరజిమ్ముతా చల్లనిగాలిని వ్యాపింపజేస్తా పలురంగుల  పూలనుపూయిస్తా పొంకాలుచూపి పులకరింపజేస్తా పచ్చదనంతో పుడమినికప్పుతా పరికించువారికి పరమానందమిస్తా తూనీగల నెగిరిస్తా సీతాకోకచిలుకల తిప్పుతా ప్రభాతసూర్యుని ఉదయింపజేస్తా అరుణకిరణాలను ప్రసరింపజేస్తా వన్నెచిన్నెలను విసురుతా వయ్యారాలను ఒలకబోస్తా అందాలను చూపిస్తా ఆనందాన్ని కలిగిస్తా కళ్ళను ఆకట్టుకుంటా మదులను దోచుకుంటా పురుషుడవు నీవైతే ప్రకృతిని నేనవుతా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చప్పట్లు ముచ్చట్లు చప్పట్లు  కొట్టాలనిపిస్తుంది ముచ్చట్లు  చెప్పాలనిపిస్తుంది కళ్ళుతెరచి చూడాలనిపిస్తుంది ఓళ్ళుమరచి మురువాలనిపిస్తుంది చెవులుతెరచి వినాలనిపిస్తుంది ఆనందములోమునిగి తేలాలనిపిస్తుంది మనసువిప్పి మాట్లాడాలనిపిస్తుంది మదులుతట్టి మురిపించాలనిపిస్తుంది కాళ్ళను  కదిలించాలనిపిస్తుంది పూలను తోటలోచూడాలనిపిస్తుంది చేతులను కలపాలనిపిస్తుంది స్నేహాలను పెంచుకోవాలనిపిస్తుంది కవితలువ్రాసి పఠించాలనిపిస్తుంది శ్రోతలమెప్పించి పొంగిపోవాలనిపిస్తుంది పదాలు ప్రయోగించాలనిపిస్తుంది ప్రాసలు పొసగాలనిపిస్తుంది అర్ధాలు వెల్లడించాలనిపిస్తుంది భావాలు బయటపెట్టాలనిపిస్తుంది కవనం చేయాలనిపిస్తుంది కుతూహలం కలిగించాలనిపిస్తుంది కవిత్వాన్ని పండించలానిపిస్తుంది సాహిత్యాన్ని సుసంపన్నంచేయాలనిపిస్తుంది చేతులు కలుపుతారా వెన్నును తడతారా ప్రేరణం కలిగిస్తారా సాయం చేస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగుజ్యోతులు ప్రసరిస్తా నేను  తెలుగుబిడ్డను  మాతృబాషను తలకెత్తుకుంటా నేను  వెలుగుగడ్డను తెలుగుదేశాన్ని మెరిపిస్తా నేను  తేనెచుక్కను తెలుగుపలుకులకు తీపినద్దుతా నేను  తెలుగుకవిని కమ్మనికవితలను కూరుస్తా నేను  చక్కని కవిచంద్రుడను తల్లిభాషపై చల్లనివెన్నెలకురిపిస్తా నేను శ్రావ్యమైన తెలుగుపాటను గాంధర్వగానం వినిపిస్తా నేను కుంచెపట్టిన చిత్రకారుడను తెలుగుతల్లిని అందంగాతీర్చిదిద్దుతా నేను కోకిల కంఠమును తెలుగుశ్రావ్యతను తెలుపుతా నేను నెమలి నాట్యమును పురివిప్పి తెలుగుసొగసునుచూపిస్తా నేను పాలబుగ్గల పసివాడను అమ్మబాషను ముద్దుముద్దుగా పలుకుతా నేను కనిపించకుండా వినిపిస్తా చక్కగా చదివిస్తా నేను తెలుగువీరుల పౌరుషమును బొబ్బిలి పలనాటికథలు చెబుతా నేను తెలుగుకవుల ప్రతీకను తెలుగోళ్ళ ఘనచరిత్ర చాటుతా నేను తెలుగుతల్లి ముద్దుబిడ్డను తలయెత్తుకొని తిరుగుతా నేను కాంతులుచిమ్మే తెలుగుజ్యోతిని దశదిశలా వ్యాపిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పిల్లలం బడిపిల్లలం అందంగా తయారవుతాం అదరాబదరా బడికెళ్తాం అక్షరాలను నేర్చుకుంటాం అమ్మాఆవులు వ్రాసుకుంటాం అయ్యవార్లను గౌరవిస్తాం అచ్చతెలుగులో మాట్లాడుతాం అక్కచెల్లెల్లతో ఆడుకుంటాం అన్నాదమ్ముల్లతో కలసిపోతాం అమ్మానాన్నల అలరిస్తాం అల్లరిపనులను మానేస్తాం అభిమానాలు చూపుతాం అనురాగాలు పంచుతాం అపహాసాలు చేయం అవహేళనలు ఎరుగం అబద్ధాలను చెప్పం అన్యాయాలకు ఒడికట్టం అన్నీ తెలుసుకుంటాం అందరితో బాగుంటాం అన్నెంపున్నెం ఎరగనివాళ్ళం అమాయకులం బడిపిల్లలం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవుల కలాలు గళాలు కవులను  అక్షరసేద్యంచేయమందాం కవితాపంటలను పండించమందాం కవికి ఆవేశం వస్తే ఆవేదన కలిగితే అంతరంగం తపిస్తుంది అద్భుతకవిత ఆవిర్భవిస్తుంది కవికి ఊహలు పుడితే భావం తడితే మది పొంగుతుంది కవిత కాగితాలకెక్కుతుంది కవికి అందం కళ్ళబడితే ఆనందం వెల్లివిరిస్తే అనుభూతులు హృదయాన్నితడతాయి అక్షరాలు పుటలపైకూర్చుంటాయి కవిగారి మాటలు తేనెఝల్లులు చల్లుతుంటే నవ్వులు నవరత్నాలు కురిపిస్తుంటే వ్రాతలు వండి వడ్డిస్తాయి కవితలు కమ్మగా పురుడుబోసుకుంటాయి కవిని తెలుగుతల్లి కరుణిస్తే కవులు మదిలోమెదిలితే వాణీదేవి సంకల్పమిస్తుంది చక్కని కైతలు వెలుగుచూస్తాయి కవికి పూలు కనువిందుచేస్తుంటే పరిమళాలు పరవశపరుస్తుంటే ప్రకృతి పసందుచేస్తుంది పలుకయితలు పుట్టకొస్తాయి కవులు  కలలుకంటుంటే కవిత కవ్విస్తుంటే కలం చెక్కేస్తుంది  కవనం కొనసాగుతుంటుంది అక్షరాలు వెంటబడితే పదాలు ప్రవిహిస్తుంటే విషయాలు వెన్ను తడుతుతాయి కవిగారిచేతినుండి కయితలుజారువాలుతయి కవులను వండమందాం కవితలను వడ్డించమందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 దేహశుద్ధి మనోసుద్ది తోమితే పళ్ళకుపట్టిన పాసిపోతుందిగానీ మదికంటుకున్న మసితొలుగుతుందా! కడిగితే ముఖముమురికి శుభ్రపడుతుందిగాని మనముమకిలి పరిశుద్ధమవుతుందా! చీదితే చీమిడి పోతుందిగాని చిత్తవికారం తొలగిపోతుందా! ఊదితే దుమ్ము లేచిపోతుందిగాని మనస్సుకంటుకున్న ధూళిపోతుందా! స్నానంచేస్తే శరీరం సాపవుతుందిగాని మనస్సు స్వచ్ఛమౌతుందా! మెదడును తెలివితో నిర్మలంచేద్దాం మనసును సత్యముతో శుభ్రపరుద్దాం మదిని మంచితో మేటినిచేద్దాం జీవితాన్ని సుకర్మలతో విమలంచేద్దాం బుద్ధిని ఙ్ఞానముతో శుద్ధిచేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మాయలోకం జననమే మాయ జీవితమే మాయ జగతియే మాయ మాయలోకం బంధాలలో ఇరికిస్తుంది బ్రతుకంతా ఈదిస్తుంది మాయలోకం సుఖాలను చూపిస్తుంది దుఃఖాల పాలుజేస్తుంది మాయలోకం ఆశలు కలిగిస్తుంది అగచాట్లు పెడుతుంది మాయలోకం చిక్కితే పట్టుకుంటుంది చిరకాలం పీడిస్తుంది మాయలోకం సంసారంలో దించుతుంది సాగరంలో ముంచుతుంది మాయలోకం భ్రమలు కల్పిస్తుంది భ్రాంతిలో పడవేస్తుంది మాయలోకం ఆకాశానికి ఎగరమంటుంది అధోలోకంలో పడవేస్తుంది మాయలోకం మనసుల బంధిస్తుంది మేనుల బాధిస్తుంది మాయలోకం ఏమిస్తావంటుంది ఏమికావాలనడగకుంటది మాయలోకం మాటలను వక్రీకరిస్తుంది అపార్ధాలను అంటకడుతుంది మాయలోకం అందంగావుంటే అసూయపడుతుంది ఆనందంగావుంటే ఆటపట్టిస్తుంది మాయలోకం గెలిస్తే అభినందించకుంటుంది పొగడటానికి నోరుతెరవకుంటుంది మాయలోకం బంధాలలో చిక్కించుకుంటుంది బయట పడనీయకుంటుంది మానవుడా జాగ్రత్త! ఆలోచించు అర్ధంచేసుకో మాయపాలిట పడకు మాయమాటలు నమ్మకు మాయలో కొట్టుకుపోకు దేహమే మాయ దాంపత్యమే మాయ దేవుడే మాయ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కాలం మారింది పాతకాలము పోయింది కొత్తకాలము వచ్చింది ఆంగ్లబాష అందరికివచ్చింది అచ్చతెలుగు అంతరించిపోయింది ట్రాక్టర్లు వచ్చాయి ఎద్దులు పోయాయి ఆటోరిక్షాలు అరుదెంచాయి జట్కాబండ్లు అంతమయ్యాయి గోధుమలువరిబియ్యాలు ఏతెంచాయి సజ్జలజొన్నల సాగుపోయీనాది పెళ్ళిపందిళ్ళలొ పెళ్ళిల్లుపోయాయి కళ్యాణమండపాలు కుప్పతెప్పలుగవచ్చాయి అమ్మలు పోతున్నారు మమ్మీలు వస్తున్నారు నాన్న మాట పోతుంది డాడ్డీ మాట వస్తుంది సమయము మూలపడుతుంది టైము వాడబడుతుంది జీమైలు వచ్చింది ఉత్తారాలు పోయాయి దూరవాణి దూరమయ్యింది చరవాణి చేరువయ్యింది పుస్తకాలు పోయేను బుక్కులు వచ్చేను కోవిడు ప్రబలింది మాస్కులు తెచ్చింది జనుముగోతాలు పోయాయి ప్లాస్టికుబ్యాగులు వచ్చాయి పద్యకవితలు తగ్గాయి వచనకవితలు పెరిగాయి కవులు తగ్గిపోయారు కవియిత్రులు పెరిగారు పేలాలు పోయాయి  చిప్సు వచ్చాయి పనులు పోయాయి యంత్రాలు వచ్చాయి బావులు పోయాయి ట్యాపులు వచ్చాయి మంచినీరుపదము పోయింది మినరలువాటరు ముందుకొచ్చింది సంచి సమసిపోయింది బ్యాగు భుజమెక్కింంది ఫలహారాలు పోయాయి పానీపూరీలు వచ్చాయి పడతులు  ఇంటిపనులు మానిరి ఉద్యోగాలలో చేరిరి చీరరవికలు వదిలిరి చొక్కాప్యాంటులు తొడిగిరి మహిళలు...
Image
 పట్టిందల్లా బంగారమే! పువ్వు  పుట్టగానే పరమళిస్తుంది చదువు సమాప్తమవగానే సదావకాశంచిక్కింది కళ్యాణం కాగానే కాసులొచ్చాయి కళత్రం కాపురానికి రాగానే కలిసొచ్చింది పుత్రుడు  పుట్టగానె పదొన్నతిలభించింది కూతురు కలిగినవెంటనే కలిమిచేకూరింది మనుమరాలు పుట్టింది మనసునుదోచింది మనుమడు పుట్టాడు వంశవృద్ధిజరిగింది నా కవిత నెగ్గింది నాకు పేరొచ్చింది నేను పట్టిందల్లా పసిడైపోయింది పరమాత్మునికి ప్రణామాలు ప్రార్ధనులు పూజలు పునస్కారాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితలు క్వణములు కవితాక్వణములు కవ్విస్తుంటే కర్ణాలకింపు కలుగుతువుంటే కలముకరానికి చేరుతుయుంటే కవనంసాగదా! కవితలుపుట్టవా! గుడిగంటలు గణగణమ్రోగుతుంటే గుడిలోపూజలు జరుగుతువుంటే గళమెత్తి దేవునిప్రార్ధించనా కలముపట్టి భక్తిపాటవ్రాయనా! బడిగంట పొద్దునేమోగుతుంటే బాల్యపురోజులు తలపునకొస్తే గతఙ్ఞాపకాలు వెంటపడితే  బాలగేయము వ్రాసిపాడనా! కోకిలగానము వినబడుతుంటే కంఠము సరిచేసుకోవాలనిపిస్తే కమ్మదనము ఆస్వాదించాలనిపిస్తే కాగితాలపై అక్షరాలనెక్కించనా! గాజులు గలాగలాలాడుతుంటే చక్కనిచేతులు కనబడుతుంటే అందాలను చూడాలనిపిస్తుంటే అద్భుతకవితను వెలువరించనా! తుమ్మెదలు ఝుమ్మంటుంటే చెవులు నిక్కపొడుచుకుంటే కళ్ళచూపులు పూలమీదపడితే కవితలు పుటలకెక్కించనా! గజ్జెలు ఘల్లుఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంటే మది మురిసిపోతుంటే కవితలవరద పారించనా! ఉరుములు పెళపెళమంటుంటే మెరుపులు మిలమిలమెరుస్తుంటే చినుకులు చిటపటపడుతుంటే కవితలు గబగబాకురిపించనా! గుండె లబ్ డబ్ మంటుంటే స్టెతస్కోపు చెవిలోధ్వనిస్తుంటే జీవనరాగము వినిపిస్తుంటే జీవితకవితను వ్రాయనా! శిశువులు ముద్దుగామాట్లాడుతుంటే చిలుకపలుకులు పలుకుతుంటే భుజాలపైకి ఎక్కించుకోవాలనిపిస్తుంటే బాలలకవ...
Image
 కవిగారి భావనలు కోడినై కూస్తా లేస్తావా కోకిలనై పాడుతా వింటావా రవినై ప్రభవిస్తా మేలుకుంటావా జాబిలినై పొడుస్తా పరికిస్తావా పూసగుచ్చినట్టు చెబుతా పరిగ్రహిస్తావా మాటలు మధురముగామారుస్తా మన్నిస్తావా రంగులద్ది చూపుతా చూస్తావా రమ్యంగా తయారుజేస్తా తిలకిస్తావా అక్షరసుమాల నల్లుతా అందుకుంటావా సుగంధాల చల్లుతా ఆఘ్రానిస్తావా పదాలను పేరుస్తా చదువుతావా పనసతొనలా చేరుస్తా చప్పరిస్తావా  తేనెపలుకులు చల్లుతా స్వీకరిస్తావా తీపి పలుకులకంటిస్తా చవిగొంటావా ఆలోచనలు పారిస్తా మదిస్తా శ్రమిస్తా భావాలు బయటపెడతా మదిలో నిలుపుకుంటావా సాహిత్యక్షీరాన్ని తెస్తా చిలుకుతా కవితావెన్నను తీస్తా ఆస్వాదిస్తావా మనసు పెడతా చక్కగా వ్రాస్తా కైతను కళ్ళముందుంచుతా చదివి సంతసిస్తావా అందాలను వర్ణిస్తా చూస్తావా ఆనందాన్ని పంచుతా అందుకుంటావా రాసేది కలంపట్టి కవిత్వమో చేసేది  కత్తిమీద సామో పడేది పూలపొగడ్తలో రాలేది రాళ్ళవిమర్శలో చూస్తా వేచిచూస్తా చదువుతా వ్యాఖ్యలుచదువుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పున్నమివెన్నెల చూద్దాం (బాలగేయం) చుక్కలగగనము చూద్దాము తళతళతారల చూద్దాము నక్షత్రాలు  లెక్కిద్దాము కాలక్షేపము చేద్దాము చందమామను చూద్దాము చక్కదనాలను చూద్దాము చల్లనివెన్నెల చూద్దాము చాలాసంబర పడదాము నీలాకాశము చూద్దాము నేత్రాలకు విందిద్దాము వెండిమబ్బులను చూద్దాము వెన్నెలలో విహరిద్దాము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మాటలమూటలు మాటలమూటలు కడతా మనుజులమనసులు తడతా మాట్లాడటము మనిషికి మాధవుడిచ్చినవరము మౌనమువహించటము మానసిక నిర్వేదప్రకటనము అర్ధముకాకుండా చెప్పటము అవివేకము అర్ధరహితముగా చెప్పటము అఙ్ఞానము చతుర్లాడటము చలాకీ కలిగించటము హాస్యభాషణము ఆనందము పంచటము సమాచార మార్పిడి మానవనైజము నవ్వుకు ప్రతినవ్వు సంభాషణకు ప్రారంభము ముఖాలు చూచుకోవటం పరిచయానికి పునాది కళ్ళ కలయిక మొదటి పలకరింపు మాటకు స్పందన సంస్కారం ప్రశ్నకు సమాధానం సంభాషణ కొనసాగించటము ప్రేమను పంచుకోవటం మనుజుల ప్రకృతిస్వభావము ఆనందము పొందటము అందరి ఆశయము మనసును తృప్తిపరచటము సహజసిద్ధము స్నేహము చేయటము పరస్పర మేలుచేసుకోవటము చేదోడు వాదోడు జీవితంలో కీలకము సంఘ జీవనము అందరికీ అవసరము సమాలోచనము ఆలోచనలు పంచుకోవటము కబుర్లాడటము కాలక్షేపనచేయటము సరసాలాడటడటము సంతోషము పొందటము ఎదురుచెప్పటము నిరశించటము సంభాషించటము భావవ్యక్తీకరణము ఉత్తరప్రత్యుత్తరాలు పరోక్షపలకరింపులు చరవాణి సంభాషణలు సత్వర సంప్రదింపులు అంతర్జాల సందేశాలు సాంకేతిక సౌలభ్యాలు మంచిచెప్పినా పట్టించుకోకపోవటం అలసత్వము చెప్పింది వినితీరాలనటము నిరంకుశత్వము చెప్పకనే చెప్పటము మహానుభావుల విలక్షణము చెప్పిందే పదేపదేచెప్పట...
Image
 ఓ నవకవీ! మాధుర్యంలేని మాటలొద్దు రుచిపచిలేని వంటలొద్దు కూనిరాగాలు తీసి గొప్పగాయకుడనని గర్వించకు వెర్రిగంతులు వేసి నవనాట్యమని నమ్మించకు చెత్తపాటను వ్రాసి కొత్తపాటని చెప్పకు చిట్టికధను వ్రాసి వచనకవితని వాదించకు పిచ్చికవితను వ్రాసి భావకవితని బుకాయించకు ప్రాసలొదిలి యాసలొదిలి తోచిందిరాసి తైతక్కలాడకు శాలువాను కప్పించుకొని మహాసత్కారమని డబ్బాకొట్టకు బిరుదులుకొని ఇప్పించుకొని చంకలుకొట్టి ఎచ్చులకుపోకు అక్షరాలను చల్లి అద్భుతకవితని ఎగిరిపడకు పదాలను పేర్చి పెద్దకవినని భ్రమించకు సుభాషితాలు చెప్పు సత్కార్యాలను చేయించు భావగర్భితం చెయ్యి మనసులను వెలిగించు అందాలను చూపించు ఆనందాన్ని అందించు మదులను తట్టు మరిపించి మురిపించు దారితప్పిన వారిని సన్మార్గాన నడిపించు మారుతున్న కాలానికి మార్పులను సూచించు ప్రతికవిత చివర ఉద్దేశం తెలుపు కవిహృదయం ఎరిగించు పాఠకులను కదిలించు సందేశములేని  రాతలొద్దు కల్లబొల్లి కబుర్లొద్దు గగనానికి గురిపెట్టు గమ్యాన్ని చేరుకొను గుర్తింపును పొందు గర్వపోతువు కాకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 శాంతమ్మా రావమ్మా! జరుగుతుంది ఉక్రెయినులోయుద్ధం కలిగిస్తుంది  ఆస్తిప్రాణనష్టం   మరణిస్తున్నారు సైనికులు చచ్చిపోతున్నారు పౌరులు  బాంబులు  ప్రేలుతున్నాయి భవనాలు  కూలుతున్నాయి బంకర్లలో  పౌరులుదాక్కుంటున్నారు భయంతో  ప్రజలువణికిపోతున్నారు ఆయుదాలిచ్చేవారు  ఆజ్యంపోసేవారు కొందరు చోద్యంచూచేవారు చలించనివారు మరికొందరు పరిష్కారాలు కనబడటంలా ఆపేప్రయత్నాలు జరగటంలా కొనసాగితే అందరికీప్రమాదం ప్రపంచయుద్ధమైతే అతిప్రమాదం అణ్వాస్త్రాలువాడితే అత్యంతప్రమాదం మానవాళిమనుగడే ప్రశ్నార్ధకం యుద్ధంజరుగుతుంది అక్కడ ధరలుపెరుగుతుంది ఇక్కడ మరణాలుసంభవిస్తుంది అక్కడ విషాదాలుకమ్ముకుంటుంది ఇక్కడ ఎవరికోసం యుద్ధం? ఎందుకోసం యుద్ధం? ఎన్నాళ్ళు ఈయుద్ధం? ఎవరుప్రేరేపిస్తున్నారు యుద్ధం? నీళ్ళు లేక విద్యుత్తు లేక భద్రత లేక అక్కడ జనులు అలమటిస్తున్నారు శాంతమ్మా! వేడుకుంటున్నా నమస్కరిస్తున్నా తపిస్తున్నా ఆలశ్యంచేయకుండా రావమ్మా శాంతమ్మా! ఓ శాంతమ్మా! త్వరగా రావమ్మా! ప్రాణాలను కాపాడమ్మా! ప్రపంచాన్ని రక్షించమ్మా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం (ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎన్నినెలలనుండో జరుగుతుం...
Image
 ఒక్క అవకాశమివ్వండి ప్లీజు! ఒక విత్తనం దొరికితే పాదుచేస్తా నాటుతా నీళ్ళుపోస్తా పెంచుతా మహావృక్షం చేస్తా ఒక మాట తడితే అక్షరాలు అల్లుతా ఆపై పదాలుపేరుస్తా అద్భుతకవితను సృష్టిస్తా ఒక ఊహ తడితే తర్కించి నిర్ణయంతీసుకుంటా కష్టపడి అమలుచేస్తా జీవితాన్ని మార్చుకుంటా ఒక తోడు లభిస్తే చేరదీస్తా ప్రేమనుపంచుతా  కష్టసుఖాలు పంచుకుంటా జీవితభాగస్వామిని చేసుకుంటా ఒక పరిచయమైతే ఆత్మీయస్నేహితుడిగా చేసుకుంటా అభిమానిస్తా అనుభవాలుపంచుకుంటా ప్రాణమివ్వటానికైనా సిద్ధపడతా ఒక కుంచె చిక్కితే అందమైన బొమ్మనుగీస్తా పలురంగులు అద్దుతా అందరిని ఆకర్షిస్తా ఒక అందం కనబడితే ఆస్వాదిస్తా ఆనందపడతా అంతరంగంలో దాచుకుంటా ఒక అవకాశమిస్తే శాసనసభ్యుడనవుతా ముఖ్యమంత్రినవుతా ఐదేళ్ళు అధికారం అనుభవిస్తా అంతే కాని అవినీతికి పాలుపడను ఆస్తులు కూడగట్టుకోను ఆంధ్రాను అధోగతిపాలుజేయను ఆలోచించకుండా ఎదురుచెప్పకుండా కళ్ళుమూసుకొని నాకో అవకాశమివ్వండి ప్లీజు అప్పుడు నాతడాకా చూపిస్తా అభివృద్ధిని గాలికి వదులుతా ఒక్కొక్కరి పనిపడతా ప్రతీకారం తీర్చుకుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చిన్నారుల చిరుకోరికలు ఓ పువ్వా! విచ్చుకో అందాలను చూపించు సువాసనలను వెదజల్లు ఓ విహంగమా! రెక్కలాడించు గాలిలో ఎగురు ఆకాశంలో విహరించు ఓ కోకిలా! పాడు పాడు గొంతెత్తిపాడు కమ్మనిరాగాలను వినిపించు ఓ చిలుకా! చక్కెరపెడతా మాట్లాడు పచ్చదనాన్ని చూపించు ఎర్రనిముక్కుతో శోభిల్లు ఓ నెమలీ! పురివిప్పు నాట్యమాడు పులకించు ఓ తరంగమా! ఎగిసిపడు ఎదనుతట్టు కడలితీరమునుచేరు ఓ చిన్నారీ! మురిపించు ముసిముసిగనవ్వు ముద్దుమాటలాడు ఓ చందమా! కనులకు కనిపించు వెన్నెల కురిపించు మనసుల మురిపించు ఓ సూర్యుడా! తూర్పున ఉదయించు కిరణాలు ప్రసరించు చీకటిని పారదోలు ఓ కవీ! బాలలకవితలువ్రాయి అందాలనుచూపించు ఆనందాన్నికలిగించు చిన్నారుల చిరుకోరికలు వినండి తీర్చండి పిల్లల మనసులను తెలుసుకోండి తన్మయపరచండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కాలమా ఆగిపో! తెల్లవారితే నిద్రలేవాలి పరుగులుతియ్యాలి పనులకువెళ్ళాలి సూర్యుడా నిలిచిపో ఉదయించకు కిరణాలు ప్రసరించకు చీకటిని పారదోలకు చతుర్దశి చందమా పెరగకు తరగకు పెరిగితే తరుగుతావు వెన్నెల కురియనంటావు గడియారమా విశ్రాంతితీసుకో తిరగకు పరుగులుతీయకు వసంతమా నిలిచిపో మల్లెవాసనలు పీలుస్తా మామిడిఫలాలు తింటా కోకిలగానం వింటా గ్రీష్మమా రాకురాకు ఎందలు మండించకు చెమటలుపట్టించకు బాధలుకలిగించకు చలికాలమా దూరంగావెళ్ళిపో మంచుకురిపించకు ఒళ్ళువణికించకు వర్షాకాలమా రావద్దు వెనక్కిపో తడపకు బంధించకు రోగాలు తెప్పించకు యవ్వనమా శాశ్వతంగావుండిపో సరదాలనాపకు వృద్ధాప్యంలోకినెట్టకు రోజులుగడిస్తే వయసుపెరుగుతుంది ఆయుస్సుతరుగుతుంది వాతావరణంమారుతుంది కాలచక్రమా ముందుకుకదలకు కష్టపెట్టకు ఋతువులుమార్చకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితావిందుకు స్వాగతం కనిపించకుండా అందాలను చూపిస్తా ఆనందంలో ముంచుతా అంతరంగంలో నిలుస్తా వినిపించకుండా గానామృతమును త్రాగిస్తా వీనులకు విందునిస్తా వినోదపరుస్తా కళ్ళను మూయిస్తా కనువిందులు చేసేస్తా కమ్మనిదృశ్యాలను చూపుతా కళకళలాడిస్తా మూతిని ముడిపిస్తా మాట్లాడిస్తా మధువును చల్లేస్తా మనసులను మయిమరిపిస్తా చెవులను మూయిస్తా సంగీతం వినిపిస్తా శ్రావ్యతను చూపిస్తా సంతసము నిచ్చేస్తా పళ్ళను బిగింపజేస్తా పదార్ధాలను నమిలిస్తా కసకస కొరికిస్తా కడుపులను నింపేస్తా చేతులుకట్టేస్తా పనులుచేయిస్తా పాటుపడిస్తా ఫలాలనందిస్తా కాళ్ళను బంధిస్తా కదములు తొక్కిస్తా కోరినచోటుకు తీసుకెళ్తా కావలసినవి చేతికిస్తా మనసును మూలనపెట్టేస్తా ఆలోచనలను మరిగిస్తా భావాల నుడికిస్తా కవితలవిందులు చేసేస్తా ఉత్తపిలుపు కాదురా చెత్తమాటలు కావురా కొత్తకబుర్లు చెబుతారా మత్తులోన  ముంచుతారా సిద్ధముకండి బయలుదేరండి సమయానికిరండి ఆస్వాదించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం