ఆరిపోయేదీపం దీపాలు ఆరిపోతాయి దేహాలు కాలిపోతాయి చేతలు మిగిలిపోతాయి వ్రాతలు నిలిచిపోతాయి తప్పదు తప్పదు పుట్టిన ప్రతివారు చితిలో కాలకతప్పదు బూడిదగామారక తప్పదు చచ్చినా బతికుండవలె మంచిపనులు చేయవలె గురుతులు మిగల్చవలె చిరంజీవిగా మిగిలిపోవలె కూడదు కూడదు అనామకుడిగా అంతరించకూడదు చేయవలె ఘనమైనపనులు లోకాననిలపవలె చెరగనిముద్రలు కళ్ళతో చూచినవాటిని చెవులతో విన్నవాటిని నోటితో చెప్పినవాటిని అక్షరాలలోదాచి అందరికందిస్తా ఆలోచనలను పారించి భావాలను పుట్టించి కాగితాలపై కెక్కించి కమ్మనికవితలు సృష్టిస్తా అక్షరకుసుమాలతో అల్లి పదాలనుపారించి పొసగి అంతరంగాన్ని మదించి అద్భుతకవితలను ఆవిష్కరిస్తా అందరికిని అందాలుచూపించి ఆనందాలు కలిగించి అందరిమదులలో నిలచిపోతా పువ్వులకవితలను పుటలపై పెడతా పడతుల ప్రణయాన్ని పేజీలకెక్కిస్తా ప్రకృతి అందాలను పేపర్లపైపెట్టేస్తా ప్రజలమనసులలో పదికాలాలు నిలచిపోతా మీ కవిని మీ మదిని మీ హృదిని మీ ప్రతిబింబాన్ని మంచికవితలను మరవకండి మరలామరలా తలచుకోండి మనసులో నిలుపుకోండి మాటిమాటికి మననంచేసుకోండి ఉన్నంతకాలం ఉన్నతమైనపనులు చేయండి ఉర్వీజనులను ఉద్ధరించటానికి యత్నించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, ...
Posts
Showing posts from April, 2022
- Get link
- X
- Other Apps
మహాకవి శ్రీశ్రీకి జోహార్లు శ్రీశ్రీలాగా కవిత్వం వ్రాయాలనియున్నది కలాన్ని కత్తిలాగా కదిలించాలనియున్నది విప్లవ సాహిత్యం విరచించాలనియున్నది విలపించే పేదలను వికసింపజేయాలనియున్నది ఛందస్సు సంకెళ్ళను తెంచాలనియున్నది బానిస సంకెళ్ళను తుంచాలనియున్నది కర్షకులను కాపాడాలనియున్నది కార్మికులను కలిపి విజయంసాధించాలనియున్నది శ్రీశ్రీ మహాకవిని స్మరించాలనియున్నది చెయ్యెత్తి జైకొట్టి కీర్తించాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎందుకనో? పూలతోటమధ్యలో పచార్లుచేయాలనియున్నది పరిమళగంధాలను పీల్చాలనియున్నది చిటపట చినుకులలో చిందులు వేయాలనియున్నది చిన్నారి పాపలతో సమయం గడపాలనియున్నది ప్రవహించే నదులను పరికించాలనియున్నది పంటలుపండే పచ్చనిపొలాల్లో పారాడాలనియున్నది చెలిని చెంతకుపిలచి కోర్కెలు తీర్చాలనియున్నది ప్రేమాభిమానాలు పంచి పులకరించాలనియున్నది నీలి ఆకాశంలో విహరించాలనియున్నది తారల తళుకులలో వెలిగిపోవాలనియున్నది మేఘాలపైన యెక్కి కూర్చోవాలనియున్నది చల్లని వెన్నెలలో సేదతీరాలనియున్నది ప్రభాత సూర్యుడిని చూడాలనియున్నది కడలి కెరటాలను కాంచాలనియున్నది అన్నార్తులందరిని ఆదుకోవాలనియున్నది రోగబాధితులందరికి సేవలుచేయాలనియున్నది బాధలుపడేవారందరిని ఓదార్చాలనియున్నది దీనజనులందరిని ఉద్ధరించాలనియున్నది చిరునవ్వుల మోములను కాంచాలనియున్నది తేనెలొలుకు పదాలను వినాలనియున్నది అందమైన దృశ్యాలను చూడాలనియున్నది అంతులేని ఆనందాలను పొందాలనియున్నది కమ్మని కవితలను వ్రాయాలనియున్నది శ్రావ్యమైన గీతాలను పాడాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
జవనిక నిన్న నువ్వు నాకలలోకొచ్చి చేసినచేష్టలే నేటి నాకవితలో నిండుగా చోటుచేసుకున్నాయి నువ్వు ఓపువ్వును నా చేతికిచ్చి నవ్వులు చిందుతూ నాముందు నాట్యంచేశావు చిరునగవులు ఒలకబోస్తూ చిలిపిచూపులతో ఆకట్టుకుంటూ సోయగాల విందులిస్తూ చిత్తుచేసి మదినికొల్లగొట్టావు తనువును తాకుతూ తొందరబెడుతూ తలను నిమురుతూ తన్మయత్వపరిచావు నిన్న రాత్రి నువ్విచ్చిన ముద్దు చెంపపై ముద్రవేసి చెరగకుండా నిలచిపోయింది నీ ఊహలను నా తలకెక్కించావు నీ వయ్యారాలను నా కళ్ళకందించావు కవ్విస్తూ కలంచేతికిస్తూ కవితవస్తువునిస్తూ కవితను వ్రాయమన్నావు నీ అందచందాలు నాకు అనునిత్యం కావాలి నీ ఆనందపరవశాలు నన్ను నిత్యం ఆహ్లదపరుస్తుండాలి నేటి రాత్రివేళలో నింగిలో విహరిద్దాం నిండుచంద్రుని వెన్నెలలో నిశిరాత్రివరకు గడిపేద్దాం చుక్కలతో సయ్యటలాడుదాం మేఘాలపల్లకిలో మనసారా ఊరేగుదాం చేతులుకలిపి చెట్టాపట్టాలేసుకుందాం జతకట్టి జల్సాలు చేసుకుందాం తెరను త్వరగా తొలగిద్దాం తలపులను త్వరలో నిజంచేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా కోరికలు పువ్వులు పొంకాలను చూపుతుంటే పరికించాలని పరమానందాన్ని పొందాలని నాకోరిక పెదవులు చిరునవ్వులను చిందుతుంటే మోములు వెలిగిపోతుంటేచూచి సంతసపడాలని నాకోరిక మాటలు తేనెతుంపరులను చిందిస్తుంటే ఆస్వాదించాలని ఆనందం పొందాలని నాకోరిక కిరణాలు చీకటిని పారదోలుతుంటే ప్రభాత సూర్యునిచూచి పరవశించాలని నాకోరిక వెన్నెల చల్లగా కురుస్తుంటే జాబిల్లి మేఘాలతో దోబూచులాడుతుంటేచూచి తన్మయత్వపడాలని నాకోరిక జలాలు నిండుగా నదులలో ప్రవహిస్తుంటే పంటలు పుష్కలంగా పండుతుంటేకని కుతూహలపడాలని నాకోరిక ప్రేమలు ఫలిస్తుంటే పెళ్ళిల్లు పెక్కుజరుగుతుంటే ప్రేమికులను పరిరక్షించమని పరమాత్ముని ప్రార్ధించాలని నాకోరిక పసిపాపలు బోసినవ్వులు నవ్వుతుంటేచూడాలని ముద్దుమాటలు పలుకుతుంటేవినాలని బ్రహ్మానంద భరితుడనుకావాలని నాకోరిక పరువాలు పడతులందు పొంగిపొర్లుతుంటే పరిహాసాలాడుతుంటే పరికించి ప్రమోదంపొందాలని నాకోరిక అలలు అంబుధిలో ఎగిరిపడుతుంటే తీరాన్ని తాకుతుంటే తనివితీరా చూడాలని నాకోరిక కొండాకోనలు పచ్చదనం కప్పుకుంటే వానజల్లులు కురుస్తుంటేచూచి సంతసించాలని నాకోరిక సెలయేర్లు క్రిందకు ఉరకలేస్తుంటే నె...
- Get link
- X
- Other Apps
లోకంపోకడ తెలుసుకోరా కల్లాకపటం ఎరగనివాడా లోకంపోకడ తెలుసుకొనరా సన్మార్గాన నడుచుకొనరా వక్రం వక్రం మాటలు వక్రం చేతలు వక్రం బుద్ధి వక్రం నడక వక్రం అంతా వక్రం అక్రమం అక్రమం సంపాదన అక్రమం ఆస్తులు అక్రమం పోకడ అక్రమం పనులు అక్రమం అన్నీ అక్రమం మోసం మోసం పేమ మోసం స్నేహం మోసం త్యాగం మోసం భక్తి మోసం సర్వం మోసం నటన నటన ఏడుపు నటన కన్నీరు నటన ఓదార్పు నటన వలపు నటన పూర్తిగా నటన బూటకం బూటకం చెప్పేది బూటకం చేసేది బూటకం చేయించేది బూటకం చూపించేది బూటకం సర్వం బూటకం వేరు వేరు చెప్పేది వేరు చేసేది వేరు ఇక్కడ వేరు అక్కడ వేరు అసలునిజం వేరు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం లోకం పోకడ తెలుసుకొని ప్రవర్తించరా పైనేమో పటారం లోనేమో లొటారం చూపేది మంచిదనం దాచేది చెడ్డదనం కనిపించేది తెల్లదనం మరుగునపెట్టేది నల్లదనం ఎదురుగావుంటే పొగుడుతారు ఎక్కడోవుంటే తిడుతారు కడుపులో విషంపెట్టుకుంటారు పెదవులపై అమృతం పూచుకుంటారు తేనెపూసిన ఖడ్గం నాకితే నాలుక ఖతం కనిపించేది పాలఘటం కనిపించనది కలిపినవిషం
- Get link
- X
- Other Apps
ముసలోడి ముచ్చట్లు (ముసలోడి స్వగతం) ముసలివాడివయ్యావు మూలనపడియుండు మంచముగది యెందుకు ముద్దతిని ముడుచుకోమన్నాడు ముద్దుగాపెంచిన కొడుకు అడ్డంగాయున్నావు అనాధాశ్రమంలోచేరు అన్నీయేర్పాటుచేస్తాము అవస్థలుపెట్టవద్దు అన్నది కొడుకుపెళ్ళాము పండుముసలివయ్యావు పెట్టినపుడు పాచియన్నమైనాతిను పళ్ళెంలోపెట్టింది కడుపునిండామెక్కు పనిలేదు రుచులతో నీకనుచు పలికింది ప్రియమైన పెళ్ళాము కష్టాలొచ్చాయి కన్నీరుకారాయి కొడుకునుకొట్టాలనిపించింది కోడలును తిట్టాలనిపించింది కట్టుకున్నదాన్ని తన్నాలనిపించింది బాధపడకు తాతా బయటకెళ్ళకు తాతా కథలుచెప్పు తాతా సుద్దులునేర్పు తాతా ముద్దులిస్తాయన్నది మనుమరాలు పోవొద్దు యెక్కడకు తాతా పాఠాలు చెప్పు తాతా పాటలు ఆటలు నేర్పించు తాతా పరీక్షలలో నెగ్గించు తాతా బాగాచూచుకుంటానన్నాడు మనుమడు పలహారాలందిస్తుంటాం పాలుపండ్లుయిస్తుంటాం పలకరిస్తుంటాం బాగోగులు గమనిస్తుంటాం బయటకెళ్ళొద్దన్నారు ప్రక్కింటివాళ్ళు స్వాంతన దొరికింది సంబరమయ్యింది సర్దుకోవాలనిపించింది సహనంవహించాలనిపించింది స్వాభిమానాన్ని వీడాలనిపించింది పృధ్విని పచ్చదనంతో కప్పుతుంటా పూలుఫలాలుయిస్తుంటా పచ్చని కొండాకోనలనుచూపిస్తుంటా పుడమిని సూర్యచ...
- Get link
- X
- Other Apps
నాపువ్వు పువ్వును పిలిచా ఉలకలా పలకలా చెంతకు రమ్మన్నా కదలలా మెదలలా రంగులు చిందమన్నా రగిలిపోతుంది పరిమళాలు చల్లమన్నా పెదవిబిగించింది ముక్కుమీద కోపంకనిపిస్తుంది మూతిని బిగించిపట్టియున్నది వారంనుండి విరులకవితను వ్రాయలేదని అలిగింది అలకపానుపు నెక్కింది చక్కలిగిలిపెట్టా నవ్వలా సరసాలాడా ప్రతిస్పందించలా చెంపలేసుకున్నా పట్టువదలలా గుంజీలుతీశా గమనించలా కలంపట్టుకున్నా కళ్ళుతిప్పిచూసింది కవితనువ్రాశా కనికరించింది ముద్దులిచ్చింది ముచ్చటలాడింది మనసుపారేసుకుంది మదినిదొచేచింది నాకు పువ్వే తోడునీడా చెలిస్నేహితురాలు నాకు పువ్వే అండదండ వెన్నుదన్ను నాలో పువ్వే ఊహలుపుట్టించు నాతో పువ్వే కవితలువ్రాయించు రాసేవారిని గెలిచేవారిని గీసేవారిని పైకెత్తండి పడేయకండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితాంజలి నీ ఆలోచనలు నాలో నదిలాప్రవహించి అందమైన రూపాలనుపొంది అవతరిస్తున్నాయి నువ్వు కలలోకివచ్చి నన్ను కవ్వించి కలంచేతికిచ్చి కాగితాలుకాగితాలు నింపిస్తున్నావు నిన్ను వ్రాసి రసాస్వాదనపొంది నామనసు పరవశించి ఆనందంలో ఉప్పొంగిపోతుంది నిను సృస్టించి నాహృదయం ఆనందపడి తనువు తన్మయత్వపడి తృప్తితో తేలిపోతుంది నీ మూలంగా నాకొచ్చిన బహుమతులు సంవత్సరాలు గడచినా ఇంటినిండాయుండి నిన్ను గుర్తుచేస్తున్నాయి నిన్ను తీపిగా శ్రావ్యంగా లయతో శ్రుతిచేసిపాడినగీతాలు నామదిలో నిలచి నిరంతరం ప్రతిధ్వనిస్తున్నాయి నువ్వు ఇచ్చే అంతులేని సంతోషాలు పాత్రలుపాత్రలు త్రాగినా ఖాళీచేసినా మరలామరలా నిండుకొని నిత్యానందాన్నిస్తున్నాయి నిన్ను చదివిన పాఠకులు నిత్యమూ పరవశించి వ్యాఖ్యానాలుపంపి నా అభిమానులుగామారి నన్ను ఆకాశానికెత్తుతున్నారు నిను తలచకుండా నేనుండలేను నువ్వు లేకుండా నేను బ్రతుకలేను ఇవే నీకు పుష్పాంజలులు ఇవే నీకు ధన్యవాదములు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నువ్వు నీపూలు నువ్వు నాటిన నీ పూలతీగ పాకి పెరిగి పల్లవించి పెద్దదయ్యింది నువ్వు వేసిన నీ పందిరికి పూలతీగ ఎగబాకి మొగ్గలుతొడిగింది నువ్వు కోరినపూలను నీ తీగపూచి పరిమళాలను వెదజల్లింది నువ్వు ఇచ్చిన నీ పువ్వును తలలో తురుముకొని తరుణి తృప్తిపడింది నువ్వు అల్లినపూదండను నీ ప్రేయసి పరమాత్ముని మెడలోవేసి పవిత్రంగా పూజచేసి పరవశించిపోయింది నువ్వు తెలిపినప్రేమను నీ పూలు ప్రేయసికి చెప్పి పులకరింపజేశాయి నువ్వు పంపిన నీ ప్రేమసందేశాన్ని చెలిచెవిలో చెప్పి సంతసపరచాయి నీకు నీ పూలకు నీ ప్రేయసికి అభివందనాలు పూలకవితను పూర్తిగా చదివిన పాఠకులకు ప్రత్యేక ధన్యవాదాలు పూలబాషను నేర్చి పూలబావాలు తెలుసుకొని పూలమనసులు నెరిగి పూలకవితలువ్రాసినకవులకు వందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం నువ్వు నీపూలును నీ పూలపిచ్చియును నీ పూలకవితలును పాడుగాను మంచి భావాలుకని మంచి అందాలనుచూపి మంచి ఆనందాలనిచ్చి మంచి కవితలనువ్రాసి మనసులనుతట్టవయ్యాకవి
- Get link
- X
- Other Apps
నా హృదయ గీతాలు కోమలాంగికవితను నేకోరలేదు నన్ను కయితలకన్యకే నమ్మివలచె పిచ్చివాడ్నిచేసెకవిత ప్రేమపంచి నన్ను సాహిత్యలోకాన నడవమనెను పుష్పములనుతెచ్చి ప్రేయసికివ్వంగ పెంచినానునేను పూలతోట ముద్దుమల్లెలు మందారములునుపూచె ముద్దబంతులు విప్పారి మోదమిచ్చె సన్నజాజిపూచె చామంతివిరబూచె పూచె పలుగులాబిపూలు నచట కబురుపంపినట్టి కాంతవచ్చుననుచు పూలతోటనందు పొంచియుంటి మచ్చెకంటితోడ మాటలాడదలచి కాచుకోనియుంటి కలికికొరకు సంతసంబుగూర్చ సరసాలునేర్చితి వెలదిరాకకొరకు వేచియుంటి ప్రక్కనున్నవారి పకపకలాడించ పెక్కుచతురతులను పేర్చినాను సంతసాల నేను సమకూర్చతలపుతో షోకులాడికొరకు చూస్తుయుంటి అధరసుధలను క్రోలంగ నాశకలిగి సుదతివచ్చుననుచు నేను చూచుచుంటి ప్రియురాలపిలచి ప్రేమను తెలుపంగ ఫల్యగుచ్ఛములను పట్టియుంటి గుండెతలుపుతెరచి గుబులునుతీర్చంగ కలికికొరకు నేను కాచుకుంటి అక్షరాలుపేర్చి నర్ధంబులివ్వంగ కవిత వ్రాయుచుంటి కలముపట్టి పదములెల్లకూర్చి పారించవలెనని కదముతొక్కుచుంటి కవితవ్రాయ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
రామరాజ్యం రావాలి రాముడు మరలాపుట్టాలి రామరాజ్యం రావాలి మనమంతా బాగుపడాలి మానవలంతా కలసిజీవించాలి రాక్షసరాజ్యాలు పోవాలి రావణులంతా అంతరించాలి రామలక్ష్మణులను పూజించాలి రాజ్యాలన్ని సుభిక్షంగాయుండాలి సీతారాములకళ్యాణం ప్రతియేడూ జరగాలి గ్రామగ్రామలందు రామాలయాలువెలుగొందాలి అందరు అన్నదమ్ములు రామలక్షమణులులాగా ఉండాలి అందరు దంపతులు సీతారాములులాగా ఉండాలి మంధరలను కనిపెట్టాలి బహుదూరంగా పెట్టాలి కైకేయిలను బహిష్కరించాలి కాపురాలు కమ్మగాసాగాలి ప్రజలమాటలను నేతలువినాలి ప్రజాసంక్షేమమే పరమావధికావాలి స్వార్ధాని అందరూ తగ్గించుకోవాలి సమాజహితానికి అందరూ పాటుపడాలి సేవకులంతా హనుమంతునిలాగా ఉండాలి యజమానుల యోగక్షేమాలు నిరంతరం చూస్తుండాలి జయజయరామా పట్టాభిరామా కోదండరామా జైజై శ్రీరామా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పువ్వా! ఏమివ్వనూ నీకేమివ్వనూ? అందం కావాలన్నా పువ్వు ప్రత్యక్షమయ్యింది ఆనందం కావాలన్నా మరోపువ్వు ముందుకొచ్చింది పరిమళం కావాలన్నా పువ్వు పరుగెత్తుకుంటూవచ్చింది పరవశం కావాలన్నా పకపకలాడుతున్నపువ్వు ప్రక్కకొచ్చింది రంగులు కావాలన్నా రమ్యమైనపూలు రయ్యిరయ్యిమనివచ్చాయి షోకులు కావాలన్నా సొగసైనపూలు సరసానికొచ్చాయి నవ్వు కావాలన్నా పువ్వువచ్చి పెదవులపైకూర్చుంది మార్పు కావాలన్నా మరోపువ్వు రూపముమార్చుకొనివచ్చింది సుకుమారం కావాలన్నా సుమాలు వంటిని చుట్టుముట్టాయి సౌఖ్యం కావాలన్నా సుమాలు పడకపైపరుచుకున్నాయి నవ్యత కావాలన్నా కొత్తపూలు కళ్ళముందుకొచ్చాయి భవిత కావాలన్నా భారీగాపూలొచ్చి పరచుకొని బాటనుచూపించాయి అక్షరాలు కావాలన్నా అలరులు అందుబాటులోకొచ్చాయి అర్ధవంతమైనపదాలు కావాలన్నా అల్లిన అందాలపూలమాలలు చెంతకొచ్చాయి భావం కావాలన్నా విరులు వరసలోనిలిచాయి కవిత కావాలన్నా కుసుమాలు కమ్మగా కూడివచ్చాయి పువ్వా ఏమివ్వనూ నీకేమివ్వనూ నీఋణమెలాతీర్చుకోనూ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సర్వేజన సుఖీనోభవంతు పూయనీ పువ్వులు పూయనీ పూతోటనిండా పువ్వులు పూయనీ పరసరాలు ప్రకాశించి పులకించనీ పూయనీ నవ్వులు పూయనీ మోములనిండా నవ్వులు పూయనీ చూచేవారికి సంతసాలను చేకూర్చనీ పండనీ పంటలు పండనీ పొలాలన్ని సుభిక్షంగా పండనీ పాటుపడ్డ రైతులను పరవశించనీ పండనీ నాపచేను పండనీ నవ్విన నాపచేనుని పండనీ నలుగురికి నయనానందం కలిగించనీ తీరనీ కోర్కెలు తీరనీ సర్వులు సంతసం పొందనీ కుతూహలంతో కేరింతలు కొట్టనీ తీరని ఆకలి తీరనీ అందరి కడుపులు నిండనీ అందరినీ ఆనందసాగరంలో తేలనీ పడనీ మురిసిపడనీ ఉల్లాలు ఉత్సాహంతో ఉఱుకులు పఱుగులతో ఉప్పొంగిపోనీ పడనీ తృప్తిపడనీ తనువులు తోషంతో తన్మయత్వం పొంది తరించిపోనీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అడుగో కవి! ప్రకృతిని వర్ణించి పుడమికి పచ్చదనమద్ది పువ్వులను కళ్ళముందుంచి ప్రజలను పరవశింపజేస్తాడట పుష్పకవి నీలాకాశంలో పట్టపగలే నెలవంకను నిలిపి వెన్నెలను వెదజల్లి విశ్వజనులను విస్మయపరుస్తాడట సహజప్రకృతికవి ప్రేమజల్లులు కురిపించి తడిపి ముద్దజేసి ప్రణయలోకంలో విహరింపజేస్తాడట ప్రణయకవి అందాలను చూపించి అంతరంగాలను ఆకట్టుకొని అద్భుతప్రపంచంలోనికి తీసుకెళ్ళి అంతులేని ఆనందాలను అందిస్తాడట అందాలకవి మనసులను తట్టి మదిలో తిష్టవేసి మరోప్రపంచాన్ని చూపి ముచ్చటపరుస్తాడట ఆనందాలకవి అక్షరాలతో అలరించి పదాలతో పసందుకలిగించి సాహిత్యలోకంలో సంచరింపజేస్తాడట సుకవి భావాలతో రక్తిగట్టించి కల్పనలను రంగరించి ఊహలలలోకంలో ఉరుకులుతీయించి హృదయాలను ఉర్రూతలూగిస్తాడట భావకవి అటువంటి కవులను ఆదరిద్దాం అభినందిద్దాం అంతరంగాలలో నిలుపుకుందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎందుకో? మేఘాల్లోని నీరునుతెచ్చి అందరిదాహం తీర్చాలని అందరినీ స్నానంచేయించాలని మనుజుల్లోని కల్మషాన్ని కడగాలనియున్నది ఆకాశవస్త్రాన్ని తీసుకొనివచ్చి అందరికి బట్టలు కుట్టించాలని అందరిమొహాల్లో ఆనందంచూడాలని అందరూ సమానులేనని చెప్పాలనియున్నది సూర్యకిరణాలలోని కాంతినితీసుకొనివచ్చి అఙ్ఞానాంధకారాలను పారదోలాలని చీకట్లను శాశ్వతంగా తరిమివేయాలని అందరిజీవితాలను ఆనందమయం చేయాలనియున్నది చంద్రుని వెన్నెలను పట్టుకురావాలని చల్లని గాలులు వీయించాలని అందరిమేనుల సేదతీర్చాలని అందరినీ ఆహ్లాదపరచాలనియున్నది పుడమినున్న పువ్వులన్నిటిని తేవాలని పడతులందరికి పంచాలని అందరినీ అందంగా చూడాలని పరిమళాలను అందరిపై చల్లాలనియున్నది కోకిలలు అన్నింటిని ఆహ్వానించాలని కుహూకుహూ రాగాలు తీయించాలని కమ్మనిపాటలు పాడించాలని అందరికీ వీనులవిందు కలిగించాలనియున్నది అడవిలోనున్న అన్నిమయూరాలను పిలవాలని పురులను విప్పుకొమ్మని చెప్పాలని అందంగా నాట్యం చేయించాలని అందరినీ పరవశింపజేయాలనియున్నది ఇంద్రలోకానికి ఎగిరివెళ్ళాలని అమృతాన్ని భువికి తేవాలని అందరిచేత త్రాగించాలని అందరినీ చిరంజీవులను చేయాలనియున్నది అందముగా అక్షరాలను అమర్చి పదాలను పారించి పరవళ్ళుత...
- Get link
- X
- Other Apps
కవినేర్పు కవితలకూర్పు కవినేర్పు కవితలకూర్పు అందాలనుచూపు ఆనందాలనిచ్చు కవితలను వ్రాయమని అక్షరాలు కలమును కోరుచున్నాయి కవితలను పూయించమని పువ్వులు పొదలను ప్రార్ధిస్తున్నాయి కవితాసౌరభాలను వెదజల్లమని పరిమళాలు గాలిని కోరుతున్నాయి కవితాకిరణాలను ప్రసరించమని వెలుగులు దీపాలను వేడుకుంటున్నాయి కవితాతేనెలను కురిపించమని మాధుర్యాలు తేటులను తొందరపెడుతున్నాయి కవితాజల్లులు కురిపించాలని ఆకాశం మేఘాలను అడుగుతుంది కవితలను పాడమని శబ్దాలు కంఠములను అడుగుచున్నాయి కవితారుచులను అందుకోవాలని నాలుకలు నిరీక్షిస్తున్నాయి కవితామృతాన్ని క్రోలాలని నోర్లు ఎదురుచూస్తున్నాయి కవితలకు కల్పనలు జోడించాలని మనసులు పరితపిస్తున్నాయి ఎక్కడనుండయినా ఎవరి ప్రోద్భలమునయినా ఎటువంటి కవితయినా ఎదలకు చేరవచ్చు కవితలను కవిగారు వండివార్చేదెపుడో వడ్డించేదెపుడో వేచిచూద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎంత బాగుండునో! చీకటి బ్రతుకులలో వెలుగులు విరజిమ్మితే సుఖసంతోషాలు వెల్లివిరిస్తే ఎంతబాగుండునో ఆరోజులు రాత్రి ప్రయాణాలలో కాంతికిరణాలు కనబడితే దారినిచూపి నడిపిస్తే ఎంతబాగుండునో ఆవెలుగులు కష్టాల కన్నీళ్ళకడలిలో చిరునవ్వులు చిందితే చిరుమోములు వికసిస్తే ఎంతబాగుండునో ఆదృశ్యాలు చిమ్మ చీకట్లలో చంద్రుడు మబ్బులువీడితే వెన్నెల కురిపిస్తే ఎంతబాగుండునో ఆరాత్రులు విషాదంలో మునిగినపుడు వికసించినపూలు కనిపిస్తే విచారం మటుమాయమయితే ఎంతబాగుండునో ఆక్షణం ఆకలికొన్న చిన్నారిని ఏడుస్తున్న బుజ్జాయిని అమ్మ ఎత్తుకొని పాలిచ్చి లాలిస్తే ఎంతబాగుండునో ఆసమయం ప్రాయంలో ఉన్నట్టి పదహారేళ్ళ యువతి పకపకలాడుతుంటే ఎంతబాగుండునో ఆచూపులు కవిగారి కలమునుండి కమ్మనికవిత జాలువారి కళ్ళముందుకొచ్చి కుతూహలపరుస్తుంటే ఎంతబాగుండునో ఆరాతలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఏమన్నవి పూలేమన్నవి? ఏమన్నది పువ్వేమన్నది పరికించి పరవశించిపొమ్మన్నది ఏమన్నది పరిమళమేమన్నది పీల్చి పులకరించిపొమ్మన్నది ఏమన్నది పూబాలేమన్నది ఆటలాడి పాటలుపాడుకుందామన్నది ఏమన్నది పూలదండేమన్నది పరమాత్మునిమెడలోవేసి పూజలుచేయమన్నది ఏమన్నది పూలమాలేమన్నది పడతికొప్పులో తురిమి ప్రేమలో పొంగిపొమ్మన్నది ఏమన్నవి పూలపొంకాలేమన్నవి పరిశీలించి పరమానందాన్నిపొందమన్నవి ఏమన్నవి పూరెబ్బలేమన్నవి అందరిపైచల్లి ఆనందపరచమన్నవి ఏమన్నవి పూలేమన్నవి పలుపూలను పూయించి పెక్కు ఆలోచనలను పారించమన్నవి ఏమన్నవి మల్లెమందారాది పువ్వులేమన్నవి మయినిమరిపించి మనసులను మురిసిపొమ్మనుచున్నవి ఏమన్నవి పువ్వారులేమన్నవి ప్రోత్సాహమిచ్చి పెక్కుకవితలను వ్రాయమనుచున్నవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం