కవితాసుందరి ఆమెకు అక్షరమే ఆయుధము ప్రాసలే ప్రాణము ఆమెకు పోలికయే భూషణము శైలే ఆలవాలము ఆమెకు ఆలోచనలే ఆధారము విషయమే ప్రధానము ఆమెకు మదులుదోచటమే ముఖ్యము నిత్యప్రవాహమే ఇష్టము ఆమెకు మధురగళాలే ఆవాసము నవ్వులుచిందించటమే ఆశయము ఆమెకు తీపినందించటమే సంతోషము అందాలుచూపించటమే ఆనందము ఆమె కలాల ప్రవాహము కాగితాలకు అలంకారము ఆమె ఆకర్షణకు ఆద్యము మరోలోకానికి మార్గము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Posts
Showing posts from February, 2025
- Get link
- X
- Other Apps
తెలుగుతమ్ముళ్ళారా! మీరు తెలుగువాళ్ళా అయితే తెలుగుతల్లిని పూజించండి మీకు తెలుగు బాగావచ్చా అయితే వెలుగులు వెదజల్లండి మీకు మాతృభాషపై ప్రేముందా అయితే మీభాషను ప్రోత్సహించండి మిమ్మల అ ఆలు పిలుస్తున్నాయా అయితే అక్షరాలను అందంగా అల్లండి మిమ్మల తేటపదాలు తడుతున్నాయా అయితే తేటతెల్లముగా కైతలువ్రాయండి మిమ్ము స్వరాలు గళమెత్తమంటున్నాయా అయితే చక్కగా కవితాగానము వినిపించండి మీకు తీపియంటే ఇష్టమా అయితే తేనెపలుకులు విసరండి మీకు తెలుగుపై పట్టుందా అయితే సాహిత్యపయనం సాగించండి మీరు పక్కా తెలుగోళ్ళా అయితే మీబాసకు తక్కువచేయకండి మిమ్మల తోటివారు ప్రోత్సహిస్తున్నారా అయితే సూక్తులు సుశబ్దాలు శోభిల్లగపలకండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా పగటికలలు నేను మునిగింది గంగనుకున్నా నాకు దక్కింది మహాపుణ్యమనుకున్నా నేను పట్టింది బంగారుమనుకున్నా నాతలరాత మారిపోయిందనుకున్నా నేను ఏరుకున్నది నవరత్నాలనుకున్నా నాకు చిక్కింది మహాభాగ్యమనుకున్నా నేను ఇచ్చింది అమూల్యమనుకున్నా నేను మరోబలిచక్రవర్తిననుకున్నా నేను రాసింది అపరూపకావ్యమనుకున్నా నాకు లభించింది అనన్యసన్మానసత్కారాలనుకున్నా నేను పాడింది గాంధర్వగానమనుకున్నా నాప్రేక్షకులు అభిమానధనులనుకున్నా నేను తొటలోపూసిన తొలిపూవుననుకున్నా నేనుపిచికారిచేసింది మల్లెలపరిమళాలనుకున్నా నేను మేఘమువదిలిన మొదటివానచుక్కననుకున్నా నావలన భూమిపచ్చబడి హరితవనమయిందనుకున్నా నేను వలచింది రంభనుకున్నా నన్ను వరించింది అదృష్టమనుకున్నా నేను తలచింది జరగాలనుకుంటున్నా నావలన అందరికీ మేలుజరగాలనుకుంటున్నా నేను ఎక్కింది మునగచెట్టనుకుంటున్నారా కాదు నేనధిరోహించిన ఊహలపల్లకిననుకున్నా నేను కోసింది సొరకాయలనుకుంటున్నారా కాదు నేనుకన్న పగటికలలనుకుంటున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా కవనకహానీలు కవితను నడిపిస్తా కనులారా కాంచమంటా కవితను మొలిపిస్తా కాయలుకాయిస్తా కోసుకొనితినమంటా కవితను పూయిస్తా సౌరభాలను ఆస్వాదించమంటా కవితను వెలిగిస్తా తేరపారా చూడమంటా కవితను వినిపిస్తా శ్రద్ధగా ఆలకించమంటా కవితను కూరుస్తా బొమ్మను చూపుతా కవితను వండుతా కడుపునిండా ఆరగించమంటా కవితను పండిస్తా కమ్మదనాన్ని అందిస్తా కవితను సాగదీస్తా ఓపికను పరీక్షిస్తా కవితను కురిపిస్తా మనసును తడిపేస్తా కవితను చదువుతారా కవిని తలుస్తారా కవితను గుర్తించుకుంటారా కవిని మెచ్చుకుంటారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం