Posts

Showing posts from January, 2024
Image
 అడుగో కవి! ఆలోచనలలో మునిగియున్నాడు అమృతాన్ని కురిపించచూస్తున్నాడు విషయాలను వెదుకుతున్నాడు విందునివ్వటానికి వేగిరపడుతున్నాడు కలాన్ని కదిలిస్తున్నాడు కవితలను కూరుస్తున్నాడు కాగితాలపై గీస్తున్నాడు కైతలను సృష్టిస్తున్నాడు కైతలను వండుతున్నాడు పాఠకులకు వడ్డించపోతున్నాడు అందాలను చూపాలనుకుంటున్నాడు ఆనందాలను అందించచూస్తున్నాడు కల్పనలు చేస్తున్నాడు భావకవితలను బయటపెట్టబోతున్నాడు అక్షరసేద్యము చేస్తున్నాడు కవనపంటలు పండించప్రయత్నిస్తున్నాడు ఊహలను ఊరిస్తున్నాడు కవిత్వాన్ని త్రాగించాలనుకుంటున్నాడు అక్షరాలతో కుస్తీపడుతున్నాడు పువ్వులులా మాలలల్లుతున్నాడు పదాలతో ప్రయోగంచేస్తున్నాడు ప్రాసలతో పరవశింపజేయాలనుకుంటున్నాడు కలలు కంటున్నాడు పుటలపై పెడుతున్నాడు కవ్వింపులకు గురవుతున్నాడు కవితాకన్యలతో కాలంగడుపుతున్నాడు కవులు ఘటికులు పండితులు స్మరణీయులు కవులు అసమానులు ఆప్తులు అమరులు కవులను గుర్తించుదాం కవితలను అస్వాదించుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ నాచెలీ! నీ నగుమోము నాకు సుందరదృశ్యము నువ్వు నవ్వేనిమిషం నాకు నచ్చేసమయం నీ పెదాలపలుకులు నాకు తీపిమిఠాయీలు నీ చిలిపుచూపులు నాలోలేపు ప్రేమజ్వాలలు నీ కొంటెసరసాలు నాకు ఇచ్చుసరదాలు నీ వంటిషోకులు నా కంటికింపులు నీ అందాలరూపం నాకు ఆనందభరితం నీ ఒయ్యారినడకలు నాలోలేపు కోర్కెలు నీ నోటిపిలుపులు నను నీచెంతకులాక్కొను నీ చక్కనిరూపం నాకు అప్సరసతోసమానం నీ వలపుచేష్టలు నామదికి బంధాలు నీతో ప్రేమాయణం నాకు మనోహరం ఇంకెందుకు ఆలశ్యం మనం కలుద్దాం నిండు నూరేళ్ళజీవితం కలసి హాయిగాగడిపేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎవరో? ఎందుకో? ఎవరో చేస్తున్నట్లున్నది కనికట్టును విచిత్రాలను ఎవరో తిప్పుతున్నట్లున్నది కాలచక్రాన్ని భూగోళాన్ని ఎవరో ఆడిస్తున్నట్లున్నది తెరలేని నాటకాన్ని ఎవరో నాటినట్లున్నది విత్తనాలను మొక్కలను ఎవరో చేతికిచ్చినట్లున్నది పువ్వులను కాయలను ఎవరో వెలిగిస్తున్నట్లున్నది సూర్యుడిని చంద్రుడిని ఎవరో ప్రేమకురిపిస్తున్నట్లున్నది అమ్మానాన్నలనిచ్చి భార్యాబిడ్డలనిచ్చి ఎవరో పిలుస్తున్నట్లున్నది తియ్యగా ప్రేమగా ఎవరో నడిపిస్తున్నట్లున్నది ఎత్తుకు ముందుకు ఎవరో ప్రక్కనున్నట్లున్నది అండగా తోడుగా ఎవరో నవ్వుతున్నట్లున్నది పకపకా ప్రకాశంగా ఎవరో వెలిగించుతున్నట్లున్నది మోములను మదులను అంతా కనిపిస్తున్నట్లున్నది కొత్తగా అందంగా అందరూ అగుపిస్తున్నట్లున్నది మంచిగా ముచ్చటగా అన్నీ మురిపిస్తున్నట్లున్నది మేనును మనసును యావత్తు తెలిసినట్లున్నది క్షుణ్ణంగా సమగ్రంగా సర్వం తానయినవాడికి ప్రార్ధనలు ప్రణామాలు ఎవరో తెలుసుకోండి ఎందుకో ఆలోచించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ పాఠకా! కవినాటిన కవనమొక్కలను పీకుతావో సాకుతావో నీ ఇష్టం ఆలోచించు కవికూర్చిన అక్షరాలను రోట్లోవేసి దంచుతావో నోట్లోవేసి నానుస్తావో నీ ఇష్టం ఆలోచించు కవిపారించిన పదాలను పెడచెవినిపెడతావో పెదాలకందిస్తావో నీ ఇష్టం ఆలోచించు కవితెలిపిన ఆలోచనలను చెత్తనుకుంటావో ఉత్తమమనుకుంటావో నీ ఇష్టం ఆలోచించు కవిచెప్పిన భావాలను కంపనుకుంటావో ఇంపనుకుంటావో నీ ఇష్టం ఆలోచించు కవిచూపిన అందాలను అసహ్యించుకుంటావో అంతరంగంలోనిలుపుకుంటావో నీ ఇష్టం ఆలోచించు కవిచేర్చే ఆనందాలను ఏమరుస్తావో ఆస్వాదిస్తావో నీ ఇష్టం ఆలోచించు కవుల కవితలను వదిలిపారేస్తావో వంటికెక్కించుకుంటావో నీ ఇష్టం ఆలోచించు కవిత్వాని ద్వేషిస్తావో ప్రేమిస్తావో నీ ఇష్టం ఆలోచించు సాహిత్యాన్ని సాగనంపుతావో స్వాగతిస్తావో నీ ఇష్టం ఆలోచించు కవిహృదయాన్ని తెలుసుకో కవిత్వసారాన్ని క్రోలుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 రంగులహంగులు రంగులు హంగులు పొంగులు రంగులు వెలుగులు విలాసాలు రంగులు బొమ్మలకు ప్రాణము రంగులు చిత్రాలకు  అందము రంగులు పువ్వులకు పొంకము రంగులు జీవితానికి రసాత్మకము రంగులు ప్రపంచానికి కళాత్మకం రంగులు సీతాకోకచిలుకలకు ఆకర్షణీయము రంగులు ప్రకృతికి ప్రకాశం రంగులు హరివిల్లుకు దర్పణం రంగులు కళ్ళను కట్టేస్తాయి రంగులు మనసును పట్టేస్తాయి రసికుల్లారా రంగుల్లోమునగండి రంగుల్లోతేలండి రంజకుల్లారా రంగులప్రపంచాన్నివీక్షించండి జీవితాన్నిరంగులమయంచేసుకోండి రంగులు అద్దుకోండి ఆనందించండి రంగులు చల్లండి పండుగచేసుకోండి రంగుల జీవితానికి లోకానికి స్వాగతం సుస్వాగతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ప్రకృతి సహజత్వం ఆరోగ్యకరం ఆస్వాదనీయం ఆనందమయం అసహజం అనర్ధదాయకం అవనికినష్టకారకం అనాదరణీయం అకృత్తిమం ఆమోదయోగ్యం అత్యవసరం ఆరాధ్యనీయం ప్రకృతిని ప్రేమించు పరిసరాలను పరిరక్షించు పువ్వులను పొడగను పరిమళాలను పీల్చుకొను అందాలను ఆస్వాదించు ఆనందాలను అనుభవించు పచ్చదనం పరికించు కమ్మదనం కళ్ళకివ్వు కొండలను కాంచు కుతూహలము కాయానికివ్వు కోనలను చూడు కుషీగా చరించు సెలయేర్లను కనుము సంతసమును సొంతముచేసుకొనుము రవిని దర్శించు అఙ్ఞానంధకారాలను పారద్రోలు నిండుజాబిలిని వీక్షించు వదనమును వెలిగించు తారకలను తిలకించు తళతళలను తనువుకివ్వు అంబుధిని అవలోకించు కెరటాల్లా ఎగిసిపడు ప్రకృతి పరమాత్మునివరం పగిది ప్రతినిత్యంపూజనీయం ప్రకృతినిప్రేమించు ప్రతినిత్యంపరికించు పవిదిప్రాముఖ్యమును ప్రపంచానికిచాటు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవనలోకంలో.... కవుల కళ్ళల్లో అందాలు తిష్టవేస్తున్నాయి కవుల ముఖాల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి కవుల నిద్రల్లో కమ్మనికలలు కోర్కెలులేపుతున్నాయి కవుల తలల్లో తలపులు తడుతున్నాయి కవుల మదుల్లో మీటను నొక్కుతున్నాయి కవుల కలాల్లో అక్షరాలు నిండుతున్నాయి కవుల కాగితాల్లో కలాలు పదాలుకారుస్తున్నాయి పాఠకుల హృదయాల్లో కవితలు స్థిరంగానిలిచిపోతున్నాయి కవనలోకంలో కవులవ్రాతలు తారకలులా తళతళలాడుతున్నాయి కవులు సరస్వతీపుత్రులు  స్మరణీయులు చిరంజీవులు కవులను ప్రోత్సహిద్దాం గుర్తించుదాం మెచ్చుకుందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ కోకిలా! ఓ కోకిలా ఎప్పుడొస్తావే ఎంతసేపుంటావే ఏమేమిచేస్తావే ఓ కోకిలా ఏపాటపాడుతావే ఏఆటనాడుతావే ఏమాటనేర్పుతావే రావే మాపెరడుకు చేయకే ఆలశ్యమును ఎక్కవే మామిడిచెట్టును కూర్చోవే కొమ్మమీదను కూయవే కుహూకుహూమంటు చిందవే చుట్టూతేనెచుక్కలను తెరవవే నోరును కదపవే తోకను ఎత్తవే గళమును పంచవే మాధుర్యమును పాడవే కమ్మనిపాటను అందించవే శ్రావ్యతను చూపవే అందాలను కూర్చవే ఆనందాలను ఉండవే జాగ్రత్తగాను పొడుస్తాయే కాకులమూకలు తంతాయే కాళ్ళతోకాకమ్మలు గోలచేస్తాయే కావుకావుమంటు ఏపాటను పాడతావే ఎంతసేపు ఉంటావే ఏగానము ఎత్తుతావే ఏరాగము తీస్తావే ఏ ఆటను ఆడతావే ఏ బాటను పడతావే వింటానే నీకంఠమును కొడతానే చప్పట్లును రావేరావే రోజురోజు రాయించవే రమ్యకవితలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ తెలుగోడా! తెలుగు వైభవంపొందాల్సిందే పేరుప్రఖ్యాతులు రావాల్సిందే  తెలుగుకు పట్టంకట్టాల్సిందే తెలుగురాజ్యస్థాపన జరగాల్సిందే తెలుగు వెలిగిపోవాల్సిందే దశదిశలా వ్యాపించాల్సిందే కవితలు పుట్టాల్సిందే తీపిని చల్లాల్సిందే కవితాసేద్యం చేయాల్సిందే పంటలు పండించాల్సిందే అక్షరగింజలు తేవాల్సిందే సిరిసంపదలు కూడాల్సిందే కవితలవంట చేయాల్సిందే వడ్డించి తీరాల్సిందే పాఠకులకడుపులు నింపాల్సిందే కోరికలు తీర్చాల్సిందే అందాలు చూపాల్సిందే ఆనందాలు పంచాల్సిందే తెలుగోళ్ళమదులు తట్టాల్సిందే హృదయస్థానము పొందాల్సిందే తెలుగుభాష వృద్ధిచెందాల్సిందే వెలుగులు చుట్టూచిమ్మాల్సిందే తెలుగుతల్లిని కొలవాల్సిందే తల్లిఋణమును తీర్చుకోవాల్సిందే తెలుగోడా నడుంబిగించరా వడివడిగా ముందుకునడువురా  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఏదైనా రాలిపావాల్సిందే? ఏమైనా రాలిపోవాల్సిందే కుళ్ళిపోవాల్సిందే మట్టిలోకలసిపోవాల్సిందే ఏదైనా  ఎక్కడైనా ఎప్పుడైనా రాలిపోవాల్సిందే కాయైనా పువ్వైనా ఆకైనా రాలిపోవాల్సిందే పక్షైనా పశువైనా పామైనా రాలిపోవాల్సిందే మొక్కైనా తీగైనా బోన్సాయైనా రాలిపోవాల్సిందే ఆడైనా మగైనా శిఖండైనా రాలిపోవాల్సిందే పెద్దదైనా చిన్నదైనా నడిమిదైనా రాలిపోవాల్సిందే పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా నిష్కర్ముడైనా రాలిపోవాల్సిందే అంగాలైనా తనువైనా ఆత్మైనా రాలిపోవాల్సిందే ఆవైనా గేదైనా మేకైనా రాలిపోవాల్సిందే చీమైనా దోమైనా నల్లైనా రాలిపోవాల్సిందే చేపలైనా రొయ్యలైనా పీతలైనా రాలిపోవాల్సిందే కుక్కైనా నక్కైనా కొంగైనా రాలిపోవాల్సిందే మంచిదైనా చెడ్డదైనా మామూలుదైనా రాలిపోవల్సిందే కొత్తదైనా పాతదైనా వాడనిదైనా రాలిపోవాల్సిందే కష్టమైనా నష్టమైనా ఇష్టమైనా అన్నీ రాలిపోవాల్సిందే రాలిపోయేవాటికై ఆరాటమొద్దు పోరాటమొద్దు చింతపడవద్దు నీ చేతిలోయున్నవి నువ్వు చేసుకో నీ చేతిలోలేనివి నువ్వు మరిచిపో ఉన్నన్ని రోజులు బాగాబ్రతుకు అనవసర ఆలోచనలు వదిలిపెట్టు మేనుపై మోహాన్ని వీడు ప్రాణంపై ప్రీతిని వదులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవీశ్వరా! అందమైన కవితలు అల్లు చదువరులకు చేర్చు కమ్మనైన కవితలు కూర్చు కళ్ళను కట్టిపడవెయ్యి మధురమైన కవితలు పాడు శ్రోతలను తృప్తిపరచు అద్భుతమైన కవితలు అక్షరాలలోపెట్టు అందరినీ అలరించు తీయనైన కవితలు వడ్డించు కడుపులను నింపు పరిమళభరితమైన కవితలు చల్లు ఆస్వాదితులను ఆహ్లాదపరచు అమృతతుల్యమైన కవితలు కురిపించు పాఠకులపెదవులకు అందించు రమ్యమైన కవితలు హరివిల్లులాదిద్దు సప్తవర్ణాలద్ది సంతసపెట్టు విచిత్రమైన కవితలు చిత్రించు వీక్షకులను వేడుకపరచు నాణ్యమైన కవితలు పుటలకెక్కించు పాఠకులను మెప్పించు చక్కనైన కవితలు కలంతోచెక్కు కళాకారుడిగా స్థిరపడు హృద్యమైన కవితలు మంచిమాటలలోపెట్టు మదులను ముట్టు ఇంపైన కవితలు వ్రాయి సొంపుగా తీర్చిదిద్దు అద్వితీయమైన కవితలు సృష్టించు కవిబ్రహ్మగా కలకాలమునిలువు మనసున్నకవి విన్నపాలను విను పదాలు ప్రయోగించు  కవితాఝరులు పారించు కవీ ఖ్యాతిని పొందు సాహిత్యములో వెలుగు అమరుడిగా నిలువు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మాయలోకంలో మాయమనుషులు మలినమైన మేనును మంచిదుస్తులు ధరించి దాచుకుంటున్నారు మాయమనుషులు దుర్గంధభరితమైన పరిసరాలందు సుగంధాలుచల్లుకొని మనసులుమూసుకొని  కాలంగడుపుతున్నారు మాయమనుషులు తలలోపుట్టిన దురాలోచనలను టోపీలుపెట్టుకొని కప్పేసుకుంటున్నారు మాయమనుషులు కళ్ళలోని దొంగచూపులను కనిపించనీయక మోమునుమాటుచేసుకుంటున్నారు మాయమనుషులు నిజరూపాలను కనపడకుండా అలంకరించుకొని నాటకాలాడుతున్నారు మాయమనుషులు ఇంటిరహస్యాలను నలుగురికితెలియకుండా తలుపులుకిటికీలు వేసుకొని బయటకు పొక్కనీయకున్నారు మాయమనుషులు మనసులోని దురాలోచనలను దాచిపెట్టుకొని సుమతులుగా చలామణవుతున్నారు మాయమనుషులు అవినీతిపనులను అందరిదృష్టికిరాకుండా చెడుచేష్టలను చీకటిలో చేస్తున్నారు మాయమనుషులు ముసుకేసుకొని మోసాలకొడిగట్టి మంచివారిలాగా మెలగుచున్నారు మాయమనుషులు చెప్పింది చేయక చేసింది చెప్పక  చాటుమాటు వ్యవహారాలకు  పాల్పడుతున్నారు మాయమనుషులు  మాయలోకాన్ని చూడు కనిపెట్టి నడు మాయమనుషులను తెలుసుకో మోసపోకుండా మసలుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏలనో? తలపులు తన్నుకొస్తున్నాయి ఊహలు ఊరుతున్నాయి ఆలోచనలు ఆవహిస్తున్నాయి యోచనలు వెంటపడుతున్నాయి భావాలు బయటకొస్తున్నాయి మెదడు ఉడుకుతుంది మనసు మరుగుతుంది మనోచిత్రం తయారవుతుంది కలం చేతికొస్తుంది కాగితం ముందుకొస్తుంది   కవిత పుట్టకొస్తుంది సాహితి సంబరపడుతుంది వాణీదేవికి వందనాలు పాఠకులకు ధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందచందాలు ఒయ్యారాలు సయ్యాటలకు రమ్మంటున్నాయి చక్కదనాలు చిందులు త్రొక్కుదామంటున్నాయి అందాలు ఆనందాలను పొందమంటున్నాయి పొంకాలు పరిహాసాలకు పిలుస్తున్నాయి కమ్మదనాలు కళ్ళను కట్టిపడేస్తున్నాయి సొంపులు వంపులు చూపుతున్నాయి ఇంపులు  కోర్కెలు లేపుతున్నాయి సోకులు సరదాలు చేస్తున్నాయి సౌందర్యాలు సంబరాలకు ఆహ్వానిస్తున్నాయి సోయగాలు సరసాలకు స్వాగతిస్తున్నాయి శోభలు సంతోషాలను చేకూరుస్తున్నాయి సొబగులు సందడులు చేస్తున్నాయి బెళుకులు తళుకులు చిమ్ముతున్నాయి హొయలు హృదిని ముట్టుతున్నాయి ఆహా! అందమే మధువు అందమే వధువు అందమే అద్భుతము అందమే ఆశ్చర్యము అందమే అపరూపము అందమే ఆవశ్యకము అందమే అలంకారము అందమే రూపకము అందమే ఉపమానము అందమే ఉపమేయము అందమే గమ్యము అందమే జీవితము అందమే భాగ్యము అందమే ఆనందము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత్వం కవిత్వం పాలతోపాటు పొంగుతుంది కవిత్వం వానతోపాటు కురుస్తుంది కవిత్వం రవికిరణాలతోపాటు ప్రకాశిస్తుంది కవిత్వం వెన్నెలతోపాటు హాయిగొలుపుతుంది కవిత్వం గాలితోపాటు వీస్తుంది కవిత్వం పువ్వులతోపాటు పరిమళాలుచల్లుతుంది కవిత్వం ఊహలతోపాటు ఊరుతుంది కవిత్వం అందంతోపాటు ఆకర్షిస్తుంది కవిత్వం ఆనందంతోపాటు కలసికదులుతుంది కవిత్వం నదితోపాటు ప్రవహిస్తుంది కవిత్వం కడలికెరటాలతోపాటు ఎగిసిపడుతుంది కవిత్వం కాలంతోపాటు ముందుకుసాగుతుంది కవిత్వం తెలుగుతోపాటు తేనెచుక్కలుచల్లుతుంది కవిత్వం కవితోపాటు పయనిస్తుంది కవిత్వం కళ్ళను కట్టేస్తుంది కవిత్వం మదులను ముట్టేస్తుంది కవిత్వాన్ని అందరితోపాటు స్వాగతిద్దాం కవిత్వాన్ని చదువుదాం కవులనుప్రోత్సహిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సంక్రాంతి సంక్రాంతి వచ్చింది అనందాలు పంచింది హరిదాసులను తెచ్చింది గంగిరెద్దులను తిప్పింది సంక్రాంతి పిలిచింది సంబరాలు చెయ్యమంది సంక్రాంతి ప్రొద్దున్నెలేపింది భోగిమంటలు వేయించింది సంక్రాంతి రేగిపండ్లుతెప్పించింది పిల్లలతలలపై పోయించింది సంక్రాంతి తినమంది అరిసెలను ఆరగింపజేసింది సంక్రాంతి వేసుకోమంది కొత్తబట్టలను ధరింపజేసింది సంక్రాంతి ఆడమంది కోడిపందాలు కాయించింది సంక్రాంతి గాలిపటాలుకొనిపించింది గాలిలో ఎత్తుగానెగురింపజేసింది సంక్రాంతి వ్రాయించింది కమ్మనికవితను కూర్పించింది సంక్రాంతి చెప్పించింది శుభాకాంక్షలు తెలియజేయించింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 💐💐💐💐🌷🌷🌷🌷అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు🌷🌷🌷🌷💐💐💐💐
 దేహాలయం దేహం ఒక ఆలయం జీవం ఒక దైవం దేహం ఒక వాహనం పయనం దాని లక్షణం దేహం ఒక సాధనం మోక్షం దాని ఆశయం దేహం ఒక వరం సువినియోగం ఆవశ్యకం దేహం అద్భుతమైనశిల్పం ముచ్చటైనరూపం అనూరాగాలనిలయం దేహం  ఎదిగేపదార్ధం పెరగటం దాని స్వభావం దేహం  ఒక అందం ఆనందం దాని గమ్యం దేహము ఒక గృహము అంతరాత్మకు అది ఆవాసము దేహం అంగాలసముదాయం ఆరోగ్యం దానికత్యంతప్రాధాన్యం దేహం అస్తిపంజరం కండల సముదాయం దేహం  గాయపడితే  విలపిస్తుంది రోగమొస్తే తపిస్తుంది దేహం ప్రేమను కోరుకుంటుంది తోడును ఆశిస్తుంది దేహం  స్నేహం కావాలంటది సహకారం ఇచ్చిపుచ్చుకుంటుంది దేహం అశాశ్వతం జీవితం కాలపరిమితం వృధ్యాప్యం దేహలక్షణం మరణం దేహంతకం ప్రాణముంటేజీవం పోషణాత్మకం ప్రాణంపోతేశవం దహనాత్మకం దేహాన్ని శుద్ధిగాయుంచు జీవితాన్ని బుద్ధిగాగడుపు ఓ దేహీ బ్రతికినంతకాలము చెయ్యిపుణ్యము జీవితాంతమందు చేరుస్వర్గము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ప్రియా! (మాటతో ఆట) ఓ మాట చెప్పనా మనసును విప్పనా ఈ మాట మదిలోదాచుకోనా బయటకు వెల్లడించనా ఆ మాట వ్రాయనా కాగితమును చేతికివ్వనా ఏ మాట ఎందుకు కళ్ళల్లో చూపనా నా మాట వింటావా నన్ను  చేరతావా నీ మాట చెబుతావా నాబాట నడుస్తావా పై మాట మనకొద్దు వాదులాట అసలొద్దు ఆ మాట ఈ మాట ఏ మాట వినవద్దు మన మాట మన బాట మన ఆట ఒక్కటవ్వాలి ఒకే మాట మనదికావాలి ఒకేపాట మనముపాడాలి మన మాట నెగ్గాలి మన గంట మ్రోగాలి ఈ మాట విను నీ మాట తెలుపు నీ మాటకు ఎదురుచూస్తున్నా నీ రాకకు నిరీక్షిస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ కవివర్యా! అక్షరాలు ఆరబోస్తావేంటి? అందినవాళ్ళు అందినట్లు ఆరగించరా! పదాలు పారబోస్తావేంటి? ప్రక్కనున్నవాళ్ళు పాత్రలలో పట్టుకొనిత్రాగరా! ఆలోచనలు అప్పుచెపుతావేంటి? అందుకున్నవాళ్ళు తలల్లోకి ఎక్కించుకోరా! విషయాలు విసురుతావేంటి? విఙ్ఞులు విందులా భోంచేయరా! కవితలు కారుస్తావేంటి? చిక్కినవాళ్ళు చిక్కినట్లు స్వీకరించరా! తెలుగును పుటలపైపోస్తావేంటి? తేటుల్లా తేననుకొని త్రాగరా! అంధ్రభాషను ఆలాచల్లుతావేంటి? అమృతమనుకొని అందినవాళ్ళు ఆస్వాదించరా! సాహిత్యఖజానాను తెరిచిపెడతావేంటి? తెలుగుభాషాభిమానులు తిన్నగా తీసుకొనిపోరా! సాహితీవిందుకు స్వాగతిస్తున్నావేంటి? సర్వులు షడృచులను చవికొనరా! ఆహా! తెలుగుసాహితీభోజనము ఎంతరుచి ఎంతశుచి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవిగారి సృజన మేఘాలను పట్టుకొని రెండుచేతులతో పిండి చిటపట చినుకులుచల్లి కవితాగానం వినిపిస్తాడు కవి ఇంద్రధనస్సు దగ్గరకెళ్ళి రంగులను ప్రోగుచేసుకొని తోటలోనిపూలకు పూసి అందాలకైతలు చూపిస్తాడు కవి తారకలను ఏరుకొని బుట్టలో తీసుకొచ్చి అక్షరాలకు అద్ది కైతలను తళతళలాడిస్తాడు కవి జాబిలికడకు ఎగిరిపోయి పిండివెన్నెలను పట్టుకొని పదాలమీద చల్లి కవనాలను వెలిగిస్తాడు కవి ఉదయాన్నె మేలుకొని తూర్పుదిక్కునకు ఏగి విషయాలపై కిరణాలుచల్లి కవితోదయం చేస్తాడు కవి నీలాకాశాన్ని చూచి అందాలను క్రోలి ఆనందంలో మునిగి అద్భుతకవనం కూర్చుతాడు కవి ఆకాశమంత ఎత్తుకి సాహిత్యాన్ని తీసుకెళ్ళి పాఠకులను మురిపించి పరవశపరుస్తాడు కవి కవుల మేధోశక్తికి వందనాలు భావకవితల సృష్టికి అభివందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ సఖీ! కలసి నడుద్దాం మనం కలసినడుద్దాం ముందుకు నడుద్దాం మనం ముందుకునడుద్దాం తోడుగ నడుద్దాం మనం తోడుగనడుద్దాం జోడుగ నడుద్దాం మనం జోడుగనడుద్దాం      ||కలసి|| ఓనా సఖీ ఓనా ప్రియా ఓనా తోడా  ఓనా నీడా ఓనా ప్రాణమా ఓనా భాగ్యమా ఓనా అందమా ఓనా ఆనందమా           ||కలసి|| చేతులు కలుపుకుందాం మనసులు కలుపుకుందాం అన్యోన్యంగా జీవిద్దాం ఆనందంగా జీవిద్దాం జతగా నిలుద్దాం జంటగా నడుద్దాం జల్సాగా నడుద్దాం జబర్దస్తుగా నడుద్దాం    ||కలసి|| కలలను నెరవేర్చుకుందాం కోరికలను తీర్చుకుందాం అందాలను కలసిచూద్దాం ఆనందాలను కలసిపొందుదాం ఎవరూలేని చోటుకువెళ్దాం ఏకాంతమైన చోటుకువెళ్దాం ఎప్పుడు వెళ్ళనిచోటుకెళ్దాం ఎదురులేనిచోటుకు వెళ్దాం    ||కలసి|| పూదోటకు వెళ్దాం పువ్వులను చూద్దాం పరిమళాలు పీలుద్దాం ప్రణయంలో మునిగిపోదాం ఆరుబయటకు వెళ్దాం వెన్నెలలో విహరిద్దాం తారకలతో మాట్లాడుదాం మేఘాలతో ముచ్చటిద్దాం   ||కలసి|| స్వర్గందాకా వెళ్ళొద్దాం దేవతలను చూచొద్దాం అమృతాన్ని త్రాగొద్దాం అమరత్వాన్ని పొందొద్దాం చిరునవ్వులు చిందుదాం సరసాలు ఆడుదాం సరాగాలు పాడుదాం సంత...
 శుచిశుభ్రతలు స్వచ్ఛనీటితో శరీరాలు శుద్ధమవుతాయి నీతినిజాయితితో మనసులు పరిశుభ్రమవుతాయి సుపలుకలతో నోర్లు శుద్ధమవుతాయి శ్రావ్యశబ్దాలతో చెవులు పరిశుభ్రమవుతాయి తోమటంతో పళ్ళు శుభ్రమవుతాయి ఉతకటంతో బట్టలు పరిశుభ్రమవుతాయి ప్రేమతో గుండెలు శుభ్రమవుతాయి స్నేహంతో హృదయాలు పరిశుభ్రమవుతాయి సత్ప్రవర్తనతో మనుషులు శుద్ధమవుతారు అన్యోన్యంతో దంపతులు పరిశుద్ధమవుతారు అందంతో చూపులు శుద్ధమవుతాయి ఆనందంతో మోములు  పరిశుభ్రమవుతాయి కమ్మనిరచనలతో కవులు శుద్ధమవుతారు ప్రియపఠనంతో పాఠకులు పరిశుభ్రమవుతారు శుచిగా బ్రతకండి ఆరోగ్యంగా జీవించండి శుభ్రతను పాటించండి శ్రేయాలను పొందండి సుద్దమైన జీవనం సుఖమైన జీవితం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆకాశపాఠాలు   కొంతమంది పిండివెన్నెలను దోచుకొని ముఖాలకు పులుముకొని చంద్రముఖులవుతున్నారు కొంతమంది  తారకలను పట్టుకొనితెచ్చి వాకిటముంగిట ముగ్గుల్లోపెట్టి ఆనందాలలో తేలిపోతున్నారు కొంతమంది ఆకాశనీలిరంగుబట్టను తెచ్చుకొని వస్త్రాలుగా కుట్టించుకొని ధరించి వయ్యారాలను ఒలకపోస్తున్నారు కొంతమంది ఆలోచనలను సారించి పక్షులరెక్కలను కట్టుకొని ఆకసంలో విహరిస్తున్నారు కొంతమంది మనోశక్తితో ఆకాశానికెగిరి మేఘాలపై స్వారిచేసి సంతోషాలలో తేలిపోతున్నారు కొంతమంది రవికిరణాలను పట్టుకొని అఙ్ఞానాంధకారాలను తొలగించుకొని  విఙ్ఞానవంతులై కవనలోకంలో వెలిగిపోతున్నారు కొంతమంది హరివిల్లుదగ్గరకెళ్ళి రంగులుతెచ్చి పూదోటలలోని పువ్వులకద్ది చక్కనైన కవితాసుమాలనుసృష్టిస్తున్నారు కొంతమంది అందాలనింగినిచూచి భావోద్వేగంపొంది కాగితాలుతీసుకొని కలమునుపట్టి కమ్మనికవితలను కూర్చుతున్నారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనహరం 
Image
 కవితాశరాలు కవితాబాణాలు పట్టుకుంటా మదులమీదకు వదులుతా అంబును  ఎక్కుపెడతా అక్షరాలను వదులుతా పదాలశరాలను ప్రయోగిస్తా అర్ధాలను స్ఫురింపచేస్తా స్వరశస్త్రాలను విడుదలజేస్తా రాగాలను పలికిస్తా విల్లును ధరిస్తా విషయాలను సంధిస్తా ధనస్సు చేబడతా ధ్వనులను చెవులకుచేరుస్తా గుండెలకుచాపాలు గురిపెడతా మదులను మురిపింపజేస్తా ఆలోచనాస్త్రాలను సారిస్తా అంతరంగాలను అలరిస్తా అమ్ములపొదిని ధరిస్తా కమ్మనికవితలను చేరుస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 గాయపడిన మనసు తుంచినా ఊహ వదిలిపోవటంలేదు తెంచినా పువ్వు వాడిపోవటంలేదు వద్దన్నా పరిమళం వీచుటమానటంలేదు ఏడ్చినా కన్నీరు కారటంలేదు గాయపరచినా గుండె ప్రతిఘటించుటలేదు వలదన్నా చిరునవ్వు విడిచిపోవటంలేదు దూరమైనా ప్రేమ తరగిపోవటంలేదు ఆలోచనలు అంతరంగాన్ని అంటిపెట్టుకునేయున్నాయి స్మృతులు మనసును ముట్టడిచేస్తూనేయున్నాయి మాటలు మదిని ముట్టేస్తున్నాయి మాను చిగురిస్తుందా మనసు వికసిస్తుందా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందాల ఆకాశం ఆకాశాన్ని పిలిచా ఉరుములు ఉరిమింది మెరుపులు మెరిసింది అందాలు చూపింది మేఘాలను పిలిచా చుక్కలు రాల్చాయి చిందులు వేయించాయి సంతసం కలిగించాయి జాబిలిని పిలిచా వెన్నెల చల్లింది కోరికలు లేపింది ముచ్చట పరిచింది తారకలను పిలిచా తళతళామెరిసాయి ఊసులుచెప్పాయి ఉత్సాహపరిచాయి సూర్యుని పిలిచా తూర్పున ఉదయించాడు అరుణకిరణాలు వెదజల్లాడు జగాన్ని జాగృతపరిచాడు పక్షులను పిలిచా రెక్కలనువిప్పాయి రెపరెపలాడాయి కోలాహలంచేశాయి గాలిని పిలిచా ముఖాన్ని తాకాడు ముక్కుల్లో దూరాడు చెట్లను ఊపాడు కిరణాలను పిలిచా కాంతులు వెదజల్లాయి చీకటిని తరిమాయి మనసును వెలిగించాయి ఆకాశము అజస్రము అనంతము అనన్యము ఆకాశము అద్భుతము అందాలమయము ఆనందాలహేతువు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెరచిచూడు కిటికీలు తెరువు తలుపులు తెరువు గాలిని పిలువు కాంతిని రమ్మను ఆరోగ్యంగా జీవించు కళ్ళు తెరువు చెవులు తెరువు అందాలను చూడు శ్రావ్యతను విను సంతోషాలను పొందు నోటిని తెరువు పెదవులు కదిలించు తేనెపలుకులు చిందు తియ్యదనాన్ని పంచు పేరుప్రఖ్యాతులు పొందు బీరువా తెరువు పర్సును తెరువు డబ్బులు తియ్యి అవసరమైనవి కొను ఆనందంగా బ్రతుకు గుప్పెట తెరువు రహస్యాలు చూడు తెలుసుకో నిజము మార్చుకో తీరు సరిదిద్దుకో కాపురము పుస్తకాలు తెరువు పుటలు తిప్పు ఙ్ఞానాన్ని పొందు మదులను వెలిగించు చైతన్యవంతుడివి అగు మనసు తెరువు మెదడును వాడు తలపులు పారించు అనుభూతులు పొందు కమ్మనికవితలను కూర్చు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం