హృదయ విదారకం (కరోనా కష్టాలు) నేను చదివా నేను చదివా కరోనా తెచ్చిన కడుకష్టాలను బరువులభారంతో బహుదూర పాదనడకలను చిధ్రమైన చాలా జీవితగాధలను నేను చదివా నేను చదివా నేను చూచా నేను చూచా పనులు లేక పైసలు లేక పస్తులున్న పలువురుని నేను చూచా నేను చూచా నేను విన్నా నేను విన్నా ఆకలి కేకలను అడుక్కొనేవారి ఆర్తానాదాలను అలమటించేవారి బ్రతిమలాటలను నేను విన్నా నేను విన్నా నేను వ్రాశా నేను వ్రాశా బీదల పాట్లను బడుగుల బాధలను బోరు విలాపాలను నేను వ్రాశా నేను వ్రాశా నాకు తెలుసు నాకు తెలుసు బండరాళ్ళు కరుగవని ఎడారిలో మొక్కలు మొలవవని క్రూరమృగాలు కరుణించవని నాకు తెలుసు నాకు తెలుసు తలచుకుంటే నాఒళ్ళు కంపిస్తుంది నాకళ్ళు చెమ్మగిల్లుతున్నాయి నానోరు తడబడుతుంది నాకాళ్ళుచేతులు కదలకున్నాయి నామనసు దుఃఖిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Posts
Showing posts from September, 2022
- Get link
- X
- Other Apps
వరాలతెలుగు తెలుగుకు వెలుగులిస్తే విరిలావికసిస్తా తెలుగుకు మెరుగులుదిద్దితే మురిసిపోతా తెలుగుకు సొబగులద్దితే సంబరపడతా తెలుగుకు తీపినిపూస్తే తక్షణమాస్వాదిస్తా తెలుగుకు పట్టాభిషేకంచేస్తీ పెద్దగాజైకొడతా తెలుగును తేటతెల్లంచేస్తే తృప్తిపడతా తెలుగుకు పెద్దాసనంవేస్తే పరవశిస్తా తెలుగును లెస్సంటే మిడిసిపడతా తెలుగును తేనెయంటే తన్మయపడుతా తెలుగు శ్రావ్యమంటే సంకలెగరేస్తా తెలుగుకు జేజేలుకొడితే కంఠంకలుపుతా తెలుగును తలకెత్తుకుంటే తోడుగానిలుస్తా తెలుగును తళతళలాడిస్తే తనివితీరాచూచితరిస్తా తెలుగును తల్లియంటే తమ్ముడిగాతోడుంటా తెలుగును చిలికితే వెన్ననుబయటకుతీస్తా తెలుగును పూయిస్తే పరిమళాలుచల్లుతా తెలుగును పండిస్తే ప్రజలకందిస్తా తెలుగును పారిస్తే పొంగిపోతా తెలుగు తీరానికొస్తే ఆధిత్యమిస్తా తెలుగున అక్షరాలల్లితే పుటలకెక్కిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కాంచవోయి తెలుగోళ్ళదుస్థితి! తెలుగోళ్ళు రేపుతున్న వర్గవైషమ్యాలకు మోపుతున్న నిందాపనిందలకు తలవంచుకుంటున్నారు తెలుగోడి హృదయం అరుదైన ప్రియపలకరింపులకోసం కరువైన ప్రేమాభిమానాలకోసం తపిస్తుంది తెలుగోడి గుండె తల్లిభాషకు జరుగుతున్న అన్యాయాలకు తోటివారిపై జరుపుతున్న దుర్మార్గాలకు తలడిల్లిపోతుంది తెలుగోడి మనసు పాలకుల తలతిక్కపనులకు నాయకుల తిట్లకుబూతులకు ద్రవిస్తుంది తెలుగోడి మది ప్రాంతాల తిరోగమనానికి దిగజారిన ఆర్ధికస్థితిగతులకు బాధపడుతుంది తెలుగోడి గళం దుష్టరాజకీయ పన్నాగాలకు రేపుతున్న కులకుమ్ములాటలకు మూగపోయింది తెలుగోడి ప్రాంతం పెరుగుతున్న మత్తుపదార్ధాల వ్యాప్తికి పారుతున్న విచ్చలవిడి మద్యంసరపరాకు ఉడికిపోతుంది తెలుగోడి వోటు రాబోయే ఎన్నికలకోసం తేబోయే మార్పులకోసం నిరీక్షిస్తుంది తెలుగోడి కలం కత్తికంటే పదునుగా అగ్గికంటే ప్రకాశంగా కదులుతుంది ఓరి తెలుగోడా పరిస్థితి గమనించు చక్కగా ఆలోచించు సముచిత నిర్ణయంతీసుకో ఓరి ఆంధ్రుడా కుల కుంపట్లకు మత విద్వేషాలకు లోనుకాకురా ఓరి త్రిలింగదేశస్థుడా ప్రగతి సాధనకు జాతి పరిరక్షణకు పాటుపడరా ఓరి తెనుగోడా కాకతీయుల కీర్తిని శాతవాహనుల శక్తిని వారసుడిగా నిలుపరా గుండ్లపల...
- Get link
- X
- Other Apps
జడివాన వానను చూడండి బాల్యానికి వెళ్ళండి జడివానను వీక్షించండి వానపాటను స్మరించుకోండి జడివానలో తడవండి ముద్దయి మురిసిపోండి జోరువానను కళ్ళారాచూడండి హోరుగాలిని చెవులారావినండి చిరుకప్పలను కాంచండి కప్పలబెకబెకలను వినండి చిటపటపడే చినుకులనువినండి ఆనందములో మునిగిపోండి నీలిగగనాన్ని కనండి నీటినిదోసిల్లలో పట్టుకోండి ఉరుములకు చెవులుమూసుకోండి మెరుపులకు కళ్ళుమూసుకోండి మేఘాలను చూడండి మదిని మురిపించండి హరివిల్లును చూడండి ఫొటోలను తీయండి అందాలను చూడండి ఆనందమును పొందండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవిగారి మనసు కవిగారి మనసు ఊగిసలాడుతుంది ఉయ్యలలూగుతుంది కవిగారి ఊహలు ఉరుకుతున్నాయి ఊరిస్తున్నాయి కవిగారి అక్షరాలు అల్లుకుంటున్నాయి అలరిస్తున్నాయి కవిగారి పదాలు పారుతున్నాయి పొసగుతున్నాయి కవిగారి భావాలు బయటకొస్తున్నాయి భ్రమలోపడేస్తున్నాయి కవిగారి కలము పరుగెత్తుతుంది పుటలపైగీస్తుంది కవిగారి కవితలు గాలిలా వీస్తున్నాయి నీరులా ప్రవహిస్తున్నాయి కవిగారి పాటలు వినోదపరుస్తున్నాయి వీనులకువిందునిస్తున్నాయి కవిగారి పలుకులు తేనెలుచిందుతున్నాయి తేటతెలుగును తలపిస్తున్నాయి కవిగారి కూర్పులు అద్భుతము అమోఘము కవిగారి ప్రాసలు సుందరము శ్రావ్యము కవిగారి కల్పనలు కమనీయము కడువిచిత్రము కవిగారు అందరికి అందాలుచూపిస్తున్నారు ఆనందంకలిగిస్తున్నారు కవిగారు అందరి అంతరంగాలుతడుతున్నారు ఆశ్చర్యపరుస్తున్నారు కవిగారి మనసు కవితా సాగరమా కావ్య రత్నగర్భమా యనుచు పాఠకలోకం భావిస్తుంది సాహిత్యప్రపంచం విస్తుపోతుంది కవులకు జేజేలు కవుల ఆలోచనలకు జేజేలు కవుల వ్రాతలకు జేజేలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నేటి నేతలు మేక గడ్డి తింటుంది ఎద్దు మేత మేస్తుంది గుర్రం దానా తింటుంది నేత డబ్బును తింటాడు పేను తలపై పెత్తనంచేస్తుంది నల్లి మంచంపై పెత్తనంచేస్తుంది శునకం తనవీధిపై పెత్తనంచేస్తుంది నేత ప్రజలపై పెత్తనంచేస్తాడు పిల్లికి పాలుకావాలి జలగకు రక్తంకావాలి కొంగకు చేపలుకావాలి నేతకు వోట్లుకావాలి ఉన్నవారు బ్రాందీవిస్కీ త్రాగుతారు లేనివారు సారాయికల్లు త్రాగుతారు తుమ్మెదలు పూలతేనెను త్రాగుతాయి నేతలు ప్రజలరక్తం త్రాగుతారు రోగి వ్యాధి తగ్గాలనుకుంటాడు వరాహం బురద కోరుకుంటుంది కడుపుకాలేవాడు అన్నం కావాలనుకుంటాడు నేత పేరుప్రఖ్యాతులు కోరుకుంటాడు త్రాగినోడు మత్తులో తెలియక మాట్లాడుతాడు నేత వోట్లకోసం తెలిసీ నెరవేర్చలేనిహామీలిస్తాడు నేతలను విశ్వసించకండి నేతలమాటలను నమ్మకండి నేతలను దారికితీసుకురండి దేశాన్ని బాగుచేయండి మంచినేతలు క్షమించాలి దుష్టనేతలు పంధామార్చుకోవాలి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలబంధం ననలు నన్ను బంధిస్తున్నాయి నాతో కవితలువ్రాయిస్తున్నాయి ఎందుకో? కుసుమాలు కనబడితే కవితపుట్టకొస్తుంది ఎందుకో? పూలు తలపుకొస్తే భావాలు బయటకొస్తున్నాయి ఎందుకో? పూలు పరిమళాలుచల్లితే ప్రోత్సాహించినట్లుంటుంది ఎందుకో? అరులు అందాలను ఆరబోస్తే ఆలోచనలు పరుగెత్తుతున్నాయి ఎందుకో? పువ్వులు పెటపెటలాడుతుంటే పడతి ప్రాయానికొచ్చినట్లుంటుంది ఎందుకో? విరులు విచ్చుకుంటే మనసు మురిసిపోతుంది ఎందుకో? ననలు నలిగితే నాకు జాలివేస్తుంది ఎందుకో? విరులు వాడిపోతే విచారం కలుగుతుంది ఎందుకో? పూలు పుడమిపైరాలితే ప్రాణాలు గాలిలోకలిసినట్లనిపిస్తుంది ఎందుకో? పూలకవితలతో పులకరింపజేస్తా అక్షరసౌరభాలతో అలరింపజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగుజాతి ఆంధ్రుల అక్షరములు ముత్యాలు పలుకులు తేనెచుక్కలు ఆంధ్రా ఆడువారు అందగత్తెలు మగవారు మహావీరులు ఆంధ్రుల సాహిత్యము అతిరమణీయము సంగీతము కడుశ్రావ్యము ఆంధ్రుల జాతిచరితములు ప్రాచీనములు సంప్రదాయాలు సుసంపన్నములు ఆంధ్రుల వ్యవసాయము విశిష్టము ఫలసాయము బహునాణ్యము ఆంధ్రులు ఆరంభకార్యములందు అత్యుత్సాహులుశూరులు అంత్యదశయండు అలసత్వపరులు ఆంధ్రా పౌరుషాలకు పోరుగడ్డ వైషమ్యాలకు పురిటిగడ్డ అంధ్రులు చదువుసంధ్యలందు ఆసక్తిపరులు వృత్తిప్రవృత్తులందు నమ్మకస్థులు అంధ్రులు పంతాలుపట్టింపులు కలవారు ఆత్మగౌరవము అధికముగానున్నవారు ఆంధ్రులు నడతలందు ముక్కుసూటిగా నడిచేవారు వెళ్ళవద్దన్నదారుల విర్రవీగుతూ వెళ్ళేవారు ఆంధ్రులు భోజనప్రియులు పంచభక్ష్యాలు ఆవకాయతోడు గోంగూరనూతిను ఆంధ్రులు అమ్మభాషకన్నను ఆంగ్లభాషను అభిమానించువారు ఆదరించువారు ఆంధ్రులు తోటివారి ఎదుగుదలను సహించలేకుండువారు పడత్రోయుటకు పరాయవారితోను చేతులుకలుపువారు ఆంధ్రులార మనచరిత్రను చదవండి మంచిగుణపాఠాలను ఎరగండి మనవారికోసం పాటుపడండి మనకీర్తిని విశ్వవ్యాప్తంచెయ్యండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మీరూ కలుస్తారా! జీవితగమనాన బ్రతుకుపోరాటాన జనసముద్రాన పయనించలేకున్నా వంకరటింకర దారిలో వెళ్ళలేకున్నా రాళ్ళరప్పల మీదగా నడవలేకున్నా నదీనదాల్లాంటి అడ్డులను దాటలేకున్నా ఎత్తైనకొండల్లాంటి ఆశయాలను చేరలేకున్నా కీకర జనారణ్యాలలో తిరగలేకున్నా నరరూపమృగాలతో వేగలేకున్నా కటికచీకటిలో కాలు కదపలేకున్నా కడలిలాంటి జీవితంలో సంసారాన్ని ఈదలేకున్నా తోడులేకుండా ఉండలేకున్నా నీడలేకుండా బ్రతుకలేకున్నా కర్ణకఠోరాలను వినలేకున్నా ద్వేషదౌర్జన్యాలాను చూడలేకున్నా విషనాగుల మధ్య జీవించలేకున్నా స్వార్ధనేతల మధ్య ఇమడలేకున్నా ముళ్ళకిరీటాన్ని పెట్టుకోలేకున్నా అవినీతిపరుల ఆటలను అరికట్టలేకున్నా వ్యధలను చెప్పలేకున్నా బాధలను భరించలేకున్నా నాకు వెలుగు కావాలి తోడు కావాలి లోకశాంతి కావాలి ప్రజలసౌఖ్యం కావాలి మీరు సహకారం అందిస్తారా రంగములోకి దిగుతారా అన్యాయాలను ఎదిరిస్తారా అక్రమార్కుల ఆటలుకట్టిస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలు పిలిచాయి పూలు పిలిచాయి పరవశించా తోటలోనికి ప్రవేశించా మల్లె సిగ్గుపడింది ముచ్చటపడ్డా పరిమళం చల్లింది ఆఘ్రానించా గులాబి రమ్మంది చెంతకువెళ్ళా గుసగుసలాడీంది సంతసపడ్డా మందారం ఆహ్వానించింది ధన్యవాదాలుచెప్పా మత్తెక్కించింది మనసుపడ్డా చామంతి చూచింది సోయగాలుచూచా సరసాలాడింది సంబరపడ్డా బంతి బహుబాగున్నది చేతిలోనికితీసుకున్నా పులకరించిపోయింది మెల్లగానిమిరా కనకాంబరం కులికింది కుతూహలపడ్డా అందాలు ఆరబోసింది ఆనందపడ్డా సన్నజాజి స్వాగతించింది సమీపానికివెళ్ళా సుగంధంచల్లింది ధన్యవాదాలుచెప్పా సంపంగి సమీపానికొచ్చింది చేతిలోకి తీసుకున్నా సువాసనలుచిందింది సంతోషంలోమునిగిపోయా పూలప్రేమకు పొంగిపోయా పూవులపైన కవితవ్రాశా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పువ్వా ఓపువ్వా! పువ్వా పువ్వా నీ నెలవెక్కడా తోటా కాదు కాదు పువ్వా పువ్వా నీ తావెక్కడా మొక్కలుకొమ్మలా కాదు కాదు పువ్వా పువ్వా నీ వాసమెక్కడా పడుతులతలలా కాదు కాదు పువ్వా పువ్వా నీ స్థావరమెక్కడా పరమాత్మునిపాదాలా కాదు కాదు పువ్వ పువ్వా నీ నిలయమెక్కడా ప్రజలమనసులా కాదు కాదు పువ్వా పువ్వా నీ నివాసమెక్కడా విగ్రహాలుపటాలా కాదు కాదు పువ్వా పువ్వా నీ ఆవాసమెక్కడా కవులుకవితలా ఔను ఔను పూలమనసు తెలుసుకో పూలభాష నేర్చుకో పూలసొగసు క్రోలుకో పరిమళాల పీల్చుకో పూలంటే నాకిష్టం నేనంటే పూలకిష్టం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అక్షరసత్యాలు రాజేంద్రమాటలు వినవయ్యా అక్షరసత్యాలు కనవయ్యా నవ్వించేవారు కొంతమంది ఏడిపించేవారు మరికొంతమంది ఇచ్చేవారు కొంతమంది దోచేవారు మరికొంతమంది నిజాలుచెప్పేవారు కొంతమంది అబద్ధలాడేవారు మరికొంతమంది ప్రేమించేవారు కొంతమంది ద్వేషించేవారు మరికొంతమంది వియ్యమాడేవారు కొంతమంది కయ్యమాడేవారు మరికొంతమంది అన్నితెలిసినవారు కొంతమంది ఏమితెలియనివారు మరికొంతమంది ముందుకునడిపేవారు కొంతమంది క్రిందకుత్రోచేవారు మరికొంతమంది మంచివారు కొంతమంది చెడ్డవారు మరికొంతమంది ఉండిలేనివారు కొంతమంది లేకయున్నవారు మరికొంతమంది వ్రాసేవారు కొంతమంది చదివేవారు మరికొంతమంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓ చిలిపికనుల చినదానా! చిలిపికనుల చినదానా ఎర్రబుగ్గల నెఱజాణా కులుకుతున్న కుర్రదానా సొగసులున్న సుమబాలా ఆచూపులోన అందాలు విసిరావె ఆమోములోన ఆనందాలు చిందావె ఆకళ్ళలోన కాంతులు చూపావె ఆనవ్వులోన ఆశలను తెలిపావె తలుపుప్రక్కన తిన్నగానిలిచావె తళతళలాడుతు తన్మయత్వపరిచావె చూపులువిసిరేవె కవ్వించావె కట్టిపడేశావె కుతూహలపరచావె తెల్లచీరకట్టి నల్లరవికతొడిగి అందాలుచిందావె ఆనందమిచ్చావె వాలుజడవేసి వయ్యారాలొలికి వలపువలవిసిరి వినోదపరచావె మెడలోన హారమేసి చేతికి గాజులుతొడిగి చెవులకు కమ్మలుపెట్టి బంగారుఛాయలో వెలిగావె కళ్ళకు కాటుకపెట్టి నుదుటన బొట్టునుపెట్టి పెదాలకు రంగునుపూసి సోయగాలు చూపావె ఫోజునుపెట్టి ఫొటోలుదిగి పొంకాలుచూపి ప్రేమలోదించావె ప్రేమగా పిలిస్తే పలుకుతానె మరుక్షణం కోరికి తెలిపితే కలుస్తానె తక్షణం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ఆచిన్ని బొమ్మపై అతిపెద్ద కవిత ఆందాల రాశిపై అపరూప వర్ణన చదవండి సమయంవెచ్చించండి సంతసపడండి చిత్తములోనిలుపుకోండి కవిని తలవండి మనసున నిలుపుకోండి
- Get link
- X
- Other Apps
మనతెలుగు వెలుగులు నన్నయ్య నట్టింటపుట్టి నడయాడి తిక్కన ఘంటాన తియ్యందనమయి పోతన పద్యాలలో పోతపోసుకొని మనతెలుగు ప్రఖ్యాతిపొందింది ధూర్జటి కావ్యాలలో దద్దరిల్లి అల్లసాని అక్షరాలతో అలరించి రాయలచేత లెస్స యనిపించుకొని మనతెలుగు ఘనకీర్తి గడించింది శ్రీనాధ ప్రబంధాలలో శ్రంగారమయి తిరుపతి కవులనోట తీపిపద్యాలయి బళ్ళారి నాటకరంగాన అజరామరమయి మనతెలుగు నందనవనమయి నిలిచింది గురజాడ చేతిలో ముత్యాలసరమయి గిడుగు పుణ్యాన వ్యావహారికమయి రాయప్రోలు కలాన తృణకంకణమయి మనతెలుగు దేదీప్యమానమై మెరిసింది విశ్వనాధ చేతిన వేయిపడగలయి నండూరికలాన అమాయక యెంకయి జాషువా కవనాన గబ్బిలమయి మనతెలుగు మనసులను దోచింది దేవులపల్లి కలాన భావకవితలయి దాశరధి చేతిలో రసరమ్యగీతాలయి పుట్టపర్తి పేరున పెనుకొండలక్ష్మయి మనతెలుగు వెలుగులను చిమ్మింది సినారె సాహిత్యాన విశ్వంభరమయి కరుణశ్రీ నోట పుష్పవిలాపమయి చలం ఊహలలోన మైదానమయినిలిచి మనతెలుగు మన్ననలను సంపాదించింది వేమన పద్యాలలో విశ్వవ్యాప్తమయి బద్దెన సుమతీశతకాన హితములయి శ్రీశ్రీ వ్రాతలలో మరోప్రపంచమయి మనతెలుగు లోకాన వాసికెక్కింది చక్కగ పదాలనుపారించి చేర్చికూర్చి ఇంపుగసొంపుగ అక్షరాలను పొదిగి పాటలను కవితలను ప్రీతి...
- Get link
- X
- Other Apps
నా కవిత ఎన్నాళ్ళ కెన్నాళ్ళకొచ్చావె కవిత ఎదురుగా నిలిచావె కవిత ఏమేమోవిషయాలు చెప్పావె కవిత ఎదను దోచేసేవె కవిత కళ్ళకు కాంతులిచ్చావె కవిత చెవులకు శ్రావ్యతనిచ్చావె కవిత చేతికి అరటిపండునిచ్చావె కవిత తృప్తిగా ఆరగించమన్నావె కవిత కవ్వించి నిలిచావె కవిత ఊహలను పారించావె కవిత భావాలు బయటపెట్టమన్నావె కవిత మదినితట్టి మురిపించావె కవిత అందాలు చూపావె కవిత ఆనందమిచ్చావె కవిత అక్షరాలు అందించావె కవిత పదాలను పారించావె కవిత కోకిలగానం వినిపించావె కవిత నెమలినృత్యం చూపించావె కవిత పచ్చదనం పుడమికికప్పావె కవిత కవనం సాగించమన్నావె కవిత పండువెన్నెల కురిపించావె కవిత చల్లగాలి వీయించావె కవిత కలము చేతికిచ్చావె కవిత కాగితాలు నింపించావె కవిత పూదోటకు తీసుకెళ్ళావె కవిత పూలమధ్య తిప్పించావె కవిత పొంకాలను చూపించావె కవిత పరిమళాలని వెదజల్లావె కవిత ఆకాశానికి ఎగిరించావె కవిత మేఘాలలో విహరింపజేశావె కవిత తారలతళుకులు చూపించావె కవిత వానజల్లులు కురిపించావె కవిత తెలుగుగొప్పదనమును చెప్పావె కవిత తెలుగుతీయదనమును చూపావె కవిత తెలుగును వెలిగించమన్నావె కవిత తెలుగులోకవనం చేయమన్నావె కవిత నా కవిత నా సొత్తు నా పొత్తు నా మత్తు నా పలుకు నా క...
- Get link
- X
- Other Apps
నవ్యాంధ్ర కథకమామిషు గుంటూరు మిరపకాయ ఘాటుకారానికి ప్రతిరూపం ఒంగోలు కోడె బలపరాక్రమానికి నిదర్శనం నెల్లూరు నెఱజాణ నాతులలో తెలివికితలమానికం అనంతపురం క్షామప్రాంతం అతితక్కువ వర్షపాతప్రదేశం కడప బాంబులు జనాలకు భయకంపితం కర్నూలు కక్షలకుముఠాలకుపేరు ఆధిపత్యానికి పోరాడుస్థలం చిత్తూరు బాలాజి కలియుగానికి దైవం క్రిష్ణా ప్రవాహం అభివృద్ధికి మూలం గోదావరి యాస వినటానికి విచిత్రం విశాఖ నౌకాశ్రమం ఇనుపఖనిజ ఎగుమతులస్థానం విజయనగరం కోట గజపతులేలిన రాజ్యం శ్రీకాకుళం అడవులు నక్సలైట్లకు స్థావరం రాయలసీమ ప్రాంతం పౌరుషాలకు జన్మస్థలం దక్షిణ అంధ్ర పాడిపంటలకు ప్రసిద్ధం మధ్య ఆంధ్ర పారిశ్రామికవేత్తల క్షేత్రం కోనసీమ కాంచ కొబ్బరితోటల తీరం ఉత్తర ఆంధ్ర వెనుకబడిన ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరం అందరూ ఆలోచించండి సమస్యలు విశ్లేషించండి పరిష్కారాలు చూపండి ప్రజలను ఉద్ధరించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగుపాట (గేయము) మధురం మధురం మధురం తెలుగుగళం బహుమధురం అజంతం మహాశ్రావ్యం రాగానుకూలం రమ్యం తెలుగుపాట అతిసుందరం తెలుగుమాట కడుమధురం తెలుగునోట కురియుఅమృతవర్షం తెలుగునాట నిలుచుఅమరగానం పల్లెపాట జానపదం పారద్రోలు పనిభారం పట్టణపాట వినోదభరితం పంచిపెట్టు ప్రమోదం కవులకుపాటలిచ్చు ప్రేరణం కవ్వించివ్రాయించు కవిత్వం కవులకవనం కమనీయం కవిసమ్మేళనం కడుగుల్యం ఆంధ్రులపద్యం అద్భుతం ఆసాంతం గణాలకూటం తెలుగునాటకం చూడచోద్యం తెలుగొళ్ళఅభినయం అభినందనీయం తెలుగుమాండలీకం ప్రాంతాలకుప్రత్యేకం తెలుగుయాసవేషం విభిన్నంవిచిత్రం భావకవిత్వం భాసిల్లునిరంతరం ప్రణయకవిత్వం పంచునానందం త్యాగయ్యసంగీతం రాగాలసుసంపన్నం అన్నమయ్యకీర్తనం శ్రీహరివాసధ్యానం రామదాసురాగం భద్రాచలస్ఫురణం క్షేత్రయ్యపదం మొవ్వగోపాలమననం ఘంటసాలగళం గాంధర్వగానసమం అమృతతుల్యం ఆనందదాయకం బాలూకంఠం మధురాతిమధురం కర్ణాలకుప్రియం కలిగించువినోదం మధురం మధురం మధురం తెలుగుగళం బహుమధురం అజంతం మహాశ్రావ్యం రాగానుకూలం రమ్యం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగుభేరి నేనూ తెలుగుభేరీని సాహిత్యలోకాన మ్రోగించాను! నేనూ తెలుగుతల్లికి కర్పూరహారతి నిచ్చాను! నేనూ తెలుగుసాహిత్యాన దీపమొకటి వెలిగించాను! నేనూ తెలుగుభాషకీర్తిని ఢంకాభజాయించి చెప్పాను! నేనూ తెలుగురుచిని తోటివారికి పంచిపెట్టాను! నేనూ తెలుగుతీపిని అఆలపై వెదజల్లాను! నేనూ తెలుగుశతకమొకటి కలియుగశతకముపేరున వ్రాశాను! నేనూ తెలుగుప్రాసలను వచనకవితలలో పారించాను! నేనూ తెలుగువెలుగులను అంతర్జాలసమూహాలలో పెట్టాను! నేనూ తెలుగుఖ్యాతిని వివిధకవితలలో చాటిచెప్పాను! నేనూ తెలుగుమాటలను పరరాష్ట్రాలవారిచే పలికించాను! నేనూ తెలుగుతోటలో పూలనుపూయించి సౌరభాలనువెదజల్లాను! నేనూ పలుతెలుగువారలను పదప్రయోగాలతో పరవశింపజేశాను! నేనూ తెలుగుఅందాలను భావకవితలలో చూపించాను! నేనూ తెలుగుమట్టిలోనే కడకు కలసిపోతాను! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కమ్మని కబుర్లు కమ్మనికబుర్లు చెప్పనా తీపిజిలేబీలు తినిపించనా పెదవులకు అమృతంఅద్దుకోనా పలుకులకు తేనెచుక్కలురాసుకోనా పిండి వెన్నెలను కాయించనా చల్లని గాలిని వీయించనా చక్కని అందాలను చూపనా మనసుకు ఆనందమును కలిగించనా సుమధుర కవితలను వ్రాయనా చదువరుల మదులను దోచుకోనా ప్రకృతిని పదాలలో పెట్టనా కళ్ళను వెలుగులతో నింపనా కలమును కరమున పట్టనా ఆలోచనలను అక్షరాలలో పెట్టనా నవరసాలను పండించనా ఆరురుచులను అందించనా సంగీతమును వినిపించనా సాహిత్యమును చదివించనా నేటిభారతాన్ని వినిపించనా నేతిగారెలను తినిపించనా విందుభోజనానికి పిలవనా వినోదాన్ని పంచనా తెలుగుఖ్యాతిని చాటనా సాహిత్యలోకాన్ని సంబరపరచనా కవనజల్లులను కురిపించనా కవితాప్రవాహాన్ని కొనసాగించనా మరలా మరలా మిమ్ముల చదివించనా మనసుల తట్టీముట్టీ మననం చేయించనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ముక్కుసూటిగా నడుస్తా! ఏఎండకు ఆగొడుగు ఎత్తను మదిలోని అభిప్రాయాలను మార్చను అన్యాయాలు చేసేవారిని మెచ్చను అబద్ధాలు చెప్పేవారిని నచ్చను అవినీతికి పాల్పడేవారిని వ్యతిరేకిస్తాను అక్రమాలు చేసేవారిని ఆపేస్తాను గొప్పలుచెప్పేవారిని నోర్లుమూయిస్తాను గోతులుతీసేవారిని గట్టిగాఎదిరిస్తాను స్వార్ధపరుల పనిపడతాను సొమ్ముకాజేసేవారల ఆటలుకట్టిస్తాను నాటకాలు ఆడేవారిని నిలదీస్తాను నమ్మకద్రోహం చేసేవారిని నిలబెడతాను కోతలు కోసేవారి చిట్టాలు బయటపెడతాను రాద్ధాంతం చేసెవారి గుట్టును రట్టుచేస్తాను యదర్ధవాది లోకవిరోధి అనేసామెతను నిజమేనంటాను తప్పనుకుంటే నిలదీయొచ్చు ఒప్పనుకుంటే సమర్ధించొచ్చు ముక్కుసూటి మనస్తత్వం కలవాడను మనసులోనున్నవిషయాన్ని మాటల్లో చెబుతాను ఆలోచనలను లేపితే ఆనందిస్తాను మనసులను తడితే మురిసిపోతాను మంచిభావము ముఖ్యమంటాను పదప్రయోగము ప్రాముఖ్యమంటాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ప్రేమికుల సరసాలు (యుగళగీతం) అతడు: ఓ పిల్లా... పువ్విస్తే ఏమిచేస్తావు నవ్విస్తే ఏమిచేస్తావు ||పువ్విస్తే|| ఆమె: ఓ బావా... పువ్విస్తే తురుముకుంటాను నవ్విస్తే తిప్పికొడతాను ||పువ్విస్తే|| అతడు: ఓ పిల్లా... కాసులిస్తే ఏమిచేస్తావు కోకలిస్తే ఏమిచేస్తావు ఆమె: ఓ బావా... కాసులిస్తే దాచుకుంటాను కోకలిస్తే కట్టుకుంటాను అతడు: ఓ పిల్లా... చాటుకురమ్మంటే ఏమిచేస్తావు పాటుకురమ్మంటే ఏమిచేస్తావు ఆమె: ఓ బావా... చాటుకురమ్మంటే చటుక్కునవస్తాను పాటుకురమ్మంటే పరువాలారబోస్తాను అతడు: ఓ పిల్లా... రమ్మంటే ఏమిచేస్తావు పొమ్మంటే ఏమిచేస్తావు ఆమె: ...
- Get link
- X
- Other Apps
చిన్నవని ఉపేక్షించకు నిప్పురవ్వలు కోట్లాస్తులను బూడిదచేస్తాయి చిన్నవని ఉపేక్షించకు నీటిచుక్కలు మహాసముద్రాలను సృష్టిస్తాయి మూలాలు తెలుసుకో అక్షరాలు గొప్పకావ్యాలను ముందుంచుతాయి విలువలు కనుక్కో చిన్నవిత్తనాలు పెనువృక్షాలుగా ఎదుగుతాయి నగ్నసత్యాలను ఎరుగు పరమాణువులు భీకరవిస్పోటాలను కలిగిస్తాయి చిన్నవని నిర్లక్ష్యంచేయకు చిన్నకోర్కె పెద్దపనులు చేయిస్తుంది ఆశయాలను ఏర్పరుచుకో ఉడుతసాయం దేవుని ఆకర్షించింది చిన్నసాయాలనయినా అందించు చిన్నపామైనా కరిసి విషంతోచంపుతుంది అశ్రద్ధ వహించకు పైసాలుదాస్తే వేలకువేలు కూడతాయి పొదుపుచెయ్యటం మొదలుపెట్టు చిన్నచీమలైనా పామును చంపేస్తాయి ఐకమత్యమేబలమని తెలుసుకో గడ్డిపోచలైనా గజమును బంధిస్తాయి వాస్తవాన్ని గ్రహించు చిన్నదని ఏమారకు పెద్దదని భయపడకు ప్రణాళికతో పయనించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవిత్వం కవిత్వం కటికచీకటిలోనూ వెలుగులు చిమ్మాలి దారిని చూపాలి ముందుకు నడపాలి కవిత్వం అఙ్ఞానులసహితమూ చదివించాలి సంతసపరచాలి స్పందింపజేయాలి కవిత్వం అంధులకుకూడా అందం చూపాలి ఆనందం కలిగించాలి సందేశం ఇవ్వాలి కవిత్వం చెవిటివారికీ శ్రావ్యంగా వినిపించాలి మనసుల మురిపించాలి భాషాభిమానం కలిగించాలి కవిత్వం నిత్యమూ సూర్యునిలా వెలుగుతుండాలి జాబిలిలా వెన్నెలవెదజల్లుతుండాలి భూమిలా భ్రమణంకొనసాగిస్తుండాలి కవిత్వం మనసులనుమీటి ఆలోచనలను పారించాలి అంతరంగాన్ని మదించాలి ఆశయాలను రేకెత్తించాలి కవిత్వం అందరినీ ఆడించాలి పాడించాలి ఓలలాడించాలి కవిత్వం పాఠకుల కళ్ళను తెరిపించాలి నిజాలను చూపించాలి నీతిమార్గాన నడిపించాలి కవిత్వం శాశ్వతమై మనుగడ కొనసాగించాలి మననం చేయించాలి కవులను తలపించాలి కవిత్వం అద్బుతం అమరం అనంతం అపరూపం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓరి తెలుగోడా! (గేయము) చెయ్యెత్తి గళమెత్తి జైకొట్టు తెలుగోడా చరిత్ర పుటలందు బహుఖ్యాతి కలవాడా తెలుగుగేయము పాడరా తియ్యదనము పంచరా తెలుగుకవిత్వము వ్రాయరా తన్మయత్వము కలిగించరా తెలుగుదనము చూపరా తెల్లవారువెలుగు తలపించరా తెలుగుపతాకము ఎత్తరా తెలుగుగొప్పదనము చాటరా తెలుగుపొలాలు సారవంతమైనవని చెప్పరా తెలుగుపంటలు కడునాణ్యమైనవని తెలపరా తెలుగుతోటను పెంచరా తెలుగుపూలను పూయించరా తెలుగుసొగసులు చూపించరా తెలుగు పరిమళాలు వెదజల్లరా తెలుగోళ్ళవెన్ను తట్టరా తోటివాళ్ళతృష్ణను తీర్చరా తెలుగుబాషను తలకెత్తుకోరా తెలుగుతలమానికమని తెలుపరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
విశృంఖలాలు నోటికి హద్దూలేదు పద్దూలేదు తలచిందే తడవుగా తూటాలుగా మాటలుప్రేలుస్తుంది వాన చినుకుల్లా ప్రేమజల్లులు కురిపిస్తుంది వసంత కోకిలలా గానామృతం చిందిస్తుంది సుమతీ శతకకర్తలా నీతిని బోధిస్తుంది మనసుకు పగ్గాలులేవు సంకెళ్ళులేవు గాలి వీచినట్లుగా ఆలోచనలు పరుగెత్తుతాయి ఆకాశంలో మేఘాల్లా ఉరుముతాయి మెరుస్తాయి రెక్కలిప్పిన పక్షుల్లా ఎగురుతాయి విహరిస్తాయి కోర్కెలు తీర్చుకోటానికి కవ్విస్తాయి కష్టపెడతాయి కవికలానికి అవధులులేవు అదుపులులేవు భావాలు పుడితే బయటకొచ్చి పొంగిపొర్లుతాయి అక్షరాలు ముత్యాలుగా అల్లుకుంటాయి పేరుకుంటాయి పదాలు ప్రాసలతో పొసగుతాయి పరుగులుతీస్తాయి ఆయస్కాంతపు శక్తిలా మనసులనుతాకుతాయి తృప్తిపరుస్తాయి కవితలకు కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అనర్హంకాదు పద్యాలు యతిప్రాసలతో అలరిస్తాయి వచనకవితలు భావగర్భితమై వెలుగుతాయి గేయాలు గంధర్వగానాన్ని వినిపిస్తాయి పలుప్రక్రియలు సాహిత్యలోకాన ప్రవహిస్తాయి సాహితి అందాలుచూపుతుంది ఆనందంకలిగిస్తుంది నదిలా ప్రవహిస్తుంది గాలిలా వ్యాపిస్తుంది కడలి అలల్లా ఎగిసిపడుతుంది జాబిలిలా వెన్నెలకాస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
విశృంఖలాలు నోటికి హద్దూలేదు పద్దూలేదు తలచిందే తడవుగా తూటాలుగా మాటలుప్రేలుస్తుంది వాన చినుకుల్లా ప్రేమజల్లులు కురిపిస్తుంది వసంత కోకిలలా గానామృతం చిందిస్తుంది సుమతీ శతకకర్తలా నీతిని బోధిస్తుంది మనసుకు పగ్గాలులేవు సంకెళ్ళులేవు గాలి వీచినట్లుగా ఆలోచనలు పరుగెత్తుతాయి ఆకాశంలో మేఘాల్లా ఉరుముతాయి మెరుస్తాయి రెక్కలిప్పిన పక్షుల్లా ఎగురుతాయి విహరిస్తాయి కోర్కెలు తీర్చుకోటానికి కవ్విస్తాయి కష్టపెడతాయి కవికలానికి అవధులులేవు అదుపులులేవు భావాలు పుడితే బయటకొచ్చి పొంగిపొర్లుతాయి అక్షరాలు ముత్యాలుగా అల్లుకుంటాయి పేరుకుంటాయి పదాలు ప్రాసలతో పొసగుతాయి పరుగులుతీస్తాయి ఆయస్కాంతపు శక్తిలా మనసులనుతాకుతాయి తృప్తిపరుస్తాయి కవితలకు కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అనర్హంకాదు పద్యాలు యతిప్రాసలతో అలరిస్తాయి వచనకవితలు భావగర్భితమై వెలుగుతాయి గేయాలు గంధర్వగానాన్ని వినిపిస్తాయి పలుప్రక్రియలు సాహిత్యలోకాన ప్రవహిస్తాయి సాహితి అందాలుచూపుతుంది ఆనందంకలిగిస్తుంది నదిలా ప్రవహిస్తుంది గాలిలా వ్యాపిస్తుంది కడలి అలల్లా ఎగిసిపడుతుంది జాబిలిలా వెన్నెలకాస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగు వెలుగుతుంది తెలుగోళ్ళకు తెలివొచ్చింది తెలుగుబాషకు వెలుగొచ్చింది తెలుగులో కవులు రోజూ పుట్టుకొస్తున్నారు తెలుగు ప్రక్రియలను బాగా ప్రచారంలోకితెస్తున్నారు తెలుగు కవితలు తెగవస్తున్నాయి తియ్యందనాలు తినిపిస్తున్నాయి తెలుగు పాఠకులు చదువుచున్నారు ప్రోత్సహిస్తున్నారు తృప్తినిపొందుచున్నారు తెలుగుబాష తీరుతెన్నులు మురిపిస్తున్నాయి మనసులతడుతున్నాయి తెలుగు కవిసమ్మేళనాలు వివిధ సాహిత్యకార్యక్రమాలు పలుచోట్ల జరుగుతున్నాయి విశేషఆదరణను పొందుతున్నాయి తెలుగుకు మంచిరోజులొచ్చాయి తెలుగువారికి సంతృప్తినిస్తున్నాయి తెలుగు తల్లికి జైజైలు కొడదాం తెలుగు బాషను విశ్వవ్యాప్తంచేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
గుణపాఠాలు అనుభవం నేర్పుతుంది పాఠం అవకాశం ఉపయోగించుకుంటే అదృష్టం అందం ఎక్కిస్తుంది అందలం ఆనందం శరీరానికిస్తుంది సగంబలం ఆరాటం చేయిస్తుంది పోరాటం అవమానం కోరుకుంటుంది ప్రతీకారం అనుమానం అవుతుంది పెనుభూతం అభిమానం ప్రేమకు మూలకారణం అనురాగం పంచుతుంది మమకారం అహంకారం కలిగిస్తుంది వినాశనం అసహనం అభివృద్ధికి ఆటంకం ఆరోగ్యం అందరికి మహాభాగ్యం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నేను బొమ్మనుచూచా భ్రమలోపడ్డా ఆలోచనలతో సతమతమయ్యా! కొమ్మనుచూచా గమ్మయిపోయా అందాలనుచూచా ఆనందంలోమునిగిపోయా రెమ్మనుచూచా చిత్తయిపోయా కోరికలతో కుస్తీచేశా లేమను చూచా లెస్సనుకున్నా మనసునువిప్పా ముచ్చటపడ్డా వామనుచూచా వశమయిపోయా వలపుసంకెళ్ళలో బంధీనయిపోయా శ్యామనుచూచా సంతసపడ్డా సరససల్లాపాలతో సమయంగడిపా హేమనుచూచా హాయనిపలకరించా మాటలుకలిపా చెలిమినిచేశా భామనుచూచా భ్రాంతిలోపడ్డా లేనిది ఉన్నట్లుతలచా భావకవితలను వ్రాశా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం