Posts

Showing posts from October, 2022
Image
 సాహితీ అవలోకనం అక్షరాలు అపారమైతే ఆలోచనలు అంబరమైతే కవితల లోతులుచూద్దాం కవనపు అంచులకెళ్దాం సాహిత్యం పర్వతమైతే కవిత్వం జలపాతమైతే శిఖరాలను అధిరోహిద్దాం వేగాన్ని అధిగమిద్దాం వ్రాతలు వృక్షములైతే కైతలు కుసుమములైతే కళ్ళారా వీక్షించుదాం మనసారా ముచ్చటపడదాం సాహిత్యభూమిలో నిధులుంటే సాహితీగగనంలో వెలుగులుంటే త్రవ్వివెలికితీసి పంచిపెడదాం తీసకొనివచ్చి అఙ్ఞానాంధకారాన్ని పారద్రోలదాం వాగ్దేవి వాక్కులిస్తే వాణీనాదం వినబడుతుంటే అందంగా పేరుద్దాం ఆనందంగా విందాం పెదవులు అమృతంచల్లితే పలుకులు తేనెలుచిందితే పావనంచేసి అమరులమవుదాం పట్టుకొనిచవిచూచి ఆనందిద్దాం కలలు కవ్విస్తుంటే కవితలు తడుతుంటే కలం చేతబడదాం కాగితాలపై చెక్కేద్దాం అందాలు కళ్ళముందుకొస్తే ఆనందం అందుకోమంటే పరికించి పులకిద్దాం పొంది  పుటలకెక్కిద్దాం కవితలు కమ్మగావుంటే క్రోలుకుందాం శ్రావ్యంగావుంటే చెవులారావిందాం పద్యకవులను ప్రోత్సహిద్దాం వచనకవితలను వర్ధిల్లజేద్దాం పాడి పరవశిద్దాం చదివి సంతసిద్దాం మహాకవుల వ్రాతలు చదువుదాం మనమూ కవితలు వ్రాసేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం అపారము= సముద్రము అంబరము= ఆకాశము అవలోకనము= విచారణ
Image
 ఓహో గులాబిబాలా! ఎర్రగానున్నది బుర్రగానున్నది ఏమరుస్తున్నది ఎదనుతట్టుచున్నది బొద్దుగానున్నది ముద్దుగానున్నది మయిమరుపిస్తున్నది ముచ్చటపరుస్తున్నది అందముగానున్నది ఆనందమునిస్తున్నది ఆశనుకలిగిస్తున్నది అంతరంగాన్నలరిస్తున్నది తోడుకొస్తానంటున్నది తీసుకొనిపొమ్మంటున్నది తొందరపెడుతున్నది తన్మయత్వపరుస్తున్నది వెలుగుతున్నది రగులుతున్నది తాజాగున్నది మోజుకలిగిస్తున్నది విచ్చుకొనియున్నది నచ్చుచున్నది మెచ్చుకోవాలనియున్నది కాచుకోమంటున్నది గుండెలోగుచ్చుచున్నది గుబులుపుట్టించుచున్నది గుసగుసలాడుదామంటున్నది గులపుట్టిస్తున్నది షోకుగానున్నది చూడమంటున్నది సిగ్గులొలుకుచున్నది సింగారించుకొనియున్నది రంగేసుకొనియున్నది రమ్యముగాయున్నది రమ్మనిపిలుస్తుంది రసఙ్ఞతనిస్తున్నది వేచియున్నది విరహములోనున్నది వేడుకచేస్తానంటున్నది వయ్యారలొలికిస్తున్నది చిత్రముగానున్నది చూడచక్కగాయున్నది చిత్తరువులాయున్నది చిత్తముదోచుచున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ఆగులాబి అదృష్టమేమో ఆవృత్తపుష్పపు వృత్తాంతమేమో ఆకుబ్జకముచేసుకున్న పుణ్యమేమో ఆరోజా ఆకర్షణకుకారణమేమో పువ్వుపంపిన పడతుకకు పువ్వులేపిన ఆలోచనలకు పుష్పకవితచదివిన పాఠకులకు...
Image
కవిగారి కవితలు లేత కొబ్బరిపలుకులు తీపి పంచదారచిలుకలు కమ్మని కాకినాడకాజాలు ఆత్రేయపురం పూతరేకులు కవిగారి కవితలు ప్రకృతి సహజసొగసులు పచ్చని కొండాకోనలు ప్రవహించే సెలయేర్లు నర్తించే నెమలులు కవిగారి కవితలు వికసించిన విరులు పరిమళించిన పూలు అలరిస్తున్న అలరులు ప్రకాశిస్తున్న పుష్పాలు కవిగారి కవితలు అక్షరాల అల్లికలు పదాల పొందికలు భావాల బహిర్గతాలు ప్రాసల ప్రయోగాలు కవిగారి కవితలు కొప్పులో పువ్వులు మోముపై నవ్వులు కాటుక కన్నులు నుదిటిపై బొట్టులు కవిగారి కవితలు చేతికిచ్చిన అరటికాయలు చెట్టునపండిన దోరజామపండ్లు పళ్ళెంలోవడ్డించిన పంచభక్ష్యాలు జుర్రుకోమంటున్న పాలతాలికలు కవిగారి కవితలు అక్షర కుసుమాలు అక్షర సౌరభాలు అక్షర ముత్యాలు అక్షర సత్యాలు కవిగారి కవితలు తినండి తృప్తిపడండి జుర్రుకోండి చప్పరించండి చూడండి చదవండి ఆలోచించండి మదిలోదాచుకోండి కవిగారి కవితలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రకృతిస్వగతం (ప్రకృతిపరవశం) తూర్పున తెల్లవారకముందే తరువులకు పూలుతొడుగుతా తళతళలాడే రంగులేస్తా తేనెచుక్కలతో నింపేస్తా తూర్పుదిక్కుకు రవినితీసుకొస్తా వెలుగులను చిమ్మిస్తా చీకటిని పారదోలతా ప్రాణులను మేలుకొలుపుతా పక్షుల నెగిరిస్తా కిలకిలారవములు చేయిస్తా కడుపులు నింపేస్తా ప్రజలను పనులకుపంపేస్తా అకాశానికి నీలిరంగునద్దుతా మేఘాలను సృష్టిస్తా ఉరుములురిమిస్తా మెరుపులుమెరిపిస్తా ఇంద్రధనస్సును చూపిస్తా వానలు కురిపిస్తా వాగులువంకలు పారిస్తా మొక్కలదాహం తీరుస్తా కాయలుకాయిస్తా పంటలుపండిస్తా పుడమిని పచ్చబరుస్తా కానలను పెంచేస్తా కొండాకోనల నలంకరిస్తా సెలయేర్లను జాలువారిస్తా విరులను వికసింపజేస్తా పరిమళాలను వెదజల్లుతా ప్రేమాభిమానాలు రేపుతా ప్రజలను పరవశపరుస్తా కోకిలలను కూయిస్తా నెమలుల నాడిస్తా మదులను దోచేస్తా ముచ్చట పరిచేస్తా నదీతీరాలకు నవ్యతనిస్తా కడలితీరాలను ముస్తాబుచేస్తా అలల నెగిరిస్తాపడవేస్తా  కనులకు కనువిందుజేస్తా సూరీడికి విశ్రాంతినిస్తా చీకటిని పిలుస్తా జాబిలిని పొడిపిస్తా వెన్నెలను కురిపిస్తా మదులను తట్టేస్తా మనుషుల నానందపరుస్తా నిద్రలోనికి పంపుతా అలసటలు తీరుస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసా...
Image
 చపలచిత్తము (నామనసు) మనసు ఉబలాటపడుతుంది అందచందాలను చూచి ఆస్వాదించి తీరాలని మనసు తిరుగుతుంది దొరికినదంతా దోచుకొని దొంతరలో దాచుకోవాలని మనసు కాచుకొనియున్నది ఎదురుపడిన దృశ్యాలనుకాంచి ఎదలో పదిలపరచుకోవాలని మనసు పరుగెత్తుతుంది పలాయిస్తున్న వాటిని పట్టుకొని బుట్టలోవేసుకోవాలని మనసు ముచ్చటపడుతుంది మంచిమాటలను విని మదిలో మూటకట్టుకోవాలని మనసు ద్రవిస్తుంది కష్టాలబారిన పడ్డవారి కడు కడగండ్లనుచూచి మనసు మండిపడుతుంది పాపాలు చేసేవారిని పట్టుకొని దండించాలని మనసు నవ్వుతుంది పువ్వుల పొంకాలనుచూచి పరిమళాలను ఆఘ్రానించాలని మనసు దుఃఖిస్తుంది మనుజులు మానవత్వాన్ని మరచిపోయి మెలగుతున్నారని మనసు మోహంలోపడింది అందాలను సొంతంచేసుకోవాలని ఆనందాన్ని పొందాలని మనసు భ్రాంతిలోపడింది ఉన్నవిలేనట్లు లేనివియున్నట్లుతలచి మహామాయలో చిక్కుకొని మనసు మురిసిపోతుంది నేలకప్పుకున్న పచ్చదనాన్నిచూచి నెత్తిమీది నీలిగగనాన్నికని మనసు చిక్కుకుంది ముసరుకున్న కోరికలవలకి మమతానురాగాల బంధానికి మనసు ఊగుతుంది ఊగుతున్న కొమ్మలపోలి ఊపిన ఉయ్యాలమాదిరి మనసు ఉవ్విళ్ళూరుతుంది మంచి కవితలువ్రాసి మహాకవిగా నిలవాలని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ప్రాసలకోస...
Image
 జీవనపయనాలు పెనుగాలి వీస్తుంటే భారీవర్షం కురుస్తుంటే నావను ఎక్కేదెట్లా నదిని దాటేదెట్లా పువ్వులు పూయకుంటే తేనె దొరకకుంటే తుమ్మెదలు త్రాగేదెట్లా బ్రతుకును వెళ్ళబుచ్చేదెట్లా పాలు పిండకుంటే కుండలో పోయకుంటే కవ్వంతో చిలకకుంటే వెన్నను తీసేదెట్లా కోర్కెలు పెరుగుతుంటే కోరినవి దొరకకుంటే మనసులు మదనపడుతుంటే లక్ష్యాలు సాధించేదెట్లా చీకటి ఆవరిస్తే దారి కనబడకుంటే తోడులేక ఒంటరిగుంటే జీవనపయనం సాగేదెట్లా కష్టాలు తరుముతుంటే కన్నీరు కారుతుంటే కాయాలు గాయపడితే కాపురాలు కాపాడుకునేదెట్లా కన్నకలలు కల్లలయితే గీసినచిత్రాలు చెదిరిపోతే అనుకున్నవి జరగకపోతే బ్రతుకుబండిని లాగేదెట్లా కళ్ళల్లో నిప్పురవ్వలుపడితే కాళ్ళల్లో ముల్లుగుచ్చుకుంటే కడుపులు ఖాళీగాయుంటే జీవననడక సాగుదీయుటెట్లా ఆలోచనలు పారకుంటే భావాలు బయటకురాకుంటే విషయాలు తట్టకుంటే కవులకవితలు పుట్టేదెట్లా తీరం కనబడకుంటే గమ్యం చేరుకొనేదెట్లా ప్రాణం నిలుపుకొనేదెట్లా జీవితం సాగించేదెట్లా జీవనకష్టాలను అధికమించరా జీవితగమ్యాలను అలవోకగసాధించరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
  జీవనసమరము పువ్వులు కావాలో నవ్వులు కావాలో చెప్పలేకున్నా! కోర్కెలను తగ్గించుకోమంటా సౌందర్యము చూడాలో సంతోషము పొందాలో తెలుసుకోలేకున్నా! ఊరకుండక తిప్పలెందుకంటా ఆయుర్దాయము కావాలో ఆనందము కావాలో అర్ధము కావటంలా! తెలిస్తే మాదకద్రవ్యాలను వదలమంటా సంపదలు కావాలో సుఖాలు కావాలో సందిగ్ధములో పడ్డా! ప్రయాసలు మానివేయమంటా వెన్నెల కావాలో వేడి కావాలో ఇతమిద్ధంగా తెలియటంలా! రెండింటిని వదులుకోమంటా పరువం వాడుకోవాలా పరువు నిలబెట్టుకోవాలా తేల్చుకోలేకున్నా! విలువలకు కట్టుబడమంటా చదువు కావాలో సంస్కారము కావాలో సరిగా తెలియటంలా! సర్దుకొని పొమ్మంటా మాటలు చెప్పాలా చేతలు చెయ్యాలా తెలుసుకోలేకున్నా! మౌనంగా ఉండమంటా శక్టి కావాలో యుక్తి కావాలో తట్టటంలా! సమయానుకూలంగా నడుచుకోమంటా అక్షయపాత్ర కావాలో కల్పవృక్షము కావాలో బోధపడటంలా! అంతామిధ్యయని తలచమంటా గుణవతి కావాలో రూపవతి కావాలో తికమకపడుతున్నా! బ్రహ్మచారిగా ఉండమంటా అబ్బాయి కావాలో అమ్మాయి కావాలో నిర్ణయించుకోలేకున్నా! ఎవరైనా పెంచకతప్పదంటా సంసారములోకి దిగనా సన్యాసమును పుచ్చుకోనా చర్చించుకుంటున్నా! ఏదైనా తప్పదుగాజీవితసమరమంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 భావిభారతపౌరుల్లారా! భాగ్యవిధాతల్లారా! అన్నెంపున్నెం ఎరుగని పిల్లల్లారా! తల్లితండ్రుల చాటునున్న బాలల్లారా! మంచీచెడూ తెలియని కూనల్లారా! భావిభారతదేశపు పౌరుల్లారా! రంగురంగుల పూలనుచూచి వింతవింత సీతాకోకచిలుకలచూచి చిటపట కురిసే చినుకులచూచి పకపకలాడే చిన్నారుల్లారా! చక్కని నీలిగగనంలోని జాబిలినిచూచి సప్తవర్ణాల హరివిల్లును చూచి మాకోసమే కళ్ళముందుకు వచ్చాయనుకుని ముచ్చటపడే చిట్టిపాపల్లారా! కిచకిచలాడే కోతులచూచి కిలకిలరవములుచేసే పక్షులచూచి గలగలపారే నీటినిచూచి తవతవలాడే బుజ్జాయిల్లారా! ఉరుములమెరుపుల మేఘాలను చూచి తళతళలాడే తారలను చూచి ఉరుకులుతీసే ఉడుతలను చూచి తమకోసమేవచ్చాయననుకొనే  బిడ్డల్లారా! ఉదయిస్తున్న అరుణుని చూచి ఎగిసిపడుతున్న కడలి అలలనుచూచి చెంగుచెంగున గంతులువేసె ఆవుదూడలచూచి సంతసపడే చిట్టిపాపాయిల్లారా! భూగోళం మీదిరా పుడమిపచ్చదనం మీదిరా కొండలుకోనలు మీవిరా క్రిందకు ఉరికేసెలయేర్లు మీవిరా కుహూకుహూకూసే కోయిలలను కనరా నాట్యంచేసే నెమలుల కాంచరా ఎర్రముక్కు పచ్చచిలుకలపై దృష్టిసారించరా పరుగులుతీసే జింకల పరికించరా పూలుపూస్తాయిరా మీకోసం గాలివీస్తుందిరా మీకోసం మేఘాలుకురుస్తాయిరా మీకోసం నదులుప్రవహిస్తాయిరా...
Image
 మనజాతిపిత  అహింస పరమధర్మమని చాటిచెప్పాడు సత్యాగ్రహానికిమించిన ఆయుధంలేదన్నాడు  కంటికికన్ను సిద్ధాంతం అంధకారమయమన్నాడు ఒకచెంపపై కొడితే రెండవచెంప చూపమన్నాడు సత్యమే జయిస్తుందని నీతిబోధచేశాడు మూడుకోతులబొమ్మల మాటలునేర్పాడు చెదును చూడకువినకుమాట్లాడకు అనిచెప్పాడు హిందూముస్లిం భాయిభాయని మతసామరస్యంచాటాడు ఆత్మవంచన పరనింద పతనానికిదారన్నాడు మేధావులు మాట్లాడుతారు మూర్ఖులు వాదిస్తారన్నాడు కోపం అసహనము వలదనిచెప్పి వీడమన్నాడు హరిజనోద్యమము అంటరానితనముపై పోరాడాడు అహింసను ఆయుధంగా వాడాడు జాతినంతా కూదగట్టాడు శాంతిమార్గాన నడిపించాడు సత్యాగ్రహాలు చేశాడు బానిసత్వాన్ని పారద్రోలాడు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు భారతీయులను నిద్రలేపాడు జాతిపితగ గౌరవముపొందాడు వాడవాడలా నీ విగ్రహాలువెలిశాయి ఓ గాంధీ కరన్సీనోట్లపై నీ బొమ్మలున్నాయి ఓ గాంధీ అన్నికార్యాలయాల్లో నీ పటాలున్నాయి ఓ గాంధీ పాఠ్యపుస్తకాలలొ నీ బోధనలున్నాయి ఓ గాంధీ మార్గదర్శివి నువ్వు ఓ గాంధీ స్ఫూర్తిప్రదాతవు నువ్వు ఓ గాంధీ సహనశీలివి నువ్వు ఓ గాంధీ శాంతిదూతవు నువ్వు ఓ గాంధీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అబ్బాయి ప్రసన్నవదన్ ఆదివారమునాడు అబ్బాయిపుట్టాడు అమ్మా అమ్మా అని అప్పుడే అరిచాడు సోమవారమునాడు స్కూలుకూవెళ్ళాడు సరస్వతీమాతను చక్కగాప్రార్ధించాడు మంగళవారమునాడు మాటలూనేర్చాడు ముద్దుగాపలికాడు ముచ్చటాపరిచాడు బుధవారమునాదు బుద్ధిగాచదివాడు బుజ్జిపిల్లలతోడ భళేభళే అడాడుపాడాడు గురువారమునాడు గటగటాపాఠాలువల్లెవేశాదు గురువులమెప్పును ఘనముగాపొందాడు శుక్రవారమునాడు సుద్దులుచదివాడు శ్రీలక్ష్మిదేవిశ్లోకాన్ని కంఠస్థముచేశాడు శనివారమునాడు శ్రద్ధగావిన్నాడు శ్రీవెంకటేశ్వరుని సుప్రభాతమువినిపించాడు అబ్బాయిని అందంగా తయారుచేద్దాం పెద్దపెద్ద చదువులకు పరదేశాలుపంపుదాం ఉన్నతమైన ఉద్యోగాలు చేయిద్దాం మనతెలుగుతల్లికి ముద్దుబిడ్డనుచేద్దాం బాలల్లారా మీరూ చక్కగా చదవండి బాలికల్లారా మీరూ మంచిగా మెలగండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవినేల ప్రకృతి కవ్వించు పువ్వులేల పరిమళాలు ప్రసరించు జాబిలేల వెన్నెలను వెదజల్లు ఆకాశమేల నీలిరంగద్దుకొను నయనానందమునిచ్చు తారకలేల తళతళలాడు తన్మయత్వపరచు మేఘాలేల చినుకులు చిందించు సూర్యుడేల జగాన్నివెలిగించు జనులమేలుకొలుపు నీరేల పారునదులందు పయోధిచేరుటకు కోకిలలేల కుహుకుహుమనికూయు కమ్మగావినిపించు నెమలులేల పురులిప్పు నాట్యమాడు పచ్చదనమేల పుడమినికప్పు పరికించువారినిపులకించు అలలేల ఆర్ణవతీరమందు అలరించునెగిసిపడుచు అందమేల ఆకట్టుకొను అలరించు ఆనందమేల మోములకెక్కు మనసులమురిపించు కవినేల ప్రకృతి కవ్వించివ్రాయించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 గాలివాటుమనసు సూరీదు ఉదయించి కిరణాలు వ్యాపించి చీకటిని పారద్రోలి పక్షులను కిలకిలమనిపించి మనుజులను మేలుకొలిపి పనులకు ఉసిగొలిపినట్టి దృశ్యాలను చూచి నామనసు తూర్పుదిక్కుకుపోయింది రవి అస్తమించి వెలుతురు కనుమరుగయి చీకటి వ్యాపించి పక్షులను గూళ్ళలోనికిపంపి జనులను భయపెట్టి నిద్రలోనికి దించినట్టి నిశ్శబ్ద నిశీధినిచూచి నామనసు పడమటిదిశకుమళ్ళింది హిమాలయముల నుండి చలిగాలులు వీచి ప్రజలను వణికించి దుప్పట్లు కప్పించి మంచాల కెక్కించి ఇళ్ళకే పరిమితంచేసి బంధించు వేళనుచూచి నామనసు ఉత్తరదిశికిపరుగెత్తింది దాక్షిణాత్యుల చూచి పురాణసంస్కృతిని తెలుసుకొని తెలుగుభాష దేశంలోగొప్పని అరవభాష అతిప్రాచీనమని కన్నడబాష కస్తూరియని మలయాళం మాధుర్యమని ద్రావిడులచరిత్ర తెలుసుకొని నామనసు దక్షిణదెసకుసాగింది  నీలిరంగు ఆవరించి మేఘాలను తేలించి జాబిల్లి యేతెంచి వెన్నెలను వ్యాపించి ప్రేమికులను రెచ్చగొట్టి చల్లనిగాలులు వీచునట్టి దృశ్యాల కళ్ళారాకాంచి నామనసు ఆకాశానికివెళ్ళింది భూమిని త్రవ్వి ఖనిజాలు బయటకుతీసి అక్రమాలకు ఒడిగట్టి వ్యాపారాలు చేసి కోట్లను కూడగట్టి రాజకీయాలు చేసి మోసాలు చేస్తున్నారనితెలిసి నామనసు అధోపాతాళానికిదిగింది అన...
Image
 మాపాప టీనా - నా ముద్దులమనుమరాలు మాపాప నవ్వింది నాకడుపు నిండింది మాపాప పిలిచింది నాకానందం కలిగింది మాపాప ఎత్తుకోమంది నామనసు మురిసింది మాపాప ఆడింది నన్ను ముచ్చటాపరిచింది మాపాప కొత్తబట్టలేసింది నాకు కనువిందుచేసింది మాపాప చెంతకొచ్చింది నాపై ముద్దులుకురిపించింది మాపాప పార్కుకుతీసుకెళ్ళమంది నాకు బయటకుతీసుకెళ్ళేపనిపెట్టింది మాపాప పిల్లలతో ఆడుకుంది నన్ను పరవశములో ముంచింది మాపాప పలకపట్టుకుంది నన్ను అక్షరాలునేర్పమంది మాపాప మిఠాయిలడిగింది నేనుకొనియిస్తే ఎగిరిగంతులేసింది మాపాప ఊరికెళ్ళింది నాకుతాతకావాలని ఏడ్చిమరురోజేవచ్చింది మాపాపతిరిగొచ్చి నన్నుచూచింది నాదగ్గరకొచ్చి ఎక్కెక్కి ఏడ్చింది మాపాప బోసినవ్వులు నన్ను కట్టిపడవేశాయి మాపాప ప్రేమాభిమానాలు నన్ను ముగ్ధున్నిచేశాయి నాకు అమ్మనాన్నకన్నా నాతాతే ముద్దన్నది మాపాప కనబడకపోతే నాకెందుకో గుబులుపుడుతుంది మాపాప భవిష్యత్తును నాకుబంగారుమయం చేయాలనియున్నది మాపాపను పెద్దపద్దచదువులకు నాకు పంపాలనియున్నది మాపాపకు నేనేమయినాచేస్తా మాపాపబాగుకు నేనుకట్టుబడియుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
కవితాఝరి ఒక మెరుపు మెరిసిందంటే ఒక ఆలోచన మదినితట్టినట్లే ఒక ఉరుము ఉరిమిందంటే ఒక భావము బయటకొచ్చినట్లే ఒక చినుకు కురిసిందంటే ఒక కవితాహృదయం ద్రవించినట్లే ఒక ఏరు ప్రవహించిందంటే అక్షరసమూహము పొంగిపొర్లినట్లే ఒక స్నానం చేశావంటే కవితగంగలో మునిగినట్లే ఒక పువ్వు పూచిందంటే కవితాకుసుమము విరబూసినట్లే ఒక సువాసన వీచిందంటే కవితాసౌరభము వ్యాపించినట్లే ఒక పంట పండిందంటే సాహితీలోకము సుభిక్షమయినట్లే ఒక పళ్ళెం నిండిందంటే కవితాకాంక్ష తీరినట్లే ఒక జిహ్వ తృప్తిపడిందంటే నవరసాలు దొరికినట్లే ఒక కడుపు నిండిందంటే కవిత్వాన్ని ఆస్వాదించినట్లే ఒక దోసెడునీరు త్రాగావంటే కవితాదాహం సమసినట్లే ఒక మనసు ఆనందపడిందంటే కవితోల్లాసము లభించినట్లే ఓ కవితాప్రేమికులారా తడవండి కవితలలో  మునగండి కవిత్వంలో తేలండి సాహితీలోకంలో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాప్రేరణాలు ఒక దృశ్యం ఆకర్షిస్తుంది కలమును పట్టమంటుంది చక్కగా వర్ణించమంటుంది ఒక శబ్దం ఆకట్టుకుంటుంది కాగితాన్ని తీసుకోమంటుంది కమ్మగా వ్రాయమంటుంది ఒక పదం అంతరంగాన్నితడుతుంది ఆలోచనలు పుట్టిస్తుంది కవనం చేయమంటుంది ఒక పాదం అతిగానచ్చుతుంది భావాన్ని దొర్లిస్తుంది కవితను వెలువరించమంటుంది ఒక రంగు కనబడుతుంది కళ్ళను కట్టేస్తుంది అక్షరాలను అల్లమంటుంది ఒక పువ్వు కనువిందుచేస్తుంది కవిహృదయాన్ని దోచేస్తుంది కైతను సృష్టించమంటుంది ఒక నవ్వు పకపకలాడిస్తుంది మోమును వెలిగిస్తుంది చకచకా రాయమంటుంది ఒక చూపు మదినిపట్టేస్తుంది వన్నెలు చిందుతుంది కవనం చేయమంటుంది ఒక ఆకు రెపెరెపలాడుతుంది తనకథను చెబుతుంది బరబరా పుటలకెక్కించమంటుంది ఒక ఈక గాలిలో ఎగురుతుంది నేలపైపడుతుంది పిట్టతో బంధాన్నితెంచుకుంటుంది తనవ్యధను తెలియపరచమంటుంది ఒక అనుభవం ఒక అందం ఒక ఆనందం ఓలలాడించి ఉర్రూతలూగిస్తాయి ఏరోజుకు ఏనిమిషానికి ఏమివ్రాయాలో ఏవేవోనిర్ణయిస్తాయి  కవిని ప్రేరేపిస్తాయి కవితలను కూర్పించుతాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 బాలల్లారా రారండి! (బాలగేయం) బాలల్లారా రారండి బాలికల్లారా రారండి ఆటలు ఆడుదాంరండి పాటలు పాడుదాంరండి మీ జంతువులం  మీ పొరుగోళ్ళం మీ పక్షులం  మీ నేస్తాలం కిచకిచలాడే కోతులం బెకబెకలాడే కప్పలం మేమేమనే మేకలం బ్యాబ్యామనే గొర్రెలం భౌభౌమనే కుక్కలం ఊళలువేసే నక్కలం గర్జించే సింహాలం గాండ్రించే పులులం అంబాయనే ఆవులం రంకెలుపెట్టే ఎద్దులం మ్యావుమ్యావుమనే పిల్లులం బుసలుకొట్టే పాములం ఘీంకరించే ఏనుగులం సకిలించే గుర్రాలం ఓండ్రపెట్టే గాడిదలం గుర్రుగుర్రుమనే పందులం క్వ్యాకుక్వ్యాకు మనే బాతులం కోకోకోమని అరిచే కోళ్ళం కుకుకుమనే పావురాళ్ళం గ్రంటుగ్రంటుమనే దున్నలం కావుకావుమనే కాకులం కూకూమనికూచే కోకిలలం కొక్కొరోక్కోయనే కోడిపుంజులం కీచుకీచుమనే కీటకాలం కలసిమెలసి జీవిద్దాం ఒకరికినొకరు తోడుందాం పరిసరాలను కాపాడుదాం పరిశుభ్రతను పాటిద్దాం పచ్చనిచెట్లు నాటేద్దాం ప్రాణవాయువును పెంచేద్దాం భూవాసులను బ్రతికిద్దాం భూగోళాన్ని రక్షిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాస్వాదనము కవిత్వం కవిగారి ఆవేశం అతనిని ఆపటం అతికష్టం కవిత్వం కవికి తీరనిదాహం అతనిని తృప్తిపరచటం అసంభవం కవిత్వం కవిగారి పైత్యం అతనిని కక్కించటం ఖాయం కవిత్వం కవికి ప్రేరణం  పూరణం పిమ్మట ప్రసరణం కవిత్వం కవిగారి చింతనం  కూర్చటం కడకు బహిరంగపరచటం కవిత్వం అస్వాదకులకు అద్భుతం అమూల్యం అమోఘం కవిత్వం కవిగారిచిత్తం చెక్కినశిల్పం చూపినదృశ్యం కవిత్వం చదువరులకు  సులభం సూక్ష్మం చాలా సరళం కవిత్వం కవిగారి సంకల్పం సంకలనం సమర్పణం కవిత్వం అందం ఆనందం కవిగారి అంతరంగం కవిత్వం కవిగారి కష్టఫలం అభినందించటం అందరి కర్తవ్యం రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కొత్త ఒకవింత-పాత ఒకరోత కొత్త వింతయ్యింది పాత రోతయ్యింది పాతది మోటయ్యింది కొత్తది నాజూకయ్యింది అప్పటి తెలుగేది అప్పటి వెలుగేది అప్పటి పలుకులేవి అప్పటి కులుకులేవి అప్పటి పంచలేవి అప్పటి చీరలేవి అప్పటి బొట్టులేవి అప్పటి జడలేవి అప్పటి ఆచారాలేవి అప్పటి కట్టబాటులేవి అప్పటి కాణీలేవి అప్పటి అణాలేవి అప్పటి వీరపుత్రులేరి అప్పటి నారీమణులేరి అప్పటి మణులేవి అప్పటి మాణిక్యాలేవి అప్పటి నవ్వులేవి అప్పటి మోములేవి అప్పటి అందాలేవి అప్పటి ఆనందాలేవి అప్పటి కవులేరి అప్పటి కవితలేవి అప్పటి కలాలేవి అప్పటి గళాలేవి అప్పటి గురువులేరి అప్పటి పాఠాలేవి అప్పటి పురాణాలేవి అప్పటి కావ్యాలేవి అప్పటి బోధనలేవి అప్పటి బుద్ధులేవి అప్పటి భక్తులేరి అప్పటి భజనలేవి అప్పటి నాటకాలేవి అప్పటి ప్రేక్షకులేరి అప్పటి హరికథలేవి అప్పటి బుర్రకథలేవి అప్పటి పద్యాలేవి అప్పటి గద్యాలేవి అప్పటి జేజేలేవి అప్పటి చప్పట్లేవి అప్పటి బంధాలేవి అప్పటి త్యాగాలేవి అప్పటి వినయములేవి అప్పటి విధేయతలేవి అప్పటి పాలకులేరి అప్పటి సేవకులేరి అప్పటి విలువలేవి అప్పటి మర్యాదలేవి కొత్తనీరు వచ్చింది పాతనీరు కొట్టుకపోయింది పడమటిపద్ధతి వచ్చింది పురాణసంస్కృతి పోయింది ...
Image
 నువ్వు ఎవరంటే ఏమనిచెప్పను? నువ్వు ఎవరంటే ఏమనిచెప్పను? నువ్వు పువ్వులలో తావివి నువ్వు  నవ్వులలో వెలుగువి నువ్వు కళ్ళల్లో కాంతివి నువ్వు నోటిలో నాలుకవి నువ్వు రుచులలో తీపివి నువ్వు రూపములో మోహినివి నువ్వు పలుకులలో మాధుర్యానివి నువ్వు చూపులలో చక్కదనానివి నువ్వు ప్రకృతిలో అందానివి నువ్వు  మదిలో ఆనందానివి నువ్వు పగలులో కిరణానివి నువ్వు చీకటిలో వెన్నెలవి నువ్వు దేహంలో ప్రాణానివి నువ్వు జీవితంలో గమ్యానివి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సూక్తిముక్తావళి ఓ మనిషీ గర్వపడితే భంగపడతావు ఒదిగియుంటే  వృద్ధిలోకొస్తావు ఆలోచించినడచుకోరా ఓ మానవా పరుగులెత్తితే క్రిందపడతావు కాళ్ళువిరిగితే కష్టాలపాలవుతావు నిదానమే ప్రదానమురా ఓ మనుజుడా అపకారాలుచేస్తే శత్రుత్వంతెచ్చుకుంటావు వీలుదొరికితే ప్రతీకారంతీర్చుకుంటారు అపకారికికూడా ఉపకారంచేయమన్నారురా ఓ మానవుడా దొంగతనాలుచేస్తే అపఖ్యాతిమూటకట్టుకొంటావు చిక్కావంటే  శిక్షలుపడతాయి నీతిబ్రతుకే మేటియని తెలుసుకోరా  ఓ మనుజా అబద్ధాలాడితే చెడ్డముద్రవేస్తారు నమ్మకంపోతే దూరంగాపెడతారు చివరకు సత్యమేజయిస్తుందిరా ఓ నరుడా అన్యాయాలుచేస్తే చెడ్డపేరుతెచ్చుకుంటావు అందరికితెలిస్తే నిందలపాలవుతావు న్యాయమార్గమే అనుసరణీయమురా ఓ మానిషీ అక్రమాలకు ఒడికడితే దుష్ఫలితాలను అనుభవిస్తావు ప్రచారంలోకొస్తే దుర్మార్గుడంటారు ఋజుప్రవర్తనే శ్రీరామరక్షరా ఓ పారగతా తప్పులుచేస్తే తంతారు వీలుదొరికితే తగలబెడతారు ఒప్పులకుప్పగా వాసిల్లురా ఓ పంచజనా గోతులుతీస్తే గుంటలోపడతావు అవకాశమొస్తే సమాధిచేస్తారు ఎవరుతీసినగోతిలో వారేపడతారురా ఓ ద్విపాదుడా గొప్పలకుపోతే మునగచెట్టెక్కిస్తారు కొమ్మవిరిగితే క్రిందపడతావు పొగడ్తలకు పొంగిపోకురా ఓ మర్త్...
Image
 పువ్వా పువ్వా! పువ్వా పువ్వా తాజా పువ్వా అందమైన పువ్వా ఆనందమిచ్చే పువ్వా వికసించే పువ్వా విభవించే పువ్వా పరిమళంచల్లే పువ్వా పరవశపరచే పువ్వా తేనెలుదాచే పువ్వా తేటులపిలిచే పువ్వా పుప్పొడియున్న పువ్వా పిందెగమారే పువ్వా ఎర్రరంగు పువ్వా ఎదనుదోచే పువ్వా తెల్లవన్నె పువ్వా తేటతేట పువ్వా పసుపువర్ణ పువ్వా పడతులుమెచ్చే పువ్వా గులాబిఛాయ పువ్వా గుబాళించే పువ్వా రంగురంగుల పువ్వా రమణీయమైన పువ్వా ఆకర్షించే పువ్వా అలరించే పువ్వా ప్రేమనుతెలిపే పువ్వా ప్రేమికులనుకలిపే పువ్వా కొప్పులకెక్కే పువ్వా కోర్కెలులేపే పువ్వా భ్రమలుకొలిపే పువ్వా భామలుమెచ్చే పువ్వా భక్తులుమెచ్చే పువ్వా భగవానుడునచ్చే పువ్వా సొగసులుచిమ్మే పువ్వా మనసులుదోచే పువ్వా ముచ్చటైన పువ్వా మరులుకొలిపే పువ్వా వాడిపోయే పువ్వా ఒరిగిపోయే పువ్వా రాలిపోయే పువ్వా నేలచేరే పువ్వా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
  చేసినకర్మము చెడనిపదార్థము నెత్తీనోరూ మొత్తుకున్నా నాటకాలు ఆడొద్దని కాళ్ళూవ్రేళ్ళూ పట్టుకున్నా కష్టాలపాలు చేయొద్దని గడ్డంచేతులు పట్టుకొనిచెప్పా గడ్డుపరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రేమగా చెప్పా పలువచేష్టలు మానుకోమని పదేపదే బ్రతిమాడా చెడ్డదారిన నడవొద్దని సూక్తులు చెప్పా మంచిగా మెలగమని శంఖమూది అరిచా తలకు ఎక్కించుకోలా పాటపాడి వినిపించా ఆలకించలా అర్ధంచేసుకోలా కవితకూర్చి పఠించా మనసుపెట్టి వినలా పరమాత్మ చూస్తున్నాడని ఘోరాలను చెయ్యొద్దనిచెప్పా అయినా లాభము కనపడలా మార్పులు చేసుకోలా పెడచెవిని పెట్టా పాపాలకు ఒడిగట్టా రోగాలు తెచ్చుకొనే కష్టాల పాలయ్యే కుటుంబం చితికిపోయే గౌరవం అడుగంటా చివరకు చిన్నవయసునే దేహం విడిచిపెట్టా కర్మఫలం అనుభవించా చేసిన కర్మము చెడని పదార్థము చేరునుకర్తను తక్షణము చూపునువేళన ఫలితము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రమణీమణుల రంగరంగవైభవములు కళారంగమందు విదుషీమణులు విభిన్నపాత్రలందు వెలిగిపోతున్నారు ఆటలరంగమందు క్రీడాకారిణులు కడునైపుణ్యాన్నిచూపుతున్నారు ఖండాంతరఖ్యాతినితెస్తున్నారు వైఙ్ఞానికరంగమందు శాస్త్రకారిణులు చెలరేగిపోతున్నారు సుసంపన్నంచేస్తున్నారు కంప్యూటరురంగమందు రమణీమణులు రాటుతేలుతున్నారు రాణిస్తున్నారు విద్యారంగమందు విరిబోడులు వికసిస్తున్నారు విశ్వకీర్తినిపొందుతున్నారు సేవారంగమందు స్త్రీరత్నములు శోభిల్లుతున్నారు సుస్థిరపడుతున్నారు ఆరోగ్యరంగమందు వైద్యురాళ్ళు వ్రేళ్ళూనుకుంటున్నారు విశ్రుతసేవలందిస్తున్నారు ఆర్ధికరంగమందు ఆడువారు అలరారుతున్నారు అభివృద్ధిచెందుతున్నారు కవనరంగమందు కవియిత్రులు కలాలనుఝళిపిస్తున్నారు కవితలనుకూర్చేస్తున్నారు అన్నిరంగాలందు అతివలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అర్ధభాగాన్ని నిలుపుకుంటున్నారు స్త్రీలశక్తి అపారము స్త్రీలరక్తి అనునిత్యము  స్త్రీలయుక్తి అమోఘము స్త్రీలభక్తి అచంచలము అమ్మలకు వందనాలు అర్ధాంగులకు ధన్యవాదాలు కోడల్లకు శుభాశిస్సులు కూతుర్లకు శుభదీవెనలు  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనప్రవాహం (కవిగారికలం) కలం పరుగెత్తిందంటే అక్షరాలు అల్లుకున్నట్లే కలం సాగిందంటే పదంపదం పొసిగినట్లే కలం ఉప్పొంగిందంటే మనసులు తడిసినట్లే కలం కదిలిందంటే జలం ప్రవిహించనట్లే కలం కూర్చిందంటే గళం ఎత్తుకోవాల్సిందే కలం కురిసిందంటే ఏరు ముందుకుసాగవల్సిందే కలం గీసిందంటే కాగితాలు వెలిగిపోవల్సిందే కలం మండిందంటే శౌర్యం పొంగిపొర్లాల్సిందే కలం సరసాలాడిందంటే ప్రణయం పుట్టాల్సిందే కలం పదునెక్కిందంటే మనసుకు పనిపెట్టాల్సిందే కలం కన్నీరుకార్చితే దుఃఖంలో మునిగిపోవాల్సిందే కలం రక్తంచిందిస్తే దేహం ఉడికిపోవల్సిందే కలం ఉసిగొల్పిందంటే రంగంలోకి దిగాల్సిందే కలం ప్రభోధిస్తే జనం ఆచరించాల్సిందే కలం రక్తిగట్టిస్తే పఠనం పదేపదేచేయాల్సిందే కలం అందాలుచూపిందంటే ఆనందం కలగాల్సిందే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రంగులలోకం రంగులలోకం రమ్మంటుంది ఆనందం ఆస్వాదించమంటుంది పుడమినికప్పు పచ్చదనం కనులకిచ్చు కమ్మదనం నయనానందకరం నీలిగగనం అంతరిక్షం అతికమనీయం పున్నమిరోజు తెల్లనెలవెలుగు చల్లదనమిచ్చు సంతసమునిచ్చు చిలుకముక్కు ఎర్రగానుండు చూడచూడమనసును దోచుకొనుచుండు నీటిచుక్కలురాల్చు నల్లనిమబ్బులు కర్షకులకిచ్చును ఆనందపరవశమును బంతులుచామంతులు పసుపురంగునందు ప్రకాశించుచుండు ముచ్చటగొలుపుచుండు పూలరాణిరోజాపూవు గులాబిరంగు గుండెల్లోగుచ్చుకొను గుబళించు రమణులకొప్పులందు రకరకాలరంగులపూలు ముసిముసిలాడు ముచ్చటపరచు భామలుబాసిల్లు బంగారువర్ణమునందు భ్రమలుకలిపించు భార్యనుచేసుకొనమనుచుండు విభిన్నమైన సీతాకోకచిలుకలు విచిత్రమైన రంగులనుదాల్చు వివిధపూలపై వ్రాలుచుండు పరికించువారిని పులకించుచుండు బతుకమ్మ రంగులపూలపండుగ హోళీ రంగులుచల్లుకునేపండుగ అమిత సౌందర్యాన్నిస్తాయ్యి ఆడవారికి రంగువస్త్రాలు రంజింప జేస్తాయి రంగులేసిన బొమ్మలు రంగుపడుతుందని సందేహించకండి రంగులలోకాన్ని స్వాగతించండి రంగుదృశ్యాలను చూడండి రంగులనడుమునందు విహరించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చిట్టిచిలకమ్మ చిలుకను  పడతా పంజరంలో పెడతా చిట్టిచిలుకను పెంచుతా స్నేహం చేస్తా గింజలు అందిస్తా గారాభం చేస్తా పంచదార పెడతా మాటలు నేర్పుతా నీటిని త్రాగిస్తా నాట్యం చేయిస్తా తోటకు తీసుకెళ్తా తోడుగా నిలబడతా ఆటలు ఆడిస్తా కేరింతలు కొట్టిస్తా బంతిని విసురుతా ముక్కుతో తోయిస్తా తలను నిమురుతా తోకను తట్టుతా చేతిలోకి తీసుకుంటా చిందులు త్రొక్కిస్తా బంధీగా ఉంచుతా బంధం కొనసాగిస్తా నాచిట్టి చిలకమ్మా నాతోనే ఉండిపోవమ్మా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందాల చిలుక చిలుకముక్కు బాగున్నదని ఎరుపురంగు పెదవులకేసి వన్నెలొలుకుచున్నది చిన్నది కోకిలకంఠము ఇంపుగానున్నదని తనగొంతును సవరించుకొని అలరిస్తున్నది కలకంఠి ముయూరినాట్యము సొంపుగానున్నదని చేతులుకాళ్ళు లయబద్ధంగా కదిలించి ముచ్చటపరుస్తున్నది ముదిత హంసనడకల హొయలుచూచి నడకను మార్చుకొని మురిపిస్తున్నది కోమలాంగి సుప్రభాత సూర్యునిచూచి  నుదుట సింధూరంపెట్టుకొని కళకళలాడుతున్నది సుందరి పండువెన్నెల జాబిలినికని పౌడరు మోముకద్దుకొని ప్రకాశిస్తుంది పడతి సీతాకోకచిలుకుల రంగులుకాంచి సంబరపడి చిత్తయి  వివిధవర్ణాల వలువలుధరిస్తుంది సుమబాల కళ్ళనుచూచి దిష్టిపెడుతున్నారని కనులకు కాటుకపెట్టి కుతూహలపరుస్తున్నది కలికి పూల అందాలనుచూచి పరిమళాలను పీల్చి పరవశించి తలలోతురుముకున్నది తరుణి రత్నాలు రమ్యంగాయున్నాయని కమ్మలలో పొదిగించుకొని చెవులకు తగిలించుకున్నది సుందరాంగి బంగారం వెలుగులు చిమ్ముతున్నదని హారమును చేయించుకొని మెడలోవేసుకొని మరిపిస్తుంది సింగారి చేతులకు గాజులుతొడుక్కొని గలగలామ్రోగిస్తున్నది సుదతి కాళ్ళకు గజ్జెలుపెట్టుకొని ఘల్లుఘల్లుమనిపిస్తున్నది కాంత వగలాడి వలపువల విసిరి కోరుకున్నవాడిని కట్టుకొని కులుకులొల...
Image
 ఓ భవాని! వద్దొద్దు నాకొద్దు పంచభక్ష్యాలొద్దు బ్రతకతిండిచాలు ఓ అన్నపూర్ణా వలదొలదు నాకొలదు ఆస్తిపాస్తులువలదు ఉండపూరిల్లుచాలు ఓ భవానిమాతా పనిలేదు పనిలేదు అప్సరసలాంంటి సతితోపనిలేదు మంచి మనసున్నభార్యచాలు ఓ విశాలాక్షీ అడుగను అడగను అందచందాలడగను ఆరోగ్యమిచ్చినచాలు ఓ రాజరాజేశ్వరీ కోరను కోరను తమ ప్రత్యక్షదర్శనమునుకోరను కటాక్షించినచాలు ఓ సింహవాహినీ ఇవ్వొద్దు ఇవ్వొద్దు భోగభాగ్యాలివ్వొద్దు సర్వులను సుఖపరిచినచాలు ఓ శాంభవిదేవీ పనిలేదు పనిలేదు శక్తియుక్తులతోపనిలేదు తమనుపూజించ భక్తినిచ్చినచాలు ఓ పార్వతిదేవీ వేడుకోను వేడుకోను తెలివితేటలు వేడుకోను తమను మరవకుండచేసినచాలు ఓ మహేశ్వరిదేవీ అక్కర్లేదు అక్కర్లేదు పనిపాటలక్కర్లేదు తమను కొలవనిచ్చినచాలు ఓ కాత్యాయణిదేవీ ఆశించ నాశించ స్వర్గసుఖాలనాశించ తమనుపూజించ భాగ్యమిచ్చినచాలు ఓ దాక్షాయణిదేవీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 💐🌷🌷🌷💐💐💐💐అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Image
 తెలుగుబిడ్డ లేవరా! తెలుగుబిడ్డ లేవరా తాజాపరిస్థితి చూడరా తెలుగువెలుగులు చిమ్మరా ప్రతిభాపాఠవాలు చాటరా తెలుగోళ్ళకు ఘనత తేరగా రాదురా తొలిగ తెలుసుకొనరా తర్వాత తెలియచెప్పరా తెలుగుభాష తియ్యదనాన్ని తేటతెల్లము చేయరా తెలుగువారి వీరత్వాన్ని నాలుగుదిక్కుల వ్యాపించరా తెలుగోళ్ళ ప్రఖ్యాతిని జగమంతా తెలుపరా తెలుగువారి పాతచరిత్రను ప్రజలకెల్లా గుర్తుచెయ్యరా తెలుగుకవుల కావ్యఖండాలను వెలికితీయరా వ్యాప్తిజేయరా తెలుగుపౌరుషాలను మనయువకులకెల్లా ఎరిగించరా వారసత్వం నిలుపమనరా తెలుగోళ్ళకు మర్యాద ఊరకనేరాదురా విజయాలుపొందరా విశ్వఖ్యాతిపొందురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 భూలోకవాసం నేను ఒక భూలోకవాసిని నన్ను భూమాత భరిస్తుంది నాకు ఆహారపానీయాలు అందిస్తుంది నాకు అందాలుచూపి ఆనందమిస్తుంది  కొండలు సెలయేర్లు రమ్మంటున్నాయి అరణ్యాలు లోయలు అనుభవించమంటున్నాయి కాలం పరుగెత్తుతుంది ఆలోచనలు వెంటబడుతున్నాయి ఆకాశంవైపు ఆశగా చూస్తున్నా నీరునిస్తుందని వెలుగునిస్తుందని వెన్నెలనిస్తుందని సూర్యుడు సహాయపడుతున్నాడు చంద్రుడు సంతోషపెడుతున్నాడు కాళ్ళక్రింది పాతాళాన్ని తలుచుకుంటున్నా మణిమాణిక్యాలనిస్తుందని ఖనిజలోహాలనిస్తుందని భూమిని బ్రద్దలుచేయదని ప్రక్కనున్న సముద్రాన్ని చూస్తున్నా ఆకాశాన్ని అందుకోవాలని ఎగిరిపడుతుంది ఎత్తుకు ఎగురుతుంది క్రిందకుపడుతుంది భూమిని ఆక్రమించుకోవాలని చూస్తుంది చీకటివెలుగుల పోరాటాన్ని చూస్తున్నా ప్రొద్దున్నె సూర్యుడొచ్చి ఏలుతుంటే సాయంత్రం తిమిరమొచ్చి పాలిస్తుంది రాత్రి చంద్రుడుచుక్కలు అలరిస్తున్నవి ఆకాశంలో దేవతలున్నారేమోనని చూస్తున్నా పూజిస్తున్నా పాతాళంలో బలిసంతానమున్నారేమోనని భ్రమిస్తున్నా భయపడుతున్నా  ఎన్నిరోజులు బ్రతకాలో? ఎందుకోసం జీవించాలో? ఏమిపనులు చెయ్యాలో? ఏమేమి సాధించాలో? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కొంటెచూపుల కోమలి గాజులు గలగలా మ్రోగిస్తూ చూపును ఆకర్షించె చిన్నది నవ్వులు కిలకిలా కురిపిస్తూ చూపును ఆకట్టుకొనె సుందరి కన్నులు మిళమిళా మెరిసిపిస్తూ చూపును పట్టేసె చెలి మోమును కళకళా వెలిగిస్తూ చూపును కట్టేసె సుందరాంగి పలుకులు బిరబిరా సంధిస్తూ చూపును స్తంభించె సుమబాల చేతులు చకచకా ఊపుతూ చూపును నిలిపేసె సౌందర్య దుస్తులు తళతళలాడిస్తూ కాంతులు వెదజల్లుతూ చూపులను బంధించె చక్కనిచుక్క నగలు ధగధగమని ప్రకాశింపజేస్తూ చూపును తిప్పుకొనె చెలియ ముంగురులు రెపరెపలాడుచుండగా ముచ్చటపరుస్తూ చూపును లంకించుకొనె సఖియా పూలు ఘుమఘుమలాడుచుండగా కొప్పునతురుముకొని చూపును చిక్కించుకొనె సింగారి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం