Posts

Showing posts from November, 2022
Image
 కల్లాకపటం తెలియనివాడా! కల్లాకపటం తెలియనివాడా లోకంపోకడ తెలుసుకోరా! గట్టిగవుంటే పిండిచేస్తరు మెత్తగవుంటే పిసికివేస్తరు భయపడ్డావంటే వెంటపడతరు ఎదురుతిరిగితే వెనకడుగేస్తరు పైసాలుంటే పక్కకొస్తరు పర్సుఖాళీగుంటే పారిపోతరు బెల్లముంటే ఈగలుమూగుతయి చెరువునిండితే కప్పలొస్తయి మంచిగవుంటే చెడగొట్టచూస్తరు వినకపోతే విమర్శిస్తరు పరుగెడుతుంటే పడగొట్టేస్తరు నడుస్తుంటే నిలదీచేస్తరు కళ్ళుతెరిస్తే కారంచల్లుతరు నోరుతెరిస్తే గొంతునొక్కుతరు బాగుపడుతుంటే చూడలేకుంటరు పేరొస్తుంటే ఓర్వలేకుంటరు అందంగుంటే అసూయపడతరు ఆనందంగుంటే తట్టుకోలేకుంటరు అన్నెంపున్నెం ఎరగనివాడా మంచిచెడులను ఎరిగిమెలగరా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 డాక్టర్ల దారుణాలు చికిత్సాకేంద్రాలు విరివిగా వెలుస్తున్నాయి మనుషులప్రాణాలకు వెలలు కడుతున్నాయి ప్రభుత్వవైద్యశాలలు నిష్ప్రయోజనాలవుతున్నాయి వ్యాపార చికిత్సాలయాలు సామాన్యుల నడ్డివిరగకొడుతున్నాయి దొరికినంత దారుణంగా దోచుకుంటున్నాయి దవాఖానాలు అనారోగ్యాన్ని ఆసరాగాతీసుకొని అక్రమాలుచేస్తున్నాయి ఆసుపత్రులు డాక్టర్లు దంపతులయి ద్విపాత్రాభినయనాలను చేస్తూ  దగాచేసి రెండుచేతులా డబ్బులు కొట్టేస్తున్నారు   మందుల దుఖానాలు ధరలుపెంచి డిస్కౌంటులంట్లుచెప్పి డాక్టర్లతో కుమ్మక్కయి  దోపిడీలుచేస్తున్నారు వైద్యశోధనలంటు వివిధ పరీక్షలు వ్రాసి  కమీషనులు కొట్టేస్తున్నారు  బిషక్కులు వైద్యో నారాయణోహరి ఒకప్పుడు డబ్బుపైకన్నేసే డాక్టరుగిరి మరిప్పుడు జబ్బులు రాకుండా జాగ్రత్త పడండి కర్మకాలి రోగాలొస్తే ఖర్చుపెట్టటానికి సిద్ధపడండి హాస్పటలు పాలయిన కుటుంబం దొంగలపడ్డ ఇంటితో సమానం కార్పొరేటు వైద్యశాలలు కాస్టిలీయస్టుగా మారాయి కాసులు కొట్టేయటానికి కేంద్రాలుగా మారాయి  అప్పుడు వైద్యుడు దేవుడితో సమానం ఇప్పుడు వైద్యగానికిపొతే పోతాయిప్రాణాలని అర్ధం కార్పొరేటు వైద్యం కాసులకు కనాకష్టం ప్రభుత్వ వైద్యగం ప్ర...
Image
 కవితాజల్లులు కవిత కలలోకి వస్తుంది కవ్వించి పోతుంది కైతలను కూర్పిస్తుంది కవితమ్మ కన్మోడ్పునుండి లేపుతుంది కలమును చేతపట్టిస్తుంది కాగితాలమీద వ్రాయిస్తుంది కవితాసుందరి ఆలోచనలు పారిస్తుంది భావాలు బయటపెట్టిస్తుంది కవనకడలిలో ముంచేస్తుంది కవితాకన్యక అక్షరాలను అల్లిస్తుంది పదాలను పారిస్తుంది కవిత్వాన్ని పొంగిస్తుంది కవితాబాల అందాలను చూపుతుంది ఆనందాల నిస్తుంది ఆపై ముగ్గులోకిదింపుతుంది కవితాఝరి తోడుకు పిలుస్తుంది తనివి తీరుస్తుంది తడిపి ముద్దచేస్తుంది కవితాకుసుమం విచ్చుకుంటుంది వినోదపరుస్తుంది విందుకుపిలుస్తుంది కవితాకాశం కిరణాలను వెదజల్లుతుంది కౌముదిని కురిపిస్తుంది కళ్ళకు కాంతులిస్తుంది కవితారణ్యం కొండాకోనల కాంచమంటుంది కోకిలల గానాన్నివినమంటుంది కేకుల నర్తనాన్ని చూడమంటుంది   కవితాలోకం స్వాగతంపలుకుతుంది స్థానమిస్తానంటుంది స్థిరంగానిలచిపొమ్మంటుంది కవితే నా సుందరి కవిత్వమే నా ఊపిరి కవనమే నా దారి కవితలే నా గురి కవనరంగమే నా కులాస కవితాలోకమే నా ధ్యాస కవితలకూర్పే నా ప్రయాస కవితానందమే నా భరోస కవులంటే నాకిష్టం కవితలంటే నాకుప్రాణం పాఠకులంటే నాకభిమానం ప్రశంసలంటే నాకు ప్రోత్సాహం గుండ్లపల్లి రాజేం...
Image
 మాటతీరు నోరే నేస్తము మాటలే మానము అప్యాయంగా  మాట్లాడితే అభిమానమును చూరగొంటావు ఆవేశంగా మాట్లాడితే అనార్ధాలను తెచ్చుకుంటావు అధికంగా మాట్లాడితే వదరబోతుగా ముద్రవేసుకుంటావు అనవసరంగా మాట్లాడితే పిచ్చివాడిగా పరిగణించబడతావు అహంకారంతో మాట్లాడితే గర్విష్ఠిగా పేరుతెచ్చుకుంటావు కోపంగా మాట్లాడితే అశాంతిని కొనితెచ్చుకుంటావు ద్వేషంతో మాట్లాడితే శత్రుత్వాన్ని తెచ్చుకుంటావు నవ్వుతూ మాట్లాడితే ఆదరణను పొందుతావు ఏడుస్తూ మాట్లాడితే అవహేళనకు గురవుతావు అబద్ధాలు మాట్లాడితే అపనమ్మకాన్ని మూటకట్టుకుంటావు నిజాలు మాట్లాడితే నమ్మకస్థుడవని పేరుతెచ్చుకుంటావు ఆలోచించి మాట్లాడితే మేధావిగా పేరుతెచ్చుకుంటావు ఆచితూచి మ్మాట్లాడితే అపార్ధాలకు తావుండదు నోరు తెరిచేముందు పరుసు తెరిచేముందు జాగ్రత్తగానుండకపోతే పరువుపోవచ్చు దబ్బుపోవచ్చు మాటతీరు మార్చుకో మంచిపేరు తెచ్చుకో నోరు  బాగుంటే ఊరు బాగున్నట్లే గుండ్లపల్లి రాజేంద్రప్రసద్, భాగ్యనగరం మానము=మర్యద, గౌరవము
Image
 వ్రాస్తా వ్రాస్తుంటా!  రానీ రాకపోనీ పేరుప్రఖ్యాతులు ప్రశంసాపత్రాలు  పేపర్లలో ఫొటోలు  బహుమతులు బిరుదులు భుజాన శాలువాలు మెడన పూలదండలు  కరాన పుష్పగుచ్ఛాలు దక్కనీ దక్కకపోనీ మాట్లడటానికి మైకులు  పత్రికలలో ప్రాచుర్యాలు ఆకాశవాణిలో వార్తలు  దృశ్యమాధ్యమాలలొ వీడియోలు చొక్కాలకు రంగులబాడ్జీలు సన్మానాలు సత్కారాలు  పొగడ్తలు కరతాళధ్వనులు పోనీ పోతేపోనీ భార్య బంధువులు తల్లి తండ్రులు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు హితులు స్నేహితులు చదవనీ చదవకపోనీ కష్టపడి వ్రాసినకవితలు అందంగాగుచ్చిన అక్షరాలు ఏరికోరిపేర్చిన పదాలు ప్రయోగించిన ప్రాసలుమాత్రలు వాడిన ఉపమానాలురూపకాలు వెలగనీ వెలగకపోనీ సూర్యుని కిరణకాంతులు చంద్రుని వెన్నెలజల్లులు తారల తళుకుబెళుకులు మెరుపుల విద్యుత్తుప్రకాశాలు మోములందు చిరునవ్వులు కనిపించనీ కనిపించకపోనీ ప్రకృతి అందాలు వికసించిన అరులు కడలిలోని అలలు నల్లని అంబుదాలు నాట్యమాడే అర్జునాలు తలుస్తా తలపుకుతెస్తా శ్రీశ్రీ విప్లవగీతాలను కృష్ణశాస్త్రి భావకవితలను ఆత్రేయ మనసుకవిత్వమును పాపయ్యశాస్త్రి పుష్పకవనమును గురజాద వ్యావహారికబాషను పలుకవుల ప్రణయ...
Image
 పాపాయిల్లారా! పకపకనవ్వుల పసిపాపల్లారా  పాలాబుగ్గల పాపాయిల్లారా   పిల్లలతోటి కలసిమెలసియుండండి  పీకలదాకా పూటుగాతినకండి  పుస్తకాలసంచి భుజానేసుకోండి పూటపూట పాఠశాలకువెళ్ళండి పెద్దలమాటలు పెడచెవిపెట్టకండి పేచీలెవ్వరితో పెట్టుకోకండి పైపైమెరుగులచూచి పొరబడకండి పొరపాటుపనుల నెపుడూచేయకండి పోకిరితనముపోరాటము మానండి పౌరుషాలుపెంకితనాలు వదలండి పంతాలకు పట్టింపులకుపోకండి పట్టువిడుపుల పాటించటమెరగండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవి-పాఠకుడు మధ్య కవితలు ఆలోచనలు అలోలములయి అంతరంగాన ఆవాసమయి సాయంసమయ ఛాయలయి తారాడి తందనాలాడుతున్నాయి రవిని చూచి కిరణాలను చూచి  జాబిలిని చూచి వెన్నెలను చూచి పువ్వులను చూచి నవ్వులను చూచి పిల్లలను చూచి పడుచులను చూచి పచ్చనివనాలను చూచి ప్రవహించే నదులనుచూచి  ఎత్తైన పర్వతాలుచూచి లోతైన లోయలనుచూచి కడలిని చూచి అలలను చూచి ఆకాశాన్ని చూచి నీలవర్ణాన్ని చూచి మేఘాలను చూచి తారకలను చూచి అందాలను చూచి ఆనందాన్ని పొంది ఆలోచనలో పడి ఆంతరంగాన మదించి పొరుగువారితో మాట్లాడి పుస్తకాలను చదివి కనులు తెరచి చెవులు విప్పి మనసు విప్పి విషయం తట్టి కలమును పట్టి కాగితము తీసి కవితను వ్రాసి సంబరపడుతున్నాడు కవి పఠించి గానంచేసి వినిపించి శ్రావ్యతనిచ్చి ముఖపుస్తక సమూహాలకుపంపి వాట్సప్పు సముదాయాలకుపంపి ఇంస్టాగ్రాముకి పంపి ట్విట్టరులో ట్వీటుచేసి బ్లాగులో పెట్టి వాలులో పెట్టి అంతర్జాలములో పంపి పలువురికి చేర్చి ఈమైలు చేసి శ్రమపడుతున్నాడు కవి పాఠకులు చదివి అక్షరాలకూర్పుకు అబ్బురపడి పదప్రయోగానికి ముగ్ధులయి ప్రాసల అమరికజూచి లోతైన భావాలుకని పరవశించి మనసున నిలుపుకొని వ్యాఖ్యలు వ్రాసి ప్రశంసించి కవికిపంపి సంతసపడుతున్నాడు ఒకచద...
Image
 తెలుగు జిలుగులు తెలుగునాట తిరుగరా తెలుగుతీపి తెలుపరా తెలుగు అక్షరాలు వెలిగించరా తెలుగు కాంతులు విరజిమ్మరా తెలుగుతమ్ముళ్ళను కలవరా తియ్యందనాలను పంచరా తెలుగుతోటలోన విహరించరా మల్లెలమత్తులోన మురిసిపోరా తెలుగుపలుకులు వినిపించరా తేనెచుక్కలు చిందించరా తెలుగు ఖ్యాతిని చాటరా తలను ఎత్తికొని నడవరా తెలుగువాడినని గర్వించరా తెలుగునందె మాట్లాడరా తెలుగుతల్లిని పూజించరా పూలదండను మెడనవేయరా తెలుగుపాటలు పాడరా తోటివారిని కదిలించరా తెలుగుబాట పట్టరా తెలుగునుడిని తేటపరచరా తెలుగుకోసం శ్రమించరా తెలుగుబాషను శ్లాఘించరా తెలుగువీరుల స్మరించరా తెలుగుదనమును బ్రతికించరా తెలుగువనమును పెంచరా తెలుగుసౌరభాల వెదజల్లరా తెలుగు సొగసులను తిలకింపజేయరా తెలుగుమదులను తృప్తిపరచరా తెలుగు తక్కువకాదని  చెప్పరా తెలుగుపై మక్కువనెక్కువ చేయరా తెలుగోళ్ళు ఆరంభశూరులు కాదనరా తెలుగువారు సాధకులని నిరూపించరా తెలుగుకవితలను వ్రాయరా తెలుగుమదులను దోచారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చిట్టిపాపలు పిల్లలు ఇంటిలోనుండాలి ఇల్లు కళకళలాడాలి బాలలు నవ్వుతువుండాలి మోములు వెలుగులుచిమ్మాలి చిన్నారులు ఆటలాడాలి ఆరోగ్యంతో బాగుండాలి పసివారు చక్కగపాడాలి పదిమందిని పరవశింపజేయాలి బాలలు అందంగాయుండాలి అందరిని ఆకట్టుకొనాలి పాపాయిలు ముద్దుగాపలకాలి మన్ననలను పొందుచుయుండాలి బిడ్డలు అమ్మఒడిలోకూర్చుండాలి అనందాలను ఇచ్చుచుండాలి పసివాండ్రు నాన్నభుజాలపైకెక్కాలి పరవశాలను పంచిపెట్టుచుండాలి పసికూనలు చిట్టితమ్ముల నాడించాలి అమ్మకు సాయము చేస్తుండాలి చిట్టిపాపలు చెల్లెలనెత్తుకోవాలి మాటలతోమురిపించి ఏడుపునాపించాలి  తాతకు ముద్దులనివ్వాలి మిఠాయిలు కొనిపించుకోవాలి నానమ్మతో కబుర్లుచెప్పాలి చిల్లరడబ్బులు కొట్టెయ్యాలి పాపలు చదువుతుండాలి విద్యబుద్ధులు నేర్వాలి పసిబాలలు చక్కగమెలగాలి పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి చిన్నపిల్లలు శుచిగానుండాలి నిత్యం స్నానాలుచెయ్యాలి పసివాళ్ళు అల్లరిమానాలి మంచిబుద్ధులు నేర్వాలి చిట్టిపాపాయిలు వెలుగుదివ్వెలు పసివారు లేతగులాబీమొగ్గలు బుజ్జాయిలు బంగరుబొమ్మలు బుడతలు కళ్ళకుకాంతులు పిల్లలపలుకులు తేనెచుక్కలు పాపాయిలనవ్వులు వెన్నెలవెలుగులు పిల్లలు మెరుపులు ఉరుములు పిల్లలు పిడుగులు నీల...
Image
 ఓ వర్ధమాన కవీ! నీకు పేరుప్రఖ్యాతులు రావాలంటే మంచివిషయాలను తెలుపు మనసులనుతట్టి మేలుకొలుపు నీ కవనకార్యం సిద్ధించాలంటే మదినిమదించు మేధనుజోడించు వెన్ననుతేలించు పుటలకెక్కించు నీవు నలుగురినాలుకలలో నానాలంటే ప్రాసలతో కవితనుపండించు అలంకారాలతో అందరినలరించు నీవు కలకాలం నిలవాలంటే ఆలోచనలను అంతరంగాన పారించు అనుభవాలను రంగరించి అక్షరరూపమివ్వు నీవు సాహిత్యలోకాన వెలిగిపోవాలంటే అద్భుతమైన పాత్రలను సృష్టించు మేలయిన మాటలను చెప్పించు నీ మాటలు తూటాల్లా ప్రేలాలంటే ప్రజల మూఢనమ్మకాల నెత్తిచూపు గురిపెట్టు అన్యాయాల నెదిరించు ప్రబోధాల పారించు నీవెంట జనం నడవాలంటే సహాయ సహకారాలను అందించు సమాజ సంక్షేమానికి పాటుపడు నీవు మనసులను మురిపించాలంటే సహజ సౌందర్యాలను వర్ణించు మానసిక ఉల్లాసాన్ని కలిగించు నీవు సుఖశాంతులతో బ్రతకాలంటే కలాన్ని కదిలిస్తుండు వ్రాసినదానితో తృప్తిపడు అభిమానుల మన్ననలను సమీక్షించుకో సక్రమంగానడువు నీవు జీవితాశయాలను సాధించాలంటే బంగారుభవితకు అక్షరపూలబాటను నిర్మించు పధకం ప్రకారం పదాలతో పయనించు పాఠకలోకమప్పుడు ప్రశంసిస్తుంది పరవశిస్తుంది ప్రేమిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మామంచి మశకము నిన్నరాత్రి ఇంటిలో ఒంటరిగానున్నా కవితరాయాలని ఆలోచిస్తున్నా ఇంతలో ఒకమశకమొచ్చింది మాట్లాడింది విషయాన్నిచ్చింది రాత్రి ఒకదోమ దగ్గరకొస్తుంది వెంటనే దూరంగా ఎగిరిపోతుంది కుట్టటంలేదు తాకటంలేదు రక్తంపీకటంలేదు ఆకలితీర్చుకోవటంలేదు చెవుల దగ్గరకొస్తుంది ఏదో చెప్పాలని చూస్తుంది బాధపడుతుంది బలహీనంగాయున్నది పలకరించాలని చూస్తుంది చొరవతీసుకొని  అడిగాను ఎందుకు సందేహిస్తున్నావని ఏమైందని ఏమికావాలని మూడురోజులనుండి  ఆహారంలేదని పస్తులున్నానని ఒపికలేదన్నది మొన్న పెద్ద భవంతిలోకెళ్ళా పగలంతా ఇంటిలో దాక్కున్నా రాత్రి రుచికరమైన రక్తంత్రాగాలనుకున్నా ఇంటిలో మందుచల్లారు తెరలేశారు కుట్టలేకపోయా నిన్న ఓ మధ్యతరగతి ఇంటికెళ్ళా ఒకగదిలో వృద్ధదంపతులు బాధపడుతున్నారు మరోగదిలో తల్లీపిల్లలు అనారోగ్యంతో ఉన్నారు నాకు కుట్టాలనిపించలా ఆకలితోవెనుతిరిగా నేడు నీ ఇంటికొచ్చా నిన్ను చూచా నువ్వు కవివని తెలుసుకున్నా నిన్ను కరవలేకపోతున్నా అన్నది జాలి పడ్డా కన్నీరు కార్చా చెయ్యిని చాచా రక్తం త్రాగమన్నా కుడితే నొప్పిపుడుతుందని రోగాలు వస్తాయని దబ్బు ఖర్చవుతందని పాపం తగులుతుందని అన్నది నీలాంటివారి రక్తంత్రాగనని ఎన్నిరో...
Image
 కళాకారులకు వందనాలు ఎందరో కళాకారులు అందరికి వందనాలు గడ్డిపరకలు తెస్తాడు గూడును అందముగాకడతాడు గుడ్లను పొదుగుతాడు పిల్లలపెంచుతాడు ఓ గిజిగాడు చెక్కను తెస్తాడు చక్కగ చెక్కుతాడు చిత్తరువులు చేస్తాడు చిత్రమైన ఓ కొయ్యకళాకారుడు రాయిని ఎన్నుకుంటాడు ఉలితో మలుస్తాడు దేవతావిగ్రహంగా తీర్చిదిద్దుతాడు భక్తులనలరిస్తాడు ఓ శిల్పాచార్యుడు కుంచెను పడతాడు కాన్వాసుపై గీస్తాడు రంగులు అద్దుతాడు రమ్యమైన చిత్రాలనువేస్తాడు ఓ చిత్రకారుడు పువ్వులు తెస్తాడు దారానికి గుచ్చుతాడు అందమైన దండలు కూరుస్తాడు ముచ్చటపరుస్తాడు ఓ మాలికుడు బంకమట్టిని తెస్తాడు బురదగ మెత్తగతొక్కుతాడు మంచిబొమ్మలు చేస్తాడు రంగులద్దుతాడు ఓ మట్టిమనుజుడు గళమెత్తుతాడు గేయంపాడుతాడు శ్రావ్యతనిస్తాడు ఓ గంధర్వ గాయకుదు వండి వారుస్తాడు నలభీమపాకాల రుచులుచూపిస్తాడు పంచభక్ష్యాలను వడ్డిస్తాడు చెయ్యితిరిగిన ఓ వంటగాడు అక్షరాలను అల్లుతాడు పదాలను పేరుస్తాడు కవితలు కూర్చుతాడు మనసులనుదోస్తాడు ఓ కవీశ్వరుడు కళలకు స్వాగతం కళాకారులకు వందనం కళాకారుల శక్తి కళాకారుల యుక్తి కళాకారుల సృష్టి కలకాలం వర్ధిల్లాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేను నేను ఇంద్రుడను కాను చంద్రుడను కాను పొగిడితే పొంగిపోను నేను కవిని కాను రవిని కాను అఙ్ఞానాంధకారాలను తరుమలేను నేను మంత్రిని కాను మాంత్రికుడను కాను మాటిచ్చిమరచిపోలేను మాయాజాలంచేయలేను నేను శక్తిని కాను యుక్తిని కాను ఎవరినీ ఓడించలేను నేను బడిని కాను గుడిని కాను విద్యలువరాలు ఇవ్వలేను నేను తల్లిని కాను తండ్రిని కాను ఎవరినీ పెంచిపోషించలేను నేను బరువును కాను బాధ్యతను కాను ఎవరికీ భారముకాను నేను కరటకుడిని కాదు దమనకుడిని కాను నీతికధలు బోధించలేను నేను కుక్కను కాను నక్కను కాను మొరగలేను మోసంచేయలేను నేను ప్రకృతిని కాను పురుషుడిని కాను కవ్వించి కవనంచేయించలేను నేను తృణాన్ని కాదు పణాన్ని కాదు చులకనగాచూస్తే ఊరుకోను   నేను అందమును కాను ఆనందమును కాను అందరినీ ఆకట్టుకోలేను నేను గురువును కాను దైవమును కాను దక్షిణలుతీసుకోను దండాలుపెట్టించుకోను నేను పువ్వును కాను నవ్వును కాను కానీ కనబడితే కవితకూర్చకుండా ఉండలేను నేను  కర్రతో కొట్టను కత్తితో పొడవను కానీ కలంతో కట్టేస్తాను నేను కవితను కాను మమతను కాను మనసులను దోచుకోకుండా ఉండలేను నేను అమాయకుడిని  అనామకుడిని అక్షరపిపాసిని గుండ్లపల్లి రాజేంద్రప్రస...
Image
 
Image
 వచనకవితల ఆంధ్రాభోజనానికి స్వాగతం రోజూ వచనకవితలను వండుతున్నా విందుకుపిలిచి షడ్రుచులను వడ్డిస్తున్నా రోజూ కలానికి పనిపెడుతున్నా కమ్మని కవితలను కూర్పిస్తున్నా రోజూ చక్షువులకు చక్కదనాలుచూపిస్తున్నా చూచిన దృశ్యాలను చక్కగా వర్ణించమంటున్నా రోజూ అంతరంగాన్ని ఆలోచించమంటున్నా అందరికి ఆనందమును అందించమంటున్నా రోజూ చేతిని ఆధీనంలోకితీసుకుంటున్నా చక్కని కవనాలను చేబట్టిస్తున్నా రోజూ పాఠకులను  చదివిస్తున్నా పెక్కు భావనలను పంచిపెదుతున్నా రోజూ అక్షరాలను అల్లుతున్నా అందరికి ముత్యాలసరాలను అందిస్తున్నా రోజూ పలుకవితలను కూరిపిస్తున్నా ప్రాసలతో పదాలాను పారిస్తున్నా రోజూ కవితాపఠనం చేస్తున్నా కడుశ్రావ్యతతో ప్రేక్షకులను  కుతూహలపరుస్తున్నా రోజూ కవనసేద్యం చేస్తున్నా కవితా కుసుమాలను కవితాభిమానులకు పంపుతున్నా రోజూ సాహితీపవనాలను విసరుతున్నా సుమ సౌరభాలను చల్లుతున్నా విందుకు రండి తినండి చదవండి తృప్తిని పొందండి కవిని గుర్తించుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
సమానత్వమేది? మానవులంతా  ఒకటే హక్కులందరికీ సమానమే సమానత్వాన్ని వ్యతిరేకిస్తే సంఘర్షణకు దిగుతా విచక్షణ చూపితే విరుచుకపడతా ఎదురుతిరుగుతా ఎల్లవేళలా నవ్వుచుండేవారు కొందరు ఎప్పుడూ ఏడుస్తుండేవారు కొందరు డబ్బుదాచుకునేవారు కొందరు ధనములేకర్ధించేవారు కొందరు భవంతులలో నివసించేవారు కొందరు చెట్లక్రిందరోడ్లమీద ఉండేవారు కొందరు భోగభాగ్యాలలో తేలేవారు కొందరు పేదరికంలో మగ్గేవారు కొందరు కార్లలోవిమానాలలో తిరిగేవారు కొందరు నడకపైసైకిళ్ళపై వెళ్ళేవారు కొందరు ఒడలొంచి పనిజేసేవారు కొందరు బట్టలునలగకుండ పెత్తనంజేసేవారు కొందరు కాలుమీదకాలేసుకొని కూర్చొనేవారు కొందరు తీరికలేకుండా శ్రమించేవారు కొందరు కోరినవన్ని తినేవారు కొందరు తినటానికిలేక పస్తులుండేవారు కొందరు సుఖాలు అనుభవించేవారు కొందరు కష్టాలు పడేవారు కొందరు హాయిగా నిద్రపోయేవారు కొందరు నిదురపట్టక మేలుకొనియుండేవారు కొందరు బానిసలుగా బ్రతికేవారు కొందరు పెత్తనము చలాయించేవారు కొందరు మగవాడినని మీసంమెలవేస్తే బుద్ధిచెబుతా అబలని వెర్రివేషాలేస్తే తిరగబడతా కడుపు తరిగిపోతుంది మనసు మండిపోతుంది కోపము  కట్టలుతెంచుకుంటుంది సమాజాన్ని సంస్కరించాలనిపిస్తుంది ఎవరు దీనికి కారకులు?...
Image
 కవిచంద్రుల కబుర్లు (ఓ శరచ్చంద్రికా!) నీలాకాశమున నిశీధిసమయాన కలువలదొర కనిపించగా కొద్దిసేపు కబుర్లాడా సరదాచేశా సరసాలాడా సంభాషించా సంతసపరచా జాబిలిపరవశించె చెంతకొచ్చె చతురులాడె చక్కదనాలుచూపె కితకితలుపెట్టె పకపకానవ్వె మిలమిలామెరిసె ముద్దులొలికించె వయసు ముదరలేదనె వన్నె తగ్గలేదనె వెన్నెలలో విహరించమనె వ్యామోహాన్ని వదలొద్దనె అదరొద్దనె బెదరొద్దనె చెదరొద్దనె కదలొద్దనె ఆలోచనలిచ్చె ఆవేశపరచె అందాలనుచూపించె ఆనందాన్నికలిగించె కలము పట్టమనె కవిత వ్రాయమనె శ్రావ్యముగ పాడమనె చిత్తాలను దోచుకోమనె నూలుపోగొద్దనె నువ్వేకావాలనె నింగినిచూడమనె నేలనువెలిగిస్తాననె కార్తీకమాసమందు కలిశారు కవిచంద్రులు  చెప్పుకున్నారు కబుర్లు చేశారు కాలక్షేపము  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ఓ శరచ్చంద్రికా కదులు కదిలించు పండువెన్నెలను పరచు చల్లగాలిని విసురు పిల్లల నాడించు ప్రేమికుల నుడికించు మేనులను తరించు మదులను మురిపించు చీకటిని ఛేదించు భయాన్ని పారద్రోలు మబ్బుల్లో విహరించు మనసుల్లో వికసించు రోగులపై ప్రసరించు వ్యాధులను తగ్గించు పూరిగుడిసెలలో తొంగిచూడు పేదరికాన్ని తొలగించు ఆపన్నుల గమనించు ఆహ్లాదము నందించు ధనాన్ని ...
Image
 బాలలదినోత్సవము చాచానెహ్రు పుట్టినరోజు  చిన్నారులకు అంకితము ప్రతినవంబరునెల పద్నాలుగు  భావీపౌరుల దినోత్సవము  పాపాయిల ప్రాముఖ్యము  తెలపటమే ఉత్సవలక్ష్యము పిల్లలకు సక్రమమార్గదర్శనమే  బాలలదినోత్సవ ధ్యేయము పిల్లల పాలబుగ్గలు  పోలును లేతగులాబీమొగ్గలు శిశువుల ముద్దుమాటలు  చల్లును తేనెలజల్లులు పసివాళ్ళ నవ్వులు  ప్రసరించును వెన్నెలకాంతులు బాలల చదువులు  తెచ్చిపెట్టును ఉన్నతోద్యోగాలు చాచాను తలచుకుందాం  బెలూనులు ఎగరేపిద్దాం ఆటలను ఆడిద్దాం  పండుగను జరుపుకుందాం పిల్లలకు బహుమతులిద్దాం  మిఠాయీలు పంచేద్దాం చిన్నారులపట్ల ప్రజలకు  అవగాహన కలిపిద్దాం యావత్తుదేశాన్ని ఒకగృహంగా  భావించమందాం  పిల్లలే దేశభవనానికి  పిల్లర్లనిచెబుదాం అందంగా నిర్మించటంలో  అందరంసాయపడదాం  ఆనందంగా భవిష్యత్తులో  బ్రతకటంనేర్పుదాం సమానత్వాన్ని  పాటించమందాం  సోదరభావంతో  మెలగమందాం కులమతాలను  నిర్మూలించమందాం నవసమాజనిర్మాణానికి  పాటుపడమందాం బాలల్లారా బాలికల్లారా  భావీభారత పౌరుల్లారా భారతదేశం మీదిరా  భవిష్యత్తు ...
Image
 వానొచ్చె వరదొచ్చె వానొచ్చింది ఓయోచనతట్టింది కాలువలుపారాయి ఆలోచనలుసాగాయి ఉరుమొచ్చింది విషయందొరికింది మెరుపొచ్చింది కాగితాలపైకూర్చోపెట్టమంది చినుకులు పడ్డాయి అక్షరాలు కురిశాయి చిటపటమన్నాయి పుటలపైకెక్కించమన్నాయి పిల్లలు బయటకొచ్చారు పదాలు పొంగిపొర్లాయి నీటిలో పడవలువదిలారు కవిగారు కవనంచేబట్టారు చిన్నారులు తడిచారు కవులకలాలను కదిలించారు కేరింతలు కొట్టారు కుతూహల పరిచారు కప్పలు బెకబెకమన్నాయి కవితలు తలలోపుట్టాయి చెరువుకు నీరుచేరింది కాగితాలపై భావంకూర్చుంది గాలి వీచింది మనసు ఊగింది చెట్లు ఊయలలూగాయి భావాలు బయటకొచ్చాయి కమ్మని కలవచ్చింది చక్కని కవితనువ్రాయించింది అందాలు కనువిందుచేశాయి ఆనందంతో మనసునిండింది వానొచ్చె వరదొచ్చె కలముచేతికొచ్చె కవితనువ్రాయించె పాఠకులకుచేర్పించె చక్కగాచదివంచె మాధుర్యమునందించె మదులుమురిపించె కవిగారికి వందనాలు కవితలకు నీరాజనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
పూలవిన్యాసాలు అదిగో కుటపము అవిగో కల్పవృక్షాలు అల్లవిగో కొమ్మలు అందవిగో కుసుమాలు రకరకాల పూలు రమ్యమైన పూలు రంజనచేసే పూలు రుతువులోపూచే పూలు తేనెలొలికే పూలు తేటులపిలిచే పూలు తరువులుతొడిగిన పూలు తరుణులకొప్పులలో తురిమినపూలు మందిరాలలో పూలు మండపాలలో పూలు సమావేశాలలో పూలు సన్మానసత్కారాలలో పూలు పువ్వుపువ్వుదో అందం కళ్ళను కట్టేస్తాయి మనసులను ముట్టేస్తాయి పరికించువారిని పట్టేస్తాయి పువ్వుపువ్వుదో సరసం కొన్ని కనమంటాయి కొన్ని కోసుకోమంటాయి కొన్ని కైపట్టమంటాయి పువ్వుపువ్వుదో పరిమళం మల్లెలు మురిపిస్తాయి సంపంగెలు సంతసపరుస్తాయి సుమసౌరభాలు సంతృప్రిపరుస్తాయి పువ్వుపువ్వుదో పరిహాసం నవ్వులు చిందిస్తాయి మోములు వెలిగిస్తాయి వయ్యారాలు ఒలికిస్తాయి పువ్వుపువ్వుదో వర్ణం వన్నెలతో వలవేస్తాయి ప్రకాశంతో పులకరిస్తాయి రంగులలోకంలొ విహరింపజేస్తాయి పువ్వుపువ్వుదో ప్రకాశం వెలిగిపోతాయి చెలరేగిపోతాయి కళకళలాడుతాయి పువ్వుపువ్వుదో ప్రేరణం ఆలోచనలు రేపుతాయి భావాలను బయటపెట్టిస్తాయి సాహితిని సుసంపన్నంజేయిస్తాయి పువ్వుపువ్వుదో ఆరాటం కవులను కవ్వించాలని కవితలను వ్రాయించాలని కవనంలో ముంచేయాలని పూలవిన్యాసాలు కనండి పూలసందేశాలు వినండి పూలబాణ...
Image
 మృత్యువు చావు బంధాలను తెంచేస్తుంది భూమిఋణాన్ని తీర్చేస్తుంది మృత్యువు తనువుచాలించక తప్పదంటుంది తప్పించటం ఎవరితరంకాదంటుంది నైధనము భయపెడుతుంది బాధపెడుతుంది మృత్యువు పుణ్యాలు చేయమంటుంది స్వర్గానికి తీసుకెళ్తానంటుంది అవసానము పాపాలు వద్దంటుంది నరకయాతన పడవద్దంటుంది నిర్యాణము బంధువులను ఏడిపిస్తుంది ఙ్ఞాపకాలను మిగిలిస్తుంది మరణము ప్రాణం తీస్తుంది శరీరాన్ని శవాన్నిచేస్తుంది హనువు దేహాన్ని కాల్పిస్తుంది బూడిదను చేయిస్తుంది మృతి నలుగురితో మోయిస్తుంది కంటతడి పెట్టిస్తుంది దేహంతము నూకలు చెల్లాయంటుంది జీవితం ముగిసిందంటుంది నిధనము ఆత్మను తీసుకెళ్తుంది అంతర్యామిని తలచుకోమంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం నాకు దేవుదు కనబడ్డాదు ఇష్టమరణవరం ఇచ్చాడు పిలిస్తే తానేవచ్చి తీసుకొనివెళ్తానన్నాడు యమభటులయాగి ఉండదనిచెప్పాడు నాకు యముడు ఒకరోజు పాశంవేశాడు విష్ణువు వెంటనేవచ్చి విడిపించాడు దేవునికి బహుధన్యవాదములు వరమిచ్చినందుకు వేలవందనాలు కనిపించినందుకు కోటిదండాలు ఆయుస్సుపెంచినందుకు ఆజన్మాంతకృతఙ్ఞతలు
Image
 నమ్మండి నమ్మకపోండి గాయాలు కనబడటంలా  కానీ గుండెలు విలపిస్తున్నాయి కళ్ళు కన్నీరు కారుస్తున్నాయి మనసులు బాధలు  పడుతున్నాయి దోమలు కనబడటంలా కానీ కాళ్ళను కుడుతున్నాయి చేతులను పీకుతున్నాయి రక్తాన్ని త్రాగుతున్నాయి దారి కనబడటంలా కానీ ప్రయాణాలు కొనసాగుతున్నాయి బాటనువెదికే ప్రయత్నాలు జరుగుతున్నాయి గమ్యం చేరుకోవాలనే తపనలగపడుతున్నాయి చీకటిలో ఏమీకనబడటంలా కానీ చేతితో తడుముతున్నారు కళ్ళను పొడిచి చూస్తున్నారు మీటనొక్కి దీపాలు వెలిగిస్తున్నారు సమానత్వం కనబడటంలా ఆడామగా భేదాలున్నాయి పేదాధనికుల వ్యత్యాసాలున్నాయి బలహీనులబలవంతుల తేడాలున్నాయి దాతలు కనబడటంలా కానీ అన్నంలేక అలమటించేవారున్నారు ఆదుకునేవారులేక ఆర్తానాదాలు చేసేవారున్నారు సాయపడేవారులేక చేయిచాచి అడుక్కునేవారున్నారు దేవుడు కనబడటంలా కానీ చర్యలు చూస్తున్నాం మహత్యాలు వింటున్నాం పురాణాలు పఠిస్తున్నాం లక్ష్మీదేవి కనబడటంలా కానీ గాజులుగలగలమంటున్నాయి గజ్జెలు మ్రోగుతున్నాయి గృహాలు కలిమితోనిండిపోతున్నాయి వాణీదేవి కనబడటంలా కానీ ప్రేరణలు పుడుతున్నాయి కలాలు పరుగెడుతున్నాయి కవితలు పుట్టుకొస్తున్నాయి మహాకవులు కనబడటంలా కానీ కవనాలు చదువుతున్నాం కవితలు వ...
Image
 మాటలమూటలు మాటలు మూటకడతా మన్ననలు పొందేస్తా మాటలు పేరుస్తా వాటివిలువలు పెంచేస్తా మాటలు విసిరేస్తా తేనెచుక్కలు చల్లేస్తా మాటలు వండేస్తా పంచభక్ష్యాలు వడ్డిస్తా మాటలు కూరుస్తా మాధుర్యం అందిస్తా మాటలు దంచేస్తా పిండివంటలు తినిపిస్తా మాటలు పాటలుచేస్తా చెవులకు శ్రావ్యతనందిస్తా మాటలు ఊదేస్తా సన్నాయి వినిపిస్తా మాటలు మ్రోగిస్తా దరువులు వినిపిస్తా మాటలు అల్లేస్తా పూలమాలలు మెడలోవేసేస్తా మాటలు పారిస్తా జలకాలు ఆడిస్తా మాటలు ప్రేలుస్తా దుష్టులను శిక్షిస్తా మాటలు మండిస్తా మోసకారులను తన్నితగలేస్తా మాటలు సృష్టిస్తా కొత్తదనం చూపిస్తా మాటలు వెలిగిస్తా వెలుగులు చిమ్మేస్తా మాటలు నేర్పుతా అర్ధాలు స్ఫురింపజేస్తా మాటలు మొహరిస్తా పోరాటాలు చేస్తా మాటలు పెనవేస్తా ప్రాసలు ప్రయోగిస్తా మాటలు జతచేస్తా సామెతలు సృష్టిస్తా మాటలు వినిపిస్తా మదులను తట్టేస్తా మాటలు చల్లేస్తా కవితలు పుట్టిస్తా మాటలు కడిగేస్తా అందాలు చూపిస్తా మాటలు మంత్రిస్తా మాయలు చేసేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చూడలేకున్నా!  పంజరములోని పక్షులు రెక్కలువిరిచిన చిలుకలు కట్టిపడేసిన పశువులు బాధతోమొరుగుతున్న కుక్కలు కనబడుతున్నాయి చిల్లిగవ్వలేని జేబులు పస్తులున్న ఖాళీకడుపులు చినిగిపోయిన వస్త్రాలు మాసిపోయిన గడ్డాలు కనబడుతున్నాయి చేతులులేని అంగవిహీనులు కళ్ళులేని కబోదులు కాళ్ళులేని అవిటోల్లు తెలివిలేని పిచ్చోల్లు కనబడుతున్నారు వినపడని చెవిటోళ్ళు మాట్లడని మూగవాళ్ళు బావిలోని కప్పలు ఎండినచెరువులోని చేపలు కనబడుతున్నాయి పనులులేని నిరుద్యోగులు పైసాలులేని పేదవారు మూతబడ్డ కార్ఖానాలు తాళాలేసిన కుటీరాలు కనబడుతున్నాయి ప్రేమలేని జీవితాలు సుఖంలేని కాపురాలు శ్రామికుల చెమటలు చెమటోడ్చే శ్రామికులు ఉద్యోగుల కష్టాలు కనబడుతున్నాయి కట్టేసిన చేతులు బంధించిన కాళ్ళు బక్కచిక్కిన శరీరాలు సంస్కారంలేని శిరోజాలు కనబడుతున్నాయి జేబులుకొడుతూ దొరికినదొంగలు వళ్ళునమ్ముకుంటున్న వనితలు లంచంతీసుకుంటు పట్టుబడ్డతిమింగిలాలు కల్తీసరుకులమ్ముతున్న వ్యాపారులు కనబడతున్నారు చాచే చేతులు తెరుచుకున్న నోర్లు ఏడుస్తున్న కళ్ళు వంగిపోయిన నడుములు కనబడుతున్నాయి కళ్ళెత్తలేకున్నా ముందుచూడలేకున్నా భరించలేకున్నా బాధపడుతున్నా కరుణచూపండి కష్టపడేవారినిచూ...
Image
 ఇదేమిలోకం? ఇదేమిలోకం ఇదేమిలోకం కళ్ళనిండాద్వేషం మనుసులనిండాస్వార్ధం ఇదేమిన్యాయం ఇదేమిన్యాయం బలవంతులదేరాజ్యం ధనవంతులదేపెత్తనం ఇదేమికష్టం ఇదేమికష్టం పనిదొరకటమేకష్టం కడుపునిండటమేకష్టం ఇదేమిధర్మం ఇదేమిధర్మం కులానికోధర్మం మతానికోధర్మం ఇదేమిపక్షపాతం ఇదేమిపక్షపాతం ఆడామగామధ్య వ్యత్యాసం బీదాధనికులమధ్య విచక్షణం ఇదేమిరాజ్యం ఇదేమిరాజ్యం దళారులదేరాజ్యం దోపిడీదారులదేరాజ్యం ఇదేమిపాలనం ఇదేమిపాలనం నేరస్తులదేపాలనం ఫిరాయింపుదారులదేపాలనం ఇదేమిప్రజాస్వామ్యం ఇదేమిప్రజాస్వామ్యం డబ్బిచ్చినవాడికే అధికారం దబాయించినవాడికే ఆధిపత్యం ఇకకలుద్దాం ఇకకలుద్దాం అన్యాయాలను అరికడదాం అక్రమాలను అంతంచేద్దాం ఇకలేద్దాం ఇకలేద్దాం మనుజులను మార్చేద్దాం మరోప్రపంచాని సృష్టిద్దాం అందరమొకటవుదాం అడుగులుముందుకేద్దాం పిడికిలి ఎత్తుదాం పోరాటం చేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెల్లనివన్ని పాలుకాదు చూపేది దైవధ్యానం చేసేది కొంగజపం కనబరచేది కుక్కవిశ్వాసం దాచిపెట్టేది నక్కటక్కరితనం పైకి తీపిచూపిస్తారు లోపల చేదునుదాస్తారు బాహ్యాన లాభమంటారు అంతరాన నష్టపరుస్తారు పలుకులలో ఇష్టంచూపిస్తారు పనులలో కష్టంకలిగిస్తారు నటించి నమ్మబలుకుతారు ఉపక్రమించి ఉపద్రవంచేస్తారు ధర్మాత్మునిగా కనబడతారు దురాత్మునిగా దుర్మార్గాలుచేస్తారు పుణ్యమని చెబుతారు పాపాలను చేస్తారు పైకేమో భక్తిముక్తి లోపలేమో భుక్తిరక్తి సాయం చేస్తామంటారు మోసం చేస్తూయుంటారు పెదవిపై తేనెపూచుకుంటారు కడుపులో విషందాచుకుంటారు మాటలతో నమ్మిస్తారు చేతలతో ముంచేస్తారు కళ్ళకుకనిపించేవన్ని నిజముకాదు అంతరంగాన్నిదర్శిస్తేగాని అసలువిషయంబయటపడదు అన్నివిషయాలు తెలుసుకోండి ఆలోచించి చక్కగామెలగండి తెల్లనివన్ని పాలుకాదు నల్లనివన్ని నీళ్ళుకాదు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కొత్తచోటు కొత్తకలము కొంగొత్తకవిత కొత్తూరు వచ్చా కొత్తవాళ్ళను చూచా కొత్తప్రదేశాలు చూచా  కొత్త అందాలనుకన్నా కొత్త ఉద్యోగంలోచేరా కొత్త ఇంటిలోదిగా కొత్తబట్టలు కట్టా కొత్తకొత్తగా తయారయ్యా కొత్తమాటలు నేర్చా కొత్తపాటలు విన్నా కొత్త ఆటలాడా కొత్త పాటులుపడ్డా కొత్తపువ్వును చూచా కొత్తకోరిక కలిగా కొత్త ఆలోచనలొచ్చా కొత్త కవితలను వ్రాశా కొత్త పెళ్ళాం కొత్త కాపురం కొత్త అనుభవం కొత్త జీవితం కొత్తంత పండుగలేదు అల్లుడంత చుట్టములేదు కొత్త ఒకవింత పాత ఒకరోత కొత్తపాతల మేలుకలయిక నూతనవొరవడి నాకవిత గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం కొత్త కలాన్నిపట్టి కొత్త పుస్తకాన్నికొని పగలంతా రాస్తా రాత్రంతా రాస్తా కొత్తకలంతో గీస్తా కుడిచేతితో చెక్కుతా ఇక చాలని అరిచేదాకా సిరా ఖాళీ అయ్యేదాకా కలంమంచిది కమ్మనైనది కదులుతుంది కదిలిస్తుంది నా కలం నా నేస్తం నా అదృష్టం నా కవిత్వం కలానికి ధన్యవాదాలు కవితలకు స్వాగతాలు
Image
 తామరపువ్వు ఆ తామర సూర్యుడినిచూచింది సంతోషపడింది వికసించింది వయ్యారమొలుకుతున్నది ఆ పద్మము అందాలు చిమ్ముతుంది ఆనందము కలిగిస్తుంది కనువిందుజేస్తుంది కళకళలాడుతుంది ఆ కమలము సరసు మధ్యన ఆకుల మధ్యన మొగ్గల మధ్యన  వెలుగులు చిమ్ముతుంది ఆ సరోజము ఎవరినో చూస్తుంది ఎందుకో పిలుస్తుంది ఎదలను తడుతుంది ఏదో చెయ్యబోతుంది ఆ అరవిందము చెరువుకు అందము లక్ష్మికి ఆసనము కళ్ళకు కమ్మదనము ప్రకృతికి పరవశం ఆ తోయజము ఒక మన్మధబాణము తగిలిన లేపునుతాపము పుట్టించును విరహము కలిగించును వేదనము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం వసంత వధువుకు తామరే సిరిమోము తామరే నయనాలు తామరే అధరాలు తామరే సోయగాలు మన్మధుని అంబులపొదిలో మహోత్పలము మొదటిది  తుమ్మెదలను స్వాగతించటంలో తొలిస్థానము తోయజముది కళ్ళల్లో ఉంటే కమలనేత్రం చెరువులో ఉంటే కమలాకరము మనసులో ఉంటే మనోహరం చేతిలో ఉంటే కరకమలం తామర శోభాయమానం మన జాతీయపుష్పం శుభాలకు చిహ్నం పరమ పవిత్రం పదములుచాలకున్నవి పంకజములవర్ణించ పద్మకవితవ్రాయంగ పాఠకులపంపంగ తామరమాదిరి నిలబడండి కోరినవాటికి పోరాడండి తామరలను ప్రేమించండి లక్ష్మిప్రసన్నం పొందండి
Image
  కవితాజల్లులు కురిపిస్తా కర్షకుల పనిపాటులకు కార్మికుల వ్యయప్రయాసలకు కార్యాలయసిబ్బంది శ్రమకు కూలీల కాయకష్టాలకు కరిగిపోతా కదంత్రొక్కుతా  కడగండ్లు తీరుస్తా కన్నీరు తుడిచేస్తా కవితాజల్లులు కురిపిస్తా హలాలకు పొలాలకు కలాలకు కార్యాలయాలకు గొడ్డళ్ళకు రంపాలకు గడ్డపారలకు కొడవళ్ళకు  సలాము చేస్తా సరఫరా చేయిస్తా నిత్యమూ తలచుతా మనసారా పూజిస్తా కవితాజల్లులు కురిపిస్తా కలాన్ని కత్తిలాఝళిపిస్తా కాగితాలపై భావాలుకురిపిస్తా నవ్యగీతికల నల్లేస్తా రమ్యరీతిన వ్రాసేస్తా శ్రావ్యంగ చెవులచేరుస్తా జనులను చైతన్యపరుస్తా నవసమాజనిర్మాణానికి పాటుబడతా సమన్యాయమందరికి చేయిస్తా కవితాజల్లులు కురిపిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం కనులతో కష్టాలకంటా కలానికి పనిబెడతా కవితలను పాఠకులకుచేరుస్తా కదిలించి పరివర్తనతీసుకొస్తా కవితాజల్లులు కురిపిస్తా బీదల బాగుపరచమంటా భాగ్యాలు భాగించమంటా భావాలు బయటపెడతా  భవ్యదివ్య భారతావనికిపాటుబడతా కవితాజల్లులు కురిపిస్తా విరచించే కవితలకు వినిపించే గీతాలకు వర్ణించే దృశ్యాలకు వివరించేవిధానాలకు వందనాలుచెబుతా కవితాజల్లులు కురిపిస్తా
Image
 తెల్లమందారాలు తెల్లమందారాలు వెలుగులు చిమ్ముతున్నవి కమ్మదనాలు కళ్ళను కట్టిపడేస్తున్నవి తెలుపుమందారాలు స్వచ్ఛముగానున్నవి కళంకములులేక కుతూహలపరుస్తున్నవి శ్వేతమందారాలు సమూహముగానున్నవి చూపరులను సంబరపరుస్తున్నవి గౌరమందారాలు చెట్టుకి ఆకులు తక్కువుగాను పూవులు ఎక్కువగానున్నవి ధవళమందారాలు చక్కగానున్నవి తేనెను తేటులకొరకుదాచుకొనియున్నవి శుక్లమందారాలు దివ్వెలులాయున్నవి కార్తీకమాసపు దీపకాంతులుచిమ్ముచున్నవి హరిణమందారాలు తెంచుకోమంటున్నవి తరుణికొప్పులో తురుమమంటున్నవి అర్జునమందారాలు విచ్చుకొనియున్నవి వయ్యారాలను ఒలకబోస్తున్నవి రజతమందారాలు చెప్పుచున్నవి ఎరుపొకటేకాదు తెలుపూబాగుంటుందని తెల్లనిమందారాలు తెరువరులను ఆకర్షిస్తున్నవి అలరిస్తున్నవి స్వచ్ఛమందారాలు సంతసపరుస్తున్నవి ధవళకాంతులతో ధగధగలాడుచున్నవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం మందార మధురిమలు మగువల మాత్రమేకాదు మగవారి మనసులను మరిపించి మురిపించు కన్నంత మందారపువ్వులు కళ్ళను తెరిపించిపెద్దజేయు మనసునంత దోచు ముచ్చటలందు ముంచు మందారమాట చెవులచేరగను మదినితట్టు పోతనపద్యంబు మరియు గజేంద్రమోక్షంబు  మురిసిపోవు మస్తకంబు  మందారము మకరందము మదనము మాధు...