Posts

Showing posts from February, 2024
ఎందుకు వివక్ష? కొందరు నవ్వుతుంటారు కొందరు ఏడుస్తుంటారు కొందరు వండుతారు కొందరు తింటారు ఒకరిదేమో సొమ్ము వేరొకరిదేమో సోకు ఒకరికేమో సుఖము వేరొకరికేమో కష్టము ఒకరేమో చెబుతారు ఒకరేమో వింటారు ఒకరిదేమో పెత్తనము ఒకరిదేమో బానిసత్వము ఒకరేమో సంపాదిస్తారు వేరొకరేమో ఖర్చుబెడతారు కొందరు పాలిస్తారు కొందరు పాలింపబడతారు కొందరు నేతలు కొందరు అనుచరులు కొందరు నాయకులు కొందరు వినాయకులు కొందరు శూరులు కొందరు భీరులు కొందరు పండితులు కొందరు శుంఠలు కొందరు శాసిస్తారు కొందరు అనుసరిస్తారు కొందరు బుద్ధిమంతులు కొందరు ఙ్ఞానహీనులు ఒకరిదేమో అందం ఒకరిదేమో ఆనందం ఒకరేమో రాస్తారు ఒకరేమో పాడతారు ఎందుకు వివక్ష ఎవరు కారణం గుండ్లల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 అక్షరవిన్యాసాలు (అక్షరాల అభ్యర్ధనలు) అక్షరాలు ఆనందమిచ్చేలా అందంగాపొసగి అందించమంటున్నాయి అక్షరాలు దీపాల్లా వరుసగాపెట్టి వెలిగించమంటున్నాయి అక్షరాలు ముత్యాల్లా దండగాగుచ్చి ధరింపజేయమంటున్నాయి అక్షరాలు కిరణాల్లా వెదజల్లి కళకళలాడించమంటున్నాయి అక్షరాలు అత్తరులా సుమసౌరభాలను చల్లమంటున్నాయి అక్షరాలు తేనెలా తియ్యదనాన్ని పంచిపెట్టమంటున్నాయి అక్షరాలు జాబిలిలా వెన్నెలను వెదజల్లమంటున్నాయి అక్షరాలు హరివిల్లులా వర్ణాలను చూపమంటున్నాయి అక్షరాలు అమృతంలా అధరాలపై చల్లమంటున్నాయి అక్షరాలు వానజల్లులా అంతరంగాలపై కురిపించమంటున్నాయి అక్షరాలు పక్షుల్లా ఆకాశంలో ఎగిరించమంటున్నాయి అక్షరాలు పంచభక్ష్యాల్లా వండివార్చి వడ్డించమంటున్నాయి అక్షరాలు నీరులా ముందుకు పారించమంటున్నాయి అక్షరాలు గేయంగా కూర్చి పాడించమంటున్నాయి అక్షరాలు కవితగా అమర్చి ఆలపింపచేయమంటున్నాయి అక్షరాలను ఆహ్వానిస్తా అందంగా ఆవిష్కరిస్తా అక్షరాలకోర్కెలను ఆమోదిస్తా ఆశించినట్లే ఆచరణలోపెడతా అక్షరాలను అందరికందిస్తా అంతరంగాలలో ఆవాసముంటా అక్షరదేవతలను ఆరాధిస్తా అనునిత్యమూ ఆహ్లాదపరుస్తా ప్రసారసాధనాలకు వందనాలు పాఠకసమూహాలకు ధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,...
 నేను  నీటిపై తేలుతాను గాలిలో ఎగురుతాను భూమిపై నడుస్తాను నింగిలో విహరిస్తాను పూదోటల్లో తిరుగుతాను ఉయ్యాలల్లో ఊగుతాను పొంకాలు చూపుతాను పరిమళాలు పీలుస్తాను పువ్వులను పరికిస్తాను నవ్వులను కురిపిస్తాను కొండలను అధిరోహిస్తాను కోనలలో చరించుతాను నదుల్లో మునుగుతాను కడలిలో తేలుతాను ఆటలు ఆడిస్తాను పాటలు పాడిస్తాను హద్దులు దాటిస్తాను సుద్దులు చెప్పిస్తాను అందాలు చూపిస్తాను ఆనందాలు చేరుస్తాను కలాల్లో దూరతాను కాగితాలపై కూర్చుంటాను అక్షరాలు అమరుస్తాను పదాలు పేరుస్తాను తలపులు తెలుపుతాను భావాలు బయటపెడతాను మస్తకాలనుంచి వెలువడుతాను పుస్తకాలలో ప్రతిబింబిస్తాను కవనాలను కూర్పించుతాను సాహిత్యాన్ని సృష్టించుతాను కలలులోకి వస్తాను కల్పితాలు చేయిస్తాను భ్రమలు కలిపిస్తాను ఆశలు రేకెత్తిస్తాను మెదడులు ముడతాను తలలను తడతాను కనిపించక వినిపిస్తాను కర్ణాలకు విందునిస్తాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎందుకో? ఏమో? తలుపులు తెరచి లోకాన్నిచూడాలనియున్నది చూపులు సారించి లోతులుకాంచాలనియున్నది మనసుదాల్చిన మౌనాన్ని వీడాలనియున్నది మూసుకున్న పెదవులను తెరవాలనియున్నది నోటిలోని మాటలను వదలాలనియున్నది గుప్పెటలోని గుట్టును విప్పాలనియున్నది గుండెలోని దాపరకాన్ని వెల్లడించాలనియున్నది హృదిలోని ప్రేమను బయటపెట్టాలనియున్నది తలలోని తలపులను తెలియజేయాలనియున్నది కడుపులోని మర్మాన్ని కక్కాలనియున్నది కంటినికట్టేసిన దృశ్యాన్ని వర్ణించాలనియున్నది కలకన్న విషయాలను కవితగావ్రాయాలనియున్నది దుర్మార్గుల దుశ్చర్యలను దూషించాలనియున్నది సమాజములోని కల్మషాన్ని కడిగిపారేయాలనియున్నది అంతరంగాన్ని అందంగా ఆవిష్కరించాలనియున్నది మదిలోని భావాలను చెప్పాలనియున్నది తెల్లనివన్ని పాలుకాదని తెలుపాలనియున్నది వినినవన్ని నిజాలుకాదని వివరించాలనియున్నది గళమెత్తి గాంధర్వగానాన్ని గట్టిగా ఆలపించాలనియున్నది కమ్మనైన కవితను పఠించాలనియున్నది ఎదలోని ఆలోచనలను ఎరిగించాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీస్రవంతి సెలయేరులాసాగే ఆలోచనలు ముందుకు పరుగెడుతుంటే మదిలోని స్పందనలు పొంగిపొర్లి పలుకవితలు పుట్టుకొస్తున్నాయి పక్షిలాయెగిరే ఊహలు ఎత్తుకెళుతుంటే భూమ్యాకాశాలు కలుసుకొని బ్రహ్మాండమైనకైతలు బయటకొస్తున్నాయి ప్రకృతినిచూస్తుంటే తలపులు తలనుతడుతుంటే చిత్రవిచిత్రాలు కన్నులనుకట్టేసి చక్కనికయితలను సృష్టిస్తున్నాయి వెన్నెలకురుస్తుంటే చింతనలు చిత్తాన్ని చుట్టుముట్టుతుంటే మదిలోని ముచ్చటలు మురిపించి కమ్మనికవనాలను కూర్చుతున్నాయి నీలిమబ్బులుక్రమ్ముతుంటే విచారాలు విడుదలవుతుంటే వింతలు వైవిధ్యములయి వివిధకవిత్వాలను వెలువరిస్తున్నాయి సూర్యోదయమవుతుంటే యోచనలు హృదయాన్ని కదిలిస్తుంటే అరుణకిరణాలు ప్రసరించి అద్భుతకవితలను ఆవిష్కరిస్తున్నాయి పూలు విచ్చుకుంటుంటే భావాలు బలపడుతుంటే పొంకపరిమళాలు ప్రబలమయి పూలకయితలను పుటలకెక్కిస్తున్నాయి అక్షరాలు చిక్కుతుంటే హృది అందుకొని అల్లుతుంటే పదములు ప్రాసలయి పసందైనపాటలు పొడుచుకొస్తున్నాయి ఆలోచనలు ఆలోలములయి సాయంకాలపు నీడలయి తందనాలాడుతుంటే సాహితీ స్రవించుతుంది అందినకవితలుచదవండి అర్ధంచేసుకోండి ఆస్వాదించండి అనుభవించండి ఆహ్లాదపడండి అంతరంగంలోనిలుపుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసా...
 ఓ పువ్వు ఓ పువ్వు పిలిచింది పసిపాపలా పకపకానవ్వుతూ ఓ పువ్వు పలుకరించింది ప్రేయసిలా ప్రేమలొలుకుతూ ఓ పువ్వు పరవశపరిచింది పేరంటాలులా పలుమాటలుచెబుతూ ఓ పువ్వు పరిమళంచల్లింది పీల్చమని పులకరించపరుస్తూ ఓ పువ్వు పొంకాలుచూపింది పలురంగులుచూపి ప్రేరేపిస్తూ ఓ పువ్వు ప్రోత్సాహపరచింది పేనాపట్టమని పుటలునింపమనీ ఓ పువ్వు ప్రణాళికిచ్చింది పదాలుపేర్చమని ప్రాసలుకూర్చమనీ ఓ పువ్వు అందాలనుచూపింది అంతరంగానికి ఆనందమునివ్వమంటూ ఓ పువ్వు పాటపాడింది శ్రావ్యతను చెవులకందిస్తూ ఓ పువ్వు నవ్వించింది పెదాలనుకదిలించి మోమునువెలుగిస్తూ ఓ పువ్వు నోరూరించింది తేనెచుక్కలుచల్లి తియ్యదనాన్నిచేకూర్చుతూ పువ్వు కవ్విస్తుంది కవితలను వ్రాయమంటూ పువ్వు ప్రక్కకొస్తుంది పరిహాసాలాడి ప్రీతినందిస్తూ పువ్వు నాదీ ప్రేమ నాదీ సుమము నాదీ సోయగము నాదీ కుసుమము నాదీ కుతూహలము నాదీ ఆర్తవము నాదీ ఆహ్లాదము నాదీ పూలలోకంలో విహరిస్తా పుష్పకవితల్లో ముంచేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవనతతంగం కాలచక్రం తిరుగుతుంది సమయము చాలకున్నది డబ్బులు ఖర్చవుతున్నాయి జేబులు ఖాళీయవుతున్నాయి సరుకులు నిండుకుంటున్నాయి త్వరగాతెచ్చి నింపమంటున్నాయి ప్రేమలు తరగిపోతున్నాయి ద్వేషాలు పెరిగిపోతున్నాయి కానీ అక్షరాలు అడగకుండా అందుబాటులోకొస్తున్నాయి పదాలు పరుగెత్తుకుంటు ప్రక్కకొస్తున్నాయి ఆలోచనలు ఆగకుండా ఊరుతున్నాయి భావాలు బయటపెట్టమని గోలచెస్తున్నాయి కవిత్వము సెలయేరులా సాగిపోతుంది సాహిత్యము పుటల్లో నిలిచిపోతుంది పాఠకులు ప్రతిదినము చదువుతున్నారు విమర్శకులు అద్భుతంగా మెచ్చుకుంటున్నారు వాగ్దేవి వాక్కులిస్తుంది సాహితి స్ఫూర్తినిస్తుంది హయగ్రీవుడు ఙ్ఞానాన్నిస్తున్నాడు బ్రహ్మదేవుడు సృజనచేయిస్తున్నాడు కవనానికి సిద్ధం కవితలకి స్వాగతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 రావా!  (ఓ కవిత్వమా) రావా సీతాకోక చిలుకలా పచ్చని శుకములా మొగ్గతొడిగిన మొక్కలా రావా పురివిప్పిన నెమలిలా గళమెత్తిన కోకిలలా ఒయ్యారి హంసనడకలా రావా ఆప్యాయంగా అందంగా ఆనందంగా రావా విరిసిన పువ్వులా వాన చినుకులా రంగుల హరివిల్లులా రావా రవికిరణంలా శశివెన్నెలలా తారతళుకులా రావా ప్రియమైన పలకరింపుతో తియ్యనైన మాటలతో శ్రావ్యమైన గళముతో రావా ముచ్చటగా ముద్దుగా మురిపముగా రావా కళ్ళకు సొంపుగా చెవులకు ఇంపుగా వంటికి ఒప్పుగా రావా ఆటలా పాటలా మాటలా రావా అలోచనగా భావముగా విషయముగా రావా కలంగా కాగితంగా కవిత్వంగా రావా పద్యంగా పాటగా కవితగా రావా గుండెను తాకేలాగా హృదిని ముట్టేలాగా మనసును దోచేలాగా రావా తోడుగా ఉండటానికి నీడగా నిలవటానికి ఘనంగా జీవింపజేయటానికి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ మనసా! ఆలొచనారూపంలో వస్తావు ఓ వెలుగునిచ్చి వెళ్తావు ఓ ఆటను ఆడించుతావు ఎందుకొస్తావో ఎప్పుడొస్తావో ఎలామాయమవుతావో అడిగితే చెప్పవుగదా! అదృశ్యరూపంలో ఉంటావు గుండెను ఆడిస్తుంటావు దేహాన్ని నడుపుతుంటావు చెప్పకుండా వస్తావు చెప్పకుండానే వెళ్తావు అడిగితే చెప్పవుగదా! ప్రొద్దున్నే  మేనునుతట్టి మేలుకొలుపుతావు పనులకు ఉసిగొలుపుతావు రాత్రికి చీకటినిచేసి విశ్రాంతితీసుకోమని వెళ్తావు కాలచక్రాన్ని ఎందుకుతిప్పుతావో చెప్పవుగదా! నిలదీస్తే నేనే నువ్వంటావు నువ్వే నేనంటావు ఇద్దరం కలిసే ఉందామంటే ఒప్పుకోవు మూతిముడిచి వెళ్ళిపోతావు నాపై పెత్తనం చలాయిస్తుంటావు ఎందుకని అడిగితే చెప్పవుగదా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 సరికొత్తగా వ్రాయాలనుకుంటున్నా! కొత్తగా కమ్మగా కోమలంగా వ్రాయాలనుకుంటున్నా! అద్భుతంగా అద్వితీయంగా అలరించేలాగా వ్రాయాలనుకుంటున్నా! రసవత్తరంగా రమణీయంగా రకరకాలుగా వ్రాయాలనుకుంటున్నా తీపిగా ప్రీతిగా యుక్తిగా వ్రాయాలనుకుంటున్నా! సూక్షంగా సరళంగా సక్రమంగా వ్రాయాలనుకుంటున్నా! విన్నూతనంగా విభిన్నంగా వైవిధ్యంగా వ్రాయాలనుకుంటున్నా! అందంగా ఆహ్లాదంగా ఆత్మీయంగా వ్రాయాలనుకుంటున్నా! అర్ధమయ్యేలా ఆలోచింపజేసేలా అంతరంగాన్నితట్టేలా వ్రాయాలనుకుంటున్నా! శ్రావ్యంగా సౌరభంగా సృజనాత్మకంగా వ్రాయాలనుకుంటున్నా! కళాత్మకంగా కవితాత్మకంగా కవ్వించేలాగా వ్రాయాలనుకుంటున్నా! పోలికలతో ప్రాసలతో పదప్రయోగాలతో వ్రాయాలనుకుంటున్నా! భావత్మకంగా రసాత్మకంగా అర్ధవంతంగా వ్రాయాలనుకుంటున్నా! మనసునుముట్టేలా గుండెనుతట్టేలా హృదిననిలిచేలా వ్రాయాలనుకుంటున్నా! ఆస్వాదించేలా ఆనందించేలా అభినందించేలా వ్రాయాలనుకుంటున్నా! అలా వ్రాయాలని అక్షరాలు అడుగుతున్నాయి పదాలు ప్రార్ధిస్తున్నాయి వస్తువులు వెంటబడుతున్నాయి అలా వ్రాయమని కలము కోరుతున్నది కాగితము వేడుకుంటుంది కవిత కవ్విస్తున్నది అలా వ్రాయాలని మనసు ముచ్చటపడుతున్నది కోరిక వెంటబడుతున్నది భావము బ్రతిమ...
 నా కివ్వవా! నా కివ్వవా! ఓ గిలిగింత పలుకరింత పులకరింత కవ్వింత నా కివ్వవా! ఓ ప్రేమ పలుకు తీపి పలుకు నచ్చే పలుకు మెచ్చే పలుకు నా కివ్వవా! ఓ ఇంపు సొంపు జలదరింపు కలవరింపు నా కివ్వవా! ఓ చక్కదనము తియ్యదనము కమ్మదనము తేటదనము  నా కివ్వవా! ఓ అందమైన చూపు మదినిముట్టే చూపు మరచిపోలేని చూపు మధురమైన చూపు నా కివ్వవా! ఓ చిత్రమైన నవ్వు పువ్వులాంటి నవ్వు ప్రకాశించే నవ్వు పరవశపరచే నవ్వు నా కివ్వవా! ఓ గుబులులేపేముద్దు గుర్తుండిపోయే ముద్దు వయ్యారాల ముద్దు తియ్యనైన ముద్దు నా కివ్వవా! ఓ ఇష్టమైన కబురు సంతసపరచే కబురు కలకాలమునిలిచే కబురు కేరింతలుకొట్టించే కబురు నా కివ్వవా! ఓ వాత్సల్యభరిత స్పర్శ అణువణువూతట్టే స్పర్శ మైమరిపించే స్పర్శ మమకారంచిందే స్పర్శ నా కివ్వవా! ఓ మంచి సమయం ఆనంద సమయం ఏకాంత సమయం ఏమరచే సమయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నీటిమాటలు చిరుజల్లులల్లో చిందులేస్తా చిన్నపిల్లాడిలా చినుకుల్లోతడుస్తా పిల్లకాలువల్లో పడవలేస్తా పసిపాపలతో పరుగులుతీస్తా నదిలో మునుగుతా పాపాలను ప్రక్షాళనచేసుకుంటా ఏటికి ఎదురీదుతా దమ్మున్నవాడినని డబ్బాకొట్టుకుంటా చెరువుల్లో ఈతకొడతా వడగాల్పులనుండి రక్షించుకుంటా తలంటుకోని స్నానంచేస్తా కల్మషాన్ని కడిగేసుకుంటా సముద్రంలో దిగుతా అలలపై తేలియాడుతా నీళ్ళను త్రాగుతా ప్రాణాలను కాపాడుకుంటా వర్షాలు కురిపిస్తా పంటలను పండిస్తా వానజల్లులు చల్లిస్తా వంటిని తడిపేస్తా గాలివానను కురిపిస్తా వరదలను పారిస్తా సెలయేర్లను పారిస్తా సంతసాలను కూరుస్తా నీటిమాటలు చెబుతా మాటలమూటలు కట్టేస్తా మాటలు వినండి మూటలు కట్టుకోండి మదుల్లో దాచుకోండి మరచిపోకుండా మురిసిపోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ తెలుగోడి తపన! వేడుకుంటున్నా చేతులుపట్టుకొని చెయ్యొద్దురా తెలుగుకుహాని బ్రతిమిలాడుతున్నా గడ్డంపట్టుకొని కొనసాగించకురా తెలుగుకుకీడుని ప్రార్ధిస్తున్నా దండంపెట్టి నిందించకురా తెలుగుభాషని సవినయంగా విన్నవించుకుంటున్నా సాగించకురా తెలుగుపైద్వేషము ప్రోత్సహించకురా పరాయిభాషను తక్కువచేయకురా తల్లితెలుగును వాడొద్దురా ఆంగ్లపదాలను చేయ్యొద్దురా తెలుగుహత్యను కోరుతున్నా గట్టిగా గళమెత్తి  తేవొద్దురా తెలుగుకు అపకీర్తిని ప్రాధమిక పాఠశాలల్లో తప్పనిసరిచేయరా తెలుగుమాధ్యమాన్ని పడకురా పరాయిమోజునందు వదలకురా తెలుగుచదువులును నిర్బంధము చెయ్యరా తెలుగుభాషను తెలుగుప్రాంతాల్లో తెలుసుకోరా మాతృభాషను తృణీకరిస్తే స్వంతతల్లిని నిరాదరణకు గురిచేసినట్లే కాచుకోరా కన్నతల్లిని కాపాడుకోరా తెలుగుతల్లిని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహిత్యవనం ఓ పువ్వు పిలిచింది ఓ నవ్వు విసిరింది ఓ ప్రేమ చూపింది ఓ ముద్దు కోరింది ఓ దృశ్యం కనబడింది ఓ విషయం ఇచ్చింది ఓ అందం ఆకర్షించింది ఓ ఆనందం అందించింది ఓ మోము వెలిగింది ఓ స్పందన కోరింది ఓ ఊహ తట్టింది ఓ ఆశ లేపింది ఓ భావన సృజించింది ఓ భ్రాంతి స్ఫురించింది ఓ కలము చేతికొచ్చింది ఓ కాగితము నింపింది ఓ కవిత పుట్టింది ఓ వెలుగు చిమ్మింది ఓ కవి వెలుగువెలిగాడు ఓ ఖ్యాతి అందుకున్నాడు ఇది  కవితలకాలం ఇది కవులకాలం ఇది సమ్మేళనాలకాలం ఇది సత్కారాలకాలం ఇది కవిత్వలోకం ఇది సాహిత్యవనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మనసులోని ముచ్చట్లు తలుపులు తెరవాలని బయటకు వెళ్ళాలని రెక్కలు విప్పుకోవాలని ఆకాశానికి ఎగిరిపోవాలని మనసు ఉబలాటపడుతుంది నోరు విప్పాలని హితాలు చెప్పాలని  తేనెను చిందాలని తీపిగా పలుకాలని మనసు ముచ్చటపడుతుంది కాళ్ళు కదిలించాలని చేతులకు పనిపెట్టాలని వళ్ళు వంచాలని ఘనకార్యాలు చేయాలని మనసు కుతూహలపడుతుంది పూతోటకు వెళ్ళాలని పూలపొంకాలు కాంచాలని పరిమళాలు పీల్చాలని పరమానందంలో మునగాలని మనసు ఉత్సాహపడుతుంది కొండలు ఎక్కాలని కోనలు కాంచాలని సెలయేర్లు దర్శించాలని ప్రకృతినిచూచి పరవశించాలని మనసు ఆశపడుతుంది జాబిలిని చూడాలని వెన్నెలలో విహరించాలని స్వేదతీరాలని సుఖపడాలని మనసు ఆరాటపడుతుంది ప్రొద్దున్నే లేవాలని ఉషోదయము చూడాలని అరుణకిరణాలు వీక్షించాలని దినచర్యలు ప్రారంభించాలని మనసు కాంక్షిస్తుంది అభిమానుల పొందాలని ఆత్మీయుల సంపాదించాలని అనురాగాలు పంచుకోవాలని అంతరంగాన్ని తృప్తిపరచాలని మనసు అభిలాషిస్తుంది అక్షరాలు ఏరాలని పదాలు పారించాలని ప్రాసలు కలపాలని కవితలు సృష్టించాలని మనసు కోరుకుంటుంది తలపులు తట్టాలని భావాలు పుట్టాలని విషయాలు దొరకాలని మదులను దోచాలని మనసు తహతహలాడుతుంది ఏమి చెయ్యను? మనసు చెప్పినట్లు మసలుకుంట...
 ఓ మంచిమిత్రమా! కళ్ళను మెరిపించు కర్ణాలను మెప్పించు మోమును నవ్వించు మదిని మురిపించు అందాలు చూపించు ఆనందాలు అందించు పూలను పూయించు పరిమళాలు వీయించు పలుకుల తేనెలచిందు పెదవుల అమృతంక్రోలించు వెన్నెల కురిపించు హాయిని కలిగించు ముందుకు నడిపించు శిఖరాలకు చేర్పించు దారులు చూపించు గమ్యాలను చేర్పించు ఆలోచనలు రేకెత్తించు అనుభూతులు పొందనివ్వు భావనలు పుట్టించు గుండెలను కదిలించు క్షేమము కాంక్షించు కూరిమిని కొనసాగించు సలహాలు ఇవ్వు సమస్యలు తీర్చు ప్రాణమిత్రులుగా నిలిచిపోదాం ప్రేమాభిమానాలతో పరిఢవిల్లుదాం స్నేహవిలువలు చాటుదాం చెలిమిబంధాలు సాగిద్దాం అందరికి ఆదర్శంగానిలుద్దాం కలసిమెలసి ప్రపంచాన్నిజయిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 అక్షరబంధాలు అక్షరాలకు బీగంవేస్తే బద్దలుకొడతా బయటకుతీస్తా అక్షరాలను మూటకడితే ముళ్ళువిప్పుతా మెరిపిస్తా అక్షరాలకు మురికిపూస్తే కడుగుతా ముస్తాబుచేస్తా అక్షరాలను పారవేస్తే ఏరుకుంటా ఎదలోదాచుకుంటా అక్షరాలను కట్టేస్తే సంకెళ్ళుతెంచుతా స్వేచ్ఛగాతిరుగమంటా అక్షరాలపై అపనిందలేస్తే నోరుమూపిస్తా నిగ్గుతేలుస్తా అక్షరాలను మరువమంటే ధిక్కరిస్తా వీలుకాదంటా అక్షరాలను వీడమంటే విననుపొమ్మంటా వల్లకాదంటా అక్షరాలతో పోరాడమంటే కుదరదంటా తలలోదాచుకుంటా అక్షరాలు ఙ్ఞానమంటా అంధకారమును తరిమేస్తాయంటా అక్షరాలను సత్యమంటా నిజాలుతెలుసుకొని మెలగమంటా అక్షరాలు లక్షలతోసమానమంటా అమూల్యమైనవని అర్ధంచేసుకోమంటా అక్షరాలు ఆలోచనలకురూపమంటా అద్భుతభావాలను అందంగాతీర్చిదిద్దమంటా అక్షరాలు అలరులంటా సుగంధాలను చల్లుతాయంటా అక్షరాలను నమ్మమంటా ఆనందాలను పొందమంటా అక్షరాలను సాహిత్యమంటా చదువుకొని సంబరపడమంటా అక్షరాలు దేవతలంటా అనునిత్యమూపూజించమంటా దశదిశలావ్యాపించమంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అద్దం కమామిషు అద్దం నిన్ను చూపుతుంది నీషోకులు చూపుతుంది అద్దం ఉన్నది ఉన్నట్టుచూపుతుంది నిజరూపాన్ని ప్రతిబింబిస్తుంది అద్దం  అమాయకమయినది ఆలోచనలులేనిది అద్దం గుండెలాంటిది పగిలితే అతకదు అద్దం అందమైనది అవసరమైనది కొందరి చెక్కిళ్ళు అద్దంలాయుంటాయి కొందరి మనసులు అద్దంలాయుంటాయి కొందరి బ్రతుకులు అద్దంలాయుంటాయి కొందరు అద్దాలమేడలలో నివసిస్తుంటారు అద్దం ఆడవాళ్ళకు అతిప్రీతిపాత్రము అందమైన జీవితము అద్దాలసౌధము మీరూ అద్దంలోచూడడండి అవలోకనంచేసుకోండి అద్దం అభిమానంగాపిలిచింది అందంగాకవితనువ్రాయించింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఎవరో చూడొస్తున్నారు? ఎవరో చూడొస్తున్నారు ఏదో చేసిపోతున్నారు ఎవరో వీస్తున్నారు ఏవో చూపిస్తున్నారు ఏలనో అదృశ్యంగాయున్నారు ఎందుకో అర్ధంకావటంలేదు ఆలోచనలని తలకెక్కిస్తున్నారు అంతరంగాలని తడుతున్నారు చెట్లను ఊపుతున్నారు వచ్చామని చాటుతున్నారు సుగంధాలు చల్లుతున్నారు సంతోసించమని చెబుతున్నారు మాటలను మోసకొస్తున్నారు సమాచారమును చేరవేస్తున్నారు హోరుశబ్దము వినిపిస్తున్నారు తూఫానుని సూచిస్తున్నారు మేనును ముడుతున్నారు మనసును మైమరపిస్తున్నారు మేఘాలను తరుముతున్నారు ఆకాశాన్ని కప్పుతున్నారు జుట్టును లేపుతున్నారు సవరించుకోమని హెచ్చరిస్తున్నారు పడతుల పయ్యెదలులేపుతున్నారు పడుచుల ఆటపట్టిస్తున్నారు కళ్ళల్లో దుమ్మునుచల్లుతున్నారు చూచింది ఇకచాలంటున్నారు అదృశ్యగాలికి వందనాలు చాటింపులకి ధన్యవాదాలు పవనమా స్వాగతము గుండెనాడిస్తున్నందుకు కృతఙ్ఞతలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 జైజై తెలుగు తెలుగుకు రంగుంది రుచియుంది రమ్యతయుంది వివిధ వర్ణాలలో వెలుగులు చిమ్ముతుంది చక్కదనాలు చూపిస్తుంది సంతసాలు కలిగిస్తుంది కళ్ళను కట్టేస్తుంది విరులను వీక్షించమంటుంది పలుకులలో తేనెలుచిందుతుంది పెదవులకు అమృతమందిస్తుంది నోర్లలో నానుతుంది నాలుకలపై నర్తిస్తుంది అక్షరభక్ష్యాలు తినిపిస్తుంది ఆహ్లాదాలను అందిస్తుంది అందాలను వర్ణిస్తుంది ఆనందాలను చేరుస్తుంది షోకులు చూపుతుంది సంబరాలు చేసుకోమంటుంది మాటలు మూటకడుతుంది మదులను ముట్టేస్తుంది అందుకే మనతెలుగు వెలుగుతుంది వ్యాపిస్తుంది జైజై తెలుగు జయహో తెలుగు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓ నాచెలీ! (ఓ చిత్ర విచిత్రమా!)   ఎర్రచీర కట్టావని ప్రమాదమని దూరంగాపోను తెల్లచీరకట్టలేదని దగ్గరకురాకుండా ఉండలేను కళ్ళు మూసుకున్నావని చిలిపిచేష్టలు చెయ్యను కళ్ళు తెరుచుకోలేదని కనపడకుండా మానను జుట్టు విరబూసుకున్నావని అందము తగ్గిందనుకోను కొప్పు ముడివెయ్యలేదని పూలివ్వటము మానను చందమామ వెనుకున్నాడని నీమోముకు సాటికాడనుకుంటాను చందమామ ముందున్నా నినుచూడక మాననేమానను సాంబ్రాణి పొగవేసినా నా దృష్టిమరల్చను సాంబ్రాణి వెయ్యకపోయినా నా కోరికనువీడను నగలు లేవని తక్కువచేయను వగలు ఉన్నదని ఉబలాటపడతాను నవ్వులు చిందినా ఇష్టపడతాను నవ్వులు దాచినా నష్టంలేదనుకుంటాను నీ మదిలో దేవుడున్నా ఇబ్బందిలేదు నీ హృదిలో నేనున్నా పరవాలేదు ఎరుపుగా ఉన్నావని వెర్రివాడనుకాను నల్లగా ఉన్నా ప్రేమించకమానను అందంగా ఉన్నావని పిచ్చివాడిగా వెంటబడను కురూపిగా ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు నల్లబొట్టు పెడితే దిష్టిచుక్కనుకుంటా ఎరుపుబొట్టుపెడితే సింధూరపుబొమ్మవనుకుంటా  కట్టూబొట్టూ చూసి సంప్రదాయ స్త్రీవనుకుంటా దైవభక్తి తెలసి సుమతివి అనుకుంటా  ఇంకెందుకు ఇక ఆలశ్యంచేయటం వెనకడుగు వేయక జతకట్టిముందుకెళ్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యన...
 పాపాయి ఊసులు మాటలురాని పాపాయి ప్రొద్దున్నె మేలుకొలిపి పలుకులను పెదవులకిచ్చి పుటలపై పెట్టమంటుంది నడకరాని పాపాయి కళ్ళముందుకు వచ్చి పదాలను పసందుగాకూర్చి ప్రాసలతో నడిపించమంటుంది అమాయకమైన పాపాయి  ఎత్తుకోమని కోరి అయోమయంలేని అద్భుతకైతని ఆవిష్కరించమని అడుగుతుంది చిరునవ్వుల పాపాయి చెంతకు వచ్చి అందరి మోములని వెలిగించమని వేడుకుంటుంది అందమైన పాపాయి అంతరంగంలో నిలిచి చక్కని కయితని చదువరులకు చేర్చమంటుంది అల్లారుముద్దుల పాపాయి ఆనందాలను అందించి అమితంగా ఆకట్టుకొని అక్షరాలతో అలరించమంటుంది కల్లాకపటంతెలియని పాపాయి ప్రేమానురాగాలు చూపించి తేనెచుక్కలు చిందించి అక్షరజల్లులు  కురిపించమంటుంది ఆలోచించలేని పాపాయి మనసును దోచుకొని తలనుతట్టి తలపులిచ్చి తెల్లకాగితంపై తెలుపమంటుంది పసి పాపాయిలు పరమాత్ముని సృష్టి అద్భుత కవితలు కవిబ్రహ్మల సృష్టి పాపాయిలను చూచి పరవశించిపోండి కవనాలను చదివి కుతూహలపడండి నచ్చితే నందకం మెచ్చితే ముదావహం పాపాయిలకి దీవెనలు పాఠకులకి ధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందచందాలు అందంగా అందరికీ కనపడాలనియున్నది ఆనందాన్ని అందరికీ పంచాలనియున్నది కమ్మగా ఎల్లవారునీ పలుకరించాలనియున్నది కబుర్లుచెప్పి ఎల్లరునీ కుతూహలపరచాలనియున్నది చక్కగా సర్వులతో మాట్లాడాలనియున్నది చిరునవ్వులని సర్వులతో చిందించాలనియున్నది సుందరమైన చిత్రమొకటి గీయాలనియున్నది చూపరుల చిత్తాలను తట్టాలనియున్నది పూలపొంకాలను పలువురితో పరికింపజేయాలనియున్నది పరిసరాలందు పరిమళాలను ప్రసరింపజేయాలనియున్నది ముగ్ధమోహనమైన మానినిని మచ్చికచేసుకోవాలనియున్నది మూడుముళ్ళువేసి మమతానరాగాలుపంచి మురిపించాలనియున్నది మురిపాల పాపాయిలను ముద్దాడాలనియున్నది ముద్దుముద్దు మాటలనువిని సంతసించాలనియున్నది రమణీయ దృశ్యాలని కాంచాలనియున్నది ప్రకృతినిచూచి పరవశంతో పొంగిపోవాలనియున్నది జాను తెలుగులోన పాడాలనియున్నది జనులనెల్ల జాగృతము చేయాలనియున్నది ముచ్చటైన కవితనొకటి వ్రాయాలనియున్నది పాఠకుల మదులను దోచుకోవాలనియున్నది అందాలను చూడండి ఆనందాలను పొందండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఎవ్వరో? ఎవరో వీపుతడుతున్నారు పొద్దుపొడవకముందే మేల్కొలుపుతున్నారు ఎవరో మాటలుచెబుతున్నారు మంచితలపులను మెదడుకెక్కిస్తున్నారు ఎవరో పురమాయిస్తున్నారు పనిలోనికి దించుతున్నారు ఎవరో కవ్విస్తున్నారు కార్యాన్ని అప్పగిస్తున్నారు ఎవరో ఉత్సాహపరుస్తున్నారు ఉల్లాన్ని ఊగిసలాడిస్తున్నారు ఎవరో తొందరపెడుతున్నారు తాత్సారము చెయ్యొద్దంటున్నారు ఎవరో అందాలనుకనమంటున్నారు అందరిని ఆస్వాదింపజేయమంటున్నారు ఎవరో ఆనందపరుస్తున్నారు అందరికి పంచిపెట్టమంటున్నారు ఎవరో గొంతుసవరించుకోమంటున్నారు గళాన్ని గట్టిగావినిపించమంటున్నారు ఎవరో పెదవులనుతెరవమంటున్నారు పలుకులను తియ్యగాచిందించమంటున్నారు ఎవరో దారిచూపుతున్నారు గమ్యానికి తీసుకెళ్తున్నారు ఎవరో ఆఆగంతకుడు అతనికి ధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అతని దినచర్య రోజూ అతనిది అదే శ్వాస అదే ధ్యాస అదే మూస రోజూ అతనిది అదే నడక అదే దారిపట్టి అదే గమ్యానికి రోజూ అతనిది ఒకటే వ్రాత అక్షరాలు ఏరి పదాలు పొసిగి రోజూ అతనికి అవే ఆలోచనలు వంటినిండా తలనిండా రోజూ అతనివి కమ్మని కవనాలు కలమును పట్టి కాగితాలు నింపి రోజూ అతగాడివి బలే వడ్డింపులు రుచిగా శుచిగా రోజూ అతనిది అదే పని సాహితీసేద్యం చేయటం కైతలపంట పండించటం రోజూ అతగాడివి అవే కూర్పులు అందాలు చూపాలని ఆనందాలు కలిగించాలని రోజూ అతనిక్రియ వస్తువుల వేటాడటం ఊహల ఊరించటం మాటల మూటకట్టటం రోజూ అతనిది ఒకటే పూజ తెలుగుతల్లిని తలచి వాణీదేవిని ధ్యానించి రోజూ పాఠకులకి నచ్చుతుందా ముచ్చట కొలిపి మనసులను దోచి చూద్దాం మనం వేచిచూద్దాం కొంతకాలం సమయమిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 అంతా భ్రాంతియేనా! గాలి మెల్లగావీస్తుంది శబ్దాలను మోసుకొనివస్తుంది పాట వినబడుతుంది ఆట ఆడిస్తుంది మేను నాట్యంచేస్తుంది ఎద ఆనందపడుతుంది చేతులు తాళంవేస్తున్నాయి కాళ్ళు చిందులుత్రొక్కుతున్నాయి గొంతు తియ్యగాఉంది మనసు తృప్తిపడుతుంది భావం బాగున్నది అర్ధం తలకెక్కుతుంది హీరో స్టెప్పులేస్తున్నట్లుంది హీరోయిన్ సైడునయెగురుతున్నట్లుంది ఆడియో వినబడుతున్నట్లుంది వీడియో కనబడుతున్నట్లుంది రీలు తెగినట్లుంది సీను కట్టయినట్లుంది ట్రాన్సుఫార్మరు ప్రేలినట్లుంది ఎలెక్ట్రిసిటి పోయినట్లుంది శబ్దం ఆగిపోయినట్లుంది బొమ్మ కనుమరగయినట్లుంది లయ తప్పినట్లుంది మది మేలుకున్నట్లుంది అక్షరాలు అల్లుకున్నట్లుంది పదాలు అమరినట్లుంది కవిత తయారయినట్లుంది పాఠకులకు చేరవేసినట్లుంది ఊహలలో మునిగినట్లుంది భ్రమలలో పడిపోయినట్లుంది కవిత్వం కల్పనలేనా సహజత్వం శూన్యమేనా అంతా భ్రాంతియేనా మనమంతా ఇంతేనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 తెలుగు వెలుగురా! తెలుగు మనదిరా వెలుగు మనదిరా తెలుగు ప్రీతిరా పలుకు తీపిరా                ||తెలుగు|| తెలుగు సుందరమురా ఇచ్చు సంతసమురా తెలుగు సుమమాలరా వీచు సుగంధాలరా            ||తెలుగు|| తెలుగు జాబిలిరా చల్లు వెన్నెలరా తెలుగు పలుకరా తేనెను చిందరా               ||తెలుగు|| తెలుగు బిడ్డా గళము నెత్తరా తెలుగుపాట పాడరా అమృతము కురిపించరా         ||తెలుగు|| తెలుగు మనజాతిరా మనకు అదిఖ్యాతిరా తెలుగుకైతలు వ్రాయరా పాఠకులమదులు దోచరా        ||తెలుగు|| తెలుగు మనతల్లిరా సేవలను చెయ్యరా తెలుగు మనదేవతరా మంగళ హారతులివ్వరా         ||తెలుగు|| తెలుగు అజంతాభాషరా దేశమందు బహులెస్సరా తెలుగుబిడ్డలు గొప్పరా బహుతెలివైన వారురా          ||తెలుగు|| తెలుగు విదేశీయులుమెచ్చినభాషరా ప్రపంచాన విస్తరిస్తున్నభాషరా దేశవిదేశాలకు తీసుకెళ్ళరా దశదిశాలా వ్యాపింపజేయరా     ||తెలుగు|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ...