Posts

Showing posts from July, 2023
Image
 నచ్చిన నాచెలి నచ్చింది నచ్చింది నాచెలి తట్టింది తట్టింది  నామది నవ్వింది నవ్వింది ననుచూచి రమ్మంది రమ్మంది ననుదరికి ఒలికింది ఒలికింది వయ్యారము చూపింది చూపింది సింగారము రమ్మంది రమ్మంది తోటలోకి సయ్యంది సయ్యంది సరసాలకి ఆలశ్యం నేచేయను అవకాశం నేవదలను కవితను కూర్చుతా నవ్యతను చూపిస్తా పాటను వ్రాస్తా రాగము తీస్తా "చెప్పనా తియ్యగా చెప్పనా చూచిన అందాలను పొందిన ఆనందాలను చెప్పనా తియ్యగా చెప్పనా చూడనా చెలిని చూడనా చారడేసి కళ్ళను చక్కదనాల రూపును చూడనా చెలిని చూడనా వెళ్ళనా ముందుకు వెళ్ళనా అడుగులు ఆగకుండావేస్తు ఆమె ఆహ్వానిస్తున్నచోటుకు వెళ్ళనా ముందుకు వెళ్ళనా తెలుపనా ప్రేమను తెలుపనా చెలిని చెంతకుపిలచి  చెవిలోన గుసగుసలాడి  తెలుపనా ప్రేమను తెలుపనా వ్రాయనా పాటను వ్రాయనా విభిన్న విషయాలుతెలుపుతు విన్నూతన విధానమునందు వ్రాయనా పాటను వ్రాయనా" గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 గులాబీల గుబాళింపులు అదిగో గులాబీమొక్క అవిగో రోజాపూలు అల్లవిగో కుబ్జకమొగ్గలు పూలేమో పిలుస్తున్నాయి మొగ్గలేమో ముకుళిస్తున్నాయి నేటి విత్తనము రేపటి అంకురము నేటి మొగ్గలు రేపటి విరులు ఒక రోజామొక్క రెండు కొమ్మలు మూడు పువ్వులు నాలుగు మొగ్గలు రెపెరెపలాడుతున్నాయి మూడు గులాబీలు ముచ్చటపరుస్తున్నాయి నాలుగు రోజామొగ్గలు తొంగితొంగి చూస్తున్నాయి విరిసిన పూలు గుబాళిస్తున్నాయి అందాలను ఆరబోస్తున్నాయి కళ్ళను కట్టేస్తున్నాయి చూపును లాగేస్తున్నాయి ఆకుపచ్చని ఆకులు విచ్చుకోని మొగ్గలు వికసించిన పుష్పాలు దోచుకుంటున్నాయి మదులు అలరులు ఆకర్షిస్తున్నాయి ఆర్తవాలు ఆకట్టుకుంటున్నాయి అరవిరులు అదునుకోసంచూస్తున్నాయి ఓ గులాబీ చూపువిసిరింది ఓ గులాబీ ముల్లుగుచ్చింది ఓ గులాబీ సిగ్గుపడుతుంది గులాబీలు కవ్వించుతున్నాయి కలమునుపట్టిస్తున్నాయి కవితనువ్రాయిస్తున్నాయి కమ్మనికవిత్వం కూర్చా అద్భుతకవనం అల్లా గులాబీకవితను చదవండి గుండెలపైపన్నీరును చల్లుకోండి పూలమనసుని తెలుసుకోండి పూలకవిని తలుచుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చంటోడు బుడిబుడినడకల బుజ్జాయి చిట్టిచిట్టిపలుకుల చిన్నారి సొట్టబుగ్గల సొగసరి బంగరువన్నెల బుచ్చాయి చిరునవ్వులు చిందాడు చెంతకు వచ్చాడు చేతులు చాచాడు చంకను ఎక్కాడు ముద్దులు ఇచ్చాడు మురిపము చేశాడు మాటలు చెప్పాడు మైమరపించాడు చిందులు తొక్కాడు కేరింతలు కొట్టాడు పకపకా నవ్వాడు పరుగులు తీశాడు చాకులెట్టు ఇచ్చాను సంతస పడ్డాడు నోటిలో వేసుకున్నాడు చక్కగ చప్పరించాడు బిస్కత్తు అడిగాడు వెంటనే ఇచ్చాను కసకస నమిలాడు కడుపు నింపుకున్నాడు బయటకు బయలుదేరాను వెంటవస్తానని అన్నాడు తీసుకొని వెళ్ళమన్నాడు మారాము చేశాడు అక్కదగ్గరకు వెళ్ళాడు బొమ్మలు లాగుకున్నాడు బాగా ఆడుకున్నాడు బుడిబుడియడుగులు వేశాడు ఆఫీసుకు బయలుదేరాను టాటాబైబై చెప్పాడు చకచకా చేతులనూపాడు త్వరగారమ్మని సైగలుచేశాడు నాబుజ్జి నాకంటికివెలుగు నాచిట్టి నావంశోద్ధారకుడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేను పక్కా తెలుగువాడను  నేను పదహరణాల అంధ్రుడను నేను తెలుగు చిమ్మే వెలుగు నేను వెలుగు చిమ్మే తెలుగు నేను తేనెను చిమ్మే పలుకులు నేను పలుకులు చిమ్మే తేనెను నేను తెలుగునేలన ఎదిగిన తోటను నేను తోటనందు పూచిన తెలుగుపూవును నేను తెనుగు చిమ్మే పరిమళమును నేను పరిమళాలను చిమ్మే తెనుగును నేను తెలుంగు పూచిన పువ్వులను నేను పువ్వులు పూచిన తెలుంగును నేను ఆంధ్రుల మోముల చిరునవ్వును నేను చిరునవ్వుల మోముల ఆంధ్రుడను నేను జెంటూగా పిలిచే జానుతెలుగును నేను జానుతెలుగుగా పిలిచే జెంటూను నేను త్రిలింగదేశపు అకారాంతభాషను నేను తూర్పు ఇటలీగాపిలిచే త్రిలింగభాషను నేను తెనుంగు తమ్ముళ్ళకు అన్నను నేను తెనుంగు అన్నలకు తమ్ముడను నేను తెలుగుకవితలు వ్రాసే కవిని నేను కవులు కూర్చే తెలుగుకవితలను  నేను తెలుగుతల్లి కన్న ముద్దుబిడ్డను నేను మాతృమూర్తిని మరువని తనయుడను నేను గుండ్లపల్లి రాక్జేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ పిల్లా! ప్రేమలో పడ్డావటే పిల్లా పెళ్ళికీ తయారటే పిల్లా   ||ప్రేమలో|| చూపులు కలిపావటే పిల్లా గాలము విసిరావటే పిల్లా పువ్వులు పెట్టావటే పిల్లా నవ్వులు చిందావటే పిల్లా   ||ప్రేమలో|| మనసు పడ్డావటే పిల్లా సొగసు చూపావటే పిల్లా ప్రియుడు పిలిచాడటే పిల్లా చెంతకు చేరావటే పిల్లా   ||ప్రేమలో|| అందాలు ఆరబోశావటే పిల్లా ఆనందము అందించావటే పిల్లా మాటలు కలిపావటే పిల్లా మరులు కొలిపావటే పిల్లా  ||ప్రేమలో|| సరసాలు ఆడావటే పిల్లా సరదాలు చేశావటే పిల్లా  పరువాలు చూపావటే పిల్లా పగ్గాలు వేశావటే పిల్లా   ||ప్రేమలో||  ముచ్చట్లు చెప్పావటే పిల్లా ముద్దులు ఇచ్చావటే పిల్లా కోర్కెను చెప్పావటే పిల్లా సిగ్గులు ఒలికావటే పిల్లా  ||ప్రేమలో|| మల్లెలు తెచ్చాడటే పిల్లా కొప్పులో తురిమాడటే పిల్లా తేనెను చిందావటే పిల్లా అమృతాన్ని అందించవటే పిల్లా  ||ప్రేమలో|| తోడు కోరుకున్నావటే పిల్లా జోడు తెచ్చుకున్నావటే పిల్లా ఆకాశములో ఎగిరావటే పిల్లా ఆనందములో తేలిపోయావటే పిల్లా  ||ప్రేమలో|| వివాహానికి పిలుస్తావటే పిల్లా విందుభోజనము పెడతావటే పిల్లా అక్షింతలు వేయమంటావటే...
Image
 అందాల ఆకాశం ఆకాశం కళ్ళనుకట్టేసుంది మనసునుదోచేస్తుంది భ్రాంతికలిగిస్తుంది ఆకాశం తలనెత్తి కనమంటుంది ఆకాశం రంగులు మారుస్తుంది ఆకాశం నిప్పులు క్రక్కుతుంది ఆకాశం కాంతులు వెదజల్లుతుంది ఆకాశం గాలులు వీస్తుంది ఆకాశం వానజల్లులు చల్లుతుంది ఆకాశం వార్తలు ప్రసారంచేస్తుంది ఆకాశం దృశ్యాలను ప్రసారణచేస్తుంది ఆకాశం వెన్నెలను కురుస్తుంది ఆకాశం తారకలను తళతళలాడిస్తుంది ఆకాశం మెరుపులు చూపిస్తుంది ఆకాశం ఉరుములు వినిపిస్తుంది ఆకాశం అందాలు కనమంటుంది ఆకాశం ఆనందం పొందమంటుంది ఆకాశం అందరిని ఆహ్వానిస్తుంది ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది ఆకాశం అందుకోమని ఆహ్వానిస్తుంది ఆకాశం పట్టుకోబోతే చిక్కకున్నది ఆకాశం అంతరంగాలను ఆహ్లాదపరుస్తుంది ఆకాశం వగలుచూపుతుంది వయ్యారలొలుకుతుంది వింతలుచూపిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగుసాహితీవనం సుందరసుమాల సాహితీవనం సందర్శిస్తా తనివితీరేవరకు తెలుగుతోటలో తిరుగుతా అందమైన అక్షరకుసుమాలతో ఆడుకుంటా అద్భుతమైన అలరులపదమాలలు అల్లేస్తా పంక్తులుగా పలుపుష్పాలను పేరుస్తా ప్రాసలతో పూలపాదాలను పెల్లెత్తిస్తా వైవిధ్యంగా విరులవిషయాలు వివరిస్తా కమ్మనైన కవితాకుసుమాలతో కనువిందుచేస్తా చుట్టుపక్కల సుమసౌరభాలను చల్లేస్తా పాఠకులను పువ్వులపొంకాలను పరికింపజేస్తా విమర్శకులకు వివిధకవనవంటకాలను వడ్డిస్తా తెలుగుతల్లిని తేనెపలుకులతో తృప్తిపరుస్తా అమ్మభారతిని ఆర్తవాలతో అలంకరిస్తా అక్షరాల అధిష్టానదేవతను అలరిస్తా వేడుకొని వాగ్దేవి వరంపొందుతా నాలుకపైకి నలువలరాణిని నిలువమంటా  వీణాపాణి వెలుగులు వెదజల్లుతా విద్యాదేవి విఙ్ఙానము వ్యాపిస్తా విడమఱచి వాస్తవాలను వివరిస్తా చదువరులను సాహిత్యలోకంలో సంచరింపజేస్తా సరస్వతీదేవిని సదాస్వాగతిస్తా సుకవితలనువ్రాయించమంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ జాషువా! వినుకొండ ప్రాంతాన పుట్టిన విలువైనవజ్రమా! ఖండకావ్యాలు మధురంగా సృష్టించిన కవిదిగ్గజమా! పలుపద్యాలు పసందుగా కూర్చిన పండితశేఖరా! వెలుగులు తెలుగుసాహిత్యాన వెదజల్లిన కవిపుంగవా! శ్మశానపద్యాలు అద్భుతముగా విరచించిన కవిరత్నమా! సందేశము గబ్బిలంతో శివునికి పంపినవాడా! శిశువు పద్యాలతో సర్వులను ఆకట్టుకున్నవాడా! నీ నామం నిలుచుశాశ్వతం నీ కవిత్వం నిత్యచైతన్యం ఆకాశంలో తారలా వెలిగిపో కలకాలం నిలిచిపో చిరకాలం అందుకో వందనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నామనసు నామనసు పిచ్చిది ఆలోచనలతో సతమతమవుతుంది నామనసు మట్టి అక్షరసేద్యం చెయ్యమంటుంది నామనసు అద్దము చూచినవన్నీ ప్రతిబింబింబిస్తుంది నామనసు పక్షి గాలిలో ఎగురుతుంది నామనసు వాహనం భూమిమీద పరుగులుతీస్తుంది  నామనసు నీరు నదిలా ప్రవహిస్తుంది నామనసు నిప్పు కోపమొస్తే దహించేస్తుంది నామనసు మమతాస్థానం ప్రేమిస్తే ప్రాణమిస్తానంటుంది నామనసు గాలి అన్నిదిక్కులా వ్యాపిస్తుంది నామనసు ఙ్ఞానస్థానం ఆలోచనలలో ముంచేస్తుంది నామనసు వెలుగు దివ్వెలా కాంతులుచిమ్ముతుంది నామనసు పిరికిపంద తలలో దాక్కుంటుంది బయటకు రానంటుంది నామనసు ఒకకోతి కిచకిచమంటుంది గంతులేస్తుంది నామనసు మార్గదర్శి నన్ను ముందుకు నడిపిస్తుంది నామనసు సీతాకోకచిలుక పువ్వులపై వ్రాలుతుంది నామనసు మల్లెపువ్వు పరిమళాలను వెదజల్లుతుంది నామనసు ఒకకవి కవితలను వ్రాయిస్తుంది నామనసు మొండిది తీరు మార్చుకోనంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 జీవితం  జీవితం అందమైనదోయ్ అనుమానం అక్కరలేదోయ్ కాలం అనంతమోయ్ జీవితం అతిస్వల్పమోయ్ పోయినకాలం రాదోయ్ చక్కగసమయం వాడవోయ్ భూమికి బరువుకాకోయ్ ప్రకృతిని పరిరక్షించుకోవోయ్ తోటిప్రాణులను బాధపెట్టకోయ్ సహజీవులను సంరక్షించవోయ్ ప్రపంచము ఒకనాటకరంగమోయ్ నీపాత్రను నువ్వుపోషించవోయ్ జీవితమంటే ప్రాణంకాదోయ్ ఆత్మీయుల ప్రేమానుబంధమోయ్ జీవితమంటే కాలక్షేపంకాదోయ్ అందాలను  ఆస్వాదించటమోయ్ జీవితమంటే జననమరణాలుకాదోయ్ వందేళ్ళు జరుపుకోవలసినపండుగోయ్ జీవితమంటే సుదూరపయనంకాదోయ్ సుఖాలను అనుభవించటమేనోయ్ జీవితమంటే సంపాదనకాదోయ్ లక్ష్యాలను సాధించటమోయ్ జీవితమంటే కలలుకనటంకాదోయ్ కోరికలను నెరవేర్చుకొనటమోయ్ జీవితం బహుచక్కనిదోయ్ తెలుసుకొని ధన్యంచేసుకోవోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రేయసీ!  మనసువిప్పనా ముందుపెట్టనా నిదురలేవనా నిన్నుతలచనా చెంతకురానా చెలిమికోరనా కన్నుతెరవనా చూపునిలుపనా అందముకననా స్పందనతెలుపనా ఆనందపడనా అతిశయిల్లనా పువ్వునివ్వనా ప్రేమచాటనా కోర్కెచెప్పనా తీర్చమందునా పెదవివిప్పనా మాటచెప్పనా నవ్వువిసరనా మోమువెలిగించనా ఆశలేపనా దారికితెచ్చుకోనా తీర్పుచెప్పనా అమలుచెయ్యనా కవ్వించనా కథనునడపనా కవితవ్రాయనా మదినిమీటనా ఆలోచించవా జవాబివ్వవా చెంతకొస్తవా సమ్మతిస్తవా చేయిపట్టనా సరసమాడనా చేరదీయనా నిలిచిపొమ్మందునా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేను నాప్రాణము పరమాత్ముడిచ్చిన ప్రాణం పరంధామునిసేవకే అంకితం జననీజనకులిచ్చిన ప్రాణం జన్మనిచ్చినవారికే సమర్పణం నాకు తీపికాదు ప్రాణం నేను విడవటానికి సిద్ధం నాకు అమూల్యంకాదు ప్రాణం నాకది గడ్డిపూసతో సమానం ఓరోజు వచ్చాడు దైవం కోరినప్పుడే తీసుకెళ్తాననిచేశాడు ప్రమాణం పడదన్నాడెపుడు యముని పాశం యమదూతలపై పెట్టాడు నిషేదం కోరినపుడు తెస్తానన్నాడు రథం ఎక్కించుకొని చేరుస్తానన్నాడు స్వర్గం అందుకే రోగభయమూలేదు మృత్యుభీతీలేదు ప్రాణప్రీతీలేదు ప్రాణంతో ఆడను చెలగాటం జీవితంతో ఆడను నాటకం త్రాగను అమృతం కోరను అమరత్వం కానీ నాకవితలు పుటలకెక్కాలి శాశ్వతంగా నిలిచిపోవాలి కాగితాలు వెలగాలి కవితలు వర్ధిల్లాలి పాఠకులంటే ప్రాణం విమర్శకులంటే విశ్వాసం నాభావం నాకిష్టం నాకవిత్వం నాకుప్రాణం సాహిత్యానికి స్వాగతం వాణీదేవికి వందనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మంచిముచ్చట్లు మంచితనము చాటాలని కాచుకొనియున్నా మంచిపనులు చేయాలని వేచియున్నా మంచిస్నేహాలు కావాలని కాంక్షిస్తున్నా మంచిసలహాలు ఇవ్వాలని వీక్షిస్తున్నా మంచిమనసు చూపాలని తలపోస్తున్నా మంచిమార్గము ఎంచుకొమ్మని మనవిచెస్తున్నా మంచితోడు తెచ్చుకోమని తెలియజేస్తున్నా మంచిమాటలు ఆలకించమని విన్నవిస్తున్నా మంచిలోకము సృష్టించమని సలహానిస్తున్నా మంచియాలోచనలు పుట్టాలని ప్రార్ధిసున్నా మంచివిషయాలు తట్టాలని మొక్కుతున్నా మంచికవితలు వ్రాయాలని ముచ్చటపడుతున్నా మంచిపాఠకులు మెచ్చుకుంటారని మనసుకునచ్చచెబుతున్నా మంచివిఙ్ఞత చూపమని వినతిచేస్తున్నా మంచిరాతలు ముందుంచుతానని మాటయిస్తున్నా వేమనబద్దనలను గుర్తుకుతేవాలని ప్రయత్నిస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తోడుకోసం తోడుకోసం చూస్తున్నా చుట్టుపక్కల శోధిస్తున్నా తోడుకోసం తయారవుతున్నా ఆకర్షించాలని ఆతృతపడుతున్నా తోడుకోసం అదుగుతున్నా అంగీకరిస్తే అందలమెక్కిస్తానంటున్నా తోడుకోసం అభ్యర్ధిస్తున్నా తలనూపితే స్వర్గంచూపిస్తానంటున్నా  తోడుకోసం వెదుకుతున్నా చిక్కితే చేరువవ్వాలనుకుంటున్నా తోడుకోసం ప్రయత్నిస్తున్నా పాటుపడుతున్నా ఫలిస్తుందనినమ్ముతున్నా తోడుకోసం తిరుగుతున్నా తిలోత్తమ తగలకపోతుందాయనుకుంటున్నా తోడుకోసం పిలుస్తున్నా చెంతకొస్తే చెలిమిచేయాలనుకుంటున్నా తోడుకోసం వలవేస్తున్నా తగిలితే పట్టేయాలనిచూస్తున్నా తోడుకోసం తోందరపడుతున్నా తలవంచితే తాళికట్టాలనుకుంటున్నా తోడుకోసం తపిస్తున్నా తదేకంగా దృష్టిసారిస్తున్నా తోడుకోసం కలలుకంటున్నా నిజమవ్వాలని నిరీక్షిస్తున్నా తోడుకోసం తంటాలుపడుతున్నా తిప్పలెప్పుడు తప్పుతాయోననిచూస్తున్నా తోడుకోసం మొక్కుతున్నా దొరికితే తలనీలాలిస్తానంటున్నా తోడుకోసం విలపిస్తున్నా వయసుముదురుతుందేమోనని విచారిస్తున్నా ఒకప్పుడు మొలతాడుంటేచాలు మీసం మెలవేయటానికి వివాహం చేసుకోవటానికి ఇప్పుడు మొనగాడయినా వరుసలో నిలువాలిసిందే పోటీలో పాల్గొనవలసిందే పాపం మగవాళ్ళు బెండకాయల్లా ముదిరిపోతున్నార...
Image
 ఎందుకనో..... (కాలం మారింది) మునగకాయల్లో రుచిపచి లోపించింది కరివేపాకులో సువాసన అంతరించింది బీరకాయల్లో నెయ్యి అదృశ్యమయ్యింది పలుకుల్లో ప్రేమలు పటాపంచలయ్యాయి పెదవుల్లో తేనెచుక్కలు చిందటంలేదు పిల్లల్లో గౌరవం నశించింది మహిళల్లో వాలుజడలు వేసేవారులేరు కొప్పుల్లో పూలు కనిపించటంలేదు మోముల్లో చిరునవ్వులు కనబడటంలేదు మనసుల్లో మమకారం మాడిపోయింది మనుజుల్లో మానవత్వం మృగ్యమయ్యింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితలెందుకు పుట్టాయో? అక్షరాలు ఆకర్షించాయో పదాలు పరవశపరచాయో అందాలు ఆకట్టుకున్నాయో ఆనందాలు అందుకోమన్నాయో తనువు తహతహలాడిందో మనసు మురిసిపోయిందో ఊహలు  ఉత్సాహపరచాయో భావాలు బయటకొచ్చాయో కలము చేతికొచ్చిందో కాగితం చెక్కమనియడిగిందో పాఠకులు ప్రాధేయపడ్డారో విమర్శకులు విన్నవించుకున్నారో గాయకులు వ్రాయమన్నారో ప్రేక్షకులు పాటలనడిగారో మది మధించమన్నదో మేధ మెరుగులుదిద్దిందో హయగ్రీవుదు ఆశీర్వదించాడో సరస్వతీదేవి కరుణించిందో కవిత్వము పుట్టకొచ్చింది  సాహిత్యము సంపన్నమయ్యింది కవితంటే తలకాయ తపాలయితే తలపులు నీరయితే పాత్ర నిండిపోతే పొంగిపొర్లిపోయేదే కవితంటే అన్నంవండి కూరలుచేసి అరిటాకువేసి వడ్డించేవిందుభోజనమే కవితంటే వికసించి సొగలుచూపి పరిమళంచల్లి పరవశపరిచేపువ్వే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నవ్వులు పువ్వులు నవ్వవు పక్షులు ఎప్పుడున్ విప్పును రెక్కలు ఎగురుటకున్ వెదకును గింజలు తినుటకున్ పెట్టును కూతలు నిత్యమున్ నవ్వుట ఎరుగవు జంతువుల్ నాలుగు కాళ్ళన నడచున్ గడ్డీ గాదములను మేయున్ అరుచును మూతులు తెరచిన్ నవ్వులు చిందవు వృక్షముల్ పచ్చని ఆకులు తొడుగున్ ఋతువుల కాయలు కాయున్ ప్రకృతి కిచ్చును సొగసుల్ నవ్వుల పువ్వులు కురిపించున్ ఇచ్చును చూపరులకు మోదముల్ వీక్షకులకు పొంకాలు చూపున్ వికసించి పరిమళాలు వీచున్ నరుడొక్కడె నవ్వును లోకమునన్ చిమ్మును వెలుగులు మోములన్ మురిపించు మనుజల మనసులన్ గ్రక్కును సుధలు బయటికిన్ పిల్లల నవ్వులు పరవశపరచున్ పడతుల నవ్వులు అందమునిచ్చున్ పురుషుల నవ్వులు ప్రమోదంతెలుపున్ పెద్దల నవ్వులు కుశలంతెలుపున్ కొన్ని నవ్వులు చిత్తసూచనల్ కొన్ని నవ్వులు వలపుగాలముల్ కొన్ని నవ్వులు నాటకముల్ కొన్ని నవ్వులు వ్యాధినిరోధకముల్ నవ్వులే సంపదల్ నవ్వులే రత్నముల్ నవ్వులే వెలుగుల్ నవ్వులే జీవితముల్ ఒకప్పుడు నవ్వు నాలుగురకాల చేటు ఇప్పుడు నవ్వు నలుబదివిధాల మేలు పకపకా నవ్వండి పల్లుబయట పెట్టండి అందాలను చూపండి ఆనందముగా ఉండండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిమార్తాండుడు అడుగో అల్లడుగో అద్భుతకవనమార్తాండుడు సూర్యోదయసమయంలో తెల్లవారివెలుగులాతెలుగునుదిద్దువాడు అల్పాక్షరాలతో అనల్పార్ధస్ఫురణచేయువాడు భావాంబరవీధిలో బహుకాలమువిహరించువాడు కవితకవ్వింపులతో కలమునుచేతపట్టినవాడు సాహితీసౌజన్యముతో సుధాభరితకైతలనల్లువాడు అద్వితీయవర్ణనలతో అందాలకయితలనందించువాడు పూలకవితలతో పాఠకులనుపులకరించువాడు చల్లనివెన్నెలలో చదువరులనుసంచరింపజేయువాడు పద్యపఠనంతో ప్రేక్షకులనుపరవశపరచువాడు పదప్రయోగముతో పెక్కురికితేటతెలుగునుపరిచయముచేస్తున్నవాడు సాహిత్యములో సర్వదామునిగితేలుతున్నవాడు కవితాముర్తికి వందనాలు కవితాసృష్టికి నీరాజనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆమెముచ్చట్లు ఆమె ముచ్చట్లుచెబుతా ఆనందింపజేస్తా ఆమె కనపడితేచాలు అందాలనారగిస్తా ఆమె వినపడితేచాలు తేనెచుక్కలుచప్పరిస్తా ఆమె నవ్వితేచాలు కాంతికిరణాలుస్వీకరిస్తా ఆమె చెంతకొస్తేచాలు చేతులలోకితీసుకొనిచుట్టేస్తా ఆమె అందిస్తేచాలు అమృతాన్నిత్రాగేస్తా ఆమె పిలిస్తేచాలు పరవశించిపోతా ఆమె కోరితేచాలు కావలసినవన్నీయిస్తా ఆమె రమ్మంటేచాలు అన్నీవదిలేసివెళ్తా  ఆమె ప్రేమిస్తేచాలు హృదయంలోచోటిస్తా ఆమె చెయ్యిచాస్తేచాలు చేతులలోకితీసుకొనిచుట్టేస్తా ఆమె వస్తానంటేచాలు ఏడదుగులునడవటానికిసిద్ధమంటా ఆమె  మెడవంచితేచాలు మంగళసూత్రాన్నికట్టేస్తా  ఆమె అనుమానిస్తే సందేహాలుతీరుస్తా ఆమె తటపాయిస్తే తక్షణంతృప్తిపరుస్తా ఆమె నిరాకరిస్తే నిశ్శబ్దంవహిస్తా నింగివైపుతలతిప్పుతా నిశ్చేష్టుడనయిపోతా నిరాశలోమునిగిపోతా ఆమె అంగీకరిస్తే అందంగాతయారవుతా ఆహ్వానంపలుకుతా ఆనందపడిపోతా అర్ధాంగినిచేసుకుంటా మిమ్ములను ఆహ్వానించుతా ఆమోదించమంటా అక్షింతలేయమంటా ఆశీర్వదించమంటా ఆనందింపజేయమంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓరి తెలుగోడా! ఎన్నటికీ మరువకురా మన మాతృభూమిని   ఎప్పటికీ విడవుకురా మన తెలుగుభాషను ఏమైనా తీర్చుకోరా కన్నతల్లి ఋణమును ఎల్లపుడూ పలుకుమురా మన తెలుగులోనె ఎక్కడున్నా పూజించరా మన తెలుగుతల్లిని ఎల్లెడా చాటరా మన తెలుగుకీర్తిని ఏచోటున్నా చెప్పరా మన తెలుగుగొప్పని ఎవరైనా నేర్పరా మన తేటతెలుగుని ఎల్లరికీ చేర్చరా మన తెలుగుమాధుర్యాలను ఎక్కడున్నా వ్రాయరా మన తెలుగుకవితలను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రంగులహంగులు రంగులతోట రమ్మంటుంది అందాలను ఆరబోస్తానంటుంది రంగులపూలు పిలుస్తున్నాయి సౌరభాలను వెదజల్లుతానంటున్నాయి రంగవల్లులు వేయమంటున్నాయి గుమ్మాలకు అందాలిస్తామంటున్నాయి రంగుబూరలు ఊదమంటున్నాయి గాలిలోకి వదిలేయమంటున్నాయి రంగులదృశ్యాలు చిత్రించమంటున్నాయి కళ్ళకువిందులు చేసేస్తామంటున్నాయి రంగులలోకం స్వాగతిస్తుంది వన్నెచిన్నెలను వడ్డిస్తానంటుంది రంగులకలలు వస్తున్నాయి రేగినకోర్కెలను తీర్చుకోమంటున్నాయి రంగులపక్షులు రవళిస్తున్నాయి సౌందర్యాలను చూపిస్తున్నాయి రంగులజీవితం మనసుకోరుతుంది అనుభవించటానికి ఉవ్విళ్ళూరుతుంది రకరకాలరంగులు కలుస్తున్నాయి కొత్తరంగులు పుట్టుకొస్తున్నాయి రంగులాట ఆడుకుందాం రంగోళీని జరుపుకుందాం రంగులప్రపంచం అనుభవిద్దాం అందాలజీవితాన్ని ఆనందమయంచేసుకుందాం రంగులు కవితనువ్రాయమంటున్నాయి రసప్రాప్తిని పలువురికిపంచమంటున్నాయి రంగులు చల్లమంటున్నాయి విచిత్రాలను వీక్షించమంటున్నాయి రంగులు మారుతున్నాయి కొత్తదనాలు కనబడుతున్నాయి రంగులు చల్లుతా ఆనందం పంచుతా రంగులు దిద్దుతా హంగులు చూపుతా రంగులు వేసేస్తా మదులను మురిపిస్తా రంగులలోకాన్ని చూడండి రంగులజీవితాన్ని గడపండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ...
Image
 వానతలపులు తలను పైకెత్తా తారాపధమును పరికించా తెరలుతెరలుగా తచ్చాడే పొగమబ్బును పరిశీలించా తేలుతున్న మబ్బులనుచూశా తరుముతున్న గాలినిగమనించా నల్లగామారిన మేఘాలనుచూశా గుముకూడిన మబ్బులనుచూశా కదులుతున్న కరిమబ్బులచూశా కరుగుతున్న మొయిలునుచూశా మబ్బుల్లో నీటినిచూశా తనువునుతాకిన చల్లగాలినిగుర్తించా తళతళమెరిసే మెరుపులుచూశా పెళపెళగర్జించే మేఘాలనుచూశా చిటపటపడుతున్న చినుకులుచూశా చిందులుతొక్కుతున్న చిన్నారులనుచూశా పారుతున్న కాలువలనుచూశా దప్పికతీర్చుకుంటున్న నేలనుచూశా తడిసిన తరువులనుచూశా త్రాగుతున్న పశువులనుచూశా హలముపట్టిన రైతన్ననుచూశా పొలముదున్నుతున్న కాడెద్దులచూశా విత్తనాలుచల్లుతున్న కర్షకులనుచూశా మొలిచిన మొక్కలనుచూశా పండిన పంటలనుచూశా పరవశించిపోతున్న పంటకాపులనుచూశా నిండిన జలాశయాలనుచూశా పారుతున్న వాగువంకలనుచూశా పరుగులెత్తుతున్న సెలయేర్లనుచూశా పచ్చగానున్న చెట్టుచేమలచూశా కడలిలోని కల్లోలముచూశా ఎగిసిపడుతున్న అలలనుచూశా పుడమినిచూశా పరవశించా ప్రకృతినిచూశా పులకరించా నీటిచుక్కల ప్రభావాన్నిచూశా నింగీనేలల పరిణామాలుచూశా వానలు కురవాలనుకున్నా పంటలు పండాలనుకున్నా పుడమి పచ్చబడాలనుకున్నా ప్రకృతి పరవశపరచాలనుకున్నా ప్ర...
Image
 ఓరి బుజ్జోడా! చెంతకూ రారా చంకనూ ఎక్కరా పకపకా నవ్వరా మోమునూ వెలిగించరా ముద్దులూ ఇవ్వరా మురిపమూ చెయ్యరా ముద్దుగా మాట్లాడరా మదినీ ముట్టేయరా గుసగుసా లాడరా గుబులునూ లేపరా అందంగా తయారవరా అందరినీ ఆకట్టుకోరా నోరునూ తెరవరా అమృతాన్ని చిందరా నెమలిపింఛము పెట్టుకోరా చిన్నికృష్ణుని తలపించరా మురళినీ వాయించరా మిత్రులా గుమికూడ్చరా చిందులు వెయ్యరా ఉత్సాహ పరచరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందాలకళ్ళు (కళ్ళకబుర్లు) కళ్ళు పలుకుతున్నాయి కథలు వినిపిస్తున్నాయి కళ్ళు కాటుకపెట్టుకున్నాయి వయ్యారాలు ఒలకబోస్తున్నాయి కళ్ళు నవ్వుతున్నాయి ముఖాన్ని వెలిగిస్తున్నాయి కళ్ళు చూస్తున్నాయి కబుర్లు చెబుతున్నాయి కళ్ళు వెలుగుతున్నాయి సంతసాన్ని వెలువరిస్తున్నాయి కళ్ళు అందాలనుచూపుతున్నాయి ఆనందాన్ని అంతరంగానికందిస్తున్నాయి కళ్ళు తెరవమంటున్నాయి చక్కదనాన్ని చూడమంటున్నాయి కళ్ళు నడుపుతున్నాయి దారులు చూపిస్తున్నాయి కళ్ళు కనిపెట్టుండమంటున్నాయి దుమ్ము పడనీయవద్దంటున్నాయి కళ్ళు కాచుకోమంటున్నాయి కానలేకపోతే జీవితమంధకారమంటున్నాయి కళ్ళు చెమ్మగిల్లనియొద్దంటున్నాయి  హృదయం ద్రవించినీయవద్దంటున్నాయి కళ్ళు పిలుస్తున్నాయి కవితను కూర్చమంటున్నాయి కళ్ళు వెంటబడుతున్నాయి కవనం చెయ్యమంటున్నాయి కళ్ళు మెరిసిపోతున్నాయి కవితావిషయాన్ని కనబరుస్తున్నాయి కళ్ళు కవ్విస్తున్నాయి కలమును పట్టమంటున్నాయి కళ్ళు  తెలుసుకోమంటున్నాయి కాయానికి నయనాలేముఖ్యమంటున్నాయి కళ్ళు ఇంద్రియప్రధానాన్నంటున్నాయి ప్రపంచదర్శనానికి ద్వారాన్నంటున్నాయి కళ్ళు పొడుచుకోకు కష్టాలు తెచ్చుకోకు కళ్ళు కావరమెక్కనీకు జీవితానికి ఎసరుతెచ్చుకోకు కళ్ళను కాపాడుక...
Image
 అక్షరసంపత్తి అక్షరాలను ఆహ్వానిస్తా ఆతిథ్యమిచ్చి ఆహ్లాదపరుస్తా అక్షరాలను నిలువమంటా మనసునందు స్థానమిస్తా అక్షరాలను పుటలకెక్కిస్తా శాశ్వతముగా భద్రపరుస్తా అక్షరాలను వెలిగిస్తా అఙ్ఞానాంధకారమును తరిమేస్తా అక్షరాలను అందిస్తా ఙ్ఞానామృతమును త్రాగిస్తా అక్షరాలను చూపిస్తా అద్భుతకవితలను చదివిస్తా అక్షరాలను నడిపిస్తా సాహిత్యమార్గాలను చూపిస్తా అక్షరాలను అందిస్తా సాహితీద్వారాలను చేర్పిస్తా అక్షరాలను పలికిస్తా అపరూపకవితలను వినిపిస్తా అక్షరాలను ఆడిస్తా కవనక్రీడలను ప్రదర్శిస్తా అక్షరాలను ఊదేస్తా సంగీతసాహిత్యాలను తెలియజేస్తా అక్షరాలను వాడేస్తా అక్షరలక్షలు వెనకేస్తా అక్షరాలను తలకెక్కిస్త్తా తెలివితేటలను చాటిస్తా అక్షరాలను అల్లేస్తా కవనమాలలను మెడలోవేస్తా అక్షరాలను చల్లేస్తా కవితాపంటలు పండిస్తా అక్షరాలను కాయిస్తా తియ్యదనాలను తినిపిస్తా అక్షరాలను వండేస్తా షడ్రుచులకవనాలను వడ్డిస్తా అక్షరాలను పరుగెత్తిస్తా సాహిత్యసంపదను పట్టిస్తా అక్షరాలను ప్రయోగిస్తా కవితావిన్యాసాలను కనబరుస్తా అక్షరాలను శరాల్లాసంధిస్తా సాహిత్యలక్ష్యాలను సాధింపజేస్తా అక్షరాలను వదులుతా కవనతూటాలను ప్రేలుస్తా అక్షరాలను వర్ణిస్తా కవితాసొగసులు...
Image
 పూలపాఠాలు పువ్వులాగా వికసించవోయ్ పరిమళాలను వెదజల్లవోయ్ పువ్వులాగా వెలుగవోయ్ ప్రకాశమును వ్యాపించవోయ్ పువ్వులాగా కనిపించవోయ్ పరికించువార్లను కుతూహలపరచవోయ్ పువ్వులాగా ప్రఖ్యాతిపొందవోయ్ ప్రజలమదులలందు నిలిచిపోవోయ్ పువ్వులాగా ప్రేమించవోయ్ ప్రణయలోకమును పాలించవోయ్ పువ్వులాగా ఆకర్షించవోయ్ ఆయస్కాంతమును తలపించవోయ్ పువ్వులాగా పులకించవోయ్ పొరుగువార్లను ప్రేరేపించవోయ్ పువ్వులాగా అందాలుచూపవోయ్ పరమానందమును అందరికందించవోయ్ పువ్వులాగా రంగులుచూపవోయ్ పలువన్నెలందు పారవశ్యమివ్వవోయ్ పువ్వులాగా ప్రోత్సహించవోయ్ పసందైనకైతలను పుటలకెక్కించవోయ్ పూలనుండి పాఠాలునేర్వవోయ్ పిల్లాపెద్దలకు ప్రబోధించవోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సర్వేజనా సుఖినోభవంతు  మేడిపండువంటి సమాజాన్ని పరికించుదాం పరిరక్షించుదాం అన్నములేక అలమటిస్తున్న అనాధలను ఆదుకుందాం పనులులేక పరితపిస్తున్న నిరుద్యోగులకు అండనిద్దాం చదువుకోలేక ఇబ్బందులుపడుతున్న యువతీయువకులను చేరదీద్దాం జబ్బులపాలపడి డబ్బులులేక బాధలుపడుతున్నవారికి భరోసానిద్దాం పట్టించుకోక వదలివేసినట్టి అభాగ్యులకు చేయూతనిద్దాం ఆలనాపాలనాలేక బాధలుపడుతున్న పసిపాపలను పెంచిపోషిద్దాం ఆరుగాలంశ్రమించినా ఫలితందక్కని రైతుకుటుంబాలకు ఊరటనిద్దాం అవస్థలుపడుతున్న అణగారినవర్గాలను చేరదీసి అభివృద్ధిపరుద్దాం పిల్లలువదిలేసిన అనాధాశ్రమాలలో తలదాచుకుంటున్న వృద్ధులకుసాయంచేద్దాం దిక్కూమొక్కూలేక శరీరాలనమ్ముకొని కాలంగడుపుతున్న పడతులకాశ్రమమిద్దాం గత్యంతరంలేక వీధులలోతిరిగి యాచిస్తున్న అమాయకులనుద్ధరిద్దాం ఓట్లుకొని అధికారంచేతబట్టి పరిపాలిస్తున్న నేతలపనిపడదాం సమాజాన్ని అభివృద్ధిచేద్దాం నవసమాజాన్ని నిర్మాణంచేద్దాం జనహితాన్ని కోరుదాం కలసిముందుకు కదులుదాం సోదరసోదరీమణులారా స్వార్ధమునువీడండి సమాజమునుచూడండి సర్వేజనశ్రేయస్సుకుసహకరించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మొగ్గ మొగ్గ తొడిగింది తల్లి మురిసింది గాలి వీచింది మొగ్గ వణికింది ఎండ తగిలింది మొగ్గ కంపించింది తుమ్మెద చేరింది మొగ్గ భయపడింది తల్లి చూచింది ఆకులలో కప్పింది తుమ్మెదచేష్ఠలు కన్నది సిగ్గుపడి తలదించుకున్నది లోకాన్ని చూచింది మొగ్గ మెచ్చింది ఆకులచూచింది ఆశ్చర్యపోయింది పూలను చూచింది పరవశించిపోయింది తోటిమొగ్గలను చూచింది సంతోషపడిపోయింది వాలినపూలను చూచింది తల్లడిల్లిపోయింది రాలినపూలను చూచింది విలవిలలాడింది ఆకాశాన్ని చూచింది ఆనందపడింది మేఘాలను చూచింది ముచ్చటపడింది పక్షులను చూచింది పులకరించిపోయింది పిల్లలను చూచింది పొంగిపోయింది మహిళలను చూచింది ముగ్ధురాలయ్యింది కవిని చూచింది కలవరించింది కలలోకి వచ్చింది కవితను వ్రాయమంది కవి కనికరించాడు కవితనొకటి వ్రాశాడు విరబూయమన్నాడు విరజిమ్మమన్నాడు ఆశీర్వదించాడు ఆలోచనలులేపాడు మొగ్గ మొక్కింది తల్లి తృప్తిపడింది కవిత పుటలకెక్కింది మొగ్గ ధన్యురాలయ్యింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగోడా లేవరా! తెలుగును వెలిగిస్తా తెరువును చూపిస్తా తెలుగుబాట నడిపిస్తా తెలుగుతోట చేరుస్తా తెలుగుదనము చాటుతా కమ్మదనము కలిగిస్తా తెలుగన్నలను గౌరవిస్తా తెలుగుతమ్ముళ్ళ దీవిస్తా తెలుగుమాటలు పలుకుతా తేనెచుక్కలు చల్లుతా తెలుగును చిలుకుతా అమృతమును అందిస్తా తెలుగక్షరాలు అల్లుతా తియ్యనికవితలు చదివిస్తా తెలుగుపదాలు పారిస్తా తలలోతలపులు పొర్లిస్తా తెలుగునుడులు వాడుతా తేటతెలుగును చూపుతా తెలుగుపాటలు పాడుతా గళమాధుర్యాలు కుమ్మరిస్తా తెలుగుసమ్మేళనాలు నిర్వహిస్తా కవులకుసత్కారాలు జరిపిస్తా తెలుగుతల్లిని తరచుతలపిస్తా తెలుగువారిని తృప్తిపరుస్తా తెలుగుపౌరుషాలు నెమరేస్తా తెలుగుప్రఖ్యాతులు గుర్తుచేస్తా కన్నతల్లికి సేవలుచేస్తా తెలుగుతల్లికి పూజలుచేస్తా తెలుగుకు జైజైయంటా తెనుగుకు జయహోయంటా తెలుగోడా లేవరా తగినపాత్రనూ పోషించరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనకుసుమాలు   కలం పట్టుకోమంటుంటే కాగితం ముందుకొస్తుంటే క్షరరహితాలు దొర్లుతుంటే కవిత పుట్టకుండుంటుందా! ఆలోచనలు తడుతుంటే భావాలు భ్రమిస్తుంటే పదాలు పారుతుంటే కైత పుటకెక్కకుంటుందా! అందాలు కనబడుతుంటే ఆనందం కలుగుతుంటే అనుభూతులు అలరిస్తుంటే అద్భుతకయితలు ఆవిర్భవించవా! చదువరులు అడుగుతుంటే పాఠకులు పరవశిస్తుంటే సాహిత్యలోకం సంబరపడుతుంటే సుకవనాలు బయటకురావా! వాట్సప్పు ఎదురుచూస్తుంటే ఫేసుబుక్కు పంపమంటుంటే మెస్సంజరు మెస్మరైజుచేస్తుంటే చక్కనికవిత్వం వెలుగులోనికిరాదా! పూలకవివని పొగుడుతుంటే కవిరాజువని పిలుస్తుంటే భావకవివని ప్రోత్సహిస్తుంటే విన్నూతనకవిత వెలువడదా! పూలు పొంకాలుచూపుతుంటే జాబిల్లి వెన్నెలకాస్తుంటే కోకిలలు గానంచేస్తుంటే కవిగారివర్ణనలు పులకించవా! విరులు విచ్చుకుంటుంటే సుమాలు సౌరభాలుచల్లుతుంటే తుమ్మెదలు ఝంకారాలుచేస్తుంటే పూలకవితలు పుట్టకరావా! మన్మధుడు శరాలుసంధిస్తుంటే వానదేవుదు చినుకులుకురిపిస్తుంటే వాయుదేవుదు చల్లనిగాలివీస్తుంటే కవిబ్రహ్మ కవితలుసృష్టించడా! సాహితి వెన్నుతడుతుంటే మది మురిసిపోతుంటే వాణీదేవి వరాలిస్తుంటే కమ్మనికవితలు ప్రవహించవా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం