Posts

Showing posts from August, 2023
Image
 శ్రావణమాసం శ్రావణమాసం శుభమాసం సౌభాగ్యవతులకు వరలక్ష్మీవ్రతమాసం విష్ణుదేవుని జన్మనక్షత్రం శ్రావణం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమాసం శ్రావణశుక్రవారం సుదినం సుహాసనీలకు శుభప్రదం శ్రావణారాధనం విశిష్టం ముత్తైదువులకు మంగళప్రదం శ్రావణమాసం అతిపవిత్రం ప్రతిగృహం తలపించుదేవాలయం శ్రావణమాసం మొత్తం మారుమ్రోగును దైవనామస్మరణం శ్రావణపూజలు స్త్రీలకుప్రియం భక్తులందరికి విశ్వాసనీయం శ్రావణమాసంలో నదీస్నానం ఆరోగ్యప్రదం ఆనందదాయకం శ్రావణమాసంలో సుముహూర్తాలనేకం శుభకార్యాలను చేసేద్దాం లక్ష్మీదేవిని కొలుద్దాం సిరిసంపదలను పొందుదాం శ్రీలక్ష్మిని అరాధిద్దాం అమ్మవారికరుణకటాక్షాలకు పాత్రులగుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితలకూర్పు చూచినవి ఆకర్షిస్తేగాని కవితలను కూర్చలేకపోతున్నా విన్నవి నచ్చితేగాని కైతలని వెల్లడించలేకపోతున్నా చదినవి వెంటబడితేగాని కయితలను వ్రాయలేకపోతున్నా అక్షరాలు అల్లుకుంటేగాని అచ్చతెలుగురాతలు అల్లలేకపోతున్నా పదాలు పారితేగాని పుటలను నింపలేకపోతున్నా ఆలోచనలు ఆవహిస్తేగాని అద్భుతవ్రాతలు ఆవిష్కరించలేకపోతున్నా భావాలు బలపడితేగాని సాహిత్యమును సృష్టించలేకపోతున్నా మహాకవులు మార్గంచూపితేగాని మంచిరచనలను ముందుంచలేకపోతున్నా పాఠకులు ప్రోత్సహిస్తేగాని పేనాను పట్టుకోలేకపోతున్నా తెలుగుతల్లి తలనుతట్టి తలపులిస్తేగాని తృప్తిగాకవనంచేయలేకపోతున్నా వాణీదేవి వరమిస్తేగాని విన్నూతనవ్రాతలు విరచించలేకపోతున్నా వ్రాయటం అదృష్టఫలం అభిలాషనీయం ఆనందకరం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సహధర్మిణితో సరాగాలు చూడటం నా వంతయ్యింది నవ్వటం నీ వంతయ్యింది పిలవటం నా వంతయ్యింది పలకటం నీ వంతయ్యింది మాట్లాడటం నా వంతయ్యింది వినటం నీ వంతయ్యింది కోరటం నా వంతయ్యింది ఒప్పుకోటం నీ వంతయ్యింది అందం నీ వంతయ్యింది ఆనందం నా వంతయ్యింది సంపాదన నా వంతయ్యింది వ్యయం నీ వంతయ్యింది ఉద్యోగం నా వంతయ్యింది గృహం నీ వంతయ్యింది తినటం నా వంతయ్యింది వండటం నీ వంతయ్యింది శ్రమించటం నా వంతయ్యింది సుఖశయనం నీ వంతయ్యింది బయటపెత్తనం నా వంతయ్యింది ఇంటిపెత్తనం నీ వంతయ్యింది కవితలు వ్రాయటం నా వంతయ్యింది చదవటం నీ వంతయ్యింది సహధర్మిణీ! వంతులు మార్చుకుందామా  పాత్రలు తారుమారుచేసుకుందామా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యన్నగరం
Image
 తెలుగు తెలుగు నా భాష తెలుగు నా ధ్యాస తెలుగు నా శ్వాస తెలుగు నా ఆశ తెలుగు నా తల్లి తెలుగు నా కల్పవల్లి తెలుగు నా  సుమము తెలుగు నా సౌరభము తెలుగు నా  పలుకు తెలుగు నా కులుకు తెలుగు నా వెలుగు తెలుగు నా వెన్న్నెల తెలుగు నా మార్గం తెలుగు  నా గమ్యం తెలుగు  నా శక్తి తెలుగు నా స్ఫూర్తి తెలుగు నా శరం తెలుగు నా వరం తెలుగు నా ఆస్తి తెలుగు   నా కీర్తి తెలుగు నా కల తెలుగు నా కళ  నా అక్షరాలు తెలుగు నా పదాలు తెలుగు నా ఆలోచనలు తెలుగు  నా భావాలు తెలుగు నా కవితలు తెలుగు నా పాటలు తెలుగు గుండ్లపల్లి రాఏంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 భావావేశం ఆకాశంలో  అందమైన జాబిలిపువ్వు పూయటంచూశా చల్లనివెన్నెల పుప్పొడిని కురిపించటం కనులారాకాంచా మేఘాలు చిటపటమని చినుకులురాల్చటం పొడగన్నా పచ్చనిమొక్కలు హాయిగా ఊపిరిపీల్చటం దర్శించా మొగ్గలు ముడుచుకొని మొహమాటపడటం తిలకించా రవినిచూచి ధైర్యంతెచ్చుకొని విరులువికసించటం వీక్షించా కొమ్మలు ఊగటం ఆకులు కదలటంకన్నా కళ్ళను మూసేశా మనసును తెరచిచూచా పెదవులకు తాళంవేశా మునివేళ్ళకు మాట్లాడటంనేర్పా కాళ్ళను కట్టేశా గాలిలో తిరిగా పూలను అక్షరాలకుతొడిగా పదాలను మాలలుగాగుచ్చా ఊహలను తలలో ఊరించా భావాలను పుటలలో పారించా కవితలను కమ్మగాసృష్టించా కల్పనలల్లి పాఠకులనుమురిపించా హాయిగా చదవండి ఆనందమును పొందండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా కవితలు గుండె చప్పుళ్ళు మది ముచ్చట్లు నా కవితలు అందాల దృశ్యాలు ఆనంద క్షణాలు నా కవితలు అంగులు చూపి అలరించె అలరులు నా కవితలు పరిమళాలు చల్లే పసందైన పుష్పాలు నా కవితలు చక్కెర కలిపిన చిక్కని పాలు నా కవితలు తేనెలు చిందే తియ్యని పలుకులు నా కవితలు వెలుగులు చిమ్మే చంద్ర వదనాలు నా కవితలు నీరు పారే జీవ నదులు నా కవితలు పచ్చని కాపురాలు సుఖమైన బ్రతుకులు నా కవితలు కుతూహల పరచే కమ్మని రాతలు నా కవితలు అర్ధాలు స్ఫురించే అద్బుత అక్షరాలు నా కవితలు ప్రాసలు కూడిన లయాత్మక పదాలు నా కవితలు తెలుగుదనం నిండిన తేట నుడికారాలు నా కవితలు భావ గర్భితమైన విన్నూతన విషయాలు నా కవితలు విన్న వారికి వీనుల విందులు నా కవితలు చదివిన వారిని వదలని విషయాలు నా కవితలు ఆస్వాదిస్తే ఆనందిస్తా సలహాలిస్తే స్వీకరిస్తా తలచుకుంటే తృప్తిపడతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చందమామ చిక్కినరోజు అమ్మా అమ్మా విన్నావటమ్మా నిన్న చంద్రునిపై విక్రందిగిందటమ్మా చందమామ రావేయని పిలువకమ్మా మనమే జాబిలిచెంతకు వెళ్దామమ్మా చందమామపై ఆడుకుంటానమ్మా జాబిల్లిపైన విహరిస్తానమ్మా చంద్రుని సొగసులు చూస్తానమ్మా చంద్రుని కవితలు వ్రాస్తానమ్మా చంద్రునిపై ఇల్లుకట్టుకుందామమ్మా చంద్రునిపై నివాసముందామమ్మా చంద్రునిపై సేద్యంచేద్దామమ్మా చంద్రునిపై పంటలుపండిద్దామమ్మా చంద్రయాన్ నిన్న చంద్రుని దరిచేరిందమ్మా విక్రం నిన్న చంద్రునిపై దిగిందమ్మా ఫొటోలు చాలా తీసిందమ్మా భూమికి వాటిని పంపిందమ్మా త్రివర్ణపతాకము జాబిలిపై ఎగిరిందమ్మా భారతీయుల మనసులు పొంగి పొర్లాయమ్మా జాబిల్లి చిక్కిందమ్మా మోములు వెలిగాయమ్మా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మన చంద్రయానం   విక్రం చంద్రుడిపైదిగింది చంద్రయానం విజయవంతమయ్యింది జాబిలిపై త్రివర్ణపతాకం రెపరెపలాడింది జనులమోములపై సంతోషం వెల్లివిరిసింది శాస్త్రవేత్తలకు అభివందనలు  భారతీయులకు శుభాకాంక్షలు  ఇస్రో విజయం దేశానికి గర్వకారణం మన శాస్త్రఙ్ఞానం ప్రపంచానికే ఒకపాఠం శ్రీహరికోట పేరు మ్రోగింది తెలుగుప్రదేశము జగానికి తెలిసింది ఎన్నెన్నో విజయాలు సాధించాలి త్వరలో చంద్రునిపై కాలుమోపాలి అంగారకుని చేరాలి శుక్రుడిమర్మాలను ఛేదించాలి సూర్యునిసమాచారం సేకరించాలి విశ్వరహస్యాలు కనుగొనాలి  తెలివైనవారమని చాటాలి భారతీయులమని గర్వించాలి జయహో భారతదేశం జయజయహో భారతదేశం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిగారిమాటలు రవినని వెలుగులుచిమ్మనా! కవినని అక్షరములునల్లనా! మనసువిప్పి ముందుంచనా! మర్మాలుచెప్పి మదినమ్మించనా! గళమునెత్తి కేసరిలాగర్జించనా! కలముపట్టి కుళ్ళునుకడిగేయనా! గజ్జెకట్టి చిందులేయనా! నోరువిప్పి నిజాలుచెప్పనా! కర్రపట్టి సాముచేయనా! కత్తిపట్టి ఝళిపించనా! ఎదిరించి రొమ్మునొడ్డనా! వెనక్కి తరిమేయనా! కవితవ్రాసి చదివించనా! భవితచూపి నడిపించనా! ఆడించి సంతసపరచనా! పాడించి పులకరించనా! తినిపించి కడుపునింపనా! త్రాగించి దప్పికతీర్చనా! ఎరిగించి మేల్కొలపనా! జోకొట్టి నిద్రపుచ్చనా! తుపాకిపట్టి రక్తంచిందించనా! పేనానుపట్టి రక్తంమరగించనా! పదాలువదలి తూటాలులాపేల్చనా! భావాలుచెప్పి తలలకుతగిలించనా! ఆలోచనలులేపి అభ్యుదయపధాననడపనా! సంస్కరణలుచూపి సమాజాన్నిసరిజేయనా! వ్యధపడి వెల్లడిస్తున్నా! మదనపడి ముందుకొస్తున్నా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీవనం సాహిత్యం స్వాగతిస్తుంది హరితవనం ఆహ్వానిస్తుంది కవిత్వం కవ్విస్తుంది కాననం కట్టేస్తుంది మస్తకం నేలయ్యింది సాహిత్యం వనమయ్యింది మనసు పూదోటయ్యింది సొగసుకు స్థావరమయ్యింది మొక్కలు మొలిచాయి సస్యము చుట్టుముట్టింది కొమ్మలు పెరుగుతున్నాయి ఆకులు పుడుతున్నాయి పువ్వులు పూస్తున్నాయి కాయలు కాస్తున్నాయి అందాలు ఆకర్షిస్తున్నాయి ఆనందము కలిగిస్తున్నాయి పువ్వులు అక్షరాలయ్యాయి మాలలు కవితలయ్యాయి పరిమళాలు వ్యాపిస్తున్నాయి కవనాలు కొనసాగుతున్నాయి సెలయేరు ప్రవహిస్తుంది కవితాఝరి స్రవిస్తుంది హరితవనం ఆహ్వానిస్తుంది సాహిత్యలోకం పిలుస్తుంది కవిత్వసారాన్ని ఆస్వాదించండి సాహిత్యరసాన్ని పానముచేయండి గుండ్లపల్లి రాజంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మెదడు ఊహలు ఊరిస్తుంది తలపులు తడుతుంది ఆలోచనలు పారిస్తుంది భావాలు బయటపెట్టిస్తుంది మనసును మురిపిస్తుంది హృదయాన్ని కరిగిస్తుంది అంతరంగాన్ని అలరిస్తుంది తనువును తృప్తిపరుస్తుంది తినిపిస్తుంది త్రాగిస్తుంది నిద్రపుచ్చుతుంది మేల్కొపుతుంది గుబులుపుట్టిస్తుంది ప్రేమకలిగిస్తుంది  కష్టముచేయిస్తుంది కుతూహలపరుస్తుంది తెలివిని ఇస్తుంది కోర్కెలు లేపుతుంది పనులు చేయిస్తుంది ఫలాలు అందిస్తుంది తలకు ఎక్కుతుంది ఉన్నతస్థానం ఆక్రమిస్తుంది ఎముకలమధ్య కూర్చుంటుంది రక్షణస్థావరం ఏర్పరచుకుంటుంది పెదవులను పలికిస్తుంది శబ్దాలను వినిపిస్తుంది శ్రమను చేయిస్తుంది ముందుకు నడిపిస్తుంది నువ్వు ఏమిటో నీమెదడు చెబుతుంది నీసంపాదన ఏమిటో నీమెదడు నిర్ణయిస్తుంది నీ చేతలేమిటో నీమెదడు సూచిస్తుంది నీ రాతలేమిటో నీమెదడు తెలుపుతుంది ముందంజకు మెదడే మూలము మనుగడకు మెదడే ముఖ్యము మెదడును  వశపరచుకో మనసును అదుపులోపెట్టుకో రహస్యం తెలుసుకో జీవితం గడుపుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎందుకు? పరిమళములేని పువ్వులెందుకు? మాధుర్యంలేని కవితలెందుకు? తోడులేని జీవితాలెందుకు? పిల్లలులేని గృహాలెందుకు? నవ్వులేని మోములెందుకు? జాబిలిలేని ఆకాశమెందుకు? తీపిలేని పలుకులెందుకు? నీరులేని నదులెందుకు? అర్ధములేని వాగుడెందుకు? వ్యర్ధమైన పనులెందుకు? అవసరములేని ఆలోచనలెందుకు? బహిరంగపరచని భావాలెందుకు? పొట్టనింపని చదువులెందుకు? ఆకలితీర్చని ఉద్యోగాలెందుకు? వానలుకురవని మేఘాలెందుకు? పంటలుపండని పొలాలెందుకు? సంతసములేని కాపురాలెందుకు? గమ్యములేని ప్రయాణాలెందుకు? ఆకర్షణలేని అక్షరాలెందుకు? ప్రకాశములేని పదాలెందుకు? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మబ్బులు మబ్బులు లేచాయి ఆకాశాన్ని కప్పాయి మబ్బులు కమ్మాయి సూర్యుని ముట్టాయి మబ్బులు గొడుగుపట్టాయి ఎండతీవ్రతను తగ్గించాయి మబ్బులు తేలాయి గగనాన్ని అలంకరించాయి మబ్బులు తిరిగాయి మనసును దోచాయి మబ్బులు కూడాయి మెరుపులు మెరిశాయి మబ్బులు కలిశాయి ఉరుములు ఉరిమాయి మబ్బులు కరిగాయి చినుకులు పడ్డాయి మబ్బులు కప్పాయి జాబిలిని దాచాయి మబ్బులు మాయమయ్యాయి నింగిని శూన్యముచేశాయి మబ్బులు పిలిచాయి ఎక్కి స్వారిచేయమన్నాయి మబ్బులు మురిశాయి మనసును తేలికపరిచాయి మబ్బులు ఎక్కుతా మిన్నులో తిరుగుతా మబ్బుల్ని వర్ణిస్తా దృశ్యాలు చూపిస్తా మబ్బుల్ని చూడమంటా మోదమును పొందమంటా మబ్బుల్లో విహరిస్తా మాటల్లో వినిపిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 భావప్రకంపనలు తలల్లో పుడతా పుటల్లో ఎక్కుతా అక్షరాలలో అవతరిస్తా పదాలలో ప్రత్యక్షమవుతా కమ్మదనాలు కురిపిస్తా తియ్యదనాలు తినిపిస్తా తనివి తీరుస్తా మదిని ముట్టేస్తా అందాలు చూపిస్తా ఆనందము కలిగిస్తా ఆలోచనలను లేపుతా అంతరంగాలను తడతా పూదోటల్లో తిప్పుతా వెన్నెలలో విహరింపజేస్తా సుమాలు చూపుతా సౌరభాలు చల్లుతా నవ్వులు చిందిస్తా మోములు వెలిగిస్తా నీరులా ప్రవహిస్తా గాలిలా వ్యాపిస్తా నింగికి రంగేస్తా నీలిమబ్బులు తేలించుతా ఆకాశంలోకి తీసుకెళ్తా హరివిల్లుని చూపించుతా అభిమానులను ఆకర్షిస్తా ఆయస్కాంతంలా అంటుకుంటా కవనంతో కట్టిపడేస్తా కవితలతో కుషీచేస్తా భావాలతో భ్రమగొల్పుతా భావకవిత్వంలో ముంచేస్తా భావప్రకంపనలు సృష్టిస్తా భావకవితలను పారిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రాణప్రీతి ఆగనా ఆగనా లబ్ డబ్ మని కొట్టుకొనటం ఆగనా అనియన్నది గుండెకాయ ఆపనా ఆపనా ఉచ్ఛ్వాసనిశ్వాసలతో పీల్చటంవదలటం ఆపనా అనియన్నది ఊపిరితిత్తి కలపనా కలపనా దేహచైతన్యాన్ని గాలిలో కలపనా అనియన్నది ప్రాణం వెళ్ళనా వెళ్ళనా శాశ్వతమైన నిదురలోనికి వెళ్ళనా అనియన్నది శరీరం మాననా మాననా నోరుతెరచి మాట్లాడటం మాననా అనియన్నది గళం మూయనా మూయనా రెప్పలు తెరవకుండామూయనా అనియన్నవి కళ్ళు ఆపనా ఆపనా ప్రవహించేటి ఆలొచనలను ఆపనా అనియన్నది మనసు వీడనా వీడనా ఏమైనాగానీ వినటం వీడనా అనియన్నవి చెవులు మానుకోనా మానుకోనా ఎక్కడికైనాసరే నడవటం మానుకోనా అనియన్నవి కాళ్ళు మానేస్తా మానేస్తా మూడుపూటలా తినటం మానేస్తా అనియన్నది నోరు ఆపేస్తా ఆపేస్తా కవితలను వ్రాయటం ఆపేస్తా అనియన్నది చెయ్యి వద్దన్నా వద్దన్నా భార్య బాధపడుతుంది  వద్దన్నా వద్దన్నా వలదన్నా వలదన్నా సంతానం శోకిస్తుంది వలదన్నా వలదన్నా విరమించమన్నా పౌత్రీపౌత్రులు పరితపిస్తారు విరమించమన్నా సరే సరే  ఒప్పుకుంటున్నా ఈసారికి సరే అనియన్నాడు జీవుడు ఒప్పుకున్నా ఒప్పుకున్నా కోరికమన్నిస్తున్నా ఈమారు ఒప్పుకున్నా అనియన్నాడు దేవుడు బ్రతికా బ్రతికా బయటపడ్డా భగవంతునిదయవల్ల బ్రతికా బట...
Image
 చెలికాడా! విరినై వికసించనా పూవునై పరిమళించనా పువ్వునై మదినిదోచుకోనా నవ్వునై మోమువెలిగించనా అప్సరసనై అందాలుచూపనా ఊర్వశినై ఉత్సాహపరచనా చెలియనై చెంతకురానా ప్రేయసినై ప్రేమించనా వధువునై తోడుగానిలువనా మధువునై తీపినందించనా తోడై నూరేళ్ళునిలవనా నీడై వదలకవెంటుండనా పత్నినై పతిసేవలుచెయ్యనా భార్యనై భాద్యతలుపంచుకోనా సిరినై చేకూరనా సంపదనై సమకూరనా శాంతినై స్థిమితపరచనా సుఖమునై సంతసపరచనా రవినై కాంతులుచిందనా శశినై వెన్నెలకురిపించనా అక్షరాలనై అలరించనా పదములనై పరవశపరచనా గేయమునై వినిపించనా కవితనై చదివించనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రవి-కవి రవి కిరణాలు చల్లుతున్నాడు కవి అక్షరాలు విసురుతున్నాడు రవి జనుల నిద్రలేపుతున్నాడు కవి మదుల మేల్కొలుపుతున్నాడు రవి అంధకారాన్ని పారదోలుతున్నాడు కవి అఙ్ఞానాన్ని అంతముచేస్తున్నాడు రవి ప్రతిదినం ఉదయించుతున్నాడు కవి నిత్యము ఉత్సాహపరుస్తున్నాడు రవి కాలాన్ని నడుపుతున్నాడు కవి కలమును కదిలిస్తున్నాడు రవి దినమును మొదలుపెడుతున్నాడు కవి పఠనమును ప్రారంబించుతున్నాడు రవి నిప్పులు చెలరేగుతున్నాడు కవి కవితలు కూర్చేస్తున్నాడు రవి పయనిస్తున్నాడు కవి గమనిస్తున్నాడు రవి ఋతువులిస్తున్నాడు కవి కయితలిస్తున్నాడు రవి ఆకాశంలో తిరుగుతున్నాడు కవి అంతరంగాల్లో వసిస్తున్నాడు రవి కనిపించుతున్నాడు కవి  వినిపించుతున్నాడు రవి అందాలనుచూపుతున్నాడు కవి  ఆనందముకూరుస్తున్నాడు రవి చూడనిచోట్లను కవి కాంచుతున్నాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ మంచిమనిషీ! మనసును కడిగెయ్యి మురికిని తీసివెయ్యి మనసును మార్చెయ్యి మూర్ఖత్వము మానెయ్యి మనసును కట్టివెయ్యి స్థిమితము పొందెయ్యి మనసును కరిగించెయ్యి మానవతను చాటెయ్యి మనసుకు నచ్చచెప్పేయి మోసాలను మానిపించెయ్యి మనసును తట్టిలేపేయి మేనును  మురిపించేయి మనసుని దారికితెచ్చుకోవోయి మంచికార్యములను చేయవోయి మనసును మాట్లాడించెయ్యి మమతను చూపించెయ్యి మనసుకు ముందుచూపివ్వవోయి మంచిదారిన నడవవోయి మనసును  పొంగించెయ్యి మంచికవతలు వ్రాసెయ్యి మనసుచెప్పినట్లు నువ్వువినకోయి నువ్వుచెప్పినట్లు మనసువినాలోయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగు - తెలుగోడు తెలుగుకు దీటులేదురా తెలుగోడికి సాటిలేరురా తెలుగుకు అండుందిరా తెలుగోడికి బలముందిరా తెలుగుకు సాహిత్యముందిరా తెలుగోడికి ఘనచరిత్రయుందిరా తెలుగుకు ఖ్యాతియుందిరా తెలుగోడికి జాతియుందిరా తెలుగుకు శ్రావ్యతుందిరా తెలుగోడికి కంఠముందిరా తెలుగుకు తీపియుందిరా తెలుగోడికి ప్రీతియుందిరా తెలుగుకు శైలియుందిరా తెలుగోడికి శిల్పముందిరా తెలుగుకు తెరువుందిరా తెలుగోడికి గమ్యముందిరా తెలుగుకు వెలుగుందిరా తెలుగోడికి తేజముందిరా తెలుగుకు శక్తియుందిరా తెలుగోడికి యుక్తియుందిరా తెలుగుకు ప్రక్రియలున్నాయిరా తెలుగోడికి ప్రయోగాలున్నాయిరా తెలుగుకు చైతన్యముందిరా తెలుగోడికి ప్రాభవముందిరా తెలుగుకు ప్రాధాన్యమిద్దామురా తెలుగోడికి పట్టముకడదామురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ వర్ధమానకవీ! దమ్ము చూపరా దుమ్ము లేపరా కలం పట్టరా గళం విప్పరా నిప్పులు చిందరా నిగ్గును తేల్చరా పౌరుషం చూపరా స్వాభిమానం చాటరా పదాలు పేర్చరా పెదాలు విప్పరా మీసం మెలివేయరా మౌనం వీడరా నోర్లు మూయించరా తలలు దింపించరా కల్లు తెరిపించరా వళ్ళు మరిపించరా అక్షరాలను ముత్యాల్లా కూర్చరా పదాలను దివ్వెల్లా వెలిగించరా మాటల గారడిచెయ్యరా నాల్కల కరిపించరా తుపాకులు పట్టరా తూటాలు పేల్చరా తలలు తట్టరా తలపులు లేపరా ఒకరంటారు కవిసమ్మేళనమంటే చెట్లమీదకాకుల్లాగా కవులు వాలుతారట కాకులు కావుకావు మన్నట్లు కవులుగుంపుగాచేరి కూస్తారట సన్మానాలంటే శాలువాలంటే ప్రశంసాపత్రాలంటే పరుగెత్తుతారట మరొకరంటారు గురుత్వాకర్షణలేని పసలేనిపదాలవెంట కవులుపడుతున్నారట కవులకాలనీకి తీసుకొచ్చినవారిని తిట్టాలట తన్నాలట పచ్చపచ్చని కవిత్వమైదాలాను పనీపాటలేనికవులు నాశనంచేస్తున్నారట చూడు విసుర్లు కను విమర్శలు మీసం తీసెయ్యి మౌనం వహించు లేదంటే సవాలు తీసుకో సమాధానం చెప్పు మాటలు వెనుకకుతీయించు కూరల్లో ఉప్పుకారం వేసినట్లు కవితల్లో తీపిసౌరభం కలుపు పాఠకులమనసులు తట్టిలేపు విమర్శకులమూతులు మూయించు బాగా వ్రాయి బుద్ధి చెప్పు బాధను అర్ధంచేసుకో వ్యధను తొలిగించు ల...
Image
 పూలపరువాలు ఉదయం పూలలో బాల్యం చూస్తున్నా మధ్యాహ్నం పూలలో కౌమారం కాంచుతున్నా మధ్యాహ్నం  పూలలో యవ్వనం వీక్షిస్తున్నా రాతిరి పూలలో వృద్ధాప్యం దర్శిస్తున్నా ఉదయం  పూలలో పసిపాపలను చూస్తున్నా మధ్యాహ్నం పూలలో పడుచులను కాంచుతున్నా సాయంత్రం  పూలలో పెళ్ళయినపడతులను వీక్షిస్తున్నా రాతిరి పూలలో ప్రణయప్రలాపనలకాంతలను దర్శిస్తున్నా ఉదయం పూలలో సిగ్గులు చూస్తున్నా మధ్యాహ్నం పూలలో మిడిసిపాటు కాంచుతున్నా సాయంత్రం పూలలో ప్రేమానురాగాలు వీక్షిస్తున్నా రాతిరి పూలలో రసికత్వం దర్శిస్తున్నా పువ్వులు పూస్తున్నాయి పొంకాలు ప్రదర్శిస్తున్నాయి పలురంగులు పరికింపచేస్తున్నాయి ప్రమోదాలు పంచుతున్నాయి పువ్వులు పరిమళాలుచల్లుతున్నాయి పరమానందపరుస్తున్నాయి ప్రకాశిస్తున్నాయి పరవశమిస్తున్నాయి పువ్వులు పరమాత్ముని పాదాలుచేరుతున్నాయి పుణ్యప్రదమవుతున్నాయి పడతులకొప్పులెక్కుతున్నాయి ప్రలోభానికిగురిచేస్తున్నాయి పువ్వులు మొగ్గలుతొడుగుతున్నాయి సిగ్గులు చూపుతున్నాయి విరబూస్తున్నాయి మరులుకొలుపుతున్నాయి పువ్వులు వికసిస్తున్నాయి విందులిస్తున్నాయి పడకెక్కుతున్నాయి పరవశపరుస్తున్నాయి పువ్వులు వాడిపోతున్నాయి వ్రాలిపోతున్నాయి ర...
Image
 తెలుగోళ్ళం తెలుగువాళ్ళం మనం తెలివైనవాళ్ళం  ఆంధ్రులం మనం అతిసుందరులం తెలుగుతల్లిపిల్లలం మనం తరతరాలవారసులం తలెత్తుకొనితిరిగేవాళ్ళం మనం తలవంపుపనులుచేయనివాళ్ళం వికాసవంతులం మనం విలువున్నవాళ్ళం  కృషీవలులం మనం కష్టపడేవాళ్ళం బాగాచదివేవాళ్ళం మనం ఉద్యోగాలుచేసేవాళ్ళం విదేశాలాకువెళ్ళేవాళ్ళం మనం విశేషంగాసంపాదిచేవాళ్ళం ఎక్కడికైనావెళ్ళేవాళ్ళం మనం ఆచారాలనువదలనివాళ్ళం ఏకజాతిగానిలిచేవాళ్ళం మనం అందరితోకలసిపోయేవాళ్ళం వీరులంశూరులం మనం పంతాలుపట్టింపులున్నవాళ్ళం దేశభక్తికలవాళ్ళం మనం జాతిసమైక్యతనుకాపాడేవాళ్ళం తీపిగ మాట్లాడుకుందాం తేనెను పంచుకుందాం తేటగ తెలుగునుపలుకుదాం తెల్లారి వెలుగునుతలపించుదాం ఏపుగ తెలుగుతోటపెంచుదాం చక్కగ తెలుగుపూలుపూయించుదాం పరిసరాల సుమసౌరభాలుచల్లుదాం పొరుగోళ్ళ మనసులుదోచేద్దాం కమ్మగ కవితలుకూర్చుదాం చక్కగ పాటలుపాడుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా తెలుగు భాషలలో బహుగొప్ప నా తెలుగుభాష జాతులలో కడుమేటి నా తెలుగుజాతి వన్నెచిన్నెలున్న ఒయ్యారి నాతెలుగు  కళాకాంతులున్న కమ్మనిది నాతెలుగు   తేనెలుచిందేటి తియ్యనిది నాతెలుగు  వెలుగులుచిందేటి వెలుతురు నాతెలుగు  పరిమళాలుచిందేటి పూదోట నాతెలుగు  చిరునవ్వులుకురిసేటి చంద్రముఖి నాతెలుగు  మనసులుముట్టేటి మున్నాడి నాతెలుగు  గుండెలుదోచేటి గుమ్మాడి నాతెలుగు  ముద్దులొలికేటి చిన్నారి నాతెలుగు  ముద్దుమాటలాడేటి పొన్నారి నాతెలుగు  వెన్నెలచల్లేటి జాబిలి నాతెలుగు తళతళమెరిసేటి తారక నాతెలుగు హంసలానడిచేటి కులుకులాడి నాతెలుగు నెమలిలానాట్యమాడేటి నర్తకీమణి నాతెలుగు చిలుకలాపలికేటి చక్కెర నాతెలుగు కోకిలలాపాడేటి గానము నాతెలుగు గోదారిలాసాగేటి వేదము నాతెలుగు క్రిష్ణలాపారేటి కావ్యము నాతెలుగు అమృతముతోనిండిన భాండము నాతెలుగు షడ్రుచులుయున్నట్టి భోజనము నాతెలుగు ముత్యాల్లాంటి అక్షరాలుకలది నాతెలుగు పంచదారలాంటి పలుపదాలున్నది నాతెలుగు ఉగ్గుపాలతో వచ్చేది నాతెలుగు ఉయ్యలపాటలతో నేర్చేది నాతెలుగు తల్లివంటి దేవత నాతెలుగు తండ్రివంటి చేయూత నాతెలుగు సరళమైనది నా తేటతెలుగు స్వచ్ఛ...
Image
 పుస్తకం పుస్తకం హస్తభూషణం పుస్తకం ఙ్ఞానకోశాగారం పుస్తకం అక్షరాలభాండాగారం పుస్తకం పదాలజలాశయం పుస్తకం విషయసంగ్రహం పుస్తకం భావాలసమాహారం పుస్తకం అక్షరసేద్యఫలం పుస్తకం చరిత్రపుటలనిక్షిప్తం పుస్తకం మనోవికాససాధనం పుస్తకం బహుమంచినేస్తం పుస్తకం సరస్వతీస్వరూపం పుస్తకం అలమరాకలంకారం పుస్తకం పూజ్యనీయం పుస్తకం పఠనీయం పుస్తకం పాండిత్యం పుస్తకం విఙ్ఞానం పుస్తకం మరోప్రపంచం పుస్తకం మస్తకజాగృతం పుస్తకాలకు వందనం పుస్తకరచయితలకు ప్రణామం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అక్షరకేళి అక్షరాలకు అత్తరురాస్తా పదాలకు పన్నీరుపూస్తా పరిమళాలు పారిస్తా పంక్తులు పేరుస్తా ముచ్చట్లు చెప్పేస్తా ముఖాలు వెలిగిస్తా అందాలు చూపిస్తా ఆనందము అందిస్తా వన్నెలు చిందిస్తా వయ్యారాలు ఒలికిస్తా పుటలకు ఎక్కిస్తా మదులకు పనిబెడతా విరులు విసిరేస్తా మరులు కొలిపిస్తా సుమశరాలు సంధిస్తా పుష్పబాణాలు సారిస్తా తనువులు తట్టుతా మనసులు ముట్టుతా తలలలో దూరుతా మెదళ్ళలో మకాంపెడతా కవితలు విసురుతా కనపడక వినిపిస్తా భావాలను బయటపెడతా విషయాలను విశదీకరిస్తా అక్షరాలతో ఆటలాడతా పదములతో ప్రయోగంచేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పూలసందేశం పూలతోసందేశమును పంపనా పూబోడులమదులను దోచనా తలలోపూలు తురుమనా తనువునుతాకి తరించనా చేతికిపూలు ఇవ్వనా మదిలోప్రేమను చాటనా చెవిలోపూలు పెట్టనా వెర్రిదానిని చెయ్యనా ముక్కుకుమల్లెలు తగిలించనా మంచిగంధమును పీల్పించనా చీరకుపూలు అంటించనా అందాలను రెట్టింపుచేయనా మాలగామల్లెలు అల్లనా మెడలోదండను వేయనా పడకపైపువ్వులు చల్లనా పవళించుటకు పిలువనా కంటికిపూలు అద్దనా చల్లదనమును కలిగించనా బుగ్గకుపూలు రాయనా కోమలము చెయ్యనా తాజామల్లెలు తీసుకురానా తట్టినకోర్కెలు తెలుపనా పూలతో మాట్లాడించనా ప్రణయంలో దించేయనా పూలకవితలు వ్రాయనా పాఠకులమనసులు పులకించనా కాళిదాసుని మేఘసందేశం శ్రీనాధుని హంసరాయబారం ప్రసాదుని పూలప్రస్తావితం పోల్చుకొని పాడండిప్రణయగీతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రబోధపర్వము ఎవరేమిచెప్పినా తప్పకవినరా నిజముతెలుసుకొనినడుచుకోరా! మీసమున్నదని మెలియవేస్తే కత్తిరిస్తారురా! మొనగాడినని గర్వపడితే పడదోస్తారురా! అందమున్నదని విర్రవీగితే అగచాట్లుపెడతారురా! డబ్బుకలదని తగలవేస్తే అడుక్కోకతప్పదురా! అధికారమున్నదని చలాయిస్తే అణచివేస్తారురా! ఓటుహక్కున్నదని దుర్వినియోగంచేస్తే సమాజానికిచేటురా! తెలివియున్నదని తోకజాడిస్తే తంటాలుపాలవుదురా! మనసుపడ్డావని అడ్డదారిపడితే మునిగిపోతావురా! తెల్లనివన్నీ పాలనుకుంటే మోసపోదువురా! చూచినవన్నీ కావాలంటే శ్రమతప్పదురా! కోరినకోర్కెలన్నీ తీరాలంటే కృషిచెయ్యాలిరా! కానివిషయాలలో తలదూరిస్తే కాలిపోతావురా! బక్కవాడని అవహేళనచేస్తే పోరుతప్పదురా! బీదవాడని ఉపేక్షిస్తే తిరుగుబాటుతప్పదురా! బడుగువాడని బయటపెడితే ఎదురుతిరుగునురా! మూతిముడిచి మూలనకూర్చుంటే మూగవాడంటారురా! లోతుతెలుసుకోక ఏటిలోదిగితే కొట్టుకుపోతావురా! అన్నీతెలుసుకొనక అడుగులేస్తే అనర్ధదాయకమురా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పూలకవితలు పువ్వుమీద తేటివ్రాలినట్లు పూదొటమధ్య కవివ్రాలాడు   పువ్వులు తేనెనిచ్చినట్లు కవిగారు తీపినిపంచుతున్నారు అవకాశం వాడుకోండి మకరందం జుర్రుకోండి మొగ్గలు తొడిగాయి కలాలు కదిలాయి పువ్వులు పూచాయి కైతలు తట్టాయి పూలు పెరిగాయి కవితలు కూరాయి విరులు విరిసాయి కయితలు వెలువడ్డాయి అందాలు చూపాయి ఆనందము ఇచ్చాయి రంగులు చూపాయి హంగులు అద్దుకున్నాయి కళ్ళను కట్టేశాయి మనసులను ముట్టేశాయి పరిమళాలు చల్లాయి పరవశాలు పంచాయి పూవులు మాలలయ్యాయి అక్షరాలు పంక్తులయ్యాయి పొంకాలు చూపాయి భావాలు తెలిపాయి సుమాలు సుందరంగాయున్నాయి కవనాలు కమ్మగాతయారయ్యాయి పూలు తెంచుకోమంటున్నాయి కవితలు చదువుకోమంటున్నాయి పుష్పాలు తీసుకొనివెళ్ళమంటున్నాయి కవితలు మదిలోనిలుపుకోమంటున్నాయి పూదోటలోని పుష్పాలు సాహిత్యంలోని కవనాలు చూచి సంబరపడండి చదివి సంతసించండి పూలను పరికించండి కవితలను పఠించండి పూలను మెచ్చుకోండి కవులను కీర్తించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఉషోదయం కవితోదయం ఉషోదయం  అయ్యింది కవితోదయం అయ్యింది కిరణాలు ప్రసరించాయి అక్షరాలు వెలువడ్డాయి తూర్పు తెల్లవారింది కవిత తయారయ్యింది జగత్తు చైతన్యమయ్యింది భావము బహిర్గతమయ్యింది మనుషులు మేలుకొన్నారు మనసులను మురిపించారు కవిత్వం పండింది ప్రపంచం పరవశించింది కలాన్ని హలమన్నారు కవనాన్ని సేద్యమన్నారు కవిని రవియన్నారు కవిత్వాన్ని అమృతమన్నారు కవులను తలచుకోండి రచనలను చదవండి అందాలు ఆస్వాదించండి ఆనందము అందుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మధుర ఙ్ఞాపకాలు తలపుకొస్తున్నాయి తృప్తిపరుస్తున్నాయి తరుముకొస్తున్నాయి తలలోతిష్ఠవేస్తున్నాయి తట్టిపోతున్నాయి తళతళలాడిస్తున్నాయి గురుతుకొస్తున్నాయి గతాన్నిచూపిస్తున్నాయి వెంటబడుతున్నాయి వేడుకచేస్తున్నాయి మదినితడుతున్నాయి మైమరిపిస్తున్నాయి ఆలోచనలులేపుతున్నాయి అంతరంగాన్నికదిలిస్తున్నాయి నవ్వుతెప్పిస్తున్నాయి నెమరవేసుకోమంటున్నాయి వీడనంటున్నాయి వినోదపరుస్తున్నాయి ఙ్ఞప్తికొస్తున్నాయి నిక్షిప్తమవుతున్నాయి కలలోకొస్తున్నాయి కవ్వించిపోతున్నాయి మరువద్దంటున్నాయి ముచ్చటపరుస్తున్నాయి అమ్మానాన్నావస్తున్నారు ఆశీర్వదించిపోతున్నారు అక్కాచెల్లెలు వస్తున్నారు పలుకరించిపోతున్నారు అన్నాతమ్మూడువస్తున్నారు ఆనందపరచిపోతున్నారు భార్యాపిల్లలువస్తున్నారు బాగోగులుచూచిపోతున్నారు మిత్రులువస్తున్నారు మంచిమాటలుచెప్పిపోతున్నారు అందాలనుమరలాచూపుతున్నాయి ఆనందాలనుతిరిగిపొందమంటున్నాయి కవితనువ్రాయమంటున్నాయి కలకాలంనిలుపమంటున్నాయి పుటలకెక్కించమంటున్నాయి పదేపదేపఠించమంటున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం