Posts

Showing posts from October, 2023
 నా పయనం ఈ పయనం నేను కావాలనుకున్నదే ఈ వాహనం నేను ఎక్కాలనుకున్నదే ఆ గమ్యస్థానం నేను కోరుకున్నదే ఆ వెళ్ళేమార్గం నేను ఇష్టపడిందే అంధకారాన్ని వీడుతున్నా వెలుతురుతావుకి చేరబోతున్నా మరో ఆలోచనను చేయటంలా వేరే మార్గమును వెదకటంలా ఊహలలోకంలో విహరిస్తా కవనజగతిలో కాలంగడుపుతా అక్షరాలతో ఆడతా పదాలతో పయనిస్తా భావాలను బయటపెడతా విషయాలను వెల్లడించుతా కవితలను సృష్టిస్తా మనసులను దోచేస్తా సాహిత్యలోకం నా స్వర్గం పాఠకలోకం నా లక్ష్యం హయగ్రీవుని అర్ధిస్తా పలుకులమ్మని ప్రార్ధిస్తా నా పయనంలో తోడుగావస్తారా నా ప్రయత్నంలో సహకరించుతారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మా ఊరు మా ఊరు ఎన్నిసార్లు కాపాడిందో నన్ను కంటికిరెప్పలా  మా అమ్మ ఎట్లా పెంచిందో నన్ను అల్లారుముద్దుగా మా నాన్న ఎలా కాపాడాడో నన్ను కష్టాలపాలుచేయకుండా మా బడి ఏలా తీర్చిదిద్దిందో నన్ను తెలివైనవాడిగా మా గురువులు ఏమి శ్రద్ధతీసుకున్నారో నన్ను ఉన్నతుడినిచేసేలా మా నేల ఎంత సారవంతమో పంటలుపెంచటానికి దండిగా మా తోటపండ్లు ఎంత రుచికరమో తినటానికి తృప్తిగా  మా ఏరు ఎలా నీటినిస్తుందో అన్ని ఋతువుల్లోనూ మా చెరువు ఎలా ఈతకొట్టించిందో నీళ్ళపై తేలుస్తూ మా ఊరబావి ఏమి ఊరుతుందో సరిపడా నీరుతోడుకొమ్మంటూ మా ఊరివారు ఏమిగౌరవిస్తారో ఊరిలోకి అడుగుపెట్టగానే మా పోలేరు ఎన్నిసార్లు వానలుకురిపించిందో పూజచేసి కోరగానే మా వేణుస్వామి ఎలా నడిపించారో నాజీవితపయనాన్ని గమనించుతూ ఊరుకి ప్రణామాలు ఊరువారికి ధన్యవాదాలు పోలేరమ్మకు పప్పుబెల్లాలు కృష్ణరుక్మిణీసత్యలకు కళ్యాణోత్సవాలు పెద్దలకు నమస్కారాలు పిల్లలకు దీవెనలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నాతలలోని తలపులు తలలోతట్టిన తలపులను తేటతెలుగులో తియ్యగాచెప్పాలనుకుంటున్నా బుర్రలోతట్టిన ఊహలను మూటకట్టి భద్రపరచాలనుకుంటున్నా కలలోకొచ్చిన సంగతులను కట్టగట్టి దాచిపెట్టుకోవాలనుకుంటున్నా మధురమైన ఙ్ఞాపకాలను మంచికవితలుగాకూర్చి ముచ్చటతీర్చుకోవాలనుకుంటున్నా కమ్మనైన విషయాలను కాగితాలపైచెక్కి కుతూహలపడాలనుకుంటున్నా అందమైన దృశ్యాలను కళ్ళల్లోబంధించి పుటలకెక్కించాలనుకుంటున్నా అందిన ఆనందాలను అచ్చతెలుగులోకిమార్చి ఆహ్లాదపరచాలనుకుంటున్నా కలంచెప్పిన కవితలను పాఠకులకుపంపి పరవశపరచాలనుకుంటున్నా తలపులతట్టను తలకెత్తుతా భారాన్ని భరిస్తారా తియ్యనికైతలను వడ్డిస్తా తనివితీరా ఆస్వాదిస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 పదలాలిత్యం పదాలతో ఆడుకుంటా పెదాలతో పలికించుతా పదాలను పద్ధతి ప్రకారం పేరుస్తా పదాలను నిర్దేశించిన క్రమంలో పొసుగుతా పదాలను ఒకే రీతిలో నడిపిస్తా పదాలను వరుసలోవాడి పంక్తులను నిర్మాణంచేస్తా పదాలను లయాత్మకంగా సంధించి పఠింపజేస్తా పదాలకు ప్రాసలు జోడించి పాడించుతా అరుదైన పదాలనువాడి వాడుకను పెంచుతా చచ్చిన పదాలకు ప్రాణంపోసి బ్రతికిస్తా కొత్త పదాలను సృష్టించి ముందుంచుతా పదాలను వండి వార్చి వడ్డించుతా పదాలను నాటి పెంచి పండిస్తా పదాలను వెలిగించి కాంతులు చిమ్మిస్తా పదాలకు పూలుపెట్టి అందాలను చూపిస్తా పదాలకు పరిమళాలద్ది పీల్చేవారికి ప్రమోదంకలిగిస్తా పదాలకు తేనెనుపూచి పెదవులకుతాకించి చప్పరింపజేస్తా పదాలకు అమృతమురాసి నాలుకలకు అందిస్తా పదాలను ఏరికూర్చి పలుకులమ్మను ప్రార్ధిస్తా పదకౌశలమును ప్రదర్శించుతా పదవిన్యాసాలను పరికింపజేస్తా పదాలతోనాట్యము చేయిస్తా పదలాలిత్యము చూపిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 తెలుగోడా తెలుసుకో! ఆంధ్రాప్రాంతం విడిపోయింది కాని తెలుగుప్రజలు వేరుపడలేదని తెలుసుకో ఆంధ్రారాష్ట్రం కుచించింది కాని తెలుగుభాష తరగలేదని గుర్తించుకో ఆంధ్రాపెత్తనం తగ్గియుండవచ్చు కాని తెలుగోళ్ళపౌరుషం తాకట్టు పెట్టలేదనుకో అంధ్రాగాలులు వీచకపోవచ్చు కాని తెలుగుచైతన్యము అణగిపోలేదనుకో ఆంధ్రులసమైక్యత దెబ్బతినవచ్చు కాని తెలుగుజాతిని అవమానానికి గురిచేయకురో ఆంధ్రా ఓటర్లు అమాయకులు కాని  తెలుగువారిని ఆశపెట్టి ఎన్నికలలోమోసం చేయనీయవద్దురో ఆంధ్రులకు భాషాభిమానం లేదనంటారు కాని తెలుగులమదులలలో తెలుగుతల్లి కొలువుతీరియున్నది దర్శించుకో ఆంధ్రులనాయకత్వం అప్రతిష్టపాలుకావచ్చు కాని ఆంధ్రులప్రతిభ అసమాన్యమైనదని తెలుపరో అంధ్రాజనం అభిమానవంతులు కావచ్చుకాని వారు వెర్రివాళ్ళుకాదని విశ్వానికి చాటరో ఆంధ్రారైతులకు కలసిరాకపోవచ్చు కాని తెలుగుసేద్యగాళ్ళు సోమరుల కాదనిచెప్పరో ఆంధ్రాకవితలు తక్కువ కావచ్చుకాని తెలుగుకవులు నిష్ణాతులని చెప్పరో ఆంధ్రులుగొప్పలు చెప్పుకునేవారుకాదు కాని తెలుగుప్రాణులు తీపికాపలుకుతాయని చూపరో తెలుగుకు తక్కువచేస్తే తిరగబడతా గళమెత్తుతా ఆంధ్రులను అవమానపరిస్తే ఉద్యమిస్తా కసితీర్చుకుంటా గుండ్లపల్లి రాజ...
 పోతేపోనీ! గడచిపోయిన వెన్నెలరాత్రిని నిత్యమూ కావాలనికోరకు వాడిపోయిన పువ్వును తిరిగి వికసించమనకు విడిచిపోయిన నవ్వును మరలా మోమునావరించమనకు జరిగిపోయిన విషయాలను మరీమరీ మననంచేసుకోకు గతించిన కాలాన్ని మరలమరలా తలచుకోకు గడచిపోయిన ప్రాయాన్ని మళ్ళీ పొందాలనుకోకు చెదిరిపోయిన కలను మరోసారి రమ్మనికోరకు చిక్కినదాన్ని చప్పరిస్తూ పాతరోజులమిఠాయిని గుర్తుకుతెచ్చుకోకు మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరవాలనుకోకు తీరని  కోరికలకై పదేపదే తపించకు ఇంకిపోయిన నదిని గతంలా లేచిప్రవహించమనకు నిన్నటి విషయాలు మరచిపో రేపటి  సంగతులు తలచుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నిత్యోదయాలు  నిత్యోదయాలు నిత్యావస్థలు నిత్యకర్మలు నవీకరించి చెప్పమంటున్నాయి ప్రభాత గాలి తనువును తాకి మెల్లగా లేపి  మంచంపై కూర్చోబెడుతుంది ఉదయపు కాంతి కిటికీనుంచి దూరి కళ్ళలోకి ప్రవేశించి లేచి నిలబెట్టిస్తుంది పక్షులుకిలకిలా అరచి బద్ధకంవిడిచి లెమ్మని బయటకురమ్మని గోలచేసి ఉద్యానవనాల్లో నడవమంటాయి గుడిలో గంటలుమ్రోగి సుప్రభాతగేయాలు వినిపించి రారమ్మంటూ పిలిచి భక్తిని పెంపొందిస్తాయి వేడివేడికాఫీ వెంటనేత్రాగమని వంటికి వేడెక్కించమని దేహాన్ని ఉత్సాహపరచి దైనందిన కార్యాల్లోకిదించుతాయి  దినపత్రిక వరండాలోపడి తాజాతాజావార్తలు చదవమని మనసును తట్టి తలుపును తెరిపిస్తుంది మదిలో ఆలోచనలుపారి పనులకు ఉసిగొలిపి ప్రణాళికను ఇచ్చి కార్యాలను అప్పగిస్తాయి కడుపుఖాళీ అయి ఆకలి అయి అల్పాహారం తీసుకోమని పేగులు గొడవచేస్తాయి కలము చేతికెక్కి కాగితాలపైచెక్కించి కమ్మనికవితను కూర్పించి పత్రికలకుసమూహాలకు పంపమంటుంది పాఠకలోకం ప్రశంసిస్తే పరవశం సాహిత్యలోకం సన్నుతిస్తే సంతోషం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఆయన చిత్తరువు సారంగధరుని మించిన చిత్తరువు నలమహారాజుని దాటేయగల చిత్రితము చిత్రము విచిత్రము అమోఘము అద్వితీయము పటము విస్మయాత్మకము విశిష్టము విన్నూతనము పెళ్ళిచూపుల ముందు ఆయనపంపిన పరిలేపము అందాలభరితము ఆనందదాయకము నవ్వుతున్న బొమ్మ పిలుస్తున్నట్లున్నది వెలుగుతున్న మోము జాబిలినితలపిస్తున్నది ఒంటరిగానున్న ప్రతిమ తుంటరిగా చూస్తున్నట్లున్నది కొంటెచూపుల నగాసు కంటిసైగ చేస్తున్నట్లున్నది కళకళలాడుతున్న కళ్ళు  కట్టిపడేస్తున్నట్లున్నవి సూటిగాచూస్తున్న నయనాలు సరసాలాడుతున్నట్లున్నవి ప్రాయం వలవేస్తున్నట్లున్నది రూపం కలలోకొచ్చేటట్లున్నది దుస్తులు దర్జానొలకపోస్తున్నట్లున్నాయి కేశాలు నల్లగానిగనిగలాడుతున్నాయి మీసం యవ్వనంతో తొణికిసలాడుతున్నట్లున్నది నాసికం కోటేరులా చక్కగాసాగియున్నట్లున్నది ఆయన దృశ్యము భ్రమలు కొలుపుతున్నది ఆయన సందేశము వినాలనిపిస్తున్నది ఆయనతో నేరుగా మాట్లాడాలనిపిస్తున్నది వారితో ఏకాంతంగా గడపాలనిపిస్తున్నది చిత్రాంగిలా సన్మోహితురాలినయ్యా దమయంతిలా దాంపత్యంకోరుకుంటున్నా ఆయన  నాచేతికి చిక్కేనా వారు నాపతిగా దక్కేనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ అభాగ్యుడు చెప్పినకథ కనురెప్ప కాటేసింది ఎవరికి చెప్పను? తాడు పామైకరచింది ఏమి చెయ్యను? భార్య ఎడమయ్యింది ఎలా బ్రతకను? తనయుడు తరిమేశాడు ఎక్కడికి వెళ్ళను? గుండె గాయపడింది ఎలా తట్టుకోను? కన్నీరు కారుతుంది ఎలా ఆపుకోను? మాటలు పెగలటంలేదు ఎలా చెప్పను? చేతులు  చాచలేకుంటిని ఏమి చేయగలను? కాళ్ళు కదపలేకుంటిని ఎలా వెళ్ళను? అన్నము సహించుటలేదు ఎలా జీవించగలను? వల్లకాడు  పిలుస్తుంది ఎలా తప్పించుకోను? గొంతు మూగపోయింది ఎలా వీడుకోలుచెప్పను? మనసు మూలనపడింది ఎలా సెలవుతీసుకోను? హృదయము ద్రవిస్తుంది ఎలా తట్టుకోను? కథ  ముగిసింది ఎలా దాచుకోగలను? బాధ బరువెక్కింది ఎలా భారముదించుకోను? కలము కదలటంలేదు ఎలా కైతనుకూర్చను? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మన తెలుగువెలుగులు తెలుగువెలుగు తిమిరాఙ్ఞానమును తరిమేస్తుంది తెలుగుతళుకు మంచిభావాలను మదిలోరేపుతుంది   తెలుగుజ్యోతి తనువులుతట్టి చూడమంటుంది తెలుగుకాంతి తలలో తలపులుపారిస్తుంది తెలుగుతేజము దేశవిదేశాల వర్ధిల్లుతుంది తెలుగుదీపము సుందరదృశ్యాలను చూపిస్తుంది తెలుగుప్రకాశం తెలివిని పంచుతుంది తెలుగుమయూఖం మదులలో తిష్టవేస్తుంది తెలుగురోచిస్సు దశదిశలా వ్యాపిస్తుంది తెలుగుభాసము దేశబాషలలో మేటిచేస్తుంది తెలుగుదీప్తి కీర్తిపతాకం ఎగిరిస్తుంది తెలుగురశ్మి రసప్రాప్తిని కలిగిస్తుంది తెలుగుకళ కమ్మదనాలు చూడమంటుంది తెలుగువెన్నెల కుతూహలము కలిగిస్తుంది తెలుగుతేజస్సు ముఖాలను మెరిపిస్తుంది తెలుగువర్చస్సు వదనాలను వికసింపజేస్తుంది తెలుగుమినుకు పలువురిదృష్టిని ఆకట్టుకుంటుంది తెలుగుబెళుకు కళ్ళను కళకళలాడిస్తుంది తెలుగుశిఖ ఉన్నతశిఖరాలకు తీసుకెళ్తుంది తెలుగుజిగి పదాలను ధగధగలాడిస్తుంది తెలుగునిగ్గు నిజానిజాల నిగ్గుతేలుస్తుంది తెలుగుజ్వాల మనసులను మురిపిస్తుంది తెలుగుశోభ చక్కదనాలకు చోటిస్తుంది తెలుగుప్రభ ప్రతిభకు పట్టంకట్టిస్తుంది తెలుగుబిడ్డా తలెత్తుకొని త్రుళ్ళిపడరా తెలుగువాడా తనివితీరా తృప్తిపడరా గుండ్లపల్లి రా...
Image
 కవులు కవులు నియంతలు కవితలు శాసనాలు అక్షరాలు అమ్ముడుపోవు కవీశ్వరులు కొనటానికిలేరు కవులు  నిప్పుకణికలు గోకకు కాల్చుకోకుచేతులు కాలేకడుపులు చూపిస్తారు ప్రజలకష్టాలు చర్చిస్తారు నిజాలు చూపుతారు నిప్పులు కక్కుతారు అక్రమాలు ఎరిగిస్తారు అన్యాయాలు ఎదిరిస్తారు అందాలు చూపిస్తారు ఆనందాలు కలిగిస్తారు కవిత్వం కూరుస్తారు చైతన్యం తెచ్చేస్తారు గళాలు వినిపిస్తారు మనసులు ముట్టేస్తారు కళ్ళు తెరిపిస్తారు కుళ్ళు కడిగేస్తారు కలాలను ఝళిపిస్తారు కిలాడీలను కుమ్మేస్తారు కవులు సమాజహితులు కవనాలు జాగృతిసాధనాలు ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ పుటలో ఏ భావమున్నదో ఏ కలంలో ఏ కల్పనున్నదో ఏ తలలో ఏ తలపున్నదో ఏ కవిలో ఏ ఘనతున్నదో ఏ కవితలో ఏ మర్మమున్నదో అసలైనకవులను ఆహ్వానించు సిసలైనకైతలను స్వాగతించు కవితలు చదువు కన్నులు తెరువు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పుష్పిక మా ఇంట మొక్కొకటి మొలిచింది మా మీద మంచిముద్రనూ వేసింది మా ఇంటికి మహలక్ష్మి అయ్యింది మా మదులను ముచ్చటా పరిచింది మా నోర్లలో నాలుకా అయ్యింది మా కళ్ళల్లో వెలుగుగా మారింది ఆమొక్కను ప్రేమగా చూశాను అనునిత్యము ఆలనాపాలనా చేశాను ఆమొక్కపై సుధాజల్లులు చల్లాను అభిమానించి  పెంచిపెద్దగా చేశాను ఆ మొక్క ఒకమొగ్గను తొడిగింది అందరి మదులనూ దోచింది ఆ మొగ్గకి పుష్పిక అనిపేరుపట్టాను ఎదుగుదలను ప్రతిక్షణమూ గమనించాను పుష్పిక అందాలు చూపింది అందరికి ఆనందమూ ఇచ్చింది పుష్పిక పువ్వుగా మారింది పరిసరాల పరిమళమూ చల్లింది ఆ మొక్కకు అభినందనలు ఆ పుష్పికకు ఆశీర్వాదాలు ఆమొక్క  సుధ ఆమొగ్గ పుష్పిక  సుధ అమృతజల్లులు చల్లుతుంది పుష్పిక తేనెచుక్కలను చిమ్ముతుంది   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 విలపిస్తున్న ఖైదీ ఖైదీ విలపిస్తున్నాడు జల్దీ విడిపించమంటున్నాడు జైలు వద్దుంటున్నాడు బైలు వేడుకుంటున్నాడు కుర్చీ లేదంటున్నాడు బల్ల ఇవ్వమంటున్నాడు దొంగను కాదంటున్నాడు బెంగను పెట్టుకొనియున్నాడు దోమలు కుడుతున్నాయంటున్నాడు ఈగలు ముసురుతున్నాయంటున్నాడు శుభ్రం లేదంటున్నాడు రోగం రావచ్చంటున్నాడు పంకా  తిరగటంలేదంటున్నాడు ఉక్క  పోస్తుందంటున్నాడు భార్య జోడులేదంటున్నాడు కొడుకు తోడులేడంటున్నాడు మనుమడి ముచ్చట్లులేవంటున్నాడు మనుమరాలి ముద్దులులేవంటున్నాడు తప్పు చేయలేదంటున్నాడు శిక్ష వేయవద్దంటున్నాడు చర్మరోగం వచ్చిందంటున్నాడు చల్లదనం కల్పించమంటున్నాడు న్యాయం చేయమంటున్నాడు ఆలశ్యం చేయొద్దంటున్నాడు వృద్ధుడను అంటున్నాడు శ్రద్ధను చూపమంటున్నాడు కడిగినముత్యంలా బయటకొస్తానంటున్నాడు నిప్పుకణికనని నిరుపించుకుంటానంటున్నాడు చూద్దాం వేచిచూద్దాం రేపోమాపోసత్యం తెలుసుకుందాం నిజం నిప్పులాంటిదెప్పుడు నేడోరేపో బయటపడకతప్పదు మోసగాళ్ళను నిలదీద్దాం వోటుతోవెన్నును విరగగొడదాం నేరగాళ్ళకి బుద్ధిచెబుదాం నిజాయతీపరులకి అండగానిలుద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాన కత్తికి కలానికి సానపడతా వాడిని వేడిని పెంచుతా మణులకు మాణిక్యాలకు సానపెడతా ప్రమోదాన్ని ప్రకాశాన్ని ప్రసరించుతా మనసులకు మనుషులకు సానబెడతా మంచిని మానవత్వాన్ని పంచిపెడతా పలుకులకు ప్రేమకు సానబడతా అందాలను ఆనందాలను అందజేస్తా పిల్లలకు పెద్దలకు సానపెట్టుతా ఓర్పును  నేర్పును పెంపొందిస్తా గంధాన్ని సానపడతా గొంతులకు రాచేస్తా కత్తికి సానపెడతా కాయలను కోసితినిపిస్తా శాణముకి సానపెడతా రత్నాలకు మిసిమినిస్తా వజ్రానికి సానబెడతా మెరుగులను చూపిస్తా బాలలకు సానపడతా భావిపౌరులుగ తీర్చిదిద్దుతా విద్యార్ధులకు సానపెడతా తెలివితేటలను తలలకెక్కిస్తా ప్రేమకు సానపెడతా ప్రేయసికి గాలమేస్తా పలుకులకు సానపెడతా మాటలతో మదులుదోస్తా మనసుకి సానపెడతా భావాలను రంగరించుతా కలానికి సానపెడతా కాగితాలపై అక్షరాలుచెక్కుతా కవితలకు సానపెడతా పాఠకులను పరవశపరుస్తా కైతలను సాగదీస్తా కైమోడ్పులు తెలియజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 శ్రోతలడగనిపాట (హోరుగాలి) గాలి పాటపాడుతుంది చెట్లు తలలూపుతున్నాయి కొమ్మలు కదులుతున్నాయి ఆకులు ఊగిపోతున్నాయి నెమలి నాట్యంచేస్తుంది వనము పులకించిపోతుంది పక్షులు కిలకిలారవాలుచేస్తున్నాయి పశువులు గడాబిడాకూతలేస్తున్నాయి మబ్బులు గుమికూడుతున్నాయి ఆకాశము నీలిరంగుపులుముకుంది చినుకులు చిటపటమంటురాలుతున్నాయి కప్పలు బెకబెకమంటుగోలచేస్తున్నాయి చంద్రుడు గమనిస్తున్నాడు వెన్నెలను కుమ్మరిస్తున్నాడు పువ్వులు విచ్చుకుంటున్నాయి పరిమళాలను వెదజల్లుతున్నాయి నదులు గలగలానిండుగాప్రవహిస్తున్నాయి అలలు చకచకాకడలిలోయెగిసిపడుతున్నాయి కవులు కలాలుపడుతున్నారు కవితలను కుప్పలుగాకూరుస్తున్నారు ప్రకృతి పరవశపరుస్తుంది మదులను మైమరిపించుతుంది ప్రకృతిగానం అద్భుతం ప్రాణులస్పందనం అమోఘం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కళ్ళు ఆకళ్ళు వెలుగుతున్నాయి కాంతులు వెదజల్లుతున్నాయి ఆకళ్ళు పిలుస్తున్నాయి చూపులు విసురుతున్నాయి ఆకళ్ళు వలవేస్తున్నాయి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఆకళ్ళు చూస్తున్నాయి అనుభూత్తులు పంచుతున్నాయి ఆకళ్ళు అందాలుచూపుతున్నాయి ఆనందము కలిగించుతున్నాయి ఆకళ్ళు నవ్వుతున్నాయి మోమును వెలిగిస్తున్నాయి ఆకళ్ళు లాగుతున్నాయి మనసును కట్టిపడవేస్తున్నాయి ఆకళ్ళు కాటుకపెట్టాయి అందము రెట్టింపుచేశాయి ఆకళ్ళు రెపెరెపలాడుతున్నాయి ముఖము కళకళలాడుతుంది ఆకళ్ళు మత్తెక్కిస్తున్నాయి మనసును దోచేస్తున్నాయి ఆకళ్ళను రోజూచూస్తున్నా ఆభావాలను నిత్యముగమనిస్తున్నా ఆకళ్ళను జ్యోతులుచేస్తా ఆమనసును ఆహ్లాదపరుస్తా ఆకళ్ళు ఆమెకాయుధం ఆచూపు నాకొకగాలం మీకళ్ళకు కవితనందిస్తా మీమనసును ఆనందపరుస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 జాగ్రత్త పాములు తిరుగుతున్నాయి బుసలు కొడుతున్నాయి విషము కక్కుతున్నాయి జాగ్రత్త కరుస్తాయి గ్రద్దలు ఎగురుతున్నాయి పరిసరాలు పరికిస్తున్నాయి తన్నుకొని పోవాలనిచూస్తున్నాయి జాగ్రత్త ఎత్తుకెళతాయి నక్కలు కాచుకొనియున్నాయి మోసము చెయ్యాలనుకుంటున్నాయి నోరును తెరుచుకొనియున్నాయి జాగ్రత్త ఖతంచేస్తాయి కొంగలు జపాలుచేస్తున్నాయి ప్రవచనాలు బోధిస్తున్నాయి నిజము దాస్తున్నాయి జాగ్రత్త చిక్కితేమ్రింగేస్తాయి జంగుపిల్లులు తిరుగుతున్నాయి గంపలు ఎత్తాలనుకుంటున్నాయి కడుపును నింపుకోవాలనుకుంటున్నాయి జాగ్రత్త శ్రద్ధగాకాపలాకాయి తోడేల్లు చరిస్తున్నాయి పల్లు బయటపెడుతున్నాయి గొర్రెలను మెడపట్టితీసుకెళ్ళాలనిచూస్తున్నాయి జాగ్రత్త రక్షించటానికిసిద్ధంగాయుండవోయి మృగాలు మనమధ్యనేయున్నాయి కాటు వేయటానికైచూస్తున్నాయి ప్రాణము తీయటానికివెనకాడకున్నాయి జాగ్రత్త బాధ్యతవీడకబరువుమోయవోయి దొంగలు పక్కనేయున్నారు నేరాలు చేయాలనుకుంటున్నారు సొమ్మును కాజేయలనుకుంటున్నారు జాగ్రత్త ఉండవోయిపారాహుషారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాసృజన మనసు పెట్టా ఆలోచన చేశా ఏటికి వెళ్ళా మట్టిని తెచ్చా నీటిని కలపా మెత్తగ పిసికా బొమ్మను చేశా రూపము నిచ్చా రంగులు అద్దా  బట్టలు కట్టా అందముగా చేశా ఆనందము పొందా ప్రాణం పోశా ప్రేమను చూపా మాటలు నేర్పా ముద్దుగ పలికించా నవ్వులు చిందించా మోమును వెలిగించా పూలు పెట్టా పరవశ పరచా ఆటలు ఆడించా పాటలు పాడించా నదకను నేర్పా నాట్యము చేయించా కలమును పట్టా కాగితంపై వ్రాశా అక్షరాలు అల్లా అర్ధాలు స్ఫురించా పదాలను పేర్చా ప్రాసలు కుదిర్చా విషయము వివరించా వినోదము అందించా కవితను కూర్చా కితాబులు పొందా అందరిని చదివించా ఆలోచనలు పారించా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత ఒక్కటి కవిత ఒక్కటి కూరుస్తా మదులు ఎన్నో హత్తుకుంటా పువ్వులు ఎన్నో పూయిస్తా నవ్వులు ఎన్నో చిందిస్తా అందాలు ఎన్నో చూపిస్తా అనందాలు ఎన్నో చేరుస్తా ఒక్క కవితను ఆవిష్కరించనా ఒక్క నిమిషము ఆలోచింపజేయనా అందాల కవితను అల్లనా అందరి మదులను ఆకట్టుకోనా కమ్మని కవితను వండనా పంచ భక్ష్యాలను వడ్డించనా చక్కని కవితను చదవనా చెవులకు శ్రావ్యతను చేర్చనా మేలైన కవితను ముందుంచనా ముచ్చట కొలిపి మదులనుదోచుకోనా తీయని కవితను చదివించనా తేనె చుక్కలను చిందించనా అద్భుత కవితను అందించనా ఆనంద కడలిలో ముంచేయనా కొత్త కవితను చెప్పనా నూతన సందేశము చేర్చనా విశేష కవితను విరచించనా వింత విషయాలను విశదీకరించనా ప్రత్యేక కవితను పఠించనా పాఠకుల హృదయాలను పులకరించనా కవిత ఒక్కటి రాస్తా  కొత్తది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 శ్రవణానందాలు తీయని పలుకులు తనివికి తృప్తినిస్తున్నాయి కమ్మని రాగాలు కునుకులు తీయిస్తున్నాయి శ్రావ్యమైన సంగీతం సంతసాన్ని స్రవిస్తుంది అమ్మ జోలపాటలు హాయిని చేకూరుస్తున్నాయి నాన్న ప్రబోధాలు సన్మార్గాన్ని చూపిస్తున్నాయి మిత్రుల మన్ననలు మేనుని మరిపిస్తున్నాయి పసిపాపల మాటలు ముద్దులు ఒలుకుతున్నాయి పడుచుల పెదవులు మాధుర్యాలను కుమ్మరిస్తున్నాయి ముద్దుగుమ్మల గొంతుకలు మనసులను మురిపిస్తున్నాయి చెలి సరసాలు సరదా పరుస్తున్నాయి పక్షుల రవాలు వీనులకు విందునిస్తున్నాయి కోకిలల కంఠాలు ఆనందాన్ని అందిస్తున్నాయి కోడి కూతలు వేకువనే మేలుకొలుపుతున్నాయి చిలుకల సవ్వడులు చెవులను ఆకర్షిస్తున్నాయి మాష్టారి మందగింపులు పట్టుదలగా చదివిస్తున్నాయి ప్రాసయుక్త పదాలు పసందు కలిగిస్తున్నాయి లయాత్మక పంక్తులు సెలయేరులా ప్రవహిస్తున్నాయి పల్ల్లవి పాటలకు ప్రాణం పోస్తుంది కవుల గళాలు కర్ణాలకు ప్రియంచేకూరుస్తున్నాయి వాణీవీణా నాదాలు వేడుక చేస్తున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవులకు స్వాగతాలు కైమోడ్పులు  కవులకు కళాకోవిదులకు స్వాగతం కోయిలలకు కవికోకిలకు సుస్వాగతం సుస్వరాలకు గాంధర్వగానాలకు స్వరాభిషేకం కవితలకు కవులప్రతిభలకు నీరాజనం విరించికి కవనబ్రహ్మలకు ఆమంత్రణం విపంచికి కవితానాదాలకు ఆహ్వానం వెలుగులు వెదజల్లేవారికి వందనాలు పరిమళాలు ప్రసరించేవారికి ప్రణామాలు పువ్వులు చల్లేవారికి ప్రాంజలులు నవ్వులు చిందించేవారికి నమస్కారాలు అందాలు చూపేవారికి అభినందనలు ఆనందము కలిగించేవారికి అంజలులు అనుభూతులు అందించేవారికి అభివాదాలు సమయం సద్వినియోగంచేయించేవారికి సలాములు కడుపు నింపేవారికి కృతఙ్ఞతలు దాహము తీర్చేవారికి దండాలు చదువుటకు సదావకాశమిచ్చినవారికి సన్నుతులు పాఠాలు నేర్పేవారికి ప్రణతులు కవితలు కూర్చేవారికి కైమోడ్పులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ చెలియా! నీ కన్నులు కట్టేస్తున్నాయి నీ చూపులు పట్టేస్తున్నాయి నీ సిగపువ్వులు మత్తెక్కిస్తున్నాయి నీ చిరునవ్వులు చెంతకుపిలుస్తున్నాయి నీ గాజులు గలగలమంటున్నాయి నీ గజ్జెలు ఘల్లుఘల్లుమంటున్నాయి నీ పలుకులు తేనెలుచిందుతున్నాయి నీ నడకలు హంసనుతలపిస్తున్నాయి నీ అందం అలరిస్తుంది నాకు ఆనందం కలిగిస్తుంది నిను చూడక  నేనుండలేను నిను విడిచి నేబ్రతుకలేను నీ సొగసును ఎరవేశావు నా మనసును దోచేశావు నన్ను కవ్విస్తున్నావు నన్ను మురిపిస్తున్నావు వయ్యారాలు ఒలికిస్తున్నావు ప్రేమానురాగాలు పంచేస్తున్నావు నాకు నిదురరావటంలా నాకు ఆకలికావటంలా వచ్చెయ్యి ఒకటవుదాం జీవితాన్ని జయించుదాం ఆలశ్యం చెయ్యొద్దు ప్రాణం తీయొద్దు ప్రణయలోకాన్ని చేరుదాం స్వర్గసుఖాల్ని అనుభవిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఊహలపల్లకి నా మనసు మేఘాలపల్లకినెక్కి ఆకాశంలో విహరించాలంటుంది నా మది అందాలనుచూఛి ఆనందడోలికలో ఊరేగాలంటుంది నా మతి ఆలోచనలుపారించి ఊహలమీనాలో ఊయలూగాలంటుంది నా హృదయం అందలమధిరోహించి ప్రణయలోకంలో పయనించాలంటుంది నా తనువు పల్యంకనమెక్కి పూలతోటలో పచార్లుచేయాలంటుంది నా గుండె కరిగిపోయి కడలితరంగాలతో ఎగిరిపడదామంటుంది నా బుద్ధి నిశితంగాగమనించి నైపుణ్యమును నిరూపించాలంటుంది నా చిత్తం చలించి వివిధాలోచనలతో తేలిపోదామంటుంది నా ఆలోచనలు హరివిల్లునెక్కి గగనసీమలో గంతులేయాలంటున్నవి నా అహం పరవశించి పేరుప్రఖ్యాతులకై పాటుపడదామంటుంది నా కలం కమ్మనికైతలను కాగితాలపై చెక్కాలంటుంది ఊహలు ఆగటంలా కవితలు వీడటంలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ కవీ! కవీ కదులు పనీ ప్రారంభించు మెరుపులు కురిపించు కళ్ళను వెలిగించు అందాలు వర్ణించు ఆనందాలు కలిగించు అక్షరాలు  అల్లు మాలలు కట్టు పదాలు  పారించు పంక్తులు పూరించు విషయాలు వివరించు మనసులు మురిపించు సౌరభాలు వెదజల్లు  పరిసరాలు పరవశపరచు గళం ఎత్తు గానం  వినిపించు వెలుగులు వెదజల్లు చీకట్లు పారద్రోలు పువ్వులు చల్లు నవ్వులు చిందు ఊహలు ఊరించు భావాలు బయటపెట్టు వెన్నెలను కాయించు మల్ల్లెలను పూయించు వానలు కురిపించు నదులు పారించు కలలు కను కల్పనలు సృష్టించు కలము పట్టు కైతలు కూర్చు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
 కవితాంశాలు కవితకు కావాలి పెక్కుయంశాలు కవితలు తట్టాలి పలుహృదయాలు కవితలకు విషయాలు ప్రాణం కయితలకు భావములు మూలం కవితలు కట్టేయాలి మదులను కయితలు గుచ్చుకోవాలి గుండెలకు కవితలు చూపాలి అందాలను కైతలు ముట్టాలి మదులను రాతలు కలిగించాలి సంతసాలు రచనలు వెలిగించాలి మోములు కవితలు చూపించాలి ప్రకృతి కవనాలు కలిగించాలి నివృతి సాహిత్యం చాటాలి ప్రేమలు కవిత్వం పెంచాలి అనురాగాలు కవితలు పెంచాలి స్నేహాలు కయితలు కలిగించాలి మమకారాలు కవితలు  చూపాలి జాబిలిని కయితలు చల్లాలి వెన్నెలని కవితలు చూపించాలి కొండాకోనలను కైతలు పారించాలి సెలయేటిధారలను కవులను కవ్వించాలి కోమలాంగులు కవితలను కడువ్రాయించాలి కాంతామణులు కవనం కవులకు ప్రాణం కవిత్వం పాఠకులకు పఠనీయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 గరికపూలు పూలజాతి అంతాసమానము లేదు ఎక్కువతక్కువనేభేదము చౌకబారుమాటలను వినవద్దు గడ్డిపూలను  అపహసించొద్దు ఎవరన్నారు గరికాపూలు కవితకనర్హమని నేను వ్రాస్తా మీరు చదివిచెబుతారా ఎవరన్నారు  గరికపూలు సుందరరహితాలని నేను చూపిస్తా మీరు చూచిచెబుతారా ఎవరన్నారు గరికపూలు సువాసనలులేనివని నేను సేకరిస్తా మీపైచల్లుతా పీల్చిచెబుతారా ఎవరన్నారు గరికపూలు పుప్పొడిలేనివని నేను తీసుకొనివస్తా మీరు తాకిచెబుతారా ఎవరన్నారు గరికపూలు తావిలేనివని నేను మధువుక్రోలే సీతాకోకచిలుకలచూపిస్తా మీరు కనిచెబుతారా ఎవరన్నారు గరికఫూలను తుమ్మెదలాశ్రయించవని నేను వ్రాలినతేనెటీగలను చూపిస్తా మీరుచూచి నిజముతెలుసుకుంటారా ఎవరన్నారు గరికపూలు పూజకుపనికిరానివని నేను తెచ్చిస్తా మీరుపూజచేస్తే దేవుడొద్దంటాడేమోచూస్తారా ఎవరన్నారు గరికపూలకు సుస్వరూపాలులేవని నేను తీసుకొనివస్తా మీరు పరికించిచెబుతారా ఎవరన్నారు గరికపూలకు మనసులేదని నేనువాటితో కలసియాడుతా అవి ఎలాసంతసిస్తాయోచూస్తారా గరికపూలను చులకనచేయకు గడ్డిపూలను వ్యధలకుగురిచేయకు చిన్నవే ముద్దురా సూక్ష్మంలొనే మోక్షమురా పువ్వులన్నియు పారిజాతాలు కానక్కరలేదురా పురుషులందరు పుణ్యపురుషులు అవనక్కరలేదురా...
Image
 
Image
 గడ్డిపూలు దారిన వేళ్తుంటే దాపున  దర్శనమిస్తాయి గడ్డిపూలు తొంగి చూస్తుంటాయి తోడుకు రమ్మంటాయి గడ్డిపూలు పక్కకు పిలుస్తాయి పరవశము కలిగిస్తాయి గడ్డిపూలు తలలు ఊపుతుంటాయి కళ్ళను కట్టేస్తుంటాయి గడ్డిపూలు బాట్తపక్కల దాక్కొనుంటాయి బాటసారులమదుల దోచుకుంటుంటాయి గడ్డిపూలు నిశితంగా పరికిస్తాయి నేస్తంగా పరిగణిస్తాయి గడ్డిపూలు పలకరిస్తే పులకరిస్తాయి పరిహసిస్తే బాధపాడతాయి గడ్డిపూలు తొక్కినా తొణకవు తిట్టినా బెణకవు గడ్డిపూలు గుబురుగా ఎదుగుతాయి గుట్టుగా బ్రతుకుతాయి గడ్డిపూలు పొట్టిపువ్వంటే పకపకలాడతాయి చిన్నిపువ్వంటే చిరునవ్వులుచిందుతాయి గడ్డిపూలు పువ్వంటే ఎదైనాపువ్వే పెద్దాచిన్నా తేడాలేదంటా అన్నిపూలను ప్రేమిస్తా అన్నిటిని ఒకటిగాచూస్తా గడ్డిపూలని చిన్నచూపుచూడకండి గరికపూలని హేళనచేయకండి మనుషులంతా ఒకటే పువ్వులన్నీ సమమే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనధ్యాస పూల పొంకపరిమళాలను కౌముది కమ్మదనాలను  సహజప్రకృతి సోయగాలను పుటలపై పెట్టాలనియుంది అందాల దృశ్యాలను ఆనంద  భావాలను   అద్భుత విషయాలను అక్షరాలతో ఆవిష్కరించాలనియుంది ప్రభోధ గేయాలను ప్రణయ గీతాలను పిల్లల పాటల్లను పదాలతో పారించాలనియుంది ప్రభాత సూర్యుడిని పున్నమి చంద్రుడిని  తారల తళుకులని వివరంగ వర్ణించాలనియుంది ప్రేమాభిమానాలను స్నేహబంధాలను తలలోనితలపులను సాహిత్యలోకంలో చాటాలనియుంది ఛందోబద్ధ పద్యాలను ప్రాసయుక్త కవితలను స్వరానుకూల పాటలను దండిగ సృష్టించాలనియుంది యదార్ధ సంఘటలను జీవిత సత్యాలను వర్తమాన విషయాలను శాశ్వతకవితలుగా మార్చాలనియుంది నదీ ప్రవాహాలను కడలి  తరంగాలను ముత్యాల వానజల్లులను కవితలాలో గుప్పించాలనియుంది కోకిల గానాలను నెమలి నాట్యాలను చిలుకల పలుకులను కైతలలో చొప్పించాలనియుంది కవిత కవ్వించితే సాహితి సమ్మతిస్తే సరస్వతి కరుణిస్తే పలుకయితలను పుట్టించాలనియుంది తెలుగుభాష తీపిని తెలుగుజాతి తేజాన్ని తెలుగుతల్లి తపనని తేటతేటతెలుగులో తెలపాలనియుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 బాలల్లారా! బాలల్ల్లారా బంగరు బుడతల్లారా బాలికల్లారా బహుసుందర బిడ్డల్లరా బడిపిల్లల్లారా బుద్ధిగచదివే చిన్నారుల్లారా బుజ్జాయిల్లారా భావిభారత పౌరుల్లారా చక్కని విషయాలు చాలాచాలా చెబుతా శ్రద్ధగా ఆలకించి చెవులకు ఎక్కించుకుంటారా ఆటలెంత ముఖ్యమో పాఠాలంత ముఖ్యమురా అమ్మలెంత  ప్రధానమో అధ్యాపకులంత ప్రధానమురా పితరుడెంత  అవసరమో ప్రధానోపాధ్యాయుడంత అవసరమురా ప్రేమయెంత ఆవశ్యకమో స్నేహమంత ఆవశ్యకమురా బొమ్మలెంత ప్రాధాన్యమో పుస్తకాలంత ప్రాధాన్యమురా ఇల్లుయెంత శ్రేష్టమో బడియంత శ్రేష్టమురా డబ్బెంత  అక్కరో చదువంత అక్కరురా వెలుగెంత అగత్యమో విఙ్ఞానమంత అగత్యమురా విద్యార్ధుల్లారా పెద్దలమాటలు వినండిరా బంగారుభవిష్యత్తుకు పూలబాటలు నిర్మించుకోండిరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం