Posts

Showing posts from May, 2024
Image
 నారదులున్నారు జాగ్రత్త! నారదలున్నారు జాగ్రత్త తగాదాలుపెడతారు జాగ్రత్త పైకి స్వామిభక్తి  చాటుతారు కానీలోన గోతులుతీసి పడదోయచూస్తారు ఇక్కడ మాటలు అక్కడ చెబుతారు అక్కడ మాటలు ఇక్కడ చెబుతారు పుకార్లు పుట్టిస్తారు జాగ్రత్త విద్వేషాలు రేపుతారు జాగ్రత్త అసూయతో  రగిలిపోతుంటారు ఈర్ష్యతో కుమిలిపోతుంటారు కొట్టుకుంటుంటే కుతూహలపడతారు తిట్టుకుంటుంటే తృప్తినిపొందుతారు చాడీలు మోస్తారు చేతులు కలుపుతారు లాభాలు పొందుతారు స్వార్ధపరులు అవుతారు కక్కుర్తి పడతారు కాటువేయ చూస్తారు కుటుంబాలను కూల్చుతారు స్నేహితులను విడదీస్తారు ప్రేమికులమధ్య చిచ్చురేపుతారు పోటీదారులమధ్య పెట్రోలుపోస్తారు నిప్పును రగిలిస్తారు మంటలు లేపుతారు బూటకాలు చేస్తారు నాటకాలు ఆడతారు తప్పక నారదలు బొక్కబోర్లాపడతారు బాధితుల చేతులకుచిక్కి తన్నులుతింటారు నారదులను గమనించండి నాటకాలకు తావివ్వకండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీసంద్రం అలల్లా ఆలోచనలు ఆవిర్భవిస్తున్నాయి బడబాగ్నిలా భావాలు భగభగలాడుతున్నాయి చినుకుల్లా అక్షరాలు కురుస్తున్నాయి పైరగాలిలా పదాలు ప్రసరించుతున్నాయి పాలుచిలికినట్లుగా మనోమదనము సాగుతుంది వెన్నలా కవిత్వము పుట్టకొస్తుంది జలచరాల్లా కవులు ఈదుతున్నారు రత్నాల్లా కవితలను వెలువరించుతున్నారు సముద్రాన్నిచూచి సాహిత్యాన్నిచదివి సంతసపడండి కవులవ్రాతలుపఠించి కవనలోతులుపరికించి కుతూహలపడండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అడుగో ఆధునికకవి! అవిగో అతనిభావాలు! కవికోకిల అవుదామనుకుంటున్నాడోయ్ గాంధర్వగానమును ఆలపించాలనుకుంటున్నాడోయ్ గొంతును సవరించాలనుకుంటున్నాడోయ్ నోరును తెరవాలనుకుంటున్నాడోయ్ పెదవులను విప్పాలనుకుంటున్నాడోయ్ తియ్యదనాలను చల్లాలనుకుంటున్నాడోయ్ వీనులకు విందునివ్వాలనుకుంటున్నాడోయ్ ప్రేక్షకులను ప్రమోదపరచాలనుకుంటున్నాడోయ్ ఆనందమును అందించాలనుకుంటున్నాడోయ్ అంతరంగాలను ఆకర్షించాలనుకుంటున్నాడోయ్ ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాడోయ్ చప్పట్లు కొట్టించాలనుకుంటున్నాడోయ్ శ్రావ్యత చేకుర్చాలనుకుంటున్నాడోయ్ నవ్యత తెలియజేయాలనుకుంటున్నాడోయ్ కైతలను గానంచేయాలనుకుంటున్నాడోయ్ శ్రోతలను కట్టిపడవేయాలనుకుంటున్నాడోయ్ నవ్వులు చిందాలనుకుంటున్నాడోయ్ మోములు వెలిగించాలనుకుంటున్నాడోయ్ అమృతజల్లులలో తడపాలనుకుంటున్నాడోయ్ ఆనందడోలికలలో ముంచాలనుకుంటున్నాడోయ్ గుండెతో శ్రుతినికలపాలనుకుంటున్నాడోయ్ జీవనగానంతో ప్రీతినిపంచాలనుకుంటున్నాడోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందాకా ఏగేదెట్లాగా! ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండమంటాడు ఆప్పుడే వెళ్ళటానికి అంతతొందర ఏమంటాడు వెళ్ళకుండా అడ్డుకుంటాడు పొనీకుండా పట్టుకుంటాడు చెంతనే ఉండమంటాడు కబుర్లను చెప్పమంటాడు సరసాలు ఆడుకుందామంటాడు సల్లాపాలు కొనసాగిద్దామంటాడు చిరునవ్వులు చిందమంటాడు మరుమల్లెలు చల్లమంటాడు ముచ్చట్లు చెప్పమంటాడు మురిపాలు చెయ్యమంటాడు చక్కదనాలు చూపమంటాడు ఆనందాలు అందించమంటాడు వెన్నెలలో విహరిద్దామంటాడు పూలతోటలో పచారీచేద్దామంటాడు పెళ్ళయ్యేదాకా ఏగేదెట్లాగా ఆపేదెట్ల్లాగా ఆగేదెట్ల్లగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తిష్ఠవేసినకవిత అందం పిలుస్తుంది ఆనందం ఇస్తానంటుంది సుమాలను చూపిస్తానంటుంది పరిమళాలను చల్లుతానంటుంది జాబిలిని కనమంటుంది వెన్నెలని ఆస్వాదించమంటుంది ఆకాశానికి ఎగరమంటుంది మబ్బులనెక్కి స్వారీచేయమంటుంది తారలతో ఆడమంటుంది తళతళలతో మెరిసిపొమ్మంటుంది సముద్రం స్వాగతిస్తుంది అలలపై తేలమంటుంది కవిత కవ్విస్తుంది కలము పట్టిస్తుంది ఊహలు ఊరిస్తుంది పదాలు పారిస్తుంది కాగితం నింపించింది కవిత్వం పుట్టించింది వర్ధమానకవిని విస్తుపరచింది అందాలకైతని ఆవిష్కరింపజేసింది పాఠకులను చదివించింది పరవశాలను చేకూర్చింది మనసులలో మాటేసింది తలలలో తిష్ఠవేసింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కలాలు కదిలితేనే! కవివర్యుల పాటలు గాయకుల గానాలు నర్తకీమణుల నృత్యాలు నేపథ్య వాయిద్యాలు వీక్షకులవినోదాలు స్పందనలు కలాలు కదిలితేనే వినబడతాయి అతివల అందచందాలు మన్మధుని మోహాలు విరహ వేదనలు హృదయ స్పందనలు మదులకు  మురిపాలు కలాలు కదిలితేనే కనబడతాయి పండితుల ప్రవచనాలు భక్తుల గుమిగూడటాలు ఔత్సాహికుల ఉరుకులు సంప్రదాయ ఆచరణలు  సంస్కృతి పరిరక్షణలు కలాలు కదిలితేనే సంభవిస్తాయి కవుల సమ్మేళనాలు సన్మాన సత్కారాలు శాలువాలు కప్పటాలు బిరుదుల ప్రదానాలు పత్రికలలో ప్రచారాలు కలాలు కదిలితేనే జరుగుతాయి అందాల వర్ణనలు ఆనందాల చేరవేతలు మనసుల మురిపింపులు నవ్వుల కురిపింపులు మోముల వెలిగింపులు కలాలు కదిలితేనే కొనసాగుతాయి అక్షరాల అల్లికలు పదాల ప్రయోగాలు పంక్తుల పసందులు చరణాల కూర్పులు భావాల విస్ఫోటనాలు కలాలు కదిలితేనే సృష్టించబడుతాయి అవినీతిపై పోరాటాలు అక్రమాలపై దండెత్తటాలు అన్యాయాలపై ఎదిరింపులు ఆర్తనాదులకు సాయాలు సంఘసంస్కరణల సాధించటాలు కలాలు కదిలితేనే సాధ్యమవుతాయి పద్యాల పరుగులు వచనకైతల వరదలు ప్రబోధాల పరంపరలు ప్రణయాల ప్రకంపనలు పాఠకుల పారవశ్యాలు కలాలు కదిలితేనే బయటకొస్తాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రేమసందేశం ప్రేమను పెట్టెలోపదిలపరచి కాపాడుకుంటున్నా ప్రేమను పొట్లంలోకట్టి భద్రపరచుకుంటున్నా ప్రేమను పువ్వుల్లోపెట్టి పరిరక్షించుకుంటున్నా ప్రేమను మనసులోదాచుకొని మననంచేసుకుంటున్నా ప్రేమను గుండెలోమరుగుపరచుకొని గురుతుకుతెచ్చుకుంటున్నా ప్రేమను హృదిలోపొందుపరచుకొని యాదిచేసుకుంటున్నా ప్రేమను మరచిపోలేక మాటిమాటికితలచుకుంటున్నా ప్రేమను మాటల్లోచెప్పలేక మౌనందాలుస్తున్నా ప్రేమను పువ్వులిచ్చితెలుపలేక పరెశానవుతున్నా ప్రేమను లేఖలోకెక్కించినా పంపలేకున్నా అయితే ప్రేమను కవితగామలచి బహర్గితంచేస్తున్నా ప్రేమ ప్రేయసికిచేరుతుందని ఆశపడుతున్నా ప్రేమకు ప్రతిస్పందిస్తుందని ప్రతీక్షిస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితపుట్టాలంటే సమయం రావాలి సందర్భం కావాలి అందాలు కనపడాలి ఆనందాలు కలిగించాలి కలలు కనాలి కల్పనలు చెయ్యాలి కవిత కవ్వించాలి మమత మురిపించాలి ఆలోచనలు పారాలి భావములు ఏర్పడాలి కలం కదలాలి కాగితం నిండాలి మెదడును మర్ధించాలి మనసును కదిలించాలి విషయం దొరకాలి హృదయం స్పందించాలి పోలికలు తట్టాలి ప్రాసలు కుదరాలి అక్షరాలు అందాలి పదములు పొసగాలి అప్పుడు కవిత్వం పుడుతుంది కమ్మదనం పంచుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేటి నాజన్మదినకవిత నా పుట్టినరోజునరాసినకవితకు ఎవరూ శుభాకాంక్షలుచెప్పలేదు ఎవరూ బహుమతులుపంపలేదు నా కవితను ఎవరూ కోరలేదు ఎవరూ చదవలేదు నా కవితకు ఏ అంశమూలేదు ఏ లక్ష్యమూలేదు నా కవితకు ఏ శిల్పమూలేదు ఏ శైలీలేదు   నా కవితకు ఏ ప్రారంభమూలేదు ఎటువంటి అంతమూలేదు నా కవితకు పాఠకులులేరు విమర్శకులులేరు నా కవిత విశిష్టము విభిన్నము నా కవిత నిగూఢము నిర్మలము అసలు ఈనాకవితను ఇప్పటివరకూ ఎవరికీపంపలేదు ఎవరినీ విసిగించలేదు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రయాణాలు బాటసారి పయనం గమ్యం చేరేవరకే ఒంటరి పయనం తోడు దొరికేవరకే పడవ పయనం ఆవలిగట్టుకు వెళ్ళేవరకే బండి పయనం వెళ్ళవలసిన ఊరువచ్చేవరకే కెరటాల పయనం తీరం తగిలేవరకే మేఘాల పయనం వాన కురిసేవరకే కాంతి పయనం రవిచంద్రులు అస్తమించేవరకే కలల పయనం నిద్రనుండి మేలుకొనేవరకే ప్రేమ పయనం పెళ్ళి చేసుకొనేవరకే స్నేహ పయనం ఆటుపోట్లు తట్టుకొనేవరకే చూపుల పయనం కనులు కాంచేవరకే నవ్వుల పయనం మోములను వెలిగించేవరకే ఆలోచనల పయనం అంతరంగాన్ని తట్టేవరకే భావాల పయనం బయటకు వెల్లడించేవరకే మనసు పయనం మేను గ్రహించేవరకే కానీ కవన పయనం కాయం కట్టెల్లోకాలేవరకూ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆంధ్రానాటకం (చాల్లే బడాయి) నేను ఉన్నాకాబట్టే ఉచితాలు ఇస్తున్నా డబ్బులు పంచుతున్నా సంక్షేమం చేస్తున్నా కడుపులు నింపుతున్నా ప్రాణాలు కాపాడుతున్నా నేను చెబితేనే మేఘాలు లేచాయి వానలు కురిసాయి పొలాలు తడిసాయి పైరులు పెరిగాయి పంటలు పండాయి నేను కోరితేనే మొక్కలు మొలిచాయి మొగ్గలు తొడిగాయి పువ్వులు పూచాయి పరిమళాలు చల్లాయి పరవాశాలు పంచాయి నేను కలంపట్టమంటేనే కాగితాలు నిండాయి కవితలు పుట్టాయి  అందాలు చూపాయి ఆనందాలు ఇచ్చాయి అంతరంగాలను తట్టాయి నేను ఉన్నాననే ఓటర్లు పోటెత్తారు మీటను నొక్కారు గెలుపును ఇస్తున్నారు ప్రత్యర్ధులను ఎదురిస్తున్నారు అధికారాన్ని ఒప్పచెబుతున్నారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చిరునవ్వుకోసం చిరునవ్వుకోసం సిగ్గూశరమూవదిలి చిన్నదాన్నడిగా ముద్దడగలా ముచ్చటడగలా మంచినవ్వడిగా అన్నమడగలా మంచినీళ్ళడగలా అద్భుతమైననవ్వునడిగా సరసాలాడమనలా చిందులేయమనలా చిన్ననవ్వునడిగా కాఫీనడగలా తేనీరడగలా చిరునవ్వునడిగా అందాన్నడగలా ఆనందాన్నడగలా అపరూపమైననవ్వునడిగా ఆటనాడమనలా పాటపాడమనలా తేటయిననవ్వునడిగా ఉలకమనలా పలకమనలా కళకళాడమన్నా దానముకోరలా సాయముకోరలా చిన్నినవ్వునడిగా చేతులుకలపమనలా సోకులుచూపమనలా చిట్టినవ్వునడిగా విందునడగలా పొందునడగలా పసందైననవ్వడిగా కళ్ళనుకట్టేయమన్నా మదినిముట్టమన్నా నవ్వుల్లోముంచమన్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనప్రకృతి ఏ ఋతువు అనుకూలిస్తుందో ఏ సమయము అనుగ్రహిస్తుందో ఏ విత్తనం మొలుస్తుందో ఏ అక్షరం గెలుస్తుందో ఏ మొక్క ఎదుగుతుందో ఏ పదం ఎదనుతడుతుందో ఏ కొమ్మ పూస్తుందో ఏ పంక్తి పులకరిస్తుందో ఏ పిందె కాయవుతుందో ఏ చరణం శ్రావ్యమవుతుందో ఏ పండు ఊరిస్తుందో ఏ కవిత మురిపిస్తుందో ఏ గాలి సౌరభాలనువీస్తుందో ఏ ఊహ తియ్యదనాలనుపంచుతుందో ఏ వనం అందాలనుచూపుతుందో ఏ పుస్తకం ఆనందాలనిస్తుందో అరణ్యంలో సేదతీరుదాం సాహిత్యంలో మునిగితేలుదాం కళ్ళకు విందునిద్దాం మెదళ్ళకు మేతపెడదాం ప్రకృతిని ప్రేమిద్దాం పలుకులమ్మని పూజిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మహలక్ష్మి రావమ్మా! రావమ్మా రావమ్మా మహాలక్ష్మి రావమ్మా మా ఇంటికిరావమ్మా మమ్మూ కరుణించవమ్మా                    ||రావ|| నిత్యము పూజిస్తామమ్మా సత్యము పలుకుతామమ్మా ప్రదక్షణలు చేస్తామమ్మా ప్రసాదాలు పంచుతామమ్మా తలుపులు తెరుస్తామమ్మా స్వాగతము పలుకుతామమ్మా త్వరగా త్వరత్వరగారావమ్మా తరలిపోక నిలిచిపోవమ్మా                     ||రావ||     చిల్లరను చల్లవమ్మా వేలను కూర్చవమ్మా లక్షలను పేర్చవమ్మా కోట్లను కుమ్మరించవమ్మా గాజులు గలగలలాడించవమ్మా గజ్జలు ఘల్లుఘల్లునమ్రోగించవమ్మా నవ్వులను నిండుగాచిందించవమ్మా మోములను చక్కగావెలిగించవమ్మా               ||రావ|| కాంతులను ప్రసరించవమ్మా చీకట్లను పారద్రోలవమ్మా పరిమళాలు వెదజల్లవమ్మా పరవశాలు కలిగించవమ్మా ధన్యవాదాలు చెబుతామమ్మా దినదినము పూజించుతామమ్మా దర్శనభాగ్యము కలిగించమ్మా ధనమును చేతులనిండాచేకూర్చవమ్మా              ||రావ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓరి నాయకుడా! ఓటర్లను భయపెడతావా పోటీదార్లను బయటకుగెంటేస్తావా రాళ్ళను పైకివిసురుతావా తలలు పగలకొడతావా కర్రలను తిప్పుతావా కార్లను ధ్వంసంచేస్తావా బాంబులను ప్రయోగిస్తావా బెదరింపులకు దిగుతావా డబ్బులు పంచుతావా ఓట్లను కొంటావా అన్యాయాలకు ఒడిగడతావా అక్రమాలకు పాలుపడతావా నిందలు మోపుతావా పెడబొబ్బలు పెడతావా వాగ్దానాలు గుప్పిస్తావా మోసపుమాటలు వల్లెవేస్తావా అబద్ధాలు చెబుతావా అపనిందలు వేస్తావా ఎన్నికలను ఎగతాళిచేస్తావా ఎదుటివారిని ఏడిపించుతావా నీతిమంతుడనని నాటకాలాడతావా బుద్ధిమంతుడినని భుజాలెగరేస్తావా ఆగు ఆగు వేచిచూడు నీరంగు బయటపడుతుంది నీనిజరూపం తెలిసిపోతుంది ప్రజస్వామ్యం నిలుస్తుంది ప్రజాభిష్టం గెలుస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనప్రపంచం కవనప్రపంచం పిలుస్తుంది కవనచైతన్యం కలిగిస్తుంది కవనమాధుర్యాన్ని క్రోలుకోమంటుంది కవనస్వర్గాన్ని చేరుకోమంటుంది కవనలోకాలను కాంచమంటుంది కవనసౌందర్యాలను తిలకించమంటుంది కవనకిరణాలను స్వీకరించమంటుంది కవనసౌరభాలను ఆస్వాదించమంటుంది కవనలోతులకు వెళ్ళమంటుంది కవనమర్మాలను కనుగొనమంటుంది కవనసుధలను పుచ్చుకోమంటుంది కవనసుమాలను పరికించమంటుంది కవనవీరులను కొనయాడమంటుంది కవనకన్యలను వరించమంటుంది కవనకౌముదిలో విహరించమంటుంది కవనసేద్యంలో కొనసాగమంటుంది కవనగిరులను వీక్షించమంటుంది కవనశిఖరాలను అధిరోహించమంటుంది కవనారణ్యంలో సంచరించమంటుంది కవననీడలలో స్వేదతీరమంటుంది కవనసామ్రాజ్యమును స్థాపించమంటుంది కవనాభిమానులను పరిపాలించమంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పూలు పూచాయి 'అదిగో అటుచూడండి. పూలు పూచాయి. అందంగా ఉన్నాయి ' అన్నాడు ఓ కవి. 'ఎక్కడ కవీశ్వరా! ' అని టక్కున అడిగాడు ఓ పాఠకుడు. అప్పుడు కవిగారు ఇలా అన్నారు. ' ఎదురుగా ఉన్న పూలతోటను చూడు. పచ్చగా ఎదిగిన మొక్కలనుచూడు. కొమ్మారెమ్మలను చూడు. అవి పూసిన పూలను చూడు. ఆనందించు ' అన్నాడు కవి. పాఠకుడు చూచి సంతోషించాడు. కవితో ఇలా అన్నాడు. ' కవిగారు, అక్కడే కాదు, ఇక్కడా కూడా పూచాయి ' అన్నాడు. 'ఎక్కడా ఎక్కడా ' అని ఆత్రంగా  అడిగాడు కవి. పాఠకుడు ఇలా అన్నాడు. ' మీ మదిలో సాహిత్యవనం కనిపిస్తుంది. కవితా వృక్షాలు కనిపిస్తున్నాయి. ఆ చెట్లనిండా వివిధ రంగుల కైతాపుష్పాలు కనిపిస్తున్నాయి. సువాసనలను చల్లుతున్నాయి ' అని అన్నాడు. ఈ మాటలు విన్న ఓ తల్లి ఇలా అన్నది. ' మా ఇంట్లో కూడా రెండు విరులు వికసించాయి. చూడండి. మా పిల్లల మోముల్లో నాకు చక్కని సుమాలు కనబడుతున్నాయి. చూడండి ' అన్నది. కవి పాఠకుడు చూచి ఆశ్ఛర్యపోయారు. అప్పుడు ఓ పిల్లవాడు ఇలా అన్నాడు . 'తలపైకెత్తి ఆకాశంలోకి చూడండి. అక్కడ కూడా పూలు కనిపిస్తున్నాయి. చందమామను చూడండి, తారకలను చూడండి. మిలమిలా తళతళా మెరిసి...
Image
ఇక సెలవు ఓటమిని ఒప్పుకుంటున్నా విదేశానికి వెళ్ళిపోతున్నా పేచీ పెట్టనంటా కుర్చీ దిగిపోతున్నా పెత్తనం వదులుతున్నా పలాయనం చిత్తగిస్తున్నా ఓటుదెబ్బకు లొంగిపోతున్నా చాటుమాటుకు వెళ్ళిపోతున్నా తిట్టులు తిట్టవద్దు దెబ్బలు కొట్టవద్దు బుద్ధి వచ్చింది తప్పు తెలిసింది మౌనం వహిస్తా మానం కాపాడుకుంటా మాటలు మీరవద్దు తూటాలు ప్రేల్చవద్దు టాటా చెబుతున్నా బైబై చెప్పుతున్నా దుర్భాషలు ఆడవద్దు ఇకసెలవు చిత్తగించవలెను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పదాలపసందులు కాకులకావుకావులైనా కవులకరాలచేరితే కోకిలలకుహూకుహూలై కమనీయతనందిస్తాయి పరుషపదాలైనా కైతలోవాడితే సరళపదాలై సంతసపరుస్తాయి రిక్తపదాలైనా కవనంలోభాగమైతే శక్తిపదాలై సంబరపరుస్తాయి వ్యర్ధపదాలైనా కవితస్వీకరిస్తే అర్ధవంతమై అలరించుతాయి పెద్దపదాలైనా కయితకరుణిస్తే శుద్ధపదాలై చోద్యపరుస్తాయి నాటుపదాలైనా చక్కగా అమరిస్తే నవ్వపదాలై నాలుకల్లోనానుతాయి మోటుపదాలైనా మంచిగామలిస్తే తేటపదాలయి తేనెచుక్కలుచిందుతాయి పాతకాలపుపదాలైనా పుటలకెక్కిస్తే కొత్తదనమునుచూపించి కుతుహలపరుస్తాయి పల్లెపదాలైనా పేజీలపైపరిస్తే జానపదాలై జనరంజకాలవుతాయి రమ్యపదాలను రసగీతాల్లోచేరిస్తే కమ్మనిపదాలయి కర్ణాలకువిందునిస్తాయి అందాలపదాలను అర్ధవంతంగావినియోగిస్తే ఆనందపదాలయి అందరినాకర్షిస్తాయి పదాలను పక్కాగాప్రయోగించితే పాఠకులను పూర్తిగాపులకరించుతాయి పదప్రయోగాలు పరవశపరుస్తాయి పదబంధాలు ప్రమోదపరుస్తాయి పదాలు అర్ధాలనుస్ఫురిస్తాయి ప్రాసలు పంక్తులకింపునిస్తాయి పదములు పదనిసలాడుతాయి పలుకులు పసందునుకలిగిస్తాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేటి ఎన్నికలచిత్రం భానుదు భగభగామండుతున్నాడు వడగాల్పులు ఎడాపెడా వీస్తున్నాయి పచ్చనోట్లు రెపరెపలాడుతున్నాయి బిరియానిపొట్లాలు చకచకాపంచబడుతున్నాయి మధ్యము గలగలా ఏరులాపారుతుంది ఓటర్లు గజగజలాడిస్తున్నారు నేతలు విలవిలాపోతున్నారు ఎన్నికలు చకచకాముంచుకొచ్చాయి అవినీతి రాజ్యమేలుతుంది అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి జయాపజయాలు దైవాధీనమయ్యాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ కవీశ్వరా! పువ్వంటివి ప్రేమంటివి మదిలోకోర్కెలు లేపితివి ప్రకృతంటివి పురుషుడంటివి ఇరువురు సృష్టికిమూలమంటివి అందమంటివి ఆనందమంటివి అంతరంగములో ఆశలురేకెత్తించితివి నవ్వంటివి నవతంటివి నాలుగుమాటలుచెప్పి నమ్మించితివి అక్షరాలనేరితివి ఆణిముత్యాల్లాగుచ్చితివి అల్లి చదివించి అలరించితివి పదాలనుపేర్చితివి పసందుగాపాడితివి వీనులకువిందునిచ్చి వేడుకపరచితివి వెలుగులుచిమ్మితివి వెన్నెలనుచల్లితివి మదులనువెలిగించి ముచ్చటపరచితివి ఊహలనూరించితివి భావాలుపొంగించితివి మదులదోచి హృదిలోనిలిచితివి సౌరభాలుచల్లితివి తియ్యందనాలుపంచితివి పెక్కువిధాల మనసులమెప్పించితివి ప్రణయమంటివి ప్రభోదమంటివి పలురీతుల పలుకులుపారించితివి పద్యమంటివి గేయమంటివి వచనకవితంటివి వివిధప్రక్రియలందునాకట్టుకుంటివి మాటలువిసిరితివి మదులుతట్టితివి మేటిసాహిత్యమునిచ్చి మహిలోచిరంజీవివైతివి కవులకు స్వాగతం కవనలోకానికి సుస్వాగతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగోడా! నన్నయ్య బాటన నడవవేమిరా నాణ్యమైనది తెలుగని నినదించవేమిరా తిక్కన తెరువున పయనించవేలరా తెలుగు తియ్యందనాలను పంచిపెట్టవేలరా పొతన దారిని అనుసరించవేమిరా నలుదిక్కులా తెలుగుని ప్రసరించవేమిరా శ్రీనాధుని కావ్యాలను స్మరించవేమిరా తెలుగోళ్ళ మనసులను దోచుకొనవేమిరా రాయలు మాటలను ప్రచారంచేయవేమిరా తెలుగు దేశానలెస్సని పలుకవేమిరా శ్రీశ్రీలాగా కమ్మనికవితలనుకూర్చవేమిరా తెలుగు వెలుగని తెలుపవేమిరా విశ్వనాధవలె విరచించవేమిరా విశ్వమంతా తెలుగును విస్తరించవేమిరా కృష్ణశాస్త్రిని తలచవేమిరా భావకవితలను తెలుగులో బహుగావ్రాయవేమిరా దాశరధి రీతిన రాయవేమిరా దశదిశల తెలుగుకు సాటిలేదనవేమిరా సినారె పాటలను పాడవేమిరా శ్రావ్యమైనది తెలుగని చాటవేమిరా ఎక్కడున్నా ఎప్పుడైనా తెలుగుతల్లిని తలచరా కలముపట్టి గళమునెత్తి తెలుగుఘనతను తెలుపరా జైజై  తెలుగనరా జయహో తెలుగనరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాకుసుమాలు నాకు చిక్కిన శిల్పాన్ని నీకు చక్కని శైలిలో చేరుస్తా నాకు నచ్చిన విషయాన్ని నీవు మెచ్చేలా మలుచుతా నాకు తట్టిన వస్తువును నీకు ముట్టేలా మారుస్తా నాకు వచ్చిన ఆలోచనలను నీకు చక్కగా తెలుపుతా నాకు కలిగిన అనుభూతులను నీకు వివరంగా విన్నవించుతా నాకు కనిపించిన అందాలను నీకు వర్ణించి వీక్షింపజేయిస్తా నాకు దక్కిన ఆనందాలను నీకు చేర్చి సంతసపరుస్తా నేను కన్న కలలను నీకు కమ్మగ వినిపించుతా నేను అల్లిన అక్షరసుమాలను నీకు అందించి ఆహ్లదపరుస్తా నేను కూర్చిన పదమాలికలను నీకు చేర్పించి సంబరపరుస్తా నేను వ్రాసిన కవితలను నీకు పంపి పరవశపరుస్తా నా  కవితలను చదువు నీ  స్పందనలను తెలుపు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏమి భాగ్యమో? ఆమెది ఏమి భాగ్యమో? నాది ఎంత అదృష్టమో? ఉల్లము ఉప్పొంగుతుంది పరువము పరుగెత్తుతుంది చుక్కలు రవికమీదకూర్చున్నాయి జాబిల్లి మోముమీదతిష్టవేసింది ఇంద్రధనస్సు చీరమీదపరచుకుంది కౌముది మదినిముంచెత్తింది మల్లెలు జడనుచేరి మత్తెక్కిస్తున్నాయి గునపాలు గుండెలోదిగి గుబులురేపుతున్నాయి కోకిల కంఠములోదూరి వినిపిస్తుంది హంస కాళ్ళనుకదిలించి అడుగులేయిస్తుంది చిలుక నోటినిస్వాధీనంచేసుకుంది అమృతము పెదవులనాక్రమించింది అందం వంటిలోచేరింది ఆనందం హృదినినింపింది సిగ్గు బుగ్గలకెక్కింది నిగ్గు కళ్ళనుచేరింది చూపు పట్టేస్తుంది కైపు తలకెక్కుతుంది అందాలకడలిలో మునుగుతా ఆనందలోకంలో విహరిస్తా ఆమెనుచూచి అసూయపడకండి అక్షరాలుచదివి ఆహ్లాదంపొందండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎట్లా? కవిత కవ్వించకపోతే కోరకపోతే కవనంసాగేది ఎట్లా? కలం కదలకపోతే కక్కకపోతే గీయకపోతే ఎట్లా? కాగితం నల్లబడకపోతే నిలబడకపోతే నిండకపోతే ఎట్లా? గళం విప్పుకోకపోతే వినిపించకపోతే విరామంతీసుకుంటే ఎట్లా? ఊహలు ఊరకపోతే ఉరకకపోతే ఉత్తేజపరచకపోతే ఎట్లా? అక్షరాలు అల్లుకోకపోతే అందకపోతే అమరకపోతే ఎట్లా? పదాలు పొసగకపోతే పారకపోతే పుటలకెక్కకపోతే ఎట్లా? కవితలు కూరకపోతే చేరకపోతే చదవకపోతే ఎట్లా? పాఠకులు పఠించకపోతే ప్రతిస్పందించకపోతే పరవశించేది ఎట్లా? మనసులు మురిసిపోకపోతే మెరిసిపోకపోతే మనేది ఎట్లా? కవులు కదలకపోతే కదంత్రొక్కకపోతే కవితలుపుట్టేది ఎట్లా? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా మనసు  గాలిలా వ్యాపించమంటుంది కాంతిలా ప్రసరించమంటుంది నీటిలా ప్రవహించమంటుంది ఆకాశంలా ఎత్తుకెళ్ళమంటుంది పుడమిలా ప్రాణులకుతావుకమ్మంటుంది పువ్వులా పూయమంటుంది నవ్వులా వెలిగిపొమ్మంటుంది ఆలోచనలలా సాగిపొమ్మంటుంది భావాలలా బహిర్గతముకమ్మంటుంది అక్షరాలై అలరించమంటుంది పదాలై పరవశపరచమంటుంది అందమై ఆకర్షించమంటుంది ఆనందమై అంతరంగంలోనిలువమంటుంది కవిత్వమై కమనీయతనివ్వమంటుంది మనసుకోరిక మన్నించుతున్నా మదినివిప్పి ముందుంచుతున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మారిన మహిళలు ఓణీలు వెయ్యటంలేదు పైటలు కప్పుకోవటంలేదు చీరెలు కట్టటంలేదు రవికలు తొడగటంలేదు జీన్సుఫాంటులు వేస్తున్నారు టీషర్టులు తొడుగుతున్నారు ఇంటిపనులు చెయ్యటంలేదు వంటపనులు సాగించటంలేదు జడలు వేసుకోవటంలేదు పూలు పెట్టుకోవటంలేదు సిగ్గు పడటంలేదు శిరసు వంచటంలేదు పెళ్ళికి తొందరపడటంలేదు పిల్లలను వెంటనేకనటంలేదు సైకిల్లు తొక్కుతున్నారు బైకులు నడుపుతున్నారు ఉన్నతవిద్యలు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వివాహానికి కట్టుబడటంలేదు విడాకులకు వెనుకాడటంలేదు చెప్పింది వినటంలేదు నచ్చింది చేసుకుపోతున్నారు వాంఛలు తీర్చుకుంటున్నారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు బంధానికి చిక్కటంలేదు అనుబంధానికి కట్టుబడటంలేదు మగువలు మగవారితోసమమయ్యారు ఆకాశంలో అర్ధభాగమయ్యారు మొగుళ్ళ ఆటలు చెల్లటంలేదు పెళ్ళాల పెత్తనాలు ఆగటంలేదు కాలం మారింది కలికికాలం మొదలయ్యింది మగువలకు అభినందనలు నవీనతకు స్వాగతము గుండ్లపల్లిరాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అతను ఏవరో తలుపులు తెరుస్తున్నారు ఏలనో లోపలికి ప్రవేశిస్తున్నారు ఎందుకో తలపులు లేపుతున్నారు ఎక్కడికో మదులను తీసుకెళ్తున్నారు ఏమిటో భావాలు వ్యక్తపరుస్తున్నారు ఏవో మార్గాలు చూపిస్తున్నారు కొంతకాంతిని ప్రసరిస్తున్నారు కొన్నివిషయాలు ప్రవచిస్తున్నారు కొన్నిరంగులు పట్టుకొస్తున్నారు కొత్త అందాలు చూపిస్తున్నారు కొన్నిపదాలు చదివిస్తున్నారు కొన్ని అర్ధాలు వెల్లడిస్తున్నారు కొన్నిశబ్దాలు వినిపిస్తున్నారు కొండంతశాంతి అందిస్తున్నారు కొంతనీడ ఇస్తున్నారు కొంతహాయి కలిగిస్తున్నారు కొత్తబాటను చూపిస్తున్నారు కొన్ని అదుగులు వేయిస్తున్నారు కొంతసమయము కేటాయించమంటున్నారు కొన్నికబుర్లను కర్ణాలకందిస్తున్నారు అతను కవీంద్రుడు అతనివి అద్భుతసృజనలు అతడిని గుర్తించుకుందాం అతనికి ధన్యవాదాలుతెలుపుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేనొక ప్రేమపిపాసిని పొడుస్తునపొద్దు రమ్మంటే వెంటనే మేల్కొంటా తలుపులు తెరుస్తా అరుణకిరణాలను స్వాగతిస్తా విరబూసినపూలచెట్టు పిలిస్తే చూచి సంబరపడతా వంగి ముద్దాడుతా అభినందనలు చెబుతా అందాలు అస్వాదించమంటే పరిసరాలు పరికించుతా ఆనందాలను అందుకుంటా మేనును మురిపించుతా ఆకాశం ఆహ్వానిస్తే నీలిమబ్బులను కంటా ఉరుములను వింటా మెరుపులను చూస్తా మేఘాలు మురిపిస్తే కళ్ళను అప్పచెబుతా మనసుకు పనిబెడతా హృదిని ఆహ్లాదపరుస్తా తారలు తొంగిచూడమంటే తలనెత్తి తిలకిస్తా తళుకులు స్వీకరిస్తా తందనాలు త్రొక్కుతా సముద్రం సైగచేస్తే సంగమించే నదులచూస్తా ఎగిసిపడే కెరటాలుచూస్తా తీరంలో సంచరిస్తా పున్నమి కనుగీటితే పరుగెత్తుకుంటూ వెళ్తా పరికించి ప్రేమనుపంచుతా విహరించి వేడుకచేస్తా ప్రేయసి ముందుకొస్తే పువ్వులు చల్లుతా నవ్వులు చిందుతా ముచ్చట్లు చెబుతా కవిత కవ్విస్తే ఆలోచనలు పారిస్తా కలమును చేపడతా కైతను కూరుస్తా ప్రేమకోసం తపిస్తా ప్రేమవెంట పరుగెడుతా ప్రేమరాజ్యం స్థాపిస్తా ప్రేమలోకంలో విహరిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
  వడగాల్పులవీరంగం సుగంధాలు చల్లుతాయనుకున్నసుమాలు వాడిపోయాయి రాలిపోయాయి కౌముది కురిపిస్తుందనుకున్నజాబిలి దడుసుకున్నది దాక్కున్నది చినుకులు చిటపటారాలుస్తాయనుకున్నమేఘాలు చిన్నబోయాయి చెల్లాచెదురయ్యాయి చిగురాకులు తొడుగుతాయనుకున్నచెట్లు ఎండిపోయాయి విలవిలలాడుతున్నాయి గళాలు విప్పుతాయనుకున్నకోకిలలు మూగబాటపట్టాయి గొంతులుతెరవకున్నాయి నాట్యాలు చేస్తాయనుకున్ననెమలులు నివ్వెరపోయాయి నీడల్లోనిలిచిపోయాయి నవ్వులు విసురుతాయనుకున్నమోములు నల్లబడ్డాయి నీరసపడ్డాయి నిజాలు అవుతాయనుకున్నకలలు కరిగిపోయాయి కల్లలయ్యాయి వడగాల్పులు వీరంగంసృష్టిస్తున్నాయి వీధులనుఖాళీచేస్తున్నాయి వాకిటితలుపులనుమూయిస్తున్నాయి ఎన్నో అడగాలనుకున్నా పువ్వులను, వెన్నెలను, చినుకులను, చిగురాకులను, కోకిలలను, కలాపీలను, నవ్వులను, నిమిషాలను కానీ కళ్ళుతెరచిచూచి విచారినయ్యా బైరాగినయ్యా మౌనినయ్యా కష్టాలు కాంచినపిమ్మట కదిలిపోయా క్రుంగిపోయా కవితనుకూర్చా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏమి చోద్యమో! రాత్రయితేచాలు అదేయావ పవ్వళిస్తేచాలు అదేధ్యాస అలసిన తనువు నిద్రనుకోరుకుంటుంది వేడెక్కిన మనసు విశ్రాంతినడుగుతుంది కళ్ళుమూస్తేచాలు నిదురవస్తుంది పడుకుంటేచాలు కలవస్తుంది స్వప్నమొస్తేచాలు మెలుకువవస్తుంది మేలుకుంటేచాలు ఆలోచనలొస్తున్నాయి కల్పనలు చుట్టుముడుతున్నాయి కవ్వింపులు వెంటబడుతున్నాయి నిజాలు మరుగునపడుతున్నాయి రంగులు పులమమంటున్నాయి భ్రమలు కలుగుతున్నాయి కోర్కెలు జనిస్తున్నాయి చక్కదనాలు కనువిందుచేస్తున్నాయి శ్రావ్యరాగాలు వీనులవిందునిస్తున్నాయి అక్షరాలు అలుముకుంటున్నాయి పదాలు పొసుగుతున్నాయి కలాలు కదులుతున్నాయి కాగితాలు నిండుతున్నాయి కలసి కవితలు వెలుగులోకొస్తున్నాయి చదివి మనసులు మురిసిపోతున్నాయి పగలు పరుగెత్తుకుంటువచ్చింది చీకటిని సుదూరంతరిమేసింది కల మదులముట్టింది కైత తనువులతట్టింది కవికి ఖ్యాతి కూరింది కవితకి కీర్తి వచ్చింది ఏమి చోద్యమో ఏమో కలలోవచ్చింది కవితలో దూరుతుంది కవితలోదూరింది మదులలోదూరుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పిలుపులు ఆకాశమునుండి పిలుపులొస్తున్నాయి తలయెత్తిచూడమని తారాచంద్రులకాంచమని గాలినుండి కబుర్లొస్తున్నాయి ప్రక్కకురమ్మని కలసిపయనిద్దామని పూదోటనుండి పిల్పులొస్తున్నాయి త్వరగారమ్మని తోడుగానిలువమని హృదయంనుండి అభ్యర్ధనలందుతున్నాయి ప్రేమజల్లులుచిందమని ప్రమోదపరచమని ఆలోచనలనుండి విన్నపాలొస్తున్నాయి అందమైనకైతలని అద్భుతంగావ్రాయమని అక్షరాలనుండి ఆహ్వానాలొస్తున్నాయి కలమునుపట్టమని కవితలనల్లమని పదాలనుండి స్వాగతాలందుతున్నాయి ప్రయోగించమని భావాలువ్యక్తపరచమని పాఠకులనుండి వినతులొస్తున్నాయి ప్రణయకవితలనురాయమని పారవశ్యంలోముంచమని పిలుపులను ఆలకిస్తా స్పందనలను స్పష్టముచేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం