Posts

Showing posts from August, 2024
Image
 తెలుగుసుధలు అమృతవర్షము కురిసింది తనువులను శుద్ధిచేసింది తెలుగును తడిపింది అమరము చేసింది సుధారసము చిందింది పెదవులను అంటింది తెలుగును పలికించింది తీయదనమును చేకూర్చింది పీయూషఘటము వచ్చింది క్రోలుకోమని కోరింది తెలుగును తలకెక్కించింది కమ్మదనాలకు తావునుచేసింది కంజకిరణాలు ఉదయించాయి కళ్ళను తెరిపించాయి తెలుగును ఆవహించాయి వెలుగును వ్యాపించాయి రేత్రబిందువులు వేకువనేపడ్డాయి పువ్వులపైన తావిచుక్కలయ్యాయి తెలుగును అంటుకున్నాయి సుగంధాలను వెదజల్లాయి అందుకే తెలుగుదేశానలెస్సయ్యింది అమరమయ్యింది మధురమయ్యంది  కమనీయమయ్యింది వెలుగయ్యింది సౌరభమయ్యింది ప్రపంచప్రఖ్యాతిపొందింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందం ఆనందం పువ్వులు వికసిస్తే అందం పరిమళాలు వెదజల్లితే ఆనందం చెట్టు పూస్తే అందం దృశ్యము పరికిస్తే ఆనందం శశికి వెన్నెల అందం చల్లగాలి తగిలితే ఆనందం కడలికి కెరటాలు అందం కేరింతలు వింటే ఆనందం నింగికి హరివిల్లు అందం వర్ణాలు వీక్షిస్తే ఆనందం మబ్బుకి చిరుజల్లులు అందం చినుకులు చిటపటమంటుంటే ఆనందం పాపాయికి పసిడిరంగు అందం ముద్దుమాటలు పలుకుతుంటే ఆనందం నెమలికి తోక అందం నాట్యము చేస్తుంటే ఆనందం కోకిలకి కంఠము అందం కుహూకుహులు వింటుంటే ఆనందం కంటికి చూపులు అందం మనసుకు ఆస్వాదన ఆనందం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవితావంటకాలు కవితలు నేర్చుకున్నా కమ్మగా కూర్చుదామని కవితలు వ్రాస్తున్నా చక్కగా చదివిద్దామని కవితలు విసురుతున్నా ఎగిరి పట్టుకుంటారని కవితలు చల్లుతున్నా తడిసి ఆనందిస్తారని కవితలు పాడుతున్నా శ్రద్ధగా వింటారని కవితలు పారిస్తున్నా గొంతులు తడుపుకుంటారని కవితలు సృష్టిస్తున్నా మనసులు దోచుకోవాలని కవితలు కుమ్మరిస్తున్నా పాఠకులు ఏరుకుంటారని కవితలు పంపుతున్నా అందుకొని ఆస్వాదిస్తారని కవితలు ప్రచురిస్తున్నా కలకాలం నిలుస్తాయని కవితలు వండుతున్నా కడుపులు నింపుకుంటారని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 జనారణ్యంలో.... కాలనాగులున్నాయి బుసకొడుతున్నాయి భయపెడుతున్నాయి కాటేస్తున్నాయి కర్రలుపట్టాల్సిందే కొట్టవలసిందే పట్టేయాల్సిందే కోరలుతీయాల్సిందే క్రూరమృగాలున్నాయి గర్జిస్తున్నాయి వెంటబడుతున్నాయి ప్రాణాలుతీస్తున్నాయి తుపాకులుధరించాల్సిందే కాల్చాల్సిందే బంధించాల్సిందే కాపాడుకోవాల్సిందే అచ్చేసినాంబోతులున్నాయి కయ్యానికికాలుదువ్వుతున్నాయి పెద్దపెద్దగారంకెలేస్తున్నాయి పదేపదేవెంటబడుతున్నాయి ముక్కుతాడేయాల్సిందే కట్టిపడవేయాల్సిందే దారికితేవాల్సిందే గర్వమణాచాల్సిందే రాక్షసులున్నారు రమణులనుచేబడుతున్నారు అత్యాచారాలుచేస్తున్నారు హింసకుదిగుతున్నారు ఎదిరించాల్సిందే పీచమణచాల్సిందే మదులుమార్చాల్సిందే మనుషులనుచేయాల్సిందే కాకులున్నాయి గుమిగూడుతున్నాయి గోలచేస్తున్నాయి చీకాకుపెడుతున్నాయి కేకలెయ్యాల్సిందే రాళ్ళువిసరాల్సిందే తోలవలసిందే ప్రశాంతతపొందాల్సిందే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అదే పిచ్చి.. అదే యావ.. మత్తులో పడ్డా తేరుకోలేకున్నా అక్షరాలకు చిక్కా అంకితమైపోయా పదాలకు దొరికా బానిసనైపోయా ఊహలకు తావయ్యా భ్రమలకు లొంగిపోయా కలముకు బందీనయ్యా గీతలు గీసేస్తున్నా కాగితాలు ఖైదీనిచేశాయి పంక్తులు పేర్పించుతున్నాయి విషయాలు తడుతున్నాయి విన్నూతనంగా విరచించమంటున్నాయి కవిత కవ్విస్తుంది రాయకపోతే ఊరుకోనంటుంది కైతలు పుట్టకొస్తున్నాయి పాఠకులకు పంపమంటున్నాయి పిచ్చి ముదిరినట్లుంది పుస్తకాలు ప్రచురించమంటుంది మైకం నుండి బయటకు రాలేకున్నా చిత్తయి పోతున్నా చెమటలు క్రక్కుతున్నా చిత్తాలు దోస్తున్నా చిరంజీవిని కావాలనుకుంటున్నా మదిని చక్కబరచమని వాణీదేవిని వేడుకుంటున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కొత్తగా...కొత్తకొత్తగా..... కొత్తగా చూడాలనుకుంటున్నా కొత్తవిషయాలను తెలుసుకోవాలనుకుంటున్నా కొత్తగా మాట్లాడాలనుకుంటున్నా కొత్తపదాలను ప్రయోగించాలనుకుంటున్నా కొత్తగా తయారవాలనుకుంటున్నా కొత్త అందాలతో ఆకర్షించాలనుకుంటున్నా కొత్తగా ఆలోచించాలనుకుంటున్నా కొత్తఙ్ఞానమును సంపాదించాలనుకుంటున్నా కొత్తగా రెక్కలుతొడుక్కోవాలనుకుంటున్నా కొత్తలోకంలో విహరించాలనుకుంటున్నా కొత్తగా మారాలనుకుంటున్నా కొత్తదనాలను పరిచయంచేయాలనుకుంటున్నా కొత్తగా వ్రాయాలనుకుంటున్నా కొత్తకవితలను కూర్చాలనుకుంటున్నా కొత్తగా వేషముమార్చాలనుకుంటున్నా కొత్తపాత్రను పోషించాలనుకుంటున్నా కొత్తకవిగా ఖ్యాతిపొందాలనుకుంటున్నా కొత్తనాలుకలపై నానాలనుకుంటున్నా పాతను తరిమెయ్యాలనుకుంటున్నా కొత్తను ఆహ్వానించాలనుకుంటున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అంతా తెలుగుమయం తెలుగు తల్లి పిలుస్తున్నది తెలుగు తీపిని తినిపిస్తున్నది తెలుగు దీపాలు వెలుగుతున్నాయి తెలుగు కాంతులు ప్రసరిస్తున్నాయి తెలుగు గాలులు వీస్తున్నాయి తెలుగు అక్షరాలు వ్యాపిస్తున్నాయి తెలుగు మేఘాలు కురుస్తున్నాయి తెలుగు పదాలు ప్రవహిస్తున్నాయి తెలుగు గళాలు తెరుచుకుంటున్నాయి తెలుగు పాటలు తన్మయపరుస్తున్నాయి తెలుగు నదులు ప్రవహిస్తున్నాయి తెలుగు జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి తెలుగు సేద్యము కొనసాగుతుంది తెలుగు పంటలు పండుతున్నాయి తెలుగు అందాలు ఆరబోస్తున్నాయి తెలుగు మోములు వెలిగిపోతున్నాయి తెలుగు పువ్వులు పొంకాలుచూపుతున్నాయి తెలుగు సౌరభాలు విరజిమ్ముతున్నాయి తెలుగు కవితలు జాలువారుతున్నాయి తెలుగు కవులు  మురిపిస్తున్నారు తెలుగు భాషకు పట్టంకడదాం తెలుగు జాతికి ఖ్యాతినితెద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 విమర్శకుడా! రాయిని విసరకు తలను పగులగొట్టకు కర్రతో కొట్టకు ఓళ్ళును హూణముచేయకు ముళ్ళతో గుచ్చకు రక్తము కార్చకు నిప్పులు చిమ్మకు కాల్చి బూడిదచేయకు బాణాలు సంధించకు బాధలు పెట్టకు ఈటెను వదలకు గాయము చేయకు తప్పులుంటే చూపు సూచనలుంటే చెయ్యి పువ్వులు చల్లు సంతసము కలిగించు ప్రోత్సహము ఇవ్వు ప్రశంసలు కురిపించు అయినా విమర్శలకు తావునివ్వనుగా  పాఠకులమదులను దోచుకుంటాగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆకాశం ఎర్రబడింది అక్కడ అబలపై జరుగుతున్న అత్యాచారాన్ని చూచి ఆకాశం ఎర్రబడింది అక్కడ దారిదోపిడీలు చేస్తున్న దొంగలముఠాను చూచి ఆకాశం ఎర్రబడింది అక్కడ అమానుషంగా అమాయకులను నరకటంకని ఆకాశం ఎర్రబడింది అక్కడ ఎన్నో దౌర్జ్యన్యాలనుచేసి ఎన్నుకోబడిన నేతనుచూచి ఆకాశం ఎర్రబడింది అక్కడ  అప్పుడేపుట్టిన శిశువును చెత్తబుట్టల్లో వేయటంచూచి ఆకాశం ఎర్రబడింది అక్కడ అమ్మానాన్నలను గెంటుతున్న తనయులనుచూచి ఆకాశం ఎర్రబడింది అక్కడ లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారులనుచూచి ఆకాశం ఎర్రబడింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగుతల్లికి నీరాజనాలు అభిషేకించి నూతనవస్త్రాలుకట్టి తెలుగుతల్లిని ముస్తాబుచేస్తా మల్లెలుతెచ్చి మాలగనల్లి తెలుగుతల్లి మెడలోవేస్తా కాళ్ళుకడిగి నెత్తినచల్లుకొని తెలుగుతల్లికి పూజలుచేస్తా చేతులెత్తి కంఠముకలిపి తెలుగుతల్లికి జైజైలుకొడతా అంజలిఘటించి ఆశిస్సులుకోరి తెలుగుతల్లికి వందనముచేస్తా ముచ్చట్లుచెప్పి చప్పట్లుకొట్టి తెలుగుతల్లిని ప్రశంసిస్తా రంగులనద్ది వెలుగులుచిమ్మి తెలుగుతల్లిని ధగధగలాడిస్తా తలనువంచి ధ్యానముచేసి తెలుగుతల్లిని తలచుకుంటా తలపైనెత్తుకొని పల్లకిలోకూర్చోపెట్టి తెలుగుతల్లిని ఊరేగిస్తా గళమునెత్తి గీతముపాడి తెలుగుతల్లిని పొగుడుతా పద్యాలువ్రాసి కవితలుకూర్చి తెలుగుతల్లికి అంకితమిస్తా కర్పూరమువెలిగించి కళకళలాడించి తెలుగుతల్లికి హారతినిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఈవేళ ఎందుకో? పూలు వికసించటంలా పరిమళాలు వెదజల్లటంలా జాబిల్లి కనబడటంలా వెన్నెల కురియటంలా గళము విప్పుకోవటంలా గీతము వెలువడటంలా పలుకులు బయటకురావటంలా తేనెచుక్కలు చిందటంలా అడుగులు పడటంలా నడక సాగటంలా అక్షరాలు అందటంలా పదాలు పారటంలా ఊహలు తట్టటంలా భావాలు పుట్టటంలా కలము కదలటంలా కవితలు కూడటంలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితావిందుకు స్వాగతం   భావము పుడితే కవితను కూర్చేస్తా కిటుకు దొరికితే కైతను అల్లేస్తా మాట మురిపిస్తే కయితను రాసేస్తా ఊహ ఊరిస్తే కాగితంపై గీసేస్తా విషయం వెంటబడితే కలమును పరుగెత్తిస్తా అందము అలరిస్తే కవితగామార్చి కుతూహలపరుస్తా విరులు వేడుకచేస్తే పుష్పసౌరభాలను పుటలకెక్కిస్తా సందర్భం స్ఫురిస్తే చక్కనికైతను చెక్కేస్తా ప్రకృతి పరవశపరిస్తే భావకవితను బరబరాబయటపెడతా ఆకలయితే సుష్ఠుగాతినమని కవితాభోజనమును వడ్డిస్తా కవుల వంటలకు వందనం కవితల విందుకు స్వాగతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ నవకవీ! పరిమళములేని పువ్వు పూజకనర్హము ప్రమోదమివ్వని కైత పఠనకనర్హము గమ్యంలేని పయనం నిరర్ధకము అర్ధం లేనికవిత నిష్ప్రయోజనము ప్రేరణలేని లేమ వర్జనీయము మదిని తట్టనికవిత రసహీనము సుఖం లేనిజీవితము అవాంఛనీయము పోలికలులేని కవనము అనాకర్షితము వెలుగులేని బాట విసర్జనీయము మెరుపులులేని కైత తిరస్కరణీయము పువ్వులులేని మొక్క అందవిహీనము సందేశములేని కయిత శుద్ధవ్యర్ధము తీపిలేని పలుకులు నిస్సారము లయలేని కవితలు అశ్రావ్యము ఉప్పులేని కూర చప్పన చమక్ లేనికవిత దండగ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చిన్ననాటి ఙ్ఞాపకాలు నిన్న మావూరెళ్ళా పాతరోజులు తలచుకున్నా కొన్నిరహస్యాలను పొట్లాంలోకట్టివేశా కొన్నిఙ్ఞాపకాలను మదిలోదాచిపెట్టా రహస్యాలు వెంటబడుతున్నాయి ఙ్ఞాపకాలు తరుముకొస్తున్నాయి పొట్లాం విప్పాలని ఉంది దాపరికాలు చెప్పాలని ఉంది మారుమూల పల్లెలోపుట్టా కడుపేద కుటుంబంలోపెరిగా పూరింట్లో జనించా పేదింట్లో వసించా గుడ్డ ఉయ్యాలలో ఊగా తల్లి ఉగ్గుపాలతో మాటలునేర్చా అక్కచెల్లెల్లతో అనురాగాలు పంచుకున్నా అన్నదమ్ములుమిత్రులతో ఆట్లాడి ఆనందించా బడికి నడిచివెళ్ళా బాగా చదువుకున్నా ఇంటిచుట్టూ మొక్కలునాటా పుష్పాలు పూయించా చింతచెట్టు ఎక్కా లేతచిగుర్లు కోశా కందిచేలలోకి వెళ్ళా కాయలనుతెచ్చి వండుకొనితిన్నా జొన్నచేలలోకి పోయా పాలకంకులను తిన్నా చెరువులో మునిగా ఏటిలో ఈదా పొలాల్లో తిరిగా పశువులను కాచా కావిడి మోసా చెట్లను ఎక్కా వరలక్ష్మిని వివాహమాడా ఉన్నతోద్యోగాన్ని సంపాదించా మేడలు కట్టా మిద్దెల్లో నివసించా సుసంతానాన్ని కన్నా వృద్ధిలోనికి తెచ్చా పేరుప్రఖ్యాతులు పొందా సన్మానసత్కారాలు అందుకున్నా పూరింటిని మరువలేకున్నా ఙ్ఞాపకాలను వీడలేకున్నా పూరిల్లే నాజన్మస్థానము పేదవాళ్ళే నాబంధుజనము పల్లెలను ప్రేమించుదాం పేదలను ప్రగ...
Image
 కవిహృదయం కవిహృదయం విప్పాలని ఉంది కవులస్వభావం తెలపాలని ఉంది మనసు తెరవాలని ఉంది ముందు పెట్టాలని ఉంది ప్రేమ చాటాలని ఉంది పొద్దు గడపాలని ఉంది మాటలు చెప్పాలని ఉంది ముచ్చట పరచాలని ఉంది అందాలు చూపాలనిఉంది ఆనందాలు కలిగించాలని ఉంది కోరిక తీర్చాలని ఉంది కుషీ పరచాలని ఉంది సరసాలు ఆడాలని ఉంది సరదాలు చేయాలనిఉంది అక్షరాలు అల్లాలని ఉంది పదములు పేర్చాలని ఉంది కవిత వ్రాయాలని ఉంది కమ్మగ చదివించాలని ఉంది కవులను తలవండి కవిహృదయాలను ఎరగండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనం సాగిస్తా! కవితలు పారిస్తా! మెదడుకు మత్తెక్కించి ఆలోచనలను అరికట్టకు కళ్ళముందు కదలాడుతున్న కాగితాలను కాజేయకు తోడుగానీడగా నిలచిన కలమును కొట్టేయకు చేతులను బంధించి కవనమును నిరోధించకు గొంతును నొక్కిపట్టి కవితాగానమునకు అడ్డుపడకు రక్తమును గడ్డకట్టించి కవితాప్రవాహమును నిలిపివేయకు గుండెచప్పుళ్ళను నిలువరించి కవితాపఠనమును నివారించకు కొట్టుతిట్టు కేకలువెయ్యి కవితావిష్కరణలను కట్టడిచేయకు కవితకోసం కాచుకుంటా పాఠకులకోసం ప్రయాసపడతా కవితలే నా ఆహరం కవనమే నా బలం కవనక్రియను ఆటంకపరచకు కవితాప్రియులను నిరాశపరచకు కవనం సాగిస్తా కవితలు పారిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగంటె నాకిష్టము బాషలందు మేటైన తెలుగుబాష నాకిష్టము తేనెకంటె తియ్యనైన తెనుగుబాష నాకిష్టము జాబిలికంటె చక్కనైన తెలుంగు నాకిష్టము నీటికంటె చల్లనైన ఆంధ్రా నాకిష్టము వెన్నెలకంటె మిన్నయిన అచ్చతెలుగు నాకిష్టము రవికంటె ప్రకాశమైన తేటతెలుగు నాకిష్టము యతిప్రాసలున్న తెలుగుపద్యము నాకిష్టము కమ్మనైన  తెలుగువచనకైతలు నాకిష్టము పోతన భాగవతము నాకిష్టము శ్రీనాధుని శృంగారకావ్యము నాకిష్టము సుమతి సూక్తులు నాకిష్టము వేమన ఆటవెలదులు నాకిష్టము క్రిష్ణశాస్త్రి భావకవితలు నాకిష్టము సినారె సినిమాపాటలు నాకిష్టము శ్రీశ్రీ పదప్రయోగాలు నాకిష్టము త్రిశ్రీ కోరినకవితాలక్షణాలు నాకిష్టము తిలక్ కవితామృతజల్లులు నా కిష్టము సిరివెన్నెల చిత్రగీతాలు నాకిష్తము తెలుగునేలల పండు పంటలు నాకిష్టము తెలుగుపలుకులు చిందు తోటితెలుగొళ్ళు నాకిష్టము తెలుగుతోటలలో పూచు తెలుగుపూలు నాకిష్టము తెనుగుపువ్వులు చిందు తెనుగుసౌరభాలు నాకిష్టము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 శ్రావణశోభలు శ్రావణమాసము ఊరూర మారుమ్రోగుతుంది రమాదేవిపాటలు వీనులకు విందునిస్తున్నాయి శ్రావణశోభలు కనబడుతున్నాయి చైతన్యమును కలిగిస్తున్నాయి శ్రావణమేఘాలు తేలుతున్నాయి చిరుజల్లులను చల్లుతున్నాయి శ్రీలక్ష్మీపూజలు చాలాచోట్లజరుపుతున్నారు సుహాసినీలు శ్రద్ధగాపాల్గొంటున్నారు వరలక్ష్మిని కొలుస్తున్నారు వరాలను కోరుకుంటున్నారు పసుపుకుంకుమలు పంచుతున్నారు చీరెరవికలు ఇచ్హిపుచ్చుకుంటున్నారు వివాహాలు జరుగుతున్నాయి విందులు పసందుగొలుపుతున్నాయి మంగళవారాలు గౌరీపూజలు చేస్తున్నారు శుక్రవారాలు లక్ష్మీపూజలు చేస్తున్నారు వరలక్ష్మీ వ్రతమును గుడిలో చేస్తున్నాము ముత్తయిదవులను స్వాగతిస్తున్నాము   రండి పాల్గొనండి లక్ష్మీదేవికృపకు పాత్రులుకండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా కుముదిని కుముదిని కులుకుతుంది ఉలుకుతుంది పలుకుతుంది కుముదిని ఆడుతుంది పాడుతుంది అలరిస్తుంది కుముదిని రసమయి రూపవతి రాగమయి కుముదిని రమ్మంటుంది రంజింపజేయమంటుంది రసఙ్ఞతచాటమంటుంది కుముదిని కళకళలాడుతుంది పకపకానవ్వుతుంది చకచకారమ్మంటుంది కుమిదిని ఊయలూపుతుంది ఊరించుచున్నది ఉత్సాహపరుస్తుంది కుముదిని పట్టుకోమంటుంది చేతిలోకితీసుకోమంటుంది పరవశపరచమంటుంది కుమిదిని కవ్విస్తుంది కలముపట్టిస్తుంది కవితవ్రాయిస్తుంది కుముదిని వదలను మరువను తరుమను కుముదిని నాప్రాణము నామానము నాజీవితము కుముదిని జీవితంలోకి ఆహ్వానిస్తా కౌముదిని ఆకాశంలోకి స్వాగతిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తూకాలు మాటలను తూకమేసి వెలకట్టాలి మనుషులను తూకమేసి మసలుకోవాలి వరుడు వధువును తూకమేసిపెళ్ళిచేసుకుంటాడు వధువు వరుని తూకమేసివివాహమాడుతుంది  సరుకులను కేజీల్లో తూస్తారు ద్రవమును లీటర్లలో తూస్తారు బంగారాన్ని గురివిందెలతో తూస్తారు రత్నాలను కారట్లలో తూస్తారు న్యాయమూర్తులు తూకమేసి తీర్పులివ్వాలి అధికారులు తూకమేసి చట్టమమలుపరచాలి లాభనష్టాలు తూకమేసి బేరీజువేసుకోవాలి మంచిచెడులు తూకమేసి నిర్ణయాలుతీసుకోవాలి  జవాబుపత్రాలు తూకమేసి మార్కులివ్వాలి ప్రతినిధులను తూకమేసి ఎన్నుకోవాలి కర్మలను దేవుడు తూకమేస్తాడు పాపపుణ్యాలను చిత్రగుప్తుడు తూకమేస్తాడు అమ్మేవాళ్ళు తక్కువతూకం వెయ్యాలనుకుంటారు కొనేవాళ్ళు ఎక్కువతూకం కావాలనుకుంటారు అక్షరాలు తూకమేసి వాడాలి పదములు తూకమేసి ప్రయోగించాలి కవితలు  చదివి తూకమేయాలి కవులను పోల్చుకొని తూకమెయ్యాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎందుకో ఏమో? వేడి తగిలితేగాని వెన్న కరగదు కోర్కె కలిగితేగాని మనసు చలించదు నీటిలో దిగితేగాని లోతు తెలియదు అందము చూస్తేగాని ఆనందము కలగదు విరి విచ్చుకుంటేగాని పరిమళము వెలువడదు కడుపు నిండితేగాని కుదురు మాటలురావు మాటలు కలిస్తేగాని బంధము ఏర్పడదు పెదవులు విప్పితేగాని పలుకులు బయటికిరావు తీపి తగిలితేగాని నోరు ఊరదు బరువులు మోస్తేగాని భారము తెలియదు కష్టము చేస్తేగాని ఫలితం లభించదు శ్రమ పడితేగాని లక్ష్యాలను ఛేదించలేరు చేతులు కలిపితేగాని చప్పట్లు వినబడవు మనసులు ఏకమైతేగాని ముచ్చట్లు సాగవు వసంతమాసము వస్తేగాని కోకిలలు గళమునువిప్పవు వేడిగాలులు వీస్తేగాని మల్లియలు మొగ్గలేయవు పెళ్ళి చేసుకుంటేగాని బంధాలవిలువ తెలియదు మంచికవితలు వ్రాస్తేగాని కవులకు పేరుప్రఖ్యాతులురావు ఊహలు పుడితేగాని కవితలు జనించవు పాఠకులు ప్రశంసిస్తేగాని కవులు తృప్తిచెందరు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ ఊహా! (మనసుకుమేత) మెరుపులా మదినితట్టరాదా తారలా తళుకులాడరాదా సీతాకోకలా కనిపించరాదా చిలుకలా పలికించరాదా ఉయ్యాల్లా ఊపరాదా కెరటాల్లా ఎగిసిపడరాదా తేనెటీగల్లా తుట్టెనుకట్టరాదా తూనీగల్లా గుంపుగారారాదా కోకిలలా కూయరాదా రాయంసలా నడుపరాదా గాలిలా ప్రసరించరాదా నీరులా ప్రవహించరాదా మల్లెలా పూయరాదా పరిమళంలా వ్యాపించరాదా చిగురాకులా తొడగరాదా మొక్కలా మొలకెత్తరాదా వెన్నెలలా వేడుకపరచరాదా అరుణబింబంలా ఉదయించరాదా తేనెలా తోచరాదా కవితలా ఫుటకెక్కరాదా పాఠకులను పరవశపరుస్తా విమర్శకులను విస్మయపరుస్తా గమ్యమును చేరుకుంటా ఙ్ఞాపకాలను నెమరేసుకుంటా ఊహలను స్వాగతించుతా మనసుకు మేతనుపెడతా చమక్కుచూపి ముగించుతా గమ్మత్తుచేసి గడియవేసుకుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రేమలు ప్రేమ ఒక లోకం పిలుస్తుంది ప్రేరేపిస్తుంది ప్రేమ ఒక బంధం కట్టేస్తుంది కలిపేస్తుంది ప్రేమ ఒక పిచ్చి దించుతుంది ముంచుతుంది ప్రేమ ఒక మత్తు ఆలోచించనీయదు విరమించనీయదు ప్రేమ ఒక నది దిగమంటుంది దాటమంటుంది ప్రేమ ఒక రోగం మందులకుతగ్గదు మాటలకులొంగదు ప్రేమ ఒక భోగం ఊరిస్తుంది ఉబికిస్తుంది ప్రేమ ఒక స్వప్నం తలపుకొస్తుంది తంటాలుపెడుతుంది ప్రేమ ఒక నాటకం పాత్రనిస్తుంది పోషించమంటుంది ఎవరైనా ఎప్పుడైనా ప్రేమకు దాసులే పొందుకు ప్రియులే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 (అక్షర)గారడీలు ఆమె కళ్ళు లాగేస్తున్నాయి చూపులు పట్టేస్తున్నాయి మాటలు కట్టేస్తున్నాయి నవ్వులు ఆటపట్టిస్తున్నాయి పువ్వులు పొంకాలు చూపుతున్నాయి పరిమళాలు చల్లుతున్నాయి పరికించమంటున్నాయి పులకరించమంటున్నాయి పసిపాపలు ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు ముద్దులొలుకుతున్నారు మయినిమరిపిస్తున్నారు ఆకాశం వెన్నెల చల్లుతుంది మబ్బులు చూపుతుంది చినుకులు కురిపిస్తుంది మదులను దోసేస్తుంది ఊహలు గాలిలా వ్యాపిస్తున్నాయి నీరులా ప్రవహిస్తున్నాయి కాంతిలా వెలిగిపోతున్నాయి అగ్గిలా రాజుకుంటున్నాయి రాత్రి కలలు వస్తున్నాయి కవ్వించి పోతున్నాయి కోర్కెలు లేపుతున్నాయి కవనానికి కదలమంటున్నాయి కవిత కలము పట్టమంటుంది కాగితము తీసుకోమంటుంది క్షరరహితాలను పేర్చమంటుంది కమ్మదనాలను పంచమంటుంది మాటలు మీటుతున్నాయి మదినితడుతున్నాయి మరిపిస్తున్నాయి మురిపిస్తున్నాయి కవితలు కూర్చమంటున్నాయి కులాసపరచమంటున్నాయి గారడీలుచెయ్యమంటున్నాయి గమ్మత్తులుచూపమంటున్నాయి గారడీలు మాయచేస్తున్నాయి ముగ్ధులనుచేస్తున్నాయి నమ్మిస్తున్నాయి నాటకాలాడిస్తున్నాయి గారడీలు బురిడీలు కొట్టిస్తున్నాయి ఇంద్రజాలాలు విస్మయము కలిగిస్తున్నాయి కైతలు భ్రమలు కొలుపుతున్నాయి ...
Image
 నాలోకాలు ఊహలలోకం ఊరిస్తుంది ఉల్లమును ఊపేస్తుంది ప్రేమలోకం రమ్మంటుంది బాంధవ్యాలలో బంధిస్తుంది పుష్పలోకం ప్రవేశించమంటుంది పరిమళసౌందర్యాలను పుటలకెక్కించమంటుంది అందాలలోకం ఆహ్వానిస్తుంది అద్భుతకవితలను ఆవిష్కరించమంటుంది ఆనందలోకం అలరిస్తుంది అపూర్వకైతలను అల్లమంటుంది వింతలోకం విహరించమంటుంది విశిష్టకవనాలను వెలువరించమంటుంది కొత్తలోకం కాలుపెట్టమంటుంది నూతనరచనలకు నాందిపలుకమంటుంది పాఠకలోకం పిలుస్తుంది మంచికయితలతో మనసులుముట్టమంటుంది సాహిత్యలోకం సందర్శించమంటుంది సుకవితలతో సుభిక్షంచేయమంటుంది వివిధలోకాలకు వెళ్ళొస్తా రమ్యకవితలను రాసేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా ముద్దుగుమ్మ ఆమె కళ్ళల్లో కాపురముంటా కన్నీరును కార్చనీయకుంటా ఆమె నుదుటపై బొట్టులాగుంటా తారకలా తళతళలాడిస్తుంటా ఆమె బుగ్గలపై నవ్వునవుతా జాబిలిలా వెన్నెలనుచల్లుతుంటా ఆమె కేశములపై గాలినవుతా ముంగురలను రెపరెపలాడిస్తుంటా ఆమె కొప్పులో పువ్వునవుతా పరిమళాలను వెదజల్లుతుంటా ఆమె అధరాలపై తేనెచుక్కలనవుతా మాధుర్యాన్ని ఆస్వాదింపజేస్తా ఆమె తనువుపై బంగరుపూతనవుతా వన్నెచిన్నెలనై వెలిగిపోతుంటా ఆమె చూపుల్లో ప్రేమలానిలుస్తా విడిచి వెళ్ళనీయకుంటా ఆమెయే నేననుకుంటా ఆమెనే సర్వమనుకుంటా ఆమెకోసమే తపిస్తా ఆమెకోసమే జీవిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నాగృహము భూమాతను పూజించా ఖాళీస్థలమును పుచ్చుకున్నా మేఘాలను తీసుకొచ్చా రాళ్ళగాపేర్చా గోడలుకట్టా నింగిని పట్టుకొచ్చా కప్పుగాకప్పా ఇంటినిచేశా వెన్నెలను వెంటతెచ్చా ఇంటిలోనిలిపా వెలుగులుచిమ్మించా తారకలను ఏరుకొచ్చా గృహమందు వ్రేలాడతీశా తోటలోకి వెళ్ళా పూలనుతెచ్చా ఇంటిలోపరచా అడవికి పోయా మొక్కలనుమోసకొచ్చా ఇంటిచుట్టూనాటా హిమగిరులని సందర్శించా గంగనుతెచ్చా గృహములోనిర్బంధించా స్వర్గానికి యాత్రకెళ్ళా అప్సరసనుతోడుతెచ్చుకున్నా ఇంటిలోపెళ్ళాడా ఇంటిని అలంకరించా ఇల్లాలితో కాపురంపెట్టా ఊహలపల్లకిని అధిరోహించా పన్నీటిచుక్కలను కాగితాలపైచల్లా ఆలోచనలను వ్యక్తీకరించా భావాలను పుటలకెక్కించా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేనడిగినప్రశ్నలు నేపొందినసమాధానాలు ఊహనడిగా నీ ఉద్దేశ్యమేమిటని తలలోదూరి ప్రవహించి  మెదడుకి పనిపెట్టేదానినన్నది శ్వాసనడిగా నీ సంగతేమిటని గాలిని గుండెలోకితీసుకొని దేహములో ప్రాణాన్నినిలిపేదానినన్నది చూపునడిగా నీ పనేమిటని దృశ్యాలను చూపించి మనసును మురిపించేదానినన్నది మాటనడిగా నీ పొగరేమిటని మదిలోని భావాలను తెలియపరచే సాధనాన్నన్నది చేతినడిగా నీ కార్యమేమిటని ఉల్లాన్ని ఉత్సాహపరచి కాయానికి సుఖాలనందించేదానినన్నది పాదాన్నడిగా నీ పాత్రేమిటని దారిన నడిపించి గమ్యాలను చేర్పించేదానినన్నది వినికిడినడిగా నీ సాయమేమిటని శబ్దాలు వినిపించి హెచ్చరికలు జారీచేసేదానినన్నది స్పర్శనడిగా నీ బాధ్యతేమిటని అనుభూతులు కలిగించి ఆనందడోలికల్లో తేల్చేదానినన్నది రక్తాన్నడిగా నీ ఘనతేమిటని మేనుకి శక్తినిచ్చి అంగాలను పనిచేయించేదానినన్నది మనసునడిగా నీ సంబరమేమిటని శరీరానికి పాలకుడనని జీవాన్ని కాపాడేదానినన్నది స్పందించి మీరూ అడుగుతారా సమాధానాలను మీరూ రాబడతారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం