Posts

Showing posts from November, 2024
Image
 పెళ్ళాం కళత్రం నాకు ప్రాణం చక్కగా చూచుకుంటా పెళ్ళాం నాకు దీపం ఇంటిని వెలిగించమంటా పెండ్లాం నాకు బెల్లం కడుపులో దాచుకుంటా భార్య నాకు యుగళం విడువక ప్రక్కనుంచుకుంటా అర్ధాంగి నాకు అందం ఆనందం పంచుకుంటా ధర్మపత్ని నాకు బంధం చిరకాలం నిలుపుకుంటా పత్ని నాకు అర్ధదేహం నాతో సమానంగాచూస్తా సతి నాకు మంత్రణం సలహాలు తీసుకుంటా ఆలి నాకు అమృతం సంతోషంగా స్వీకరిస్తా దార నాకు కాలక్షేపం ఎక్కువసమయం గడుపుతా కళ్ళాలు నాకు గౌరవప్రదాయం గర్వంగా తలనెత్తుకొనితిరుగుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  (నిన్న ఒక అభిమాని పెళ్ళాం గురించి కవిత వ్రాయమని కోరారు. సరేనని ఒప్పుకున్నా. దాని పర్యావసానమే నేటి నా కవిత.)
Image
 ఎలా చెప్పను? (కవిగారి హృదయస్పందనలు) ఎన్ని చెట్లు పూచాయో ఎన్ని పూలు రాలాయో ఎన్ని సుకుమారాలు నలిగాయో ఎన్ని గర్భాలు ఫలించాయో ఎన్ని శిశువులు జన్మించారో ఎన్ని మరణాలు సంభవించాయో ఎన్ని పుష్పాలు తెంచబడ్డాయో ఎన్ని సుమాలు కట్టబడ్డాయో ఎన్ని కుసుమాలు గుచ్చబడ్డాయో ఎన్ని దేహాలు చెమటోడ్చాయో ఎన్ని గుండెలు ఆగిపోయాయో ఎన్ని హృదయాలు పగిలిపోయాయో ఎన్ని పూరేకులు రాలాయో ఎన్ని చేతులు తెంచాయో ఎన్ని కాళ్ళు త్రొక్కాయో ఎన్ని అంగాలు తెగాయో ఎన్ని కళ్ళు మూతబడ్డాయో ఎన్ని కాళ్ళు చతికలబడ్డాయో సత్యాలు దాచలేను అబద్ధాలు చెప్పలేను బాధను భరించలేను బాధలు వర్ణనాతీతము నిజాలు నిష్ఠూరము భావాలు దాచటమసాధ్యము ఏమి చేయను ఎలా చెప్పను ఎలా వ్రాయను ఎలా ఆలోచించను ఎలా స్పందించను ఎలా మౌనందాల్చను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నా తెలుగు తియ్యనైనది నా తెలుగుభాష తేటయైనది నా తెలుగుభాష తేనెలుచిందేది నా తెలుగుభాష తెల్లారివెలుగు నా తెలుగుభాష               ||తియ్య| అకారాంతమైనది నా తెలుగుభాష అనేకాక్షరాలున్నది నా తెలుగుభాష అమృతంలాంటిది నా తెలుగుభాష అమ్మలాబహుగొప్పది నా తెలుగుభాష ఉగ్గుపాలతో వచ్చింది  నా తెలుగుభాష ఉయ్యాలూపులలో నేర్చింది నా తెలుగుభాష గానానికి యోగ్యమైనది నా తెలుగుభాష శ్రావ్యతకి పేరొందినది నా తెలుగుభాష          ||తియ్య|| నన్నయ్య గ్రాంధీకరించింది నా తెలుగుభాష పోతన్న సొబగులుదిద్దింది నా తెలుగుభాష గురజాడచేతిలో వ్యావహారికమైనది నా తెలుగుభాష కందుకూరికలంతో నవలగావతరించింది నా తెలుగుభాష విశ్వనాధచే విఖ్యాతిపొందినది నా తెలుగుభాష శ్రీశ్రీచేత మార్పులుసంతరించుకుంది నా  తెలుగుభాష దాశరధిద్వారా దేదీప్యమానమైనది నా తెలుగుభాష సినారెచేతిలో పరిపక్వమైనది నా తెలుగుభాష      ||తియ్య|| త్యాగయ్యకృతులతో శ్రావ్యమైనది నా తెలుగుభాష అన్నమయ్యకీర్తనలతో శ్రేష్ఠమైనది నా తెలుగుభాష రామదాసుపాటలతో రమ్యనైనది నా తెలుగుభాష ఘంటసాలగళంతో ఘనమైనది నా తెలుగుభాష ...
 నీవొకటంటే నేపదంటా తిరిగే కాళ్ళు తిట్టే నోర్లు ఊరకుంటాయా నీవు ఒకటంటే నేను పదంటా లెక్కబెడతావా రాసే కలాలు పాడే గళాలు గమ్ముగుంటాయా పారే నదులు ఊరే జలాలు నిలిచిపోతాయా వీచే గాలులు ఊగే కొమ్మలు ఆగిపోతాయా తేలే మేఘాలు కారే చినుకులు వద్దంటేవింటాయా మొరిగే కుక్కలు ఊళలేసే నక్కలు వలదంటేఊరుకుంటాయా పుష్పాల పొంకాలు సుమాల సౌరభాలు ఆస్వాదించకుండతరమా సూర్యుని కిరణాలు చంద్రుని కళలు మట్టుబెట్టగలమా తారల తళుకులు దీపాల వెలుగులు నిరోధించగలమా మోముల నవ్వులు కన్నుల కాంతులు కనకతలలుతిప్పగలమా మది తలపులు హృది ఉల్లాసాలు కట్టడిచేయగలమా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుసుకో పడ్డవాళ్ళు అందరు చెడ్డవాళ్ళుకాదని తెలుసుకో మాటల ఈటెలు విసరటం  ఏమాత్రము సబబుకాదని తెలుసుకో బట్టను కాల్చి పైన వేయకూడదని తెలుసుకో పరులపై మకిలిని చల్లి అంటించరాదని తెలుసుకో పరులవిషయాల్లో జోక్యము చేసుకోకూడదని తెలుసుకో అనవసరంగా శతృత్వం  తెచ్చుకోకూడదని తెలుసుకో నీటిలా ధనమును ఖర్చుబెట్టకూడదని తెలుసుకో భవిష్యత్తులో అవసరాలకు ఇబ్బందులు రావచ్చని తెలుసుకో ఇచ్చిన మాటను నిలుపుకోవాలని తెలుసుకో అపనమ్మకస్థుడుగా ముద్రను వేసుకోకూడదని తెలుసుకో నోరు తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకో జారిన మాటలను వెనక్కు తీసుకోలేమని తెలుసుకో గొప్పవాడినని గర్వించకు పొగడ్తలకు పొంగిపోకూడదని తెలుసుకో భట్రాజులను గుర్తించి దూరంగా పెట్టటం తెలుసుకో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిదని తెలుసుకో తొందరపడి వ్యవహరించకు లేకపోతే బురదలో కూరుకుపోవచ్చని తెలుసుకో ఎదుటివారి తప్పులను ఎన్నటము సరయిన పద్ధతికాదని తెలుసుకో నువ్వు ఒప్పుగా మసలుకోవటము అత్యంత ముఖ్యమని తెలుసుకో సూచనలు ఇవ్వటము తేలికయిన విషయమని తెలుసుకో ఆచరణలో పెట్టటము కష్టమైన వ్యవహారమని తెలుసుకో వేమనలాగ హితాలు నేను చెప్పటంలేదని తెలుసుకో బద్దెనలాగ సూక్తులు నే...
Image
 ఓ మనసా! చీకట్లో ఉండేవు తలపుల్లో ముంచేవు మరుగుల మాటునీవు తపనల చోటునీవు               ||చీకటిలో|| కనపడక దాగేవు ఉనికిని చాటేవు ఆఙ్ఞలు ఇచ్చేవు అమలును పరిచేవు పనులను చేయించేవు చైతన్యమును చూపెంచేవు ప్రాణమును నిలబెట్టేవు జీవనమును గడిపించేవు          ||చీకటిలో|| ఉన్నవి వదిలేసేవు లేనివి కోరుకొనేవు చేసేది చెప్పకుండేవు చెప్పింది చేయకుండేవు సుఖమును ఆశించేవు సూక్తులను వల్లెవేసేవు మంచితనము చూపించేవు మాలిన్యము దాచిపెట్టేవు         ||చీకటిలో|| కంటితో వీక్షించేవు కన్నవాటిని కాంక్షించేవు కర్ణాలతో ఆలకించేవు శ్రావ్యతని క్రోలుకునేవు శ్వాసను తీసుకునేవు సుగంధాలను కోరేవు నోటితో ఆరగించేవు రుచులను ఆశించేవు             ||చీకటిలో|| మోవులను బిగించేవు మాట్లాడక మెలిగేవు మర్మాలను దాచేవు మౌనమును దాల్చేవు దేహపెత్తనము సాగించేవు అధికారము చలాయించేవు గొప్పలను పలువురికిచెప్పేవు మెప్పులను వినగనిష్టపడేవు    ||చీకటిలో|| అందాలను చూడగోరేవు ఆనందాలను ఆస్వాదించేవు ప్రేమాభిమానాలు పొందేవుపంచేవు బ...
Image
కవిత్వం కవిత్వం సాహిత్య అభివృద్ధికి ఉత్తమ సాధనం కవిత్వం మానవ అభివ్యక్తికి చరమ స్వరూపం కవిత్వం అనుభూతులు తెలపటానికి సంక్షిప్త రూపం కవిత్వం కవుల తలపులకు ప్రతిబింబం నిలువుటద్దం కవిత్వం క్లుప్తత సున్నితత్వాలకు పర్యాయపదం కవిత్వం మదులను తట్టే మేటి ఉపకరణం కవిత్వం శబ్దాల ప్రయోగానికి తగిన ఆలవాలం కవిత్వం పోలికలతో ఆకట్టుకునే అక్షర నిర్మాణం కవిత్వం విషయాల వెల్లడికి పదాల ప్రయోగం కవిత్వం నైపుణ్య ప్రదర్శనానికి చక్కని నిదర్శనం కవిత్వం పాఠకులను అలరించటానికి సామూహిక పరికరం కవిత్వం పఠనావ్యసనానికి గురిచేసే పదునైన ఆయుధం కవిత్వం వ్రాయటం వర్ణించటం ప్రోత్సహించదగిన వ్యాపకం కవిత్వం అమూల్య పరికరం  సక్రమప్రయోగం ఆవశ్యం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనోత్సాహం పెదవులు కదలటంలేదు పలుకులు పెగలడంలేదు కన్నులు తెరుచుకోవటంలేదు దృశ్యాలు కనుబడటంలేదు చెవులు వినటంలేదు శ్రావ్యత దొరకటంలేదు కలము వ్రాయటంలేదు పుటలు నిండటంలేదు అందాలు అగుపించుటంలేదు ఆనందాలు కలిగించటంలేదు విరులు వికసించటంలేదు సువాసనలు వెదజల్లటంలేదు కానీ ఆలోచనలు ప్రవహిస్తున్నాయి విషయాలు వెంటబడుతున్నాయి ఉల్లము ఉబలాటపడుతున్నది రాతలు చేబట్టమంటున్నది మానసము పరుగెత్తుతున్నది మాటలను పట్టుకోమంటున్నది కవనోత్సాహం వీడకున్నది కవితాజననం కోరుచున్నది నూతనకవితలు నిత్యమూముందుంచుతా నాణ్యతాప్రమాణాలు సత్యంగానిలబెడతా కయితలను ఆస్వాదించండి కవులను గుర్తుంచుకోండి  ఉండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఓ కెశివారెడ్డి కవివరేణ్యా! సాహితీ జగతిలో సవ్వడీ చేసేవు సరస్వతీ దేవినీ సన్నుతీ చేసేవు             ||సాహితీ|| అక్షరాలను పేర్చి ఆటలూ ఆడించేవు పదాలను కూర్చి పాటలూ పాడించేవు మదులనూ తట్టేవు హృదులలో నిలిచేవు భావాలు చెప్పేవు భ్రమల్లో ముంచేవు           ||సాహితీ|| కలమును పట్టేవు పుటలను నింపేవు కైతలను కూర్చేవు కమ్మదనమునిచ్చేవు వైవిద్య విషయాలు వివరంగ చెప్పేవు నూతన ఒరవడులు నిత్యమూ చూపేవు           ||సాహితీ|| కవన సేద్యమూ కొనసాగించేవు కవితల పంటలూ కుమ్మరించేవు రవివోలె కాంతులు ప్రసరణాచేసేవు శశివోలె వెన్నెలను పుడమిపైచల్లేవు              ||సాహితీ||            కయితా సుమాలను పూయించేవు కవన సౌరభాలను వెదజల్లేవు అమృతాజల్లులును కురిపించేవు అధరాలకు తేనెచుక్కలనందించేవు          ||సాహితీ|| గాంధర్వగానమును వినిపించేవు కర్ణాలకింపుసొంపులను కలిగించేవు తెలుగుతల్లికీ వందనాలు చేసేవు తెలుగుజాతికీ పేరుప్రఖ్యాతులు తెచ్చేవు    ...
Image
గీతాలాపనలు ప్రణయగీతం ఆలపించనా ప్రబోధగీతం వినిపించనా విప్లవగీతం ఆకర్ణించనా విరహగీతం వీనులకందించనా                   ||ప్రణయ|| జోలపాటపాడి జోకొట్టనా లాలిపాటపాడి లాలించనా భక్తిగీతంపాడి  పరవశపరచనా భావగీతంపాడి భ్రమింపజేయనా                  ||ప్రణయ||  అందాలగీతం పాడనా ఆనందగీతం అందించనా జానపదాలు వల్లెవేయనా పౌరాణికాలు ప్రవచించనా                            ||ప్రణయ||  మనసుపాటలుపాడి ముచ్చటపరచనా సొగసుపాటలుపాడి సంతృప్తిపరచనా పెళ్ళిపాటలుపాడి ప్రోత్సాహపరచనా పూలపాటలుపాడి పరిమళాలుచల్లనా           ||ప్రణయ||  తెలుగుపాటలుపాడి తృప్తినికలిగించనా తేనెపాటలుపాడి తీపినిక్రోలుకోమందునా పాతపాటలుపాడి పాతఙ్ఞాపకాలుతట్టనా కొత్తపాటలుపాడి కొంగొత్తరుచులుచేర్చనా       ||ప్రణయ||  పిల్లలపాటలుపాడి ప్రమోదపరచనా పెద్దలపాటలుపాడి సుద్దులుతెలపనా హాస్యపాటలుపాడి నవ్వులుచిందించనా శృంగారపాటలుపాడి వలపుక...
Image
 తెలుగుతల్లికి ప్రణామాలు  తీయతీయని మాటలతో తేనెచుక్కలు చిందుతూ మనతెలుగుతల్లినీ స్తుతించెదమా                ||తీయ|| తేటతేటైన పలుకులతో నిర్మలమైన హృదయంతో మనతెలుగుతల్లినీ ప్రార్ధించెదమా అమృతమొలికే అక్షరాలతో మనతెలుగుతల్లినీ ఘటియించెదమా             ||తీయ|| ధగధగలాడే తళుకులతో మనతెలుగుతల్లినీ వెలిగించెదమా ఘుమఘుమలాడే మల్లెమాలలతో మనతెలుగుతల్లినీ అలంకరించెదమా            ||తీయ|| గళమునెత్తి గట్టిగా ఘనకీర్తిని చాటుతూ మనతెలుగుతల్లినీ కొనియాడెదమా చెయ్యెత్తి నినదిస్తూ దశదిశల వినిపిస్తూ మనతెలుగుతల్లికీ జైకొట్టెదమా               ||తీయ|| రెండుచేతులు జోడిస్తూ భక్తివినయాలతో పూజిస్తూ మనతెలుగుతల్లికీ నమస్కరించెదమా కర్పూరమును వెలిగిస్తూ గుప్పుగుప్పుమని మండిస్తూ మనతెలుగుతల్లికీ హారతినిచ్చెదమా        ||తీయ||    కన్నతల్లికీ సమానముగా మనతెలుగుతల్లికీ ప్రణమిల్లెదమా అన్ని దేశాలందునా అతిలెస్సయిన భాషనీ మనతెలుగుతల్లినీ కీర్తించెదమా  ...
Image
 ఓ కవిరాజా! ముందునడువు  సమాజాన్ని ముందుకునడిపించు అడ్డదారులు తొక్కొద్దను అవాంతరాలు కలిపించొద్దను గమ్యమువైపు నడవమను లక్ష్యాలను సాధించమను చెప్పు మంచిమాటలు చెప్పు నిజాలు చెప్పు నీతిగ బ్రతకమను వైషమ్యాలు పెంచొద్దను విషబీజాలు నాటొద్దను చెయ్యి పరోపకారాలు చెయ్యి ప్రేమాభిమానాలు చాటు మానవత్వము తెలుపు సక్రమమార్గము చూపు సమాజహితము కోరు పెంచు చెట్లనుపెంచమను పరిసరాలనుకాపాడమను పచ్చదనము పరికించమను ప్రకృతిని ప్రేమించమను పువ్వులుపూయించు పొంకాలుచూపించు పరిమళాలువీయించు పరవశాలనందించు  చూపు అందాలు చూపు ఆనందాలు పంచు కాంతులు ప్రసరించు మోములు వెలిగించు నవ్వులు చిందించు సాధించు విజయాన్ని సాధించు దేశాన్ని ప్రేమించు జాతిని మేలుకొలుపు పేరుప్రఖ్యాతులు పొందు చరిత్రను సృష్టించు వ్రాయి చక్కగా వ్రాయి అందరిని చదివించు అంతరంగాలను తట్టు శాశ్వతముద్రను వెయ్యి చిరంజీవిగ నిలువు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నా మనసు మనసు నిండా మునిగింది అక్షరాల వర్షంలో పదాల ప్రవాహంలో మనసు ఆలోచనల్లో తేలుతుంది ఆకాశంలో మేఘాల్లా కాలవలలో పడవల్లా మనసు మంటల్లో కాలుతుంది పొయ్యిలో కట్టెల్లా కారుచిచ్చులో చెట్లలా మనసు పరుగులు తీస్తుంది చిరుతవెంటబడిన జింకలా శిఖరంనుండిజారే సెలయేరులా మనసు అన్వేషణ చేస్తుంది ఆకలయిన పులిలా గొంతెండిన పక్షిలా మనసు కాచుకొని యున్నది కలమును చేపట్టాలని కాగితము నింపేయాలని మనసు పగటికలలు కంటుంది మంచికవితలు రాయాలని పాఠకులమదులు తట్టాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది రవిలా జగతిలోవెలగాలని కవిలా కలకాలంనిలవాలని మనసు భ్రాంతిలో పడింది భావకైతలు కూర్చాలని భ్రమల్లో ముంచాలని  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎందుకో ఈరోజు? ఆవేశము వస్తుంది ఆవేదన పెడుతుంది మదిని తెరవమంటుంది పుటలపై పెట్టమంటుంది అందాలు చూపమంటుంది ఆనందాలు పంచమంటుంది పువ్వులు చల్లమంటుంది పరిమళాలు వెదజల్లమంటుంది వాన కురిపించమంటుంది నీరు పారించమంటుంది ఆటలు ఆడించమంటుంది పాటలు పాడించమంటుంది వెలుగులు చిమ్మమంటుంది చీకట్లను తరుమమంటుంది ఆలోచనలు పారించాలనిపిస్తుంది భావాలు పుట్టించాలనిపిస్తుంది అక్షరాలు అల్లాలనిపిస్తుంది పదాలు పొసగాలనిపిస్తుంది కలము కదిలించాలనిపిస్తుంది కాగితము నింపాలనిపిస్తుంది మనసు ముందుకుతోస్తుంది ఉల్లము ఉద్రేకపడుతుంది కవితలు జనిస్తున్నాయి కమ్మదనాలు కలిగిస్తున్నాయి పాఠకులను పరవశపరచాలనియున్నది విమర్శకులు విస్మయపరచాలనియున్నది సాహిత్యలోకాన్ని సంబరపరచాలనియున్నది శారదాదేవిని సంతృప్తిపరచాలనియున్నది కైత కూడింది కోర్కె తీరింది తక్షణము చదవండి అభిప్రాయము చెప్పండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆసక్తికరంగా సాగిన 147వ అంతర్జాతీయ అంతర్జాల కాలిఫోర్నియా వీక్షణం సమావేశం నిన్న 16-11-2024వ తేదీ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారి 147వ వీక్షణం అంతర్జాల సమావేశం ఆసక్తికరంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు, కవి, గాయని శ్రీమతి గీతా మాధవి గారు ముఖ్య అతిధి, సహస్ర సినీటీవి గేయాల రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ ను మరియు హాజరయిన కవులకు స్వాగతం పలికారు. తర్వాత శ్రీ మౌనశ్రీ మల్లిక్ సినిమా గేయ రచయితలకు ఉండవలసిన లక్షణాలు మరియు పాటించవలసిన నియమాలను చక్కగా సోదాహరణంగా స్వీయానుభవాలతో వివరించారు. మౌనశ్రీ ప్రసంగం చాలా బాగున్నదని శ్రీమతి గీతా మాధవి, సినీ గేయ రచయిత శ్రీ సాదనాల వేంకటేశ్వరరావు, ప్రముఖ కవి శ్రీ రామాయణం ప్రసాదరావు మరియు వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ స్పందించి మౌనశ్రీ గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిపారు. పిమ్మట శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవిసమ్మేళనం నిర్వహించారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు కుండపోత అనే తన కవితను పాడి వినిపించారు.అవధానం  అమృతవల్లి మనసంటే అనే పాటను,శ్రీ చేకూరి నరసింహారావుగారు ఒక దేశభక్తి గీతాన్ని పాడి వినిపించారు. శ్రీవాకాటి రాంరెడ...
Image
 నైమిశంలో అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక వారి కార్తీక వనభోజనాల వేడుక నిన్న 15-11-2024వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భముగా జిడ్డు క్రిష్ణమూర్తి కేంద్రం నైమిశంలో కాప్రా మల్కాజగిరి కవుల వేదిక కార్తీక వనభోజనాల వేడుకను అద్భుతంగా నిర్వహించింది. మొదట కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అందరికి స్వాగతం పలికారు. వేదిక మార్గదర్శకుడు మరియు సినీటీవి గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు కవుల వేదిక గురించి వివరించి అతిధులకు మరియు ఆహ్వానితులు బాగా స్పందించినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రఖ్యాత మనస్తత్వవేత్త శ్రీ శ్రీక్రిష్ణ గారు మనిషి తనకు తనే మిత్రుడని, తనకు తనే శత్రువని చెబుతూ మనోవికాసానికి తీసుకొనవలసిన పద్ధతులను చక్కగా వివరించారు. ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు తను వివిధ సంస్థలకు ఇచ్చిన మరియు ప్రఖ్యాతి పొందిన వ్యాపార ప్రచార ప్రకటనల గురించి వివరించారు. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి రాధా కుసుమ గారు అంత్యాక్షరి పాటల కార్యక్రమాన్ని చాలా ఉత్సాహభరితంగా నిర్వహించారు.  తెలుగువెలుగు ప్రధాన కార్యదర్శి శ్రీ మోటూరి నారాయణరావు గారు తంబోలా ఆ...
Image
 అమ్మపాట పాడాలని ఉన్నది   కన్నతల్లిని కొనియాడాలని ఉన్నది అమ్మభక్తిని చూపించాలని ఉన్నది విశ్వమంత వినేలా వినువీధికి ఎగిరి మాతృమూర్తి ప్రేమను  మాటల్లో చెప్పాలని ఉన్నది మేఘాలపై కూర్చొని అమ్మపాటను పాడాలని ఉన్నది గాలిలో పక్షిలా ఎగిరి మాతఘనతను తెలపాలని ఉన్నది కన్నతల్లి కాళ్ళుకడిగి తలపై చల్లుకోవాలని ఉన్నది భుజాలపైన ఎత్తుకొని భక్తితో మోయాలని ఉన్నది జగాన్ని మరచి తల్లికి సేవలుచేయాలని ఉన్నది జనయిత్రిని పూజించి జన్మను ధన్యంచేసుకోవాలను ఉన్నది అమ్మ మనసునెరిగి  మసుకోవాలని ఉన్నది అమ్మ కొరికలను తీర్చాలని ఉన్నది తల్లే దేవతని చెప్పాలని ఉన్నది తల్లే గొప్పయని చాటాలని ఉన్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా భావోద్వేగాలు మొక్కలు పెంచుతా పూలు పూయిస్తా  సౌరభాలు చల్లిస్తా తేటులను పిలుస్తా  తేనెను త్రాగమంటా  పరవశము పొందమంటా నోరు తెరుస్తా  పెదాలు కదిలిస్తా  శబ్దాలు వదులుతా  తేనెచుక్కలు చల్లుతా అమృతము చిందిస్తా ఆనందము అందిస్తా ప్రభాకరుని ఉదయించమంటా తట్టి నిద్రలేపుతా అరుణకాంతులు ప్రసరిస్తా అంధకారము తరిమేస్తా పక్షులను కిలకిలలాడిస్తా జగతిని చైతన్యపరుస్తా చంద్రుని స్వాగతిస్తా వెన్నెలను వెదజల్లమంటా తారలమధ్య తిరగమంటా మబ్బులతో దోబూచులాడమంటా మెల్లగాచల్లగాలి తోలమంటా మనసులను మురిపించుతా ఆలోచనలు పారిస్తా భావనలు పుట్టిస్తా అక్షరాలను అల్లుతా పదాలను పేర్చుతా అర్ధాలను స్ఫురిస్తా కమ్మనికైతలు కూరుస్తా అందాలు చూడమంటా ఆనందాలు పొందమంటా హృదయాలను ఆకట్టుకుంటా గుండెలకు గుసగుసలువినిపిస్తా తలల్లో కాపురంపెడతా సాహిత్యాన్ని సుసంపన్నంచేస్తా భావం భ్రమాత్మకం కవిత్వం కళాత్మకం అందం ఆస్వాదాత్మకం ఆనందం అనుభూతాత్మకం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 సతులమతులు పతులపాట్లు పత్ని ప్రతిరోజూ చాలా సరుకులుతెమ్మంటది పట్టీనిచ్చి ప్రతిదాన్ని పట్తుకొనిరమ్మంటది లేదంటే పస్తులు పెడతాననిహెచ్చరిస్తది భార్య వారానికోమారు సంతకు డబ్బులివ్వమంటది ఎన్నోరూపాయలు నీటిలా ఖర్చుచేస్తది  స్నేహితులదగ్గరకు వెళ్ళవద్దంటది ఇంటికితెసుకొనిరావద్దంటది సతి నెలకోచీర కావాలంటది సరిపోయేరవిక కొనాలంటది బట్టలకు కుట్టుకూలీకి భారీగా డబ్బులుతగలేస్తది పెళ్ళాం ఏడాదికోనగలు కొనిపెట్టమంటది పాతనగలును మారుస్తానంటది తరుగులు చార్జీలకని తంటాలుపెడతది అర్ధాంగి ఓపికలేకున్నా పనులు చేయమంటది ఇల్లువిడిచి బయటకు పోవద్దంటది పిల్లలదగ్గరకు పోదామంటే ససేమిరాయంటది కట్టుకున్నాక భార్యను భరించాల్సిందేనా బతుకుబండిని ఒంటెద్దులాగా లాగాల్సిందేనా పైసాపైసాలెక్కలు పత్నికి ప్రతిదినంచెప్పాల్సిందేనా ఆలికోసం చేపలా ఏటికెదురుగా ఈదాల్సిందేనా పక్షిలా ఎత్తుగా ఎగరాల్సిందేనా పశువులా మొండిగా బతకాల్సిందేనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవనకేళి  కవిత్వంతో క్రీడించాలనివున్నది కుస్తీపట్టులు కొనసాగించాలనివున్నది అక్షరాలతో ఆడాలనివున్నది అందంగా అల్లాలనివున్నది పదాలతో ఆటలాడించాలనివున్నది పుటలపైన కూర్చోబెట్టించాలనివున్నది ఆలోచనలతో ఆడుకోవాలనివున్నది అంతరంగాలను అంటుకోవాలనివున్నది శబ్దాలతో సయ్యాటలాడించాలనివున్నది శ్రావ్యతను చెవులకుకలిగించాలనివున్నది సరిగమలతో సందడిచేయాలనివున్నది చిత్తాలను చిత్తుచేయాలనివున్నది పెదవులతో తేనెచుక్కలుచల్లాలనివున్నది నాలుకులకు చప్పరించేలాచేయాలనివున్నది అధరాలతో అమృతంచిందాలనివున్నది అందిపుచ్చుకొని అమరంచెయ్యమనాలనివున్నది కలంతో కదంతొక్కించాలనివున్నది కవనజగానికి కాలిబాటనిర్మించాలనివున్నది సుమాలతో సుందరమార్గంచేయాలనివున్నది సౌరభాలను చుట్టూవెదజల్లాలనివున్నది సాహితీజగతిలో సంచరింపజేయాలనివున్నది శారదాదేవిని స్మరింపజేయాలనివున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 అకాశం అంతరంగం ఆకాశంలో మెరుపులా తలలో ఆలోచనలు ఎపుడు పుడుతాయో ఎపుడు వెలుగుతాయో ఆకాశవాణిలో పాటలా గాంధర్వ గానం ఎపుడు వినిపిస్తుందో ఎపుడు విందునిస్తుందో గగనంలో నీలిరంగులా చక్కని వస్త్రము ఎపుడు లభిస్తుందో ఎపుడు ధరిస్తానో నింగిలో మబ్బుల్లా మనసులో భావాలు ఎపుడు కూడుతాయో ఎపుడు కవితారూపందాల్చుతాయో నభంలో హరివిల్లులా హృదయంలో అందచందాలు ఎపుడు దర్శనమిస్తాయో ఎపుడు పరవశపరుస్తాయో ఆకసంలో సూర్యునిలా గుండెలో కిరణాలు ఎపుడు ప్రసరిస్తాయో ఎపుడు ప్రభవిస్తాయో మింటిలో జాబిలిలా కంటిలో కాంతిలా ఎపుడు వెన్నెలవెదజల్లుతుందో ఎపుడు ఉల్లముత్సాహపడుతుందో అంబరవీధిలో తారకల్లా కాగితాలపై అక్షరాలు ఎపుడు కూర్చుంటాయో ఎపుడు అల్లుకుంటాయో అంతరిక్షంలోని నౌకలా పదాల సమూహాలు ఎపుడు ఆవిర్భవిస్తాయో ఎపుడు పైకెగురుతాయో మిన్నులో చినుకుల్లా సెలయేటి పరుగుల్లా ఎపుడు కవితలుకూర్చబడతాయో ఎపుడు ప్రవహించుతాయో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నా చెలి  కొంటెచూపుల కోమలాంగి చిరునగవుల చిగురుబోడి అందాలబొమ్మ అలివేణి చిత్రవిచిత్రాల చిగురుబోడి వాలుజడ వాశిత చిలిపికనుల చిత్రాంగన వయ్యరాల వనిత మదినితట్టిన మగువ మధువులొలుకు మహిళ చక్కదనాల చంద్రవదన సంతసపరిచే సకియ  కలలోకొచ్చే కలువకంటి హంసనడకల హరిణలోచన నచ్చింది ననబోడి మెచ్చింది మెలతుక వదలకుంటా వయ్యారిని చెంతపెట్టుకుంటా చెలియని సతినిచేసుకుంటా సారసాక్షిని కాపురానికితెచ్చుకుంటా కాంతామణిని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 వానవస్తే! వరదవస్తే! వానవస్తే  భూమికి సంబరం  మబ్బులులేస్తే  రైతులకు ఆనందం  చినుకులురాలితే విత్తనాలకు పర్వదినం  వానచుక్కలుతడిపితే   చిన్నారులకు సంతోషం  జల్లులుచల్లితే  వాగులువంకలకు ఆనందం  సెలయేర్లుపారితే చూపరులకు పరవశం  మేఘాలురవినికప్పితే  ఎండతో దోబూచులు  మబ్బులుశశినికమ్మితే  వెన్నెలది వింతదర్శనం   గాలివానవీస్తే  జనాలకు భయం  వరదపారితే  కుంటలుకాలువలకు భోజనం  వర్షంచాటేస్తే  హర్షానికి చుక్కెదురు  వానా కరుణించవమ్మా  తాపాన్ని తగ్గించవమ్మా  వరుణదేవుడా పుడమినిపచ్చబరచవయ్యా  ప్రజలను కరువుకాటకాలనుండికాపాడవయ్యా  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఏమిటీజగం? ఎందుకీజన్మం? ఆకాశం క్రింద పడదేమిటి భూగోళం పైకి ఎగరదేమిటి సూర్యగమనం ఆగిపోదేమిటి కాలచక్రం నిలిచిపోదేమిటి సముద్రం ఇంకి పోదేమిటి సంసారం విడిచిపెట్టదేమిటి అందాలు ఆకట్టుకుంటున్నాయిదేనికి ఆనందాలు అస్వాదించమంటున్నాయిదేనికి చెట్లు ఎదుగుతున్నాయిదేనికి పూలు పూస్తున్నాయిదేనికి పరిమళాలు ఆఘ్రానించమంటున్నాయిదేనికి సుస్వరాలు ఆలకించమంటున్నాయిదేనికి అరణ్యాలు ఆకర్షిస్తున్నాయిదేనికి సెలయేర్లు ప్రవహిస్తున్నాయిదేనికి ప్రేమలు పుడుతున్నాయిదేనికి బంధాలు కట్టేస్తున్నాయిదేనికి జీవితపయనం సాగించమంటుందిదేనికి గమ్యాలను చేరుకోమంటుందిదేనికి తలపులు తట్టిలేపటందేనికి తనువులు తహతహలాడటందేనికి కలాలు పట్టమంటున్నాయిదేనికి కవితలు కూర్చమంటున్నాయిదేనికి జీవితం గమ్యసాధనకే జవసత్వం పూలబాటనిర్మాణానికే జగం జీవులబాగుకొరకే జన్మం జనార్ధనుడిసేవకే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా అంతరంగం ఆకాశపు  అంచులను చేరాలని  నాకున్నది  అవనినిండా ఆక్షరాలను చల్లాలని నాకున్నది  కిరణాలలో  పదాలను కలపాలని నాకున్నది గాలిలోన శబ్ధాలను వదలాలని నాకున్నది అమోఘమైన ఆలోచనలను పారించాలని నాకున్నది ఆకట్టుకునే శైలిని వాడాలని నాకున్నది  తేనెలొలుకు పలుకులను చిందాలని నాకున్నది అబ్బురపరచే విషయాలను వెల్లడించాలని నాకున్నది పాఠకుల అంతరంగాలను  దోచాలని నాకున్నది అద్భుతమైన కవితలను ఆవిష్కరించాలని నాకున్నది  గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ భాగ్యనగరం
Image
 ఇల్లు ఇల్లాలు ఇల్లు వెలిగిపోతుందంటే ఇల్లాలు  ఇంటిలో దీపంగా ఉన్నట్లే ఇల్లు ఆనందంగా ఉందంటే ఇల్లాలు ఇంటిలో ప్రేమానురాగాలు పంచుతున్నట్లే ఇల్లు సిరులతో తూగుతుందంటే ఇల్లాలు ఇంటిలో లక్ష్మీదేవిగా అవతరించినట్లే ఇల్లు ఒకతాటిమీద నడుస్తుంటే ఇల్లాలు గణనీయమైనపాత్రను పోషిస్తున్నట్లే ఇల్లు సమాజంలో గౌరవమర్యాదలు పొందుతుంటే ఇల్లాలు బరువుబాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లే ఇల్లు పలుశుభకార్యాలకు ఆలవాలమైతే ఇల్లాలు తన సమర్ధతను చాటుకున్నట్లే ఇల్లు స్వర్గసీమను తలపిస్తుంటే ఇల్లాలు దేవతాపాత్రను పోషిస్తున్నట్లే ఇల్లు బంధువులకు నెలవైతే ఇల్లాలు చక్కని అనుబంధాలను సాగిస్తున్నట్లే ఇల్లు చక్కని నిర్ణయాలకు తావయితే ఇల్లాలు మంచి సలహాలను ఇస్తున్నట్లే ఇల్లు పూజాపునస్కారాలకు స్థావరమయితే ఇల్లాలు దేవునికృపకు పాత్రురాలయినట్లే ఇల్లు ఆలయమయితే ఇల్లాలు అందులోదేవతే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితలు కవితలు కవిగారి ఆవేశాలు కవిగారి ఉల్లాసాలు కవివిస్తరించిన పరిధులు కవిప్రయోగించిన పదబంధాలు కవితలు కవితలలోపుట్టిన ఊహలు కవిపొందిన అనుభవాలు కవినికట్టేసిన అందాలు కవిపొందిన ఆనందాలు కవితలు కవిపూయించిన పుష్పాలు కవివెదజల్లిన సౌరభాలు శశికురిపించే వెన్నెలలు రవిప్రసరించే కిరణాలు కవితలు కవులుచల్లే తేనెచుక్కలు కవికోకిలాలపించే రాగాలు కవిగారి ఉయ్యాలఊపులు కవనమయూరాలుచేసే  నాట్యాలు కవితలు కవుల తెలివితేటలు కవుల ప్రయాసఫలాలు కవితలను ఆస్వాదించండి కవులను స్మరించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం