Posts

Showing posts from December, 2024
Image
 కవనబాల మదిలో పుట్టాను మహిలో పడ్డాను కలమునుండి జారాను కాగితముపైన కూర్చున్నాను అక్షరాలను అయ్యాను అర్ధాలను అందించాను పదాలరూపం పొందాను ప్రాసలుగా మారాను పంక్తులుగా పేర్చబడ్డాను పూర్తిబొమ్మగా తయారయ్యాను పుట్టినబిడ్డను అయ్యాను పాఠకులచేతుల్లోకి వెళ్ళాను మనసులు తట్టాను మోదము కలిగించాను పురిటిపిల్లను సాకండి అల్లారుముద్దుగా పెంచండి కవనబాలను దీవించండి కవిగారిని గుర్తించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అలిగిన అలరు పలకరించలేదని పెరట్లో పూచినపువ్వు అలిగింది ముఖాన్నితిప్పుకొని బెట్టుచేసి చూపులను చాటుచేసుకుంది పరికించిన పూవుతల్లి విషయము గ్రహించింది పుష్పకన్యను అనునయించి పొంకాలు చూపమన్నది విరిని పరిసరాలలో పరిమళాలను వెదజల్లమంది తల్లిచెట్టు చెంతకురమ్మని నాకురహస్యంగా సైగలుచేసింది సుమబాల ననుచూచి సిగ్గుపడి తలవంచుకుంది పూబోడిని తడిమా చేతులలోకి తీసుకున్నా పూబాల సంతసించి పైకిక్రిందకి అటూ ఇటూ ఊగింది పరవశంతో పకపకా నవ్వులు చిందింది అందాలన్నీ దాచకుండా చూపింది అలరించింది పువ్వు నాకుదక్కింది కవిత మీకుచిక్కింది ఆనందం వెల్లివిరిసింది అదృష్టం కలిసివచ్చింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితావేశం మబ్బులు కమ్ముతుంటే మదులు మురిసిపోతాయి మేఘాలు చుక్కలుజారుస్తుంటే కలాలు అక్షరాలనుకారుస్తాయి నీరు భూమిమీదపారుతుంటే పదాలు కాగితాలపైప్రవహిస్తాయి కుంటలు నిండిపోతే పుటలు నిండిపోతాయి చెరువులు అలుగులుదాటితే భావాలు బయటకొస్తాయి నదులు పరుగెత్తుతుంటే కవితలు ఉరుకుతాయి ఆకశము నీలమయితే పుస్తకము నల్లబడుతుంది ప్రకృతి పరవశపరుస్తుంటే సాహితి సంబరపెడుతుంది వరదలను ఆపలేము కవితలను కట్టడిచేయలేము కవితావేశానికి కాలకట్టుబాట్లులేవు కవితలనైనాకూర్చాలి పాటలనైనావ్రాయాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
వలవేస్తా ఏటిలో వలవేస్తా చేపలను పట్టుకుంటా బుట్టలో వేసుకుంటా డబ్బు వలవేస్తా పనులు చేయించుకుంటా పలులాభాలు పొందుతా చూపుల వలవెస్తా చెలిని ఆకట్టుకుంటా చెలిమి చేసుకుంటా అందాల వలవేస్తా అట్టే ఆకర్షిస్తా ఆనందాలను అందిస్తా ఆశల వలవేస్తా కోర్కెలను లేపుతా రంగంలోకి దించుతా    వలపు వలవేస్తా వన్నెలాడిని చేబడతా వివాహము చేసుకుంటా మాటల వలవేస్తా శ్రోతలను పట్టేస్తా అభిమానులను పెంచుకుంటా కవితల వలవేస్తా పాఠకుల మదులుదోస్తా అంతరంగాలలో నిలిచిపోతా వలలో చిక్కితే వదలకుంటా వశముచేసుకుంటా వెంటపెట్టుకుంటా విముక్తి కావాలంటే యుక్తిని ప్రయోగిస్తా శక్తిని చూపిస్తా విరక్తిని వదిలిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నాతో పెట్టుకోకు నోట్లో మాటలున్నాయి తేనెచుక్కలు చిందుతా గ్రహించమంటా చప్పరించమంటా సంతసపరుస్తా కోపంతెప్పిస్తే తూటాలు ప్రేలుస్తా గాయాలపాలు చేస్తా చిందులు త్రొక్కిస్తా రక్తం క్రక్కిస్తా కంట్లో కాంతులున్నాయి ప్రసరిస్తా కళకళలాడిస్తా చూపులు సారిస్తా ప్రేమలు కురిపిస్తా కోపంతెప్పిస్తే నిప్పురవ్వలు చల్లుతా కాల్చిపారేస్తా బూడిదగా మారుస్తా చేతిలో కలమున్నది కమ్మనికైతలు కూరుస్తా చక్కనిపాటలు పాడుతా పసందైనపద్యాలు ఆలపిస్తా ఆగ్రహంతెప్పిస్తే కలాన్ని కత్తిగామారుస్తా దాడిచేస్తా దొమ్మీకొస్తా తంటాలుపెడతా మదిలో ఆలోచనలున్నాయి అనుభూతులు పొందుతా అక్షరాలు పారిస్తా పదాలు పేరుస్తా అందాలు చూపుతా ఆనందంకలిగిస్తా క్రోధానికిగురిచేస్తే విప్లవగీతాలు రాస్తా కాగడాలు పట్టిస్తా తిరుగుబాటు చేయిస్తా సమాజానికి ఎదురుతిరుగుతా సంఘసంస్కరణలు చేబడతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 కన్నెమనసు(ప్రేమగీతం) పూవల్లె ఉన్నావు విప్పారమన్నాడు బొమ్మల్లె ఉన్నావు ఉండిపొమ్మన్నాడు             ||పూవల్లె|| చిలుకలా ఉన్నావు మాట్లాడమన్నాడు కోకిలలా ఉన్నావు గళమెత్తమన్నాడు నెమలిలా ఉన్నావు నాట్యమాడన్నాడు హంసలా ఉన్నావు హొయలుచూపన్నాడు           ||పూవల్లె|| దివ్వెలా ఉన్నావు వెలిగిపోమన్నాడు గువ్వలా ఉన్నావు జతకురమ్మన్నాడు నవ్వుతూ ఉన్నావు నెరజాణవన్నాడు కన్నుకొడుతున్నావు కోమలాంగివన్నాడు             ||పూవల్లె|| సిగ్గువద్దన్నాడు ముగ్గులోకిదించాడు చుక్కలాగున్నావు చుంబించమన్నాడు మల్లెలాగున్నావు మత్తెక్కించమన్నాడు ఎర్రగా ఉన్నావు బంగారానివన్నాడు             ||పూవల్లె|| గులాబివన్నాడు గుచ్చవద్దన్నాడు అందంగవున్నావు అలరించమన్నాడు చక్కెరలాగున్నావు చవిచూపమన్నాడు చిన్నగాయున్నావు ఎదగమనియన్నాడు              ||పూవల్లె|| నమ్మమనియన్నాడు అభయహస్తమిచ్చాడు కలతవద్దన్నాడు వెంటనడవమన్నాడు లక్ష్మిలా ఉన్నావు సిరులుతెమ్మన్నాడు వాగ్దేవినన్నాడు వాక్కుల...
Image
 కవితామృతం అల్లితే అక్షరాలు ఆకర్షించాలి విన్యాసాలు పేర్చితే పదాలు పంచాలి పసందులు బయటపెడితే భావాలు మురిసిపోవాలి మదులు కూర్చితే కలాలు చేర్చాలి ఉల్లాసాలు నింపితే కాగితాలు తలపించాలి నిజాలు చదివితే కవితలు చూపాలి చక్కదనాలు పాడితే గేయాలు వీనులకివ్వాలి విందులు కదిలితే పెదాలు చిందాలి తేనెచుక్కలు రాస్తే కవులు పరవశించాలి పాఠకులు తలిస్తే ఙ్ఞాపకాలు తట్టాలి అనుభూతులు తగలగానే కవనాస్త్రము పైకుబకాలి గంగాజలము అప్పుడే కవనాలు అవుతాయి అమృతము ఆరోజే కవులు అవుతారు చిరంజీవులు ఆనాడే కవితలు అయిపోతాయి అమరము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 తెలుగుదారులు తెలుగుదారి పట్టరా వెలుగులు వెదజల్లరా తెలుగుబాట నడవరా కుసుమాలు పరచరా తెలుగుత్రోవ అనుసరించరా తేనెచుక్కలు చల్లరా తెలుగుపథము నిర్మించరా సౌరభాలు వెదజల్లరా తెలుగుతెరువు చూపరా తెలివితేటలు అందించరా తెలుగుమార్గము సుందరముచేయరా తోటివారలకు సంతసమునివ్వరా తెలుగురాస్తా చూపించరా తేటదనాలు తెలుపరా తెలుగుదోవ సరిచేయరా కదాలు త్రొక్కించరా తెలుగుజాడ వెలిగించరా వెన్నెలందు విహరింపజేయరా తెలుగుతొవ్వ పయనించమనరా తెలుగుతల్లిఋణము తీర్చుకోమనరా గుండపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఆలుమగలవంతులు (గేయం) వంతు వంతు వంతు మామధ్యన వంతు కాపురంలో వంతు జీవితంలో వంతు          ||వంతు|| వ్రాయటం నావంతు పాడటం తనవంతు చెప్పటం నావంతు వినటం తనవంతు         ||వంతు||   వండటం తనవంతు తినటం నావంతు సంపాదన నావంతు ఖర్చుపెట్టుట తనవంతు      ||వంతు|| పిల్లలుకనటం తనవంతు పోషించటం నావంతు ముస్తాబవటము తనవంతు మురిచిపోవుట నావంతు     ||వంతు|| ఇల్లునుచూడటం తనవంతు ఇంటినిజరపటం నావంతు ముగ్గులేయటం తనవంతు ముద్దుచేయటం నావంతు    ||వంతు|| అందంచూపటం తనవంతు ఆనందించటం నావంతు ఇంటిపెత్తనం తనవంతు బయటపెత్తనం నావంతు     ||వంతు|| పిల్లలు పిల్లలు పిల్లలు అమ్మానాన్నల చూడండి లోకాన్ని వీక్షించండి విఙ్ఞానాన్ని పొందండి       ||వంతు|| బాలలు బాలలు బాలలు అనురాగాలు చూపండి అన్యోన్యంగా ఉండండి ఆదర్శంగా బ్రతకండి       ||వంతు|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మాటలుండాలి మనుషులుంటే చాలా మూతులు ఉండాలి మాటలు ఉండాలి మాటలుంటే సరిపోతుందా మంచిగా ఉండాలి ముద్దుగా ఉండాలి నచ్చితే మెప్పేనా తియ్యగా ఉండాలి చెవులకు విందునివ్వాలి వీనులకందితే చాలునా శ్రావ్యంగా ఉండాలి మదికి చేరేలాయుండాలి మతినితట్టితే  సరియేనా ఙ్ఞాపకాల్లోకి వెళ్ళాలి జీవితాంతం తలచేలాయుండాలి మాటలు  నవ్వులు తెప్పించాలి పువ్వులు తలపించాలి మాటలు  గొంతులకు చెరకురసమందించాలి    నాలుకలను తేనెచప్పరింపజేయాలి మాటలు  మురిపించేలా ఉండాలి మయిమరిపించేలా ఉండాలి మాటలు కాంతులు వెదజల్లాలి కళ్ళను కళకళలాడించాలి మాటలు రంగులు చూపించాలి సౌరభాలు వెదజల్లాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
తరువులతలపులు  కొమ్మలతో ఎదుగుతుంది ఆకులతో పచ్చబడుతుంది పూతతో పరిఢవిల్లుతుంది పూలతో ప్రకాశించుతుంది పరిమళంతో పరవశపరుస్తుంది ఫలాలతో నోరూరిస్తుంది పక్షులతో సావాసంచేస్తున్నది కాయలతో కడుపునింపుతుంది చల్లనినీడతో అలసటతీరుస్తుంది మెల్లనిగాలితో స్వేదాన్నితుడుస్తుంది కొయ్యలతో కుర్చీలుచేసుకోమంటుంది మానులతో మంచాలుచేసుకోమంటుంది పచ్చదనంతో పొంకాలుచూపుతుంది స్వచ్ఛగాలితో ప్రాణాలునిలుపుతుంది  చెట్లతో చెలిమిచేద్దాం మొక్కలతో మిత్రుత్వానిసాగిద్దాం తరువులతో తనువులతరిద్దాం వృక్షాలతో వృద్ధిచెందుదాం ప్రకృతికి వందనాలుచెబుదాం సాహితికి ప్రణామాలర్పిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మన తెలుగు వెలుగుతుంది తెలుగు వ్యాపిస్తుంది తెలుగు వర్ధిల్లుతుంది తెలుగు శోభిల్లుతుంది తెలుగు వ్రాయిస్తుంది తెలుగు పాడిస్తుంది తెలుగు పువ్వులుపూస్తుంది తెలుగు పరిమళాలుచల్లుతుంది తెలుగు ఆకర్షిస్తుంది తెలుగు ఆహ్వానిస్తుంది తెలుగు మదినిమీటుతుంది తెలుగు హృదినితట్టుతుంది తెలుగు తీపినిస్తుంది తెలుగు స్ఫూర్తినిస్తుంది తెలుగు పలికిస్తుంది తెలుగు మురిపిస్తుంది తెలుగు వినమంటుంది తెలుగు విందునిస్తుంది తెలుగు ఖ్యాతినిస్తుంది తెలుగు సత్కారాలిస్తుంది తెలుగు చక్కగనుంటది తెలుగు శ్రావ్యంగుంటది తెలుగు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
మూడు గంటలపాటు హాస్యం వండి వడ్డించిన కాలిఫోర్ణియా వీక్షణం వారి 148 వ అంతర్జాల సమావేశం  నేడు 14-12-2024 వ తేదీ జూమ్ లో జరిగిన 148 వ వీక్షణం సాహితీ సమావేశం హాస్యాన్ని వండి వడ్డించి సభికులను ఆనందసాగరంలో ముంచింది. ద్వాదశాబ్ది కాలం పైబడి  నెల నెలా డా.గీతామాధావి గారు ప్రపంచ కవులకు సాహితీ విందు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా! అది వారి పట్టుదల, అకుంఠిత దీక్ష, సాహితీ ప్రియత్వం!! .ఆ విందులలో ఒక ప్రత్యేకత ఉంటుంది.ప్రతిసారి ఒక క్రొత్త వంటకాన్ని వండి వడ్డిస్తూ వుంటారు. దేనికదే గొప్ప రుచి. ఈసారి సాహితీవంకాయలో ఉల్లికారం కూరి వడ్డించిన హాశయుయ గుళిక గుత్తివంకాయ కూర అబ్బ! ఏమి రుచో!      గీతమ్మగారి స్వాగత వచనాలతో  సభ ప్రారంభమైంది.నేటి ప్రత్యేక అతిధి హాస్యావధాని డా.శంకర నారాయణ గారి  వైశిష్ట్యాన్ని , వారి వివిధ బిరుదులనూ,అవార్డులను గురించి గీతామాధవి గారు విపులీకరించారు.నోరు వెళ్ళబెట్టడం సభికుల వంతు అయింది ఇన్ని కిరీటాలు ఒక వ్యక్తికి సాధ్యమా అని.        డా.శంకర నారాయణ గారు తన ప్రసంగంలోని ప్రతి అక్షరము కూడా సభికుల కుక్షుల, బుగ్గల శక్తిని పరీక్షించి...
Image
 ఫూలపుణ్యం చెట్లకు పూస్తాయి కళ్ళను కట్టేస్తాయి మొగ్గతొడిగి మురిపిస్తాయి విచ్చుకొని విస్మయపరుస్తాయి రంగులు అద్దుకుంటాయి హొయలు పోతాయి షోకులు చూపుతాయి సౌరభాలు వెదజల్లుతాయి మాలగ మార్చబడుతాయి సిగలన సింగారమవుతాయి కొప్పులు ఎక్కుతాయి కోమలులను కుషీపరుస్తాయి గుడికి చేరుతాయి దేవుని కొలుస్తాయి ప్రేమికుల చేతులుమారుతాయి ప్రేమను వ్యక్తపరుస్తాయి సత్కవులను సన్మానిస్తాయి వధూవరులను వేడుకపరుస్తాయి పూలు మదులనుదోస్తాయి విరులు మరులుకొల్పుతాయి పూలుచేసుకున్న పుణ్యం వర్ణనాతీతం కవులకిస్తున్న ప్రేరణం శ్లాఘనీయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
అక్షరతోరణం అక్షరాలని వడబోస్తా మనసుని పురికొలుపుతా అక్షరాలని ఏరుకుంటా హస్తానికి పనిపెడతా కాగితాలని కైపడతా కలానికి కార్యమప్పగిస్తా రంగములోకి దిగుతా కవితలని సృష్టిస్తా అక్షరసంపదని ఆకాశంలో చల్లుతా నక్షత్రాలను చేసి తోరణంకడతా అక్షరావిరిని గగనానికి పంపుతా అంబుదాలను చేసి తేలించుతా అక్షరమేఘాలని కరిగిస్తా కవితా జల్లులని కురిపిస్తా అక్షరజలాన్ని నదిలో కలుపుతా కవితామృతాన్ని క్రిందకు పారిస్తా అక్షరసమూహాలని కడలిలో వదులుతా కవన తరంగాలని ఎగిసిపడేస్తా అక్షరజ్యోతులని రవికిరణాలకు జోడిస్తా కైతా కిరణాలని ప్రసరింపజేస్తా అక్షరవెలుగులని చంద్రునిపై చల్లుతా కయితా కౌముదిని వెదజల్లిస్తా అక్షరసుమాలని బుట్టనిండాతెస్తా అందంగా అల్లి కవితాతోరణం కట్టేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 తెలుగంటే తెలుగంటే మధురభాషోయ్ తెలుగంటే తేటభాషోయ్      తెలుగంటే  అమృతంబోయ్ తెలుగంటే  చెరకురసమోయ్            ||తెలు|| తెలుగంటే త్రుళ్ళింతలోయ్ తెలుగంటే కేరింతలోయ్  తెలుగంటే ఓప్రాంతంకాదోయ్ తెలుగంటే అఖిలాండమోయ్            ||తెలు||       తెలుగంటే అ ఆ అక్షరాలోయ్ తెలుగంటే గుండ్రటి ముత్యాలోయ్ తెలుగంటే అమ్మా ఆవులోయ్ తెలుగంటే అంతా వెలుగులోయ్          ||తెలు|| తెలుగంటే సుశబ్దాలోయ్ తెలుగంటే సుస్వారాలోయ్ తెలుగంటే పున్నమోయ్ తెలుగంటే వెన్నెలోయ్                 ||తెలు|| తెలుగంటే దివ్వెలోయ్ తెలుగంటే జ్యోతులోయ్ తెలుగంటే మట్టినేలకాదోయ్ తెలుగంటే రత్నగర్భమోయ్           ||తెలు|| తెలుగంటే వేషముకాదోయ్ తెలుగంటే చక్కదనమోయ్ తెలుగంటే జాతొకటేకాదోయ్ తెలుగంటే కళాకాంతులోయ్         ||తెలు|| తెలుగంటే ప్రఖ్యాతేకాదోయ్ తెలుగంటే విశ్వవిఖ్యాతోయ్  తెలుగంటే వట్టిమాటలేకాదోయ్ తెలుగంటే తీపి...
Image
 ప్రేమగీతాన్నివ్రాసి పాడాలని ఉన్నది ప్రేమగీతమునొకటి పాడాలని ఉంది చక్కనయినచెలిని పొగడాలని ఉంది                               ||ప్రేమ|| కళ్ళారా పారజూచి కాంతులను వెదజల్లి కెమారాను గురిపెట్టి అందాలను బంధించాలని ఉంది                 ||ప్రేమ|| చిరునవ్వుల మోముచూచి సిగ్గుపడే బుగ్గలుకని మనసులోని భావాలనెరిగి చక్కనిఫొటోలు తీయాలని ఉంది                ||ప్రేమ|| అమృతంచిందే అధరాలనుచూచి తేనెచుక్కలుచిందే పలుకులువిని చేస్తున్న చిలిపిచేష్టలనుకాంచి విచిత్రచిత్రాలను తీయాలని ఉంది            ||ప్రేమ|| ఎగురుతున్న ముంగురులనుచూచి తొలుగుతున్న పైటకొంగునుకని దాచలేకున్న కోర్కెలనుతలచి కాన్వాసుపై కుంచెపట్టిగీయాలని ఉంది         ||ప్రేమ|| మన్మధబాణాలువిసిరి మరులురేకెత్తించి  ముగ్గులోనికిదించి ముహూర్తమునుపెట్టించి  మెడనువంచింపజేసి మంగళసూత్రమునుకట్టి  మనుమాడి మంచిగచూచుకోవాలని  ఉంది...
Image
 సాహితీ సవ్వడులు సాహితీచైతన్యం  స్వాగతిస్తుంది సాహితీలోకం సంభాలిస్తుంది సాహితీసాగరం దిగమంటుంది సాహితీప్రస్థానం సాగించమంటుంది సాహితీసేవలు  చేయమంటుంది సాహితీకిరణాలు ప్రసరించమంటుంది సాహితీనౌక ఎక్కిపయనించమంటుంది సాహితీసమరం కొనసాగించమంటుంది సాహితీవనం విహరించమంటుంది సాహితీవలయం చేబట్టుకుంటుంది సాహితీసాహచర్యం వీడొద్దంటుంది సాహితీసౌరభం వెదజల్లమంటుంది సాహితీసమ్మేళనాలు సందడిచేస్తున్నాయి సాహితీసంబరాలు ఆహ్వానంపలుకుతున్నాయి సాహితీస్ఫూర్తి ప్రదర్శించమంటుంది సాహితీశక్టి చూపించమంటుంది సాహితీపధం నడకసాగించమంటుంది సాహితీగమ్యం చేరుకోమంటుంది సాహితీతీర్పులు శిరసావహిస్తాను సాహితీమాటలు చిత్తగించుతాను   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఆసక్తికరంగా సాగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక తొలి అంతర్జాల కవిసమ్మేళనం @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ నిన్న 07-12-2024వ తేదీ అంతర్జాలంలో జరిగిన కాప్రా మల్కాజగిరి   అంతర్జాల కవిసమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొదట సమావేశం అధ్యక్షులు మరియు సహస్ర సినీటీవీ పాటల రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు కవులకు స్వాగతం పలికారు.సమూహ ఉద్దేశ్యాలను, చేసిన మరియు చేయబోయే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని జంట కవులు తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతి శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వారి పాండవోద్యోగ విజయం నాటకం మరియు పద్యాలు తెలుగు దేశాన బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు.  పిమ్మట కవి సమ్మేళనాన్ని నిర్వాహక బృందం శ్రీ మౌనశ్రీ మల్లిక్, డాక్టర్ రాధా కుసుమ, డాక్టర్ దీపక్ న్యాతి మరియు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నిర్వహించారు. పద్యకవి రాధశ్రీ, అంబటి లింగ క్రిష్ణారెడ్డి, మునిమడుగు నాగరాజ శాస్త్రి మరియు నామాల రవీంద్ర సూరి చక్కగా పద్యాలను ఆలపించి అందరినీ అలరించారు. మౌనశ్రీ మల్లిక్ చలికాలంలో శ్రీమతితో పెట్టుకోవద్దని హాస్యో...
Image
 కవితోదయం  ఈ ఉదయం నా హృదయం ఊగిసలాటమీద పడింది నల్లగా కనపడుదామా నీలంగా అగుపిద్దామా అని ఆకాశం ఊగిసలాడుతుంది చినుకులు రాలుద్దామా జోరువాన కురిపిద్దామా అని మేఘాలు ఊగిసలాడుతున్నాయి వేగంగా వీద్దామా మెల్లగా కదులుదామా అని గాలి ఊగిసలాడుతుంది కొమ్మలను కదిలిద్దామా గమ్ముగా ఉండిపోదామా అని చెట్లు ఊగిసలాడుతున్నాయి గూటిలో ఉందామా గాలిలో ఎగురుదామా అని పక్షులు ఊగిసలాదుతున్నాయి ఎరుపుగా వెలుగుదామా తెల్లగా ప్రకాశించుదామా అని సూర్యుడు ఊగిసలాడుతున్నాడు ఆనందంగా ఆడుదామా శ్రావ్యంగా పాడుదామా అని మది ఊగిసలాడుతున్నది మాటలు వదులుదామా మూతిని బిగిద్దామా అని నోరు ఊగిసలాడుతున్నది కవితను కూర్చుదామా గేయాన్ని వ్రాద్దామా అని మనసు ఊగిసలాడుతున్నది ప్రణయగీతం పాడుదామా ప్రభోధగేయం ఆలపిద్దామా అని ఉల్లము ఊగిసలాడుతున్నది పాటను విందామా కైతను చదువుదామా అని పాఠకులు ఊగిసలాడుతున్నారు కవితోదయం అయ్యింది శుభోదయం చెప్పింది ఊగిసలాట ముగిసింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 అమ్మానాన్నలు అమ్మానాన్నలు  పటాలకెక్కారు  అనుబంధాలను  మూటకట్టకెళ్ళారు    అమ్మ  చూస్తుంది  అయ్య  పలుకరిస్తున్నాడు   అమ్మ  దీవిస్తుంది  నాన్న  గర్విస్తున్నాడు    అమ్మ  ఆప్యాయతలు పెంచుకోమంటుంది అయ్య  ఆర్ధికాభివృద్ధిని సాధించుకోమంటున్నాడు  మనుమరాలనుచూచి   అమ్మ సంతసపడుతుంది  మనుమడినిచూచి  అయ్య మురిసిపోతున్నాడు  అమ్మకు వందనాలు  నాన్నకు  ప్రణామాలు అమ్మానాన్నలకు   పూదండలు  ధూపదీపాలు  కర్పూరహారతులు  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 జీవితసారం జీవితం క్రందిస్తూపుట్టటం కాయాన్నిపెంచటం కష్టపడటం కడకుకూలటం జీవితం పయనించటం పరికించటం ఫలితమాశించటం ప్రయాసపడటం జీవితం రావడం గడపటం పెరగటం వెళ్ళటం జీవితం ప్రేమించటం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం చచ్చిపోవటం జీవితం ఆడటం పాడటం జతకూడటం విడిపోవటం జీవితం చూడటం కోరటం పొందటం పోగొట్టుకోవటం జీవితం రంగస్థలమెక్కటం పాత్రపోషించటం పిమ్మటదిగిపోవడం కనుమరగవటం జీవితం బంధాలవలయం దాంపత్యబంధం సంతానబంధం సమాజబంధం జీవితం తగలబెడ్డటం నీరుచల్లటం ఆర్పివేయటం బూడిదతీయటం జీవితం దోచుకోవటం దాచుకోవటం కాపలాకాయటం కలలుకనటం జీవితం అశాశ్వతం మరణం అనివార్యం అప్రతిహతం జీవితం  కడలితీరం  అలలప్రభంజనం ఎగరటంపడటం నెట్టటంలాగటం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
అనుభూతులు కవితలువనితలు తనంతట తనేరావాలి కవితయినా వనితయినా తొవ్వితే దొరికేదికాదు కవిత తన్నితే వచ్చేదికాదు వనిత అనుభూతులనే కవితగామార్చాలి అనుభుక్తినే వనితగాతలచాలి తారలాగా తళుక్కునతారసపడాలి మెరుపులాగా మిలమిలమెరిసిపోవాలి కవిత అప్సరసలా అగుపించాలి రసగుల్లలా నోరూరించాలి వనిత తలలోపుట్టి మదినిముట్టి భావముకావాలి బయటకురావాలి కవిత ప్రేమించి బంధంకోరి చెంతకురావాలి చెలిమిచేయాలి వనిత తోచిందేతడవుగా తొందరతొందరగా అక్షరాలనల్లితే రసహీనమవుతుంది కవిత భ్రమల్లోపడి నిజాలుమరచి ప్రవర్తించితే రమ్యహీనమవుతుంది వనిత అనుభూతినిస్తే మదినిదోస్తే మధురమవుతుంది మెప్పిస్తుంది కవిత ఇచ్ఛకలిగితే ఇష్టపడితే చెంతకొస్తుంది సుఖమునిస్తుంది వనిత కవితలు వనితలు అందాలుచూపుతాయి ఆనందపరుస్తాయి అంతరంగాననిలుస్తాయి కవితలను ఆస్వాదించండి కవులను గుర్తించండి వనితలను అభిమానించండి జీవితాలను సుఖమయంచేసుకోండి కవితలు అనుభూతులు వనితలు అనుభుక్తులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాస్రవంతి ఆలోచనలు పారుతుంటే విషయాలు వెంబడించాలి భావాలు పుట్టకొస్తే బయటపెట్టమని పురమాయించాలి కలము పట్టుకుంటే అక్షరాలు జాలువారాలి కాగితం నిండితే కవిత్వం వెలువడాలి కవితలు స్రవిస్తుంటే సాహితీలోకం సుసంపన్నంకావాలి పాఠకులు చదివితే హృదయాలు ఉప్పొంగాలి మనసులు సంతసిస్తే కవులు స్థిరస్థానంపొందాలి కవులు వ్రాస్తుండాలి కైతలు పుడుతుండాలి కవిత్వం వర్ధిల్లాలి సాహిత్యం సుభిక్షమవ్వాలి కవులరాతలు అమృతంచిందాలి కవిశ్రేష్ఠులు అమరులుకావాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఓ కవిమనసు కమ్మనైన కవితనొకటి కూర్చాలని ఉన్నది సాహితీప్రియులను తట్టి లేపాలని ఉన్నది రమ్యమైన భావమొకటి పుటలపైపెట్టాలని ఉన్నది పాఠకులను భ్రమలలోనికి నెట్టాలని ఉన్నది అందమైన ప్రకృతిని అక్షరీకరించాలని ఉన్నది చదువరులను మెప్పించి శిరసులలోనిలవాలని ఉన్నది చక్కనైన పూలకయితని సృష్టించాలని ఉన్నది సుమసౌరభాలను చల్లి సంతసపరచాలని ఉన్నది రుచియైన కవనవిందుని శుచిగావడ్డించాలని ఉన్నది అక్షరాభిమానులను ఆహ్వానించి ఆరగింపజేయాలని ఉన్నది శ్రావ్యమైన కైతనొకటి ఆలపించాలని ఉన్నది కోకిలా కుహూకుహూలని తలపించాలని ఉన్నది సొంపైన షోకులాడి సొగసులని చిత్రంగా మలచాలని ఉన్నది సాహిత్యప్రియులతో చదివించి చిత్తాలనుదోచాలని ఉన్నది  సాహిత్యరంగమందు సుదూరపయనాన్ని  సాగించాలని ఉన్నది కవనసూర్యుని కిరణాలని ఖండాలందు ప్రసరించాలని ఉన్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
 వసుధైకకుటుంబం అనాధశిశువు అగుపించితే ఆరాటపడతా అండగానిలుస్తా అంగవికులుడు ఎదురొస్తే అలమటిస్తా చేయూతనిస్తా ఆకలికొన్నవాడు అయ్యాసాయమంటే ఆదుర్దాపడతా ఆర్ధికసాయమందిస్తా అక్కుపక్షి అలమటిస్తుంటే అశ్రువులుకారుస్తా అంతర్యామినినిందిస్తా అవివేకుడు తారసపడితే చేరదీస్తా ఙ్ఞానభొధచేస్తా అమాయకుడు అభ్యర్ధిస్తే సలహాలిస్తా సన్మార్గంచూపిస్తా అమానుషుడు అవధులుదాటుతుంటే అడ్డగిస్తా అంతరంగాన్నిమారుస్తా అబల అభ్యర్ధిస్తే ఆశ్రమమిస్తా ఆసరాకలిపిస్తా అందరమూ ఆత్మీయులమంటా వసుధంతా ఒకేకుటుంబమంటా అవనిని అపరస్వర్గంచేద్దాం అందరిని అన్యోన్యంగామెలగమందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం