కొన్నిటిని... కొన్నిటిని ఇచ్చుకోవాలి, కొన్నిటిని పుచ్చుకోవాలి, కొన్నిటిని మెచ్చుకోవాలి, కొన్నిటిని తెచ్చుకోవాలి. కొన్నిటిని పేర్చుకోవాలి, కొన్నిటిని జార్చుకోవాలి, కొన్నిటిని మార్చుకోవాలి, కొన్నిటిని తీర్చుకోవాలి. కొన్నిటిని తేల్చుకోవాలి, కొన్నిటిని రాల్చుకోవాలి, కొన్నిటిని వాల్చుకోవాలి, కొన్నిటిని తల్చుకోవాలి. కొన్నిటిని కోరుకోవాలి, కొన్నిటిని ఏరుకోవాలి, కొన్నిటిని చేరుకోవాలి, కొన్నిటిని జుర్రుకోవాలి. కొన్నిటిని చెప్పుకోవాలి, కొన్నిటిని ఒప్పుకోవాలి, కొన్నిటిని తప్పుకోవాలి, కొన్నిటిని కప్పుకోవాలి. కొన్నిటిని చేయించాలి, కొన్నిటిని రాయించాలి, కొన్నిటిని వాయించాలి, కొన్నిటిని జయించాలి. కొన్నిటిని ఊరించాలి, కొన్నిటిని పారించాలి, కొన్నిటిని సారించాలి, కొన్నిటిని వారించాలి. అన్నిటినీ ఆశించకూడదు, అన్నిటినీ అనుసరించకూడదు, అన్నిటినీ అతిక్రమించకూడదు, అన్నిటినీ ఆచరించకూడదు, అన్నీ మనవని అనుకోకూడదు! — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.