తరగని ప్రేమ (ఆ ప్రేమ) ఆ ప్రేమ తరగనిది తొలగనిది స్థిరమైనది ఆవిరై ఆకాశాన్ని చేరినా మేఘమై మేనుమీద చినుకులురాలుస్తుంది సిగ్గై బుగ్గలనెర్రపరచినా మొగ్గై పైటనుకప్పుకొనివస్తుంది పువ్వై వాడిపోయినా నవ్వై వదనాన్నివెలిగిస్తుంది పయనమై బహుదూరం పోయినా చిరుగాలై చల్లగా చుట్టుముడుతుంది అదృశ్యమై అగుపించకపోయినా గంధమై గుబాళిస్తుంది క్షణాలై కాలం గడచినా ఙ్ఞాపకమై వెంటపడుతుంది మాయమై మట్టిలోకివెళ్ళినా జలై చేదుకోమంటుంది కలై కవ్వించినా కవితై కాగితాలకెక్కుతుంది ఊసై ఉరుకులు తీసినా పలుకులై పెదవులనుండి ప్రవహిస్తుంది ఎక్కువై ఎన్నోసంగతులు మరచిపోయినా మనసై మెదడులో కూర్చుంటుంది చక్కదనమై సుదూరాలకుపయనించినా సంతసమై చిత్తానిచేరుతుంది భ్రమై భ్రాంతిలోపడవేసినా ప్రేమై పరవశపరుస్తుంది ఆ ప్రేమను ఎలా మరచిపోను? ఆ ఋణము ఎలా తీర్చుకోను? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Posts
Showing posts from April, 2024
- Get link
- X
- Other Apps
భువిని దివినిచేద్దాం భువిని దివినిచేద్దామురా సుఖాలని స్వంతంచేసుకుందామురా మంచిమాటలు చెప్పనా మేటిపనులను చేయమననా మొక్కలను పెంచరా మహిని పచ్చపరచరా పువ్వులను పూయించరా పొంకాలు చూపించరా వెలుగులు వెదజల్లరా తమసును తరిమెయ్యరా పరిమళాలు చల్లరా పరిసరాలు పులకించరా చిరునవ్వులు చిందించరా మోములను వెలిగించరా తేనెచుక్కలు చల్లరా తీపిపలుకులు వినిపించరా అమృతజల్లులు కురిపించరా అధరాలను క్రోలుకోమనరా శక్రిసామర్ధ్యాలు చూపరా యుక్తిచేష్టలను చెయ్యరా మంచితనమును చూపరా మానవత్వమును చాటరా మదులను ముట్టరా హృదులను తట్టరా చక్కదనాలను చూపరా సంతసాలను కలిగించరా ఈర్ష్యాద్వేషాలు విడువరా కక్షకార్పణ్యాలు వదలరా మమతనురాగాలను చూపించరా మానవబంధాలను వృద్ధిచెయ్యరా మనసులను సృజించరా మానవులను మురిపించరా భూలోకమును స్వర్గముగాచేద్దామురా మనుజలను సురలుగామారుద్దామురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సమయం సందర్భం మీ సమయం తీసుకునేదాకొంచెం సందర్భం తెలియజేసేదాస్వల్పం నాకు సమయం దొరికింది సందర్భం కుదిరింది నేటి సమయం ఉదయం సందర్భం ఆదివారం ఇప్పుడు కవిత్వం కూర్చేసమయం కుతూహలం కలిగించేసందర్భం కలలకు రూపమిచ్చేసమయం కల్పనలను కళ్ళముందుంచేసందర్భం అందాలను వర్ణించేసమయం ఆనందాలను పంచిపెట్టేసందర్భం సూర్యోదయాన్ని దర్శించేసమయం జనాన్ని మేలుకొలిపేసందర్భం పువ్వులు పూచేసమయం పూజలు చేసేసందర్భం ప్రార్ధనలు చేసేసమయం వరాలను కోరేసందర్భం సమయం మించను సందర్భం వదలను సమయం సద్వినియోగపరుస్తా సందర్భం సవివరంగాతెలియజేస్తా సమయానుసారం మాట్లాడుతా సందర్భానుసారం నడుచుకుంటా సమయోచితంగా ప్రవర్తిస్తా సందర్భోచితంగా వ్యాఖ్యానిస్తా సమయపాలన పాటిస్తా సందర్భపాలన చూపిస్తా సమయం కలిసొచ్చింది సందర్భం అనుకూలించింది సమయస్ఫూర్తి కలిగిస్తా సందర్భస్పృహని ఎరిగిస్తా సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సందర్భం కలిసొచ్చినందుకు కృతఙ్ఞతలు గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెంచుకోలేని ప్రేమ కవిత కవ్వింపులకుదిగింది వ్రాత సాగించమంటుంది గాలి హోరుగావీస్తుంది వాన జోరుగాకురుస్తుంది తుఫాను తరుముకొస్తుంది కడలి కల్లోలమయ్యింది కల గుర్తుకొస్తున్నది స్మృతి వదలకున్నది కధ చివరకురాకున్నది కంచికి చేరవేయమంటున్నది ఆరంభం అదిరిపోయింది అంతం చేరుకోమంటుంది తేనెతుట్టె కదిలింది తేనెటీగలను లేపింది దారి రమ్మంటున్నది అడుగులు వేయమంటున్నది చేయి సాగుతున్నది పని జరగుతున్నది ఊహలు వెంటబడుతున్నాయి ఉల్లము ఉరకమంటున్నది కధ ముగింపులేనిదయింది కల మరవనీయనిదయింది కళ్ళు మూతబడకున్నవి చెవులు నిక్కరించుకున్నవి ప్రేమ తగ్గకున్నది భ్రమ తొలగకున్నది కవిత దోరబుచ్చుకున్నది ప్రేమబంధము తెగిపోనిదయ్యింది అది గాలికాదు కవనపయనం అది వానకాదు కవితలవర్షం అది ప్రేమకాదు సాహితీప్రణయం అవి సంకెళ్ళుకావు కవిత్వబంధం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తొలికవితలు తొలికోడి కూసింది నిదురనుండి లేపింది తొలికిరణం ప్రసరించింది తలపైవెలుగులు చిమ్మింది తొలిపువ్వు తోటలోపూచింది త్వరగారమ్మని తొందరాచేసింది తొలితలపు తట్టింది తొలికవిత పుట్టింది తొలిపత్రిక ఇంటికొచ్చింది తొలిగానాకవితను మోసకొచ్చింది తొలికవితాపోటీ జరిగింది తొలిగానాకవిత నిలిచింది తొలిపురస్కారం నాకుదక్కింది తొలిబహుమానం నాదరిచేరింది కవిసమ్మేళనములో తొలిగా నన్నుపిలిచారు సన్మానాల్లో తొలిగా నన్నుసత్కరించారు తొలిగా అన్నిటా నేనుంటా తొలిస్థానంలో నాకవితలు నిలుపుతా తొలిగా చదువుతారా తొలిగా స్పందిస్తారా తొలిపేరు తెచ్చుకుంటా తొలిసంబరాలు జరుపుకుంటా తొలిపుస్తకము తీసుకొస్తా సుమసౌరభాలు వెదజల్లుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నన్ను తెలుసుకో గుండెను తెరుస్తున్నా లోపలకు తొంగిచూడు హృదయాన్ని ముందుంచుతున్నా తపనను తిలకించు తల తలుపులుతీస్తున్నా తలపులను తెలుసుకో మనసును విప్పుతున్నా భావాలను గ్రహించు అధరాలు ఆడించుతా వాస్తవాలు వివరించుతా ఏమి చెయ్యమంటావు ఇంకేమి చెయ్యమంటావు ఎలా ఎరిగించమంటావు నన్నెలా తెలుసుకుంటానంటావు కవిని కలముపట్టినవాడిని కైతలని కుమ్మరించేవాడిని అక్షరాల వెనకకువెళ్ళు పదాల పరమార్ధమెరుగు కవితలను చదువు కవులను ఎరుగు కవిత్వాన్ని ఆస్వాదించు సాహిత్యాన్ని సంరక్షించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పున్నమిరోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు చంద్రుడు ఉదయిస్తున్నాడు రవి అరుణకిరణాలుచల్లుతున్నాడు శశి ధవళకాంతులుచిమ్ముతున్నాడు పగలు పరుగెత్తుతుంది వెన్నెల వెంటబడుతుంది అందం ఆకాశాన్ని ఆవరించింది ఆనందం అంతరంగాలను చేరింది జాబిలి నింగిలో నిండుగాకనిపిస్తున్నాడు వెన్నెలని నేలమీద పిండిలాపరుస్తున్నాడు మబ్బులు చంద్రుడితో ఆడుకుంటున్నాయి మదులు కాంచి మురిసిపోతున్నాయి ఆత్రేయుడు పరుగెడుతున్నాడు అకల్క వెంటపడుతుంది కలువలు విచ్చుకుంటున్నాయి చెరువులు సంబరపరుస్తున్నాయి తారలు తళతళలాడుతున్నాయి మోములు ధగధగామెరుస్తున్నాయి మల్లెలు మత్తెక్కిస్తున్నాయి ప్రేమికులు పరవశించిపోతున్నారు కారుమబ్బులు తేలుతున్నాయి కలాలు కదులుతున్నాయి ఊహలు ఊరుతున్నాయి భావాలు బయటపడుతున్నాయి కలాలు కక్కుతున్నాయి కాగితాలు నిండుతున్నాయి కవులు కష్టపడుతున్నారు కవితలు పుట్టకొస్తున్నాయి అందాలు అలరిస్తున్నాయి ఆనందాలు అందుతున్నాయి పున్నమి పులకరిస్తుంది కౌముది కుతూహలపరుస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా కలంకబుర్లు ఎవరు నేర్పారమ్మ ఈ కలముకు కమ్మని కవితలను కూర్చమని ఎవరు చెప్పారమ్మ ఈ కలముకు ఆలోచనలకు అక్షరరూపము నివ్వమని ఎవరు ఇచ్చారమ్మ ఈ కలముకు ప్రకృతిని అర్ధంచేసుకునేశక్తి పుటలపై భావాలనుపెట్టేయుక్తి ఎవరు అర్ధించారమ్మ ఈ కలమును అందాలను అందించమని ఆనందాలను పంచిపెట్టమని ఎవరు శాసించారమ్మ ఈ కలమును పూలకవితలను పెక్కుటిని అల్లమని ఎవరు అడిగారమ్మ ఈ కలమును కాలాన్నికేటాయించమని కడుకైతలను కాగితాలపైపెట్టమని ఎవరూ కోరారమ్మ ఈ కలమును రెచ్చిపొమ్మని రసరమ్యగీతాలను రాయమని ఎవ్వరూ ఈ కలమును నానుండి లాక్కోవద్దు ఎవ్వరూ ఈ కలమును నానుండి వేరుచేయవద్దు ఎవ్వరూ ఈ కలాన్ని గాయాలపాలు చేయవద్దు ఈ కలం నా హృదయం ఈ కలం నా ప్రాణం ఈ కలం నా ఉచ్ఛ్వాస ఈ కలం నా నిశ్వాస కలమే నా ప్రతిక్షణం కలమే నా ప్రతిదినం నా కలం నా బలం నా నేస్తం నా జీవితం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
గాలిని నిత్యసంచారిణి నేను గాలిని నిత్య సంచారిణి కళ్ళకు కనబడకుంటా ఉనికిని చాటుతుంటా పిలిస్తే చిన్నగా చెంతకు చేరుతా ఆహ్వానిస్తే చల్లగా మేనును తాకుతా నిందిస్తే స్తంబిస్తా ఉక్కిరిబిక్కిరి చేసేస్తా తిడితే వేగంగా వీస్తా ఇబ్బందిపెడతా స్వాగతిస్తే సుగంధాలు పట్టుకొస్తా పరవశపరుస్తా గౌరవిస్తే సంబరపడుతా పరిసరాలను పరిశుభ్రపరుస్తా ద్వేషిస్తే ఉగ్రరూపందాలుస్తా ఇల్లనుచెట్లను కూల్చిపారేస్తా ప్రేమిస్తే పరుగెత్తుకుంటూవస్తా ప్రాణవాయువును గుండెలకందిస్తా ధూషిస్తే మబ్బులనుతేలుస్తా వానలుకురిపిస్తా వరదలుపారిస్తా విమర్శిస్తే సుడులుతిరుగుతా ధూళినిలేపుతా దుమ్మునుకళ్ళల్లోచల్లుతా పూజిస్తే ప్రసన్నుడనవుతా ప్రశాంతతకలిపిస్తా ప్రమోదపరుస్తా తలలుతాకి ఆలోచనలుపారిస్తా తరంగములయి ఆలాపనలువినిపిస్తా నిరంతరం ప్రసరిస్తుంటా నిత్యం పయనిస్తుంటా మానవులకు తోడుగుంటా మదులను మురిపిస్తుంటా సోకుతూ సంచరిస్తుంటా తడుతూ తిరుగుతుంటా నాకు సరిహద్దులులులేవు పరిమితులులేవు వంకలులేవు ఆటంకాలులేవు నాకు దిక్కులులేవు రహస్యాలులేవు బంధుత్వాలులేవు సంకెళ్ళులేవు నేనే గాలిని చిరుగాలిని వడిగాలిని సుడిగాలిని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మన తెలుగుకోసం గుప్పెడు అక్షరాలను గుమిగూడుస్తా కాసిని పదాలను ఎన్నుకుంటా కొన్ని ఆలోచనలను పారిస్తా కూసిని భావాలను పుట్టిస్తా కొంత సమయం తీసుకుంటా కొంచం తేనెను పులుముతా కొంచెం గంధాన్ని చల్లుతా కాస్త వెలుగును ప్రసరిస్తా కొలది కవితలను కూరుస్తా కొద్ది పాటలను పాడుతా కొందరి మనసులను దోచుకుంటా కొల్ది క్షణాలు కేటాయిస్తారా కాసేపు కవిని తలుస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అక్షరజల్లులు అక్షరాలు ఆవిరై ఆకాశాన్నిచేరాయి అంబుధాలు ఆకర్షించి ఘనీభవించాయి అందాలు అత్రేయుడునుండి పొందాయి అమృతచుక్కలు అకల్కనుండి స్వీకరించాయి రంగులు హరివిల్లునుండి తీసుకున్నాయి కాంతులు సూర్యుడినుండి వశపరుచుకున్నాయి తళుకులు తారలనుండి పుచ్చుకున్నాయి మెరుగులు మెరుపులనుండి అందుకున్నాయి భ్రమణాలు భూమినిండి నేర్చుకున్నాయి పరిమళాలు పూలనుండి సేకరించాయి కొండాకోనలు కనిపించి కుతూహలపరచాయి సెలయేర్లు సందడిచేసి సంతసపరిచాయి తేనెలు పూలనుండి తెచ్చుకున్నాయి రెక్కలు పక్షులనుండి ప్రాప్తించుకున్నాయి చినుకులు చిటపటా పడుతున్నాయి గంగాజలాలు గలగలా పారుతున్నాయి మనసులు సముద్రాలు అవుతున్నాయి ఆలోచనలు అలలై ఎగిసిపడుతున్నాయి అక్షరచుక్కలు నింగినుండి కురుస్తున్నాయి అక్షరపంటలు నేలమీద పండుతున్నాయి అక్షరబొట్టులు కలాలనుండి కారుతున్నాయి అక్షరపంక్తులు కాగితాలపై కూర్చుంటున్నాయి కలాలు కవితలను కూర్చుతున్నాయి కాగితాలు భావాలకు రూపమిస్తున్నాయి అక్షరజల్లులు అంతరాంగాలను అలరించుతున్నాయి పరవశాలు పాఠకులచెంతకు చేరుతున్నాయి క్షరరహితాలు కథలై చదివిస్తున్నాయి కవితలై పాడిస్తున్నాయి సాహిత్యమై చిరకాలంనిలుస్తున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్...
- Get link
- X
- Other Apps
చెలిసింగారాలు పొంకమో పరిమళమో పువ్వు పట్టేస్తుంది అందమో ఆనందమో అతివ ఆకట్టుకుంటుంది వయసో వన్నెయో వనిత వయ్యారాలొలుకుతుంది తోషమో తన్మయత్వమో తరుణి తలనుతడుతుంది చూపును తిప్పలేకున్నా మోమును మరల్చలేకున్నా పువ్వును ప్రేయసికొప్పులోగుచ్చుతా నవ్వును నెచ్చెలికివినిపిస్తా చెలిని లాలిస్తా ప్రేమను కురిపిస్తా అవకాశాన్ని సద్వినియోగంచేసుకుంటా అదృష్టానికి సంబరపడిపోతా ఆలశ్యం చేయను అమృతాన్ని చేజార్చుకోను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నేను నేను పైకి పైపైకి మరింతపైకిలేస్తా నన్ను మాటలతో కాల్చిమసిచేయకండి చూపులతో ఛిద్రముచేయకండి ద్వేషంతో దుర్భాషలాడకండి నాపై కోపాన్ని చూపకండి విషాన్ని చిమ్మకండి నిప్పును విసరకండి నేను కడలి కెరటంలా ఎత్తుకెగిరిపడి తిరిగి ఎగిసిపడుతా నేను తూర్పున సూర్యుడిలా నిత్యం ప్రొద్దున్నే ఉదయిస్తుంటా నేను చంద్రుని వెన్నెలలా కురుస్తూ ఆనందింప జేస్తుంటా నేను తాజా పువ్వులా అందాలుచూపి పరిమళాలు వెదజల్లుతుంటా నేను కరిగిన హిమములా గంగానదిలా క్రిందకు ప్రవహించుతుంటా నన్ను వక్రీకరించకండి నాపై బురదచల్లకండి అయినా నిజాలు వెల్లడిస్తుంటా నన్ను అనుమానించకండి నాపై అభాండాలు వేయకండి అయినా అసలువిషయాలు తెలియజేస్తుంటా నన్ను దూరంగాపెట్టకండి నాపై ధూషణలు గుప్పించకండి అయినా అందరికీ చేరువవుతా నన్ను కట్టడిచేయకండి నాపై బాణాలు సంధించకండి అయినా స్వేచ్ఛగా బయటకొస్తా నన్ను అపార్ధంచేసుకోకండి నాపై నిందలు మోపకండి అయినా మనసువిప్పి ముందుంచుతా నన్ను కర్రలతోకొట్టకండి నాపై మాటలతూటాలు ప్రేల్చకండి అయినా తట్టుకొని తలయెత్తుకొనితిరుగుతా నన్ను హింసించకండి నాపై నిందలు వేయకండి అయినా నిజాయితీ నిరూపించుకుంటా నన్ను వెలివేయకండి నాపై అసత్యాలు ప్...
- Get link
- X
- Other Apps
కవులకు స్వాగతం (కవిహృదయం) ఎందుకు ఈ సమ్మేళనాలు ఎందుకు ఈ సమాగమాలు ఏల కవులనొకచోటచేర్చటాలు ఏల కోకిలలనుకూయించటాలు ఎందుకా కవితలను కొనసాగించటానికి భాషను బ్రతికించటానికి సాహిత్యాన్ని వృధ్ధిచెయ్యటానికి కలంపట్టిన కవులకు గళంవిప్పెడి కోయిలలకు కైతలువ్రాసిన బ్రహ్మలకు సాదరస్వాగతం పలుకుతా అందాలను వర్ణించేవారికి ఆనందాలను కలిగించేవారికి మోములను వెలిగించేవారికి హార్ధికసుస్వాగతం చెబుతా ఊహలను ఊరించేవారికి అక్షరాలను అల్లేవారికి పదాలను పారించేవారికి మనఃపూర్వక ఆహ్వానమందిస్తా పొగడ్తలుగుప్పించేవారికి ప్రోత్సహించేవారికి పరవశపరిచేవారికి ప్రియాత్మక ఆమంత్రణమంటా ప్రశంసాపత్రాలు ఇచ్చేవారికి బహుమతులు అందించేవారికి శాలువాలు కప్పేవారికి హృదయపూర్వక ధన్యవాదాలుతెలియజేస్తా సభకువిచ్చేసిన అతిధులకు వినటానికొచ్చిన ప్రేక్షకులకు చూడటానికొచ్చిన వీక్షకులకు ప్రేమపూర్వక కృతఙ్ఞతలుతెలుపుతా భావాలతో ఆకర్షించేవారికి శ్రావ్యతతో వీనులవిందుచేసేవారికి అంతరంగాలను ఆకట్టుకొనేవారికి అభిమానాభిమంత్రణం వ్యక్తపరుస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
చిరుగాలులు చిరుగాలులు వీస్తుంటే చిరుకొమ్మలు ఊగుతుంటే కళ్ళుచూస్తాయి అందాలు వళ్ళుపొందుతుంది ఆనందాలు చిరుగాలులు సాగుతుంటే చిరుమోములకు తగులుతుంటే మురిసిపోతుంది నాహృదయం వెలిగిపోతుంది నావదనం చిరుగాలులు సందడిచేస్తుంటే చిటపటచినుకులు పడుతుంటే ఆలపిస్తుంది నా అంతరంగము అమృతవర్షం వినిపిస్తుంది రాగము చిరుగాలులు సంతసపరిస్తే చిరుముత్యాలు రాలుతుంటే పొంగిపోతుంది నా మనసు పరవశపరుస్తుంది ఆ సొగసు చిరుగాలులు సుగంధాలుచల్లుతుంటే చిరునవ్వులు కలిగిస్తుంటే ఉప్పొంగుతుంది నా మది ఉవ్విళ్ళూరుతుంది నా హృది చిరుగాలులు మబ్బులనెడుతుంటే చిత్రమైనరూపాలు కనబడుతుంటే ఆకర్షిస్తుంది ఆకాశం ఆనందపరుస్తుంది ఆదృశ్యం చిరుగాలులు వంటినితాకుతుంటే చల్లనిస్పర్శ పులకిస్తుంటే సంబరపడుతుంది నా శరీరం చెలరేగిపోతుంది నా మానసం చిరుగాలులకు స్వాగతం చిరునవ్వులకు సుస్వాగతం చిరుజల్లులకు ఆమంత్రణం చల్లదనాలకు ఆహ్వానం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవరు? వారెవరు? కవ్విస్తే ఎవరయినా రెచ్చిపోయేవారున్నారా కలమునుపట్టేవారున్నరా పొగిడితే ఎవరయినా పొంగిపోయేవారున్నారా పదాలనుపొసిగేవారున్నారా కవిసమ్మేళనానికిపిలిస్తే ఎవరయినా పరుగెత్తుకుంటూవెళ్ళేవారున్నారా పాడిపరవశపరచేవారున్నారా శాలువాకప్పితే ఎవరయినా సంతసపడేవారున్నరా ధన్యవాదాలుచెప్పేవారున్నారా కవితనువినిపించమంటే ఎవరయినా ముందుకొచ్చేవారున్నారా మురిపించేవారున్నారా ఉగాదికైతనువ్రాయమంటే ఎవరయినా స్పందించివ్రాసేవారున్నారా అద్భుతంగావర్ణించేవారున్నారా అందాలనుచూపమంటే ఎవరయినా సరేననిసమ్మతించేవారున్నారా చక్కగాచూపించేవారున్నారా ఆనందాలనుపంచమంటే ఎవరయినా కైతలను పంపేవారున్నారా కుతూహలపరచేవారున్నారా ఎవరు వారు ఇంకెవరు కవివర్యులు తప్ప కల్పనాచతురులు తప్ప కవి అల్పసంతోషుడు మాటలమాంత్రికుడు అక్షరాల నేతగాడు కవిబ్రహ్మలను అలుసుగాచూడొద్దు అమర్యాదచెయ్యొద్దు అణచివేయవద్దు కవులను ఆదరిద్దాం వెన్నుతడదాం గౌరవిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
జీవితమా! ప్రకృతి దృశ్యంలా అద్దాల సౌధంలా అందాల బొమ్మలా శ్రావ్య రాగంలా చక్కెర తీపిలా జీవితమా సాగిపో బండి చక్రాల్లా కడలి కెరటాల్లా కాంతి ప్రసారణలా గాలి పయనములా జింకల పరుగుల్లా కాలమా గడచిపో రవి కిరణములా శశి వెన్నెలలా తారల తళుకుల్లా మెరుపు తీగల్లా ఇంద్ర ధనస్సులా కాయమా వెలిగిపో ఆకాశంలో మేఘాల్లా ఎగురుతున్న పక్షుల్లా పూలపై తుమ్మెదల్లా సుమాల సౌరభంలా నీటి ఆవిరిలా చైతన్యమా కదలిపో ఊరుతున్న జలలా ఉరుకుతున్న సెలయేరులా పొంగుతున్న పాలులా ప్రవహిస్తున్న నదిలా కరుగుతున్న హిమంలా మనసా ముందుకుపో అక్షర సుమాల్లా పదాల మాలల్లా ఊహల పందిరిలా భావ పరంపరలా కమ్మని కల్పనల్లా కవితా రూపందాల్చుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అక్షరాలు అక్షరాలు తోడై వెంటనడుస్తున్నాయి అక్షరాలు దివ్వెలై వెలుగులుచిమ్ముతున్నాయి అక్షరాలు పువ్వులై పరిమళాలువెదజల్లుతున్నాయి అక్షరాలు నవ్వులై మోములనువెలిగిస్తున్నాయి అక్షరాలు చినుకులై వర్షిస్తున్నాయి అక్షరాలు పలుకులై తేనెచుక్కలనుచల్లుతున్నాయి అక్షరాలు మిఠాయిలై తీపినితినిపిస్తున్నాయి అక్షరాలు జాబిలై వెన్నెలనుకురిపిస్తున్నాయి అక్షరాలు తారకలై తళుకుతళుకుమంటున్నాయి అక్షరాలు అమృతచుక్కలై అధరాలనుక్రోలమంటున్నాయి అక్షరాలు సత్యాలై వాస్తవాలనుచూపుతున్నాయి అక్షరాలు తీగలై ప్రాకుతున్నాయి అక్షరాలు మొక్కలై కాయలుకాస్తున్నాయి అక్షరాలు ముత్యాలై సరాలుగాగుచ్చమంటున్నాయి అక్షరాలు ఆలోచనలకురూపమై కవితలవుతున్నాయి అక్షరాలు భావాలై మనసునుహత్తుకుంటున్నాయి అక్షరాలు పుటలకెక్కి పుస్తకాలవుతున్నాయి అక్షరాలు నాకుతోడు నేను అక్షరాలకుతోడు మేము కలసిముందుకునడుస్తాము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఉందిలే మంచికాలం అనుకున్నవి జరగలేదని అలమటించకు అనుకోనివి జరిగాయని హాతాశుడవుకాకు కష్టాలు వచ్చాయని కలతచెందకు నష్టాలు ప్రాప్తించాయని నిరాశపడకు గుండెను నిబ్బరించి దిటువుచేసుకో మదికి నచ్చచెప్పి దారికితెచ్చుకో మంచిరోజులు వస్తాయని ఎదురుచూడు ఎండినచెట్లు చిగురిస్తాయని తెలుసుకో మారాకులుతొడిగి మొక్కలు మళ్ళీపూస్తాయని గుర్తించుకో చీకటినితరిమి వెలుగు విస్తరించక మానదనుకో ఆశలు తప్పక తీరుతాయని ప్రతీక్షించు కోర్కెలు సిద్ధిస్తాయని కాచుకోనియుండు పాత అనుభవాలను మరచిపో కొత్త అనుభూతులను తలచుకో చేదు ఙ్ఞాపకాలను చెడిపెయ్యి తీపి కబుర్లకు తెరతియ్యి ఉందిలే మంచికాలము ముందుముందునని ఎరిగి మసులుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఆలోచించు ఏదారిన నడుస్తావు నిజాయితీగా ఎన్నాళ్ళు ఉంటావు ఎంతదూరం పయనిస్తావు లక్ష్యాలను ఎపుడు చేరుకుంటావు ఎంతసమయం చూస్తావు అందాలను ఎప్పటిదాకా ఆస్వాదిస్తావు ఎందాకా ఏకాకిగావుంటావు తోడును ఎపుదు తెచ్చుకుంటావు ఏరీతిగా స్పందిస్తావు అందరినీ ఎలా ఆకర్షిస్తావు ఎవరెవరిని ఆహ్వానిస్తావు మర్యాదలు ఎమేమి చేస్తావు ఎక్కడిదాకా వెళతావు చేరి ఏమి సాధిస్తావు ఎంతసేపు ఆలోచిస్తావు తుదినిర్ణయము ఎపుడు తీసుకుంటావు ఎవరుచెప్పింది వింటావు తదుపరి ఎలా స్పందిస్తావు ఎవరికోరిక మన్నిస్తావు ఇచ్చినమాటను ఎట్లా నిలుపుకుంటావు ఎవరిని ప్రసన్నంచేసుకుంటావు నమ్మకాన్ని ఎప్పటిదాకా నిలుపుకుంటావు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పుర్రెకోబుద్ధి బుర్రకోబుద్ధి భూలోకమందున పుర్రెకోపద్ధతి పుడమినందున పుచ్చెకోపిచ్చి భూగోళమందున తలకోతలపు ధరణినందున శిరస్సుకోచాపల్యము జగమునందున నెత్తికోనడక విశ్వమందున మస్తకానికోదారి మహినందున సిరముకోప్రత్యేకత సారంగమందున మూర్ధానికోప్రీతి మేదినందున ఔదలకో ఔపోసన అవనినందున మస్తముకో అందము జగతినందున మనిషికోవిశిష్టత వసుధనందున మనుజులచూచి మసలుకోవోయి మంచినిగమనించి నడుచుకోవోయి ఎదుటివారినితెలుసుకొని ప్రవర్తించవోయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
షడ్రుచుల పచ్చడికోసం ఉగాదిపండుగ వచ్చిందని ఉగాదిపచ్చడిని తినాలని ఉబలాటపడి ఉత్సాహంగా ఎదురుచూశా సంవత్సరాది శుభాలపండుగని సంబరపడి సూర్యోదయాన్నేలేసి స్నానముచేశా వేపపూతకోసమని పూచినచెట్టుకోసమని వెతికివెతికి పట్టుకొని కోసుకొని ఇంటికితీసుకొచ్చా మామిడికాయలకోసమని మైలుదూరముతిరిగి ఖరీదయినా సరేనని రెండుకాయలు కొనుక్కొనివచ్చా లేతపచ్చి మిరపకాయలుకొని ఇంటికి పట్టుకొచ్చి సన్నసన్నముక్కలుగా తరగమని ఆదేశాలిచ్చా కొత్తచింతపండునుకొని నీళ్ళలో నానబెట్టించి గుజ్జును తియ్యమని పురమాయించా ఉప్పులేనిపదార్ధము వ్యర్ధమని చప్పదనమునుపోగొట్టాలనిచెప్పి ఓ పొట్లాము ఉప్పునుతెచ్చి భార్యామణిచేతికిచ్చా ఉత్సాహపరచి ఉద్వేగపరచి ఉగాదిపచ్చడిని ఉత్తమంగా చేయించా అందరంకలసి పూజలుచేసి ఉగాదిపచ్చడినితిని పరవశించాం సంవత్సరమంతా షడ్రుచులపచ్చడి సంతోషమిస్తుందని చూపుతుందనిమహత్యం ఎగిరిగంతులేశా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం అందరికీ ఉగాది శుభాకాంక్షలు
- Get link
- X
- Other Apps
కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమంది కొత్తవ్యక్తులు తారసపడి తన్మయపరచి జీవితాంతం తోడుగానిలిచిపోతారు కొన్నిసార్లు కొన్ని కలలొచ్చి నిద్రనుండిలేపి కొన్ని అనుభూతులుకలిగిస్తాయి కొన్నిసార్లు అందాల హరివిల్లు వాననుతరిమేసి సప్తవర్ణాలలో ఆకాశంలోదర్శనమిచ్చి సంతసమిస్తాయి కొన్నిసార్లు గడుసరి తేనెటీగలు పూతేనెను తస్కరించి తుట్టెలోదాచుకొని సంబరపరుస్తాయి కొన్నిసార్లు మొగ్గగాపుట్టి వికసించి పూలు పొంకాలుచూపి పరిమళాలువెదజల్లి ప్రమోదపరుస్తాయి కొన్నిసార్లు పెదాల నవ్వులుపుట్టి తలను తట్టి మోమును వెలిగిస్తాయి కొన్నిసార్లు మనసులో ఊహలుమెరిసి మాయమయిపోయి కవితలను వ్రాయిస్తాయి కొన్ని క్షణాలు కొన్ని సార్లు కొన్ని రహాస్యాలుచూపించి కొన్నిపనులను చేయిస్తాయి కొన్ని మంచి క్షణాలకోసం ఓపికగా ఎదురుచూస్తూ కాలముగడుపుదాము జీవితాన్ననుభవిద్దాము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితలంటే? మనసులో మెరుపులు కలము కదలికలు కాగితాల్లో కూర్పులు కవితలు తోటలో విరబూసినపువ్వులు రంగుల సీతాకోకచిలుకలు ఎగురుతున్న తూనీగలు కవితలు నింగిలోని నిండుచంద్రుడు వెన్నెల చల్లదనాలు కన్నుల కమ్మదనాలు కవితలు వాన చినుకులు పారు నదులు కడలి కెరటాలు కవితలు చెరకు రసాలు మామిడి ఫలాలు తియ్యని జిలేబీలు కవితలు ఊహల పరుగులు హృది స్పందనలు మది పొంగులు కవితలు అమృత చుక్కలు సుమ సౌరభాలు కాంతి కిరణాలు కవితలు అక్షర ముత్యాలు గుచ్చిన సరాలు దాల్చిన కంఠాలు కవితలు మాటలుకట్టిన మూటలు పెదాలుప్రేల్చిన తూటాలు కవులుచెప్పెడి పాఠాలు కవితలు కవితలు చదవండి ఆనందించండి కవులనుతలవండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
చెలిసొగసులు దాని గాజులు గల్లుగల్లు మంటుంటే దాని గజ్జెలు ఘల్లుఘల్లు మంటుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని కాటుకకళ్ళు కవ్విస్తుంటే దాని ఎర్రనిపెదవులు రమ్మంటుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని పలుకులు తేనెచుక్కలు చల్లుతుంటే దాని కులుకులు ఒయ్యారాలు ఒలుకుతుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని చిరునవ్వులు మోమును వెలిగిస్తుంటే దాని తలపువ్వులు సువాసనలు చల్లుతుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని నడుము అటునిటు ఊగుతుంటే దాని రూపము కళకళ లాడుతుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని సరసాలు సంబరపరుస్తుంటే దాని వేషాలు మరులుకొలుపుతుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని నగలు ధగధగ లాడుతుంటే దాని కురులు గాలికి ఎగురుతుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని తెల్లనిరంగు వెలుగుతుంటే దాని ఎర్రనిబుగ్గలు సిగ్గులొలుకుతుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది నా మనసు దాని అడుగులు హంసను తలపిస్తుంటే దాని పరుగులు జింకను గుర్తుకుతెస్తుంటే లాగేస్తున్నది దాని సొగసు మురిసిపోతుంది న...
- Get link
- X
- Other Apps
నువ్వు నీవు ఎందుకు పుడతావు ఎక్కడికి తీసుకెళ్తావు ఏమి చేయిస్తావు నీవు తలలో దూరతావు నీరులా పారుతావు గాలిలా వ్యాపిస్తావు నీవు వేడిని పుట్టిస్తావు బుర్రను గోకిస్తావు ఆదేశాలు జారీచేస్తావు నీవు చక్కదనాలు చూపిస్తావు సంతసాలు కలిగిస్తావు సర్వము తెలుసుకోమంటావు నీవు వెలుగులు చిమ్ముతావు చీకటిని పారద్రోలతావు పగటికలలు కనమంటావు నీవు సౌరభాలు వెదజల్లుతావు పరిసరాలు పరిశుభ్రంచేయిస్తావు పీల్చువారిని పులకరింపజేస్తావు నీవు ప్రేమజల్లులు కురిపిస్తావు ఆశలు ఎన్నోమదిలోలేపుతావు పనిలోకి తక్షణందింపుతావు నీవు గాలిలో ఎగరమంటావు ఆకాశంలోకి వెళ్ళమంటావు మబ్బులపై స్వారీచేయమంటావు నీవు జాబిలిపైకెక్కి తిరగమంటావు తారలతో సహవాసంచేయమంటావు నవలోకాన్ని సృష్టించమంటావు నీవు మెరుపులా వస్తావు మరుక్షణం మాయమవుతావు మెదడుపై ముద్రవేసివెళ్తావు నీవు కళ్ళకుపనిని అప్పగిస్తావు చూపులను కేంద్రీకరించమంటావు కనుగొన్నదాన్ని విశ్లేషించమంటావు నీవు నోటిని తెరవమంటావు ప్రశ్నలు కుమ్మరిస్తావు సమాధానాలు రాబడతావు నీవు కలమును పట్టమంటావు కాగితమును తియ్యమంటావు కరానికి పనిపెడతావు నీవు కవితలను కమ్మగాకూర్చమంటావు పాఠకులను పరవశింపజేయమంటావు సాహిత్యలోకంలో స్థి...
- Get link
- X
- Other Apps
ఏమిపని? తోడుకోసం వెదకవలసిన పనిఏమున్నది? అప్సరస స్వర్గలోకంనుండి చెంతకుచేరినపుడు బుగ్గలకు పౌడరుతోపని ఏమున్నది? సిగ్గులు ఎర్రరంగును పులిమినప్పుడు అధరాలకు త్రాగవలసినపని ఏమున్నది? అమృతజల్లులు అడగకుండా అందినపుడు ఇంటికి దీపంతోపని ఏమున్నది? మోములు చిరునవ్వులు చిందుచున్నప్పుడు కళ్ళను మూసుకోవలసినపని ఏమున్నది? కమ్మదనాలు కనువిందు చేస్తున్నపుడు నిశరాత్రి నిద్రతోపని ఏమున్నది? నెరజాణ నీప్రక్కనే ఉన్నప్పుడు రుచికి మిఠాయిలతోపని ఏమున్నది? చెలిపలుకులు తేనెచుక్కలను చిమ్ముతున్నప్పుడు గంధం పూచుకోవలసినపని ఏమున్నది? మల్లెపూలు చెలికొప్పులో ఘుమఘుమలాడుతున్నప్పుడు చెలిని చేజార్చుకోవలసినపని ఏమున్నది? సదుపాయాలు చక్కగా అందిస్తున్నప్పుడు కవితకోసం కాచుకొనేపని ఏమున్నది? ఆలోచనలు అంతరంగాన్ని అంటినప్పుడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎందుకో ఏమో? వెన్నెల వీడాలనుకోవటంలేదు నిద్దుర పోవాలనుకోవటంలేదు పువ్వును నలపాలనుకోవటంలేదు కాళ్ళతో తొక్కాలనుకోవటంలేదు సోమరిని అవుదామనుకోవటంలేదు జూదరిని కావాలనుకోవటంలేదు స్నేహాన్ని విడిచిపెట్టాలనుకోవటంలేదు మౌనాన్ని దాల్చాలనుకోవటంలేదు చెలిని మరచిపోవాలనుకోవటంలేదు మోసము చేయాలనుకోవటంలేదు చీకటిని కోరుకోవటంలేదు అక్రమాలకు ఒడిగట్టాలనుకోవటంలేదు పస్తులు ఉండాలనుకోవటంలేదు ఆస్తులు కూడగట్టుకోవాలనుకోవటంలేదు ప్రేమను త్యజించాలనుకోవటంలేదు కోపమును వ్యక్తపరచాలనుకోవటంలేదు పొగడ్తలకు పొంగిపోవాలనుకోవటంలేదు విమర్శలకు భయపడానుకోవటంలేదు కలమును పట్టకూడదనుకోవటంలేదు కవితలను కూర్చకూడదనుకోవటంలేదు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎదురుచూస్తున్నా! ఋతువు మార్పుకోసం ఎదురుచూస్తున్నా! శిశిరమాసం అంతంకోసం ఎదురుచూస్తున్నా! చైత్రమాసం ఆరంభంకోసం ఎదురుచూస్తున్నా! వసంతమాసం ఆగమనానికోసం ఎదురుచూస్తున్నా! ఉగాది షడ్రుచులకోసం ఎదురుచూస్తున్నా! మల్లెల పరిమాళాలకోసం ఎదురుచూస్తున్నా! కోకిల కుహూకుహూరాగాలకోసం ఎదురుచూస్తున్నా! మామిడి పండ్లకోసం ఎదురుచూస్తున్నా! చెట్లు పచ్చబడాలని ఎదురుచూస్తున్నా! యుగాది పచ్చడితినాలని ఎదురుచూస్తున్నా! గుడిలో పూజలుచేయటంకోసం ఎదురుచూస్తున్నా! గోపాలస్వామిరుక్మిణీల కళ్యాణంచెయ్యటంకోసం ఎదురుచూస్తున్నా! దేవుడిని ఊరిలో ఊరేగించటంకోసం ఎదురుచూస్తున్నా! పంచాంగ శ్రవణంకోసం ఎదురుచూస్తున్నా! తెలుగుసంవత్సరాది కవితనువ్రాయటానికోసం ఎదురుచూస్తున్నా! కవులను కలుసుకోవటంకోసం ఎదురుచూస్తున్నా! కవితాగానంతో ప్రేక్షకులనుపులకరించాలని ఎదురుచూస్తున్నా! కవుల సమ్మేళనాలకోసం ఎదురుచూస్తున్నా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం