Posts

Showing posts from October, 2024
Image
 డాక్టర్ ఎ యస్ రావుకు 21వ వర్ధంతి సందర్భముగా ఘన నివాళులు  31-10-24వ తేదీ ఉదయం ఎ యస్ రావునగర్ లో డాక్టర్ ఎ యస్ రావునగర్ నివాసుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఎ యస్ రావు గారి 21వ వర్ధంతి సందర్భంగా అతిధులు, ఐదుగురు  కవులు మరియు వక్కృత్వపు పోటీలో గెలుపొందిన నలుగురు అణు విద్యుత్ పాఠశాల విద్యార్ధులు ఘన నివాళులు అర్పించారు. మొదట సంఘ నిర్వాహకుడు శ్రీ శంకరరావు గారు అతిధులను వేదికపైకి ఆహ్వానించారు.సభాధ్యక్షుడు శ్రీ బులుసు భాస్కరరావు గారు సంస్థ మరియు సంస్థ ఉద్యోగులు ఎ యస్ రావు గారికి ఎంతో ఋణపడి ఉన్నారన్నారు. ముఖ్య అతిధి శ్రీ వి కె ప్రేమచంద్ గారు శ్రీ రావు గారితో వారికున్న అనుబంధాన్ని 1930 వ దశకం నుండి 2000 వ దశకం వరకు సోదాహరంగా వివరించారు. శ్రీ రావు గారి ఆశయాలను భావాలను మహోన్నత వ్యక్తిత్వాన్ని  తెలియపరిచారు. కాప్రా మల్కాజగిరి కవుల వేదిక తరఫున ఐదుగురు కవులు పాల్గొని శ్రీ రావు గారికి గేయార్చనచేశారు. డాక్టర్ రాధా కుసుమ గారు జోహారు జోహారు ఎ యస్ రావు గారు, ఓ కార్యసాధకుడా అంటు చక్కగా పాడారు. పిమ్మట డాక్టర్ దీపక్ న్యాతి గారు అదిగో అదిగో అదిగదిగో నింగిని వెలుగుతుంది ఓ చుక్కా...
Image
 మన ఏ ఎస్ రావు మహానుభావుడు నిరాడంబరుడు ఈ సి ఐ ఎల్ స్థాపకుడు ఏ ఎస్ రావు నామధేయుడు                ||మహా|| దేశాన్ని ప్రేమించాడు ధైర్యాన్ని చూపించాడు విశ్వాసంతో పనిజేశాడు లక్ష్యాలను సాధించాడు                   ||మహా|| వ్యూహాత్మకుడు దూరదృష్టికలవాడు పట్టుదలకలవాడు జాతికంకితమైనవాడు                     ||మహా|| నైపుణ్యం చూపాడు పెక్కురికి శిక్షణనిచ్చాడు పలు ఉత్పత్తులనుచేయించాడు బహుమేలు దేశానికిచేశాడు                 ||మహా|| సాంకేతికరంగ మాగదర్శకుడు డిగిటల్ కంప్యూటర్ మొదటచేయించాడు సాలిడ్ స్టేట్ టీవి ప్రవేశపెట్టాడు ఎర్త్ స్టేషన్ యాంటీనాకు ఆద్యుడు           ||మహా|| ఈ సి ఐ ఎల్ కు పేరు తెచ్చాడు వేల ఉద్యోగాలను సృష్టించాడు విదేశదిగుమతులు తగ్గించాడు ఆర్ధికవ్యవస్థను సుస్థిరపరిచాడు             ||మహా|| విదేశమోజు లేనివాడు సంపాదనధ్యాస లేనివాడు భారతమాత ముద్...
Image
 కాలగమనం కవితలజననం కాలచక్రం పరుగెడుతుంది జీవనకాలం తరిగిపోతుంది కాలం కరిగిపోతుంది ఙ్ఞాపకం మిగిలిపోతుంది గతం తిరిగిరాకున్నది వర్తమానం ఆగిపోకున్నది ఆరాటం ఆగకున్నది పోరాటం తప్పకున్నది జగన్నాటకం చూడమంటుంది జీవితగమనం సాగించమంటుంది కవనోత్సాహం తగ్గిపోకున్నది కైతారచనాంగం కొనసాగించమంటుంది మరణం వెంటపడుతున్నది కవనం విడిచిపెట్టకున్నది మెప్పులు పొందమంటుంది మదులను దోచమంటుంది నాలుకల్లో నానమంటుంది తలల్లో నిలిచిపొమ్మంటుంది కవితలవానను కురిపించమంటుంది కవననదులను పారించమంటుంది కయితాపుష్పాలు పూయించమంటుంది సాహిత్యసౌరభాలు వెదజల్లమంటుంది సూర్యోదయం రోజూ జరుగుతుంది కవితోదయం నిత్యమూ అవుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాజననం ఊహలు రూపందాల్చాయి భావాలు బయటపడ్డాయి అక్షరాలు దొర్లాయి పదాలు పొర్లాయి కిరణాలు ప్రసరించాయి చీకట్లు తొలగిపోయాయి మనసు పొంగింది హృదయం కరిగింది ప్రేమ ఫలించింది గమ్యం దొరికింది ఉల్లం ఉత్సాహపడింది గుండె  దిటువయ్యింది మాట గొంతుదాటింది కవిత పుటలకెక్కింది కవిత్వం సాగింది సాహిత్యం కూడింది శారద  కరుణించింది కవిత జనించింది పాఠకులు పరవశించారు విమర్శకులు విస్తుపోయారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
 కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ప్రారంభం నేడు ఉదయం 10 గంటలకు హైదరాబాదు ఏ ఎస్ రావునగర్ రుక్మిణీపురి కాలనీలో కవి మరియు సినీ గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రఖ్యాత కవి శ్రీ నూతక్కి రాఘవేంద్రరావు గారి చేతుల మీదగా కాప్రా మల్కాజగిరి కవుల వేదిక  ప్రారంభించబడినది. శ్రీ రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ  ఈ వేదిక దినదినాభివృద్ధి చెందాలని కవులకు ప్రోత్సహమివ్వాలని మరియు యువకవులను వెలుగులోకి తేగలరని ఆశాభావం వ్యక్తపరిచారు. సభాధ్యక్షులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు మాట్లాడుతూ నేడు 25 మంది కవులతో ప్రారంభమయిన ఈ వేదిక భవిష్యత్తులో వందల కవులతో వర్ధిల్లుతుందని నమ్మకం వెలిబుచ్చారు. గౌరవ అతిధి, ప్రఖ్యాత పద్యకవి.విశ్రాంత బ్యాంకు అధికారి శ్రీ రాధశ్రీ గారు  ఈ వేదిక అభివృద్ధిచెందాలని తన ఆశు కందపద్యాలతో అందరినీ అలరించారు. అక్షర కౌముది వ్యవస్థాపకులు శ్రీ తులసి వెంకట రమణాచార్యులు గారు సమన్వయ కర్తగా వ్యవహరించి అతిధులను చక్కగా పరిచయంచేసి తన వాక్చాతుర్యాన్ని చాటుకున్నారు. పిమ్మట కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా కవిసమ్మేళనం నిర్వహించారు. 25 మం...
Image
 మరుమల్లె చూపుతుంది తెల్లగా శుద్ధిగా రంగును చల్లుతుంది మెల్లగా మత్తులా సుగంధాన్ని చాటుతుంది చల్లగా ప్రేయసిలా ప్రేమనురాగాలని చూపుతుంది సొబగులు కోమలాంగుల కొప్పులెక్కి భక్తినిచాటుతుంది పూజావస్తువై దేవతలమెడలనలంకరించి పాదాలచెంతకుచేరి అంజలిఘటిస్తుంది రెబ్బలై తలలపై చల్లబడి ఆహ్వానిస్తుంది గుచ్ఛమై కట్టబడి చేతులకివ్వబడి దోస్తుంది చిత్తాలను పిండబడి అత్తరై మల్లె నాచెలికత్తె నాప్రోత్సాహిత నాప్రియకవిత గుండ్లపల్లి రాజేంరప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనసమర్పణం నీరు ఊరినట్లు ఆలోచనలు జలించాలి చలము నిండినట్లు తలపులు గుమికూడాలి ముత్యాలు గుచ్చినట్లు అక్షరాలను పేర్చాలి పల్లానికి నీరుపారినట్లు పదాలను ప్రవహింపజేయాలి పాలు పొంగినట్లు కవితలు పొర్లిపోవాలి దప్పిక తీర్చుకున్నట్లు కైతలదాహం తీర్చుకోవాలి హలం దున్నినట్లు కలం సాగాలి పాత్రలు నిండినట్లు పుటలు నిండిపోవాలి చెట్లు పూచినట్లు కైతలు మొగ్గలుతొడగాలి పరిమళాలు వీచినట్లు కయితలు సౌరభాలువెదచల్లాలి విరులు విచ్చుకున్నట్లు కవితలు విప్పారాలి పూలు పొంకాలుచూపినట్లు సాహితీసుమాలు చక్కదనాలుచూపాలి ఉల్లాలు ఉత్సాహపడాలి మదులు మురిసిపోవాలి కవిత్వం వెలిగిపోవాలి సాహిత్యం ప్రకాశించాలి కవులు కుతూహలపడాలి పాఠకులు పరవశించాలి అన్నం వండినట్లు కవనపచనం చేయాలి అతిధులకు వడ్డించినట్లు సాహితీప్రియులకు సమర్పణచేయాలి గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం
Image
 ఆకవిగారి కవనాలు అతనివి కుక్కపిల్లలు సబ్బుబిళ్ళలు కావు అతనివి సుమసౌరభాలు తెలుగువైభవాలు అతనివి కఠినపదాలు కాఠిన్యరాతలు కావు అతనివి తేటపలుకులు తెలుగుతియ్యందనాలు అతనివి కల్లబొల్లికబుర్లు కలలదొంతరలు కావు అతనివి అక్షరసత్యాలు ప్రాసపదాలప్రయోగాలు అతనివి దురాలోచనలు దుష్టబుద్ధులు కావు అతనివి కమ్మనితలపులు రసరమ్యవీచికలు అతనివి అంధకారాలు అయోమయాలు కావు అతనివి రవికిరణాలు శశివెలుగులజల్లులు అతనివి అశ్లీలాలు అమంగళాలు కావు అతనివి అద్భుతాలు అద్వితీయాలు అతనివి అర్ధరహితాలు వ్యర్ధవచనాలు కావు అతనివి ప్రకృతిసొగసులు మానసికోల్లాసాలు అతనివి సూక్ష్మముకాదు చేంతాడుకాదు అతనివి చిట్టిచిట్టిపదాలు చిన్నిచిన్నిపంక్తులు అతనివి గాడిదగాండ్రింపులు నక్కలరుపులు కావు అతనివి కోకిలకుహూకుహులు గాంధర్వగానాలు అతనిని విమర్శిస్తే విలువతగ్గిస్తే ఊరుకోను అతనిని పొగిడితే ప్రోత్సహిస్తే పరవశిస్తాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నాకోసం నాకోసం ఎందరో ఎదురుచూస్తున్నారు ఏలనో కాచుకొనియున్నారు ఎందుకో వెదుకులాడుచున్నారు నన్ను చూడాలని కొందరు యత్నిస్తున్నారు నన్ను చదవాలని కొందరు కోరుకుంటున్నారు నన్ను అర్ధంచేసుకోవాలని కొందరు ప్రయాసపడుతున్నారు నన్ను తలకెక్కించుకోవాలని కొందరు తంటాలుపడుతున్నారు నన్ను అనుసరించాలని కొందరు అనుకుంటున్నారు నన్ను అనువదించాలని కొందరు తలపోస్తున్నారు నన్ను పాడాలని కొందరు కోరుకుంటున్నారు నన్ను వినాలని కొందరు తపిస్తున్నారు నన్ను వ్రాయాలని కొందరు పాటుపడుతున్నారు నన్ను సవరించాలని కొందరు సూచిస్తున్నారు నన్ను అందంగాదిద్దాలని కొందరు భావిస్తున్నారు నన్ను అమరంచెయ్యాలని కొందరు శ్రమిస్తున్నారు నా రూపం అక్షరం నా ఆంతర్యం భావం నేను హృదయాలను తాకుతాను గుండెలను మీటుతాను మదులను ముడతాను నాకోసం కొందరు ఆలోచిస్తున్నారు శ్రమించుతున్నారు ప్రార్ధించుతున్నారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 జన్మసాఫల్యం మనుషజన్మ మహోన్నతమైనదోయ్ పూర్వజన్మ సుకృతాలఫలమోయ్ బతుకును ఉద్ధరించుకోవాలోయ్ జన్మను సాఫల్యంచేసుకోవాలోయ్ మాతృమూర్తి ఋణముతీర్చుకోవాలోయ్ మాతృభూమికి ఖ్యాతినితేవాలోయ్ మాతృభాషను వ్యాప్తిచేయాలోయ్ గురువులను గౌరవించాలోయ్ తండ్రికి సేవలుచేయాలోయ్ తోటివారికి సహాయపడాలోయ్ హింసామార్గాన్ని వీడాలోయ్ అవినీతిబాటని అరికట్టాలోయ్ లక్ష్యాలను సాధించాలోయ్ జీవితమును సుసంపన్నంచేసుకోవాలోయ్ అన్నదమ్ములను ప్రేమించాలోయ్ అక్కాచెల్లెల్లను ఆదుకోవాలోయ్ ద్రోహులను శిక్షించాలోయ్ మోసగాళ్ళకు గుణపాఠంచెప్పాలోయ్ అనాధులకు అండగానిలవాలోయ్ అన్నార్తులకు ఆహారమందించాలోయ్ సమాజశ్రేయస్సుకు పాటుపడాలోయ్ దేశాభివృద్ధికి పాటుపడాలోయ్ స్వార్ధము తగ్గించుకోవాలోయ్ పరహితముకు పాటుపడాలోయ్ దానవత్వం విడవాలోయ్ మానవత్వం చాటాలోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వీక్షణం కాలిఫోర్నియా 146వ అంతర్జాల సాహితీ కార్యక్రమం నేడు 19-10-2024వ తేదీ ఉదయం అంతర్జాలంలో జరిగిన వీక్షణం 146వ సాహితీ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు శ్రీమతి గీతా మాధవి గారు ముఖ్య అతిధి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని, ప్రత్యేక ఆహ్వానితులు ఆచార్య ఎం. రామనాధం నాయుడు గారిని, శ్రీ కొమరరాజు ఉమామహేశ్వరరావు గారిని, డాక్టర్ పండ్రంగి శారద గారిని మరియు కవిసమ్మేళనంలో పాల్గొనటానికి వచ్చిన కవులకు స్వాగతం పలికారు. పిమ్మట తెలంగాణా స్పెషల్ డిప్యూటి కలెక్టరు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు అత్యాధునిక తెలుగు కవిత్వానికి నిర్వచనం చెప్పి, గురజాడ ముత్యాలసరాలు నుండి, విశ్వనాధ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలనుండి, శ్రీశ్రీ, కాళోజీ, సినారె మొదలగు కవుల కవితలను ఉదహరిస్తూ చక్కగా ప్రసంగించి సభికుల మన్ననలను పొందారు. వారి కవితలను అమెరికా యువకవి కమర గారు, సాలూరు కవి శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు, పర్లాకిమిడి కవి మరియు ఉత్కల సాహిత్య వేదిక అధ్యక్షురాలు శ్రీమతి పండ్రంగి శారద గారు, మరియు శ్రీమతి వేరుటి శైలజ గారు ముఖ్య అతిధి ప్రసంగాన్ని, ఇచ్చిన ఉదాహరణల...
Image
 ఓ కవితాకన్యకా! మల్లికలారావా  మైమరిపించవా పరిమళంచల్లవా పరవశపరచవా మాధురిలారావా మాధుర్యమునందించవా ముచ్చట్లుచెప్పవా మదినిమురిపించవా సుహాసినిలారావా చిరునవ్వులుచిందవా మోమునువెలిగించవా బాధలుమరిపించవా సుమతిలారావా చక్కనిభావాలులేపవా కమ్మనికైతలురాయించవా కవనలోకాననిలుపవా సువర్ణలారావా ధగధ్గలాడరాదా కళ్ళనుతెరిపించరాదా కవనాలు కూర్పించరాదా సరోజలారావా చక్కదనాలు చూపవా సన్మోహితుడినిచేయవా సంతసపరచవా కమలలారావా కమ్మదనాలు కనిపింపజేయవా కాంతికిరణాలు ప్రసరింపజేయవా కుతూహలపరచవా పుష్పికలారావా విప్పారి వేడుకచేయవా అందాలు చూపించవా ఆనందమునివ్వవా రోజాలారావా గుండెనుతాకరాదా గుబాళించరాదా గుబులునుతీర్చరాదా కుసుమలారావా ఖుషీచేయరాదా కలమునుపట్టించరాదా కవితలనువ్రాయించరాదా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం 
Image
 అందచందాలు అందం స్మరణీయం అందం శ్లాఘనీయం అందం అజరామరం అందం అప్రతిహతం అందం ఆకర్షణీయం అందం ఆస్వాదనీయం అందం ఎల్లకాలమానందం అందం ఎల్లవేళలాదర్శనీయం అందం అన్నింటిలోదృగ్గోచరం అందం అన్నిచోట్లాసాక్షిభూతం అందం సూర్యప్రకాశం అందం చంద్రబింబం అందం ఆకాశం అందం భూగోళం అందం అరణ్యం అందం సముద్రం అందం నేత్రాలకాహారం అందం ఉల్లాలకుత్సాహం అందం జీవితమకరందం అందం ఆరోగ్యప్రదాయకం అందం అనుభవనీయం అందం ఆలోచనీయం అందం అమూల్యం అందం అనంతం అందం మధురం అందం శ్రావ్యం అందం అమృతతుల్యం అందం వినాశరహితం అందం నా కవితలవిషయం అందం నా జీవితమార్గదర్శకం అందం చూపటం నాధ్యేయం ఆనందం  కలిగించటం నాలక్ష్యం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత్వం నా ప్రయత్నం నేను గాలిలో ఎగరాలని మిమ్మలనూ నాతో తీసుకెళ్ళాలని మబ్బులపై కూర్చోపెట్టాలని జాబిలిపై విహరింపజేయాలని నా ప్రయత్నం నా నోటిలోని మాటలను మీ నోటిలోపెట్టి పలికించాలని నా ప్రయత్నం నా మనసులోని భావాలను మీతో సూటిగాచెప్పకుండా తెలపాలని నా ప్రయత్నం నేను అనుకున్నది మీరూ తలచేలాచేసి మీ పెదవులుకదిలించి చెప్పించాలని నా ప్రయత్నం నేను చూచినవి మీ కళ్ళముందుపెట్టి మీరూ చూచేటట్లు చెయ్యాలని నా ప్రయత్నం నేను విన్నవి తియ్యగాచెప్పి మీరూ వినేటట్లు చేద్దామని నా ప్రయత్నం నేను వ్రాసినవి మీ చెంతకుచేర్చి చదివించి సంతోషపరచాలని నా ప్రయత్నం నేను  మీ నాలుకల్లో నానాలని మీ తలల్లో తిష్టవేయాలని నా ప్రయత్నం నేను మీ కళ్ళల్లో వెలగాలని మీ చెవుల్లో దూరాలని నా ప్రయత్నం నేను మీపై సౌరభాలుచల్లి తన్మయత్వపరచాలని నా ప్రయత్నం నాతో మీరు  సహకరిస్తారా స్పందిస్తారా సాహితీలోకంలోవిహరిస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మళ్ళీ చిగురిద్దాం! మనసు వికలమైనా మాటలు దొర్లకున్నా మౌనము ఆవరించినా మొక్కల్లా మళ్ళీచిగురిద్దాం కవులారా పూలు రాలినా ఆకులు ఎండినా చెట్లు మళ్ళీచిగుర్లుతొడగవా జన్మను సాఫల్యంచేసుకోవా తెల్లవారినా నిద్రలేచినా పనుల్లోపడినా తీయనిరాత్రికలలను తలుచుకోమా పూదండవాడినా తీసిపారేసినా తలలోలేకున్నా మల్లెలవాసన వెంటనేకురులనువీడునా చెలిదూరమైనా ప్రేమవిఫలమైనా కలుసుకోవటం కుదరకపోయినా మధురానుభూతులను చెరిపేసుకోగలమా ప్రయాసపడుతున్నా ప్రయోజనందొరకకున్నా చెమటలుకారుతున్నా విజయంపొందేవరకు ప్రయత్నాన్నిసాగిద్దాంధీరుల్లా కవి దేహాంతమైనా కవితలు మరణించునా ఖ్యాతి చెదురునా కవిని చిరంజీవినిచెయ్యవా పలువురుపాఠకులు పొగిడినా పెక్కు సన్మానాలు చేసినా పురస్కారాలు లభించినా పలుకులమ్మను నిత్యంపూజిద్దాంసేవకుడిలా చెట్లను ఆదర్శంగా తీసుకుందాం కొట్టేసినా మరలామరలా చిగురిద్దాం కవితలు కమ్మగావ్రాద్దాం కవిగా ఖ్యాతినిపొందుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
  పుష్పకన్య ఎంత మృదువుగా ఉన్నావో అన్నా సిగ్గుపడింది తాకకూడదనుకున్నా నలపకూడదనుకున్నా ఎంత చక్కగా ఉన్నావో అన్నా వెలిగిపోయింది కళ్ళను తిప్పకూడదనుకున్నా మోమును మరల్చకూడదనుకున్నా ఎంత ప్రకాశంగా ఉన్నావో అన్నా ధగధగలాడింది కాంతిని గ్రహించా రూపాన్ని తిలకించా ఎంత పరిమళం వీస్తున్నావో అన్నా అత్తరుచల్లింది అదేపనిగా ఆఘ్రానించా ఆనందంలో మునిగిపోయా ఎంత కళాత్మకంగా ఉన్నావో అన్నా కళకళలాడింది చూడకుండా నిలువలేకున్నా మెచ్చకుండా మౌనందాల్చలేకున్నా ఇంకెంతసేపని ఇంటికిబయలుదేరా తల్లడిల్లింది గిలగిలలాడింది కన్నీరుకార్చింది సైగలుచేసి చెంతకురమ్మంది చేతిలోకితీసుకోమంది స్పర్శించితరింపజేయమంది పట్టుకుంటే పరవశించింది కిలకిలానవ్వింది మత్తులోదించింది పుష్పకన్యను వీడను ఇంటికి తెచ్చుకుంటా తోడుగా ఉంచుకుంటా ప్రక్కనే పెట్టుకుంటా అహా! ఏమిభాగ్యము? అదృష్టదేవత అవకాశమిచ్చింది అందాలుచూపింది ఆనందపరిచింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత! ఓ కవిత! నేటి కవిత! పొద్దున్నే పొద్దుపొద్దునే కలమునుపట్టి కాగితమునుతీసి వ్రాయాలనుకున్నవెంటనే గలగలమనిగాజులాడిస్తూ ఘల్లుఘల్లుమనిగజ్జలుమ్రోగిస్తూ ఆలోచనలనుపారిస్తూ అక్షరాలనుకూరుస్తూ అర్ధాలనొనగూరుస్తూ పదాలనుపారిస్తూ పంక్తులనుపేరుస్తూ అంతరంగాన్నితడుతూ ప్రాసలనుకూర్చుతూ పోలికలనుచేరుస్తూ గలగలమనిప్రవహిస్తూ కవితాకన్యకవచ్చింది కమ్మనికైతనువ్రాయించింది పాఠకులకుపంపించింది పరవశమునుపంచింది మనసులనుముట్టింది తలలోతిష్ఠవేసింది ఉల్లంబుననిలిచి ఉజృంభించుతూ ఉక్తులనందిస్తూ మంచిగచెబుతూ ఘనఘనపలికిస్తూ గలగలాపారించుతూ ప్రీతినికలిగిస్తూ వ్రాయించుతున్న సరస్వతీతల్లికి రెండుచేతులెత్తి నమస్కరించి చెపుదునునిత్యము  వేలవందనములు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మాటలు మనమాటలు అప్పుడప్పుడు చందనపుష్పాలా సుగంధాలుచల్లుతుంటాయి మల్లియల్లా మనసులుదోస్తుంటాయి గులాబీల్లా గుబాళిస్తుంటాయి మందారాల్లా మకరందాన్నందిస్తాయి  తియ్యంగా తేనెచుక్కలుచల్లుతుంటాయి దీపాల్లా వెలుగులుచిమ్ముతుంటాయి సీతాకోకచిలుకల్లా చక్కదనాలుచూపుతుంటాయి జాబిలిలా చల్లనివెన్నెలవెదజల్లుతుంటాయి కోకిలలా కమ్మనిస్వరాలువినిపిస్తుంటాయి మంత్రాల్లా ముగ్ధులనుచేస్తుంటాయి మీ గళంనుండి గాంధర్వగానం వెలువడాలనుకుంటున్నాను మీ కలంనుండి మధురమామిడిసారం పారాలనుకుంటున్నాను మీ పెదవులనుండి సుధారసం చిమ్మాలనుకుంటున్నాను మీ హృదయంనుండి ప్రేమాభిమానాలు పొంగాలనుకుంటున్నాను నేను మాటల ప్రేముకుడిని పదాల ప్రయోగికుడిని అందాలు వర్ణించేవాడిని ఆనందాలు అందించేవాడిని నోరూరిస్తే క్షమించండి ఆశలులేపితే సాధించండి రంగంలోకిదింపితే తలచుకోండి విజయంసాధిస్తే పొంగిపోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ వెన్నెలా! ఓ వెన్నెలా ఎవరివో నీవెవరివో అందరిని అలరిస్తున్నావు ఆనందాన్ని అందిస్తున్నావు ఏ అంగన అందానివో వెన్నెలా ఏ అతివ ఆనందానివో వెన్నెలా ఏ చిగురుబోడి చిరునవ్వువో వెన్నెలా ఏ చిన్నదాని సిగపువ్వువో వెన్నెలా ఏ పూబోడి పులకరింపువో వెన్నెలా ఏ పడతి ఆరబోసినపిండివో వెన్నెలా ఏ లేమ లేపానివో వెన్నెలా ఏ లలన లాలిత్యానివో వెన్నెలా ఏ వనిత వర్ణానివో వెన్నెలా ఏ వనజాక్షి వెలుగువో వెన్నెలా ఏ కన్నియ కళకళవో వెన్నెలా ఏ కాంత కాంతివో వెన్నెలా ఏ కలికి కులుకువో వెన్నెలా ఏ కోమలి జిలుగువో వెన్నెలా ఏ మహిళ మిడిసిపాటువో వెన్నెలా ఏ మానిని మెరుపువో వెన్నెలా ఏ పైదలి ప్రోత్సాహానివో వెన్నెలా ఏ ప్రమిద ప్రాయానివో వెన్నెలా ఏ నెలత ఆకర్షణవో వెన్నెలా ఏ నాతుక జిగేలివో వెన్నెలా ఏ పూదోటలో పచార్లుచేయను వెన్నెలా ఏ కలువలచెరువుప్రక్కన విహరించను వెన్నెలా  నీవు నచ్చనివారులేరు వెన్నెలా నిన్ను మెచ్చనివారులేరు వెన్నెలా ఎవరితోడును తెచ్చుకుందును వెన్నెలా ఎంతసమయము వెచ్చించను వెన్నెలా ప్రణయానికి ప్రతీకవయ్యావు వెన్నెలా మనసులను దోచేస్తున్నావు వెన్నెలా జోష్ ఇచ్చావు వెన్నెలా జోహారు జోహారు  వెన్నెలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్య...
Image
 పొగుడుతుంటే వీధుల్లో ఏనుగునధిరోహించి మేళతాళాలతో ఊరేగుతున్నట్లుంది సభలో మహానీయులచేతులతోటి గండపెండేరం తొడిగించుకుంటున్నట్లుంది ఆకాశంలో నీలిమబ్బులపైకూర్చొని విహరించుతున్నట్లున్నది పడకగదిలో పలురకాలపూలపానుపుపైన పవళించుతున్నట్లున్నది పున్నమివెన్నెలలో మల్లెపూలతోటలో ముచ్చటగా వాహ్యాళిచేస్తున్నట్లున్నది అందాలలోకంలో అద్భుతదృశ్యాలనుచూచి ఆనందిస్తున్నట్లున్నది నీలిగగనంలో ఇంద్రధనస్సునెక్కి సుందరమైన భూగోళాన్నిచూస్తున్నట్లుంది పెద్దలసమక్షంలో పెళ్ళిపీటపైనకూర్చొని ఇష్టసఖిని వివాహమాడుతున్నట్లున్నది ఎందుకో నన్నుమునగచెట్టును ఎక్కిస్తున్నారేమో అనిపిస్తుంది గాఢనిద్రలో మంచముపైపడుకొని కలనుకంటున్నానేమోననిపిస్తుంది దయచేసి పొగడ్తలతో నన్ను ముంచకండి వాస్తవాలలో జీవించనీయండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏ ఎస్ రావునగర్ లో అద్భుతంగా జరిగిన బతుకమ్మ ఆట పాట మరియు సాహిత్య కార్యక్రమాలు ధరణి మహిళ శక్తి, వినాయకనగర్ విశాలాక్ష్మి స్వయం సహాయక సేవాసంఘం మరియు కుసుమ ధర్మన్న కళాపీఠం వారి సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు ఏడవ తేదీన డాక్టర్ ఏ ఎస్ రావు నగర వాసుల సంక్షేమం మరియు సాంస్కృతిక సంఘంవారి గ్రంధాలయభవనంలో బతుకమ్మ సంబరాలు ఆద్యంతము ఆహ్లాద భరితంగా  జరిగాయి. సభాధ్యక్షులు కవి, గాయకులు శ్రీ వాకిటి రాంరెడ్డి గారు అధ్యక్షప్రసంగంలో నిజమైన ప్రేమ మరియు  ఆనందం అందరిమోముల్లో కనిపిస్తుందని  శ్లాఘించారు మరియు తృప్తిని వ్యక్తపరిచారు.ప్రఖ్యాతకవి, రచయిత, అనువాదకుడు అయిన స్పెషల్ డిప్యూటి కలక్టర్  ముఖ్య అతిధి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు  తెలంగాణా సంప్రదాయలు మరియు బత్కమ్మ వేడుకల ఆరంభానికి  చారిత్రాత్మక  కారణాలను వివరించి అందరి మన్ననలను పొందారు.కవి, పురావస్తు చరిత్రకారులు అయిన విశిష్ట అతిధి డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ  గారు బతకమ్మ గురించి వివరిస్తూ సభికులను తమ శ్లోకాలతో ఆశీర్వదించి అందరిని ఆకట్టుకున్నారు. విశ్రాంత అటవీశాఖ అధికారి,ఆత్మీయ అతిధి శ్రీ అంబటి లింగాల క్రిష్ణారెడ్డి గ...
Image
 కవితాజిలేబీలు జిలేబీలనువండుతా ఘుమఘుమలాడిస్తా కవితలనువ్రాస్తా జివజివలాడిస్తా జిలేబిచూపుతా నోరూరిస్తా కైతను కనమంటా ఆశనులేపుతా జిలేబినందిస్తా ఆనందపరుస్తా కయితనుచేతికిస్తా మురిసిపొమ్మంటా జిలేబీనితినమంటా చప్పరించమంటా కవనాన్నిచదవమంటా మధురానుభూతినిపొందమంటా జిలేబీని తలపించేలాజేస్తా మరలా తినాలనిపించేలాచేస్తా కవిత్వాన్ని గుర్తుపెట్టుకొనేలాచేస్తా పదేపదే పఠించేలాచేస్తా జిలేబీలు మహారుచి కవనాలు అంతేరుచి జిలేబీలు భలేతీపి కవితలు అంతేతీపి తినటం మరిగారా ఇకవదలనే వదలరు చదవటం అలవాటుపడ్డారా జీవితంలోనే మరచిపోరు ఆలశ్యం ఎందుకు రంగంలోకి దిగండి జిలేబీలు తినండి కవితలను చదవండి చక్కెర వ్యాధున్నా పరవాలేదు అడ్డంకికాదు పూర్తిగా అర్ధంకాకున్నా పక్కవారినడగొచ్చు తెలుసుకోవచ్చు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏమనుకున్నావు? ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పారిపోతున్నావు కందిరీగననుకున్నావా కుటతాననుకున్నావా తేనెటీగననుకున్నావా ముళ్ళుగుచ్చుతాననుకున్నావా గుడ్లగూబననుకున్నావా కూతకూస్తాననుకున్నావా గబ్బిలాన్ననుకున్నవా చెవులోదూరతాననుకున్నావా కుక్కననుకున్నావా మొరుగుతాననుకున్నావా నక్కననుకున్నావా ఊళవేస్తాననుకున్నావా గాడిదననుకున్నావా తంతాననుకున్నావా గుఱ్ఱాన్ననుకున్నావా క్రిందపడవేస్తాననుకున్నావా పాముననుకున్నావా విషమెక్కిస్తావనుకున్నవా తేలుననుకున్నావా కాటువేస్తాననుకున్నావా ఎద్దుననుకున్నావా కుమ్ముతాననుకున్నావా దున్నననుకున్నావా పొడుస్తాననుకున్నావా బాణాన్ననుకున్నావా గాయపరుస్తాననుకున్నావా తుపాకిననుకున్నావా తూటాలుప్రేలుస్తాననుకున్నావా ముళ్ళననుకున్నావా మేనులోకిదిగుతాననుకున్నావా కత్తిననుకున్నావా కాయాన్నికోస్తాననుకున్నావా దోమననుకున్నావా రోగమెక్కిస్తాననుకున్నావా ఈగననుకున్నావా అంటువ్యాధులుతగిలిస్తాననుకున్నావా ఉద్యమకారుడనుకున్నావా కానేకాను విమర్శకుడనుకున్నావా అసలేకాను నేనో అక్షరపిపాసిని పదాలప్రయోగిని కవితలసృష్టికర్తని నేనో తెలుగాభిమానిని పూలప్రేముకుడిని భావకవిని మనసులను దోసేస్తా మన్ననలను...
Image
 ఓ చెలీ! నువ్వేమో అందానివి నేనేమో ఆస్వాదకుడను నువ్వేమో నవ్వువు నేనేమో పరిగ్రహుడను నువ్వేమో పువ్వువు నేనేమో తుమ్మెదను నువ్వేమో వెన్నెలవి నేనేమో విహారిని నువ్వేమో సౌరభానివి నేనేమో ఆఘ్రాణిని నీవేమో చైతన్యానివి నేనేమో జడత్వాన్ని నీవేమో ప్రోత్సాహానివి నేనేమో ప్రేరేపుతుడిని నీవేమో అమృతానివి నేనేమో క్రోలువాడిని నువ్వేమో సూదంటురాయివి నేనేమో ఇనుపకడ్డీని నువ్వేమో గాలానివి నేనేమో చేపను నీవేమో కవితాకన్యవు నేనేమో కలంపట్టినకవిని ఆలశ్యం అనర్ధకం సమయం అమూల్యం ప్రణయాన్ని ఫలవంతంచేద్దాం జీవితాన్ని అనుభవించుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం