Posts

Showing posts from June, 2022
Image
 ఓ చెలికాడా! చెప్పనా నిన్నచేసిన నీఘనకార్యాలను చెప్పనా చెయ్యనా నామదినివిప్పి నీగుట్టును రట్టుచెయ్యనా తెల్పనా నిన్నరాత్రి కలలోకొచ్చి నువ్వుచేసిన చిలిపిపనులను తెల్పనా  తీర్చనా నీవు కోరినకోర్కెలను నిండుగా తీర్చనా ఇవ్వనా నీకుముద్దులనివ్వనా నినుమురిపించనా చిందనా చిరునవ్వులను మోమునిండా చిందించనా ఆడనా సరసాలాడనా సరదాలు చేయనా రానా మసకమసక చీకటిలో మల్లెపందిరిక్రిందకు రానా విహరిద్దామా చక్కని చంద్రునిక్రింద చల్లన వెన్నెలలోన విహరిద్దామా చెలికాడా చెంతకుపిలవకురా చేయినిచాచకురా కన్నుగీటకురా కబుర్లుచెప్పకురా కవ్వించకురా మురిపించకురా మరిపించకురా మనసుదోచుకోకురా నలుగురిలో నను నగుబాటుచేయకురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మామభామల సంవాదం అతడు:  మేలిముసుగు        ఎందుకే భామా        మోమును        చూపవే భామా        దొంగచూపులు        ఎందుకే భామా        దోరవయసు        దాచకే భామా        ధరహాసం        చూపవే భామా        ధమ్మిల్లము        చూడనీయవే భామా        అందాన్ని        చూపవే భామా        ఆనందాన్ని        కలిగించవే భామా        ముసుగును        తీయవే భామా        మౌనమును        వీడవే భామా        ముందుకు        రావే భామా        ముచ్చటలు        చెప్పవే భామా        ఎందుకే        ముసుగు భామా       ...
Image
 పూలంటే పూలుకాదు నాహృదయపు ప్రతిబింబాలు ఓచెట్టు విరబూసింది ఓనాడునాకు పూదానంచేసింది ఆచెట్టు సంతసించింది ఆపూలు నాపూలయ్యాయి నాపూలు నావెంటవచ్చాయి నాకుతోడుగా నిలిచాయి నాపూలు ననుప్రేమించాయి నాపై ఆప్యాయతచూపించాయి నాపూలు నాప్రక్కకుచేరాయి నాతో సరసాలాడాయి నాపూలు విచ్చుకున్నాయి నన్ను  చూడమన్నాయి నాపూలు అందచందాలుచూపాయి నన్ను ఆనందపరచాయి నాపూలు ప్రకాశించాయి నామోమును వెలిగించాయి నాపూలు నక్కాయి నన్ను వెతికిపట్టుకోమన్నాయి నాపూలు మొక్కాయి నన్ను వరాలివ్వమన్నాయి నాపూలు నవ్వాయి నన్ను సంతసపరచాయి నాపూలు పరిమళించాయి నన్ను పరవశింపజేశాయి నాపూలు నాట్యమాడాయి నన్ను మురిపించాయి నాపూలు ఆటలాడాయి నన్ను ఆహ్లాదపరచాయి నాపూలు పాడాయి నన్ను పులకరింపజేశాయి నాపూలే నావెలుగులు నాపూలే నాప్రోత్సాహకాలు పూలంటే  పూలూకాదు  నాహృదయపు  ప్రతిబింబాలు పూలుప్రకృతిప్రసాదించిన  ప్రేమప్రతీకలు  నాకులభించిన ప్రియనేస్తాలు పూలంటే ఇష్టము పరమాత్మునికే కాదు పడతులకే కాదు పరికించేవారందరికిను పూలను మరువను పువ్వుల వీడను పువ్వులే నాప్రాణము పువ్వులే నాలోకము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేను నాపూలు పువ్వాపువ్వా ఓ మల్లెపువ్వా పరిమళాన్ని నాకివ్వవా అన్నా ప్రకృతికవీ ఓ ప్రకృతికవీ పసందైన మల్లెపూలకవితొకటి వ్రాయవాయన్నది మందారమా ఓ మందారమా మకరందాన్ని నాకివ్వవా అన్నా మహాకవీ ఓ మహాకవీ మంచి మందారకవితొకటి వ్రాయవాయన్నది గులాబీ ఓ గులాబీ గుండెలపై కాపురముండవా అన్నా గీర్వాణిపుత్రుడా ఓ గీర్వాణిపుత్రుడా గమ్మత్తయిన గులాబీకవితొకటి వ్రాయవాయన్నది పువ్వాపువ్వా ఓ బంతిపువ్వా పుష్పాంజలి ఘటించవా అన్నా పూలకవీ ఓ పూలకవీ పూబంతులపై అందమైనకవితొకటి వ్రాయవాయన్నది చామంతీ ఓ చామంతీ సొగసులను చూపవా అన్నా సుకవీ ఓ సుకవీ సుందరమైన చామంతులకవితొకటి వ్రాయవాయన్నది సంపంగీ ఓ సంపంగీ సుగంధాన్ని చల్లవా అన్నా సుందరకవీ ఓ సుందరకవీ శ్రేష్టమైన సంపంగికవితొకటి వ్రాయవాయన్నది పూలకవితను వ్రాయగానే పూకన్యలన్నీ ప్రక్కకుచేరాయి విన్యాసాలతో వేడుకపరచాయి పరిమళాలుచల్లి పరవశింపజేసాయి సరసాలాడి సమ్మోహపరచాయి రంగులువెదజల్లి రంజింపజేసాయి ముద్దులతో ముంచెత్తాయి షోకులచూపి సంతసపరచాయి పూలంటే ప్రేమనాకు పూలంటే సంతోషంనాకు పెక్కుపూలకవితలు వ్రాస్తా పాఠకులను పరవశింపజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చక్కనైన చిన్నది ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి ఎచటనుండి వచ్చెనో ఈ చక్కని చిన్నది చిరునగవులు మోమున చిందిస్తున్నది అందాలను అన్నింటిని ఆరబోస్తున్నది తెల్లచీరనుకట్టి వెలిగిపోవుచున్నది మల్లెపూలనుపెట్టి మనసునుమురిపిస్తున్నది ఇంతలేసి కన్నులతో ఇంపుగానున్నది అంతులేని ఆలోచనలతో అంతరంగాన్ని తట్టుచున్నది ముచ్చటైన కురులను ముడివేసియున్నది కలువలాంటి కన్నులతో కళకళలాడుచున్నది మధురమైన మాటలతో మత్తెక్కిస్తున్నది ముచ్చటైన చూపులతో మరులుకొలుపుచున్నది అందమైన నడకలతో అలరిస్తుయున్నది అప్సరసలాంటి అందాలతో ఆకట్టుకుంటున్నది ప్రేమను పంచుతున్నది ప్రియమును పెంచుతున్నది తలను తిప్పనీయకున్నది తృప్తిని కలిగిస్తున్నది శిరసువంచియున్నది సిగ్గుపడుచున్నది వలనువిసురుతున్నది వలపులోకిదించుచున్నది చిన్నదాన్ని చూడకుండా ఉండేదెట్లా మనసుకు కళ్ళెమును వేసేదెట్లా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
చంటోడి స్వగతం పుట్టగానే ఏడ్చా పరమాత్ముని వీడి పుడమిపై పడ్డందుకు క్షీరంకుడిపితే త్రాగా కన్నతల్లి ప్రేమరుచిని కనుగొనేందుకు వంటిపైన చెయ్యేస్తే స్పర్శానుభూతిని పొందా హాయిగా నిదురబోయా నాన్న ఎత్తుకుంటే  నాకు కావలస్నవాడని నేను మురిసిపోయా ఉయ్యాలలోవేసి ఊపితే గాలిలో తేలిపోతున్నట్లుగా సంబరపడిపోయా ప్రక్కవాళ్ళు పలకరిస్తే పరిచయం చేసుకుంటే పకపకనవ్వా అన్నను చూశాక ఆటలు ఆడాలని ఆరాటపడ్డా అక్క పలకరించాక అనురాగం ఆప్యాయతలను అందరికి అందించాలనుకున్నా అంగీ తొడిగితే అంగాలకు రక్షణదొరికిందని అనందపడిపోయా అన్నప్రాశన చేస్తే అరిగించుకునే శక్తివచ్చిందని సంతసించా పేరుపెట్టిపిలిస్తే గుర్తింపువచ్చిందని కుతూహలపడ్డా కళ్ళతోచూచా కమ్మదనాన్ని క్రోలుకొనటంమొదలుపెట్టా చెవులతోవిన్నా శ్రావ్యతేమిటో తెలుసుకున్నా రానున్న రోజుల్లో నడక నేర్చుకుంటా మాటలు నోట్లోచిందిస్తా తినటం తెలుసుకుంటా చదువులు నేర్చుకుంటా ఉద్యోగాలు చేస్తా సంపాదన పొందుతా స్వతంత్రుడిగా బ్రతుకుతా శిరసువంచుతా సపర్యలుచేస్తా పూజలుచేస్తా నమస్కరిస్తా పెద్దల్లారా దీవించండి గురువుల్లారా ఆశీర్వదించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవికోకిలలు - నాడు నేడు రేపు అప్పుడు చెట్టుమాటున ఒక్క కోకిల చక్కగా పాడుచుండె ఆకులలోన అణిగి మణిగి కవితకోకిల కూయుచుండె ఇప్పుడు కూసికూసి అలసిన కోకిలమ్మలు జనాలకు గళాలనరువునిచ్చి జనారణ్యాలచేరి వినుచుండె పాటనేర్చిన పెక్కు కవికోకిలలుకూడి పరవశించి పాడుచుండె రేపటిరోజులందు కొత్త శకానికి కొత్త కవులుపుట్టు కొత్త భావాలతోడ కొత్తకవితలు పాడు అక్షర సేద్యగాళ్ళు అక్షరవిన్యాసాలు చూపు అక్షరపోరాటాలు చేయు అక్షరగానామృతాన్ని చిమ్ము కవులకు స్వాగతం కవులకలాలకు స్వాగతం కవులకవితలకు స్వాగతం కవులగళాలకు స్వాగతం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అక్షరపోరాటకుడు ఎవరనుకున్నారు అతనెవరనుకున్నారు కలాన్నికత్తిలాపట్టేవాడు అక్షరపోరాటంచేసేవాడు యదర్ధవాది లోకవిరోధి కనిపించనివాడు వినిపించేవాడు మాటలు ముక్కుసూటిగామాట్లాడేవాడు చేతలు చెప్పినట్లుగాచేసేవాడు అబద్ధలాడేవారిని ఎండగట్టేవాడు అన్యాయాలుచేసేవారిని నిలదీసేవాడు చెప్పినవాటికి కట్టుబడేవాడు సహాయంకోరినవారికి తోడుగాయుండేవాడు నిజాయితీగా మాట్లాడేవాడు న్యాయమార్గాన్ని అనుసరించేవాడు నిజాన్ని నిష్ఠూరంలేకుండా చెప్పేవాడు నీతిని నలుగురికి బోధించేవాడు ద్రోహుల ఆటలుకట్టించేవాడు మోసకారుల మెడలువంచేవాడు నిప్పుతోనైనా చెలగాటమాడేవాడు జీవితాన్నయినా పణంగాపెట్టేవాడు కర్తవ్యాన్ని నిర్వహించేవాడు ఫలితాలను అందరికీపంచేవాడు చేతులు కలుపుదాం చెడును నిర్మూలిద్దాం సహకారాన్ని అందిద్దాం సమాజాన్ని అభివృద్ధిచేద్దాం కవులను ప్రోత్సహిద్దాం కవితలను ఆస్వాదిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
ఓ జాలిలేని జవరాలా! (విరహగీతం) ఓ... జాలిలేని జవరాలా చెంతకుచేరవా ఓ...  ప్రేమలేని ప్రియురాలా సంతసపరచవా  నన్నెందుకు కలిశావు నువ్వెందుకు వలచావు మాటలెందుకు కలిపావు మనసెందుకు దోచావు కఠినాత్మురాలువయితే కంటకాలను గుండెలోగుచ్చకపోయావా వలపేలేనిదానివయితే వలనువిసరకుండా ఉండకపోయావా ఎమయ్యిందీ ఇప్పుడేమయ్యిందీ ఎక్కడకెళ్ళావూ ఇప్పుడెక్కడకెళ్ళావూ నీ ఙ్ఞాపకాలను నెమరేసుకుంటున్నా నీ కోసం నిరీక్షిస్తున్నా రెక్కలుంటే పక్షిలాగా గాలిలో ఎగిరి వెదికి నీదగ్గర వ్రాలేవాడిని పువ్వులొచ్చి నీసమాచారమిస్తె ప్రేమసందేశాన్ని పూలలోదాచి పంపేవాడిని పావురాన్నినువ్వుపంపితే ప్రేమలేఖను పదిలంగా ప్రీతితోనీకుచేర్చేవాడిని మబ్బులునీజాడనుచెబితే మనోవేదనను మాటలలోకిమార్చి మాటుగాచేర్చేవాడిని వెన్నెలరేడు నీదారినిచూపితే విరహవేదనను వివరంగావర్ణించి వేగంగా నీకు అందించేవాడిని కవిగా మారా కమ్మగా వ్రాశా కవితను పంపుతున్నా కనికరించి దరిచేరవా చెలియా ఫేసుబుక్కులో పలకరించుకుందామా వాట్సప్పులో వీడియోలో చూసుకుందామా సఖియా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాదర్పణం కవిత ఒక దర్పణం దొరుకుట ఒక అదృష్టం కవితలో కవిగారు కనబడతారు కమ్మని విషయాలను కనులముందు పెడతారు కవితలో కవిమోమును చూడవచ్చు కవిరూపాన్ని కుంచెపట్టి గీయవచ్చు కవితలో కవిమనసునుకాంచవచ్చు కవిహృదయాన్ని కనుగొనవచ్చు కవితలో అందాలనుచూడవచ్చు ఆనందాన్ని పొందవచ్చు కవిత కవ్విస్తుంది కళ్ళలో కాపురంపెడుతుంది మంచికవిత మనసులో నిలుస్తుంది సుకవిత చిరకాలం చిత్తాన్నితొలుస్తుంది కవితాదర్పణాన్ని అందుకోండి కవిగారిమనోభావాలను వీక్షించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందమా నీవెక్కడా! అందమా  నా డెందమా నా చంద్రమా నా బంధమా అందమా నా ఆనందమా నా కమ్మదనమా నా కంటిదృశ్యమా అందమా నా వెలుగా నా మార్గమా నా లక్ష్యమా అందమా నీవెక్కడా నీతావులెక్కడా నీచిరునామా తెలుపుమా అనగానే  అందమొచ్చె సమాధానమిచ్చె సందేహమిలాతీర్చే ఇక్కడా అక్కడా అనేసందేహం వలదుసుమా ఎందెందు వెదికిచూచినా  అందందే తప్పక ఉంటా పువ్వుల్లో ఉంటా పరికించేవారికెల్లా పొంకాలుచూపుతుంటా పులకరిస్తుంటా అతివల్లో ఉంటా అణిగిమణిగి ఉంటా అందుకోగలిగేవారినెల్లా  ఆనందపరుస్తుంటా పసిపాపల్లో ఉంటా పిల్లలపలుకులలో ఉంటా ప్రక్కనున్నవారిని పరవశపరుస్తుంటా నింగిలో ఉంటా నీలిమబ్బుల్లో ఉంటా మేఘాల్లో ఉంటా హరివిల్లులో ఉంటా చంద్రునిలో ఉంటా చక్కనివెన్నెలలో ఉంటా చుక్కల తళతళలలో ఉంటా చూపరులను సంతసపెడుతుంటా పుడమిపై ఉంటా పచ్చనిచెట్లలో ఉంటా పంటపొలాల్లో ఉంటా ప్రకృతిలో ఉంటా ప్రభాత సూర్యునిలో ఉంటా అరుణకిరణాలలో ఉంటా అస్తమించే రవిరంగులలో ఉంటా విశ్వమంతా వ్యాపించి ఉంటా కొండల్లో ఉంటా  కోనల్లో ఉంటా అరణ్యాలలో ఉంటా సెలయేర్లలో ఉంటా నదినీటిలో ఉంటా సరస్సులలో ఉంటా సముద్రాల్లో ఉంటా వాటితీరాలలో ఉంటా కళ్ళల్లో ఉంటా కనగలిగేవారికి కనపడతా కళకళ...
Image
 ఆడవాళ్ళూ మీకు జోహార్లు! ఎక్కడచూచినా ఎందులోనయినా అమ్మాయిలు ముందుకెళ్తున్నారు  అబ్బయిలెందుకో వెనుకబడుతున్నారు చదువుసంధ్యల్లో ఉద్యోగసద్యోగాల్లో ఆడవాళ్ళు దూసుకెళ్తున్నారు మగవాళ్ళెందుకో వెనుకంజవేస్తున్నారు అందంలో ఆనందంలో నవ్వటంలో నవ్వించటంలో యువతులు ముందుంటున్నారు యువకులెందుకో వెనుకనుంటున్నారు బట్టల్లో నగల్లో సోకుల్లో సందడిలో స్త్రీలు ముందువరసలో ఉంటున్నారు పురుషులెందుకో వెనుకవరుసలో ఉంటున్నారు ఆటల్లో పాటల్లో మాటల్లో చేతల్లో కుర్రపిల్లలు ముందుకెళ్తుంటే కుర్రోళ్ళెందుకో  పోటీబడలేకపోతున్నారు ఆశయాల్లో అనుభవాల్లో ఆలోచనలలో ఆచరించటంలో మహిళలు ఉన్నతిలోకొస్తుంటే మగవాళ్ళెందుకో దిగజారిపోతున్నారు ప్రేమల్లో బంధాల్లో కాపురాల్లో జీవితాల్లో మహిళామణులు ముందుంటుంటే మగవారెందుకో సరితూగలేకపోతున్నారు బరువు బాధ్యతల్లో కుటుంబపోషణలో పెత్తనంలో భార్యాభర్తలొకటయినా భర్తలెందుకో బాగావెనుకబడ్డారు అమ్మలకన్నా నాన్నలు వెనుకబడ్డారు సోదరీమణులుకన్నా సోదరులు బాగావెనుకబడ్డారు కవితల్లో కధల్లో సమూహాల్లో వ్యాఖ్యానాల్లో ఆడవారు అదరకొడుతుంటే మగవాళ్ళెందుకో వెనుకబడ్డారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్నీ సాధిస్తున్నారు అన్నిటా పురు...
Image
 కవితాంజలి కవితాకుసుమాలను పూయించి  కళ్ళముందుపెట్టి కనువిందులుచేయనా కవితాసౌరభాలను వెదజల్లి మనసులనుతట్టి మురిపించానా కవితాకిరణాలను ప్రసరించి వెలుగులునింపి పరవశింపజేయనా  కవితాపఠనమును కావించి కర్ణములకునింపును కలిగించనా కవితాజల్లులను కురిపించి తనువులనుతడిపి తరింపజేయనా కవితాగంగను పారించి కల్మషాలన్నింటిని కడిగిపారేయనా కవితాకన్యకను కలలోకినాహ్వానించి కమ్మనివిషయాలనుచెప్పించుకొని కవనంసాగించనా కవితాసేద్యమును కొనసాగించి కమ్మనిపంటలనుపండించి కడుపులునింపనా కవనవిజయమును పొంది కవితాలోకమున వెలుగొందనా కవనాన్ని కొనసాగించనా కుతూహలపరచనా కవితానందమునీయనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆపువ్వును చూడు ఆపుష్పం ఎంతచక్కనో ఆపరిమళం ఎంతఘాటో ఆరూపు ఎంతవింతయో ఆరంగు ఎంతవిచిత్రమో ఆతేనెకు ఎంతతీపో ఆతేటికి ఎంతానందమో ఆపువ్వుకు ఎంతప్రేమో  ఆజీవితం ఎంతధన్యమో ఆతోటకి ఎంతపచ్చదనమో ఆవాతావరణం ఎంతాహ్లాదకరమో వదలను వదలను ఆపువ్వును వదలను కదలను కదలను ఆపువ్వునుండి ప్రక్కకుకదలను పూబాలతో ఆటలాడుతా పూలకన్యతో పాటలుపాడుతా చేతిలోకి తీసుకుంటా సంతోషంలో తేలిపోతా మనసులో దాచుకుంటా సహవాసములో పొంగిపోతా పువ్వులలోకంలో పయనిస్తా ఆనందలోకంలో విహరిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం నాలుగురోజులు విషాదకవితలు విరచించా సున్నితమనస్కులకు బాధకలిగించా ఇకముందు అందాలను చూపిస్తా ఆనందాన్ని కలిగిస్తా ఇట్లు మీ గుండ్లపల్లి మీ రాజేంద్ర మీ ప్రసాద్ మీ కవి చివరగా పాఠకులకు ధన్యవాదాలు వ్యాఖ్యాతలకు అభివందనాలు (ఏ పువ్వును ముఖచిత్రంగా పెట్టాలా అని బాగా ఆలోచించి, చివరకు దాలియా పువ్వును ఎన్నుకున్నాను. మీరు చూచి మురిసిపోతారనుకుంటున్నాను.)
Image
 వాడినపువ్వును వికసించనీ! ప్రేమను పరిహాసంచేస్తావా నమ్మకాన్ని వమ్ముచేస్తావా నువ్వు ఏమని అనుకున్నావు నన్ను ఎమని అనుకున్నావు పిల్లదాన్ని అనుకున్నావా పిచ్చిదాన్ని అనుకున్నావా మోసకారి ననుకున్నావా మాటకారి ననుకున్నావా ఆట ఆడిద్దామనుకున్నావా వెంట తిప్పించుకుందామనుకున్నావా అంతా నాటకమనుకున్నావా అన్నీ అబద్ధాలనుకున్నావా ఘోరంగా వంచనచేస్తావా మానసికంగా హింసకుగురిచేస్తావా అసలెందుకు కలిశావు నన్నెందుకు వలచావు మనసెందుకు దోచావు బంధాన్నెందుకు కలిపావు మాటలెందుకు చెప్పావు మనసునెందుకు దోచావు పన్నీరును పైనచల్లతానన్నావు కన్నీరును కార్పిస్తున్నావు గుండెకు గాయంచేశావు వంటికి నిప్పునుపెట్టావు నిన్ను మరువలేకున్నాను నిన్ను వీడలేకున్నాను ఇప్పటికయినా మనసుమారదా ఇద్దరిమొకటిగా ముందుకెళ్ళలేమా ప్రణయాన్ని విఫలంచేస్తావా జీవితాన్ని నాశనంచేస్తావా చెలికాడా ఎండినచెట్టును చిగురించనీ వాడినపూవును వికసంచనీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మిగిలిపోయె మదిలో మాయనిబాధ! మల్లెపువ్వులా పరిమళమును వెదజల్లలేను కోకిలలా గళమెత్తిగానము చేయలేను మామిడిచెట్టులా మధురఫలాలను అందించలేను నెమలిలా పురివిప్పినాట్యమాడి చూపరులను రంజింపజేయలేను చంద్రునిలా చల్లనివెన్నెలను ప్రసరించలేను సూర్యునిలా వెలుగులుచిమ్మి చీకటినిపారద్రోలలేను మేఘంలా వానజల్లులను కురిపించలేను కనులుండీకూడా  అక్రమాలను అఘాయిత్యాలను అరికట్టలేను నోరుండీకూడా నిజాలను నిర్భయంగా  చెప్పలేను గొప్పకవిలా కవితలనువ్రాసి కుతూహలపరచలేను మనిషిలా మానవత్వాన్ని చాటలేకున్నాను చెట్లు పువ్వులు పక్షులుకన్నా చంద్రుడు సూర్యుడు మేఘాలుకన్నా జంతువులు కవులు తోటిమనుషులుకన్నా అధముడననేబాధ మనసులో మిగిలెనుకదా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగుపూలు అదిగో ఆపూలతోటనుచూడు అందమైన తెలుగుపూలు అందరిని అలరిస్తున్నాయి ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆవికసించిన మల్లెపువ్వునుచూడు వయ్యారాలను ఒలకబోస్తూ పరిమళాలను వెదజల్లుతూ అంతరంగాన్ని కట్టిపడవేస్తుంది ఆ అందాలరోజాపువ్వునుచూడు చెంతకురమ్మని సైగచేస్తుంది కబుర్లు చెప్పమంటుంది కాలాక్షేపం చేసుకుందామంటుంది ఆమనోహర మందారపువ్వునుచూడు పూర్తిగా విచ్చుకుంది అందాలను ఆరబోస్తుంది ఆడుకుందాం రమ్మంటుంది ఆ ముద్దబంతినిచూడు ముద్దులొలుకుతుంది ముచ్చటగాయున్నది మయినిమరిపిస్తున్నది ఆ చామంతినిచూడు సొగసుగాయున్నది సరసాలకు రమ్మంటుంది సరదాలు చేసుకుందామంటుంది తెలుగుతోటను చూడు తెలుగుపూలను చూడు తెలుగుసొగసులు చూడు తెలుగువెలుగులు చూడు తెలుగు కవిగారు తెలుగుపూలమీద చక్కనిరెండుపద్యాలను చెప్పండి చదువరుల మనసులుతట్టండి తెలుగుపూలజూడ వెలుగులుచిందేను తరుణులునలరులను తలనుదాల్చ చూడముచ్చటయ్యి శోభిల్లుచుండును పూలుచేసుకున్న పుణ్యమేమొ మత్తుచల్లుచుండె మందారకుసుమంబు గుండెలనుగులాబి గుచ్చుచుండె బహుగబాగుగుండె బంతిచామంతులు మనసునుతడుచుండె మల్లెపూవు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఒంటరినైపోయాను ప్రేమలూ విధేయతలు అంతా బూటకం ప్రమాణాలు వాగ్దానాలు అంతా నాటకం ఎవరికి ఎవరూ ఏమీకారు సంబంధాలన్నీ శాశ్వతముకాదు నీ రక్తమే నిన్ను చివరకు భగభగా దహిస్తుంది బూడిదగా మారుస్తుంది  గాలిలో ఎగిరేవారయినా మట్టిలో కలవాల్సిందే సుఖంగాయున్నప్పుడు అందరూ తోడుకువస్తారు దుఃఖములో యున్నప్పుడు అందరూ ముఖంచాటేస్తారు నీవాళ్ళలాగే నీప్రక్కనేవుంటారు నువ్వుచిక్కావంటే నీగుండెనుబద్దలుచేస్తారు పాలల్లో విషంకలుపుతారు ప్రేమగాయిచ్చిత్రాగించి ప్రాణాలుతీస్తారు మాటలుచెప్పి మోసంచేస్తారు నాటకమాడి నమ్మిస్తారు కళ్ళల్లో కారంకొడతారు కపటంజేసి కాజేస్తారు దేవునికి పూజలుచేస్తారు దైవానికే ద్రోహంచేస్తారు మనుషులను లెక్కచేయ్యరు బాంధవ్యాలకు విలువనివ్వరు చిక్కితే చితకకొడతారు నక్కితే నలగకొడతారు మెత్తగాయుంటే నలిపేస్తారు గట్టిగాయుంటే పగలగొట్టిపిండిజేస్తారు నిలుచుంటే నిందలేస్తారు ప్రక్కకుపోతుంటే వెంటబడివేధిస్తారు కోరినవాటిని ఇవ్వమంటారు వద్దన్నవాటిని పైనరుద్దుతారు అనురాగం ఆప్యాయత అంతా  అబద్ధం పైకి ఒకటిచెబుతారు బయట వేరొకటిచేస్తారు ప్రేమించానన్నది పెళ్ళిచేసుకుందామన్నది ప్రమాణంచేసింది పాతాళానికిత్రోసింది వలపువలలో పడ్డాను చెప్...
Image
 ఎన్నాళ్ళో? బాల్యము పోయింది ఙ్ఞాపకాలను మిగిల్చింది పుట్టినఊరికి దూరమయ్యాను ప్రాణమిత్రులకు ఎడమయ్యాను భార్య వచ్చింది బాధ్యతలు పెంచింది సంసారంలో దిగాను సముద్రాన్ని ఈదుతున్నాను   యవ్వనం పోయింది స్మృతులు తరుముతున్నాయి ఉద్యోగంనుండి విశ్రాంతిదొరికింది సంపాదన అడుగంటింది సంబంధాలు పోయాయి సంతోషాలు పోయాయి తల్లి గతించింది మరణించాడు తండ్రి కోదళ్ళు వచ్చారు కొడుకులు దూరంగావెళ్ళారు మనుమలను చూడలేకపోతున్నాను మనుమరాళ్ళతో ఆడుకోలేకపోతున్నాను ఆప్యాయతలు తగ్గాయి ఆనందాలు తగ్గాయి ముసలితనము వచ్చింది భార్యయే దిక్కయింది కవితాకన్యక తోడయ్యింది కలలోకొచ్చి కవ్విస్తుంది కవితావిషయాలను ఇస్తుంది కవనకుతూహలం కలిగిస్తుంది కలం తోడయ్యింది కల్పనలు తోస్తున్నాయి కవితలు వస్తున్నాయి కాగితాలపైకి ఎక్కుతున్నాయి కవితాస్నేహం  ఎన్నాళ్ళో కవితలువ్రాసేది ఎన్నాళ్ళో ముసలిజీవితం  ఎన్నాళ్ళో ముసలిదానిసహచర్యం ఎన్నాళ్ళో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మనుమరాలి ముచ్చట్లు మనుమరాలు టీనా ముచ్చటపరుస్తున్నది ముద్దుమాటలతోడ మురిపించుచున్నది అందచందాలతోడ అలరిస్తుయున్నది ఆటపాటలతోడ ఆనందపరుస్తున్నది చాకులెట్టులిస్తే సంబరాపడుతుంది బిస్కత్తులిస్తే ముద్దులూపెడుతుంది తాతదగ్గరకొచ్చి కథలుచెప్పమంటున్నాది నానమ్మదగ్గరకొచ్చి నవ్వించిపోతున్నాది తల్లిచేత దెబ్బలు తరచుగా తింటున్నాది తండ్రికి కబుర్లుచెప్పి తోషాన్ని ఇస్తున్నాది మా బుజ్జి టీనా మా చిట్టి టీనా మా ఇంటి వెలుగు నా కంటి మెరుపు మామంచి టీనా మాముద్దు టీనా మాబంగారు టీనా మాసుగుణాల టీనా నిండునూరేళ్ళు జీవించరా నినుకన్నవారికి పేరుప్రఖ్యాతులుతేరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నాకు ఆడపిల్లపుట్టింది (ఓ నాన్న స్వగతం) నేడునాకు పుట్టింది ఆడపిల్ల నాకు నచ్చింది మనసెల్ల మాఇంటికి వచ్చింది మహలక్ష్మి మన్నించి శుక్రవారాన పుట్టింది సంపదను తెస్తుంది ఆడపిల్లంటే ఆదిలక్ష్మంటారు అడుగుపెట్టిందంటే అన్నికలిసొస్తుందంటారు ఎరుపురంగులోన వెలిగిపోతున్నాది ఎత్తుకోమని నాకు ఏదోచెప్పినట్లున్నాది పెంచుతాను నేను పోషిస్తాను నేను పెద్దగాచదివిస్తాను నేను పెళ్ళిచేస్తాను నేను భార్య కూతురునుచూచింది పురిటిబాధలను మరచిపోయింది నానొచ్చి చూచాడు అమ్మమరలా ఇంటికొచ్చిందన్నాడు అమ్మొచ్చి చూచింది అతిగ సంతసించిపోయింది అక్కొచ్చి చూచింది కొడుక్కి చేసుకుంటానంది మామొచ్చి చూశాడు మహదానందంలోన మునిగిపోయీనాడు మరదలొచ్చి చూచింది మయిమరచి మురిసిపోయింది ఎవరు అంటున్నారు ఆడపిల్లలు వద్దనిపుడు మహిళలే ముందువరసనున్నారిపుడు పోటీపడి పరదేశాలకెళ్ళుతున్నారిపుడు ఉన్నతపదవులలోన వర్ధిల్లుతున్నారు విజయాలబాటలోన ముందుకెళుతున్నారు అబ్బాయిలెంతో అమ్మాయిలంతే మారింది కాలము మనమూ మారదాం లింగవివక్షలు లేవిపుడు భ్రూణహత్యలు లేవిపుడు మంచికాలం వచ్చింది సమానత్వం తెచ్చింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆకాశ చిత్రాలు ఆకాశదేశాన విహరిస్తా అంతరంగాన్ని పులకిస్తా ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తా అందులో అందరికి ఆతిధ్యమిస్తా అకాశాన్ని  క్రిందకుదించుతా అవనిని నీలంగామారుస్తా ఆకాశపందిరిని వేస్తా అవనియంత ఇల్లును కట్టేస్తా ఆకాశదృశ్యాలను చూపిస్తా ఆకాశవాణిని  వినిపిస్తా ఆకాశదీపాలను వెలిగిస్తా అంధకారాన్ని తరిమేస్తా ఆకాశగొడుగును ఎత్తుతా ఆకాశగంగనునేలకు తీసుకొస్తా ఆకాశరంగును అద్దుకుంటా అందమైన బాలకృష్ణునిగా అలంకరించుకుంటా ఆకాశవస్త్రాన్ని తొడుగుకుంటా ఆకాశతీరాలను తాకివస్తా ఆకాశమేఘాలను అందుకుంటా అందమైనబొమ్మలుగా రూపుదిద్దుతా ఆకాశ తారకలను పట్టకొస్తా అందాలమాలగా గుచ్చి మెడలో అలంకరించుకుంటా ఆకాశానికి నిచ్చెనను వేచి ఎక్కుతా అందాల చందమామతో ఆడుకొని వస్తా ఆకాశహరివిల్లును సారిస్తా అందరినీ ఆనందపరుస్తా ఆకాశం కాదుశూన్యము అది అనంతము మరి శాశ్వతము ఆకాశాన్ని చూడు ఆనందాన్ని పొందు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
గేయము అయినా కవులకలములాగలేదూ అక్షరాలను అల్లెనూ పదాలను పేర్చెనూ పద్యాలను వ్రాసెనూ కవితలను కూర్చెనూ    అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ అందాలను వర్ణించెనూ ఆనందాలను కలిగించెనూ అంతరంగాలను తట్టెనూ అందరిమదులలో తిష్టవేసెనూ అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ శైలిని మార్చెనూ వాడుకబాషను వాడెనూ కల్పనలు చేసెనూ భావకవితలు వ్రాసెనూ అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ ప్రణయకవితలు వ్రాసెనూ ప్రబోధకవితలు వ్రాసెనూ పూలకవితలు వ్రాసెనూ ప్రకృతికవితలు వ్రాసెనూ అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ ప్రశంసలు పొందెనూ పతకాలు గెలిచెనూ పురస్కారాలు వచ్చెనూ పాఠకులను మెప్పించెనూ అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ అరణ్యాలను చూచెనూ అందంగా అభివర్ణించెనూ ఆకాశాన్ని చూచెనూ అద్భుతంగా విరచించెనూ అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ పల్లెలను చూచెనూ జనపదాలు వ్రాసెనూ పట్టణాలు చూచెనూ జనులకవితలు వ్రాసెనూ అయినా కవులకలములాగలేదూ ఆకవుల కవనకాంక్షతీరలేదూ ఆంగ్లకవితలు చదివెనూ దేశభాషలకవితలు చదివెనూ పాతకొత్త తెలుగుకవితలు చదివెనూ అన్నీరంగరించి అద్వితీయకవితలు వ్రాసెనూ అయినా కవులకల...
Image
 ఎవరివో నీవెవరివో? సూర్యుని వెలుగువా చంద్రుని వెన్నెలవా మబ్బులోని మెరుపువా తారకల తళుకువా ఎవరైనా సరే నీకు దిగదుడిపే ఏమైనా సరే నీవు నాధ్యేయానివే  నీభుజాలపైపడ్డ కేశాలు నీళ్ళతోనిండిన మేఘాలు నీకంటి ఓరచూపులు విసిరిన వలపువలలు  నీ కళ్ళను చూస్తేనే నాకు నిషా కలిగే నీచూపులు మత్తునిచ్చే నామనసును చిత్తుచేసే నీ వెలుగులుచిందు మోము సరసులో విరిసిన  కమలము నీనోటి ముత్యాల పలుకులు కమ్మని తేనెల చుక్కలు నీవు చల్లే ప్రేమజల్లులు నాపై పడే వానచినుకులు తడిపేను నా మేనును తట్టేను నా మనసును నీవు వసంత వీచికవి కవుల స్వప్న సుందరివి నీవు చిందే చిరునవ్వులు అయ్యేను నీపెదవులపై మెరుపులు నీవు యవనికవు అందానికి ప్రతీకవు దీపాల వెలుగువు నాహృదికి మోహనరూపువు నీకోసమే ఎదురుచూస్తుంటా చెలీ నీసుఖమే ఎపుడూకోరుకుంటా సఖీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పువ్వుల ప్రాశస్త్యం పరమాత్ముడే పువ్వులకు ప్రీతిపాత్రుడయ్యాడు పొంకాలనందించాడు పరిమళాలనిచ్చాడు పలురూపాలనిచ్చాడు పువ్వులది భాగ్యమే భాగ్యం భగవంతుని పాదాలుచేరుతున్నాయి భామల కొప్పులకెక్కుతున్నాయి పువ్వులు అమ్మోరులకు ఆసనాలయ్యాయి కోమలాంగుల కళ్ళల్లోచేరుతున్నాయి కవుల కవితల్లోకనబడుతున్నాయి  పువ్వులు ప్రొద్దుప్రొద్దునే పరమాత్మునిచే పుట్టించబడుతున్నాయి పలురంగులను అద్దించుకుంటున్నాయి పరాగాన్నితేనెలను నింపించుకుంటున్నాయి తేటులను పిలుస్తున్నాయి తేనెను పంచుతున్నాయి కవులను తడుతున్నాయి కవితల్లోకి ఎక్కుతున్నాయి అలరుల అందాలనుచూచి అప్సరస అసూయపడి అవనివాసులకు తనతోపనిలేదని అమరలోకానికి వెళ్ళిపోయింది పువ్వుల సుగంధాలనుపీల్చి  పరవశించి పోయి పరిమళద్రవ్యాలు ఆశ్ఛర్యపడి ప్రక్కకు తప్పుకున్నాయి పుష్పాల రంగులను చూచి హరివిల్లు సంబరపడి వాటిముందు తాను తీసుకట్టని దూరంగా తరలిపోయింది పువ్వులతేనెల రుచిచూచి పనసతొనలు పండ్లు పంచదారమిఠాయిలు అబ్బురపడి తలను క్రిందకు దించుకున్నాయి అలరుల ఆకర్షణనుచూచి ఆయస్కాంతం అచ్చెరువొంది అంతటిశక్తి తనకులేదని అక్కడనుండి తప్పుకుంది పూలవెలుగును చూచి పున్నమివెన్నెల ఈర్ష్యపడి పుడమికి తనతో ప...
Image
 కవితాగేయం వచ్చింది వచ్చింది కవిత! వచ్చింది వచ్చింది కవిత బహుబాగ నచ్చింది కవిత ముందుకూ వచ్చింది కవిత ముచ్చటా పరచింది కవిత            ||వచ్చి|| కలలోకివచ్చింది, కబుర్లనుచెప్పింది  కవ్వించిపోయింది, కుతూహలపరచింది  కోరికలు లేపింది, కోరినవి ఇచ్చింది  కథనొకటి ఇచ్చింది, కవిత వ్రాయించింది ||వచ్చి|| ప్రేమనూతెలిపింది, పరవశాపరచింది  పకపకానవ్వింది, పలువరుసచూపింది             ప్రాయమందునున్నది, పరువాలు చూపింది  ప్రోత్సాహమిచ్చింది, పాట వ్రాయించింది ||వచ్చి|| ధగధగా మెరిసింది, దద్దరిలిపోయింది  తియ్యగా పలికింది, తేనెలను చిందింది  సిగ్గులను చూపింది, సింగారమొలికింది  సొగసులను చూపింది, చిత్తాన్ని దోచింది ||వచ్చి|| చెంతకు వచ్చింది, చేతులను కలిపింది  సరసాలు ఆడింది, సంతోష పరచింది  మానసముతట్టింది, మదిలోననిలిచింది  ముచ్చటలు చెప్పింది, మురిపాలు చూపింది ||వచ్చి||            ఊహలను ఇచ్చింది కవిత, ఉత్సాహ పరచింది కవిత భావాలనిచ్చింది కవిత, బయటపెట్టించింది కవిత వచ్చింద...
Image
 నిరీక్షణ నీ నవ్వులన్నీ నాకోసమేనని నేను నమ్ముతున్నా నీ అందాలన్నీ నావేనని నేను అదృష్ట్తవంతుడననుకొనుచున్నా నీ ప్రేమంతా నామీదనేనని నేను తలపోస్తున్నా నీ పలుకులన్నీ నిజమేనని నేను అనుకుంటున్నా నీ చేతలన్నీ నాకోసమేనని నేను నిర్ణయించుకున్నా నువ్వు పుట్టింది నాకోసమేనని నేను భావిస్తున్నా నీ ఆలోచనలన్నీ నాపైనేనని నేను విశ్వసిస్తున్నా నీ చూపులన్నీ నాపైనేనని నేను నిర్ధారించుకున్నా నువ్వే నాతోడూ నాజోడూ అనిపరిగణిస్తున్నా నువ్వులేనిదే నేనుండలేనని నీకు తెలియపరుస్తున్నా నీ సమ్మతికోసం నేను ఎన్నిరోజులయినా నిరీక్షిస్తుంటా నెచ్చెలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
జానపదగీతం బావామరదల్లు ఆమె:  వెళ్ళుమామా వెళ్ళు        నువ్వు వెళ్ళుమామా వెళ్ళు        రానుమామా రాను        నేను రానుమామా రాను  ||వెళ్ళు|| అతను: ఏమయిందే పిల్ల        నీకు యేమయిందే పిల్ల        రావెపిల్లా రావె        నువ్వు రావెపిల్లా రావె ||ఏమ|| ఆమె:  పట్టుచీరెలన్నావు        పట్టెమంచమన్నావు        పూలురోజుతెస్త్తానన్నావు        వట్టిమాటలు చెప్పావు  ||వెళ్ళు||        బంగారునగలిస్తానన్నావు        ప్రతివారంసినిమాచూపిస్తానన్నావు        ముద్దుముచ్చటలన్నావు        కల్లమాటలు చెప్పావు ||వెళ్ళు||        మాంసం పెడతానన్నావు        చేపలు తెస్తానన్నావు        రొయ్యలు రోజూయన్నావు        ఉట్టిమాటలుచెప్పావు  ||వెళ్ళు||        ...
Image
 చిన్నదానిసొగసు చూడతరమా!  చిన్నది చెంగావిచీరకట్టింది చక్కగా చింతపువ్వులరవికనుతొడిగింది చిన్నది వాలుజడను వేసుకొన్నది చూపులతో వలపువలను విసిరింది చిన్నది చిరుమల్లెపూలుపెట్టుకున్నది చక్కదనంతో చిత్తాన్నిదోచుకున్నది చిన్నది చంద్రునివలెవెలుగుచున్నది సోయగాలను చూపిమురిపిస్తున్నది చిన్నది చేలోనకెళ్ళింది చిరునవ్వులను చిందించింది చిన్నది చింతతోపుకెళ్ళినది చల్లగాలికి సేదతీరితోడునుకోరింది చిన్నది చిటికెలేస్తున్నది సావధానపరచి సరసాలాడుచున్నది చిన్నది ఆడుతున్నది చక్కగా పాడుతున్నది చిన్నది వయసులోనున్నది సొగసులను చూపిస్తున్నది చిన్నది పరువాలతో పరవశించిపోవుచున్నది చెలికాన్ని ప్రేమలోనికి దించాలనిచూస్తున్నది చిన్నది చెయ్యెత్తిచూపుతున్నది చెంతకురమ్మని సైగలుచేస్తున్నది చిన్నది చెంతకుచేరుతున్నది చతురోక్తులను సూటిగావిసురుతున్నది చిన్నదానితో మాట్లాడాల్సిందే తోడుకు తెచ్చుకోవాల్సిందే చిన్నదాని మెడవంచాల్సిందె నలుగురిముందు తాళికట్టాల్సిందే పెద్దలతో అక్షింతలు చల్లించుకోవాల్సిందే అందరి దీవెనలు పొందాల్సిందే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పూలప్రేమ తొలికిరణం తొంగిచూడగానె తూర్పున సూరీడుదయించగానె  తోటలోనికివెళ్ళి పూలనుపలకరిద్దామని తలుపుదగ్గరకెళ్ళా తయారయి  తేటులన్నికూడి తలుపు దగ్గకుచేరి అడ్డుకున్నాయి ఆపాయి పూలకవీ పూలనుండిమమ్ము వేరుచెయ్యొద్దని పూదోటకు వెళ్ళొద్దని ప్రార్ధించాయి పూలు ఈమధ్య పలుకరించుటలేదు దగ్గరకు వెళ్దామన్న రానియ్యుటలేదు తాకనివ్వుటలేదు తేనెనిచ్చుటలేదు తరిమేస్తున్నాయి తత్తరపెడుతున్నాయి పువ్వులంటే ప్రాణం నాకు పువ్వులంటే ప్రేమ నాకు పూలదగ్గరకు పోకుండా ఉండలేను పోండి పోండి జరగండి ప్రక్కకు  అని అన్నా  కోప్పడ్డా  బిగ్గరగా అరిచా  ముక్తకంఠముతో ముందుకుపోనీకుండా అప్పుడు ఆతేటులన్ని అన్నాయి ఇలాగని చెవ్వుల్లో దూరతాం ముక్కును ముట్టేస్తాం చేతులను కుడతాం కాళ్ళను కరుస్తాం కందిరీగలను పిలుస్తాం కళ్ళను కుట్టిస్తాం కాకులను పిలిచి గోలచేయిస్తాం గ్రద్దలను పిలిచి గోళ్ళతో గీకిస్తాం ఎర్రచీమలను పిలుస్తాం వంటినంతా ప్రాకిస్తాం కుట్టిస్తాం ఈగలను పిలుస్తాం మోత మోగిస్తాం దోమలను పిలుస్తాం రక్తాన్ని త్రాగిస్తాం పువ్వులు విషయానితెలుసుకొని పరుగెత్తుకుంటు వచ్చాయి తేటులను తిట్టేశాయి దూరంగా తరిమేశాయి స్వాగతం పలికాయి త...