Posts

Showing posts from April, 2023
Image
 ఏక్కడుంటే అక్కడే! ఎక్కడ తెలుగుంటే అక్కడ వెలుగుంటుంది ఎక్కడ అందముంటే అక్కడ ఆనందముంటుంది ఎక్కడ పూలుంటే అక్కడ పరిమళముంటుంది ఎక్కడ కృషియుంటే అక్కడ అభివృద్ధియుంటుంది ఎక్కడ మంచియుంటే అక్కడ మానవత్వముంటుంది ఎక్కడ ప్రయత్నముంటే అక్కడ విజయముంటుంది ఎక్కడ ప్రేమయుంటే అక్కడ బంధముంటుంది ఎక్కడ మనసుంటే అక్కడ అట్టియాలోచనుంటుంది ఎక్కడ ప్రతిభయుంటే అక్కడ ప్రఖ్యాతివస్తుంది ఎక్కడ సంతోషముంటే అక్కడ స్వర్గముంటుంది ఎక్కడ శుభ్రతయుంటే అక్కడ లక్ష్మియుంటుంది ఎక్కడ చదువుంటే అక్కడ సరస్వతియుంటుంది ఎక్కడ నీవుంటే అక్కడ నీకర్మవెంటయుంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ మనిషీ! మేనుకంటిన మలినమును మానవత్వముతో కడగరా మనసుకంటిన మురికిని మంచితనముతో తుడవరా కాయానికంటిన కంపును కుసుమగంధాలతో కడతేర్చరా కుళ్ళిపోయిన దేహమును నిజాయితీతో ప్రక్షాలనముచెయ్యరా పాసిపట్టిన పళ్ళను పకపకానవ్వులతో పరిశుభ్రముచెయ్యరా గుబిలిపట్టిన చెవులను శ్రావ్యరాగాలతో శుద్ధముచెయ్యరా ధూళితో మూసుకున్నకళ్ళను అందచందాలుచూపి తెరిపించరా మూసుకుపోయిన ముక్కును సువాసనలతో శుచిపరచరా వెక్కిరిస్తున్న నుదురుకు మెచ్చుకొనుటను నేర్పరా వెలవెలలాడుతున్న మోమును చిరునవ్వులతో వెలిగించరా రుచికోల్పోయిన నాలుకకు తేనెపలుకులను తడపరా  మూతిబిగించిన పెదవులకు అక్షరామృతము అందించరా చేతలుడిగిన చేతులను చైతన్య పరచరా కదలనీమెదలనీ కాళ్ళను కవ్వించి నృత్యమాడించరా మాసినా కురులకు మర్ధనము చెయ్యరా తట్టినా తలపులను తెల్లకాగితాలపై పెట్టరా గాఢ నిద్రానుండి గబగబాలేవరా మత్తునూ వదిలేసి మిసమిసాలాడరా సూర్యుడిని చూడరా కళకళాలాడరా చంద్రుడిని చూడరా ముసిముసీనవ్వరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏడి? వారేడి? (అలిగినవేళ) వారొస్తే బుంగమూతిపెదతా బెట్టుచేస్తా బ్రతిమాలించుకుంటా...... పొద్దుకూకింది చీకటిపడింది సద్దుమణిగింది ఏరి? వారేరి? ప్రియుడురాలేదు పలకరించలేదు పరిహాసాలాడలేదు ఏడి? వాడేడి? చంద్రుడొచ్చాడు చుట్టూతారకలున్నవి చతుర్లాడుతున్నట్లున్నది రారేమి? వారింకారారేమి? వెన్నెలకాస్తున్నది చల్లదనమున్నది చక్కదనమున్నది ఎక్కడ? వారెక్కడ? తోటనిండాపూలున్నవి పరిమళాలుచల్లుతున్నవి ప్రేమనురేకెత్తుస్తున్నాయి జాడేది? వారి జాడేది? తలలోమల్లెలువాడుతున్నవి సమయంగడుస్తున్నది మనసుతొందరపెడుతున్నది రారేమి? వారురారేమి? తాళలేకున్నా వేచిచూడలేకున్నా లేస్తున్నా ఇంటికివెళ్తున్నా....... రేపైనా వస్తారో రారో? ఏమైందో ఏమో? అలిగారో ఏమో? చూస్తా వేచిచూస్తా అందాకా విరహతాపంతో వేగిపోతా........ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మనతెలుగు తెలుగుకేభాష ఇలలోసాటిగాదనీ చాటరా తెలుగు వెలుగుకుసమానమైనదనీ చెప్పరా తెలుగుతల్లికి పూదండనల్లీ వెయ్యరా తెలుగుజాతి ఘనమైనదనీ తెలుపరా తెలుగు కడుతియ్యనైనదనీ పలుకరా భాషలలో బహుగొప్పదనీ గళమెత్తరా తెలుగువారు అతితెలివైనవారనీ నిరూపించరా అందచందాలలలో అగ్రగణ్యులనీ అభినందించరా తెలుగువాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఒక్కటేరా తెలుగుతల్లి ప్రియతమపిల్లలమనీ కూడుమురా తెలుగునేల సారవంతమనీ చూపించరా తెలుగుపంటలు శ్రేష్టమనీ రుజువుచేయరా తెలుగువారు మేటిరైతులనీ మెచ్చరా తెలుగువాళ్ళు కష్టపరులనీ చూపరా తెలుగుతోటలు చక్కనైనవనీ పొగడరా తెలుగుపూలు బహుపరిమళమనీ కీర్తించరా తెలుగక్షరాలు గుండ్రనిముత్యములనీ వ్రాయించరా తెలుగుపలుకులు లేతకొబ్బరిపలుకలనీ రుచిచూపరా తెలుగుజాతిచరిత్ర ఘనమనీ గుర్తించరా తాతముత్తాతలనాటి కథలన్నీ ఎరిగించరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రంగుపడిద్ది నింగినుండి నీలిరంగు పడిద్ది నేలమీదపడి పచ్చగా మారిద్ది పొద్దునేసూర్యుడునుండి ఎరుపురంగు ప్రసరించ్చిద్ది కళ్ళల్లోపడి తెల్లగా అయ్యిద్ది పూతోటనుండి తెల్లమల్లియ వచ్చిద్ది పరాచకాలాడి మసిపూసి పోయిద్ది రోజా వచ్చిద్ది గులాబిరంగు చల్లిద్ది గుండెలోగుచ్చిద్ది ఎర్రరక్తం కార్పిచ్చిద్ది పచ్చనిగోరింట వచ్చిద్ది పడతులచేతిపైకి ఎక్కిద్ది ఎర్రగా పండిద్ది షోకులు విసిరిద్ది బంగారువన్నెల భామ పెళ్ళిచూపులో కనపడిద్ది సిగ్గుతో తలవంచుకొని ఎర్రబుగ్గలు చూపిద్ది ముద్దమందారం వచ్చిద్ది మంకెనరంగు చల్లిద్ది మేనును తట్టిద్ది రంగును పూచిద్ది హరివిల్లు వచ్చిద్ది సప్తవర్ణాలు చూపిద్ది వానను ఆపిద్ది వన్నెలు చిందిద్ది రంగులహోళి వచ్చిద్ది వేడుకలు చేసిద్ది వివిధరంగులును వంటిపై విసిరిద్ది ఊసరవల్లి రంగులు మార్చిద్ది ఉరివి వన్నెలు చల్లిద్ది రంగులు చూస్తే పొంగిపోతా ఆనందంలో తేలిపోతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 బిడ్డల్లారా! పలుకునై పెదవులను కదిలిస్తా కులుకునై కూనలను నవ్విస్తా పువ్వునై పరిమళాలు వెదజల్లుతా నవ్వునై మోములను వెలిగిస్తా తేనెనై నాలుకలను తడిపేస్తా వేడినై గుండెలను కరిగిస్తా అక్షరాలనై ఆలోచనలు వెల్లడిస్తా పదాలనై భావాలను పారిస్తా జాబిలినై వెన్నెలను కాస్తా మేఘాలనై వానజల్లులు కురిపిస్తా గానమునై గళమును విప్పుతా పాటనై పరవశము పంచుతా కాంతినై కళ్ళల్లో కూర్చుంటా చూపునై వ్రాతలను చదివిస్తా శబ్దమునై చెవులలో దూరేస్తా అర్ధమునై మదులను మురిపిస్తా మాతనై బిడ్డలను బ్రతికిస్తా భాషనై భూమిపై వర్ధిల్లుతా కలమునై కాగితంపై వ్రాయిస్తా కవితనై కమ్మదనాలను కురిపిస్తా వెలుగునై తెలుగును మెరిపిస్తా తెలుగునై తియ్యందనాలు చల్లేస్తా సంగీతమునై అధరామృతమును తలపిస్తా సాహిత్యమునై ఆలోచనామృతం త్రాగిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
జీవితపాఠాలు జీవితం దేవునివరం కృతజ్ఞుడిగా ప్రవర్తించు జీవితం సుక్షేత్రం పాటుబడి పంటలుపండించు జీవితం మాధుర్యస్థావరం అందాలనాస్వాదించు ఆనందాలనుభవించు జీవితం సుందరసౌధం ఊదితేయూగిసలాడనీకు పేకమేడలాపడిపోవనీకు జీవితం అందంఆనందం కమ్మదనాలనుచూడు సుఖాలననుభవించు జీవితం చదరంగం ఆలోచించి ఎత్తులువెయ్యి జీవితం ప్రయాణం పూలబాటనునిర్మించు గమ్యంచేరేదాకానడు జీవితం గాలిపటం ఎత్తుకుపోనివ్వు రెపరెపలాడనివ్వు జీవితం నాటకం మంచిపాత్రను ఎన్నుకొనిపోషించు జీవితం కావ్యం చక్కగారచించు శ్రావ్యంగావచించు జీవితం మకరందం చోరులనుండి సంరక్షించు జీవితం కాలపరిమితం సమయాన్ని సద్వినియోగంచెయ్యి జీవితం సమరం పోరాటానికి సిద్ధపడియుండు జీవితం ఆలుమగలనుబంధం కడదాకాకలసిమెలసి కాపురాన్నిసాగించు జీవితం స్నేహభరితం మిత్రులతో మంచిగామెలుగు జీవితం అతిప్రధానం ఉపేక్షవహించకు  గాలికివదలెయ్యకు జీవితం క్రీడారంగం నైపుణ్యంప్రదర్శించు విజయాలనుసాధించు జీవితం సాగరం ఆటుపోట్లకువెరవకు ఆవలితీరందాకాఈదు జీవితం సంఘసహచర్యం సహకరించు సేవలుసాగించు జీవితం అశాశ్వతం ఉన్నంతవరకు ఉత్తాముడిగామసలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
అందమే ఆనందం అందం అగుపించితే ఆనందం అందుకుంటా అందం ఆహ్వానిస్తే అంగీకరిస్తా అక్కునచేరుతా అందం అభ్యర్ధిస్తే ఆమోదిస్తా అనుభవిస్తా అందం వస్తానంటే రమ్మంటా చేకొంటా అందం కావాలంటే తోడుగా నిలబడతా అందం అండకోరితే ఆశ్రయమిస్తా అభయహస్తమిస్తా అందం సరసాలాడితే స్పందిస్తా సంబరపడతా అందం నవ్వితే మురిసిపోతా ముచ్చటపడతా అందం చేయిచాపితే చేతులుకలుపుతా చెలిమిచేస్తా అందం ప్రభవించితే వెలుగులుచిమ్ముతా వేడుకచేస్తా అందం అడిగితే అన్నీయిస్తా ఆహ్లాదపరుస్తా అందం అలిగితే బ్రతిమాలుతా బుజ్జగించుతా ఆహా! అందం నాదే ఆనందం నాదే అదృష్టం నాదే అందలం నాదే అందం ఒకదృశ్యం ఆకట్టుకుంటుంది ఆశ్చర్యపరుస్తుంది అందం ఉత్సాహం ఉల్లాసపరుస్తుంది ఉవ్విళ్ళూరిస్తుంది అందం అమృతం అందుకోమంటుంది ఆస్వాదించమంటుంది అందం ప్రకాశం కళకళలాడుతుంది కాంతులుచిమ్ముతుంది అందం అతివసమానం అభిమానిస్తుంది అలరించుతుంది అందం ప్రణయం ప్రేమలోపడవేస్తుంది పరవశపరుస్తుంది అందం ప్రోత్సాహం కలంపట్టమంటుంది కవితలువ్రాయమంటుంది అందం అనంతం అమూల్యం అక్షయం అందం అపరూపం అద్భుతం ఆనందం అందం నాకవితావస్తువు ఆనందం నాకవనలక్ష్యము అందరిని ఆకర్షిస్తా అందరికి ఆహ్లాదమిస్తా గుండ్లపల్లి రాజెంద్రప్రసాద్, భాగ...
Image
 నా ఆలోచనలు (శుభసంగతులు సంతోషసూచనలు) పువ్వులు చల్లనా పరిమళాలు వీచనా తీపివార్తలు చెప్పనా తనువులను  తృప్తిపరచనా చల్లగాలి తోలనా సేదను తీర్చనా సోయగాలు చూపనా సంతసాలు కూర్చనా వేడుకలు చెయ్యనా విందులు ఇవ్వనా శాలువా కప్పనా సన్మానము చెయ్యనా పూలగుచ్ఛము అందించనా ప్రేమాభిమానము ఎరిగించనా కోకిలతో పాడించనా నెమలితో ఆడించనా చిలుకపలుకులు పలికించనా తేనెపలుకులు చిందించనా వేసవితాపానికి తాటిముంజలివ్వనా మధురమామిడిపండ్లు నోటిముందుపెట్టనా దడదడ ఉరుములు ఉరిమించనా తళతళ మెరుపులు మెరిపించనా టపటప వానజల్లులు కురిపించనా బిరబిర వాగులువంకలు పారించనా ప్రేమతో గుండెనునింపనా స్నేహంలో హృదినిముంచనా కలమును పట్టనా కాగితాలు నింపనా కమ్మనికైత కూర్చనా ప్రియపాఠకుల పరవశింపజేయనా కవితలు చదివించనా పాటలు పాడించనా ఇష్టమైనవిషయాలు వివరించనా కష్టమైనవస్తువులు దాటవేయనా కవితలకు కాచుకో పఠించుటకు పూనుకో అక్షరాల అల్లిక ఆకట్టుకుందా పదాల ప్రయోగము ఫలించిందా చదివితే సంతోషము స్పందిస్తే ధన్యవాదాలు అన్నీ  మంచిసంగతులే అందరికీ  సంతోషసూచనలే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా బంగారం అందాన్ని చూశా ఆనందాన్ని పొందా వలను విసిరా పిట్టను పట్టా పూలను ఇచ్చా ప్రేమను తెలిపా మనసు విప్పా ముచ్చట పరచా చెంతకు పిలిచా చెలిమిని కోరా ఆమెను మెచ్చా ఆమెకు నచ్చా ఒంటరిగా పిలిచా తుంటరిగా మాట్లాడా నవ్వులు పంచా ముగ్గులోకి దించా మతి పోగొట్టా మత్తులో పడవేశా ఈడు కుదిరింది జోడు కొచ్చింది తోడుగా నిలిచింది నీడగా మారింది కల నిజమయ్యింది కోరిక నెరవేరింది సుకన్య చేరువయ్యింది స్వర్గం చూపించింది సుఖము ఇచ్చింది శాంతి కూర్చింది బంధం పడింది బంధీ అయ్యింది స్వప్న్మం సార్ధకమయ్యింది సమస్య పరిష్కారమయ్యింది కాపురం కలిసొచ్చింది కుటుంబం వృద్ధిచెందింది బ్రతుకు బంగారమయ్యింది జీవితం సుఖమయమయ్యింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కలం పలుకులు (కలం ఉవాచ) కవులారా నన్ను పట్టుకోండి ఉహలు ఊరింపచేస్తా విషయాలు వెల్లడింపజేస్తా కవులారా నన్ను చేతపట్టండి అక్షరాలు చెక్కుతా పదాలను కల్పుతా కవులారా నన్ను చూడండి నీరులా ప్రవహిస్తా గాలిలా వ్యాపిస్తా కవులారా నన్ను వాడండి అందాలను వర్ణిస్తా ఆనందము కలిగిస్తా కవులారా నన్ను అడగండి ప్రాసలు పేర్చుతా లయలు కూర్చుతా కవులారా  నన్ను చేకొనండి పూలను చూపితా పరిమళాలు చల్లిస్తా కవులారా నన్ను కోరండి నవ్వులు చిందిస్తా మోములు వెలిగిస్తా కవులారా నన్ను తలచండి కలలోకి వస్తా కథావస్తువు నిస్తా కవులారా నన్ను తీసుకోండి కవనం చేయిస్తా కవితలు వ్రాయిస్తా కవులారా నన్ను మెచ్చండి పొగడ్తల నిప్పిస్తా సన్మానాలు చేయిస్తా కవులారా ఇవి చాలంటారా ఇంకేమయినా కావాలంటారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం కలము కరదీపిక నగవు ముఖదీపిక కలము విష్ణువు చక్రము శివుని త్రిశూలము వాగ్దేవి ఘంటము కలము రైతుల నాగలి శ్రామికుల కొడవలి మహిళల చేతిగంటి కలము చేతులకెక్కేది పుటలపైగీసేది భావాలకురూపమిచ్చేది కలము పద్యాలు వ్రాయించేది  గద్యాలు రచయింపజేసేది  వచనకవితలు ఒలుకించేది కలము సరస్వతీదేవి ఆయుధము  సాహిత్యక్రియల సాధనము కవివర...
Image
కవితావిస్ఫోటనం ఎవరో తలలో బాంబునుపెట్టారు నిప్పునంటించారు భారీశబ్దం వచ్చింది విస్ఫోటనం జరిగింది ఆలోచనలు ఎగిరిపడ్డాయి భావనలు విసరబడ్డాయి భ్రమ కలిగింది భ్రాంతి ముసురుకుంది అలజడి లేపింది ఆరాటం చేసింది వ్రాయకుండా ఉండలేకున్నా చదవకుండా నోరుమూసుకోకున్నా కలంపట్టకుండా కూర్చోలేకున్నా కాగితాలునింపకుండా కరముకట్టేసుకోలేకున్నా నిత్యకవితను నిరోధించలేకున్నా సాహిత్యసేవను సమాప్తంచేయలేకున్నా నిద్ర రావటంలేదు ఆకలి అవటంలేదు విషయాలు వీడటంలేదు తలపులు తరగటంలేదు కవితాప్రవాహం కదిలిపోతుంది కవనకార్యం కొనసాగుతుంది ఎప్పటివరకో ఈ కార్యక్రమం ఎందుకొరకో ఈ ప్రయత్నం ఎక్కడివరకో ఈ పయనం ఎవ్వరికొరకో ఈ కవనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సమాజరంగం సమాజం ఒకరంగస్థలం మనమమందరం పాత్రధారులం చురుకైనపాత్రను పోషించి జనాన్ని జాగృతంచేయాలనుకుంటున్నా విలువైనపాత్రలో నటించి వీక్షకులను మెప్పించాలనుకుంటున్నా సహజమైనపాత్రలో కనిపించి సహచరులను చైతన్యపరచాలనుకుంటున్నా బరువైనపాత్రను ధరించి బాధ్యతలను గుర్తుచేయాలనుకుంటున్నా సంస్కర్తపాత్రలో ఒదిగిపోయి మూఢనమ్మకాలను నిర్మూలించాలనుకుంటున్నా అందమైనపాత్రలో అగుపించి ఆనందాలను అందించాలనుకుంటున్నా ప్రేమికుడిపాత్రలో మునిగిపోయి ప్రజాహృదయాలను దోచుకోవాలనుకుంటున్నా రాజకీయనాయకుడిపాత్రలో వసించి రామరాజ్యాన్ని తలపించాలనుకుంటున్నా సేవకుడిపాత్రలో లీనమైపోయి సుఖసంతోషాలను చేకూర్చాలనుకుంటున్నా సున్నితమైనపాత్రను తీసుకొని సహృదయులను సంతృప్తిపరచాలనుకుంటున్నా విశిష్టమైనపాత్రలో నిమగ్నమై మానవతావిలువలను చాటాలనుకుంటున్నా కవిపాత్రలో కనిపించి కమ్మనికవితలను కంఠస్థంచేయించాలనుకుంటున్నా మీ పాత్రను మీరే రచించుకోండి మీ మనసును మీరే తెలియజేయండి మంచిపాత్రను మీరే ఎన్నుకోండి చక్కనిసందేశాలను సమాజానికి చేర్చండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత్వావిష్కారం కవితవచ్చి కవ్విస్తేగాని కవితావిష్కారం కాకున్నది పువ్వులొచ్చి ప్రాధేయపడితేగాని పుష్పకవిత పుట్టకున్నది వనితవచ్చి వలపువలవిసిరితేగాని విరహకవిత వెలువడకున్నది కలలోకివచ్చి కైతకోరితేగాని కల్పితకవితను కూర్చలేకుంటి తెలుగుపదాలుతట్టి తేనెచుక్కలొలికితేగాని తేటతెలుగుకవిత తీసుకురాలేకుంటి ఆలోచనలుపారి భావనకలిగితేగాని బేషూకైనకవితను బయటపెట్టలేకుంటి మాటలొచ్చి మదినిముట్టితేగాని మంచికవితను ముందుపెట్టలేకుంటి అందాలుకనపడి ఆనందపరిస్తేగాని అద్భుతకవితను ఆవిష్కరణచేయలేకుంటి సాహితివచ్చి  సన్నుతిచేసినకాని సరసమైనకవితను సృష్టించలేకుంటి జానకివచ్చి జబ్బతట్టినగాని జల్సాకవితకు జన్మనీయలేకుంటి పార్వతివచ్చి ప్రొత్సహించినగాని పసందైనకవితను పుటలపైకెక్కించలేకుంటి వాణీవచ్చి వేడుకున్నగాని విరులకవితను వ్రాయలేకుంటి అనితవచ్చి అభ్యర్ధించినగాని అసలుసిసలైనకైతను అందించలేకుంటి పద్మావతివచ్చి పొగడకున్నగాని ప్రణయకవితను పేర్చలేకుంటి పాఠకులుకోరినరీతి చిత్రకవితలువ్రాస్తి పుష్పకైతలురాస్తి ప్రణయకయితలుకూర్చితి వాగ్దేవివెన్నుతట్టి విరచించమన్నట్టి వివిధప్రక్రియలందు తెలుగుతల్లికవితలనువ్రాస్తి జై తెలుగుతల్లి జై జై తెలుగుతల్లి ...
Image
 కవిపుంగవా! పూరించవోయ్ సమరశంఖమును మేలుకొలుపవోయ్ సాహిత్యజగత్తును వెలిగించవోయ్ అక్షరదీపాలను తొలగించవోయ్ అఙ్ఞానాంధకారాలను ప్రోత్సహించవోయ్ కవిపుంగవులను వ్రాయించవోయ్ కమ్మనికవితలను మురిపించవోయ్ మృదుమదులను కలిగించవోయ్ సుఖసంతసాలను పూయించవోయ్ కవనకుసుమాలను ప్రసరించవోయ్ సుమసౌరభాలను చూపించవోయ్ అందచందాలను చేకూర్చవోయ్ ఆనందానుభూతులను వేడుకొనవోయ్ వాగ్దేవివాత్సల్యమును  వెలువరించవోయ్ వాక్మాధుర్యాలను చేపట్టవోయ్ వివిధకవనప్రక్రియలను సుసంపన్నంచేయవోయ్ తెలుగుసాహిత్యమును చిందించవోయ్ తేనెచుక్కలను చూపించవోయ్ తెలుగుతియ్యదనాలను చదివించవోయ్ చక్కనిరాతలను చేకూర్చవోయ్ చిద్విలాసములను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, బాగ్యనగరం
Image
 నేను! నాపూబోడి!! పువ్వు సోయగం నీకేది చెలియా? పువ్వు సౌరభం నీకేది ప్రియురాలా? పువ్వు సంతసం నీకేది సఖియా? పువ్వు కోమలం నీకేది ప్రణయినీ? పువ్వు రంగు నీకేది సకియా? పువ్వు  నవ్వు నీకేది ప్రేయసీ? ఏమిటేమిటీ పువ్వులనుతెచ్చి ప్రక్కనపెట్టుకోమంటావా! అతివా అలరులనుచూచి అసూయపడుతున్నావా! కుసుమాలుతెస్తా కొప్పులోపెడతా కలతచెందకుచెలీ! హమ్మయ్య అతివ అలకతీరింది పూబోడి పువ్వుతోకూడి పక్కకొచ్చింది ఇప్పుడు మామధ్య అలకలులేవు అలజడులులేవు మా అనందానికి హద్దులులేవు  పద్దులులేవు పువ్వుకి  పూధారికి పలుధన్యవాదాలు  పూబాణుడికి ప్రణయదేవతకు పెక్కుప్రణామాలు  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితోపాఖ్యానం కవిత్వం వ్రాయటం సులభం తలలో తలపులు మదిలోమాటలు ఉంటేచాలు కవిత్వం వండటం కరతలామలకం అక్షరాలనుకూర్చి ఉడకబెట్టి పదాలకు గంజివారిస్తేచాలు కవిత్వం పారించటం శ్రమకాదు ఊహలను ఊరించి భావాలకు దారిచూపితేచాలు కవిత్వం పూయించటం పెద్దపనికాదు అక్షరవిత్తనాలను నాటి పచ్చనిపదమొక్కలను పెంచితేచాలు కవిత్వం పొంగించటం పనేమికాదు సాహిత్యక్షీరాన్ని పాత్రలోపోసి మనసనేపొయ్యిమీద కాస్తేచాలు కవిత్వం పాడటం ఇబ్బందికాదు కళ్ళతోచూచి చదివి పెదవులతో వదిలితేచాలు కవిత్వం పుట్టించటం బ్రహ్మవిద్యకాదు అక్షరమనే అమ్మాయికి ఆలోచననే అబ్బాయికి పెళ్ళిచేస్తేచాలు కవిత్వం అల్లటం పాటుకాదు పదపుష్పాలను లయదారానికి కడితేచాలు కవిత్వం చూపించటం వెతయేమికాదు లోతైన విషయాలను ఇంపుగా వర్ణిస్తేచాలు కవిత్వం పండించటం కటువేమికాదు అక్షరసేద్యం చేసి కైతలపంటను తీస్తేచాలు కానీ కవిత్వం చెయ్యటం కష్టం కావాలి లోతైనభావం చేయాలి అద్భుతపదప్రయోగం అప్పుడే కవిత్వం పాఠకులను తడుతుంది మనసులను ముడుతుంది చిరకాలం నిలుస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఉగాది ఉల్లాసాలు ఉగాదిపండుగ వచ్చింది ఉత్సాహమును ఇచ్చింది ఉరకలు వేయించింది  ఊహలు పారించింది కోకిలమ్మ వచ్చింది  కొమ్మపై కూర్చుంది కుహుకుహు కూసింది  కుషీకుషీ చేసింది మామిడి మెండుగపూతేసింది  పిందెలనెన్నో కాచేసింది చెట్టు కొత్తాకులుతొడిగింది శుభతోరణాలు కట్టించింది మల్లె పూలనిచ్చింది  మాలను కట్టించింది పడతుల కొప్పెక్కింది  పరిమళాలు చల్లింది కోడరికానికి కొతకోడలువచ్చింది కొత్తకాపురమును పెట్టించింది చీరెలనుసారెలను పుట్టింటినుండితెచ్చింది  శోభాయమానంగా అత్తవారింటికొచ్చింది చలికాలం పోయింది  మధుమాసం వచ్చింది పుడమి పచ్చబడింది  ప్రకృతి పరవశించింది కవులను కలంపట్టించింది  కైతలనెన్నో వ్రాయించింది కమ్మకమ్మగా పాడించింది  కమ్మదనాలను చూపించింది చక్కని ఆలోచనలనిచ్చింది  సాహిత్యంలోనికి దించింది  కవితలకవనంచేయించింది  కాసులుకానుకలు కురిపించింది సన్మానాలు చాలాచేయించింది  శాలువాలు మెడపైకప్పించింది ప్రశంసలవర్షం కురిపించింది  కవులకు కీర్తికిరీటీలనిచ్చింది తెలుగుభాష తీపినిచుట్టూచల్లింది దేశవిదేశములందు వెలిగిపోయింది  తెలుగుదనమును ...
Image
 ఆలోచనామృతం  సంగీతం ఆపాతమధురం సాహిత్యం ఆలోచనామృతం రెక్కలు విచ్చుకుంటేనే విహంగాలు ఎగురగలవు మబ్బులు ముసురుకుంటేనే వానజల్లులు కురువగలవు సూర్యుడు ఉదయించితేనే తూరుపు తెల్లవారుతుంది చంద్రుడు పొడిస్తేనే వెన్నెల వ్యాపిస్తుంది డబ్బులు జేబులోయుంటేనే కడుపులు నిండుతాయి పూలు పూస్తేనే తోటకు అందంవస్తుంది విరులు విచ్చుకుంటేనే సౌరభాలు వెదజల్లుతాయి పిల్లలు ఉంటేనే ఇల్లు కళకళలాడుతుంది కాంతలకు కురులుంటేనే కొప్పేదైనా అందాన్నిస్తుంది ఆలోచన తడితేనే భావము బయటకొస్తుంది ఆవేదన కలిగితేనే అద్భుతరచన అవతరిస్తుంది మనసు ముచ్చటపడితేనే మంచికవిత ముందుకొస్తుంది చక్కనికైత చదివితేనే చదువరులకు సంతోషంకలుగుతుంది కవితకు ప్రాసలేకపోతే కూరలో ఉప్పులేనట్లుచప్పనే సరుకున్నకవి చక్కనికవితను అనునిత్యము అందించగలడు దినదినం కవితలుచదవండి ప్రతిదినం పరవశించిపోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నెచ్చలి ముచ్చట్లు సఖీ నీకిష్టమైతే చెంతకొస్తావు చేయిచాస్తావు చెలిమిచేస్తావు కానీ నాకిష్టమైతే పట్టించుకోవు పలుకరించవు ప్రతిస్పందించవు సఖీ నీకునచ్చితే నవ్వుతావు నవ్విస్తావు నమ్మిస్తావు కానీ నాకునచ్చితే నసుగుతావు నటిస్తావు నాలుకవెళ్ళబెడతావు సఖీ నీవుమెచ్చితే ఇంద్రుడవంటావు చంద్రుడువంటావు చప్పట్లుకొడతావు కానీ  నేనుమెచ్చితే గమ్ముగుంటావు వమ్ముచేస్తావు పొమ్మనంటావు సఖీ నేనుపిలిస్తే ఉలకవు పలకవు కదలవు కానీ  నీవుపిలిస్తే బరాబరారావాలి బదులివ్వాలి బద్ధకంవీడాలి సఖీ నీవుకోరితే కాసులివ్వాలి కొనిపెట్టాలి కష్టపడాలి కానీ నేనుకోరితే బెట్టుచేస్తావు బదనాంచేస్తావు బ్రతిమాలించుకుంటావు సఖీ నీవుమెడవంచితే తాళికట్టాలి తోడుగుండాలి తృప్తిపరచాలి కానీ నేనుమెడవంచితే గేళిచేస్తావు గంతులేస్తావు గడుసుగుంటావు సఖీ నీకు షోకులుకావాలి సుఖంకావాలి సంసారంకావాలి కానీ  నేను పాట్లుపడాలి పోషించాలి పరిరక్షించాలి సఖీ మనంబాగుపడాలంటే అన్యోన్యంగాయుండాలి కలసిముందుకుసాగాలి సంసారసాగరమునీదాలి కానీ మనమెప్పుదు తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు రట్టుచేసుకోకూడదు సఖీ మనకుకుదిరితే ముందుకెళ్దాం లేకపోతే వెనుకడుగేద్దాం సఖీ ఆలోచించు నిర్ణయంచ...
Image
 కవితోదయం వేకువ అయ్యింది మెలుకువ వచ్చింది మదిలో అలారముమ్రోగింది మేనును గట్టిగాతట్టిలేపింది సూర్యోదయం కావస్తుంది కవితోదయం సమయమయ్యింది కాలము గడుస్తుంది మనసు పరుగెత్తింది ఆలోచన తలలోతట్టింది భావన తయారయ్యింది కలము గీస్తుంది కవిత పుడుతుంది అక్షరాలు అందుచున్నాయి పదాలు పొసుగుతున్నాయి ప్రాసలు కుదురుతున్నాయి లయలు అమరుతున్నాయి కష్టము ఫలిస్తుంది కవిత జనిస్తుంది కవికి కష్టమెందుకో? కవితకు తొందరెందుకో? విషయము తెలుసుకోవాలి విరుగుడు కనుక్కోవాలి నిత్యకవితకు స్వాగతం దైనికపాఠకులకు సుస్వాగతం సుపుత్రునిపై సరస్వతీమాత వాత్సల్యానికి వేలవందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 విసుర్లు పూలు విసురుతా పొంకాలు చూపుతా చూపులు విసురుతా షోకులు చూపిస్తా నవ్వులు విసురుతా మోములు వెలిగిస్తా పలుకులు విసురుతా తేనెచుక్కలు చిందిస్తా వల విసురుతా చిక్కితే బందిస్తా పరువాలు విసురుతా ప్రణయంలోకి దింపుతా కాంతులు విసురుతా చీకటిని పారదోలుతా ఙ్ఞానాన్ని విసురుతా అఙ్ఞానాన్ని తరిమేస్తా ఈటెను విసురుతా ప్రాణాలతో చెలగాటమాడుతా తూటాలు  విసురుతా ప్రతీకారం తీర్చుకుంటా మాటలు విసురుతా మనసులు దోచేస్తా అక్షరాలు విసురుతా కవితలు చదివిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మనిషీ ఓ మనిషీ! మనిషీ ఓ మనిషీ ఓ మంచీ మనిషీ! అమ్మానాన్నలతో ఆనందముగా గడుపవోయ్ దేవతల్లా పూజించీ దీవెనలూ పొందవోయ్ ఋణమునూ తీర్చుకొనీ సుఖముగా బ్రతుకవోయ్ నరుడా ఓ నరుడా మనసున్నా ఓ నరుడా! అర్ధాంగిని ఎన్నుకొనీ తోడుగా తెచ్చుకోవోయ్ కష్టసుఖాలలో పాలూపంచుకోవోయ్ కడదాక కలసిమెలసీ కాపురమూ చేయ్యవోయ్ మానవా ఓ మానవా తెలివైనా ఓ మానవా! పిల్లలను కనీ పెంచీ పెద్దచెయ్యవోయ్ బరువుబాధ్యతలతో బాగుగా చదివించవోయ్ సమాజానికి పనికొచ్చేలా చక్కగా తీర్చిదిద్దవోయ్ మానుషా ఓ మానుషా శక్తీయుక్తీగల ఓ మానుషా! కొడుకుకు పెళ్ళిచేసీ కోడలును తెచ్చుకోవోయ్ మనుమడు మనుమరాళ్ళతో వంశాన్ని వృద్ధిచేసుకోవోయ్ సేవాతత్పరతలు నేర్పీ సంఘానికి తోడ్పడవోయ్ మానిషీ ఓ మానిషీ ఆలోచించగల ఓ మానిషీ! కూతురును కనిపెంచీ కుమరునితో సమముగా చూడవోయ్ పెద్దజేసి పెళ్ళిజేసి అల్లునితో అత్తవారింటికి పంపవోయ్ కుటుంబ గౌరవమునూ కాపాడమని బోధించవోయ్ మనుజా ఓ మనుజా మానవత్వమున్న ఓ మనుజా! సమాజానికి హితములు చెప్పీ సుఖసంతసములు నివ్వవోయ్ అభివృద్ధిచేసి చూపీ ఆనందమును పంచవోయ్ సంక్షేమ రాజ్యాన్నీ స్థాపించి సంస్కరించవోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిగారి పైత్యము వేకువనే లేస్తా ఆలోచనలను పారిస్తా కలలు కంటా కవితలలో పెడతా కలమును పడతా కాగితాలను నింపుతా సూర్యోదయం చూస్తా కవితోదయం చేస్తా ఊహించి వ్రాస్తా భావకవిత అంటా ప్రేమకవితలు పుటలకెక్కిస్తా ప్రణయకవితలని పేరుపెట్టేస్తా అక్షరాలను అమరుస్తా అర్ధాలను అంటకడతా ప్రాసలతో పండిస్తా లయతో నడిపిస్తా కవిసమ్మేళనాలలో పాల్గొంటా కవితలను పఠించుతా చప్పట్లుకొడితే సంతోషిస్తా ముచ్చట్లుచెబితే మురిసిపోతా శాలువాలు కప్పించుకుంటా సన్మానాలు చేయించుకుంటా ప్రశంసాపత్రాలు పుచ్చుకుంటా పొగడ్తలకు పొంగిపోతా ఫోటోలు తీసుకుంటా వీడియోలు దాచుకుంటా పత్రికలలో వేయించుకుంటా పలువురిదృష్టిని ఆకర్షిస్తా పోటీలలో పాల్గొంటా పతకాలు కొల్లగొడతా విజేతగా నిలుస్తా నగదుబహుమతులు కొట్టేస్తా కమ్మగాకైతలు వినిపిస్తా కర్ణాలకు విందునిస్తా చదివితే సంబరపడతా శ్లాఘిస్తే సంతృప్తిపొందుతా పుస్తకాలను ప్రచురిస్తా సాహిత్యలోకానికి అందజేస్తా కవివంటే పొంగిపోతా కాలరును ఎగరేస్తా బిరుదులిస్తే పుచ్చుకుంటా పేరుముందు తగిలించుకుంటా సరుకుంటే సాగిస్తా సమూహాలలో సాక్షాత్కరిస్తా సుదీర్ఘపయనం చేస్తా సాహిత్యలోకాన స్థిరపడతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం పాతకవులకు ...
Image
 కవితాకుసుమం పువ్వు పూసిదంటే పరిసరాలు ప్రకాశించినట్లే పువ్వు మొగ్గతొడిగందంటే సొగసులు చిందబోతున్నట్లే పువ్వు వికసించిందంటే మనసు మురిసిపోయినట్లే పువ్వు పరిమళించిందంటే ప్రాణులు పరవశించినట్లే పువ్వు పిలిచిందంటే పడుచు పరిహాసమాడినట్లే పువ్వు పొంకాలుచూపిందంటే ప్రమోదము పంచిపెట్టినట్లే పువ్వు ఊగిందంటే ఎదను ఊహలుముట్టినట్లే పువ్వు పిలిచిందంటే ప్రకృతి  ప్రభవించినట్లే పువ్వు కోరిందంటే కవిత పుట్టినట్లే పువ్వు నవ్విందంటే కన్నియ కన్నుగీటినట్లే పువ్వు పరిహాసమాడితే కవితాకన్యక కవ్వించినట్లే పువ్వు ఇచ్చామంటే ప్రేమను ప్రకటించినట్లే పువ్వు వాడిందంటే దుఃఖంలో మునిగినట్లే పువ్వు రాలిందంటే కన్నీటిచుక్క కారినట్లే పూలేకవికి ప్రధమ ప్రోత్సాహము పొంకము పరమానందము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ఓ పువ్వు పిలిచింది ఓ నవ్వు విసిరింది ఓ పువ్వు కవ్వించింది ఓ కవిత వ్రాయించింది పాఠకులు చదివారు ప్రశంసలు కురిపించారు సాహితి సంబరపడింది సరస్వతి సహకరించింది సాహితీవనము స్వాగతించింది శాంతిసౌఖ్యములు చేకూర్చింది ఏ పువ్వుది ఏ అందమో ఏ కవితది ఏ చందమో
Image
కవీశ్వరా! అక్షరాలను వెలిగించరా  అంధకారమును పారద్రోలురా పదములను పారించురా పాఠకులకు పనిపెట్టరా విషయాలను వెల్లడించరా విఙ్ఞానమును వ్యాపించరా పలుకులను పెదవులదాటించరా తేనెచుక్కలను చుట్టూచిందించరా ఆలోచలను ఊరించరా భావాలను బయటపెట్టరా అచ్చతెలుగులో మాటలాడరా అలతిపదాలతో కవితలనల్లరా ఆంధ్రులఘనతను అందరికితెలుపురా ఆంధ్రులాచారాలను అన్నిచోట్లాచాటురా మాతృభాషను మరవద్దురా పరబాషను కించపరచొద్దురా తల్లితెలుగును వ్యాపించరా తోటితెలుగులను సమైక్యపరచరా తెలుగుబాష తేజరిల్లుబాషరా తెనుగువారు తెలివియున్నవారురా అక్షరసంపదను అందరికిపంచరా ఆంధ్రులను ఐశ్వర్యవంతులచెయ్యరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రవికన్నా కవిమిన్న (కవిగారి కాంక్షలు) కలంపడితే కమ్మనికవితలు ఉరకాలి కాగితంపట్టుకుంటే కవితలు జారువాలాలి కలగంటే కాల్పనికకైతలు కూర్చగలగాలి పట్టిందల్లా బంగారం కావాలి కోరితే కొండమీదకోతైనా దిగిరావాలి నవ్వితే నవరత్నాలు రాలాలి పిలిస్తే పరుగెత్తుకుంటూ రావాలి పాడితే పరవశపరచకలగాలి మనసుపెడితే మార్గాలుకనుగొనగలగాలి ప్రయత్నిస్తే ఫలితం దక్కించుకోవాలి ప్రేలిస్తే గురిచేరాలి రాసిందెల్లా రమ్యంగా ఉండాలి పంపిందెల్లా పత్రికల్లో రావాలి పఠించినవారెల్లా ప్రశంసించేటట్లు ఉండాలి పోటీలకుపంపినకవితలకెల్లా పతకాలు పొందాలి పేరుప్రఖ్యాతులు ప్రపంచమంతా విస్తరించాలి కవనలోకంలో కలకాలం నిలిచిపోవాలి కవియంటే రవికన్నా మిన్నయనాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితా వైభవం కవిత పుట్టిందంటే కాంతి ప్రభవించాలి కవిత పూసిందంటే సౌరభము వ్యాపించాలి కవిత కాసిందంటే  నోర్లను ఊరించాలి కవిత చదివామంటే కమ్మదనము కలిగించాలి కవిత కనపడినదంటే గబగబా చదివించాలి కవిత ఆస్వాదిస్తే కడుపులు నిండిపోవాలి కవిత దొర్లిందంటే కాగితం కళకళలాడాలి కవిత కూర్చామంటే ముత్యాలసరమై తెలుగుతల్లిమెడనలంకరించాలి కవిత విన్నామంటే చెవులను నిక్కపొడిపించాలి కవిత పాడామంటే శ్రోతలను ఉర్రూతలూగించాలి కవిత పుటలకెక్కిందంటే కవిని చిరంజీవినిచేయాలి కవితా శీర్షిక కళ్ళను కట్టిపడవేయాలి కవితా అక్షరాలు కడుపసందు కలిగించాలి కవితా పదములు తేనెచుక్కలను చిమ్మాలి కవితా విషయము మదులలో తిష్టవెయ్యాలి కవితలకు స్వాగతం కవులకు నీరాజనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం మంచికవితకుముహూర్తమెపుడు మదనపడినపుదు  మనసుగాయపడినపుడు మాటలువెంటపడినపుడు కవిత్వమునకు రంగులుండవు హంగులుండవు పొంగులుండవు కవిత్వము స్వచ్ఛము అద్బుతము కాంతిమయము ఒక్కో కవిది ఒక్కో శైలి ఒక్కో కవితది ఒక్కో రీతి కవితలను స్వాగతించు కవులను ప్రోత్సహించు