ఏమిరాయనూ? ఏమిపాడనూ? ఏ కవిత నే రాయనూ ఏ పాట నే పాడనూ ఏ విషయమూ నే రాయనూ ఏ రాగమందూ నే పాడనూ ||ఏమి|| అందాలకవితనూ రాయనా ఆనండాలపాటనూ పాడనా పూలకవితనూ నే రాయనా పరిమళాలపాటను నే పాడనా ||ఏమి|| బాలలకవితనూ నే రాయనా జోలపాటనూ నే పాడనా శ్రామికులకవితనూ నే రాయనా విప్లవగీతాన్ని నే పాడనా ||ఏమి|| వెన్నెలకవితనూ నే రాయనా జాబిల్లిపాటనూ నే పాడనా ప్రేయసీకవితనూ నే రాయనా ప్రణయగీతమును నే పాడనా ||ఏమి|| తల్లులకవితనూ నే రాయనా ఉయ్యాలపాటనూ నే పాడనా మనసుకవితనూ నే రాయనా మోహనగీతమును నే పాడనా ||ఏమి|| యుక్తికవితనూ నే రాయనా భక్తిపాటనూ నే పాడనా చక్కనీకవితనూ నే రాయనా తియ్యనీపాటనూ నే పాడనా ...
Posts
Showing posts from September, 2024
- Get link
- X
- Other Apps
ముఖేముఖే......... మనిషిమనిషికి ఒక పేరుంది ఒక ఊరుంది ఒక కథవుంది ఒక రూపముంది ఒక వ్యక్తిత్వమున్నది ఒక శైలియున్నది మనసుమనసుకు భావాలున్నాయి భ్రములున్నాయి భవితపై ఆశలున్నాయి పుఱ్ఱెపుఱ్ఱెకు బుధ్ధియున్నది గమ్యమున్నది మార్గమున్నది మోముమోముకు ఆకర్షణయున్నది అందమున్నది ఆనందమున్నది ఇంటింటికి యజమానియున్నాడు ఇల్లాలుయున్నది పిల్లలున్నారు తల్లితల్లికి ప్రేమయున్నది దయయున్నది మంచియున్నది కుటుంబకుటుంబానికి ఒక విలువున్నది ఒకకట్టుబాటుయున్నది ఒక గుర్తింపుయున్నది ఊరూరికి ఒక నామధేయమున్నది ఒక చరిత్రయున్నది ఒక ప్రత్యేకతయున్నది దేశదేశానికి సరిహద్దులున్నాయి సంప్రదాయాలున్నాయి సంస్కృతులున్నాయి చెట్టుచెట్టుకు ఆకులూకొమ్మలున్నాయి పూలూకాయలున్నాయి పచ్చదనముపరిశుభ్రతలున్నాయి నవ్వునవ్వుకు కళవున్నది కారణమున్నది కమ్మదనమున్నది పువ్వుపువ్వుకు పొంకమున్నది ప్రత్యేకరంగున్నది పరిమళమున్నది మాటమాటకు అర్ధమున్నది వాడుకున్నది ప్రాముఖ్యమున్నది ముఖేముఖే సరస్వతి విచిత్రం విభిన్నం విశిష్టం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓ మానవా! గడ్డిపరకను పాదాలతోత్రొక్కినా కుయ్యిమనక మౌనంగా ఉండేదాన్ని పశువులు మేసినప్పటికి గాయపరచినప్పటికి తిరిగి చిగురించేదాన్ని పనికిరానిపువ్వువని దూషించినప్పటికి చిన్నిచిన్నిపూలు పూసిచూడమనికోరేదాన్ని నీరు పోయకపోయినా గొంతులెండినా ప్రాణాలు నిలుపుకునేదాన్ని మేతకోసం కోసినాదోకినా మరలామారాకుతొడిగి పలకరించేదాన్ని కోపం ఎరుగనిదాన్ని పగ పట్టనిదాన్ని మమ్మలనీ సహజీవులుగా గుర్తించండి మాకూ ప్రాణమున్నదని తెలుసుకోండి చేతులెత్తి నమస్కరిస్తున్నా చిట్టిదానినని చిన్నచూపు చూడకండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
లోకంతీరు లోకానకొంతమంది కరుణాత్ములు ఉన్నారు మరికొంతమంది కఠినాత్ములు ఉన్నారు కొంతమంది తేనెచుక్కలు చల్లుతారు మరికొంతమంది నిప్పురవ్వలు రువ్వుతారు కొంతమంది పూలు చల్లుతారు మరికొంతమంది రాళ్ళు విసురుతారు కొంతమంది కోకిలకంఠము వినిపిస్తారు మరికొంతమంది కాకులగోలను తలపిస్తారు కొంతమంది వెన్నెలను ఆస్వాదిస్తారు మరికొంతమంది చీకటిని కోరుకుంటారు కొంతమంది కోర్కెలను త్రుంచుకుంటారు మరికొంతమంది ఆశలను పెంచుకుంటారు కొంతమంది మంచిని చూస్తారు మరికొంతమంది తప్పులు వెదుకుతారు కొంతమంది కలిసి ఉండాలనుకుంటారు మరికొంతమంది విడిచి వెళ్ళాలనుకుంటారు కొంతమంది దివ్వెలు వెలిగిస్తారు మరికొంతమంది దీపాలు ఆర్పుతారు కొంతమంది లక్ష్మిదేవివచ్చినా తలుపుతీయరు మరికొంతమంది దరిద్రదేవతను ఆహ్వానిస్తారు కొంతమంది దేవతల్లాగా కనబడతారు మరికొంతమంది రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు ముళ్ళదారిని వదలమంటా పూలబాటను పట్టమంటా మనుషులను వడబోయమంటా మానవత్వమును పోషించమంటా అందరిమేలును భువిన కోరమంటా లోకసమస్తమును దివిని చేయమంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
గాలికబుర్లు గాలి వచ్చింది గాత్రము తాకింది గుసగుస లాడింది గుబులును లేపింది ఆకులను ఊపింది గలగల ఆడించింది పువ్వుల కదిలించింది పరిమళాలు వెదజల్లింది బూరలను నింపింది బుజ్జాయిలను ఆడించింది పతంగులను ఎగిరించింది గగనాన రెపరెపాలాడించింది పక్షులను పిలిచింది పరవశా పరిచింది ఆరేసినబట్టలను ముట్టింది తడిని తరిమిపారేసింది మబ్బులను తేల్చింది మనసులను దోచింది వానను తెచ్చింది వాగులు పారించింది నోటినుండి వెలువడింది మాటలను వినిపించింది ముక్కులో దూరింది గుండెను ఆడించింది చిరుగాలి తగిలింది చిరునవ్వులు ఇచ్చింది చల్లగాలి తాకింది సంతసాన్ని ఇచ్చింది ధూళిని లేపింది దుమారం సృష్టించింది మరలా వస్తానంది మాయమై పోయింది గాలికి కులములేదుమతములేదు చిన్నాపెద్దా తేడాలేదు ఆడామగా వ్యత్యాసములేదు ధనికాబీదా భేదములేదు గాలిలేని చోటులేదు అవసరంలేని ప్రాణీలేదు అయితే వాటమున్నది తరిమే వేగమున్నది గాలిదేవునికి ప్రణామము గాలికవితకి విరామము గాలిజోరుకు కళ్ళెము గాలికబుర్లకి సమాప్తము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎమడిగానని? కోకిలలా గళమెత్తమనలా నెమలిలా నాట్యమాడమనలా భోజనం పెట్టమనలా దాహం తీర్చమనలా చేతులు కలపమనలా కౌగిలి ఇవ్వమనలా ముచ్చట్లు చెప్పమనలా చప్పట్లు కొట్టమనలా అందాలు చూపమనలా చిందులు త్రొక్కమనలా కోపం చూపించలా దూరం వెళ్ళిపొమ్మనలా కేకలు వెయ్యలా నిప్పులు చెరగలా సొమ్ము ఇమ్మనలా సోకు చూపమనలా సిగ్గువిడిచి అర్ధించా చిన్నకోరికని తీర్చమన్నా చిరునవ్వును అభ్యర్ధించా చిన్నకోరికను తీర్చమన్నా బుగ్గలు సొట్టబడితే చూద్దామని మోము వెలుగుతుంటే సంతసిద్దామని ఆమాత్రానికే గోలచెయ్యాలా అందరిముందు పరువుతియ్యాలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నేను నా అమాయకత్వం నోట్లో వేలుపెట్టినా కొరకటం తెలియనివాడ్ని తిట్టినా తన్నినా తలవంచుకొని తిరిగేవాడ్ని పొగిడినా ప్రశ్నించినా సమానంగా చూచేవాడ్ని బంతికి చామంతికి వ్యత్యాసం ఎరగనివాడ్ని ఇంటికి ఇల్లాలికి తేడాను గ్రహించలేనివాడ్ని పువ్వుకు తావుకు బంధము భోధపడనివాడ్ని అందానికి ఆకర్షణకు అనుబంధము అర్ధంకానివాడ్ని గులాబికి ముళ్ళకు సంబంధమెందుకో కారణమెరుగనివాడ్ని మల్లెకు మత్తుకు చుట్టరికము తెలుసుకోలేనివాడ్ని ప్రకృతికి వికృతికి ఆంతర్యం అంతుబట్టనివాడ్ని అఙ్ఞానిని అల్పుడుని అచేతుడుని అమాయకుడుని అనాముకుడిని అప్రయోజకుడిని అనాదరుడిని అభాగ్యుడిని అర్ధం చేసుకుంటారా హస్తం అందించుతారా వెన్ను తడతారా దన్ను ఇస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సరస్వతీపుత్రుడు అతని పెదవులు కదులుతుంటే తేనెచుక్కలు చిందుతాయి అతని గళము తెరచుకుంటే గాంధర్వగానము వినిపిస్తుంది అతని కలము కదులుతుంటే కమ్మనికవితలు రూపుదిద్దుకుంటాయి అతని చూపులు తగులుతుంటే చెప్పరాని ఆనందముకలుగుతుంది అతని నగుమోము చూస్తుంటే మనసు ముచ్చటపడిపోతుంది అతని పేరు తలచుకుంటే చక్కనికైతలు గుర్తుకొస్తాయి అతను మహాకవి విఙ్ఞానగని చిరంజీవి సరస్వతీపుత్రుడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా నిత్యపయనాలు అక్షరాలతో ప్రయాణం చేస్తున్నా మచ్చికచేసుకుందామని పదాలతో ప్రయాణం చేసున్నా వంటబట్టించుకుందామని ఊహలతో ప్రయాణం చేస్తున్నా చక్కనివిషయాలు తడతాయని కలంతో ప్రయాణం చేస్తున్నా కమ్మనిరాతలు కూర్చుదామని పుటలతో ప్రయాణం చేస్తున్నా అద్భుతంగా నింపాలని కవనంతో ప్రయాణంచేస్తున్నా కమ్మనికవితలు సృష్టించుదామని మనసుతో ప్రయాణం చేస్తున్నా మంచిపేరుప్రఖ్యాతులు పొందాలని దేహంతో ప్రయాణం చేస్తున్నా బొందికి గుర్తింపుతీసుకొనిరావాలని జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నా లక్ష్యాలని సాధించాలని నిత్యప్రయాణుకుడికి అండగా నిలుస్తారా అందలం ఎక్కిస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఒంటి కబుర్లు ఓ తారవెలిసింది గగనాన మెరిసింది ఓ పువ్వుపూసింది పరిమళం చల్లింది ఓ నవ్వువిసిరింది ముచ్చటా పరిచింది ఓ చూపుచూచింది కైపులో దింపింది ఓ మబ్బులేచింది చినుకులు కార్చింది ఓ మొక్కమొలిచింది మహావృక్షముగ ఎదిగింది ఓ దీపంవెలిగింది చీకటిని తరిమింది ఓ తోడుదొరికింది జీవితాన అండనిచ్చింది ఓ అడుగుపడింది గమ్యాన్ని చేర్చింది ఓ అందంకనపడింది ఆనందాన్ని ఇచ్చింది ఓ ఊహపుట్టింది జీవితాన్ని మార్చింది ఓ కవిపుట్టాడు కవితలు సృష్టించాడు ఓ కైతచెంతకువచ్చింది మనసును దోచింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నమ్మటంలా! ఎందుకో రాయాలనిపించింది వ్రాస్తున్నా ఏలనో చెప్పాలనిపించింది చెబుతున్నా ఆకాశానికి నిచ్చెనవేస్తున్నాననో లేతసొరకాయలు కోస్తున్నాననో అనుకుంటున్నారో ఏమో నిజాలుచెబుతుంటే ఎదుటివాళ్ళు నమ్మటంలా అమృతోత్సవాలలో పాల్గొనమని కవితలను రాసిపంపమని పురస్కారాలిస్తామని కేంద్రసాహీతసంస్థనుండి ఆహ్వానమువచ్చిందంటే నమ్మటంలా ప్రధానమంత్రి కార్యాలయంనుండి మనసులోమాట కార్యక్రమంలో ఆకాశవాణి దూరదర్శనులలో ప్రధానితోపాటు మాట్లాడమన్నారంటే నమ్మటంలా అమెరికాతెలుగువారు వీసాతీసుకోమని ఖర్చులు భరిస్తామని సాహిత్యసభల్లో ప్రసంగించమన్నారంటే ఎవ్వరూ నమ్మటంలా దేవుడు ఒకరోజురాత్రివచ్చాడని చావుగురించి భయపడవద్దని కోరుకున్నప్పుడు పిలవమని స్వయంగావచ్చి తీసుకెళ్తానన్నాడంటే నమ్మటంలా లక్ష్మీదేవి గజ్జెలుమ్రొగించి గాజులు గళగళమనిపించి వరంకోరుకోమంటే డబ్బుకొరతలేకుండా చూడమన్నానంటే అందుకు అంగీకరించిందంటే నమ్మటంలా సరస్వతీదేవి కళ్ళముందుకొచ్చి వాక్కులిచ్చి వాగ్దానంచేసి కలమును పట్టమన్నదంటే కవితలు కూర్చమన్నదంటే ఎవ్వరూ నమ్మటంలా వివిధ సాహితీసంస్థలు బిరుదులిస్తామని సన్మానాలుచేస్తామని దరఖాస్తులు పెట్టుకోమన్నారంటే నేను స్పందించటంలేదంటే...
- Get link
- X
- Other Apps
మాధవసేవ మానవసేవ పెదవులతో మాధవుని ప్రార్ధించు తప్పులేదు చేతులతో చెయ్యి మానవసేవను సంతోషపడతా మందిరాలకు దానాలు ఇవ్వు దోషంకాదు అనాధాశ్రమాలకు ఆర్ధికసాయం అందించు మెచ్చుకుంటా దేవుళ్ళకు పూజలు చేసుకో అభ్యంతరంలేదు పేదలను ఆదరించి ఆదుకో ఒప్పుకుంటా గుడులకువెళ్ళు తీర్ధప్రసాదాలు పంచు అపరాధముకాదు అన్నార్తులమొరలు ఆలకించు తీర్చు అభినందిస్తా ఉపవాసలుండు ఊరేగింపులు చెయ్యి పొరపాటుకాదు దరిద్రులకు చేయూతనివ్వు చేరదీయి సద్గుణిడివంటా ప్రవచనాలు చెప్పించు ఆధ్యాత్మికతనుపెంచు నేరముకాదు సమాజశ్రేయస్సుకు పాటుపదు ఉద్ధరించు మహాత్ముడివంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మనసిస్తారా! కొద్దిసేపు మనసిస్తే కొన్నివిషయాలు నూరిపోస్తా మనసును మేల్కొలుపుతా నూతనాంశాలను తెలియజేస్తా మనసును మొదట ముడతా ముద్రనువేస్తా మనసును తడతా ఆలోచనాసరళిని మారుస్తా మనసును మురిపిస్తా అందచందాలు చూపిస్తా మనసును ముచ్చటపరుస్తా మహదానందంలో ముంచేస్తా మనసును శుద్ధిచేస్తా కల్మషాలను కడిగేస్తా మనసును బుజ్జగిస్తా అలకను తీరుస్తా మనసుకు ముక్కుతాడువేస్తా వ్యర్ధసంగతులజోలికి వెళ్ళనీయకుంటా మనసుకు మర్యాదనేర్పుతా మంచిదారిలో నడిపిస్తా మనసుకు పాఠాలుచెబుతా నిజాలను తెలియపరుస్తా మనసును చదివిస్తా మూఢత్వాన్ని మానిపిస్తా లేతమనసులకు దారిచూపుతా మంచిమనసులకు అండనిస్తా పెంకిమనసులకు కళ్ళెమువేస్తా చలాకిమనుసులకు మార్గదర్శిగానిలుస్తా మనసును వెలిగిస్తా లోకాన్ని ఎరిగిస్తా మనసులు కలుపుతా మిత్రుడిగా నిలిచిపోతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
రంగులాటలు ఆకాశం ఏడురంగులు పూసుకుంటుంది చూపరులను చిందులేయిస్తుంది రమణీమణులు రంగులవస్త్రాలు ధరిస్తున్నారు మగవారిని ఆటాడిస్తున్నారు పువ్వులు రకరకాలరంగులు అద్దుకుంటున్నాయి పొంకాలుచూపి ఆటాపాటలలోదింపుతున్నాయి చలికాలంపోయిందని రంగునీళ్ళు చల్లుకుంటున్నారు హోళీకేళి ఆడుతున్నారు సీతాకోకచిలుకలు రంగురెక్కలను రెపరెపలాడిస్తున్నాయి పట్టుకోవాలనుకునేవారిని నానాతిప్పలుపెడుతున్నాయి తూనీగలు రెక్కలూపుతు రమ్యమైనరంగులేసుకొని ఎగురుతున్నాయి చూపరులను గంతులేపిస్తున్నాయి కుంచెలుపట్టి చిత్రకారులు ఇంపైనరంగులతో సొంపైనచిత్రాలుగీస్తున్నారు కళాప్రియులను కదంత్రొక్కిస్తున్నారు అందమైన ప్రకృతి వింతవింతరంగుల్లో వెలిగిపోతుంది సౌందర్యప్రేమికులను సయ్యాటలాడిస్తుంది ఆశలగుర్రమెక్కినజనులు రంగులకలలు కంటున్నారు భ్రమలలో తేలిపోతున్నారు రంగులే రంజకాలు రమణీయాలు రసగుల్లాలు రంగులలోకంలో విహరిద్దాం రంగులమధ్యలో నివసిద్దాం జీవితమే రంగులాట రంగులబాట రంగులతోట గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అక్షరముద్రలు తీయనిపలుకులు చెబుతా మాటలముద్రను వేస్తా పకపకనగవులు చిందుతా నవ్వులముద్రను వేస్తా పువ్వులజల్లులు వెదజల్లుతా ప్రేమముద్రను వేస్తా పన్నీటిచుక్కలు చల్లుతా పరిమళముద్రను వేస్తా చక్కనివేషము కడతా అందాలముద్రను వేస్తా సుఖసౌఖ్యాలు కలిగిస్తా ఆనందముద్రను వేస్తా మధురభక్ష్యాలు తినిపిస్తా తీపిముద్రను వేస్తా ఊహలడోలికలో ఊపుతా భావముద్రను వేస్తా కవితావానను కురిపిస్తా కవిముద్రను వేస్తా అక్షరముద్రలు అందుకోండి సాహిత్యముద్రలు వేసుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవనప్రారబ్దాలు ఊహలు ఉడికిస్తున్నాయి భావాలు బంధిస్తున్నాయి విషయాలు వెంటబడితరుముతున్నాయి అక్షరాలు అరదండాలేస్తునాయి పదాలు పట్టేసుకుంటున్నాయి పంక్తులు సంకెళ్ళువేస్తున్నాయి కలాలు కట్టిపడవేస్తున్నాయి కాగితాలు కునుకుతీయనీయకున్నాయి వ్రాతలు వరదలైపారుతున్నాయి మనసు మత్తులోతూలుతుంది కవితలు కూర్చోబెట్టికూర్పిస్తున్నాయి కవనాలు కైతాభిమానులనుముంచేస్తున్నాయి కయితలను క్రోలండి కవులను తలచండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నదీతీరం కవితాతీరం కవి రోజూ నదీతీరానికి వస్తుంటాడు ఏదో వ్రాసుకొని పోతుంటాడు ఏవో తెలియపరచాలని చూస్తుంటాడు నది కవిని పిలుస్తుందో కవి నదిని కోరుకుంటాడో నది కవికి ఏమిస్తుందో కవి నదికి ఏమిస్తాడో కవితని నది రాయిస్తుందో నదిని కవి మురిపిస్తాడో చినుకులు చిటపటా పడుతాయి నీళ్ళు గలగలా ప్రవహిస్తాయి అక్షరాలు చకచకా పుటలకెక్కుతాయి కవితలు గబగబా పుట్టకొస్తాయి కలం పరుగెత్తుతుంది కాలం దౌడుతీస్తుంది తీరం కవితలని వ్రాయిస్తుంది కవిత్వం నదిలా పారుతుంది తీరం సంతసపడుతుందో సంతోషం తీరానికివస్తుందో నది కోరింది కమ్మనికవితలను కవి కలిపాడు నీటిలోరాతలను మీరూ కవితాతీరానికిరండి కవితలనుచదవండి కవనామృతమునుక్రోలుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఆనందక్షణాలు మెత్తగా తగిలితే అదో ఆనందం చల్లగా తాకితే అదో ఆహ్లాదం చక్కదనం కనబడితే అదో సంతోషం నగుమోము చూస్తుంటే అదో సంతసం ప్రేమగా పిలిస్తే అదో పరితోషం విజయం సాధిస్తే అదో ప్రహ్లాదం వెన్నెల కురుస్తుంటే అదో ప్రమోదం సుగంధం పీలుస్తుంటే అదో ప్రతోషం చక్కనితోడు దొరికితే అదో కుతూహలం మంచి అండదొరికితే అదో కులాసం పిల్లలు ప్రయోజకులైతే అదో సౌఖ్యదాయకం మంచి ఊహలుతడితే అదో సుఖప్రదం తీపిని తింటుంటే అదో ఉల్లాసం కడుపు నింపుకుంటే అదో ఉత్సాహం అనుకున్నది జరిగితే అదో సంబరం ఆప్తులు ప్రక్కనుంటే అదో సంహర్షం ఆలసత్వము వహించకండి లక్ష్యాలను సాధించండి ఆనందాలను ఆస్వాదించండి జీవితమును అనుభవించండి గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
స్వరఝరులు (పాటలు) అక్షరాలు స్వరాలు పదపంక్తులు గానసుధలు అర్ధాలు అద్భుతాలు భావాలు సమ్మోహనాలు పల్లవీలు ప్రాణాలు చరణాలు సరాగాలు ఊహలు ప్రవాహాలు మదులు జలపాతాలు గాయకులు గంధర్వులు గళాలు దైవవరాలు పెదాలు తీపితావులు చెవులు శ్రావ్యతాగ్రహణాలు లయలు హొయలు సృతులు విందులు వాయిద్యాలు వినోదభరితాలు పాటలు శ్రోతలకుపసందులు మాత్రలు సొంపులు ప్రాసలు ఇంపులు గురువులు దీర్ఘాలాపనలు లఘువులు మందగమనాలు ఆలకింపులు అదృష్టాలు పులకింపులు ప్రతిఫలాలు సరాగాలలో పాల్గొందామా సంతసాలలో తేలిపోదామా గుండ్లపల్లి రాజేంద్రపసాద్,భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓరి దేవుడా! మ్రొక్కులను తీర్చు భగవంతుడా భూలోకమును స్వర్గముచేయ్యి దేవుడా మానవమృగాల మనసులుమార్చు జనారణ్యాలను చేయిబృందావనాలు మూగవాళ్ళతో మాట్లాడించు కుంటివాళ్ళతో చకచకానడిపించు గుడ్డివారికి కంటిచూపునివ్వు చెవిటివారికి వినికిడిశక్తినివ్వు కడుపులుమాడేప్రాణులకు ఆహారమందించు గొంతులెండినజీవులకు మంచినీరునిప్పించు చీకటిరాత్రులలో వెన్నెలవెదజల్లు వేసవికాలములో వానకురిపించు అందాలను చూపించు ఆనందాలను కలిగించు గాయపడ్డవారికి ఉపశమనమివ్వు రోగాలపాలైనవారికి ఉచితచికిత్సలందించు మోడుబారినచెట్లను చిగురింపజేయి ఎండిపోయిననదులను ప్రవహింపజేయి మహిళలను కాపాడు వృద్ధులను రక్షించు మహామంచికవులను సృష్టించు మనసులదోచేకవితలను వ్రాయించు అప్పుడు మొక్కులుతీర్చుకుంటా గుడులకుమందిరాలకువెళ్తా పూజాపునస్కారాలుచేస్తా తీర్ధప్రసాదాలుపంచుతా భాజాభజంత్రీలుమోగించుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మన తెలుగు (బాలగేయం) తెలుగు బాలల్లారా తెలుగు బాలికల్లారా తెలుగు దీపములారా తెలుగు వంశజులారా ||తెలుగు|| తెలుగు వ్రాద్దాం తెలుగు చూద్దాం తెలుగు వెలిగిద్దాం తెలుగు చూపిద్దాం తెలుగు చదువుదాం తెలుగు పలుకుదాం తెలుగు వినిపిద్దాం తెలుగు వాడుదాం ||తెలుగు|| తెలుగు కోరుదాం తెలుగు చాటుదాం తెలుగు నేర్పుదాం తెలుగు కూర్చుదాం తెలుగు చిందుదాం తెలుగు పంచుదాం తెలుగు బాటపడదాం తెలుగు పాటపాడుదాం ||తెలుగు|| తెలుగు నోర్లనుతెరుద్దాం తెలుగు పెదాలువిప్పుదాం తెలుగు చేతులుకలుపుదాం తెలుగు మదులనుతట్టుదాం తెలుగు నుడులుపలుకుదాం తెలుగు గళాలనెత్తుదాం తెలుగు రాజులతలుద్దాం తెలుగు కవులస్మరిద్దాం ||తెలుగు|| తెలుగు మనతల్లిరా తెలుగు మనజాతిరా తెలుగు మనకీర్తిరా తెలుగు మనదేవతరా తెలుగు మననెలవురా తెలుగు మనభాషరా తెలుగు మనరక్తమురా తెలుగు మ...
- Get link
- X
- Other Apps
కవిరాజుధ్యాసలు ఏరుకుంటుంటాడు ఏదైనా చిక్కుతుందేమోనని వెదుకుతుంటుంటాడు ఏమైనా దొరుకుతుందేమోనని తిరుగుతుంటుంటాడు ఎక్కడైనా ఊహలుతడతాయేమోనని తలగీకుకుంటుంటాడు ఏవైనా తలపులుపుడతాయేమోనని చుట్టూచూస్తుంటాడు చక్కదనాలుంటాయేమోనని చప్పుడులువింటుంటాడు చతురోక్తులువాడుకోవచ్చునేమోనని చల్లాలనుకుంటుంటాడు అక్షరసౌరభాలని అల్లాలనుకుంటుంటాడు పదపుష్పాలమాలలని ప్రయాసపడుతుంటాడు దున్నటానికి విత్తటానికి నీరుపెట్టటానికి కైతలపంటకొయ్యటానికి శ్రమిస్తుంటాడు బంకమట్టితేవటానికి అడుసుతొక్కటానికి అచ్చుపోయటానికి కవితాబొమ్మలుచేయటానికి గీతలుగీస్తుంటాడు కుంచెనుపట్టుకొని రంగులనద్దుకొని క్యాన్వాసుపైపూసి కవనచిత్రాలనుసృష్టించటానికి చెక్కుతుంటాడు ఉలినిచేపట్టి రాయినిచెక్కి చెమటలుక్రక్కి కయీతాశిల్పాలనుతయారుచేయటానికి కష్టపడుతుంటాడు ఊహలనూరించి విషయాలుసేకరించి భావాలుగామార్చి కవితలుకూర్చటానికి రాత్రింబవళ్ళు రాయటానికి చదివించటానికి మదులుదోచటానికి కవికదేధ్యాస అదేపని కవిరాజు గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
బెజవాడ బాధలు విజయవాడ పౌరుల విషాదము చూశాను విషయము తెలుసుకొని విలపించి పోయాను వాన కురిసింది వాగులు పొంగించింది వరద పారించింది వీధుల జలమయముచేసింది వార్తలు విని కన్నీరు కార్చాను నష్టాలు తెలుసుకొని నివ్వెరా పోయాను బుడమేరు పొంగింది ఇళ్ళను ముంచింది తినుటకు తిండిలేకుండచేసింది త్రాగుటకు నీరులేకుండచేసింది క్రిష్ణవేణి నిండుగాపారింది గజగజలాడించింది వారధి తెగుతుందేమోనని భయభ్రాంతులకుగురిచేసింది బెజవాడ బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు ప్రాణాలు అరచేతపట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు దాతలిచ్చిన నీటిపొట్లాలు దిక్కయ్యాయి ప్రభుత్వమిచ్చిన పులిహోరప్యాకెట్లు ప్రాణాలుకాపాడాయి పిల్లలు అలమంటించారు వృద్ధులు వెతలపాలయ్యారు రోగులు యాతనాచెందారు మహిళలు కన్నీరుకార్చారు నాయకులు వచ్చారు ఓదార్చారు ఇచ్చేది ఇచ్చారు చెప్పేది చెప్పారు క్రిష్ణమ్మ వారధిదాటింది భయపెట్టింది బ్రతిమాలించుకుంది శాంతించింది కాపాడింది కనకదుర్గమ్మా వందనాలమ్మా మరలా ఇలాజరగనీయకమ్మా క్రిష్ణమ్మకు ముక్కుపుడకనీయమ్మా ముప్పును మరోసారిరానీయకమ్మా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితా మాధుర్యాలు ఊహలను మాగబెడతా కవిత్వాన్ని పండించుతా అక్షరాలను పూయించుతా పదాలను మాలలుకడతా వ్రాతలను జవజవలాడిస్తా కైతలని కువకువలాడిస్తా పలుకులలో తేనెచుక్కలుచల్లుతా పాటలలో అమృతధారలుకురిపిస్తా శబ్దాలను సంధించుతా స్వరాలను సుమధురంచేస్తా కయితలలో జీవిస్తా మనసులలో నిలుస్తా పాలలా సాహిత్యాన్ని చిలుకుతా వెన్నలా కవనాలను బయటకుతీస్తా తుపాకిలా కలమును ప్రేల్చుతా తూటాల్లా కవితలను తలల్లోదించుతా సాదాసీదా రాతలజోలికిపోనంటా కల్లబొల్లి కబుర్లనుచెప్పనంటా తెలుగుసాహిత్యాన్ని వెలిగిస్తా తియ్యందనాలను పంచేస్తా కవితామాధుర్యాలను అందిస్తా సాహితీకాంక్షలను తీరుస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
జీవితం జీవితం పూలబాటకాదు ఉషారుగాజోరుగా నడవటానికి జీవితం హరివిల్లుకాదు రంగులనుచూస్తూ కాలంగడపటానికి జీవితం సుఖాలమయంకాదు అనుభవించటానికి ఆనందించటానికి జీవితం విహంగవీక్షణంకాదు దూరంనుండిచూస్తూ వినోదంపొందటానికి జీవితం సముద్రముకాదు నిత్యంకెరటాల్లా ఎగిసిపడటానికి జీవితం మకరందంకాదు సీతాకోకచిలుకల్లా క్రోలటానికి జీవితం వడ్డించినవిస్తరికాదు కష్టపడకుండా కాలక్షేపంచేయటానికి జీవితం భ్రమకాదు ఊహలలో తేలిపోటానికి జీవితం సంపాదనకాదు కోట్లధనాన్ని కూడబెట్టటానికి జీవితం దీర్ఘపయనం గమ్యాలను చేరటంకోసం జీవితం శ్రమించటం లక్ష్యాలను సాధించటం జీవితం ప్రేమనుపంచటం భార్యాబిడ్డలతో ఇరుగుపొరుగువారితో జీవితం నాటకరంగం ఇచ్చినపాత్రనుపోషించి దిగిపోవటానికి జీవితం గాలిపటం ఎప్పుడు ఎగురుతుందో ఎప్పుడు కూలుతుందో జీవితం విద్యాలయం నేర్వటానికి అమలుచేయటానికి జీవితం పోరాటం బ్రతకటానికి బాగుపడటానికి జీవితం ఎరుగు ఆశయం సాధించు అదే జీవితాన్నిగడపటం అదే జీవితాన్నిగెలవటం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం