Posts

Showing posts from June, 2025
  ఓ మనిషీ! మనసును దారినిపెట్టుకో మనసుకు మంచిని నేర్పు మనసుకు బుద్ధిని ఇవ్వు మనసుకు మాటలు చెప్పు మనసుకు దారిని చూపు మనసును మురిపించు మనసును నడిపించు మనసును పలికించు మనసును తేనెనుచల్లించు మనసును పరుగెత్తించకు మనసును క్రిందకుపడదోయకు మనసును మభ్యపెట్టకు మనసును మాయచేయకు మనసును రగిలించకు మనసును మట్టుబెట్టకు మనసుకు కళ్ళెం తగిలించు మనసుకు కోర్కెలు తగ్గించు మనసుకు లక్ష్యాలు ఏర్పరచు మనసుకు సాధనకు సలహాలివ్వు మనసును చెప్పినట్లు వినమను మనసుకు స్వేచ్ఛను ఇవ్వకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 భాగ్యనగరం కవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాదుకు విశ్వపుత్రిక గజల్ సంస్థ పురస్కారం నిన్న 29-06-2025వ తేదీ సుందరయ్య విఙ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరిగిన విశ్వపుత్రిక గజల్ సంస్థ వార్షికోత్సవ సమావేశంలో కవి భాగ్యనగరం నివాసి గుండ్లపల్లి రాజేంద్రప్రసాదుకు గజల్ పురస్కారం ప్రదానం చేశారు. సభకు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షత వహించారు. సభకు పెక్కుమంది సాహితీ ప్రియులు హాజరుకావటం చాలా సంతసాన్ని ఇస్తుందన్నారు. పిమ్మట సంస్థ అధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మిపండిట్ గజల్ కవులను ప్రోత్సహించటానికే సంస్థను స్థాపించామన్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నరసింహప్ప సంస్థ క్రమం తప్పకుండా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. సభకు అతిధులుగా ప్రముఖ కవి ఖమ్మం వాసి మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ గజల్ కవి సురారం శంకర్, కవి విశ్రాంత  ఐ.ఆర్.ఎస్.   అధికారి జెల్ది విద్యాధర్, సహస్ర సినీ టీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, కవి రచయిత జర్నలిస్ట్ భగీరథ మొదలగు వారు పాల్గొన్నారు.  కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ గొప్పగా కవిసమ్మేళనం నిర్వహించి అందరి మన్ననలను పొందారు. కవిసమ్మేళనంలో మొదటగా గుండ్లప...
 ఓ వెన్నెలా! వెన్నెల వెన్నెల వెన్నెలా పున్నమి రాతిరి వెన్నెలా చక్కని చల్లని వెన్నెలా తెల్లని జాబిలి వెన్నెలా                     ||వెన్నెల|| ఏ భామ వన్నెవే వెన్నెలా మదిని తడుతున్నావే వెన్నెలా  ఏ లేమ నవ్వువే వెన్నెలా రమ్మని పిలుస్తున్నావే వెన్నెలా                ||వెన్నెల|| ఏ వనిత సిగమల్లెవే వెన్నెలా తెల్లగా కనిపిస్తున్నావే వెన్నెలా ఏ ముదిత మోమువే వెన్నెలా మెరుపులా మెరుస్తున్నావే వెన్నెలా             ||వెన్నెల|| ఏ పడతి పులకరింతవే వెన్నెలా ఇంపుసొంపులు ఒలుకుతున్నావే వెన్నెలా ఏ సుదతి ఎదమంటవే వెన్నెలా నిప్పును ఆర్పమంటున్నావే వెన్నెలా            ||వెన్నెల|| ఏ మెలత మురిపానివే వెన్నెలా పకపకలాడుతున్నావే వెన్నెలా ఏ నెలత పైపూతవే వెన్నెలా ధగధగలాడుతున్నవే వెన్నెలా                 ||వెన్నెల|| ఏ అంగన చూపువే వెన్నెలా వయ్యారాలతో వెలుగుతున్నావే వెన్నెలా ఏ అతివ ప్రతీకవే వెన్నెలా కళ్ళనుకట్టేస్తున...
 కవిత్వం కవిత్వం ఊహలరూపం మాటలమార్గం కవిత్వం భావాలబహిర్గతం సందేశాలసమాహారం  కవిత్వం వైయక్తికం విశిష్టశిల్పం  కవిత్వం ప్రగతిపధం ప్రయోజనకరం   కవిత్వం అక్షరసేద్యం పంటలపెంపకం కవిత్వం పదాలప్రయోగం ప్రాసలబద్ధం  కవిత్వం వాక్యనిర్మాణం వ్యాకరణబద్ధం  కవిత్వం ఆస్వాదనీయం ఆనందదాయకం కవిత్వం మధురం సౌరభం కవిత్వం ప్రబోధం పాఠం కవిత్వం నూతనోత్సాహం అసిధారావ్రతం కవిత్వం ఆయుధం సాధనీయం  కవిత్వం ఆలోచనలప్రతిఫలం భావాలవ్యక్తీకరణం కవిత్వం ఒకవ్యాపకం మనోవికారం కవిత్వం అందాలదృశ్యం ఆనందకారకం  కవిత్వం ఒకవర్షం ఒకప్రవాహం కవిత్వం కళ్ళకుప్రకాశం మోములకుచిరుహాసం కవిత్వం కలాలఫలం కలలస్పందనం కవిత్వం గీతలకాగితం కల్పనలకూర్చటం కవిత్వం కావ్యాలంకారం ఓసాహిత్యవిభాగం కవిత్వం ఉబికినహృదయం  పొంగినపరవశం కవిత్వం అత్యంతశక్తివంతం  అభినందనీయం  కవిత్వం ఎప్పటికీసశేషం నిత్యచైతన్యం  కవిత్వం అమృతం అజరామరం  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
ఓ కొంటెదానా! ( గజల్ తీస్ర గతి) ఎదురుగుండ నిలచియున్న ఎర్రదాన ఇటుచూడవె మనసునిండ ఆశలున్న బుల్లిదాన ఇటుచూడవె అందమైన చూపులున్న చిన్నదాన తలతిప్పకె బుంగమూతి పెట్టకుండ బుజ్జిదాన ఇటుచూడవె చిరునవ్వులు చిందుతున్న చిట్టిదాన విసుగుకోకె బుంగమూతి పెట్టకుండ పిల్లదాన ఇటుచూడవె కొప్పులోన మల్లెలున్న కొంటెదాన కోపపడకె మత్తులోన తోయకుండ కుర్రదాన ఇటుచూడవె వేగలేక వేచియున్న చిలిపిదాన తొందరేలె వయ్యారము ఒలకబోస్తు వెర్రిదాన ఇటుచూడవె పొగరుయున్న  పరువమున్న చిట్టిదాన కసరబోకె పొంగులున్న ప్రతిభయున్న పసిడిదాన ఇటుచూడవె హంగులున్న హాయికొలిపె పోరదాన మంకువలదె పదేపదే అలగకకుండ  పిచ్చిదాన ఇటుచూడవె గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 ఓ వెన్నెలా! వెన్నెల వెన్నెల వెన్నెలా పున్నమి రాతిరి వెన్నెలా చక్కని చల్లని వెన్నెలా తెల్లని జాబిలి వెన్నెలా                     ||వెన్నెల|| ఏ భామ వన్నెవే వెన్నెలా మదిని తడుతున్నావే వెన్నెలా  ఏ లేమ నవ్వువే వెన్నెలా రమ్మని పిలుస్తున్నావే వెన్నెలా                ||వెన్నెల|| ఏ వనిత సిగమల్లెవే వెన్నెలా తెల్లగా కనిపిస్తున్నావే వెన్నెలా ఏ ముదిత మోమువే వెన్నెలా మెరుపులా మెరుస్తున్నావే వెన్నెలా             ||వెన్నెల|| ఏ పడతి పులకరింతవే వెన్నెలా ఇంపుసొంపులు ఒలుకుతున్నావే వెన్నెలా ఏ సుదతి ఎదమంటవే వెన్నెలా నిప్పును ఆర్పమంటున్నావే వెన్నెలా            ||వెన్నెల|| ఏ మెలత మురిపానివే వెన్నెలా పకపకలాడుతున్నావే వెన్నెలా ఏ నెలత పైపూతవే వెన్నెలా ధగధగలాడుతున్నవే వెన్నెలా                 ||వెన్నెల|| ఏ అంగన చూపువే వెన్నెలా వయ్యారాలతో వెలుగుతున్నావే వెన్నెలా ఏ అతివ ప్రతీకవే వెన్నెలా కళ్ళనుకట్టేస్తున...
 పిల్లలం పిడుగులం మనం  బడులకు వేళ్దాం మనం పాఠాలు చదువుదాం మనం అ ఆలు దిద్ద్దుదాం మనం అమ్మ ఆవులు పలుకుదాం మనం    ||బడులకు|| ఆటలు ఆడుదాం మనం పాటలు పాడుదాం మనం పరుగులు తీద్దాం మనం పందెములు కాద్దాం మనం        ||బడులకు|| తల్లిని కొలుద్దాం మనం తండ్రిని పూజిద్దాం మనం గురువును ఆరాధిద్ద్దాం మనం పెద్దలను గౌరవిద్దాం మనం        ||బడులకు||   అక్కలతో తిరుగుదాం మనం అన్నలతో మాట్లాడుదాం మనం చెల్లెళ్ళతో చిందులేద్దాం మనం తమ్ముళ్ళతో కబుర్లాడుదాం మనం   ||బడులకు||   కోకిలలా పాడుదాం మనం చిలకలా పలుకుదాం మనం నెమలిలా నాట్యమాడుదాం మనం         హంసలా నడుద్దాం మనం        ||బడులకు||    ఊరుపేరు నిలుపుదాం మనం వంశఖ్యాతి నిలబెడదాం మనం రాష్ట్రకీర్తిని పెంచుదాం మనం జాతిగౌరవం  చాటుదాం మనం    ||బడులకు||   తల్లిభాషను వ్యాపిద్దాం మనం తేటమాటలు వాడుదాం మనం తేనెపలుకులు చిందుదాం  మనం తెలుగుగొప్పలు చెప్పుదాం మనం   ||బడులకు|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం...
Image
 పువ్వమ్మ పువ్వమ్మ పువ్వమ్మా! పువ్వమ్మ పువ్వమ్మ పువ్వమ్మా ఎందుకు నీకంత సిగ్గమ్మా చెట్టుకు చక్కన నీవమ్మా తోటకు కమ్మన నివ్వమ్మా         ||పువ్వమ్మ|| అందంతోటి అలరిస్తావు అందరిమదులు దోచేస్తావు రంగులతొటి ఆకర్షిస్తావు హంగులతోటి ఆనందపరుస్తావు     ||పువ్వమ్మ|| కాంతులాను వెదజల్లుతావు ప్రశాంతతను చేకూరుస్తావు  పరిమళాలను చల్లుతావు పరిసరాలను మురిపిస్తావు         ||పువ్వమ్మ|| తేటులాను పిలుస్తావు తేనెచుక్కలు అందిస్తావు ప్రేమకోర్కెను పుట్టిస్తావు విరహబాధను కలిగిస్తావు         ||పువ్వమ్మ|| ముందు మొగ్గగా పుడతావు పిమ్మట విరిగా విచ్చుకుంటావు మొదట పిందెగా మారుతావు తర్వాత కాయగా రూపుదిద్దుకుంటావు ||పువ్వమ్మ|| దండగా అల్లమంటావు దేవుళ్ళమెడన వెయ్యమంటావు కోమలాంగుల కొప్పులెక్కుతావు చక్కదనాలను రెట్టింపుచేస్తావు      ||పువ్వమ్మ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 జాగ్రత్త కవీ! మాటలు వదిలితే తూటాలు పేలుతాయేమో కలాలు కదిలిస్తే కత్తులు దిగుతాయేమో అక్షరాలు విసిరితే నిప్పురవ్వలు పైనపడతాయేమో పదాలు పారిస్తే ప్రవాహంలో కొట్టకపోతారేమో కవితలు పఠిస్తే మెదడులో గుచ్చుకుంటాయేమో ఆలోచనలు ఊరిస్తే తల తటాకమవుతుందేమో కల్పనలు అల్లితే భ్రాంతుల్లో కూరుకుపోతారేమో విషాదకైతలు రాస్తే కన్నీరు కార్పిస్తుందేమో  కవనజల్లులు కురిపిస్తే వరదల్లో కొట్టుకపోతారేమో ఎదలను దోచుకుంటే పిచ్చివాళ్ళు అవుతారేమో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం  
Image
 అద్భుతంగా జరిగిన కాలిఫోర్నియా 154వ  వీక్షణం సాహితీ గవాక్షం అంతర్జాల సాహితీ సమావేశం సమీక్షకులు ప్రసాదరావు రామాయణం, కావలి  **************************************************  నేడు 21-06-2025 వ తేదీ శనివారం వీక్షణం 154 వ అంతర్జాల సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. వీక్షణం వ్యవస్థాపకురాలు  డా. గీతామాధవి గారు గొప్ప కవయిత్రి, కథా రచయిత్రి, నవలాకారిణి, నటి, సంగీత నిధి, గాయని. దేశాలన్నీ తిరుగుతూ తెలుగు భాషావ్యాప్తికై  ఉపన్యాసించడమే కాకుండా సిలికాన్ ఆంధ్రాలో ఎన్నో తెలుగు పాఠశాలలను నడుపుతున్నారు. ఒక మస్తకంతో పది హస్తాలతో పనిజేస్తున్నారు.        ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన  సమావేశం గీతామాదవి గారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది. ముఖ్య అతిథి డా. టి.గౌరీశంకర్ గారిని గీతామాదవి గారు సభకు పరిచయం చేశారు. హైదరాబాద్ లో జన్మించిన గౌరీశంకర్ గారు తెలుగు ఏం ఎ  చేశారు. తెలుగు సీనియర్ ఆచార్యులు గాను జర్నలిస్ట్ గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు.పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు.  వారు భాషకు నిర్వచనం దగ్గరన...
Image
 అమ్మా సరస్వతీ! నా మనమున గొప్ప ఆలోచనలు పారించు నా పెదాల  అక్షరామృతం కురిపించు నా మోమున వెలుగులు ప్రసరించు నా గళమున గాంధర్వగానము వినిపించు నా నోటన  తేనెపలుకులు చిందించు  నా వాక్కుల సుశబ్దములు శోభిల్లించు నా కళ్ళకు అందాలదృశ్యాలు చూపించు నా ఎదన  ఆనందము కాపురముంచు నా కలమున పదాలజల్లులు ప్రవహించు నా చేతన అద్భుతకవితలు వ్రాయించు నా ఉల్లాన కలకాలము నిలువు నా రాతలకు మెరుగులు దిద్దు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   
Image
 ఆద్యంతం రసవత్తరంగా సాగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక అంతర్జాల పితృదినోత్సవం ******************************************** తేదీ 15-06-25న కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 9వ సమావేశం  అంతర్జాల పితృదినోత్సవం ఆసాంతం రసవత్తరంగా జరిగింది. ముఖ్య అతిధి, ప్రముఖ కవి, తెలంగాణా తెలుగు అకాడెమి తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ నాన్నల పాత్ర విశిష్టమైనదని, అమూల్యమైనదని పిల్లల మరియు కుటుంబ వృద్ధికి మూలకారణమని అన్నారు. అమ్మ భూమి అయితే నాన్న ఆకాశం అని, అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే, నాన్న పెంపుదలకు శిక్షణకు చిహ్నమని అన్నారు. భార్గవి,చలం,నిర్మల మొదలగు వారి సంఘటనలను, వ్రాతలను గుర్తుచేసి అందరి మన్ననలను పొందారు. సభ నంది అవార్డు గ్రహీత సినీ దర్శకుడు దీపక్ న్యాతి తొలి స్వాగత వచనాలతో ప్రారంభమయింది. సహస్ర సినీ టీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తమ అధ్యక్ష ఉపాన్యాసంలో నిర్వాహక బృందం పితృదినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించటం.  సిద్ధారెడ్డి గారి వంటి ప్రముఖ సాహితీవెత్తను అతిధిగా పిలవటం, పెక్కు ప్రముఖ కవులు పాల్గొనటం చాల సంతసించవలసిన విషయమన్నారు. గౌరవ అతిధి మరియు విశ్రాంత అటవీ శాఖ అధికారి అంబ...
 ప్రాసలరాయుని ప్రబోధాలు పేరున్నదని ఊరున్నదని కారున్నదని నోరుపారేసుకోకోయ్ అందమున్నదని ఆనందమున్నదని అందలమున్నదని అరవిందముననుకోకోయ్ పూవులాంటివాడినని పొంకమున్నవాడినని పరిమళముచల్లువాడినని పెట్రేగిప్రవర్తించకోయ్ జాబిలియున్నాడని వెన్నెలచల్లుతున్నాడని హాయిగొలుపుతున్నాడని విరహంలోపడదోయకోయ్ ఆజ్యమున్నది అంగారకమున్నదని అవకాశమొచ్చిందని అగ్గినిరేపకోయ్ రంగులున్నాయని హంగులున్నాయని పొంగులున్నాయని కంగుకంగుమనకోయ్ మనసున్నదని బుద్ధియున్నదని ఙ్ఞానమున్నదని అతితెలివిచాటుకోకోయ్ శైలియున్నదని శిల్పమున్నదని సాహితీద్రష్టనని చంకలెగరేసుకోకోయ్ అక్షరాలున్నాయని పదాలున్నాయని ఆలోచనలున్నాయని చెత్తకైతలల్లకోయ్ పత్రికలున్నాయని ప్రచురిస్తాయని పాఠకులున్నారని పేలవకవితలుపంపకోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 హితోపదేశాలు రెచ్చకొట్టకురా రగిలించుటకు కోపము దువ్వకురా కయ్యమునకు కాలు  ఆజ్యంపొయ్యకురా మండించుటకు మంటలు  సూదులుగుచ్ఛకురా తెచ్చుకొనేవు చేటు చెడపకురా చిక్కుల్లోపడి చెడిపోయేవు  గోతులుతియ్యకురా తీసినగుంటల్లో పడిపోయేవు  నటించకురా దొంగబుద్ధి బయటపడేను విషంక్రక్కకురా పర్యావసానం అనుభవించేవు నిజందాచకురా సహించకు అన్యాయాలు కొంపలుకూల్చకురా తగులుతాయి నిరాశ్రయులశాపాలు ఘనుడననుకోకురా కూయకు కారుకూతలు విపరీతబుద్ధిచూపకురా కొనితెచ్చుకొనేవు వినాశనము విప్పాలి మనస్సు చెప్పాలి హితాలు తెరిపించాలి కళ్ళు చూపించాలి సత్యాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 సాహిత్యశోభలు మాటలు గుబాళింపచెయ్యమంటున్నాయి పలుకులు తేనెచుక్కలుచల్లమంటున్నాయి అక్షరాలు ముత్యాల్లాగుచ్చమంటున్నాయి పదాలు పనసతొనల్లాపసందుకొలపమంటున్నాయి ఆలోచనలు పారించమంటున్నాయి భావాలు బహిర్గతంచేయమంటున్నాయి శబ్దాలు శ్రావ్యతనుకూర్చమంటున్నాయి పాఠకలోకము పరవశపరచమంటుంది కలము చేతపట్టమంటుంది కాగితము బొమ్మనుచెక్కమంటుంది శైలి  సొంతంచేసుకోమంటుంది శిల్పం చక్కగాదిద్దమంటుంది భాష తల్లిలాప్రేమించమంటుంది సాహితి పుత్రవాత్సల్యంచూపుతుంది కైతలు కమ్మదనాలుకలిగించమంటున్నాయి మదులు  మురిపించమనివేడుకుంటున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవిగారి తపనలు మొదలు దొరకటంలా ప్రారంభించటానికి దారి కనబడటంలా గమ్యంచేరటానికి తోడు దొరకటంలా కాలక్షేపంచేయటానికి ప్రోత్సాహం లభించటంలా ప్రతిభనుబయటపెట్టటానికి అక్షరాలు అందటంలా అందంగా అమర్చటానికి పదాలు పొసగటంలా కమ్మగా కూర్చటానికి సమయం చిక్కటంలా కలంపట్టటానికి ఆలోచనలు ఊరటంలా భావాన్నివెలిబుచ్చటానికి విషయం తట్టటంలా ముందుకుసాగటానికి ముగింపు కనబడటంలా పూర్తిచేయటానికి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కలలకెరటాలు కవితలతరంగాలు (కలల అలలు) నీవు నిత్యంవస్తున్నావు ఆలోచనలు లేపుతున్నావు భావాలు పుట్టిస్తున్నావు అక్షరజల్లులు కురిపిస్తున్నావు కవితలవరద పారిస్తున్నావు నీవు వెన్నుతడుతున్నావు కలం పట్టిస్తున్నావు కాగితాలు నింపిస్తున్నావు కుషీ పరుస్తున్నావు కైతలు కూర్పిస్తున్నావు నీవు కవ్విస్తున్నావు విషయలు ఇస్తున్నావు పదాలు పేర్పించుతున్నావు పరవశం కలిగిస్తున్నావు కయితలు రాయిస్తున్నావు నీవు అందాలుచూపుతున్నావు ఆనందం అందిస్తున్నావు ఆకాశానికి తీసుకెళ్తున్నావు హరివిల్లును ఎక్కిస్తున్నావు కవనాలు అల్లిసున్నావు నీవు పూలనిస్తున్నావు పరిమళాలు చల్లుతున్నావు మెడకు దండనేస్తున్నావు మత్తులోకి దించుతున్నావు సాహిత్యాన్ని సుసంపన్నంచేయిస్తున్నావు నీవు మేలుకొలుపుతున్నావు మాయమవుతున్నావు మదిని ముట్టుతున్నావు హృదిని ఆక్రమించుకుంటున్నావు కవిత్వంలో కాలక్షేపంచేయిస్తున్నావు స్వప్నం చైతన్యపరుస్తుంది ఆశలను లేపుతుంది జాబిలిపైకి తీసుకెళ్తుంది వెన్నెలలో విహరింపజేస్తున్నది వాక్యాలను రసాత్మకంచేస్తుంది కలలు నిజము కైతలకు ప్రేరణము కల్లలు కానేకావు కవులు మహనీయులు కూర్పులు అద్భుతాలు  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పక్షులు ప్రవృత్తులు అక్కుపక్షి అలమటిస్తుంది దిమ్మతిరిగి దిక్కుతోచకా గాలిపక్షి అరుస్తుంది అర్ధంపర్ధంలేకుండా ఆడుతూపాడుతూ తల్లిపక్షి తంటాలుపడుతుంది తృప్తికరమైనభోజనం తనపిల్లలకందించాలనీ పిల్లపక్షి ఎదురుచూస్తుంది అండాదండకు ఆలనాపాలనకూ గర్భిణీపక్షి కలలుకంటుంది బిడ్డలనుకనాలని పెద్దవారినిచేయాలనీ స్వేచ్ఛాపక్షి ఆడుతుంది పాడుతుంది తేనెచుక్కలు చిందుతూ గాంధర్వగానం వినిపిస్తూ నోటిపక్షి గోలచేస్తుంది కర్ణకఠోరంగా కావుకావుమంటూ సంగీతపక్షి గొంతెత్తిపాడుతుంది వీనులకింపుగా కుహూకుహూమంటూ పిచ్చిపక్షి ప్రేలాపనలుచేస్తుంది మనసులను కకలావికలంచేయాలనీ ఒంటరిపక్షి ఉబలాటపడుతుంది ఏకాంతంవీడాలని గుంపులోచేరాలనీ ప్రేమపక్షి పరితపిస్తుంది సాహచర్యానికి సంతోషానికీ కవిపక్షి కవితలుకూరుస్తుంది కమ్మనిరాగాలతో కుతూహలపరచాలనీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఓ ప్రేమికుడితంటాలు  ఓ పోకిరీ! తలతిప్పకుండా ఎందుకలా చుస్తున్నావు కొరుక్కుతింటావా ఓ అల్లరోడా! విడవకుండా ఎందుకు వెంటబడుతున్నావు బుట్టలోవేసుకుంటావా ఓ చిలిపోడా! అదేపనిగా ఎందుకుపిలుస్తున్నావు కబుర్లతో కాలక్షేపంచేయాలనా ఓ చిన్నోడా! చేతినిండా పూలెందుకుపట్టుకోనియున్నావు అందించి ప్రేమనుతెలపాలనా ఓ కుర్రోడా! ఆపకుండా ఎందుకలా నవ్వుతున్నావు అందాన్ని ఆస్వాదిస్తున్నావా ఓ పోరిగా! చేతిలోనిది ఉత్తరమా ఎందుకు చూపిస్తున్నావు ప్రేమలేఖ అందించాలనా ఓ కిలాడీ! తలగీక్కుంటున్నావా ఏమిటి ఆలోచిస్తున్నావు చిన్నదాన్ని ఎలావశపరచుకోవాలనా ఓ బుల్లోడా! కాచుకొనియున్నావా వలపువలను విసిరి చెలిని చేపలాబంధించాలనా ఓ పిల్లోడా! ఎదురుచూస్తున్నావా మన్మధబాణం విసిరి కామాంధురాలుని చేయాలనుకుంటున్నావా ఓ పిరికోడా! వణికిపోతున్నావా కథ అడ్డంతిరిగితే చెంప చెళ్ళుమంటుందనా ధైర్యం చెయ్యరాడింబకా ఆశయం నెరవేర్చుకోరా విజయం పొందరాపిచ్చోడా జీవితం సుఖమయంచేసుకోరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఓ నాన్నా! నాకు  ఏపేరుపెడతావు నాన్నా! నన్ను ఎంతప్రేమగాపిలుస్తావు నాన్నా! తాతపేరు పెడతావా దేవునిపేరు పెడతావా పెద్దపేరు పెడతావా చిన్నపేరు పెడతావా బుజ్జీ అంటావా బంగారం అంటావా నీ ఇష్టప్రకారం పెడతావా అమ్మ కోరికప్రకారం పెడతావా జ్యోతిష్యం ప్రకారము పెడతావా ఆశయం మేరకు పెడతావా పేరును విరిసి పిలుస్తావా లేకసాగదీసి పిలుస్తావా బారసాలరోజు పెడతావా అన్నప్రాసనరోజు పెడతావా ముద్దుగా పిలుస్తావా కోపంగా పిలుస్తావా నాన్నా! నాపేరును నన్నే పెట్టించుకోనీయరాదు మానాన్న బహుమంచివాడు నాకోరిక మన్నిస్తాడంటాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 ఆనందమానందమాయనే పకపకా నవ్వుతున్నానంటే  పరమానందాన్ని పక్కాగాపొందినట్లే మోమున వెలుగులుచిమ్ముతున్నానంటే మహదానందాన్ని చిక్కించుకున్నట్లే ఎగిరి గంతులేస్తున్నానంటే ఎంతోసంతోషాన్ని ఎదననింపుకున్నట్లే కళ్ళు కాంతులుచిమ్ముతున్నాయంటే ఆహ్లాదాన్ని దోరబుచ్చుకున్నట్లే మిఠాయీలు పంచుతున్నానంటే మదికిమురిపాన్ని ముట్టజెప్పినట్లే చప్పట్లు కొడుతున్నానంటే ఉత్సాహం ఉల్లాన్ని  తట్టినట్లే వెన్నెలలో విహరిస్తున్నానంటే మానసికానందాన్ని హృదయానికప్పజెప్పినట్లే ఆనందభాష్పాలు కారుస్తున్నానంటే సంతసంతో అంతరంగాన్న్ని  నింపుకున్నట్లే అదృష్టం వరించిందంటే అమితానందాన్ని అందుకున్నట్లే విజయం దక్కిందంటే నూతనోత్సాహాన్ని దక్కించుకున్నట్లే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 ఆశలజోరు    మబ్బులు లేస్తే వానపడుతందనే ఆశ ఉద్యోగం దొరికితే కడుపునింపుకోవచ్చనే ఆశ తోడుదొరికితే కష్టసుఖాలుపంచుకోవచ్చనే ఆశ మంచికలవస్తే నిజంచేసుకుందామనే ఆశ విజయందక్కితే గుర్తింపువస్తుందనే ఆశ అండనిచ్చేవారుంటే అడుగులుముందుకెయ్యాలనే ఆశ అందాలుకనబడితే ఆనందంపొందవచ్చనే ఆశ ఆలోచనతడితే అమలుపరుద్దామనే ఆశ అందలమెక్కితే అన్నీసాధించవచ్చనే ఆశ లక్ష్యాన్నిచేరితే జీవితాన్నిగెలిచామనే ఆశ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవితావిస్ఫోటాలు కవితాజల్లులు కురిపిస్తా కవితాస్నానాలు చేయిస్తా కవితాకుసుమాలు పూయిస్తా కవితాసౌరభాలు వ్యాపిస్తా కవితాచిందులు త్రొక్కిస్తా కవితానందము కలిగిస్తా కవితామాధుర్యాలు తినిపిస్తా కవితామృతము త్రాగిస్తా కవితాసేద్యము సాగిస్తా కవితాపంటలు పండిస్తా కవితాసవ్వడులు కావిస్తా కవితాగానాలు వినిపిస్తా కవితాప్రవాహము కొనసాగిస్తా కవితాసాగరమందు కలిపేస్తా కవితాదీపాలు వెలిగిస్తా కవితాకాంతులు వెదజల్లుతా కవితావెన్నెలను ప్రసరిస్తా కవితావిహారము చేయించుతా కవితాపయనము చేయిస్తా కవితాలోకమును చేర్పిస్తా కవితలందు ముంచుతా కవనాలందు తేలుస్తా కైతలందు కనిపిస్తా కయితలందు కట్టేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 యుద్ధం వద్దురా! యుద్ధం వద్దురా నాశనం వలదురా సమరం చాలించరా శాంతిని ప్రేమించరా పోరాటం చేయొద్దురా వినాశనం కోరొద్దురా కయ్యం  మానురా వియ్యం సలపరా ద్వేషం పెంచుకోకురా విధ్వంసం తెచ్చుకోకురా పోరు పనికిరాదురా ప్రగతిమార్గము పట్టరా ఆలము అనవసరమురా అభివృద్ధికి ఆటంకమురా కోట్లాటకు దిగవద్దురా దెబ్బలు తినవద్దురా రణము మరణాలకుహేతువురా ప్రాణాలకు హానికరమురా జగడము ప్రమాదమురా తకరారులు కలిగించురా తగవులు రుద్దితే తగినశాస్తి చెయ్యరా కలహం కోరితే పీచమణచరా బుద్ధిచెప్పురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 తెలుగు తడాక నోటిలో  నానుతుంటుంది నాలుకపై  నృత్యంచేస్తుంటుంది కళ్ళల్లో  కూర్చుంటుంది కాంతులు  కురిపిస్తుంటుంది కడుపునుంచి  బయటకొస్తుంది కమ్మనివిషయాలు  క్రక్కిస్తుంది తీయదనం  తినిపిస్తుంది కమ్మదనం  కలిగిస్తుంది పువ్వులు  విసిరిస్తుంది పరిమళాలు  వెదజల్లిస్తుంది నవ్వులు  చిందిస్తుంది మోములు  వెలిగిస్తుంది పెదవులు  తెరిపిస్తుంది తేనియలు  చిందిస్తుంది గళము  విప్పిస్తుంది గేయము  పాడిస్తుంది కలము  పట్టిస్తుంది కవితలు  రాయిస్తుంది మదులు  మురిపిస్తుంది ఉల్లాలు  ఉరికిస్తుంది అక్షరాలు  చల్లిస్తుంది పదాలు  పారిస్తుంది పద్యాలు  కూర్పిస్తుంది పాటలు  వినిపిస్తుంది త్రిలింగాలు  స్ఫురింపజేస్తుంది జెంటూశబ్దము  స్మరింపజేస్తుంది ఇటలీభాషను  గుర్తుకుతెస్తుంది బ్రౌనుదొరను  తలపిస్తుంది నన్నయను  స్మరించమంటుంది రాయలను  శ్లాఘించమంటుంది నవరసాలు  చిందిస్తుంది నవనాడులు  కదిలిస్తుంది పంక్తులు  పేర్పిస్తుంది కవితలు  సృష్టిస్తుంది కలము  పట్టి...
 కవివర్యా! ఊహలు ఊరించు ఉల్లాలు మురిపించు అక్షరాలు కురిపించు పదాలు పారించు సరిగమలు చిందు పదనిసలు వదులు తనువులు తట్టు మనసులు ముట్టు శ్రావ్యత ఒసగు ఘనత చాటు వెలుగులు చిమ్ము చీకట్లు త్రోలు అధరాలు తెరువు తేనెచుక్కలు చల్లు తియ్యదనాలు చేర్చు తనువులు తృప్తిపరచు పరిమళాలు వెదజల్లు పరవశాలు కల్గించు సొంపులు చూపించు ఇంపులు చేకూర్చు దీపాలు వెలిగించు కాంతులు ప్రసరించు వెన్నెల ప్రసరించు విహారాలు చేయించు కలాలు కదిలించు కాగితాలు నింపు కవితలు కుమ్మరించు కమ్మదనాలు అందించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 కవితామాధుర్యాలు తీపిపదార్ధాలు తింటుంటా తియ్యనిపలుకులు తొనకుతుంటా కమ్మనికవితలు కూరుస్తుంటా కవనప్రేమికులను కుతూహలపరుస్తుంటా బెల్లపుముక్కలు చప్పరిస్తుంటా ఆనందమును చేకూర్చుతుంటా చక్కెరరసము త్రాగుతుంటా సంతసము కలిగిస్తుంటా రసగుల్లాలు లాగేస్తుంటా నవరసాలు చిందిస్తుంటా మిఠాయీలు మెక్కుతుంటా మధురానుభూతులు క్రక్కుతుంటా జిలేబీలు ఆరగిస్తుంటా తనువులు తృప్తిపరస్తుంటా లడ్డులు కొరక్కుతింటుంటా కాయాలను కుషీపరస్తుంటా పూతరేకులు భక్షిస్తుంటా మదులను ముచ్చటపరస్తుంటా పాయసము పుచ్చుకుంటుంటా పారవశ్యము పంచిపెడుతుంటా కవితామాధుర్యాలు అందిస్తుంటా సాహితీప్రియులను సంబరపరస్తుంటా తియ్యనికవితలు సృష్టిస్తుంటా పాఠకులహృదులు పులకరిస్తుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 మంచిమాటలు (పంచపద్యాలు) పచ్చదనము తగ్గె వెచ్చదనము హెచ్చె ఋతువులగమనమున గతులుమారె కలుషితంబునయ్యె గాలి జలము భూమి జనులు బ్రతుకుటెట్లు జగమునందు మంచిమాట చెప్ప మదినందు తలపోయ మారి మొదట నీవు మార్చుపరుల మార్గదర్శకుడిగ మనుగవలయునన్న సర్వహితుడుగాను సాగుమెపుడు నీతివంతుదుగను నిత్యము మెలుగుము ఆదరించు పరుల సాదరముగ చక్కనైనబాట నిక్కముగానెంచి వెడలుమయ్య నీవు వెరవకుండ పరుగుతీయువాని పడవేయవలదయ్య గెంట చూడకయ్య గుంటతీసి సహకరించవయ్య సజ్జనులకెపుడు సర్వవేళలందు శ్రమనుపెట్టి పగనుబట్టినట్టి పామువలె తలచి దుర్మతులకు నీవు దూరజరుగు మంచిచేయునట్టి మనుజుల గుర్తించి తోడుగనిలుచొనుము తొణకకుండ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్.భాగ్యనగరం 
Image
 నా అంతరంగ ఆలోచనలు (అఆల ఆంధ్రవైభవము) అక్షరాలు అల్లాలని ఉన్నది అద్భుతకవితలు అందించాలని ఉన్నది అడుగులు ఆపకూడదని ఉన్నది అంతిమలక్ష్యము అందుకోవాలని ఉన్నది అందాలు ఆస్వాదించాలని ఉన్నది ఆనందాలు అందరికీపంచాలని ఉన్నది అంతరంగాలు అంటుకోవాలని ఉన్నది ఆలోచనలు ఆవిర్భవింపచేయాలని ఉన్నది అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఉన్నది అపజయాలు అరికట్టాలని ఉన్నది ఆపదలు అధికమించాలని ఉన్నది అందలము అధిరోహించాలని ఉన్నది అపనిందలు అడ్డుకోవాలని ఉన్నది అబద్ధాలు ఆపించాలని ఉన్నది అగచాట్లు అరికట్టాలని ఉన్నది ఆరాటాలు అనర్ధకమనిచెప్పాలని ఉన్నది ఆత్మాభిమానము ఆజన్మాంతంనిలుపుకోవాలని ఉన్నది అందరిమన్ననలు అందుకోవాలని ఉన్నది ఆశిస్సులు అందించాలని ఉన్నది అన్నిశుభాలు ఆపాదించాలని ఉన్నది అక్షరసేద్యము అనునిత్యంచేయాలని ఉన్నది అత్యున్నతకైతలు అప్రతిహతంగాసాగించాలని ఉన్నది అసమాన్యప్రతిభను అవలోకింపజేయాలని ఉన్నది అల్పకాలమందు అలరారాలని ఉన్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 నా తెలుగుభాష నా భాషలో నే చెబుతా నచ్చితే ఆలకించు మెచ్చితే పులకరించు నా భాషలో నే వ్రాస్తా కావాలంటే పఠించు కమ్మగుంటే ఆస్వాదించు నా భాషలో నే పాడుతా గేయాన్ని వల్లించు గానాన్ని అనుకరించు నా భాషలో నే నేర్పుతా మాతృభాష చరిత్రను మహాకవుల కావ్యాలను నా భాషలో నే ఆలోచిస్తా విప్పుతా మనసును తట్టుతా హృదులను నా భాషలో  నే మునుగుతా ఏరి చల్లుతా అక్షరాలు కోరి పారిస్తా పదాలు నా భాషలో నే పిలుస్తా తీస్తా చెంతకు కలుపుతా చేతులను నా భాషలో నే ప్రసంగిస్తా చెబుతా ముచ్చట్లు కొట్టిస్తా చప్పట్లు నా భాష చక్కని తెలుగు నా మాటలు తెల్లారి వెలుగు నా భాష అమృత భాండాగారము నా కైతలు లేత కొబ్బరిపలుకులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ప్రకృతిసోయగాలు పడతిపొంకాలు  ప్రకృతి పులకించి తనలోని అందాన్నంతా నీ వంటికిస్తే అవలోకించనా ఆస్వాదించనా! గాలి గట్టిగావీచి సుగంధాన్ని వెదజల్లుతూ నీ కొంగునురెపరెపలాడిస్తే ముచ్చటపడనా మురిసిపోనా! కొంటిగా చూస్తూ కాంతులు చల్లుతూ నీ కంటిచూపులుతాకితే పరవశించనా పొంగిపోనా! సెలయేరు పారుతూ చోద్యాలు చూపుతంటే నిను గుర్తుకుతెచ్చుకోనా ఆదమరచి చూడనా! రంగురంగుల పూలు రమణీయతలు చూపుతుంటే నీ సోయగాలుపోల్చుకోనా ఆనందంలో చిందులుత్రొక్కనా! ఆకాశం అకస్మాత్తుగా అమృతజల్లులు చల్లుతుంటే నీ అనురాగసుధలను తనివితీరా క్రోలనా! ఉరుములు దడిపిస్తుంటే మెరుపులు భయపెడుతుంటే నీ చెంతకుచేరనా చేతులలోకి తీసుకోనా! ఆలోచనలు తడుతుంటే అంతరంగం ఉప్పొంగుతుంటే నిన్ను తలచుకోనా ఆనందసాగరంలో మునగనా! వెండి జాబిలి వెన్నెల కురిపిస్తుంటే నీ తోడునుకోరనా హాయిగా విహరించనా! నీలాకాశం కమ్ముకుంటే హృదిని దోస్తే నీకోసం వెదకనా దగ్గరకుతీసుకోనా సంతసించిపోనా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం