Posts

Showing posts from October, 2025
 అక్షరకేళి తల తలుపులు తెరుచుకున్నాయి తట్టెడు తలపులు త్రోసుకొనివచ్చాయి విచిత్ర భావాలు వానలా చిందాయి విభిన్న విషయాలు నదిలా పారాయి అక్షరాలు పక్షుల్లా ఎగిరాయి పదాలు పూలతల్లా ప్రాకాయి పువ్వుల్లా అందంగా అల్లుకున్నాయి దండల్లా ఆనందంగా తయారయ్యాయి నవ్వులై మోముల ఆక్రమించాయి వెలుగులై కాంతులు విరజిమ్మాయి తేనెలా నాలుకనుచేరాయి సుధలా పెదవులనంటుకున్నాయి స్వరాలై మధుర రాగాలుతీసాయి శబ్దాలై వీనులకు విందునిచ్చాయి ముత్యాలై మదిని మురిపించాయి రత్నాలై హృదిన రవళించాయి కవితలై కాగితలకు ఎక్కాయి కావ్యాలై కవ్వింపులకు దిగాయి శిశువై చిందులు వేయిస్తున్నాయి కన్యకై కుతూహల పరుస్తున్నాయి మధువై మత్తు ఎక్కిస్తున్నాయి వధువై వినోదము అందిస్తున్నాయి అక్షరాల ఆట  పరికించాలి పదాల బాట  పట్టాలి అక్షరాలే ఆత్మీయం పదాలే ప్రాణనీయం భావమే బంధం కవనమే విఙ్ఞానం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
 వద్దు...వలదు ఆలోచనలకు అడ్డుకట్ట వేయవద్దు -  మనసుకు పగ్గాలు వేయవలదు, కళ్ళకు గంతలు కట్టుకోవద్దు -  చెవులను దూదితో నింపుకోవలదు. సూర్యుడుకు అరచేయ్యడ్డంపెట్టాలనుకోవద్దు -  చంద్రుడును మబ్బుల్లో దాచాలనుకోవలదు, గుండెకు గుబులు పుట్టించవద్దు -  హృదయముకు చిల్లులు పొడవవలదు. చూపులను పక్కకు మరల్చవద్దు -  మోమును కనపడకుండా దాచవలదు, కలాలకు మూతలు పెట్టవద్దు -  వ్రాతలకు వీడ్కోలు పలుకవలదు. మౌనమును పాటించవద్దు -  పెదవులకు తాళాలేయవలదు, మొక్కలను పీకి పారవేయవద్దు -  పువ్వులను తెంపి నలిపేయవలదు. పీకలను నొక్కివేయవద్దు -  స్వేచ్ఛను హరించవలదు, సత్యాలను దాచవద్దు -  పుకార్లను వ్యాపించవలదు. ఓటర్లను మభ్యపెట్టవద్దు -  హామీలను ఏమరచవలదు, ఆయుధాలు చేతపట్టవద్దు -  అమాయకులను అణచివేయవలదు. మాటలను మీరవద్దు -  కోతలను కోయవలదు, గొప్పలు చెప్పుకోవద్దు -  గోతులు తీయవలదు. పనులకు విరామం ఇవ్వవద్దు -  చేతులకు సంకెళ్ళు వేసుకోవలదు, పయనాలను విరమించుకోవద్దు -  కాళ్ళకు బంధాలు వేయవలదు. కన్నతల్లిని కష్టపెట్టవద్దు -  మాతృభాషని మరచిపోవలదు, దేశమును ద్వేషించవద...
 అటు చూడండి (ప్రకృతి సాక్షి) మబ్బులు తేలుతున్నాయి చినుకులు రాలుస్తున్నాయి తారకలు పొడుచుకొస్తున్నాయి తళుకులు విసురుతున్నాయి పుడమి తడుస్తుంది మొక్కలు తన్నుకొస్తున్నాయి నీరు ప్రవహిస్తుంది నదులు పారుతున్నాయి గాలి వీస్తుంది హోరు వినబడుతుంది చెట్లు ఊగుతున్నాయి తలలు ఆడిస్తున్నాయి పూలు పిలుస్తున్నాయి పొంకాలు చూపుతున్నాయి పండ్లు పండిపోతున్నాయి నోర్లను ఊరిస్తున్నాయి అద్భుతప్రకృతి అలరిస్తుంది అందచందాలు చూపుతుంది ఆనందాలు అందిస్తుంది అంతరంగాలను ముట్టుకుంటుంది అక్షరాలు అల్లుకుంటున్నాయి పదాలు ప్రాకుతున్నాయి కవితలు పుట్టకొస్తున్నాయి హృదులను మురిపిస్తున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
 ఆమె అపరూపి అసమాన్వి (నా కవితా సుందరి) ఆమె నాకు వెలుగు - ఆమె నాకు తెరువు ఆమె నాకు పుష్పము - ఆమె నాకు సౌరభము ఆమె నాకు మార్గదర్శి - ఆమె నాకు జ్యోతిర్మయి ఆమె నాకు కలము - ఆమె నాకు కాగితము ఆమె నాకు ప్రాణము - ఆమె నాకు మానము ఆమె నాకు స్ఫూర్తిప్రదాత - ఆమె నాకు కీర్తిపతాక ఆమె నాకు తేనెజల్లు - ఆమె నాకు రసపట్టు ఆమె నాకు చక్కనితోడు - ఆమె నాకు సరిజోడు ఆమె నాకు అక్షరము - ఆమె నాకు పదము ఆమె నాకు అందము - ఆమె నాకు ఆనందము ఆమె నాకు ఊహ - ఆమె నాకు శ్వాస ఆమె నాకు జాబిలి - ఆమె నాకు కౌముది ఆమె నాకు పొదరిల్లు - ఆమె నాకు హరివిల్లు ఆమె నాకు స్వప్నము - ఆమె నాకు కావ్యము ఆమె నాకు లోగిలి - ఆమె నాకు కౌగిలి ఆమె నాకు సరసము - ఆమె నాకు విరహము నా లోపల ఆమే - ఆమె బయట నేనే నా ప్రేమ ఆమెమీదే - ఆమె వలపు నామీదే నా భావాలు ఆమెవే - నా విషయాలు ఆమెవే నా వ్రాతలు ఆమెవే - నా కవితలు ఆమెవే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవితా భాగ్యము అన్ని ద్వారాలు — ఒకేసారి తెరుచుకుంటున్నాయి, అన్ని దారులు — ఒకేచోటకు చేరుస్తామంటున్నాయి. అన్ని అక్షరాలు — ఒకేలయలో కూరుతున్నాయి, అన్ని పదాలు — ఒకేభావం పలుకుతున్నాయి. అన్ని కలాలు — ఒకేశైలిలో రాస్తున్నాయి, అన్ని గీతాలు — ఒకేకంఠంతో పాడుతున్నాయి. అన్ని మదులు — ఒకేసారి చదవాలంటున్నాయి, అన్ని హృదులు — ఒకేతీరున మురిసిపోతున్నాయి. అన్ని రుచులు — ఒకేపట్టున ఆరగించమంటున్నాయి, అన్ని రసాలు — ఒకేతడవున ఆస్వాదించమంటున్నాయి. అన్ని అందాలు — ఒకేమారు దర్శనమిస్తున్నాయి, అన్ని ఆనందాలు — ఒకేసారి తడుముతున్నాయి. నా మాటలకు — చప్పట్లవర్షం కురుస్తోంది, నా చేతలకు — ప్రశంసాపుష్పాలు అందుతున్నాయి. నా అదృష్టం — పొంగిపొర్లి పరవశిస్తోంది, నా భాగ్యం — గగనమంతా ఎగసిపోతోంది. కవితే నా భాగ్యం – కాగితంపై పూసిన పరవశ పుష్పం, కవితే నా ధ్యేయం – పాఠకుల ఎదల్లో కలిగించే ప్రభంజనం. కవితే నా ప్రాణం – భావాల విహంగం, అక్షరాల ఆకాశం, పదాల ప్రపంచం. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
 అక్షర సత్యాలు  గుండె కోరేది గాలినికాదు – బ్రతికించే ప్రాణవాయువును. మనసు అడిగేది రవికాంతినికాదు – మనోహర జ్ఞానకిరణాల వెలుగులను. దేహం ఇమ్మనేది అన్నముకాదు – ముందుకు నడిపే శక్తి–యుక్తులను. చెయ్యి కావాలనేది కత్తినికాదు – రమ్యరాతల పదునైన కలమును. హస్తము పట్టుకోవాలనేది కర్రనుకాదు – పుస్తకపు పథదీపమును, కరభూషణమును.  వంటిని అలరించేది బంగారం కాదు – ఆకట్టుకునే స్ఫురద్రూప సౌందర్యమును. చెవులు వినాలనుకునేది సొల్లుకబుర్లు కాదు – తేనెచుక్కలు లుచిందు పలుకులను. హృదయం ఎదురుచూసేది మన్మధబాణాలకు కాదు – సుమసౌరభాల ఆఘ్రహణకు, ఆనందానికి. శరీరం ఆశించేది మూడుముళ్ళ బంధం కాదు – మనోరంజితమైన సంబంధం. మాటలు చెప్పుకోవడం కాలక్షేపానికి కాదు – సత్సంగానికి, హితాలు నేర్వటానికి. అక్షరాలు అల్లడం వినోదానికి కాదు – కవిత్వాన్ని పూయించటానికి. పదాలు కూర్చడం పనిలేక కాదు – హృదయాలను పొంగించటానికి. ఆలోచించడం పనిలేక కాదు – భావకవనాన్ని సృష్టించటానికి. జీవించడం నూరేళ్లు గడపటానికి కాదు – సంఘాన్ని చైతన్యపరచి సుఖపరచటానికి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కలిసుంటే కలుగు సుఖం మంచాలు  విడిపడితే పరవాలేదు మమతలు వేరుపడితే బాగుండదు ప్రాంతాలు చీలిపోతే నష్టంలేదు పంతాలు పెట్టుకుంటే లాభముండదు డబ్బులు పంచితే ముప్పులేదు జబ్బులు వ్యాపిస్తే శ్రేయంకాదు వేషాలు మార్చితే సంస్కృతిపై వేటు భాషను మరిస్తే మాతృబాసకి చేటు ద్వేషాలు పెంచితే భవిష్యత్తుకు ప్రమాదం ఉద్రేకాలు సృష్టిస్తే పతనానికి ప్రారంభం విడిపోవటాలు వినాశనానికి మార్గం కలసిపోవటాలు సంక్షేమానికి సుగమం కలసి ముందుకు సాగు చేతుల్ని కలుపు కదులు స్వార్ధాన్ని వెంటనే వదులు ఐక్యమత్యాన్ని ఆయుధంగా వాడు ఆలపించు శ్రావ్య సమైకరాగం ఆలకించు సుస్వర సమతాగీతం అమలుపరచు ఉమ్మడి సంకల్పాలు అనుభవించు విజయ ఫలాలు అనైక్యతే చేయును విధ్వంసం అభివృద్ధే కావాలి అందరిగమ్యం కలిసుంటే కలుగు సర్వులకు సుఖం తెలుసుకుంటే అదగు జీవన బోధనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవితా మహిమలు కవిత్వం జనిస్తుంది ధ్వనిస్తుంది తరిస్తుంది మహిమాన్వితమై కవిత్వం కదులుతుంది కదిలిస్తుంది కట్టిపడేస్తుంది సంగీతమై  కవిత్వం కనబడుతుంది వినబడుతుంది కుదుపుతుంది రసవాక్యాలై కవిత్వం ప్రవహిస్తుంది పయనిస్తుంది పరుగెత్తిస్తుంది హృదయమై కవిత్వం పూస్తుంది పరిమళిస్తుంది పులకరిస్తుంది అంతరంగమై కవిత్వం పొడుచుకొస్తుంది ప్రకాశిస్తుంది పరిఢవిల్లుతుంది వెలుగై కవిత్వం వినమంటుంది తినమంటుంది త్రాగమంటుంది మత్తుపదార్ధమై కవిత్వం పలుకుతుంది ఉలుకుతుంది కులుకుతుంది రాగమృతమై కవిత్వం కురుస్తుంది తడుపుతుంది కరిగిస్తుంది వర్షధారై కవిత్వం నాటుకుంటుంది మొలకెత్తుతుంది మానవుతుంది బీజమై గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 వెళ్తుంటా వెళ్తుంటా... దూసుకుంటూ వెళ్తా - దుమ్ముధూళీ  లేపుతా, దోచుకుంటూ వెళ్తా - మదులను మురిపిస్తా. కోసుకుంటూ వెళ్తా - బడాయీలు కూస్తా, మోసుకుంటూ వెళ్తా - భారాలు తలకెత్తుకుంటా. రాచుకుంటూ వెళ్తా - రాపిడిని కలిగిస్తా, త్రోసుకుంటూ వెళ్తా - పరుగురేసులో నెగ్గుతా. గుచ్చుకుంటూ వెళ్తా - సుమమాలలు అల్లుతా, పూచుకుంటూ వెళ్తా - సౌరభాలు గుప్పిస్తా. చేసుకుంటూ వెళ్తా - లక్ష్యాలను సాధిస్తా, కాచుకుంటూ వెళ్తా - పేరుప్రఖ్యాతులు పొందుతా. ఇచ్చుకుంటూ వెళ్తా - అడుక్కునేవారిని ఆదుకుంటా, గీసుకుంటూ వెళ్తా  - చిత్రమైనబొమ్మలు సృష్టిస్తా. తీసుకుంటూ వెళ్తా - అనుభవాలజేబులు నింపుకుంటా, చాచుకుంటూ వెళ్తా - కరచాలనాలు ఇస్తూకదులుతా. కస్సుమంటూ వెళ్తా - దుష్టులభరతం పడతా, బుస్సుమంటూ వెళ్తా - కఠోరసత్యాలు చిమ్ముతా. వేచుకుంటూ వెళ్తా - బిక్షగాళ్ళజోలులు నింపుతా, నోచుకుంటూ వెళ్తా - దైవకృపకు పాత్రుడనవుతా. వెళ్తుంటా వెళ్తుంటా - పదాలపయనమై వెళ్తుంటా, రాస్తుంటా రాస్తుంటా - జీవనగీతాలై  రాస్తుంటా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 అక్షర జల్లులు  వాన కురిస్తే - వాగులు పారతాయి అక్షరాలు కురిస్తే - కవితలు పుడతాయి పూలు కురిస్తే - మదులు మురుస్తాయి ప్రేమ కురిస్తే - హృదయాలు పొంగుతాయి. నిప్పులు కురిస్తే - మంటలు రేగుతాయి రాళ్లు కురిస్తే - తలలు పగులుతాయి ముత్యాలు కురిస్తే - మెడలు చుట్టుకూంటాయి మణులు కురిస్తే - మూటలు ఇల్లుచేరుతాయి. మాటలు కురిస్తే - తేనెచుక్కలు చల్లబడతాయి స్వరాలు కురిస్తే - రాగసుధలు వినబడతాయి ఓట్లు కురిస్తే - విజయభేరులు మ్రోగుతాయి చెప్పులు కురిస్తే - చీత్కారాలు కనబడతాయి. తిట్లు కురిస్తే - ద్వేషజ్వాలలు రగులుతాయి డబ్బులు కురిస్తే - తన్నులాటలు జరుగుతాయి కాంతులు కురిస్తే - అంధకారాంతము అవుతుంది వెన్నెల కురిస్తే - మనసులకానందము చేకూరుతుంది.  కురిస్తే - సంతోషగీతము  కురవకపోతే - నిరాశ జనితము అతివృష్టి - అనర్ధ దాయకము అనావృష్టి - దుఃఖ కారకము. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
 🎵 పూల సంబడాలు తోటలో పూసిన పూలు – చూపుతున్నాయి  అందాలు, తలపై జారిన పూలు – ఘటిస్తున్నాయి అంజలులు. 🌸 చీరల పైన పూలు – చిమ్ముతున్నాయి రంగులు, దారిలో చల్లిన పూలు – పలుకుతున్నాయి స్వాగతాలు. 🌼 వేదికపై పూలు – చేస్తున్నాయి వేడుకలు, కొప్పుల్లో తురిమిన పూలు – చల్లుతున్నాయి మత్తులు. 🌺 కాగితంపై పూలు – కట్టేస్తున్నాయి కళ్ళు, ఊహల్లోని పూలు – ఊరిస్తున్నాయి ఉల్లాలూ. 🌹 మెడలో వేసిన పూలు – మురిపిస్తున్నాయి మనసులు, దేవుడిపాదాలదగ్గరి పూలు – చేస్తున్నాయి పాదసేవలు. 🌼 విరబూసిన పూలు – తడుతున్నాయి హృదులు, విచ్చుకున్న పూలు – ముడుతున్నాయి మదులు. 🌷 చేతికిచ్చిన పూలు – చాటుతున్నాయి ప్రేమను, సిగలో దోపిన పూలు – సూచిస్తున్నాయి ప్రణయమును. 🌸 పక్కపైని పూలు పలుకుతున్నాయి సరసాలు నలిగిపోయిన పూలు తెలుపుతున్నాయి తన్మయత్వాలు. 🌺 మొగ్గలైనా పూలు – ఇచ్చేది మురిపమే, విచ్చుకున్నా పూలు – విసిరేది వయ్యారమే. 🌹 ఎక్కడున్నా పూలు అందాలకారకమే  ఎంతచూచినా పూలు ఆనందభరితాలే. 🌺 గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 మూడు గంటలూ ముచ్చటగా జరిగిన కాలిఫోర్నియా వీక్షణం 158వ అంతర్జాల సాహితీ సమావేశం ************************************************************** నేడు 11-10-25వ తేదీ ఉద్యయం కాలిఫోర్నీయా వీక్షణం గవాక్షం నిర్వహించిన 158వ అంతర్జాల సమావేశం ఆద్యంతము ఉత్సాహభరితంగా సాగింది. మొడట వీక్షణం వ్యవస్థాపుకురాలు మరియు అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారు పాల్గొంటున్న సాహితీ ప్రియులకు, కవిమిత్రులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిధి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారిని వేదికకు పరిచయం చేసి. వారు సృష్టించిన ఏక వాక్య కవితా  ప్రక్రియ గురించి ప్రసంగించమని ఆహ్వానించారు. వాక్యం రసాత్మకం కావ్యం అని గురువు గారు చెప్పిన తర్వాత, సంస్కృత వ్యాక్యాలు కొన్ని తెలుసుకున్నాక, ఏక వాక్య కవితలు వ్రాయటం మొదలుపెట్టానని, పెక్కు కవితలు వ్రాసి, పెక్కు పుస్తకాలు ప్రచురించానని చెప్పారు. అనేక ఏకవాక్య కవితలను వినిపించి, వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వారి ప్రసంగం చాలా రసవత్తరంగా ఉందని, గీతా మాధవి గారు, ప్రఖ్యాత కవులు ఘంటా మనోహరరెడ్డి గారు, సాధనాల వేంకటస్వామినాయుడు గారు ప్రశంసించారు. ఫణీంద్ర గారు పాటవం కల పద్యకవి అని, మధుర కంఠమున్న మాటకారి అ...
 జేజేలు కొడదాం మానవత్వం మూర్తీభవించిన మహనీయులకు జేజేలు కొడదాం ప్రేమతత్వం ప్రభోధించిన పుణ్యపురుషులకు జేజేలు చెబుదాం సౌభాతృత్వం చాటినట్టీ సుజనలకు జేజేలు అందాం స్వాతంత్ర్యం సాధించినట్టి మహానాయకులకు జేజేలు పలుకుదాం సేవాతత్వం ప్రోత్సహించిన కారణజన్ములకు జేజేలు చెప్పిద్దాం సమానత్వం కోరుకున్నట్టి శ్రేయోభిలాషులకు జేజేలు అనమందాం దురాచారాలను రూపుమాపిన సంస్కర్తలకు జేజేలు అర్పించుదాం దుర్మార్గాలను ఎదిరించినట్టి మహానుభావులకు జేజేలు గుప్పించుదాం బీదసాదలకు అండగానిలిచిన సంఘహితులకు జేజేలు కొట్టించుదాం నీతినిజాయితీలకు పట్టంకట్టిన ప్రయోజకులకు జేజేలు సమర్పిద్దాం సత్కార్యాలను చేసినట్టి శ్రేష్టులకు జేజేలు అర్పించుదాం సూక్తివచనాలు చెప్పినట్టి ధర్మాత్ములకు జేజేలు కొట్టమందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 వెళ్తుంటా వెళ్తుంటా... దూసుకుంటూ వెళ్తా - దుమ్ముధూళీ  లేపుతా, దోచుకుంటూ వెళ్తా - మదులను మురిపిస్తా. కోసుకుంటూ వెళ్తా - బడాయీలు కూస్తా, మోసుకుంటూ వెళ్తా - భారాలు తలకెత్తుకుంటా. రాచుకుంటూ వెళ్తా - రాపిడిని కలిగిస్తా, త్రోసుకుంటూ వెళ్తా - పరుగురేసులో నెగ్గుతా. గుచ్చుకుంటూ వెళ్తా - సుమమాలలు అల్లుతా, పూచుకుంటూ వెళ్తా - సౌరభాలు గుప్పిస్తా. చేసుకుంటూ వెళ్తా - లక్ష్యాలను సాధిస్తా, కాచుకుంటూ వెళ్తా - పేరుప్రఖ్యాతులు పొందుతా. ఇచ్చుకుంటూ వెళ్తా - అడుక్కునేవారిని ఆదుకుంటా, గీసుకుంటూ వెళ్తా  - చిత్రమైనబొమ్మలు సృష్టిస్తా. తీసుకుంటూ వెళ్తా - అనుభవాలజేబులు నింపుకుంటా, చాచుకుంటూ వెళ్తా - కరచాలనాలు ఇస్తూకదులుతా. కస్సుమంటూ వెళ్తా - దుష్టులభరతం పడతా, బుస్సుమంటూ వెళ్తా - కఠోరసత్యాలు చిమ్ముతా. వేచుకుంటూ వెళ్తా - బిక్షగాళ్ళజోలులు నింపుతా, నోచుకుంటూ వెళ్తా - దైవకృపకు పాత్రుడనవుతా. వెళ్తుంటా వెళ్తుంటా - పదాలపయనమై వెళ్తుంటా, రాస్తుంటా రాస్తుంటా - జీవనగీతాలై  రాస్తుంటా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 అందచందాలు అందాల దృశ్యం  ఆహ్వానిస్తుంది సుందర ప్రదేశం  స్వాగతిస్తుంది పొంకాల పుష్పం  పరిమళిస్తుంది చక్కని సీతాకోకచిలుక  వన్నెలుచూపుతుంది  ముద్దుల పాపాయి  మురిపిస్తుంది కమ్మనీయ కడలి  కుతూహలపరుస్తుంది సుందర రూపం  ఆస్వాదించమంటుంది హృద్య వర్ణం  కనువిందు చేస్తుంది ఇంపైన గీతం  ఆలకించమంటుంది సొంపైన రాగం  శ్రావ్యత నింపుతుంది ఆహ్లాద వదనం  వెలిగిపోతుంది ఆకర్షణీయ దేహం  అబ్బురపరుస్తుంది సొగసలు  సయ్యాటకు రమ్మంటాయి  సొబగులు  మాధుర్యమును పంచుతాయి  సోయగాలు  మదిని కట్టేస్తాయి  శోభలు  హృదిని ముట్టేస్తాయి  సవురు  మనసుల లాగుతుంది  హరువు  తనువుల లాలిస్తుంది చెన్ను  ఉల్లాల చెలరేగిస్తుంది  టెక్కు  సంతసాల చేకూరుస్తుంది      జిలుగులు మెరుస్తూ  కళకళలాడుతాయి బెళుకులు రగులుతూ  ధగధగలాడుతాయి ఆందం  అలరిస్తుంది పులకరిస్తుంది  చందం  కదిలిస్తుంది కుదిపేస్తుంది  అందంలేని మోములు  కళావిహీనం చందంలేని చూపులు  నిష్ప్రయోజనం  సౌందర...
 డొంక దొరికితే… డొంక దొరికితే – పాకుతా సాగుతా, కిటుకు చిక్కితే – అల్లుతా, కూర్చుతా. పూలు లభిస్తే – గుచ్చుతా, కట్టుతా, పగ్గాలు చేతికొస్తే – లాగుతా, తోలుతా. ఊహలు తడితే – ఊరిస్తా, పారిస్తా., విషయము నచ్చితే – వివరిస్తా, వర్ణిస్తా. అధికారం దక్కితే – శాసిస్తా, చెలాయిస్తా, దారి కనబడితే – అడుగులేస్తా, అంతంచేరుతా. పైకి ఎత్తితే – పొంగిపోతా, పొర్లిపోతా, పొగడ్తలు గుప్పిస్తే – పరవశిస్తా. గుర్తించుకుంటా. ప్రేమిస్తే – కరిగిపోతా, దొరికిపోతా, మనసిస్తే – మచ్చికవుతా, మురిపిస్తా. కలం పడితే – కదిలిస్తా, గీస్తా, కాగితం కనబడితే– నింపుతా, వెలిగిస్తా. శ్రోతలుంటే – ఆడుతా, పాడుతా, పాఠకులుంటే – వ్రాస్తా, చదువుతా. ప్రోత్సహిస్తే – కరుగుతా, చెలరేగుతా, సత్కరిస్తే – సంతసిస్తా, సంబరపడతా. బహుమతులు ఇస్తే - మెచ్చుకుంటా, మెడెత్తుకుంటా, బిరుదులు ఒసగితే – పుచ్చుకుంటా, పరవశించుతా. శైలి నచ్చిందా - పదాలసరళి బాగుందా, అక్షరాలు అమరాయా, పదాలు పొసిగాయా. పాకం కుదిరిందా - తేనెజల్లు కురిసిందా, భావం వ్యక్తమైందా - అమృతం అందిందా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఒక్కోసారి.... ఒక్కోసారి పువ్వునైపోతా పులకరింపజేస్తా ఒక్కోమారు నవ్వునైపోతా మోమును వెలిగిస్తా ఒక్కోరోజు పరిమళమైపోతా పరిసరాల వ్యాపిస్తా ఒక్కో సమయాన అందమైపోతా అలరింపజేస్తా ఒక్కోపొద్దు తేనెనైపోతా పలుకుల్లో వెలువడుతా ఒక్కోకాలాన రంగులైనైపోతా హరివిల్లును సృష్టిస్తా ఒక్కోసందర్భాన ఆహారమైపోతా కడుపు నింపుతా ఒక్కో క్షణాన నీరైపోతా దప్పిక తీరుస్తా ఒక్కో నిమిషాన శబ్దమైపోతా శ్రావ్యత అందిస్తా ఒక్కోపూట వెలుగునైపోతా దారిని చూపిస్తా నేను కాదు రవిని నేను ఒక కవిని నేను ఇస్తా కవితలని నన్ను  గుర్తించుకుంటావా మదిలో దాచుకుంటావా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 జీవనయానంలో... పిడికిలి మూస్తున్నా– రహస్యాలు దాచటం కోసం. నెత్తిన కప్పుకుంటున్నా – ఆశలు సజీవంగానిలుపటం కోసం. మాటలు విసురుతున్నా – భావాలు వ్యక్తపరచటం కోసం. తలను గీసుకుంటున్నా – ఆలోచనలు పారించటం కోసం. భుజాలు వంచుతున్నా – బాధ్యతలు భరించటం కోసం. బతుకుబండిని ఈడుస్తున్నా – జీవితచక్రాలను దొర్లించటం కోసం. చేతులను శ్రమపెడుతున్నా – ఫలాలు పొందటం కోసం. కాళ్లు కదుపుతున్నా – గమ్యాలను చేరటం కోసం. ఎత్తుకు ఎగురుతున్నా – ఆకాశం అందుకోవటం కోసం. మనసు విప్పుతున్నా – ప్రేమను పంచుకోవటం కోసం. నాకు అండగా నిలుస్తారా? నా పయనానికి సహకరిస్తారా? నన్ను ప్రోత్సహిస్తారా? నాగుండెల్లో వెలుగులు నింపుతారా? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా కలం నా కలం – నా గళం, నా బలం – నా ప్రాణం. నా కలం – నా హలం, నా పరికరం – నా ఆయుధం. నా కలం – నా అక్షరం, నా పదం – నా ఆయుధం. నా కలం – నా కుంచె, నా సుత్తి – నా సమ్మెట. నా కలం – నా వరం, నా ఫలం – నా రూపం. నా కలం – నా పద్యం, నా గీతం – నా కవిత్వం. నా కలం – నా హృదయం, నా కరదీపం – నా ప్రకాశం. నా కలం – నా అందం, నా ఆనందం – నా అంతరంగం. నా కలం – నా పుష్పం, నా పరిమళం – నా పరవశం. నా కలం – నా దర్పణం, నా ప్రతిబింబం – నా మనోఫలకం. నా కలం – నా చిత్రం, నా శిల్పం – నా ప్రతిరూపం. నేనే కలము – కలమే నేను, నాకలందే శైలి – శైలిదే నాకలం. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఆమె నా ఊహల్లో ప్రవాహమై, నా శిరస్సులో వెలుగై, నా దేహంలో అధిష్టానమై – ఆమే నా జీవనగీతం. నా కంటిలోని పొంకమై, నా నాసికలో పరిమళమై, నా పెదవుల్లో పీయూషమై – ఆమే నా సౌందర్యస్వరూపం. నాకు కోకిల కంఠమై, నాకు గాంధర్వ గానమై, నాకు నెమలి నృత్యమై – ఆమే నా మానసికవినోదం. నాకు చక్కని నీలాకాశమై, నాకు చల్లని కడలికెరటమై,  నాకు తెల్లని సూర్యోదయమై - ఆమే నా చిక్కని భావతరంగం.  నా అందాల కుటీరమై,  నా ఆనంద కుటుంబమై,  నా శాశ్వత విలాసమై - ఆమే నా మాటల సమాహారము. ఆమె నా వంటికి భోగమై,  ఆమె నా చేతికి భాగ్యమై,  ఆమె నా నోటికి భోజ్యమై - ఆమే నా బ్రతుకుకి బలము. నాకు ఎర్రని మందారమై,  నాకు తియ్యని మకరందమై,  నాకు చంచల మానసమై - ఆమే నా రసాత్మక కావ్యము. నా ఆలోచనల సరళిగా, నా భావాల తరంగిణిగా, నా పదాల ప్రవహాముగా – ఆమే నా అక్షరాలరూపం. ఆమె కలము పట్టిస్తుంది, ఆమె కవనం చేయిస్తుంది, ఆమె పుటలు నింపిస్తుంది - ఆమే మదులు దోచేస్తున్నది. ఆమె వెలుగులు చిమ్ముతుంది, ఆమె ప్రేమజల్లులు కురిపిస్తుంది , ఆమె రాగాలు తీయిస్తుంది – ఆమే ముందుకు నడిపిస్తుంది. ఆమె నా జీవిత ధ్యేయము, ఆమె నా జీవన పయనము, ఆమె నా నిత్య ప్రేర...
 నన్ను తీసేయకు... ఏదో ఒకరోజున ఙ్ఞాపకమై వస్తా పాతక్షణాలు నెమరేయిస్తా కొత్త ఆశలు రేకెత్తిస్తా ఏదో ఒకరోజున కలలోకి వస్తా కవ్వించుతా కుతూహలపరుస్తా ఏదో ఒకరోజున మేనుతడతా మేలుకొలుపుతా మేలుచేస్తా ఏదో ఒకరోజున మంచిమాటలు చెబుతా నమ్మకము కలిగిస్తా మదిలో నిలిచిపోతా ఏదో ఒకరోజున చెంతకు వస్తా చెలిమి చేస్తా చేతులు కలుపుతా ఏదో ఒకరోజున అవకాశం ఇస్తా అదృష్టం వరింపజేస్తా అందలం ఎక్కిస్తా ఏదో ఒకరోజున ఆటలు ఆడిస్తా పాటలు పాడిస్తా నాట్యము చేయిస్తా ఏదో ఒకరోజున చిరునవ్వులు చిందిస్తా మోమును వెలిగించుతా హృదిని ఆకట్టుకుంటా ఏదో ఒకరోజున పూలు చేతికిస్తా పరిమళాలు చల్లుతా ప్రేమను పంచుతా ఏదో ఒకరోజున అక్షింతలు వేస్తా దీవెనలు అందిస్తా శుభాలు సమకూరుస్తా నన్ను తీసేయకు నీళ్ళలో తోయకు మంటల్లో వేయకు గాలిలో విసరకు నన్ను దాచుకో నన్ను చూచుకో నన్ను కాచుకో నన్ను దోచుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం