బావా ఓబావా! (ప్రేమగీతం) రమ్మంటావా బావా పొమ్మంటావా బావా దగ్గరకు రమ్మంటావా బావా దూరంగా పొమ్మంటావా బావా||రమ్మ|| సయ్యంటావా బావా నయ్యంటావా బావా పెళ్ళికి సయ్యంటావా చెలిమికి నయ్యంటావా ఒప్పుకుంటావా బావా తప్పుకుంటావా బావా వలపుకు ఒప్పుకుంటావా బరువుకు తప్పుకుంటావా పెంచుకుందామా బావా తెంచుకుందామా బావా ప్రేమను పెంచుకుందామా బంధము తెంచుకుందామా ఆడుకుందామా బావా పాడుకుందామా బావా ఆటలు ఆడుకుందామా పాటలు పాడుకుందామా తోటకెళ్దామా బావా చాటుకెళ్దామా బావా మల్లెపూల తోటకెళ్దామా పూలచెట్టు చాటుకెళ్దామా చూపమంటావా బావా ఇవ్వమంటావా బావా అందము చూపమంటావా ఆనందం ఇవ్వమంటావా మాటలొద్దురా బావా చేతలుచూపరా బావా వట్టిమాటలు వద్దురా గట్టిచేతలు చూపరా ||రమ్మ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం గప్ చుప్ సంబారు బుడ్డీ నోటిమీద వేలేసుకోండి వేళాపాళలేదు కళ్ళురెండుమూసుకోండి పాటను చదవండి మీరే పాడుకోండి ఆనందం పొందండి మీరూ మురిపించండి
Posts
Showing posts from July, 2022
- Get link
- X
- Other Apps
నాపెళ్ళాల కధాకమామిషు నాకు ఇద్దరు భార్యలు మొదటిభార్య వినయవతి రెండోభార్య మనోవల్లరి పెద్దభార్య రూపవతి రెండోభార్య అతిరూపవతి మొదటిసతికి ఇద్దరు పిల్లలు రెండోసతికి లేరు పిల్లలు మొదటిపెళ్ళాంతో రోజూ రెండుగంటలు గడుపుతా రెండోపెళ్ళాంతో రోజూ పదిగంటలు గడుపుతా మొదటిభార్య అన్నపానీయాలు సమకూరుస్తుంది రెండోభార్య విషయాలు సమకూరుస్తుంది ప్రధమభార్య బాగోగులు చూచుకుంటుంది రెండొభార్య కవ్వించి కలంపట్టిస్తుంది ఒకటోపెళ్ళాం కళ్ళముందుంటుంది ద్వితీయపెళ్ళాం కలలోకొస్తుంది ఒకరు శాంతపరుస్తారు మరొకరు రెచ్చకొడతారు మొదటిపెళ్ళి పెద్దలుచేశారు రెండోపెళ్ళి ఇద్దరంఇష్టపడి చేసుకున్నాం మొదటిభార్య సరస్వతి రూపవతి గుణవతి రెండొభార్య కవిత స్ఫురిత జ్వలిత నావయసు డెబ్భయి సరసావయసు అరవయి కవితావయసు ఇరవయి అర్ధమయినదనుకుంటా సరస సేవకురాలు కవిత కల్పితరాలు ఒకప్పుడు మొదటిభార్య ఇష్టం ఇప్పుడు రెండోభార్యే ఇష్టం ఒకరు ఆనందమిస్తున్నారు మరొకరు అమృతమిస్తున్నారు మొదటిభార్య లేకపోతే జీవితమే లేదు రెండొభార్య లేకపోతే కవితలే లేవు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మల్లీ మాఊరిమల్లీ! (ప్రేమగీతం) మల్లీ మాఊరిమల్లీ మాటలూ చెప్పింది మనసునూ దోచింది మల్లీ మాఊరిమల్లీ ||మల్లీ|| మాపుటేళకు రమ్మంది మల్లేపూలను తెమ్మంది మాటుచోటుకు రమ్మంది ముచ్చటగతయారయి రమ్మంది ||మల్లీ|| ముచ్చటలు చెప్పింది ముద్దులును ఇచ్చింది మనసార నవ్వింది మురిపెమూ చేసింది ||మల్లీ|| మరుసటిరోజున రమ్మంది మంచిచీరెను తెమ్మంది మొహమాట మొద్దంది మోసమూ చెయ్యొద్దంది ||మల్లీ|| మురిసిపోదామంది మెరిసిపోదామంది మాటివ్వమంది మరచిపోవద్దంది ||మల్లీ|| మూతిముడవద్దంది మౌనమూదాల్చొద్దంది ముక్కుమీదకోపమొద్దంది మాటిమాటికి అలగొద్దంది ||మల్లీ|| మమతను చాటింది మోహినీ అయ్యింది మాత్సర్యమొద్దంది మిడిసిపాటొద్దంది ||మల్లీ|| మాఘమాసమొచ్చిందంది మనుమాడదామంది ముహూర్తమును పెట్టించమంది మెడవంచుతా తాళికట్టామంది ||మల్లీ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఆకవి అదృష్టం అదిగో అటుచూడండి ఎవరో గుంపుగా వెళుతున్నారు ఎందుకో ఆదుర్దాపడిపోతున్నారు ఏదో అత్యవసరపనిమీద వెళ్తున్నారు చీమల దండులా వరుసక్రమంలో వెళుతున్నారు జింక పిల్లలులా పరుగెత్తుకుంటూ పోతున్నారు అందముగా ఉన్నారు వెలిగిపోతున్నారు ఆకర్షిస్తున్నారు అబ్బురపరుస్తున్నారు అనుమానం దేనికి అడుగుతా అసలు విషయం తెలుసుకుంటా ఆగండి ఆగండి ఏవరు మీరు ఎక్కడకు వెళుతున్నారు ఏపనిమీద పోతున్నారు ఆగకుండా ఆలశ్యంచేయకుండా సమాధానమిస్తూనే సాగిపోయారు ఆపకండి ఆపకండి అక్షరాలము మేము ఆకవిదగ్గరకు వెళుతున్నాము అమ్మభారతీదేవి ఆఙ్ఞపై పోతున్నాము కవిగారు పిలిచినట్లున్నారు కలం పట్టుకున్నట్లున్నారు కవనం చేస్తున్నట్లున్నారు కవితలు వ్రాస్తున్నట్లున్నారు ఆ కవిని చూడవలె ఆ కవితను చదవవలె అందరితో పంచుకొనవలె ఆనందంలో తేలిపోవలె ఆకవిపై అమ్మవారికి అంతవాత్సల్యం ఎందుకో అక్షరాలకు ఆకవినిచేరాలని అంతతొందర ఎందుకో ఓరి పిచ్చోడా తెలుసుకోరా ఆకవికి ఆవేశమొచ్చింది అమ్మశారదాదేవికి అనురాగంపుట్టింది అక్షరాలతో అవసరంపడింది ఆకవిగారు అదృష్టవంతుడు సరస్వతీపుత్రుడు సాహితీప్రియుడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా సాహితి నాకై పువ్వై నవ్వై వచ్చె నాసాహితి నాకై తేనై తీపై మాటలయ్యె నాసాహితి నాకై గాలై గంధమై వీచె నాసాహితి నాకై వెలుగై తోడై దారిచూపె నాసాహితి నాకై కోకిలై గానమై వినిపించె నాసాహితి నాకై నెమలై నాట్యమై మురిపించె నాసాహితి నాకై అప్సరసై అందమై ఆనందమిచ్చె నాసాహితి నాకై ప్రేయసై ప్రియమై పరవశపరచె నాసాహితి నాకై అక్షరాలై పదాలై కవితలయ్యె నాసాహితి నాకై ఊహలై భావాలై కమ్మనికైతలయ్యె నాసాహితి సాహితి నా కాంతి సాహితి నా శాంతి సాహితి నా స్ఫూర్తి సాహితి నా సంపత్తి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
విస్సన్న వేదం (అప్పటి ఇప్పటి పెళ్ళిల్లు) అప్పుడు అంటే అనగనగా అనే అమ్మానాన్నలు పెళ్ళిచేసుకున్న ఆ రోజులు మరి ఇప్పుడంటే మనుమల్లు మనుమరాల్లు మనువు ఈడుకొచ్చి మసలుతున్న ఈరోజులు ఒకప్పుడు పెళ్ళిల్లుకాక ఆడపిల్లలు శాశ్వతకుమారీలుగా మిగిలిపోయేవారు ఇప్పుడు పెళ్ళిల్లుకాక మగపిల్లలు ముదిరిన బెండకాయలవుతున్నారు ఒకప్పుడు మొలతాడుంటే చాలు మగపిల్లలకు పెళ్ళిల్లు జరిగేవి మరిప్పుడు ఆస్తులున్నా ఉద్యాగాలున్నా అందంగానున్నా మగవాళ్ళకు పెళ్ళిల్లు సులభంగా జరగటంలేదు అప్పుడు ఆడపిల్లలు పెళ్ళిచూపులంటే తలవంచుకునేవారు సిగ్గుపడేవారు ఇప్పుడు పెళ్ళంటే మగపిల్లలు మొహమాటపడుతున్నారు అడుగులు వెనుకకేస్తున్నారు అప్పుడు ప్రతి ఊరిలో పెళ్ళిల్లపేరయ్యలు ఉండేవారు పెద్దలతో మాట్లాడి పెళ్ళిల్లుచేసేవారు ఇప్పుడు చదువుకునేరోజులలో చనువులు ఉద్యోగంచేసేరోజులలో ప్రేమలు పెళ్ళిసంబంధసంస్థల ప్రమేయపెళ్ళిల్లు జరుగుతున్నాయి ఒకప్పుడు జాతకాలు కుదిరితేనే పెళ్ళిల్లు జరిగేవి ఇప్పుడు జాతకాలు పట్టించుకోకుండానే పెళ్ళిల్లు జరుగుతున్నాయి ఒకప్పుడు బంధువులతోనే ఈడుజోడు చూచి పెళ్ళిల్లు చేసేవారు ఇప్పుడు మేనరికాలు చుట్టాలు మధ్య పెళ్ళిల్లు చేయటంలేదు ...
- Get link
- X
- Other Apps
కవితావిందుకు స్వాగతం గాలివీచినట్లు ఏరుపారినట్లు ఊహలూరినట్లు కవితలు కదులుచున్నాయి మిఠాయి తినినట్లు మంచిమాట వినినట్లు తేనెను నాకినట్లు కవితలు తీపిగానున్నాయి నిండుజాబిలి ఉన్నట్లు విరబూచినచెట్టు ఉన్నట్లు ముస్తాబయిన పెళ్ళికూతురున్నట్లు కవితలు సొగసుగానున్నాయి ముత్యాలను సరముగా గుచ్చినట్లు మల్లెలను మాలగా అల్లినట్లు దీపాలను వరుసలో పెట్టినట్లు కవితలో అక్షరాలు కుదిరిపోయాయి అరుణోదయ కిరణంలా చల్లని వెన్నెలవెలుగులా తారల తళుకుబెళుకులా కవితలు మెరిసిపోతున్నాయి విషయాలను వర్ణించి కళ్ళకు చూపించి పెదవులను కదిలించి కవితలు మనసులను తట్టుచున్నాయి గాలిలో ఎగిరినట్లు మబ్బుల్లో తిరిగినట్లు కమ్మని కలకన్నట్లు కవితలు భావనకలిగిస్తున్నాయి పద్యాలపసందు పాటలవిందు వచనకవితలవడ్డింపు కలసి కవితలుగుబాళిస్తున్నాయి కవితాకన్యక కవ్వించి సాహితి సహకరించి శారదదేవి కరుణించి కవితలు కళ్ళముందుకొస్తున్నాయి కవితలను అందుకోండి మనసుపెట్టి చదవండి ఆస్వాదించి అర్ధంచేసుకోండి మనసులను మురిపించండి కవితలవిందుకు కదిలిరండి కడుపునిండా ఆరగించండి కమ్మగా ఆస్వాదించండి కవులను మనసులతలచండి నచ్చితే మెచ్చుకోండి నచ్చకపోతే విమర్శించండి గుండ్లపల్లి ర...
- Get link
- X
- Other Apps
ఆపువ్వు ఆపువ్వు నవ్వుతుంది నన్ను ఆకర్షిస్తుంది ఆపువ్వు పలుకరిస్తుంది నన్ను పరవశింపజేస్తుంది ఆపువ్వు పిలుస్తుంది నాతోడును కోరుకుంటుంది ఆపువ్వు సుగంధం చల్లుతుంది నన్ను సంతోషపరుస్తుంది ఆపువ్వు వెలుగులు చిమ్ముతుంది నన్ను చూడమంటుంది ఆపువ్వు రంగులు అద్దుకుంది నన్ను మురిపిస్తుంది ఆపువ్వు గాలికి ఊగుతుంది నామనసును ఊయలలా ఊపుతుంది ఆపువ్వు అందంగా ఉన్నది నాకళ్ళను కట్టిపడవేస్తుంది ఆపువ్వు నన్ను ప్రేమిస్తుంది నాకు బాగా నచ్చింది ఆపువ్వే నా ప్రాణం ఆపువ్వే నా లోకం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఆడవాళ్ళు ఎవరన్నారు ఆడవాళ్ళను అవమానిస్తున్నారని వారు ఉత్తమసగాలు ఎవరన్నారు ఆడవాళ్ళను అనుమానిస్తున్నారని వాళ్ళు నిజాయితీపరులు ఎవరన్నారు ఆడవాళ్ళను అగౌరవపరుస్తున్నారని వారు సంస్కారవంతులు ఎవరన్నారు ఆడవాళ్ళను అమాయకులని వారు బహుమేధావులు ఎవరన్నారు ఆడవాళ్ళకు ఆర్ధికస్వాతంత్రంలేదని వారు ఇళ్ళకు ఆర్ధికమంత్రులు ఎవరన్నారు ఆడవాళ్ళకు అవకాశాలులేవని వాళ్ళు అన్నింటిలోముందున్నారు వినలేదా ఆడవాళ్ళు ముందని అది మర్యాదకాదా వినలేదా ఆడవాళ్ళకు జోహార్లని అది గొప్పతనంకాదా వినలేదా ఆడవాళ్ళు ఇళ్ళకు దీపాలని అది ఘనతకాదా వినలేదా ఆడవాళ్ళు మన ఇంటిమహలక్ష్ములని అది మంచిమాటకాదా వినలేదా ఆడవాళ్ళు మన ఇంటిదేవతలని అది వారికిచ్చినమర్యాదకాదా వినలేదా ఆడవాళ్ళు ఆలోచనాపరులని అది వారికిప్రతిష్ఠకాదా ఆడవాళ్ళు అన్ని ఉద్యోగాలలో ఉన్నారుకదా ఆడవాళ్ళు అన్నిటా సగభాగం అన్నారుకదా అందుకే ఆడవాళ్ళు మీకుజోహార్లు అంటాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా రుబాయీలు ఆలోచిస్తే అద్భుతాలను సృష్టించగలవు కష్టపడితే అసాధ్యాలను సాధించగలవు మనసులో జీవితలక్ష్యాలను పెట్టుకో ప్రయత్నిస్తే ఆశయాలను అందుకోగలవు పువ్వునుచూస్తే ప్రేమ పుట్టుకొస్తుంది నవ్వునుచూస్తే మోము వెలిగిపోతుంది కొన్నివిషయాలు కొన్నిటిని ఉసిగొల్పుతాయి చెలినిచూస్తే మనసు ఉప్పొంగిపోతుంది ఎండలో తిరగాలని ఎవరికుంటుంది వానలో తడవాలని ఎవరికుంటుంది అందరు దుఃఖాలను దూరంపెడతారు కష్టాల్లో పడాలని ఎవరికుంటుంది కర్రతో కొడితే దెబ్బతగులుతుంది కత్తితో పొడిస్తే గాయమవుతుంది ఆయుధాలున్నాయని ఉపయోగించకు మాటలతో తిడితే మదినొచ్చుకుంటుంది చీమ చిటుక్కుమంటే పట్టేస్తాయి చెవులు దోమ కుట్టిందంటే కదులుతాయి చేతులు దేవుడు మానవులకు తెలివిని ఇచ్చాడు భ్రమ కలిగిందంటే చలిస్తాయి మదులు కన్నుపడితే కోర్కె కలుగుతుంది మనసుపడితే ప్రేమ జనిస్తుంది ఆలోచనలు లేస్తే ఆగవు చూపులుకలిస్తే చెలిమి పుడుతుంది తేగలిగితే జాబిలిని పట్టుకురా లేకపోతే పువ్వులను తీసుకురా మనసును మురిపించాలనుకుంటే చల్లని చిరుగాలిని తోలుకురా పుట్టటం ఎవరికి తెలుస్తుంది గిట్టటం ఎవరికి తెలుస్తుంది అవి విధియాడే నాటకాలు పెరగటమే నీకు తెలుస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ...
- Get link
- X
- Other Apps
కవికిరణాలు కవుల కలాలు జనుల గళాలు కవుల కవితలు బాషకు వెలుగులు కవుల కవనము జాతికి మేలుకొలుపు కవుల ప్రబోధము జనులకు చైతన్యము కవుల కనుమరుగు జగతికి అఙ్ఞానంధకారము కవుల మనసులు జనుల ప్రతిబింబాలు కవుల చేతులు ప్రజల పనిముట్లు కవుల అక్షరాలు రవి కిరణాలు కవుల పఠనాలు కోకిలల గానాలు కవుల పంట దేశ సంపద కవులను ప్రోత్సహించండి జాతిని జాగృతంచేయండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పువ్వుపువ్వు పువ్వుపువ్వు చూపేను సుందరరూపాలు చక్కనివర్ణాలు పువ్వుపువ్వు మీటేను మమతలను మనసులను పువ్వుపువ్వు కట్టేసేను కళ్ళను కాళ్ళను పువ్వుపువ్వు ఇచ్చేను సంతసాలను సౌందర్యాలను పువ్వుపువ్వు వీచేను చందనపరిమళాలు వసంతవీచికలు పువ్వుపువ్వు చిందేను తేనెచుక్కలు చిరునవ్వులు పువ్వుపువ్వు చెప్పేను ప్రీతిపలుకులు ముద్దుముచ్చటలు పువ్వుపువ్వు పలికేను కోకిలగానం సన్నాయిరాగం పువ్వుపువ్వు మయిమరిపించేను మురిపించేను మెరిపించేను పువ్వుపువ్వు విచిత్రము విలక్షణము విన్నూతనము పువ్వుపువ్వును చూడు ఆనందాలను పొందు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలదీవి నిన్నరాత్రి నిదురించేవేళ నానారకాలపూలు నాపడకచుట్టూచేరి నాట్యమాడాయి మేనుతట్టి మేలుకొలిపి మొరపెట్టి మాటతీసుకొని మరలిపోయాయి పర్యావరణాన్ని పాడుచేస్తున్నారని ప్రాణాలతో ప్రజలమధ్య బ్రతకలేమని బావురుమని విలపించాయి కోమలాంగులు కళ్ళారాచూచి కుతూహలపడక కుట్టుతున్నారు సూదులతో కడుతున్నారు దారాలతోనన్నాయి ప్రేమికులు పూలుపెట్టుకున్న పడతులను ప్రోత్సహిస్తున్నారు పరికించి పరవశించిపోతున్నారు రెక్కలు విరిచి నీటిలో ఉడికించి అత్తరులను సీసాలనింపి అమ్ముకుంటున్నారు పైనచల్లుకుంటున్నారు వాడి రాలిపోగానే చీపుర్లతో చిమ్మి కాళ్ళతో తొక్కి చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు దయచూపి దేశాన్ని దాటించి దీవిలోనికితీసుకెళ్ళి నాటి ధన్యులనుచెయ్యమన్నాయి మాటతీసుకొనివెళ్ళాయి పూల కోరికమేరకు చెట్లను పెకిలించి విత్తనాలను సేకరించి పూలదీవికితీసుకెళ్ళి పాదుల్లోపాతాను పాకుతున్న పూలతీగలను పీకేసి పూలదీవిలో బారులుగానాటాను పగలనక రేయనక పొద్దుననక సాయంత్రమనక పూలతోనే పూర్తిగాగడిపా పుష్కలంగా పువ్వులనుపూయించాను ఎవరూ తాకకుండా ఎవరూ తెంచకుండా ఏతుమ్మెదలు వాలకుండా ఏపుగా చెట్లనుతీగలనుపెంచాను పూలదీవికి పేరుప్రఖ్యాతులుతెచ్చా ప్రపంచంలో...
- Get link
- X
- Other Apps
నాహృదయం నా మనసు పూలకు తెలుసో లేదో కాని ప్రతి ఆకుకు తీగకు తెలుసు తోటకంతా తెలుసు నా ప్రేమ ప్రేయసికి తెలుసో లేదో కాని ముందువెనుకప్రక్కన ఉన్నవారందరికి తెలుసు ఊరంతా తెలుసు నా ఆలోచనలు మనసుకు తెలుసో లేదో కాని అందానికి ఆనందానికి తెలుసు సందేశాలకు సర్వంతెలుసు నా గానం కోకిలలకు తెలుసో లేదో కాని స్నేహితులకు శ్రోతలకు తెలుసు సరస్వతీపుత్రులందరికి తెలుసు నా పేరు మీకు తెలుసో లేదో కాని నన్ను చూచినవారికి విన్నవారికి తెలుసు నన్ను తెలుసుకున్నవారందరికి తెలుసు నా కష్టం కవితలకు తెలుసో లేదో కాని అక్షరాలకు పదాలకు తెలుసు భావాలకు పూర్తిగా తెలుసు నా కూర్పులు శ్రావ్యతకు తెలుసో లేదో కాని ఆదిప్రాసలకు అంత్యప్రాసలకు తెలుసు పదప్రయోగాలకి తెలుసు నా వ్రాతలు కలానికి తెలుసో లేదో కాని చేతికి మనసుకి తెలుసు వంటికంతా తెలుసు నా కవితలు కల్పనకు తెలుసో లేదో కాని ముఖపుస్తక వాట్సప్పు సభ్యులకు తెలుసు సాహిత్యలోకానికి తెలుసు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలుతేరా చెలికాడా! తాజాతాజా పూలను తోటకువెళ్ళి తెంచుకొని తేరా చెలికాడా.... తేటులు తాకని కన్యపూలను దుమ్ముధూళిసోకని పూలనుతేరా చెలికాడా.... తలలోన పూలను తురుమురా తేటతెల్లముగా నీప్రేమను తెలుపురా చెలికాడా.... కొప్పులోన కుసుమాల మాలనుగుచ్చి కోమలి అందాలను కాంచరా చెలికాడా.... తెల్లవారిందిరా తోటనుండి పూలనుతెచ్చి ఇవ్వరా చెలికాడా.... తెల్లను మల్లెలు తేరా చెలికాడా వసంతమాసం వచ్చిందిరా చెలికాడా... ప్రేమించి పూలిచ్చి తుంటరిపనులకు పాల్పడుకురా చిలిపిచేష్టల చెలికాడా.... నువ్వే నేనై నేనే నువ్వై ఒకరికి ఒకరై ఇద్దరంఒకటై పోదామురా చెలికాడా.... తలపులలో మునిగి తనువులను కలిపి గాలిలోన తేలిపోయి గగనంలో విహరిద్దామురా చెలికాడా.... పూవుకు తావిలా తావికి పూవులా ఒకటై పోదామురా రారా చెలికాడా.... తక్షణమే రారా తాత్సారం చేయకురా తరుణమిదేరా తప్పకరారా చెలికాడా.... తరుణిమనసును తెలుసుకోరా తరుణిచేతిని చేపట్టరా చెలికాడా.... గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలపాఠాలు పువ్వులకు కులుకులెక్కువ జీవితాంతము నవ్వుతూ గడుపమంటవి పువ్వులకు వగలు ఎక్కువ అందాన్నిచూపి ఆనందాన్ని ఇవ్వమంటవి పువ్వులకు పలుకులెక్కువ పిలిస్తే ప్రీతిగా పలుకరిస్తవి పువ్వులకు సుకుమారమెక్కువ పట్టుకుంటే కందిపోతవి పువ్వులకు బింకమెక్కువ భయపెడితే వణికిపోతవి పువ్వులకు మమకారమెక్కువ ప్రేమిస్తే ప్రాణమిస్తవి పువ్వులకు ప్రేమ ఎక్కువ ప్రణయమే జీవితమంటవి పువ్వులకు పరిమళమెక్కువ ప్రక్కనున్నవారిని పులకరిస్తవి పువ్వులకు ప్రకాశమెక్కువ పలురంగులలో ప్రజ్వరిల్లుతుంటవి పువ్వులకు బిడియమెక్కువ సిగ్గులతో సంబరపరుస్తవి పువ్వులకు ఆకర్షణ ఎక్కువ ఆయస్కాంతంలా అందరిని ఆకట్టుకుంటవి పువ్వులకు పడతులపై ఇష్టమెక్కువ కోమలాంగుల కొప్పులజేరి కుతూహలపరుస్తవి పువ్వులకు భక్తి ఎక్కువ పరమాత్మునిపాదాలుచేరి పూజించి పరవశిస్తవి పువ్వులకు కవులపై మక్కువ ఎక్కువ పూలకవితలు వ్రాస్తే పొగడ్తలకు పొంగిపోతవి పువ్వులకు అభివందనాలు పూలప్రేరణకు బహుధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవరో ఎందుకో? తూర్పున ఎవరో రోజూదీపాన్ని వెలిగిస్తున్నారు కాలచక్రాన్ని ఎందుకో ముందుకు కదిలిస్తున్నారు చెట్లకు ఎవ్వరో మొగ్గలు తొడుగుతున్నారు రంగులు ఎందుకో అందంగా అద్దుతున్నారు తల్లులను ఏలనో పిల్లలను కనమంటున్నారు లోకానికి ఎందుకో కొత్తదనాన్ని చూపిస్తున్నారు ఆకాశానికి ఎవరో నీలిరంగు పులుముతున్నారు మబ్బులమధ్య ఎందుకో కాంతిబింబాన్ని తిప్పుతున్నారు నింగిలో ఎవరో మేఘాలను కరిగిస్తున్నారు నేలపై ఎందుకో వానలు కురిపిసున్నారు అందకత్తెలను ఎవరో అవనిలో సృష్టిస్తున్నారు లోకాన్ని ఎందుకో ఆనందమయం చేస్తున్నారు పుటలపై ఎవరో అక్షరాలు నింపుతున్నారు మనసులను ఎందుకో కవనాలతో ముచ్చటపరుస్తున్నారు సృష్టించిన వానికి శతకోటి వందనాలు సృష్టించబడిన వాటికి సహస్ర ధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
వ్రాస్తున్నా చూస్తున్నా! ఉషోదయ కిరణాలను వడిసిపట్టుకొని వచనకవితలకు రంగరించి వండివడ్డించాలని చూస్తున్నా పున్నమి వెన్నెలను పట్టుకొని పాత్రలనిండాతెచ్చి ప్రణయకవితలపై పులిమి పాఠకులకుచేర్చాలని చూస్తున్నా మల్లేపూల పరిమళాలను తోటనుండి తీసుకొచ్చి మాటల మూటలపై అక్షరతోరణాలపై చల్లాలనిచూస్తున్నా అడవికెళ్ళి పుట్టతేనెను సేకరించి ఇంటికితెచ్చి అచ్చతెనుగు కవితలపై అద్ది అందరికి అందించాలనిచూస్తున్నా చెలి చిరునవ్వులను చేతిలోనికి తీసుకొని చక్కనికవితలపై చేర్చి చిరుదివ్వెలుగా వెలిగించాలనిచూస్తున్నా పెక్కుకవితలను వ్రాసి పలువురికి అందించి ఫేసుబుక్కుసభ్యుల మనసులను తట్టాలని చూస్తున్నా శారదాదేవి కరుణకటాక్షాలతో కమ్మని కవితలపంటను పండించాలని చూస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
చెలిప్రేమ (సల్లాపము(గజల్)) పూలుతెచ్చి చెలియమీద చల్లాలని నాకున్నది చెలిమోమున చిరునవ్వులు చూడాలని నాకున్నది అందాలను అన్నింటిని తేరపార కనులజూచి ముద్దూమురిపాలతోడ మురియాలని నాకున్నది చెలినిపిలిచి చేతిలోకి తీసుకోని చంపనిమిరి సరససల్లాపములలో ముంచాలని నాకున్నది మల్లెపూల తోటలోన ముచ్చటలను చెప్పుకొనుచు చందమామ వెన్నెలలో తిరగాలని నాకున్నది నింగిలోన తేలియాడు మేఘాలను పారజూచి తళతళమను తారకలను ఎంచాలని నాకున్నది మల్లెపూలు కోసకొచ్చి ముచ్చటగా మాలనల్లి సుందరాంగి కొప్పులోన తురమాలని నాకున్నది అచ్చతెనుగు పదములందు కవిరాజుగ కవితవ్రాసి శ్రావ్యమయిన పాటనొకటి పాడాలని నాకున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితాప్రవాహం గాలి వీచినట్లు సుగంధాలు వ్యాపించినట్లు ఆలోచనలు పారుతున్నాయి నది ప్రవహించినట్లు నీరు పరుగెత్తినట్లు భావాలు పొంగిపొర్లుతున్నాయి కిరణాలు ప్రసరిసంచినట్లు చీకటి పారిపోయినట్లు మనసు చలిస్తుంది పూలు అల్లినట్లు పూసలు గుచ్చినట్లు అక్షరాలు అమరుతున్నాయి చీమలు బారులుతీరినట్లు పక్షులు కలసి ఎగిరినట్లు పదాలు వరుసకడుతున్నాయి విషయాలు తట్టి పంక్తులు ఏర్పడి కవితలు పుడుతున్నాయి అందాలు కనిపించి కనువిందులు చేసి ఆనందాలు కలిగిస్తున్నాయి కలాలు పరుగెత్తి కాగితాలు నింపి కవనం కొనసాగుతుంది కవితాకన్యక కవ్వించి శారదాదేవి కరుణించి సాహిత్యం వెలువడుతుంది అక్షరసేద్యం కొనసాగిస్తా కవితలపంటను పండిస్తా సాహిత్యాన్ని సుభిక్షంచేస్తా హయగ్రీవునికి హారతులు వాగ్దేవికి వందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అలిగినవేళనే చూడాలి అలిగినవేళనే చూడాలి రోజాపూల అందాలను ఎరుపెక్కిన బుగ్గలను మూతిబిగించినవేళనే చూడాలి మందారాల కోపతాపాలను ముకుళించిన నేత్రాలను తలవంచినవేళనే చూడాలి తల్లడిల్లే మల్లెపూలను తనివితీరని తాపత్రయాలను మోముప్రక్కకుతిప్పినవేళనే చూడాలి సన్నజాజుల ఎడమొహాన్నిపెడముఖాన్ని చిన్నబోయిన చిరువదనాన్ని కలతచెందినవేళనే చూడాలి కలువపూల కష్టాలను కుమిలిన కోమలహృదయాలను కస్సుబుస్సులాడుతున్నవేళనే చూడాలి తామరపూల తాపాలను తన్మయపరచే అందచందాలను దూషణలకు దిగినవేళనే చూడాలి సంపంగుల కోపావేశాలను చెంతకుతీసుకొనిలాలించి చెప్పాలిముచ్చట్లను కొరకొరలాడుతున్నప్పుడే చూడాలి కనకాంబరాల విషాయింపులను కుతూహలపరచి తీర్చాలికోర్కెలను అలకపానుపునెక్కినవేళనే చూడాలి చామంతుల చక్కదనాలను పెంకి పెదవివిరుపులను బుంగమూతిపెట్టినవేళనే చూడాలి బంతిపూల భావప్రకటనలను బ్రతిమలాడి బుజ్జగించేసన్నివేశాలను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం పూలు ఎందుకో రెండు రోజులనుండి అలిగాయి. బహుశా పూలకవితలను వ్రాయలేదనేమో. ఆ భావమునుండి పుట్టినదే ఈకవిత. ఇక్కడ పువ్వులు అంటే పూబోడులుగా అనువయించుకొని మరోకోణంలోనూ చూడాలని విఙ్ఞప్తి.
- Get link
- X
- Other Apps
అన్నీ నీవిరా! అంతా నీదే అన్నీ నీవే అందరు నీవారే అన్నీ నీకేలే వడివడి అడుగులు వేయరా వచ్చే కాలం నీదిరా గాలినీదిరా ప్రాణంనీదిరా వాననీదిరా నీళ్ళునీవిరా పుడమినీదిరా పంటనీదిరా నిప్పునీదిరా వెలుగునీదిరా నింగినీదిరా తారకలునీవిరా జాబిలినీదిరా రవినీవాడురా పెళ్ళాంనీదిరా కుటుంబంనీదిరా అమ్మనీదిరా నాన్ననీవాడురా అక్కనీదిరా అన్ననీవాడురా చెల్లెలునీదిరా తమ్ముడునీవాడురా కూతురునీదిరా అల్లుడు నీవాడురా కొడుకు నీవాడురా కోడలు నీ ఇంటిలక్ష్మిరా ఇల్లు నీదిరా ఊరు నీదిరా దేశం నీదిరా లోకం నీదిరా జీవితం నీదిరా హాయిగా గడపరా ముందుకు నడవరా గమ్యము చేరురా ఆటుపోట్లకు అదరకురా కష్టనష్టాలకు కలతచెందకురా భయభ్రాంతులకు బెదరకురా అపజయ అవమానాలకు కృంగిపోకురా అక్షరాలు నీవిరా పదాలు నీవిరా ఊహలు నీవిరా భావాలు నీవిరా కవితలు వ్రాయరా గానము చేయరా అంతా నీదే అన్నీ నీవె అందరు నీవారే అన్నీ నీకోసమే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలబాణాలు ఎవరో పూలబాణాలను సంధించారు ఎందుకో కవితాకన్యను తలపించారు పుష్పబాణాలు గుండెకు గుచ్చుకున్నాయి కొత్తకోర్కెలు మదిలో మొలుచుకొచ్చాయి అందాలసుందరి ఆకర్షించింది ఆయస్కాంతాన్ని అధికమించింది చిరునవ్వులను చిందింది చిత్తమును స్వాధీనంచేసుకుంది తేనెచుక్కలను మాటల్లోచల్లింది తీయదనమును రుచిచూపింది ఓరచూపులను విసిరింది వయ్యారాలను ఒలకబోసింది కన్ను గీటింది చేయి పట్టింది వలను విసిరింది లక్ష్యాన్ని సాధించింది చెంతకు వచ్చింది చెలిమిని చేసింది మనసులు కలిపింది మేనును మురిపించింది అక్షరాలు అల్లుకున్నాయి పదాలు పేరుకున్నాయి పలుకవితలు పుట్టాయి పలువురిని పరవశింపజేశాయి పువ్వుకు ప్రేమకు బంధము ఏమిటో అందానికి ఆనందానికి సంబంధము ఏమిటో చెలికి చెలికానికి చెలిమి ఎందుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవరో ఎవరో? పున్నమివెన్నెలను పట్టకొచ్చి ఆమెమోముమీద పూసిందెవరో పాలపొంగును పట్టకొచ్చి ఆమెఎదలో దాచిందెవరో తారకలనుతెచ్చి హారముగాగుచ్చి ఆమెమెడలో వేసిందెవరో కొప్పులో పెట్టుకోమని కోమలకుసుమాలను పూయించెదెవరో అమృతాన్ని పట్టకొచ్చి ఆమెఅధరాలను నింపిందెవరో తేనెచుక్కలను తీసుకొచ్చి ఆమెనోటిలో దాచిందెవరో కడలికెరటాలను మొసకొచ్చి ఆమెగుండెలో పెట్టిందెవరో కాంతికిరణాలను తీసుకొచ్చి ఆమెకళ్ళను వెలిగించిందెవరో బంగారాన్ని కరిగించి ఆమెమేనుకు తాపడంచేసిందెవరో సెలయేటి ప్రవాహానితెచ్చి ఆమెప్రాయంలో పెట్టిందెవరో అన్నిఅందాలను ఏరికోరి ఆమెవంటిలో కూర్చిందెవరో అందచందాలను కళ్ళకుచూపించి నన్నుఆమెను కట్టుకోమన్నదెవరో పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు అందాలను సృష్టించినందుకు ఆదేవదేవునికి వందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మనుమడు పుట్టినరోజు ఈరోజు మనుమడు చుమను పుట్టినరోజు ఇంటిలోని వారందరికి పండుగరోజు చుమను టీనమ్మలు మొగ్గలు తొడిగాయి మనసులను మురిపించాయి కొడుకు కోడలు కలసి పెంచినపూలు అందరిని అలరించాయి అందరికి ఆనందాన్నిచ్చాయి చిన్ని చిన్ని పూలనుచూచి జాబిలి నవ్వింది చల్లనివెన్నెలను చల్లింది పువ్వుపువ్వున నవ్వులుచూచి పున్నమి వచ్చింది పులకింతలు పెట్టింది ఆ తుంటరులకోపం తొలిపొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు వారి అల్లరికి లేదు హద్దు వారి గొడవలకు లేదు పద్దు వారు ముద్దులకే మంచి ముద్దు ఈరోజు మనుమడు చుమను పుట్టినరోజు ఇంటిలోని వారందరికి పండుగరోజు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తాయిలాలు రారండోయ్ తాయలాలను ఇస్తా చదవండోయ్ తాయిలాలగూర్చి చెబుతా తాయిలాలు ఇస్తేగాని చిన్నారులు ఏడుపు మానరు చెప్పింది వినరు తాయిలాలు ఇస్తామంటేగాని వోటర్లు బూతులకురారు వోట్లు వెయ్యరు నేతలను ఎన్నుకోరు తాయిలాలు అందిస్తేగాని సభలకు జనాలురారు చెప్పిందివినరు తాయిలాలకోసమే భట్రాజులు పొగుడుతారు భజనలుచేస్తారు తాయిలాలు లేకపోతే చెలియ చెంతకురాదు చెలిమినిచేయదు తాయిలాలు ఫలం పత్రం పుష్పం తోయిదం ఇవ్వనిదే పరమాత్ముడు కరుణించడు తాయిలాలు శాలువాలు శ్లాఘనలు సన్మానసత్కారాలు ప్రశంసాపత్రాలు బహుమతులు లేనిదే కవులు సమ్మేళనాలలో పాల్గొనరు తాయిలాలంటే ఉచిత తినుబండారాలు పొగడ్తలు ప్రలోభాలు నమస్కారాలు నగదుసమర్పణ నాకూ పాఠకులారా తాయిలాలిస్తారా అందలమెక్కిస్తారా ఆనందంకలిగిస్తారా మీకూ తెలుగుతియ్యదనాలిస్తా మాటలమూటలిస్తా విషయచింతనకలిగిస్తా మనసులదోచుకుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సమయసందర్భము కవిగారికవనము ఒక వెలుగు ప్రసరించి ఒక చర్యకు ఉసిగొలుపుతుంది ఒక క్షణం రెచ్చగొట్టి ఒక పనిని పురమాయిస్తుంది ఒక అందం కనపడి ఒక ఆనందం కలిగిస్తుంది ఒక కన్యక కలలోకివచ్చి ఒక కవిని కవ్విస్తుంది ఒక పువ్వు ప్రత్యక్షమయి ఒక మనసును వ్రాయమంటుంది ఓక చెలి ఊరించి ఒక హృదయాన్ని కలంపట్టిస్తుంది ఒక ఊహ తట్టి ఒక కైతను పుట్టిస్తుంది ఒక భావం నచ్చి ఒక మనసును ముచ్చటపరుస్తుంది ఒక సమయము అనుకూలిస్తుంది ఒక సందర్భము అనుగ్రహిస్తుంది ఒక మనసు చలిస్తుంది ఒక కవిత జనిస్తుంది ఒక నిమిషం వినోదాన్నిస్తుంది ఒక ఘటన విషయాన్నిస్తుంది ఓ కవీ! సమయసందర్భాలను గమనించు సమయోచితకవనమును కొనసాగించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా అందాలరాశి నా ఆనందాలగని అదిగో అదిగో ఆచిత్తరువును చూడండి అందాలను కనండి ఆనందమును పొందండి తేరపారచూచే కళ్ళా ఆమెవి కాదు కాదు విరబూచిన కలువలు సిగ్గుపడిన బుగ్గలా ఆమెవి కాదు కాదు ఎర్రని గులాబిమొగ్గలు సుందరమైన మోమా ఆమెది కాదు కాదు పున్నమిచంద్రుని ప్రతిబింబము తెల్లని పళ్ళా ఆమెవి కాదు కాదు మెరుస్తున్న ముత్యాలు నుదుటనున్న సింధూరమా అది కాదు కాదు ఉదయిస్తున్న సూర్యబింబము ఎర్రని పెదవులా ఆమెవి కాదు కాదు పండిన దొండపండ్లు చిందిస్తున్నవి చిరునవ్వులా అవి కాదు కాదు నిండుపున్నమి వెన్నెల ప్రకాశించే వర్ణమా ఆమెది కాదు కాదు మేలు బంగరుఛాయ ఆమె అందాలరాశి సుగుణాలవాసి ఆనందాలగని శారదాపతి చేసినబొమ్మ ప్రతిసృష్టిని చేయబోయేఅమ్మ ఆమెను అక్కునచేర్చుకుంటా అంగములో అర్ధభాగమిస్తా అందరిముందు ఆమెకుతాళికడతా అందరిచేత అక్షింతలువేయించుకుంటా కాపురానికి తెస్తా గృహలక్ష్మిని చేస్తా నేను ప్రకృతి ప్రేమికుడిని అందాల ఆరాధకుడిని ఆనందాల పిపాసకుడిని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
శక్తిసామర్ధ్యాలు చూపరా పలుకురా పలుకురా తియ్యగా పలుకురా ప్రక్కనున్నవారిపై ప్రభావంబు చూపరా తియ్యరా తియ్యరా వెలికి తియ్యరా నీశక్తిని బయటకుతియ్యరా నలుగురికి నేర్పరా వాడరా వాడరా మేధస్సును వాడరా మంచిపనులు చేయరా మున్ముందుకు సాగరా చూపరా చూపరా నేర్పరితనం చూపరా నీలోన నిలచియున్న నిగూఢశక్తిని చాటరా చెయ్యరా చెయ్యరా సంఘసేవ చెయ్యరా శక్తిమేర యుక్తిపన్ని సమాజవృధ్ధి చెయ్యరా బ్రతకరా బ్రతకరా నీతిగా బ్రతకరా నిజాయితీని నిలుపురా నిండునూరేళ్ళు బ్రతకరా ఊహలను ఊరించరా మనసును మదించరా భావాలను బయటపెట్టరా కమ్మనికవితలు వ్రాయరా తెలుపరా తెలుపరా తెలుగుతీపిని తెలుపురా తల్లితెలుగు ఘనతను దశదిశల చాటరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితాసేద్యం మట్టిమెదడును దున్నుతా కవితాసాగుకు యోగ్యంచేస్తా అక్షరాలను వెదజల్లుతా కవితాపంటలను పండిస్తా పదాలను నాటుతా కవితావనమును సృష్టిస్తా ఊహలను ఊరిస్తా కవితాలోకంలో విహరింపజేస్తా భావమేఘాలను పుట్టిస్తా కవితాజల్లులను కురిపిస్తా కవితలపంటలను పండిస్తా మనోక్షామాన్ని నివారిస్తా అందాలను చూపిస్తా ఆనందాలను పంచేస్తా కవితామృతాన్ని అందిస్తా ఆకలిదప్పుల తీర్చేస్తా సుకవితలను సృష్టిస్తా సాహితీలోకంలో స్థిరంగానిలచిపోతా ప్రణయకవితను పండిస్తా ప్రేమికులను పరవశపరుస్తా పుష్పకవితలు పుట్టిస్తా పలువురిమనసులను పులకరిస్తా ప్రబోధకవితలను పుటలకెక్కిస్తా సమాజాన్ని చైతన్యపరుస్తా సరస్వతీదేవిని స్తుతిస్తా సాహిత్య సేవనుకొనసాగిస్తా పాఠకులారా ప్రోత్సహించండి దేవతలారా దీవించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
పూలపరవశాలు పూలు ప్రకాశిస్తున్నాయి పొంకాలను ప్రదర్శిస్తున్నాయి విరులు విచ్చుకున్నాయి వేడుకచేస్తున్నాయి వినోదపరుస్తున్నాయి కుసుమాలు కళ్ళను కట్టిపడవేస్తున్నాయి మహదానందమునిచ్చి మనసును మురిపిస్తున్నాయి అలరులు అలరిస్తున్నాయి అంతరంగంలో అలోచనలను లేపుతున్నాయి సుమాలు సుందరంగావున్నాయి సుగంధాలను చల్లుతున్నాయి సంతసపరుస్తున్నాయి లతాంతాలు లలితంగావున్నాయి లాలిస్తున్నాయి లాస్యమాడుతున్నాయి ప్రసూనాలు పరాచకాలాడుతున్నాయి ప్రక్కకురమ్మంటున్నాయి పూలపాటను పాడమంటున్నాయి పూలతో ముచ్చటలాడుతా పూలలోకంలో పయనిస్తా పూలకోర్కెలను తీరుస్తా పూకన్యలను ప్రమోదపరుస్తా పూబాలలను పొగుడుతా పూలప్రాశస్త్యాన్ని పదిమందికి చెబుతా పూలకవితలు వ్రాస్తా పలువురితో పంచుకుంటా పాఠకులకు పంపుతా పదేపదే పఠింపజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవరునేర్పారమ్మ ఈపూలకు? తోటలో సందడిచేయ్యమని చూపరులకు సంతసమివ్వమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు కళ్ళకు కాంతులివ్వమని పెదవులకు చిరునవ్వులివ్వమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు సౌందర్యాలు చూపమని సుగంధాలు చల్లమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు గాలికి నాట్యమాడమని వెలుతురికి మెరిసిపొమ్మని ఎవరునేర్పారమ్మ ఈపూలకు పరమాత్మునిపాదాలుచేరి ధన్యతనుపొందమని తరుణులతలలకెక్కి అందాలనురెట్టింపుజెయ్యమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు ప్రేమలు పుట్టించమని ఆప్యాయతలు అందించమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు సున్నితంగా ఉండమని సుఖంగా జీవించమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు మట్టిలోను పుయ్యమని నీళ్ళలోను పూయమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు చెట్లకు పుట్టమని తీగలకు వేలాడమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు కొండల్లో పుష్పించమని కోనల్లొ కుసుమించమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు ఆకులమధ్య పుట్టమని ముళ్ళమధ్య పెరగమని ఎవరునేర్పారమ్మ ఈపూలకు నేలరాలినా లాలిత్యంనిలుపుకోవాలని మట్టిలోకలసినా మృదువుగానేయుండాలని ఎవరునేర్పారమ్మ ఈపూలకు వానకుతడిసినా వయ్యారాలు ఒలుకాలని ఎండలబారినపడినా తాజాగాయుండాలని ఎవరునేర్పారమ్మ ఈపూలకు సూదులతోగుచ్చినా మురిపించాలని దారాలతోకట్టినా ముచ్చటపరచాలని ఎవరునేర్పారమ్మ ఈపూలకు వివిధరూపాల్ల...