
పూలలోకం పూలలోకంలో విహరించాలనియున్నది పూలమనసులను తెలుసుకోవాలనియున్నది పూలచెట్లను పెంచాలనియున్నది ప్రకృతిమాతకు శోభనుకూర్చాలనియున్నది పూలను చూడాలనియున్నది పరవశమును పొందాలనియున్నది పూలను అల్లాలనియున్నది మాలలను తెలుగుతల్లిమెడలోవెయ్యాలనియున్నది పూలతేనెను సేకరించాలనియున్నది తెలుగుపలుకులపైచల్లి తియ్యంగాచేయాలనియున్నది పూలపరిమళాలు చల్లాలనియున్నది పూలప్రేమికులను పరవశింపజేయాలనియున్నది పూలపొంకాలు చూపాలనియున్నది పరికించేవారిని పులకరింపచేయాలనియున్నది పూబాలలను పలుకరించాలనియున్నది కబుర్లుచెప్పి కాలక్షేపంచెయ్యాలనియున్నది పూలకన్యలను పిలువాలనియున్నది పొగడ్తలలో ముంచాలనియున్నది పూలకవితలు వ్రాయాలనియున్నది సాహిత్యప్రియులను సంతసపరచాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం