Posts

Showing posts from July, 2025
 ఎందుకో? పగలు పిలుస్తుంది తిమిరంతో సమరంచెయ్యమని అందాలు ఆహ్వానిస్తున్నాయి వికారాలను విదిలించుకోమని పూలు ప్రాధేయపడుతున్నాయి తుంచకుండా పరిరక్షించమని ఊహలు ఊరుతున్నాయి మనసును శుద్ధిచెయ్యమని మెదడు బ్రతిమలాడుతుంది అఙ్ఞానాంధకారాన్ని పారద్రోలమని పలుకులు తేనెనుచిమ్ముతున్నాయి నిస్సారాన్ని నిరోధించమని ప్రకృతి అర్ధిస్తుంది విచ్ఛిత్తికి పాలుపడవద్దని నీలిమబ్బు చినుకులుచల్లుతుంది క్షామకరువులను కట్టడిచెయ్యాలని వెలుగులు చిమ్ముతున్నాయి నిండినచీకటిని తొలగించమని వెన్నెల వెదజల్లుతుంది విచారాలను వదిలించుకోమని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పైపై మెరుగులు అల్లానికి బెల్లం జోడిస్తున్నారు ఆరగించటానికి అరిగించుకోటానికి చేదుగుళికలకు తీపిని అంటిస్తున్నారు జారమ్రింగటానికి ఆరోగ్యంగా ఉండటానికి వస్త్రాలపై అత్తరు చల్లుకుంటున్నారు దుర్గంధాన్ని దాచటానికి పక్కవారిని మభ్యపెట్టటానికి తలలకి నూనె అంటుకుంటున్నారు కేశాలను అణచిపెట్టటానికి చింపిరిని అదుపుచెయ్యటానికి కన్యలు వక్షస్థలంపై పైటలు కప్పుకుంటున్నారు అందాలు దాచుకోవటానికి మాయలోనికి నెట్టటానికి అధరాలకు రంగు పూసుకుంటున్నారు ఆకర్షించటానికి అమృతముందని చెప్పటానికి ఏడుపును లంకించుకుంటున్నారు నమ్మించటానికి  సానుభూతి పొందటానికి పడతులు పూలు పెట్టుకుంటున్నారు పొంకాలు చూపటానికి ప్రేమలో దింపటానికి కళ్ళకు కాంతలు కాటుక పెట్టుకుంటున్నారు కాంతులు చిమ్మటానికి కళకళలాడి కట్టేయటానికి కావాలని కొందరు పొగడ్తలు గుప్పిస్తున్నారు ప్రసన్నులను చేసుకోటానికి పనులను చేయించుకోటానికి మాటలకు తేనెను అద్దుకుంటున్నారు ఆకట్టుకోటానికి అంతరంగాలు తట్టటానికి అర్ధాంగులు అలకపానుపు ఎక్కుతున్నారు బ్రతిమాలించుకోవటానికి మొగుడిని చెంగునకట్టిపడేయటానికి పైమెరుగులను పసికట్టాలి దృష్టిపైపైగాక లోతులకెళ్ళాలి వాస్తవాలను తెలుసుకోవాలి మర్మాల...
Image
 ఉత్సాహభరితంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 9వ అంతర్జాల సమావేశం నిన్న 29-07-25 వ తేదీ మంగళవారం సి. నారాయణరెడ్డి జయంతి సందర్భ సమావేశం ఆద్యంతం అంతర్జాలంలో ఉత్సాహభరితంగా జరిగింది. సమావేశానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన తెలంగాణా స్పెషల్ డిప్యూటి కలక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు సినారె గారి సాహిత్య సేవను, భాషా పటిమను, విషిష్టతలను సోదాహరణంగా పేర్కొన్నారు. సినారె గారి గేయ కావ్యాలు విశ్వనాధనాయుడు, నాగార్జునసాగరం మరియు కర్పూర వీర వసంతరాయలు చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. విశిష్ట అతిధి ప్రఖ్యాత కవి, ఉపాధ్యాయుడు శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు సినారె గారికి ఙ్ఞానపీఠ అవార్డు మరియు పేరు ప్రఖ్యాతిని తెచ్చిన విశ్వంభర కావ్యాన్ని అద్భుతంగా విశ్లేషించి అందరి మన్ననలను పొందరు.ప్రత్యేక అతిధి విశ్రాంత అటవీశాఖ అధికారి, సాహిత్యప్రియుడు శ్రీ అంబటి లింగ క్రిష్ణారెద్ది గారు సినారె పాటలను వినిపించి శ్రోతలను సంతసపరిచారు. సభాధ్యక్షులు సినీ టీవి గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు సినారె గారి గజల్లను, పాటలను పాడి వినిపించి ఆహ్వానితులు అందరిని ఆహ్ల్లాద పరిచారు. తొలుత నంది అవార్డు గ్రహీత సినీ దర్శ...
 మాటలపర్వం మాటలను తేనెచుక్కల్లా చల్లుతావో నిప్పురవ్వల్లా చిమ్ముతావో నీ ఇష్టం మాటలను పువ్వుల్లా పూయిస్తావో రాళ్ళలా విసురుతావో నీ ఎంపిక మాటలను దీపాల్లా వెలిగిస్తావో చీకటిలా క్రమ్మిస్తావో నీ ఎన్నిక మాటలను ముత్యాల్లా వెదజల్లుతావో చెత్తలా విసిరేస్తావో నీ ఆకాంక్ష మాటలను ప్రేమనుచాటటానికి వాడతావో ద్వేషంరగిలించటానికి రువ్వుతావో నీ అభీష్టం మాటలను పకపకలాడించటానికి ప్రయోగిస్తావో విలవిలలాడించటానికి వినియోగిస్తావో నీ తలపోత మాటలతో మల్లెల్లా మురిపిస్తావో ముళ్ళలా గుచ్చుతావో నీ ఇచ్చ మాటలను ఆచి తూచి వదులుతావో తోచిన రీతిన సంధిస్తావో నీ అభిమతం మాటలతో మనసులను మురిపిస్తావో హృదయాలను గాయపరుస్తావో నీ అపేక్ష మాటలను మృదువుగా ఉపయోగిస్తావో కటువుగా ఉచ్చరిస్తావో నీ కాంక్ష మాటలు నోర్లను తెరిపిస్తాయి పెదవులన దొర్లుతాయి చెవుల్లో దూరతాయి మాటలు మనసున మెరుస్తాయి హృదిన ఉప్పొంగుతాయి రాతలుగా మారుతాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవ్వింపులు మల్లేవాసన పిలుస్తుంటే సమ్మతిస్తున్నా సంగ్రహిస్తున్నా సంతసిస్తున్నా పున్నమివెన్నెల స్వాగతిస్తుంటే అంగీకరిస్తున్నా ఆస్వాదిస్తున్నా ఆనందిస్తున్నా చక్కనికన్నియ చతుర్లాడుతుంటే స్వీకరిస్తున్నా స్పందిస్తున్నా సంబరపడుతున్నా రంగులసుమాలు రమ్మంటుంటే రయ్యనవెళ్తున్నా రమ్యతచూస్తున్నా రసాస్వాదనచేస్తున్నా కడలికెరటాలు ఎగిసిపడుతుంటే వీక్షిస్తున్నా విహరిస్తున్నా వినోదిస్తున్నా నింగిననీలిమబ్బులు కదులుతుంటే నిద్రించలేకున్నా నివ్వెరపోతున్నా  నిశ్ఛేష్టుడనవుతున్నా చెలిచిరునవ్వులు చిందుతుంటే బదులిస్తున్నా బందీనవుతున్నా భ్రమల్లోపడుతున్నా అందాలదృశ్యాలు కాంచమంటుంటే క్రోలుకుంటున్నా దాచుకుంటున్నా పదేపదేతలచుకుంటున్నా సహజప్రకృతి ప్రోత్సహిస్తుంటే పరికిస్తున్నా పరవశపడుతున్నా పురుషుడనవుతున్నా మనసు కవ్విస్తుంటే రెచ్చిపోతున్నా రగిలిపోతున్నా రంగంలోకిదిగితున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవితాజల్లులు చిరుజల్లులు చిటపటారాలుతాయి చిందులుత్రొక్కిస్తాయి చిరునవ్వులొలికిస్తాయి వెన్నెలజల్లులు వినోదపరుస్తాయి విహరించమంటాయి విరహంలో ముంచుతాయి పువ్వులజల్లులు ఆహ్వానంపలుకుతాయి ముచ్చటపరుస్తాయి ముసిముసినవ్వులనిస్తాయి ప్రేమజల్లులు మనసునుముడతాయి గుండెనుతాకుతాయి హృదినికరిగిస్తాయి ప్రశంసలజల్లులు మునగచెట్టునెక్కిస్తాయి ఆకాశానికెగిరిస్తాయి గర్వాన్నికలిగిస్తాయి నవ్వులజల్లులు మోములువెలిగిస్తాయి ముగ్ధతకలిగిస్తాయి మోదముచిందిస్తాయి నేతలవరాలజల్లులు ఆశలులేపుతాయి ఓట్లనుకుమ్మరిస్తాయి అధికారాన్నిచేజిక్కిస్తాయి అమృతజల్లులు తడవమంటాయి త్రాగమంటాయి తృప్తిపడమంటాయి అక్షరజల్లులు అందుకోమంటాయి అల్లమంటాయి అలరించమంటాయి కవనజల్లులు మదులదోస్తాయి మురిపిస్తాయి మన్ననలుపొందుతాయి జల్లులు ఆకాశాన మబ్బులుగామారాలి చక్కనిజాబిలిని పొడిపించాలి ఇంద్రధనస్సును సంధించాలి జల్లులు కవులను కలముపట్టించాలి పాఠకులను పఠింపజేయాలి సాహిత్యమును సుసంపన్నంచేయాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 కవితావేశం గాలి వీస్తుంటే ఊహలు ఉల్లాన ప్రసరిస్తాయి మబ్బు లేస్తే కలాలు అక్షరాలను రాలుస్తాయి నీరు పారుతుంటే పదాలు గలగలా ప్రవహిస్తాయి ఎండ తగిలితే కవనవృక్షాలు పూలు పూస్తాయి రవి ఉదయిస్తే కవిత పొడుచుకొస్తుంది పక్షులు రెక్కలిప్పితే కవిచేతులు చాచుకుంటాయి కాలము కదులుతుంటే భావము తలకెక్కుతుంది కాగితము పరచుకుంటే కవిత్వము ఎక్కికూర్చుంటుంది పాఠకులు కోరుకుంటే కవితలు చెంతచేరతాయి పత్రికలు ప్రచురిస్తే సాహిత్యము వెలిగిపోతుంది వర్షము ఉధృతమైతే వరదకు గట్లుకొట్టుకపోతాయి కవితావేశము  వస్తే కవనలోకము దద్దరిల్లిపోతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కలలుకంటున్నా! కమ్మదనాలతో కట్టేయాలనుకుంటున్నా తియ్యదనాలతో పట్టేయాలనుకుంటున్నా కోకిలకంఠంతో కుతూహలపరచాలనుకుంటున్నా హంసనడకలతో హాయినొసగాలనుకుంటున్నా వెన్నెలజల్లులతో తడపాలనుకుంటున్నా విహారయాత్రలతో వినోదపరచాలనుకుంటున్నా కెరటాలతో కేరింతలుకొట్టించాలనుకుంటున్నా సరసాలతో సయ్యాటలాడించాలనుకుంటున్నా తేనెపలుకులతో తృప్తిపరచాలనుకుంటున్నా సుమసౌరభాలతో సంతసపరచాలనుకుంటున్నా కలలతో కవ్వించాలనుకుంటున్నా కల్పనలతో భ్రమలుకొల్పాలనుకుంటున్నా అక్షరకుసుమాలతో అలరించాలనుకుంటున్నా పదవిన్యాసాలతో పరవశపరచాలనుకుంటున్నా అందమైనమైనమాటలతో అద్భుతకవితలురాయాలనుకుంటున్నా అనందమైనభావాలతో అబ్బురపరచాలనుకుంటున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 ఓ మనసా! జాబిలివి నువ్వే వెన్నెలని చల్లే పొంకమూ నువ్వే ప్రమదమూ ఇవ్వే     ||జాబిలి|| సుమానివి నువ్వే సౌరభము చిమ్మే దీపమువు నువ్వే కాంతుల్ని చిందే నవ్వువూ నువ్వే మోమునా వెలుగే  సిగ్గువూ నువ్వే బుగ్గలో చూపే       ||జాబిలి|| తేనెవూ నువ్వే తీపినీ ఇవ్వే మాటవీ నువ్వే తేటగా పలుకే ప్రేమవూ నువ్వే మమతనూ చాటే రాగమూ నువ్వే రమ్యతా పంచే      ||జాబిలి|| కలలోకి రావే కవ్వించి పోవే  కలమువూ నువ్వే కవితనూ రాయే ఊహవూ నువ్వే భావమూ ఇవ్వే ఊయలా నువ్వే నిద్దురా పుచ్చే       ||జాబిలి||  స్వర్గమూ నువ్వే సుఖములూ ఇవ్వే గమ్యమూ నువ్వే బాటనూ చూపే లక్ష్మివీ నువ్వే భాగ్యము నింపే వాణివీ నువ్వే వివేకము పెంచే      ||జాబిలి||   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 నేను ఎవరనుకుంటివిరా ఏమనుకుంటివిరా అపర బ్రహ్మనురా అక్షర ప్రియుడినిరా              ||ఎవర|| రాతలు రాసేవాడినిరా కోతలు కోసేవాడినిరా మాటలు చెప్పేవాడినిరా తూటాలు ప్రేల్చేవాడినిరా         పువ్వులు చల్లేవాడినిరా నవ్వులు చిందేవాడినిరా ఆటలు ఆడించేవాడినిరా పాటలు పాడించేవాడినిరా           ||ఎవర||  కలమును పట్టేవాడినిరా గళమును విప్పేవాడినిరా కవితలు చదివేవాడినిరా కల్పనలు చేసేవాడినిరా మదులు ముట్టేవాడినిరా హృదులు తట్టేవాడినిరా అందాలు చూపించేవాడినిరా ఆనందాలు కలిగించేవాడినిరా     ||ఎవర|| కాంతులు చిమ్మేవాడినిరా తేనియలు విసిరేవాడినిరా లాభాలు కూర్చేవాడినిరా శుభాలు కోరేవాడినిరా హితాలు పలికేవాడినిరా కితాబు ఇచ్చేవాడినిరా సవ్వడులు చేసేవాడినిరా చిందులు త్రొక్కించేవాడినిరా      ||ఎవర|| ప్రకృతిని ప్రేమించేవాడినిరా పాఠకుల్ని మెప్పించేవాడినిరా ఊహాలు రేపేవాడినిరా భావాలు తెలిపేవాడినిరా ముచ్చట్లు గుప్పించేవాడినిరా చప్పట్లు కొట్టించేవాడినిరా లక్ష్యాలు ఏర్పరిచేవాడినిరా ముందుకు నడిపించేవాడినిరా...
 ఆ కవి.... ఆ కవిమనసులో రేగిన  ఆలోచనలెన్నో అవి కవితలుగా మలచిన సందర్భాలెన్నో ఆ కవి నిద్దురలోకన్న కలలెన్నో అవి కవితారూపం చెందిన సమయాలెన్నో ఆ కవి కవ్వింపులకుగురైన పూటలెన్నో అవి అక్షరరూపం దాల్చిన దినాలెన్నో  ఆ కవిగళం తెరిపించిన గేయాలెన్నో అవి అమృతాన్ని చిందించిన ఘడియలెన్నో ఆ కవి ఆలపించిన కవితలెన్నో అవి సత్కారాలు అందించిన వేళలెన్నో ఆ కవి కలంపట్టిన కాలమెంతో అవి పుటల్ని మెరిపించిన సఫలమైనరోజులు ఎన్నో ఆ కవి సేకరించిన విషయాలెన్నో అవి అద్భుత రాతలైన నిమిషాలెన్నో ఆ కవి సృజించిన సౌందార్యాలెన్నో అవి పాఠకులకు చేకూర్చిన సంతోషాలెన్నో ఆ కవి వెలిగించిన  దీపాలెన్నో అవి కవనప్రియులకు చూపించే దారులెన్నో ఆ కవి మురిపించిన హృదయాలెన్నో అవి అతడిని అమరుడినిచేసిన స్మృతులెన్నో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 కవనరంగం (సాహితీక్షేత్రం) ఇక్కడనే కవికమలాప్తుడు ఉదయించు కవనకాంతులు ప్రసరించు ఇక్కడనే కవనపుష్పాలు వికసించు సుమసౌరభాలు వ్యాపించు ఇక్కడనే చక్కనిజాబిలి కనిపించు చల్లనివెన్నెల కురిపించు ఇక్కడనే నీలిమేఘాలు తేలియాడు తారలు తళుకులుచిమ్ము ఇక్కడనే అక్షరతీగలు అల్లుకొను పదాలు పసందుకొలుపు ఇక్కడనే కవులకలాలు కదులుచుండు కమ్మనికైతలు కాగితాలకెక్కు ఇక్కడనే సాహిత్యసేద్యము సాగుచుండు కవితాపంటలు పండుచుండు ఇక్కడనే పంచభక్ష్యాలు వడ్డించబడు నవరసాలు లభ్యమగుచుండు ఇక్కడనే కవిసమ్మేళనాలు జరుగుచుండు సన్మానసత్కారాలు చేయబడు ఇక్కడనే పురస్కారాలు అందించబడుచుండు పుస్తకాలు ఆవిష్కరించబడుచుండు ఇక్కడనే కవులప్రతిభలు బయటపడుచుండు వాగ్దేవివాక్కులు వెలువడుచుండు ఇక్కడనే మదులుపఠించి మురిసిపోవుచుండు హృదులాస్వాదించి ఊయెలలూగుచుండు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   
 సాహితీపయనంలో...... ఎన్ని మదులు దోచానో ఎన్ని ఙ్ఞాపకాలు దాచానో ఏమి మాటలు చెప్పానో ఏమి కోతలు కోసానో ఏమేమి అందాలు చూచానో ఏమేమి ఆనందాలు పంచానో ఏఏ ఆటలు ఆడానో ఏఏ పాటలు పాడానో ఎక్కడెక్కడికి వెళ్ళానో ఎవెరెవరిని కలిసానో ఏ దారులు పట్టానో ఏ గమ్యాలు చేరానో ఎట్లా అక్షరాలు అల్లానో ఎట్లా పదములు పేర్చానో ఎట్లాంటి కవితలు రాశానో ఎట్లాంటి పత్రికలు ప్రచురించాయో ఎందరు పిలిచి పురస్కారాలందించారో ఎందరు ఎన్నుకొని బహుమతులిచ్చారో ఎలా సన్మానాలు చేశారో ఎలా సత్కారాలు పొందానో ఎవరి వేదికలెక్కి  ప్రసంగించానో ఎవరి సభలకువెళ్ళి కవితాపఠనంచేశానో ఎంత ఖ్యాతిని సంపాదించానో ఎంత గౌరవాన్ని అందుకున్నానో సాహితీ పెద్దలకు ధన్యవాదాలు సాహిత్య సంస్థలకు శుభాకాంక్షలు కవన ప్రోత్సాహకులకు వందనాలు కవితా ప్రియులకు కృతఙ్ఞతలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 నవ్వమ్మ నవ్వమ్మ నవ్వమ్మా! నవ్వమ్మ నవ్వమ్మ నవ్వమ్మా అందాలభరిణా నవ్వమ్మా చిలుకలకొలికీ నవ్వమ్మా ముద్దులపట్టీ నవ్వమ్మా      ||నవ్వమ్మ|| తేనెపలుకులు చిందమ్మా ముద్దుమాటలు విసరమ్మా కమ్మనికాంతులు చిమ్మమ్మా చక్కనిమోమును చూపమ్మా అమ్మపై ప్రేమను చాటమ్మా నాన్నకు ముద్దులు ఇవ్వమ్మా  వెన్నా ముద్దలు మింగమ్మా నేతీ అరిసెలు తినవమ్మా     ||నవ్వమ్మ||   చెట్టాపట్టా లేయమ్మా చెమ్మాచెక్కా ఆడమ్మా దాగుడుమూతలు నేర్వమ్మా తొక్కుడుబిళ్ళలు వేయమ్మా అచ్చనగాయలు తేవమ్మా విసిరేసిగాలిలో పట్టమ్మా కబాడికూతలు కూయమ్మా బొమ్మలపెళ్ళిల్లు చేయమ్మా     ||నవ్వమ్మ|| బడికీ రోజూ వెళ్ళమ్మా పంతుళ్ళు చెప్పినట్లు వినమ్మా గురువులనూ గౌరవించమ్మా మిత్రులతో చక్కగామెలగమ్మా అ ఆలను చక్కగాదిద్దమ్మా అమ్మా ఆవుల నేర్వమ్మా పెన్సిలుతో గీతలు గియ్యమ్మా రంగులతో చిత్రాలు వెయ్యమ్మా ||నవ్వమ్మ||   అక్కలతో హాయిగా గడుపమ్మా అన్నలతో ముచ్చట్లు చెప్పమ్మా చెల్లెళ్ళకు కథలు చెప్పమ్మా తమ్ముళ్ళకు హితాలు బోధించమ్మా నిత్యము స్నానము చేయమ్మా చక్కని బట్టలు తొడుక్కోవమ్మా వయ్యారాలూ ఒలికించమ్మా సింగారాలు చూపించమ్మా...
Image
 రసవత్తరంగా నేడు (19-09-25) జరిగిన వీక్షణం సాహితీగవాక్షం(కాలిఫోర్నియా) వారి 155వ అంతర్జాల సాహితీసమావేశం **************************************************************                  సమీక్షకులు: ప్రసాదరావు రామాయణం                       భారత కాలమానం ప్రకారం ఈరోజు 19-07-25 శనివారం ఉదయం 6-30గం ప్రారంభమైన సమావేశం గం.9-45వరకు ఆసక్తిదాయకంగా జరిగింది. తొలుత డా.గీతామాధవిగారి స్వాగతోపన్యాసంతో సభ ప్రారంభమైంది. ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య మాడభూషి సంపత్కుమార్ గారిని ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు. శ్రీ మాడభూషి గారు గొప్ప భాషావేత్త, విమర్శకులు .మద్రాస్ యూనివర్సిటీలో ఎరుకల భాషపై ఏం ఫిల్ చేశారు.షుమారుగా 60 గ్రంథాలు వ్రాశారు. వారికి చాలా పురస్కారాలు లభించాయి.        మాడభూషి గారు ఆధునిక కవిత్వంపై అనర్గళంగా 50 నిమిషాలపాటు మాట్లాడారు.  శ్రీశ్రీగారి 'కవితా..ఓ కవితా ' అనే కవితను చదివితే ఆధునిక కవిత్వం ఎలా వ్రాయాలి అనే వారికి ఒక పాఠమే అన్నారు. వచన కవిత్వం ఒక ప్రజాస్వ...
 కవనకౌగిలి కవనకౌగిలిలో బంధీనయ్యా విడిపించుకోలేకపోతున్నా పద్మవ్యూహంలో చిక్కుకపోయా ప్రతిఘటించలేకపోతున్నా బురదలో కూరుకొనిపోయా పొడినేలచేరి బ్రతకాలనుకుంటున్నా సుడిగుండంలో గుండ్రంగా తిరుగుతున్నా బయటపడలేకపోతున్నా అక్షరజ్వాలలో తగలబడుతున్నా తప్పించుకోలేకపోతున్నా పదప్రవాహంలో కొట్టుకుపోతున్నా వేగానికి తట్టుకోలేకపోతున్నా చలిలో ఒణికిపోతున్నా కవిత్వవెచ్చదనానికి కాచుకొనియున్నా కడలికెరటాల్లో నిశ్చేష్టుడనయ్యా తీరం చేరలేకపోతున్నా కవితలలో మునిగిపోతున్నా ఊపిరాడక విలవిలలాడుతున్నా సాహితీవనంలో సమయంగడుపుతున్నా భావాలమాయకు లొంగిపోతున్నా చిక్కుల్లో పడవేసినా కవిత్వమే అందం మదుల్లో నిలిచిపోయినా కవనమే ఆనందం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 కవనహృదయం కవితోదయం  (ఉదయసందేశం) ప్రభాతవేళ ప్రాణులనులెమ్మంటుంది ప్రకృతిహేళ పరికించరమ్మంటుంది మొగ్గలు పొడుచుకొస్తాయి ఆలోచనలు తన్నుకొస్తాయి కిరణాలు దూసుకొస్తాయి అంధకారము పారిపోతుంది దృశ్యాలు ఆకట్టుకొంటాయి మనసులు పొంగిపొర్లుతాయి విషయాలు వెన్నుతడతాయి భావాలు బయటకొస్తాయి అక్షరాలు అల్లమంటాయి పదాలు పరచమంటాయి తలుపులు తెరువమంటాయి తలపులు తోచుకొనివస్తాయి పంక్తులు పొదుగుతాయి చరణాలు ఒదుగుతాయి కలాలు కదులుతాయి కాగితాలు నిండుతాయి కవితలు ఉదయిస్తాయి వెలుగులు విరజిమ్ముతాయి మదులు మురిసిపోతాయి హృదులు ఉల్లాసపడతాయి సూర్యోదయము చూడమంటుంది కవితోదయము చదవమంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 చెట్లపాఠాలు చెట్టును చూడు మౌనంగా ఎదుగు తీగలను కను మనసులకు అల్లు పువ్వులను కాంచు పరవశము పొందు పండ్లను ఆరగించు కడుపు ఆకలితీర్చు ఆకులను  పరికించు పచ్చదనంతో పరిఢవిల్లు కొమ్మలను పట్టు ఉయ్యాలలా ఊగు నీడలో నిలువు స్వేద తీరు గొడుగులా భావించు ఎండలో తిరుగకు రాళ్ళను వేయవద్దు కర్రలు విసరవద్దు కత్తులను పట్టవద్దు గొడ్డళ్ళను వాడవద్దు పక్షుల్లాగా వ్రాలు కోతుల్లాగా చిటారుకొమ్మలచేరు మానుల్లాగా పెరుగు కుర్చీల్లాగా తయారగు మబ్బులను ఆకర్షించు చినుకులు చిటపటాకురిపించు బిందువై ముత్యములామెరువు టపటపమంటూ సంగీతంవినిపించు అందాలు చూపించు ఆనందము కలిగించు చిరకాలము జీవించు కొట్టేసినా చిగురించు ఎండలకు వెరవకు వానలకు బెదరకు పెనుగాలులకు భీతిచెందకు వరదవృద్ధితికి కొట్టుకపోకు వృక్షాలకు వందనాలు ప్రకృతికి ప్రణామాలు భూమాతకు నమస్కారాలు భగవంతునికి ధన్యవాదాలు గుండ్లపల్లి  రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా పెళ్ళాం బంగరుబొమ్మ నాముద్దులగుమ్మ ఇంటికొచ్చిన లక్ష్మినంటది తాళికట్టిన పెళ్ళాన్నంటది అపరూపంగా చూడాలంటది            ||బంగరు||  సెల్లు చేతబడితే ప్రక్కగదికి వెళ్ళమంటది గడ్డం చేసుకోకపోతే చెంతకు రావద్దంటది             కూర బాగులేదంటే కోప్పడతది కేకలేస్తది స్నానము చేయకపోతే దూరంగా జరగమంటది               ||బంగరు|| ఒకటోతేదీ డబ్బులివ్వకపోతే మూతిబిగిస్తది పస్తుబెడతది ఆడవారితో మాట్లాడితే కస్సుమంటది బుస్సుమంటది             పండుగ వచ్చిందంటే చీరెలడుగుతది నగలుకోరుతది కోరికలు తీర్చకపోతే ఏడుస్తది అలకపానుపెక్కుతది           ||బంగరు|| గయ్యాళివంటే గొడవచేస్తది బెట్టుచేస్తది గడసరివంటే గంతులేస్తది గొంతుచించుకుంటది ఆలశ్యంగా ఇంటికొస్తే అనుమానిస్తది నిందలేస్తది ఇచ్చిన డబ్బులలెక్కలడిగితే ఛీకొడుతది గీకొడుతది                ||బంగరు|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 మావారు మావారు మంచోరు నామాట వింటారు చెప్పింది చేస్తారు అడిగింది ఇస్తారు         ||మావారు|| ప్రేమగా చూస్తారు తోడుగా ఉంటారు అండగా  నిలుస్తారు రక్షణా కలిపిస్తారు చీరెలూ కొంటారు నగలూ చేయిస్తారు అప్సరసవు అంటారు పొగడ్తలు గుప్పిస్తారు      ||మావారు|| పువ్వులూ పట్టుకొస్తారు కొప్పులో తురుముతారు అత్తరూ తెస్తారు వంటిపై చల్లుతారు నవ్వుల్లో ముంచుతారు మోమునూ వెలిగిస్తారు సరసాలు ఆడుతారు సరదాలు చేస్తారు        ||మావారు|| సినిమాలు చూపుతారు కారుల్లో తిప్పుతారు మిఠాయీలు కుక్కుతారు ఐసుక్రీములు తినిపిస్తారు పార్కుకూ తీసుకెళ్తారు పరవశా పరుస్తారు మనసునూ దోస్తారు హృదినీ తాకుతారు       ||మావారు|| అందగత్తెనని పిలుస్తారు ఆకాశనికి ఎత్తుతారు మాటకారినినని పొగుడుతారు తేనెచుక్కలని చల్లమంటారు చేతులూ కలుపుతారు చప్పట్లు కొట్టిస్తారు వదిలేది లేదంటారు పోటానికి ఒప్పుకోనంటారు  ||మావారు||  మావారు రత్నము దొరకుటా అదృష్టము మావారు ముత్యము పొందుటా పూజాఫలము మావారు వజ్రము కాంతులు చిమ్ముతారు మావారు బంగారము వెలుగులు చల్లుతారు  ...
 కవనసృష్టి  కాగితాలపై కొన్ని అక్షరాలుచల్లు అవి అవుతాయి కవితలు కధలు కావ్యాలు  లోకంపై కొన్ని వెలుగులువెదజల్లు అవి అవుతాయి దీపాలు పగలు ఙ్ఞానము  మనసులపై కొన్ని రంగులుపొయ్యి అవి అవుతాయి అరణ్యం ఆకాశం మైదానం ప్రకృతిపై కొన్ని చూపులుసారించు అవి అవుతాయి అందాలు ఆనందాలు ఆకర్షణలు  ఆకాశంపై దృష్టి కేంద్రీకరించు అవి ఆవిష్కరిస్తాయి మేఘాలు చినుకులు తారలు  నీటిపై కొన్ని కాగితాలువదులు అవి అవుతాయి పడవలు చాపలు పయనాలు నేలపై కొన్ని విత్తనాలువెదబెట్టు అవి అవుతాయి పంటలు కూరగాయలు భోజనాలు మనుజులపై కొన్ని పుష్పాలజల్లుకురిపించు అవి పలుకుతాయి ఆహ్వానాలు గొప్పదనాలు విశిష్టతలు చెట్లపై కొన్ని పదాలవానకురిపించు అవి పుడమికిస్తాయి పచ్చదనం ప్రాణవాయువు వర్షాలు కవులపై ప్రశంసలు కురిపించు అవి సృష్టిస్తాయి విశిష్టభావాలు విభిన్నవిషయాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 నిండు చందమామా!  పున్నమీ చందమా చక్కనీ బింబమా ఆకాశ దీపమా మనుజుల మురిపెమా         ||అందమా|| పుడమికి వెలుగువా మోములా జిలుగువా చల్లనీ వెన్నెలవా తెల్లనీ వన్నియవా             మనసులా దోస్తావా మోదమూ ఇస్తావా హృదినీ తడతావా హాయినీ కొలిపెదవా        ||అందమా|| ప్రేమను రేపుతావా చెలియను చేరుస్తావా సరదా చేయిస్తావా సరసం ఆడిస్తావా           కబుర్లు చెప్పిస్తావా కాలము గడిపిస్తావా కులుకులు చేరుస్తావా తళుకులు చిమ్మిస్తావా         ||అందమా||  కోర్కెలు తీరుస్తావా బ్రతుకును పండిస్తావా పువ్వులు పూయిస్తావా నవ్వులు కురిపిస్తావా         మాటలు కలుపుతావా బాటలు చూపుతావా ఆటలు ఆడిస్తావా పాటలు పాడిస్తావా        ||అందమా||        వెలుగులు చిమ్ముతావా తాపాలు తీరుస్తావా కోపాలు తగ్గిస్తావా మోములు మెరిపిస్తావా అమృతము అందిస్తావా తేనియలు చిందిస్తావా ముద్దులూ గుప్పిస్తావా ముచ్చటా పరుస్తావా ||అందమా||     గు...
 ఓ భగవంతుడా! భారం దింపేస్తావా భుజాలపైనుండి శిరసుపైనుండి బాధ్యత తప్పిస్తావా ఎత్తుకున్నవాటినుండి తగులుకున్నవాటినుండి భాగ్యం చేకూరుస్తావా బాగాబ్రతకటానికి పరులసేవలుచేయటానికి బాటను చూపిస్తావా పయనించటానికి గమ్యంచేరటానికి భ్రమలు తొలగిస్తావా తెరలుతొలగించి నిజాలుచూపించి బంగారం అందిస్తావా అలంకరించుకోవటానికి అందాలనుచూపటానికి భోగాలు కలిపిస్తావా అనుభవించటానికి ఆనందించటానికి బోనాలు ఎత్తిస్తావా అమ్మనుకొలవటానికి సంస్కృతినిలపటానికి భజనలు చేయిస్తావా భక్తినిచాటటానికి ముక్తినిపొందటానికి భావాలు బయటపెట్టిస్తావా బహుగొప్పగా చాకచక్యంగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 చిక్కుతున్నా! చెలరేగుతున్నా!! ఊహైనా కావచ్చు ఉద్రేకమైనా కావచ్చు ఉల్లాన్ని ఊపుతుంది ఉత్సాహాన్ని కలిగిస్తుంది శబ్దమైనా కావచ్చు దృశ్యమైనా కావచ్చు నన్ను ముట్టుతుంది మేల్కొలుపు పాడుతుంది అక్షరమైనా కావచ్చు పదమైనా కావచ్చు నన్ను తట్టుతుంది నిద్ర లేపుతుంది అందమైనా కావచ్చు ఆనందమైనా కావచ్చు నన్ను ఆకర్షిస్తుంది అంతరంగాన్ని అలరిస్తుంది పువ్వైనా కావచ్చు నవ్వైనా కావచ్చు నన్ను రెచ్చకొడుతుంది కవనరంగంలోకి దింపుతుంది వెన్నెలైనా కావచ్చు సౌరభమైనా కావచ్చు నన్ను కట్టేస్తుంది మదిని దోచేస్తుంది కలమైనా కావచ్చు కాగితమైనా కావచ్చు కవితలు రాయమంటుంది కవనజగాన్ని రంజింపజేయమంటుంది భావమైనా కావచ్చు విషయమైనా కావచ్చు నాలో పుడుతుంది నన్ను ఉసిగొల్పుతుంది ప్రేమైనా కావచ్చు ప్రేరణైనా కావచ్చు నన్ను ఆవహిస్తుంది మనసుకు పనిపెడుతుంది రక్తైనా కావచ్చు భక్తైనా కావచ్చు నన్ను వశపరచుకుంటుంది కవనాలలోకి కాలుపెట్టిస్తుంది బాగుండేలా భ్రమలుకొలుపుతున్నా స్పందించేలా మదులుతాకుతున్నా  పత్రికలు ప్రచురిస్తున్నాయి ప్రాచుర్యం కలిపిస్తున్నాయి నచ్చేమాటలజాడలో పయనిస్తున్నా మెచ్చేరీతిలో పలువురినిపట్టేస్తున్నా  పాఠకులు పరవశిస్తున్నారు ప్రతిస్ప...
 భార్యలపాత్రలు బహుకోణాలు భార్య ఇంటికడుగుబెడుతుంది సిగ్గుతో తలవంచుకొని సోకులతో అలంకరించుకొని ఆశలతో మదినినింపుకొని భార్య అందరినలరిస్తుంది అందము చూపించి అనురాగము వ్యక్తపరచి అంతరంగాలను మురిపించి భార్య చేస్తుంది ఇంటిసాకిరి వంటపని వడ్డనలకార్యాన్ని భార్య భరిస్తుంది అత్త ఆరడింపులు ఆడపడచు వ్యంగాలు మగని మౌనము భార్య అపుడుమొదలబెడుతుంది నిజస్వరూపాన్ని ఇంటిపెత్తనాన్ని గయ్యళితనాన్ని భార్య అడుగుతుంది సరుకులు చీరెలు నగలు భార్య పెడుతుంది భోజనాలు అల్పాహారాలు తినుబండారాలు భార్య గణిస్తుంది ఆదాయవివరాలు ఖర్చులలెక్కలు మిగులుడబ్బులు భార్య చూపుతుంది అందం అభిమానం ఆధిపత్యం భార్య ఇస్తుంది ఆనందం మకరందం అమృతం భార్య వెలుగుతుంది దీపంలా జాబిలిలా తారకలా భార్య కాచుకుంటుంది భర్తను పిల్లలను ఇల్లును భార్య చిందుతుంది చిరునవ్వులు సుమసౌరభాలు తేనెపలుకులు భార్య కోరుకుంటుంది ఆదరణ ప్రేమ పొగడ్త భార్య భాద్యతతీసుకుంటుంది ఇంటి శుభ్రతకు పిల్లల క్రమశిక్షణకు కుటుంబ గౌరవమునకు భార్య అలుగుతుంది కోరింది ఇవ్వకపొతే చెప్పింది వినకపోతే సుఖాలని అందించకపోతే భార్య చివరకుచూపుతుంది గడుసుతనము గయ్యాళితనము గాంభీర్యము భార్యపాత్ర పోషించటం కత్తిమీదసాము...
 మాటల మూటలు-ముచ్చట్లు మాటలు తడుతున్నాయి ముద్దుగా మురిపెంగా మాటలు తెలుపుతున్నాయి మనుషులను మనస్తత్వాలను మాటలు మెరిసిపోతున్నాయి తళతళా మెరుపుతీగలా మాటలు మురిపిస్తున్నాయి సుమధురంలా సుగంధంలా మాటలు మత్తెక్కిస్తున్నాయి త్రాగిస్తూ తూగిస్తూ మాటలు మంటలులేపుతున్నాయి తన్నుతూ తగలేస్తూ మాటలు మదులుదోస్తున్నాయి నిలవాలని గెలవాలని మాటలు ప్రసరిస్తున్నాయి జోరుగా హోరుగా మాటలు ప్రవహిస్తున్నాయి వాగులాగా వరదలాగా మాటలు ప్రేలుతున్నాయి పెదవుల్లోనుండి పేనాల్లోనుండి మాటలు వినిపిస్తున్నాయి శ్రావ్యంగా సున్నితంగా మాటలు కోటలుదాటుతున్నాయి కోతలతో కల్పనలతో మాటలు ఆకర్షిస్తున్నాయి అందాలతో ఆనందాలతో మాటలు అలరిస్తున్నాయి అక్షరలక్షలతో పదాలప్రాసలతో మాటలు ముచ్చట్లు మురిపాలు ముత్యాలు మాటలు భావాలు భ్రాంతులు కవనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 విరహతాపం  ఆ చూపు బాణము విసిరుతున్నట్లున్నది ఆ రూపు వెలుగులు చిమ్ముతున్నట్లున్నది ఆ పిలుపు తేనెను చల్లుతున్నట్లున్నది ఆ నవ్వు  వలను విసురుతున్నట్లున్నది ఆ సైగ చెంతకు రమ్మన్నట్లున్నది ఆ పైట గాలికి లేస్తున్నట్లున్నది  ఆ చేతులు కలుపమని  కోరుతున్నట్లున్నది ఆ కనులు ఆదుర్దాగా ఎదురుచూస్తున్నట్లున్నది ఆ మోము నిండు జాబిలిలాగున్నది ఆ వెలుగు వెన్నెల చల్లుతున్నట్లున్నది ఆ మది ప్రేమలో పడినట్లున్నది ఆ హృది తోడుకై తపిస్తున్నట్లున్నది ఆ దేహము దేనికో ఎదురుచూస్తున్నట్లున్నది ఆ బిడియము ఏలనో అడ్డుపడుతున్నట్లున్నది ఆ ఒళ్ళు తాపానికి ఉడికిపోతున్నట్లున్నది ఆ కాళ్ళు కదులుటకు తడబడుతున్నట్లున్నది ఆ స్థితి అయోమయంగా ఉన్నట్లున్నది ఆ గతి వర్ణనాతీతంగా కనబడుతున్నది ఆ ప్రేమ త్వరలో పండేటట్లున్నది ఆ కోర్కె తప్పకుండా తీరేటట్లున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
  గాలి కబుర్లు (గాలి మాటలు ముచ్చట్లు మాయలు మర్మాలు) గాలి వీస్తుంది చల్లగా చిన్నగా చక్కగా గాలి పిలుస్తుంది రమ్మని తిరగమని ఆనందించమని గాలి అరుస్తుంది హోరుగా జోరుగా దురుసుగా గాలి ఊపుతుంది కొమ్మలను కొంగులను కేశాలను గాలి లేపుతుంది దుమ్ముధూళులను కడలికెరటాలను ఎత్తైనచెట్లను గాలి తరుముతుంది కంపుని కుళ్ళుని కల్మషాన్ని  గాలి తెస్తుంది కొండల వేడిని సముద్రాల తడిని పొలాల పొడిని గాలి మోసుకొస్తుంది రేడియో తరంగాలను టీవీ శబ్దచిత్రాలను అంతర్జాల సంకేతాలను గాలి తడుతుంది మేనులను మనసులను మనుషులను గాలి తలపులుమళ్ళిస్తుంది ప్రేమ మీదకు ప్రేయసి మీదకు పెళ్ళి మీదకు గాలి వినిపిస్తుంది శబ్దాలని స్వరాలని సంగీతాన్ని గాలి మదినిమరలిస్తుంది అక్షరాల పైకి పదాల పైకి కవితల పైకి గాలిమాటలు చెవిలోపడితే కట్టేయ్యాలి కుట్టెయ్యాలి కొట్టెయ్యాలి గాలికబుర్లను చెప్పితే వినకూడదు విశ్వసించకూడదు వ్యాప్తిచేయకూడదు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 నామది విప్పనా! భావాలు తెలుపనా ఊహలు లేపనా రాగాలు తీయనా నవరసాలు త్రాగించనా అందాలు చూపనా ఆనందాలు పంచనా మనసులు తట్టనా హృదులు ముట్టనా కలమును పట్టనా పుటలను నింపనా అక్షరాలు అల్లనా పదాలు పేర్చనా మొక్కలు నాటనా తోటను పెంచనా పువ్వులు పూయించనా పరిమళాలు వెదజల్లనా తేనెచుక్కలు చల్లనా తీయదనాలు అందించనా కవితలు పాడనా కమ్మదనాలు కలిగించనా నవ్వులు చిందించనా మోములు వెలిగించనా వెన్నెల వెదజల్లనా ఒయ్యారాలు ఒలికించనా కలలోకి రానా కవ్వించి పోనా కల్పనలు చేయనా భ్రమలు కొలపనా హితాలు చెప్పనా శుభాలు చెయ్యనా లక్ష్యాలు ఏర్పరచనా ముందుకు నడిపించనా అక్షరశిల్పాలు చెక్కనా రంగులబొమ్మలు గీయనా పదప్రయోగాలు చెయ్యనా విషయాలు వివరించనా నోర్లు తెరిపించనా కడుపులు నింపనా పాటలు పాడనా వీనులకు విందివ్వనా వాణిని పూజించనా వాక్కులు ఇమ్మననా సాహితిని పిలవనా లోకాన్ని మెప్పించనా అచ్చతెలుగు వాడనా తేటతెలుగు పలకనా అంధ్రామృతము ఇవ్వనా తెనుగుభాషకు వెలుగులద్దనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 ప్రియా! ఓ ప్రియా!! మాటలు వదిలితే మురవాలా కాంతులు విసిరితే వెలగాలా నవ్వులు చిమ్మితే వీక్షించాలా పువ్వులు చల్లితే పులకించాలా      ||మాటలు|| తేనెపలుకులు ఒలికితే చవిచూడాలా సుమపరిమళాలు చిలికితే ఆస్వాదించాలా పెదవులు తెరిస్తే పవశించిపోవాలా కోకిలగళము ఎత్తితే వినాలా       ||మాటలు||    రమ్మని పిలిస్తే రావాలా చేతిని చాస్తే కలపాలా ఆడుదామని అంటే ఆడాలా పాడుదామాని అంటే పాడాలా      ||మాటలు||  అందాలు చూపితే కనాలా ఆనందము ఒసగితే పొందాలా ప్రేమగ పిలిస్తే పలకాలా తోడును కోరితే నిలవాలా          ||మాటలు||    సోకులు చూపితే కులకాలా జోకులు వేస్తే నవ్వాలా చిటుకులు చెప్పితే వినాలా కిటుకులు నేర్పితే చెయ్యాలా        ||మాటలు|| చూపులు విసిరితే కలపాలా విరహము కలిగితే విలపించాలా  వెన్నెలలోనా విహరించాలా చుక్కలక్రింద తిరగాలా            ||మాటలు|| జీవిత గమ్యము తేల్చాలా నూతన దారిలో నడవాలా   సూటిగ పయనము సాగించాలా సకల కోర్కెలను సాధించాలా      ...
 మేమిద్దరం  మేమిద్దరం మాట్లాడుకుంటుంటే కాలం కదలటానికి జంకుతుంది మేమిద్దరం మురిసిపోతుంటే వెలుగు కరిగిపోవటానికి భయపడుతుంది మేమిద్దరం పెనవేసుకుంటే కళ్ళు చూడటానికి సందేహిస్తాయి మేమిద్దరం ఆటాడుకుంటుంటే ఆనందం అధరాలను వీడకుంటుంది మేమిద్దరం కలసినడుస్తుంటే పయనం అలసటలేకుండా సాగుతుంది మేమిద్దరం ఊరేగుతుంటే సమాజం దప్పుకొట్టి గళమెత్తుతుంది మేమిద్దరం అవిభాజ్యం నేను పురుషుడిని ఆమె ప్రకృతి మేమిద్దరం ఒకరికొకరం నేను ఇనుపముక్కను ఆమే ఆయస్కాంతము మేమిద్దరం వేరుకాదు నేను అందం ఆమె ఆనందం మేమిద్దరం తోటిప్రయాణికులం గడుపుతాం జీవితం చేరతాం గమ్యం మట్టి పరుపై నిద్రబుచ్చుతుంది కొమ్మ ఊయలై ఊపుతుంది అగ్ని మంటై వండిస్తుంది అవని భోజనమై వడ్డిస్తుంది గాలి పంఖాయై వీస్తుంది మబ్బు నీటిచుక్కలై కురుస్తుంది పచ్చదనంతో  చెట్లు పరవశపరుస్తుంటే ఇంద్రధనసుతో ఆకాశం అబ్బురపరుస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవితాప్రస్థానం కవితచదివితే విందుభోజనం చేసినట్లుండాలి కవితవింటే కర్ణాలకింపు కలిగేలాగుండాలి కవితచెబితే శ్రోతలను కట్టిపడేసేలాగుండాలి కవితపాడితే గాంధర్వగానం ఙ్ఞప్తికితెచ్చేలాగుండాలి కవితరాస్తే అంతరంగాలను తాకేలాగుండాలి కవితకూర్చితే మల్లెమాల మత్తుచల్లినట్లుండాలి కవితనాస్వాదిస్తే చెరకురసం త్రాగినట్లుండాలి కవితననుభవిస్తే పనసతొనలు తిన్నట్లుండాలి కవితపంపితే ప్రముఖపత్రికలలో ప్రచురించేలాగుండాలి కవితచేతికొస్తే పాఠకులుపఠించి పరవశపడేలాగుండాలి కవితపోటీలకుపంపితే ప్రధమబహుమతి పొందేలాగుండాలి కవితకుప్రాచుర్యమొస్తే పిలిచి పురస్కారాలందించేలాగుండాలి కవితవంటబడితే కొత్తకవులు కలంపట్టేలాగుండాలి కవితాసంకలనంతీసుకొస్తే సాహితీలోకాన్ని సుసంపన్నంచేసేలాగుండాలి కవితనుచిలికితే పాలుమీగడలు తేలేలాగుండాలి కవితనుమదిస్తే అమృతభాండాగారం నిండేలాగుండాలి కవితనుక్రోలితే భృంగాలకు మధువుదొరికినట్లుండాలి కవితనుపొగిడితే సాహిత్యలోకం సంబరపడేలాగుండాలి  కవితాజల్లులుకురిస్తే కమ్మదనాలు వరదలాపారేలాగుండాలి కవితచరిత్రకెక్కితే కవిని సాహిత్యసింహాసనమెక్కించేలాగుండాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం     
 అక్షరాలపని మనసులు తట్టటం తలపులు లేపటం విషయాలు వివరించటం అదేకదా అక్షరాలపని అందాలు చూపటం ఆనందము ఇవ్వటం అంతరంగాలు ఆక్రమించటం అదేకదా అక్షరాలపని నిద్ర పుచ్చటం కలలు రప్పించటం కల్పనలు చేయించటం అదేకదా అక్షరాలపని నోర్లు తెరిపించటం తేనెచుక్కలు చిమ్మటం తియ్యదనాలు అందించటం అదేకదా అక్షరాలపని పువ్వులు చల్లించటం పొంకాలు చూపించటం పరిమళాలు పంచటం  అదేకదా అక్షరాలపని కనులకు చిత్తరువులుచూపటం కవ్వింపులకు గురిచేయటం కుతూహలం కలిగించటం అదేకదా అక్షరాలపని నవ్వులు చిందించటం మోములు వెలిగించటం మనసులు మురిపించటం అదేకదా అక్షరాలపని జాబిలిని ఉదయింపజేయటం వెన్నెలను వెదజల్లించటం వినువీధిలో విహారింపజేయటం అదేకదా అక్షరాలపని ఇంద్రధనస్సు సృష్టించటం వివిధవర్ణాలు అద్దటం అబ్బురం కలిగించటం అదేకదా అక్షరాలపని ప్రేమను రగిలించటం ప్రియురాలును దగ్గరకుతీయించటం పరిణయము జరిపించటం అదేకదా అక్షరాలపని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 కవిపుంగవా! అక్షరాలతో అందంగా ఆరంభింపచేస్తావా ఆనందంగా అంతంచేస్తావా అనూహ్యంగా అలరింపజేస్తావా  పదాలతో ప్రొద్దున్నే ఉదయించుతావా అస్తమించకుండా నిలుస్తావా  ప్రతిరోజూ పులకరింపజేస్తావా  వాక్యాలతో వెలుగుకు ద్వారంతెరుస్తావా చీకటికి తలుపుమూసేస్తావా కాంతులు వేదజల్లుతావా  చరణాలతో పరవశాలు చేకూరుస్తావా పరితాపాలు తొలగిస్తావా  ప్రసన్నతను కలిగిస్తావా  ఆలోచనలతో ఉరతావా ఊరించేస్తావా ఎండకుండా సాగుతావా  జీవనదిగా ప్రవహిస్తావా  భావాలతో బయటకు వస్తావా అంతర్ముఖుడవు కాకుంటావా  భ్రమల్లో ముంచుతావా  ఉత్సాహంతో మదుల్లోనికి ప్రవేశిస్తావా హృదయంనుండి నిష్క్రమించకుంటావా గుండెల్లో గుబాళిస్తావా  సత్యాలతో స్థిరమయి నిలిచిపోతావా మాయమవకుండా ఉండిపోతావా  సూక్తులు తెలుపుతావా  కవితలతో మౌనము దాల్చమంటావా మాటలు కురిపించమంటావా స్పందనలు పంపమంటావా  సాహితితో సన్నిహితంగా ఉండమంటావా సుదూరంగా జరిగిపోవద్దంటావా  సౌమ్యంగా సహవాసంచేయమంటావా  సంతసంతో  నన్ను తీసుకెళ్ళావా  నీ లోకానా  నన్ను వెలిగించవా   దయతో  అన్యాదా భావించకుండా  నన్ను ...
 పదాల ప్రకాశం  చెబితే చక్కనికవిత్వము చెప్పాలి తెల్పితే చిత్తాలు చిందులుత్రొక్కాలి వ్రాస్తే కమ్మనికైతలు గుప్పించాలి అల్లితే మల్లెపూలమత్తు వ్యాపించాలి తెరిస్తే కోకిలకంఠము తెరవాలి చూపితే సుందరదృశ్యాలు చూపాలి తాకితే  దిమ్మ తిరిగిపోవాలి త్రోస్తే తారాలచెంత పడాలి ఆడితే ప్రతిభ బహిర్గతముకావాలి పాడితే గాంధర్వగానం తలపించాలి ఎక్కితే హిమాలయశిఖరాలు ఎక్కాలి దిగితే బలిచక్రవర్తిలోకము చేరాలి వండితే వంటలు ఘుఘుమలాడాలి వడ్డిస్తే వదలక చకచకాతినాలి తట్టితే తియ్యనితలపులు తలనుతట్టాలి ముట్టితే మదులు మహదానందములోమునగాలి చల్లితే తేనెపలుకులు విసరాలి చిందితే నవరత్నాలు రాలాలి    చూపిస్తే  పున్నమిచంద్రుని చూపాలి ఆరబోస్తే పిండివెన్నెలను ఆరబోయాలి కూర్పులు  అద్భుతంగా కలసిపోవాలి  మాటలు  సహజంగా ప్రవహించాలి  కవులు కుతూహలము పంచాలి   పాఠకులు  పరవశము పొందాలి  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 అక్షరశిల్పి అక్షరాలు ఆడిస్తున్నాడు ఆనందము అందిస్తున్నాడు అక్షరాలు వెలిగిస్తున్నాడు కవనకాంతులు వెదజల్లుతున్నాడు అక్షరకౌముది చల్లుతున్నాడు అంతరంగాలను ఆకట్టుకుంటున్నాడు అక్షరకుసుమాలు అల్లుతున్నాడు అంతర్యామిని అలంకరిస్తున్నాడు అక్షరసౌరభాలు ప్రసరిస్తున్నాడు అందరిమదులను అలరిస్తున్నాడు అక్షరసేద్యము చేస్తున్నాడు కవితాపంటలు పండిస్తున్నాడు అక్షరజల్లులు కురిపిస్తున్నాడు కైతానదులను పారిస్తున్నాడు అక్షరామృతము సృష్టిస్తున్నాడు కయితాసుధలను క్రోలుకోమంటున్నాడు అక్షరచిత్రాలు గీస్తున్నాడు అద్భుతరూపాలను చూపిస్తున్నాడు అక్షరశిల్పాలు చెక్కుతున్నాడు సంతసాలను పొందమంటున్నాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం