Posts

Showing posts from September, 2025
 కవితాజగతిలో… కవనతీపి చూపటం కాదు, తినిపించటమే ప్రధానము. కవితాజల్లులు కురిపించటం కాదు, పాఠకుల మురిపించటమే ప్రాముఖ్యము. కయితాగళం ఎత్తటం కాదు, గానామృతం పంచటమే ధర్మము. కైతారంగులు చల్లటం కాదు, హరివిల్లు పొడిపించటమే ముఖ్యము. అక్షరాలు పేర్చటం కాదు, ముత్యాలమాల అల్లటమే కవిత్వం. పదాలు పారించటం కాదు, ప్రాసలతో పొసగటమే నైపుణ్యం. కలము పట్టటం కాదు, విచిత్రాలు చూపటమే కర్తవ్యము. రాతలు రాయటం కాదు, కైతలవాసన పంచటమే రమణీయము. సుదీర్ఘ కవనాలు కాదు, సంక్షిప్త సందేశాలే శరణ్యము. వాక్యాలు విసరటం కాదు, విషయాల విన్నూతనమే శ్రేష్ఠము. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 తెలుగు ధారలు తెలుగు వెలుగుతుంటే మది మెరిసిపోతుంది తెలుగు కనబడుతుంటే హృది ఆనందిస్తుంది తెలుగు తడుతుంటే తనువు పరవశిస్తుంది తెలుగు చదువుతుంటే మనసు పులకరిస్తుంది తెలుగు పలుకుతుంటే తీపి దొర్లుతుంది తెలుగు వింటుంటే నాడులు నర్తిస్తాయి తెలుగు పారుతుంటే తృష్ణ తీరుతుంది తెలుగు వీస్తుంటే మేను మురిసిపోతుంది తెలుగు మొగ్గలుతొడిగితే కళ్ళు కళకళలాడుతాయి తెలుగు విచ్చుకుంటుంటే ఉల్లం ఉప్పొంగిపోతుంది తెలుగు పరిమళిస్తుంటే ప్రాణం లేచివస్తుంది తెలుగు వ్యాపిస్తుంటే ఉల్లం ఉరుకులేస్తుంది తెలుగు రాస్తుంటే కలం పరుగెత్తుతుంది తెలుగు చెబుతుంటే కాయం కుషీపడుతుంది తెలుగు కురుస్తుంటే తలపులు తట్టుతాయి తెలుగు పొంగుతుంటే కవితలు ప్రవహిస్తాయి తెలుగు నాలుకలు అమృత స్థావరాలు తెలుగు పలుకులు లేత కొబ్బరిపలుకులు తెలుగు ఉజ్వలజ్యోతి శాశ్వత ప్రేరణి తెలుగు దివ్యఔషధి ఙ్ఞాన ప్రవర్ధని  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నోటిముత్యాలు నోరు తెరిస్తే –  నవరత్నాలు రాలాలి, పలుకులు విసిరితే –  తేనెచుక్కలు చిందాలి. గొంతు విప్పితే –  నవరసాలు కురవాలి, పాట పాడితే –  బండరాళ్ళూ కరగాలి. మాటలు కలిస్తే –  మనసులు మురవాలి, అధరాలు కదిపితే –  అమృతం పొంగిపొర్లాలి. శబ్దాలు వదిలితే –  చెవులు శ్రావ్యతపొందాలి, ముక్కు మీద వేలేస్తే –  మూతులు ముడుచుకుపోవాలి. గట్టిగా పలికితే –  భయంతో వణికిపోవాలి, శంఖం మోగిస్తే –  సమరానికి సిద్ధమవ్వాలి. మధుర గళాలే హృదులకు ఆనందాలు, రసాత్మక వాక్కులే - కవులకు అలంకారాలు. గుండ్లపల్లి రాజేంరప్రసాద్, భాగ్యనగరం.
Image
 ఆద్యంతం అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 12వ సమావేశం **************************************************************** నిన్న 27-9-25వ తేదీన ఎ.ఎస్.రావునగర్ లో కాప్రా మలకాజగిరి కవుల వేదిక 12వ సమావేశం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన కళారత్న మరియు నవ్యాంధ్ర రచయతల సంఘం అధ్యక్షులు శ్రీ బిక్కి క్రిష్ణ గారు, 28వ తేదీ జాషూవా జయంతి సందర్భంగా మహకవి జాషువా జయంతోత్సవం ఘనంగా  నిర్వహించటం  సంతోషదాయక విషయమన్నారు. జాషూవా తన జీవితమంతా అణగారిన వర్గాలకోసం అంకితం చేశారన్నారు. చక్కని ఖండ కావ్యాలు వ్రాసి తెలుగు సాహిత్యంలో స్థిరస్థానం సంపాదించుకున్నారన్నారు. ముఖ్య అతిధి,కవి,పరిశోధకులు మరియు విమర్శకులు శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు జాషువా మహా గొప్ప కవి అని ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. జాషువా గారి పద్యాలను చక్కగా ఆలపించి అందరిని అలరించారు. విశ్రాంత అటవీ శాఖ అధికారి, సాహిత్య ప్రియుడు మరియు గొప్పదాత శ్రీ అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు జాషువా గురించి చాలా విషయాలి చెప్పి వారి పద్యాలను కొన్ని వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. బాలసాహిత్య కవి శ్రీ గద్వాల సోమన...
 సుకవుల సుకృత్యాలు అక్షరసుమాలు అల్లటం, పదమాలలు గుచ్చటం, ఆలోచనలు పారించటం, భావాలకు రూపమివ్వటం. పువ్వులు చూపించటం, పరిమళాలు వెదజల్లటం, నవ్వులు చిందించటం, మోములు వెలిగించటం. అందాలు చిత్రించటం, ఆనందాలు అందించటం, అలంకారాలు జోడించటం, అంతరంగాలు ముట్టటం. బాటలువేసి నడిపించటం, రంగులుదిద్ది చూపించటం, కలంపట్టి పుటలునింఫటం, హృదయాలను మురిపించటం. కాంతులుచల్లి చీకట్లుతోలటం, రవినితలపించి బ్రహ్మను అనుసరించటం, వాక్యాల్లో విశ్వాన్ని ఆవిష్కరించటం, వాగ్దేవిని ఆరాధించి ప్రసన్నుడుకావటం. సాహితీవంటలు వండివడ్డించటం, కడుపులునింపి తృప్తిపరచటం, పంటలాగా కవిత్వం పండించటం, జీవితాల్లో  వెలుగులు నింపటం. భాషను బ్రతికించి జాతిని కాపాడటం, సాహిత్యసేద్యం సాగించి కైతలు పంచటం, అమృతంలా కవనధారలు అందించటం, జాతిగుండెల్లోనిలిచి శాశ్వతస్థానం సంపాదించటం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ప్రేమ ఉంటే..... ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ పువ్వులుంటాయి సీతాకోకచిలుకలుంటాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ నవ్వులుంటాయి వెలుగుతున్న మోములుంటాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ అందాలుంటాయి ఆనందాలు వెల్లివిరుస్తుంటాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ చల్లదనముంటుంది కడుగ కమ్మదనముంటుంది  ఎక్కడ ప్రేమ ఉంటే అక్కద రంగులుంటాయి కనులకు విందులుంటాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ తియ్యదనముంటుంది నిండుగ కమ్మదనముంటుంది ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ మంచిమాటలుంటాయి సమస్యలు అన్నీ సర్దుకుంటాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ చక్కని తోడుంటుంది తనువులు తృప్తిని పొందుతాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ హృదయముంటుంది మానవత్వము పరిమళిస్తుంది ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కాలం సర్దాగాసాగుతుంది జీవితం సుఖమయమైపోతుంది ప్రేమను  ఆహ్వానించు ఆస్వాదించు ప్రేమను  పారించు ఈతకొట్టించు ప్రేమను  పంచిపెట్టు పరవశపరచు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవిత్వం రాస్తా-రాస్తుంటా! చూపులు చీల్చినా, మాటలు మండినా, విషము చిమ్మినా – కలాన్ని వదలనూ… వదలనూ! ఆంక్షలు విధించినా, ఆటంకాలు సృష్టించినా, అభ్యంతరాలు వ్యక్తపరచినా – కాగితాన్ని వీడనూ… వీడనూ! మట్టిలో కప్పినా, గాలిలో కలిపినా, గుంతలో పడేసినా – రాయటాన్ని ఆపనూ… ఆపనూ! బురదలో నెట్టినా, బూడిదలో కుక్కినా, బాధలలో ముంచినా – సువాసనలు చల్లుతా… చల్లుతా! చేతితో చరచినా, కాలితో తన్నినా, కర్రతో కొట్టినా – కవితాజ్యోతులు వెలిగిస్తా… వెలిగిస్తా! బరువు మోపినా, పరువు తీసినా, కరువు వచ్చినా – సాహిత్యరాగాలు తీస్తా-తీస్తా! గుండె గాయాలపాలైనా, హృది తరగిపొయిన, మది మదనపడ్డా – కవనం సాగిస్తా… కొనసాగిస్తా! ఊపిరి ఆగేదాకా, కాయం కూలేదాకా, ప్రాణం పోయేదాకా – కవిత్వం రాస్తా… రాస్తుంటా! కవనం –  నా ధ్యేయం, నా మార్గం,  నా భాగ్యం. కవిత్వం –  నా ప్రాణం, నా మానం,  నా జీవనం! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 పొద్దున్నే... సాహితి కవ్విస్తుంటే కలలు కంటున్నా రాగాలు తీస్తున్నా కల్పనలు చేస్తున్నా. సూర్యోదయం అవుతుంటే అరుణకిరణాలు వీక్షిస్తున్నా, జనజాగృతం గమనిస్తున్నా తెలుగుజ్యోతులు వెలిగిస్తున్నా. అక్షరాలు కురుస్తుంటే ఏరుకుంటూ ఆడుతున్నా, పేర్చుకుంటూ పాడుతున్నా, కుతూహలం తీర్చుకుంటున్నా. పదాలు పిలుస్తుంటే చెంతకు పోతున్నా, చెలిమి సాగిస్తున్నా చిత్రరేఖలు గీస్తున్నా. వాక్యాలు కూడుతుంటే ప్రాసలగూడు కట్టుతున్నా, పోలికలమాల వేస్తున్నా పరిమళాలు వెదజల్లుతున్నా. ఊహలు ఊరుతుంటే మెదడులో మ్రోగిస్తున్నా, హృదయంలో నింపుతున్నా కవిత్వంలో కనబరుస్తున్నా. భావాలు బయటకొస్తుంటే పరికించుతున్నా, రూపము దిద్దుతున్నా ప్రతిమను సృష్టిస్తున్నా. మాటలు పెదాలజారుతుంటే అమృతం త్రాగిస్తున్నా, తీయదనం చేరుస్తున్నా శ్రావ్యతను పంచిపెడుతున్నా. కవితలు పుట్టుకొస్తుంటే వెలుగులు చిందుతున్నా, రంగులు అద్దుతున్నా హంగులు ప్రదర్శిస్తున్నా. కవనాలు కూరుతుంటే అందాలలోకం కనబరుస్తున్నా, ఆనందరాగం ఆలపిస్తున్నా, అంతరంగాలను అలరిస్తున్నా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 జీవిత పయనంలో ఈ జీవితం నేర్పిన పాఠాలెన్నో, ఈ జగతి చూపిన మార్గాలెన్నో    ||ఈ|| ఈ జీవిత పయనంలో తనువుకు తగిలిన గాయాలెన్నో, ఈ జీవన గమనంలో గుండెను గుచ్చిన శూలాలెన్నో.    ఈ బ్రతుకు బాటలో ఎదురైన ఆటంకాలెన్నో, ఈ ప్రాణ పోరాటంలో ప్రాప్తించిన అపజయాలెన్నో.      ||ఈ|| ఈ బాధ్యతల భారంలో చేసిన పొరపాట్లెన్నో, ఈ బరువులు మోయటంలో భుజాలు పడ్డ పాట్లెన్నో.        ఈ కల్లోల కాలంలో జరుగుతున్న అక్రమాలెన్నో, ఈ స్వార్థ ప్రపంచంలో విచ్ఛిన్నమైన కుటుంబాలెన్నో.    ||ఈ|| ఈ సంసారం ఈదటంలో అనుభవించిన కష్టాలెన్నో, ఈ సమాజ పోకడల్లో తెచ్చిన మార్పులెన్నో.         ఈ సంఘ సమరంలో సహకరించిన స్నేహితులెందరో, ఈ ప్రజా ఉద్యమాల్లో ప్రాణాలొడ్డిన వీరులెందరో.   ||ఈ|| ఈ అందాల వేటలో గతించిన కాలమెంతో, ఈ ఆనందాల వెతుకులాటలో ఆడిన నాటకాలెన్నో.          ఈ బతుకు తెల్పిన సత్యాలెన్నో, ఈ మనుగడ చెప్పిన కథనాలెన్నో, ఈ పుడమి చేసిన సాయాలెన్నో, ఈ జగము చాటిన హితాలెన్నో.  ||ఈ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 దొరకకపోతే? పల్సు దొరకకపోతే జీవితం గాలిలో కలిసిపోతుంది, పర్సు దొరకకపోతే హృదయం దుఃఖానికి తావవుతుంది. పని దొరకకపోతే చేతులు నిశ్చలమవుతాయి, తిండి దొరకకపోతే కడుపులు మంటలపాలవుతాయి. మాటలు దొరకకపోతే నిశ్శబ్దం రాజ్యమేలుతుంది, తోడు దొరకకపోతే జీవితము ఏకాంతమవుతుంది. ప్రేయసి దొరకకపోతే బ్రతుకు బ్రహ్మచర్యమవుతుంది ప్రేమ దొరకకపోతే జీవితం శూన్యగ్రంధమవుతుంది. బండి దొరకకపోతే కాళ్ళు చక్రాలవుతాయి, సమయం దొరకకపోతే వాయిదా అనివార్యమవుతుంది. అందం దొరకకపోతే కళ్ళు కళాహీనమవుతాయి, ఆనందం దొరకకపోతే ఒళ్ళు నిరాశజనకమవుతుంది. ఫలితం దొరకకపోతే ప్రతిక్షణం దండగవుతుంది జీవితం దొరకకపోతే, అస్తిత్వం శూన్యమవుతుంది అర్ధం దొరకకపోతే కవనం వ్యర్ధప్రదమవుతుంది, ఆంతర్యం దొరకకపోతే కూర్చటం వృధాప్రయాసవుతుంది. అక్షరాలు దొరకకపోతే కలం మూగవాద్యమవుతుంది, పదాలు దొరకకపోతే కాగితం ఖాళీ ఆకాశమవుతుంది. కవులు దొరకకపోతే కవిత్వం నిర్జలనదీప్రవాహమవుతుంది, పాఠకులు దొరకకపోతే ప్రోత్సాహం సదాపూజ్యమవుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 ఏమి చేసేదీ..ఇంకేమిచేసేదీ? ఏమి చేసేదీ... ఇంకేమి చేసేదీ? ఏమి చేసేదీ నేనేమి చేసేదీ? ఎలా చెప్పేదీ నేనెలా చెప్పేదీ? ఏమి చేసేదీ... ఏమి చేసేదీ?   ||ఏమి|| నెత్తీ నోరూ బాదుకున్నా ఉలుకూ లేదూ పలుకూ లేదూ కాళ్ళవేళ్ళూ పట్టుకున్నా ముద్దూ లేదూ ముచ్చటా లేదూ  ||ఏమి|| చీరా రవికా ఆశ చూపినా కదలిక లేదూ మెదలిక లేదూ పూలూ పండ్లూ ఇచ్చెదన్నా తాకకున్నదీ తినకున్నదీ       ||ఏమి|| సూటూ బూటూ వేసుకున్నా నచ్చకున్నదీ మెచ్చకున్నదీ మూటా ముల్లే సర్దుకున్నా పట్టకున్నదీ మాట్లాడకున్నదీ     ||ఏమి|| కమ్మలూ ఉంగరాలూ తెచ్చిచ్చినా వద్దంటుందీ వారించుచున్నదీ నగదూ నట్రా చేయిస్తానన్నా ఒప్పుకోకున్నదీ తప్పుకుంటున్నదీ  ||ఏమి|| ఫోనూ టీవీ కొంటానన్నా వినకున్నదీ విసుగుకుంటున్నదీ గుడులూ గోపురాలు చూపిస్తానన్నా రాకున్నదీ రంకెలేస్తున్నదీ        ||ఏమి|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 మళ్ళీ మళ్ళీ చెబుతున్నా...గుర్తుంచుకో! ఊది ఊది దీపాలను ఆర్పకు చీకటి అలుముకోవచ్చు చోరీకి దారితీయవచ్చు! ఉరిమి ఉరిమి చిందులు త్రొక్కకు కోపిష్టివి అనుకోవచ్చు కొంటెవాడివి అనితలచవచ్చు! తరచి తరచి కన్నులార్పక కాంచకు దుమ్ముధూళీ పడవచ్చు క్రిమికీటకాలు బాధించవచ్చు! పదే పదే తనువును తడుముకోకు గజ్జివాడిగా చూడొచ్చు గలీజోడుగా ముద్రవెయ్యొచ్చు! మరలా మరలా మాయకు లొంగబోకు మత్తు బంధించవచ్చు మోహం ముంచెత్తవచ్చు! అరచి అరచి విసిగి వేసారబోకు అసహనం పుట్టవచ్చు ఆహ్లాదం కరగిపోవచ్చు! కోరి కోరి పొగడ్తలు అడగబోకు విలువ తగ్గవచ్చు విలాసము కోల్పోవచ్చు! మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పబోకు వింతమనిషిగా ఎంచవచ్చు విడ్డూరంగా భావించవచ్చు! రాసి రాసి ముత్యాల్లాంటి పదాలుచల్లు అందాలను ఆవిష్కరించు ఆనందాలను పంచిపెట్టు! కూర్చి కూర్చి కవితాజల్లులు కురిపించు మాధుర్యాలు విరజిమ్ము మనసులను మురిపించు! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కాలిఫోర్నియా వీక్షణం 13వ వార్షిక సమావేశం ఆవిష్కరించబడిన వీక్షణం రెండు పుస్తక సంపుటాలు - ఉత్సాహభరితంగా జరిగిన 157వ కవిసమ్మేళనం **************************************************************** నేడు 20-09-2025వ తేదీన జరిగిన వీక్షణం 157వ అంతర్జాల సమ్మేళనంలో విశ్రాంత ఆచార్యులు, శ్రీ క్రిష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం, శ్రీ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు వీక్షణం 13వ వార్షికోత్సవం సందర్భంగా 112 కవితలు, కధలు,వ్యాసాలతో కూడిన సాహితీ మిత్రుల రచనల సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ సంకలనం చాలా బాగున్నదని, కవితలు, కథలు మరియు వ్యాసాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. వీక్షణం 13 సంవత్సరాలూగా తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవలను కొనియాడారు. కొన్ని కవితలను లోతుగా విశ్లేషించారు. అధ్యక్షులు గీతా మాధవి గారిని, భారతీయ ప్రతినిధి రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు తెలిపారు. వీక్షణం గత 12 నెలల సమీక్షల సంపుటిని కవి, విశ్రాంత బ్యాంకు అధికారి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఇందులో వేమూరి వెంకటేశ్వర్లు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేయటం మరియు 150వ సమావేశం సందర్భంగా 150 కవితలతో కవితల సంపుటి...
 ఆత్మావలోకనం  ఆలోచించటం నేర్చుకున్నా, నిర్ణయాలు తీసుకోవటం చేతకాకున్నది. కాంక్షల విత్తనాలు నాటుతున్నా, సాధన పంటలు పండకున్నవి. అందాల ఊసులు ఊహించుకున్నా, అనుభవాలు అందక దూరమైపోయాయి. ఆనందాలు అందుకోవాలని తపిస్తున్నా, చేతులలో నిలువక  జారిపోతున్నాయి. మిఠాయిల రుచులు కోరుకున్నా, నోటికి తగలని జ్ఞాపకాలయ్యాయి. పరిమళాలు పీల్చి పరవశించాలనుకున్నా, గాలిలో కలసి మాయమైపోయాయి. పనులు చేయటం చేస్తున్నా, మనసుకు నచ్చని చేష్టలైపోయాయి. నడవటం సాగిస్తున్నా, గమ్యాలు చేరని దారులైపోయాయి. ఎట్లా సమయం గడపను? ఎలా జీవనాన్ని నెట్టుకురాను? ఏ మార్గాన నడచెదను? ఏ కార్యములు సాధించెదను? కానీ రేపో మాపో - ఒక వెలుగు దారిని చూపదా ఒక ఆశ హృదయాన్ని నింపదా ఒక అడుగు ముందుకు వేయించదా ఒక జీవిత లక్ష్యము నెరవేరదా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 అక్షరాల ఆటలు అక్షరాల ఉనికిని ఉజ్జ్వలింపచేయనా, మహిమల చిట్టాని ముందుంచనా. అక్షరాల తోటలో త్రిప్పించనా, వేటలో దింపి విజృంభింపజేయనా. అక్షరాల పువ్వులుచల్లి పరిమళింపజేయనా, నీటిచుక్కలు చుట్టూచల్లి చల్లపరచనా. అక్షరాల వెలుగులు విరజిమ్మనా, వెన్నెల జల్లులు కురిపించనా. అక్షరాల ముత్యాలుగుచ్చి పొదగనా, రత్నాల హారాలు మెడనవేయనా. అక్షరాల అర్ధాలు అర్చించనా, భావాల తరంగాలు వదలనా. అక్షరాల అందాలు వర్ణించనా, ఆనందాల ధారలు పారించనా. అక్షరాల సౌరభాలు చిలకరింపనా, రంగుల రమ్యాలు చూపించనా. అక్షరాల విన్యాసం చేయించనా, పాటల సరస్వతిని పాడింపజేయనా. అక్షరాల ఆటలతో అలరింపనా, మాటల మాధుర్యాలతో మురిపించనా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 రండి..రారండి! సాహిత్యసుధా లోకాన పిలిచె మధురగీతం అందాల అరుణోదయాన వెలిగె సుకవితాదీపం శుభ సంధ్యాకాలమున పొడిచె చంద్రబింబం తనువులను మురిపించగ ముంచె మదులనుతాపం ముత్యాలను కాసేపు గుచ్చుకుందాం రత్నమాలను కాసేపు పేర్చుకుందాం రంగులబొమ్మలతో కాసేపు ఆడుకుందాం సుందరశిల్పాలతో కాసేపు పాడుకుందాం చక్కని సొగసులను కాసేపు దర్శించుదాం అంతులేని ఆనందాలను కాసేపు అందుకుందాం తేనెచుక్కలను కాసేపు చవిచూద్దాం సుమసౌరభాలను కాసేపు ఆఘ్రానిద్దాం చిరునవ్వులను కాసేపు కురిపించుదాం లేతపువ్వులను కాసేపు చల్లుకుందాం  నవరసాలను కాసేపు ఆస్వాదిద్దాం హితవచనాలను కాసేపు ఆలకిద్దాం కోకిలకంఠాలను కాసేపు తెరుద్దాం నెమలి పింఛాలను కాసేపు విప్పిద్దాం కవితాజల్లులను కాసేపు కురిపిద్దాం సాహితీవరదను కాసేపు పారిద్దాం తనువులను కాసేపు తట్టుదాం మనసులను కాసేపు ముట్టుదాం అందాలజగతిలో కాసేపు విహరిద్దాం ఆనందలోకంలో కాసేపు గడుపుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 ఎలా చెప్పను? చిలుకకు చెప్పినట్లు చెప్పా అర్ధంచేసుకోవటంలా ఆచరించటంలా చిరునవ్వులు చిందుతూ చెప్పా నచ్చటంలా నమ్మటంలా మంచిమాటలు మధురంగా చెప్పా ఆలకించటంలా ఆస్వాదించటంలా చక్కనివిషయాలు సూటిగా చెప్పా చెవికెక్కించుకోవటంలా శ్రద్ధపెట్ట్తటంలా బెత్తము చేతబట్టుకొని చెప్పా భయపడటంలా బోధపడటంలా కన్నీరు కారుస్తూ చెప్పా ఖాతరుచేయటంలా కర్ణాలుతెరవటంలా మూడుమాటల్లో ముక్తసరిగా చెప్పా మనసుపెట్టటంలా మతలబుతెలుసుకోవటంలా గుసగుసలు చెవుల్లో ఊదా గీ అనటంలా బ్యా అనటంలా ప్రియవాక్యాలు ప్రేమతో చెప్పా స్వీకరించటంలా సంతసించటంలా మమతానురాగాలు ముచ్చటగా వ్యక్తపరిచా మర్యాదివ్వటంలా మనసుపెట్టటంలా గుండ్లపల్లి రాజెంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 
 అక్షరాల్లో… అక్షరాల్లో  తడిచిపోయా, పిల్లవాడినై  ఆటలాడా. అక్షరాల్లో  కొట్టుకుపోయా, పడవనై  తేలియాడా. అక్షరాల్లో  మునిగిపోయా, జలచరమై  జీవించా. అక్షరాల్లో  పడిపోయా, చేపనై  ఈతకొట్టా. అక్షరాల్లో  కూరుకుపోయా, వనజానై  వికసించా. అక్షరాల్లో  అందాలుచూచా, మన్మధబాణాన్ని విసిరా. అక్షరాల్లో  ఇరుక్కుపోయా, పిపాసకుడనై  పీయూషముత్రాగా. అక్షరాల్లో  ఒదిగిపోయా, ఆయస్కాంతమై  హృదయాలనులాగా. అక్షరాల్లో  పయనించా, అన్వేషకుడనై  మార్గాలుకనుగొన్నా. అక్షరాల్లో  ఇమిడిపోయా, సాహిత్యరూపాన్ని సంతరించుకున్నా. అక్షరాల్లో  ఆసీనుడనయ్యా, అంతర్భాగమై  అలరించా. అక్షరాల్లో  జీవించా, అనుభూతులను వెల్లడించా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నోటిదూలవద్దురా! నోటిదురద  వెళ్ళబుచ్చకురా నాలుకదూల  తీర్చుకోకురా అపనిందలు  వేయొద్దురా అబాసుపాలు  కావొద్దురా  పుకార్లు  వ్యాపించకురా గలీబోడు  అనిపించుకోకురా అబద్ధాలు  చెప్పొద్దురా విలువను  పోగొట్టుకోకురా మాటలను  మార్చకురా చెడ్డపేరు మూటకట్టుకోకురా  వట్టిపలుకులు  వదరకురా వదరుబోతువు  కాకురా ద్వేషాలు  రగిలించకురా కోపమును  ప్రదర్శించకురా  మాటవిలువను  ఎరుగుమురా మంచితనమును  నిలుపుకొనుమురా వాక్కులు మురికిలాపారకూడదురా నాలువు జ్వాలలారగలకూడదురా పెదవులు నిప్పులుచిమ్మకూడదురా పలుకులు  రాళ్ళనువిసరకూడదురా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవితోత్సాహం కలమును చేతపట్టాలని ఉన్నది కాగితాలను పూరించాలని ఉన్నది ఆలోచనలను పారించాలని ఉన్నది అద్భుతాలను సృష్టించాలని ఉన్నది రాయటమును సాగించాలని ఉన్నది రమణీయతను కలిగించాలని ఉన్నది అందాలను చూపించాలని ఉన్నది ఆనందాలను అందించాలని ఉన్నది పలుకులను ప్రేల్చాలని ఉన్నది తేనెబొట్లను చల్లాలని ఉన్నది  భావాలను బయటపెట్టాలని ఉన్నది భ్రమలను కల్పించాలని ఉన్నది విషయాలను వెల్లడించాలని ఉన్నది హృదయాలను హత్తుకోవాలని ఉన్నది మదులను మురిపించాలని ఉన్నది హృదులను హత్తుకోవాలని ఉన్నది అక్షరజగమును అలరించాలని ఉన్నది పాఠకలోకమును పరవశపరచాలని ఉన్నది కవనప్రపంచమును శాసించాలని ఉన్నది సాహితీసామ్రాజ్యమును పాలించాలని ఉన్నది నీరు చల్లితే చల్లబడతా గాలి ఊదితే ఆరిపోతా ఊతమిస్తే ఉర్రూతలూగిస్తా ప్రేరేపిస్తే రెచ్చిపోతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నేనున్నా… చెప్పు తోచినపుడు చెప్పు దగ్గరకు వస్తా కాలక్షేపము చేయిస్తా చిరునవ్వులు పంచుతా తీరికలేనపుడు చెప్పు సహకారం అందిస్తా సలహాలు ఇస్తా సక్రమంగా నడిపిస్తా చలిగా ఉన్నపుడు చెప్పు దుప్పటి కప్పుతా మంటను రాజేస్తా వెచ్చదనం కలిగిస్తా వేడిగా ఉన్నపుడు చెప్పు గాలిని వీచుతా చెమటను తుడుస్తా చల్లదనం చేరుస్తా కష్టాల్లో ఉన్నపుడు చెప్పు బాధలు పంచుతా వ్యధలు తీర్చుతా ధైర్యం నింపుతా ఆకలిగా ఉన్నపుడు చెప్పు గోరుముద్దలు పెడతా గుటుక్కున తినిపిస్తా కడుపుని నింపుతా లేనపుడు చెప్పు చేతులకు పనిపెడతా జేబులు నింపుతా రోజులు సాగిస్తా ఉన్నపుడు చెప్పు దానాలు ఇప్పిస్తా  ధర్మాలు చేయిస్తా దండాలు పెట్టిస్తా సాంకేతికలోకంలోనైనా  కృత్తిమమేధస్సులోనైనా గాలిలోనైనా కాంతిలోనైనా నేనున్నా నీలోనే నీతోనే ఉన్నా  చరవాణిలోనైనా  కంప్యూటరులోనైనా— అంతరంగములోనైనా నేనుంటా నీపక్కనే నిలిచే ఉంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఊరకుంటే…  ఏ ఆలోచన తడుతుందో ఏ చోటుకు  తీసుకెళ్తుందో, ఏ పనులు చేయమంటుందో ఏ ఘనకార్యం  సాధించమంటుందో, ఏ మాటలు  పలుకమంటుందో ఏ స్పందనలు  ఆశిస్తుందో, ఎక్కడకు వెళ్దామంటుందో ఏ ముచ్చటలు చెప్పమంటుందో, ఎవరిని కలుద్దామంటుందో ఎవరితో సంతోషం  పంచుకుందామంటుందో, ఏమి  తినమంటుందో ఏమి త్రాగమంటుందో, ఏమి  చదవమంటుందో ఏమి నేర్చుకోమంటుందో. ఏమి ఆడదామంటుందో ఏమి పాడదామంటుందో, ఎవరిని పిలుద్దామంటుందో ఏమేమి చేద్దామంటుందో ఏ అందాలు చూడమంటుందో ఏ ఆనందాలు పొందమంటుందో, ఓ మనసా!  కవ్వించకే కష్టపెట్టకే కరుణించవే, ఓ అంతరాత్మా  మనసును అదుపులోపెట్టుకోవే మాయామోహాలకు చిక్కకే మానవత్వము మట్టుపెట్టకే. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవనగతులు  ఏ గతి వ్రాయను   ఏ రీతి చాటను   ఏ స్తుతి చేయను   ఏ శృతి ఎత్తను   ఏ శైలి చేపట్టను   ఏ దారి నడవను   ఏ తీరు పాటింతును   ఏ పేరు సాధింతును   ఏ బొమ్మలు గీయను   ఏ రంగులు అద్దను   ఏ శిలలు చెక్కను   ఏ రూపాలు చూపను   ఏ స్వరాలు పలుకను   ఏ రాగాలు తీయను   ఏ విషయము ఎంచను   ఏ విధానము ఆచరించను ఏ ప్రక్రియ అనుసరించను   ఏ ప్రతిచర్య అందుకొందును ఏ విందు అందించను   ఏ పసందు చేకూర్చను ఏ ఊహలు పారించను   ఏ భ్రమలు కలిగించను ఏ అందాలు చూపను   ఏ ఆనందం పంచను   ఏ తేనెచుక్కలు చిలికించను   ఏ మాధుర్యం చవిచూపను ఏ సౌరభం చల్లను   ఏ ప్రభావం చూపను ఏ ఆట ఆడించను   ఏ పాట పాడించను   ఎవ్వరిని తట్టను   ఎవ్వరిని ముట్టను   ఏ పంటలు పండించను   ఏ వంటలు వడ్డించను   ఏ పువ్వులు పూయించను   ఏ నవ్వులు చిందించను      ఎన...
 జంకకురా తెలుగోడా! జంకు ఎందుకురా తెలుగోడా బెణుకు ఎందుకురా తెలుగోడా వెన్నుగా నిలువరా తెలుగోడా   దన్నుగా నిలువరా తెలుగోడా        ||జంకు|| తెలుగు వెలుగులు చిమ్ముననరా తెలుగు తేనియలు చిందుననరా తెలుగు తేటనైనది అనిచెప్పరా తెలుగు లెస్సైనది అనితెలుపరా తెలుగు అక్షరాలు సుందరమనురా తెలుగు పదాలు కొబ్బరిపలుకులనరా తెలుగు ముత్యాలను సరాలుగాగుచ్చరా తెలుగు రత్నాలను వరుసగాపేర్చరా    ||జంకు|| మనతెలుగు వరాలతల్లి అనరా మనతెలుగు మహాగొప్పజాతి అనరా మనతెలుగు బహుచక్కన అనరా మనతెలుగు అతిసౌరభము అనరా      తెలుగు హలమును చెతపట్టరా తెలుగు విత్తులను చుట్టూనాటరా తెలుగు పంటలను పండించరా తెలుగు సేద్యమును సాగించరా       ||జంకు|| తెలుగు భాషను నేర్పించరా తెలుగు వేషములు వేయించరా తెలుగు చరిత్రను చాటరా తెలుగు సంస్కృతిని కాపాడరా తెలుగు తల్లులా పొగడరా తెలుగు బిడ్డలా పోషించరా తెలుగు ప్రేమను చూపించురా తెలుగు రాగములు ఎత్తుకోరా        ||జంకు||        తెలుగు ఇలసాటి లేనిదనరా తెలుగు కడుమేటి అనిమెచ్చరా తెలుగు విశ్వఖ్యాతి పొంద...
 ఓ కవితా....నిన్ను అక్షరాల్లో కూర్చోబెడతా పదాల్లో పండబేడతా ఆణిముత్యాల్లా గుచ్చుతా నవరత్నాల్లా పేర్చుతా తీపితెలుగులో తెలియపరుస్తా తేటవెలుగులో తిలకింపజేస్తా మల్లెపువ్వులా ప్రదర్శిస్తా చిరునవ్వులా వెలిగించుతా నవవధువులా కనబరుస్తా సురమధువులా మత్తెక్కిస్తా తేనెచుక్కల్లా చిందింపజేస్తా సౌరభంలా ప్రసరింపజేస్తా ముద్దూమురిపాల్లో ముంచుతా మాయామోహంలో దించుతా అమృతంబొట్లు అందించుతా  అంతరంగాలు మురిపించుతా నాట్యమయూరిలా పురివిప్పిస్తా కోయిలగానంలా కంఠమెత్తిస్తా పచ్చనిచిలకలా పలికిస్తా వయ్యారిహంసలా నడిపిస్తా కలంనుండి జలజలాజాలువారుస్తా కాగితాలమీద కళకళాకాంతులుచిమ్మిస్తా పాఠకలోకానికి పరిచయంచేస్తా సాహిత్యజగానికి సామ్రాఙ్ఞినిచేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవనవిన్యాసాలు అక్షరాలను కుప్పలుగాపోసాడు పదాలను పంక్తులుగాపేర్చాడు చేతుల్లోకి చిక్కినంతతీసుకోమన్నాడు మాటల్లోకి వీలైనంతమార్చుకోమన్నాడు అర్ధమైతే ఆనందించమన్నాదు అంతరంగంలో నిలుపుకోమన్నాడు నచ్చితే నోరారామెచ్చుకోమన్నాడు నలుగురితో నిరభ్యరంతరంగాపంచుకోమన్నాడు హృదిలో పదిలపరచుకోమన్నాడు మదిలో మెరుపులుమెరిపించమన్నాడు వెలుగులు విరివిగాచిమ్మమన్నాడు పరిమళాలు పరిసరాలచల్లమన్నాడు తేనెచుక్కలు రుచిచూడమన్నాడు తియ్యదనమును ఆస్వాదించమన్నాడు చెరకురసము కడుపునిండాత్రాగమన్నాడు చక్కదనములు కళ్ళనిండాదాచుకోమన్నాడు సాహితీచైతన్యము ప్రదర్శించమన్నాడు కవనవిన్యాసాలు గమనించమన్నాడు కవితాసామ్రాజ్యమును బలపరచమన్నాడు కవిసార్వభౌములకు పట్టాభిషేకంచేయమన్నాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 జనారణ్యంలో..... పాములు ప్రాకుతున్నాయి పడగలు విప్పుతున్నాయి విషం క్రక్కుతున్నాయి కరచి కాట్లువేస్తున్నాయి తేళ్ళు తిరుగుతున్నాయి తోకలు ఆడిస్తున్నాయి తిన్నగా కుట్టుతున్నాయి భాధలు పెడుతున్నాయి గాడిదలు ఓండ్రిస్తున్నాయి కాళ్ళతో తన్నుతున్నాయి క్రిందకు పడదోస్తున్నాయి గాయాలపాలు చేస్తున్నాయి నక్కలు ఊళలేస్తున్నాయి నాటకాలు ఆడుతున్నాయి జిత్తులు పన్నుతున్నాయి మోసాలకు గురిచేస్తున్నాయి గబ్బిలాలు గమనిస్తున్నాయి చెట్లకు వ్రేలాడుతున్నాయి చీకట్లో చరిస్తున్నాయి చిక్కినివి దొచుకుంటున్నాయి దుష్టులు తిరుగుతున్నారు సమయంకోసం చూస్తున్నారు కాచుకొని ఉన్నారు కబళించటానికి సిద్ధంగున్నారు కొందరు తియ్యగాపలుకుతున్నారు మాటలతో నమ్మిస్తున్నారు సమయం చూస్తున్నారు నట్లేట్లో ముంచుతున్నారు కొంతమంది నటిస్తున్నారు బయటకు బాగాకనపడుతున్నారు లోపల నిజరూపందాచుకుంటున్నారు అనుకూలించినపుడు అవస్థలపాలుజేస్తున్నారు కొలదిదుర్మార్గులు గోముఖంకప్పుకుంటున్నారు ప్రక్కకు చేరుతున్నారు ప్రేమను చాటుతున్నారు పిమ్మట పులులైభక్షిస్తున్నారు తెల్లనివన్నీ పాలనుకోవద్దు నల్లనివన్నీ నీళ్ళనుకోవద్దు అంతరరూపాలను ఆదమరచవద్దు బాహ్యసౌందర్యాలకు బలికావద్దు గుండ్లపల్...
 ప్రకృతీ ప్రతాపాలు ఓ ప్రకృతీ రావా! చిరుగాలివలె పలుకరించవా, పసినవ్వువలె వెలిగించవా, హరివిల్లువలె కనిపించవా. ఓ జాబిల్లీ రావా! వెన్నెలవలయమై చల్లవా, నిశీధినకలువవై వికసించవా, తనివినితాకి తరించవా. ఓ మేఘమా రావా! ఆకాశ వీధిలో తేలుతూ, చినుకుల ముత్యాలు రాల్చుతూ, తడి పరిమళమై పరచకుంటూ. ఓ సూర్యుడా రావా! ఉదయకిరణమై పొడవవా, మందారమాలికవై మెరవవా, చీకటిని చిదిమి వెలుగునివ్వవా. ఓ కోకిలా రావా! కంఠమున గీతమై పొంగిపొర్లవా, తేనెల స్రవంతివై జాలువారవా, మనసున మాధుర్యమై మెప్పించవా. ఓ కడలి తరంగమా! ఎత్తుకెగురుతూ క్రిందకు పడుతూ, నురుగుల జాజిమల్లెలు చిందుతూ, ఒడ్డును తాకి తిరిగివెళ్ళవా. ఓ అందమా రావా! కళలతోరణమై దర్శనమివ్వవా, పరిమళమై పరిసరాల నిలువవా, కమ్మదనాల వర్షమై కురవవా. ఓ ఆనందమా రావా! చెంతకుచేరి చిరునవ్వులు చిమ్మవా, చిత్తములో వెలుగులా నిలువవా, హృదయాన గీతమై వినిపించవా. ఓ కవితా రావా! అక్షరాల గజ్జెలు మోగించవా, పదాల ముత్యాలు మెరిపించవా, భావాల బహిర్గతము  చెయ్యవా. ఓ కవీ రావా! కలలని కాంతులుగా అల్లవా, అనుభూతుల సమూహంగా నిలుపవా, హృదయంలో ఆరిపోని జ్యోతివికావా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఒ కవీ! నీ భాష, భావన  నిన్ను కవినిచేస్తాయి  మాకు నమ్మకన్నికలిగిస్తాయి నీ సాహసం, భాద్యత నిన్ను కవిగానిలబెడతాయి మాకు మర్గదర్శకత్వంచేస్తాయి నీ స్పందనలు, అనుభవాలు నిన్ను విశేషవ్యక్తినిచేస్తాయి మాకు మానసికానందాన్నిస్తాయి నీ తేటపదాలు, తేనెపలుకులు నిన్ను ఆకాశానికెత్తుతాయి మాకు మాటలమర్మాలుతెలుపుతాయి నీ రాతలు, చేష్టలు నిన్ను చిరంజీవినిచేస్తాయి మాకు అమృతరుచులందిస్తాయి నీ లక్ష్యాలు, బాటలు నిన్ను ముందుకునడిపిస్తాయి మాకు అనుసరణీయమవుతాయి నీ కలము, కాగితము నిన్ను కదిలిస్తాయి మాకు బేడీలేస్తాయి నీ గళము, గానము నిన్ను గాంధర్వుడినిచేస్తాయి మాకు వీనులవిందునిస్తాయి నీవే మాకు డశ, దిశ నీవే మాకు ఆశ, ధ్యాస నీవే మాకు అందము, ఆనందము నీవే మాకు ఆశాజ్యోతివి నీవే మాకు విఙ్ఞానగనివి నీవే మాకు అక్షరలక్షాధికారివి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆమె ఙ్ఞాపకాలు ఆమె చిరునవ్వులను నాదగ్గర వదిలివెళ్ళింది ఎక్కడకు పోయిందో? ఏమిపనులు చేస్తుందో? ఆమె తేనెపలుకులను నాదగ్గర కుమ్మరించిపోయింది బాకీ ఎలా తీర్చుకుంటానో? వడ్డీ ఎపుడు చెల్లించుకుంటానో? ఆమె సుమసౌరభాలను నాపై చల్లివెడలింది ఎన్నిరోజులు అనుభవిస్తానో? ఎంతకాలం సుఖపడతానో? ఆమె అందచందాలను నాకప్పగించి కనుమరుగయ్యింది కలలోకి ఎందుకొస్తుందో? కవ్వించి ఏమిసాధిస్తుందో? ఆమె ముద్రను నామనసుపై అంటిదూరమయ్యింది ఆగుర్తు ఎందుకు చెడటంలేదో?  ఆతలపులు ఎందుకు వీడటంలేదో? ఆమె ఙ్ఞాపకాలను నామెదడుకెక్కించి అదృశ్యమయ్యింది  నిత్యం నెమరేసుకుంటున్నా ఎందుకో? క్షణక్షణం కుమిలిపోతున్నా ఎందుకో? ఆమె చిలిపితనమును నామీద కురిపించిపోయింది ఎక్కడ దాక్కున్నదో? ఏమిపాట్లు పడుతున్నదో? ఆమె శీలసంపదను నాకందించి మాయమయ్యింది ఎన్నిబాధలు పడుతుందో? ఎంతగా కృశించిపోయిందో? ఆమె ఙ్ఞాపకాలను సదా స్మరించుకుంటా! ఆమె అనుభూతులను రోజూ తలచుకుంటా! ఆమె వస్తే అంతా అప్పగిస్తా! ఆమె కోరితే అండగా నిలుస్తా! అసలు తిరిగి చెంతకు వస్తుందా! అలనాటి సుఖాలను మళ్ళీ ఇస్తుందా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా రాతపూతలు ఏకాంతంగా కూర్చుంటా ఏదయినా రాసుకుంటా తలపులను పారిస్తుంటా తోచినపనులు చేసుకుంటా తళుకులతారకలు చూస్తా తేలియాడేమబ్బులు తిలకిస్తా తచ్చాడేజాబిలిని గమనిస్తా తనివితాకే వెన్నెలనాస్వాదిస్తా కడలితీరంలో కూర్చుంటా ఎగిసిపడేకెరటాలను కంటా తెల్లనినురుగులు వీక్షిస్తా చల్లనిగాలిని పీల్చుకుంటా అక్షరాలను ఏరుకుంటా పదాలను పేర్చుకుంటా కవితలను కూర్చుతుంటా కమ్మదనాలు కూరుస్తుంటా హృదులను ముట్టుతా మదులను దోస్తా గుండెలను తాకుతా సాహితిని ఆహ్వానిస్తా పగటికలలు కంటా కవ్వింపులకు గురవుతా కల్పనలు కావిస్తా భ్రమలందు ముంచేస్తా కవనపుష్పాలు చల్లుతా సుమసౌరభాలు చిమ్ముతా అందాలు చూపించుతా ఆనందాలు పంచుతా ఆకాశానికి ఎగిరిస్తా పర్వతాలు ప్రాకిస్తా లోయల్లోకి దించుతా ప్రకృతిని పరికింపజేస్తా సమాజవేదనలు వింటా విసుర్లబాణాలు వదులుతా పేదలపాట్లను తలుస్తా పద్యాలు వ్రాసిపాడిస్తా సత్యాన్ని నిలబెడతా న్యాయాన్ని కాపాడుతా ప్రేమానురాగాలు కురిపిస్తా మానవత్వమును చూపిస్తా జననికన్నీళ్ళు తుడుస్తా భూమాతగాయాలు మానిపిస్తా స్వాతంత్రజ్యోతులు వెలిగిస్తా పౌరులభవితను పరిరక్షిస్తా వాస్తవాలను ముందుంచుతా నిదిరించేవారిని మేలుకొలుపుతా సాహిత్యకిరణాలు విరజ...